Sri Vamana Mahapuranam    Chapters   

ముప్పదియవ అధ్యాయము

పులస్త్య ఉవాచ ః

చండముండౌచనిహతౌ దృష్ట్వాసైన్యంచవిద్రుతమ్‌ | సమాదిదేశాతిబలం రక్తబీజంమహాసురమ్‌ |

అక్షౌహిణీనాంత్రింశద్భిః కోటిభిఃపరివారితమ్‌| 1

తమాపతంతందైత్యానాం బలందృష్ట్వైవచండికా | ముమోచసింహనాదంవై తాభ్యాం సహమహేశ్వరీ. 2

నినదంత్యాస్తతోదేవ్యా బ్రహ్మాణీముఖతో7భవత్‌ | హంసయుక్తవిమానస్థా సాక్షసూత్రకమండలుః. 3

మహేశ్వరీ త్రినేత్రాచ వృషారూఢాత్రిశూలినీ | మహాహివలయా రౌద్రా జాతాకుండలినీక్షణాత్‌. 4

కంఠా, దథచకౌమారీ బర్హిపత్రాచశక్తినీ | సముద్భూతాచదేవర్షే మయూరవరవాహనా. 5

బాహుభ్యాంగరుడారూఢా శంఖచక్రగదాసినీ | సార్‌జ్గబాణధరాజాతా వైష్ణవీరూపశారినీ 6

మహాగ్రముసలారౌద్రా దంష్ట్రోల్లిఖితభూతలా | వారాహీపృష్ఠతోజాతా శేషనాగోపరిస్థితా

7

వజ్రాంకుశోద్యతకరా నానాలంకారభూషితా | జాతాగజేంద్రపృష్ఠస్థా మాహేంద్రీస్తనమండలాత్‌. 8

విక్షిపంతీసటాక్షేపైర్గ్రహనక్షత్రతారకాః | నఖినీహృదయాజ్జాతా నారసింహీసుదారుణా. 9

తాభిర్ని పాత్యమానంతు నిరీక్ష్యబలమాసురమ్‌ | ననాదభూయోనాదాన్‌ వై చండికానిర్భయారిపూన్‌.

తన్నినాదంమహచ్ఛ్రుత్వా త్రైలోక్యప్రతిపూరకమ్‌ 10

సమాజగామదేవేశః శూలపాణిస్త్రిలోచనః| అభ్యేత్యవంద్యచైవైనాం ప్రాహవాక్యంతదాంబికే. 11

నమాయాతో7స్మివైదుర్గే దేహ్యాజ్ఞాంకింకరోమితే | తద్వాక్యసమకాలంచ దేవ్యాదేహోద్భవాశివా. 12

జాతాసాచాహదేవేశం గచ్ఛదౌత్యేనశంకర | బ్రూహిశుంభంనిశుంభంచ యదిజీవితుమిచ్ఛథ. 13

తద్గచ్ఛధ్వందురాచారాః సప్తమంహిరసాతలమ్‌ | వాసవోలభతాంస్వర్గం దేవాఃసంతుగతవ్యః. 14

యజంతుబ్రాహ్మణాద్యామీ వర్జాయజ్ఞాంశ్చసాంప్రతమ్‌ | నోచేద్బలావలేపేన భవంతోయోద్ధుమిచ్ఛథ. 15

తదాగచ్ఛధ్వమవ్యగ్రా ఏషా7హంవినిషూదయే|

పులస్తుడు అన్నాడు : నారద! చండముండులు వధింపబడి తమ సైన్యమంతా చెల్లాచెదరు కావడంచూచి శుంభనిశుంభులు రక్తబీజుడనే ఘోరరాక్షసుణ్ణి ముప్పదికోట్ల అక్షౌహిణీ సైన్యంతో యుద్ధానికి పంపించారు. వారు రావడం చూస్తూనే చండిక భయంకరమైన సింహనాదం చేసింది. ఆదైత్యులు కూడా సింహనాదాలు చేశారు. ఆమె గర్జిస్తుండగా నామెనోటినుండి, అక్షమాలకమండలాలు ధరించి హంసల విమానం మీద కూర్చున్న బ్రహ్మాణి వెలువడింది. మరుక్షణాన మూడుకన్నులు త్రిశూల, సర్పకుండలాలు వలయాలు ధరించి వృషభారూఢయై మహేశ్వరి ఉద్భవించింది. అంతట మహర్షీ! ఆమె కంఠాన్నుండి నెమలి ఈకలు శక్తిని ధరించి నెమలి మీద కూర్చొని కౌమారి పుట్టింది. ఆమె బాహువుల నుండి శంఖచక్రగదాఖడ్గశార్జగబాణాలు ధరించి గరుడుని అరోహించి రూపసి అయిన వైష్ణవి జన్మించింది. ఆమె పృష్ఠభాగాన్నుంచి మహోగ్రమైన రోకలిపట్టుకుని క్రోధంతో దంష్ట్రలతో భూమిని త్రవ్వుతూ శేషనాగం మీద కూర్చొని వారాహీదేవి వచ్చింది. ఆమె స్తనమండలాన్నుంచి ఏనుగుమీద కూర్చొని వజ్రాంకుశాలూ వివిధాలంకారాలు ధరించి మహేంద్రి ఆవిర్భవించింది. అంతట భయంకరమైన జూలువిదిల్చి ఆసటలతో ఆకాశంలోని గ్రహనక్షత్రతారకలను చెదరకొట్టుచు వాడియైన గోళ్ళతో భయంకరాకారయగు నారసింహీ, ఆదేవిహృదయాన్నుంచి బయటకువచ్చింది. వారలచేత సంహరించబడిన రాక్షసబలాన్ని చూచి నిర్భయంగా ఆ చండిక మరొకపర్యాయం గర్జించింది. ముల్లోకాలలో నిండిన ఆ మహానాదాన్ని విని దేవదేవుడు త్రిశూల త్రినేత్రు డచటకువచ్చి అంబికకు అభివాదంచేసి - 'దుర్గేః నేను చేయవలసిన కర్తవ్యం ఆజ్ఞాపించమని' కోరాడు. ఆయన వాక్యాలతోబాటు దేవి శరీరం నుండి వచ్చిన శివ ఆయనతో, శంకరా నీవు శుంభనిశుంభుల వద్దకు దూతగా వెళ్ళి వారితో - మీరు బ్రతుకదలచుకుంటే వెంటనే సపరివారంగా సప్తపాతాళానికి వెళ్ళండి. దేవతలకు వారి స్వర్గం యిచ్చింవేయండి. బ్రాహ్మణులు నిర్విఘ్నంగా యజ్ఞయాగాదులు చేసుకుంటారు. అలాగాక బలంతో క్రొవ్వియుద్ధం చేయదలచుకుంటే ఆవశ్యంగా రండి. అందరూ యమలోకానికి పంపుతామని చెప్పమన్నది.

యతస్తుసాశివందౌత్యే న్యయో యతనారద.

తతోనామమహాదేవ్యాః శివదూతీవ్యజాయత | తేచా7పి శంకరవచః శ్రుత్వాగర్వనమన్వితమ్‌|

హుంకృత్వా7భ్యద్రవన్‌ సర్వే యత్రకాత్యాయనీస్థితా. 17

తతఃశ##రైఃశక్తిభిరంకుశైర్వరైః పరశ్వథైః శూలభుశుంఢిపట్టిశైః|

ప్రాసైఃసుతీక్షైఃసరిఘైశ్చవిస్తృతై ర్వవర్షతుర్దై త్యవరౌసురేశ్వరీమ్‌. 18

సాచాపిబాణౖర్వరకార్ముకచ్యుతై శ్చిచ్ఛేదశస్త్రాణ్యథబాహుభిఃసహ|

జఘానచాన్యాన్‌ రణచండవిక్రమా మహాసురాన్‌ బాణశ##తైర్మహేశ్వరీ. 19

మారీత్రిశూలేన జఘావచాన్యాన్‌ ఖట్వాంగపాతై రపరాంశ్చకౌశికీ|

మహాజలక్షేపహతప్రభావాన్‌ బ్రాహ్మీతథాన్యానసురాంశ్చకార. 20

మహేశ్వరీశూలనిదారితోరస శ్చకారదగ్దానపరాంశ్చవైష్ణవీ|

శక్త్యాకుమారీకులిశేనచైంద్రీ తుండేన చక్రేణ వరాహ రూపిణీ 21

నఖైర్విభిన్నానపినారసింహీ అట్టాట్టహాసైరపిరుద్రదూతీ|

రుద్రస్త్రిశూలేనతథైవచాన్యాన్‌ వినాయకశ్చాపిపరశ్వథేన. 22

ఏవంహిదేవ్యావివిధైస్తురూపై ర్నిపాత్యమానాదనుపుంగవాస్తే|

పేతుఃపృథివ్యాంభువిచాపిభూపై స్తేభక్ష్యమాణాః ప్రలయంప్రజగ్ముః. 23

తేవధ్యమానాస్త్వథదేవతాభి ర్మహాసురామాతృభిరాకులాశ్చ |

విముక్తకేశాస్తరలేక్షణాభయా త్తేరక్తబీజంశరణంహిజగ్ముః. 24

సరక్తబీజస్సహసాభ్యుపేత్య వరాస్త్రమాదాయచమాతృమండలమ్‌ |

విద్రావయన్‌ భూతగణాన్సమంతాద్‌ వివేశకోపాత్‌ స్ఫురితాధరశ్చ. 24

తమాపతంతంప్రసమీక్ష్యమాతరః శ##సై#్త్రఃశితాగ్రైర్దితిజంవవర్షుః|

యోరక్తబిందుర్న్యపతత్‌ పృథివ్యాం సతత్ర్పమాణస్త్వసురో7పిజజ్ఞే. 26

తతస్తదాశ్చర్యమయంనిరీక్ష్య సాకౌశికీ కేశినిమభ్యువాచ |

పిబస్వచండేరుధిరంత్వరాతే ర్వితత్యవక్త్రం బడవానలాభమ్‌. 27

సాత్వేవముక్త్వావరదా7బికాహి వితత్యవక్త్రంవికరాలముద్రామ్‌|

ఓష్ఠంనభఃస్పృక్‌ పృథివీంస్పృశంతం కృత్వా7ధరంతిష్ఠతిచర్మముండా. 28

తతో7బికాకేశవికర్షణాకులం కృత్వారిపుంప్రాక్షిపతస్వవక్త్రై|

బిభేదుశూలేనతథా7ప్యురస్తః క్షతోద్భవాన్యేన్యపతంశ్చవక్త్రే 29

తతస్తుశోషంప్రజగామరక్తం రక్తక్షయేహీనబలోబభూవ|

తంహీనవీర్యంశతథాచకార చక్రేణచామీకరభూషితేన. 30

ఓ నారదా! ఆమె శివుని దూతగా నియోగించినందున శివదూతి అనుపేరు గలిగినది. శంకరునిహితవచనాలువిని ఆ గర్విష్టులు హూంకారాలు చేస్తూ ఆ కాత్యాయని ఉన్నవైపు పరుగులుతీశారు. అంతట ఆ రాక్షసులందరు బాణాలు శక్తులు, అంకుశాలు పరశువులు, శూల భుశుండి పట్టిసాదులు, వాడిగల ప్రాసపరిఘలు ఆ దేవి మీద ఒక్కమారుగా వర్షించారు. ఆ మహేశ్వరి ఉత్తమమైన ధనుస్సును సంధించి వందలాది నిశితబాణాలు గుప్పించి, ప్రచండమైన విక్రమంతో, ఆమహాసురల శస్త్రాస్త్రాలను తునాతునకలు గావించి వారల బాహువుల ఖండించింది. మరెందరనో బాణసహస్రాలు వర్షించి వధించింది. మారిత్రిశూలంతో కొందరను పరిమార్చింది. కౌశికి ఖట్వాంగంతో కొందరను వధించింది. ఇక బ్రాహ్మిమంత్రించిన జలం చిలకరించి ఎందరనో హతమార్చింది. మహేశ్వరి శూలంతో శత్రువుల వక్షాలను చీల్చి చంపితే వైష్ణవి మరెందరనో భస్మంగావించింది. కౌమారీ శక్తితో ఐంద్రి వజ్రంతో, ముట్టెతోను చక్రంతోను వారాహి, వాడిగోళ్ళతో చీల్చి నారసింహీ, వికటాట్టహాసధ్వనులతో శివదూతీ ఎందరనో యమసదనానికి పంపించారు. రుద్రుడు త్రిశూలంతో వినాయకుడుపరశువు ఎందరనో హతమార్చారు. ఈ విధంగా పరమేశ్వరి తన అసంఖ్యాక రూపాలతో దైత్యముఖ్యులనెందరనో సంహరించింది. వారల దెబ్బలకు భూపతితులైన రాక్షసులందర్నీ భూతగణాలు తినివేయడంతో మహాప్రళయం ఏర్పడింది. ఆ విధంగా దేవతలు మాతృగణాల సంహారకాండకు భయాతురులై రాక్షసవీరులు జుట్టుముడులు వీడగా కళ్ళచూపులు చెదిరిపోగా ఫారిపోయి రక్తబీజుని ఆశ్రయించారు. అంత నారక్తబీజుడు భయంకరంగా గర్జిస్తూ శ్రేష్ఠమైన ఆయుధాలతో మాతృకాగణాలను, భూతగణాలను చీకాకుపరుస్తూ కదనరంగానికి దూకాడు. అది చూచిన మాతృకాగణాలు వాడి శరీరాన్ని వాడిస్త్రాస్త్రాలు వర్షించి చిల్లులుపడజేసారు. వాడి శరీరాన్నుంచి క్రిందపడిన ప్రతి రక్తపుబిందువునుంచి వాడంతటివాడు మరొక రక్తబీజుడు పుట్టసాగాడు. యుద్ధభూమి అంతా రక్తబీజులతో నిండిపోయింది. ఆ విచిత్రాన్ని గమనించిన కౌశికికేశిని పిలిచి - ఓ చండీ! నీ నోటిని విశాలంగా తెరచి వాడి వంటి నుండి పడే రక్తబిందువులన్నీ త్రాగేసి వేయుమని ఆదేశించింది. దేవి ఆదేశం ప్రకారమే ఆ చండి పై పెదవి ఆకాశాన్నీ క్రింది పెదవి భూమిని తాకునట్లు తన భయంకరమైన వక్త్రాన్ని తెరిచి ఆ శత్రువును జుట్టుపట్టుకొని తన నోటిలోవెసనకొని మింగేసింది. శూలంతో వాడి వక్షం ఖేదించి రక్తం ఒక్క బొట్టు కూడ క్రిందపడకుండా త్రాగేసింది. శరీరంలోని నెత్తురంతా పోవడంతో ఆ రక్తబీజుడు శక్తిహీనుడైపోయాడు. వాడి వెంటనే స్వర్ణాలంకృతమైన చక్రంతో నూరుముక్కలు చేసింది.

తస్మిన్‌ విశ##స్తేదనుసైన్యనాథే తేదానవాదీనతరం వినేదుః|

హతాత హాభ్రాతరితిబ్రువంతః క్వయాసితిష్ఠస్వమూహూర్తమేహి. 31

తథాపరేవిలులితకేశపాశా విశీర్ణవర్మాభరణాదిగంబరాః |

నిపాతితాధరణితలేమృడాన్యా ప్రదుద్రువుర్గిరివరముహ్యదైత్యాః. 32

విశీర్ణవర్మాయుధభూషణంతత్‌ బలంనిరీక్ష్యైవహిదానవేంద్రః |

విశీర్ణచక్రాక్షరథోనిశుంభః క్రోధా న్మృడానీంసముపాజగామ. 33

ఖడ్గంసమాదాయచచర్మభాస్వరం ధున్వన్‌ శిరః ప్రేక్ష్య చరూపమస్యాః|

సంస్తంభమోహజ్వరపీడితో7థ చిత్రే థా7సౌలిఖితేబభూవ. 34

తంస్తంభితం వీక్ష్యసురారిమగ్రే ప్రోవాచదేవీవచనంవిహస్య |

అనేనవీర్యేణసురాస్త్వయాజితా అనేనమాంప్రార్థయసే బలేన. 35

శ్రుత్వాతువాక్యంకౌశిక్యా దానవఃసుచిరాదివ | ప్రోవాచచింతయిత్వా7థ వచనంవదతాంవరః. 36

సుకుమారశరీరో7యం మచ్ఛస్త్రపతనాదపి | శతధాయాస్యతేభీరు ఆమపాత్రమివాంభసి.

37

ఏతద్విచింతయన్నర్థం త్వాంప్రహర్తుంనసుందరి | కరోమిబుద్ధింతస్మాత్‌ త్వం మాంభజస్వాయతేక్షణ. 38

మమఖడ్గనిపాతంహి నేంద్రోధారయితుంక్షమః | నివర్తయమతింయుద్ధా ద్భార్యామేభవసాంప్రతమ్‌, 39

ఇత్థంనిశుంభవచనం శ్రుత్వాయోగీశ్వరీమునే | విహస్యభావగంభీరం నిశుంభంవాక్యమబ్రవీత్‌. 40

నాజితా7హంరణవీర భ##వేభాక్యహికస్యచిత్‌ | భవాన్‌ యదిహభార్యార్థీతతోమాంజయసంయుగే. 41

ఇత్యేవముక్తేవచనే ఖడ్గముద్యమ్యదానవః | ప్రచిక్షేపతదావేగాత్‌ కౌశికీంప్రతినారద. 42

తమాపతంతంనిస్త్రింశం షడ్భిర్బర్హిణరాజితైః | చిచ్ఛేదచర్మణాసార్థం తదద్భుతమివాభవత్‌. 43

ఖడ్గేసచర్మణిచ్ఛిన్నే గదాంగృహ్యమహాసురః | సమద్రవత్‌ కోశభవాం వాయువేగసమోజనే. 44

తస్యాపతతఏవాశు కరౌ శ్లిష్టౌసమౌదృఢౌ | గదయాసహచిచ్ఛేద క్షురప్రేణరణ7బికా. 45

తస్మిన్నివతితేరౌద్రేసురశత్రౌభయంకరే | చండాద్యామాతరోహృష్టా శ్చక్రుఃకిలకిలాధ్వనిమ్‌. 46

గగనస్థాస్తతోదేవాః శతక్రతుపురోగమాః | జయస్వవిజయేత్యూచుర్‌ హృష్టాఃశత్రౌనిపాతితే.

47

తతస్తూర్యాణ్యవాద్యంత భూతసంఘైఃసమంతతః | పుష్పవృష్టించముముచుః సురాః కాత్యాయనీంప్రతి. 48

నిశుంభంపతితందృష్ట్వాశుంభఃక్రోధాన్మహామునే| వృందారకంసమారుహ్యాపాశపాణిఃసమభ్యగాత్‌. 49

తమాపతంతందృష్ట్వా7థ సగజందానవేశ్వర్ధమ్‌ | జగ్రాహచతురోబాణాం శ్చంద్రార్థాకారవర్చసః. 50

క్షురప్రాభ్యాంసమంపాదౌ ద్వౌచిచ్ఛేదద్విపస్యసా | ద్వాభ్యాంకుంభేజఘానాథ హసంతీలీలయాంబికా. 51

నికృత్తాభ్యాంగజఃపద్భ్యాం నిపపాతయథేచ్ఛయా | శక్రవజ్రసమాక్రాంతం శైలరాజశిరోయథా. 52

తస్యావర్జితనాగస్య శుంభస్యాప్యుత్పతిష్యతః | శిరశ్చిచ్ఛేదబాణన కుండలాలంకృతంశివా. 53

ఛిన్నేశిరసిదైత్యేంద్రో నిపపాతసకుంజరః | యథాసమహిషఃక్రౌంచో మహాసేనసమాహతః.

54

శ్రుత్వాసురాఃసురరిపూనిహతౌమృడాన్యా | సేంద్రాః ససూర్యమరుదశ్వివసుప్రధానాః|

ఆగత్యంతంగిరివరం వినయావనమ్రా | దేవ్యాస్తదా స్తుతిపదం త్విదమీరయంతః. 55

అలా రాక్షస సైన్యాధిపతి చావడంతో దానవులంతా దైన్యంతో ''హా తండ్రీ ! హా సోదరా ! నెళుతున్నావా, క్షణం అగుమాగు'' మంటూ ఆర్తనాదాలు గావించారు. జుట్లు విరబోసికొని వస్త్రాలూడిపోగా, కవచాలు ఆభరణాలు ముక్కలుకాగా భయకంపితులయిన యితరుల నా మృడాని నేలపై బడగొట్టినది. వారలు 'బ్రతుకు జీవుడా'యని ఆ కొండను వదలి పారిపోయారు. ఆ విధంగా కవచాదులు భిన్నమై దిగంబరులుగా పారివచ్చిన తన బలాలను చూచి దానవేంద్రుడయిన నిశుంభుడు, చక్రాలు దెబ్బతిని యిరుసులూడుచున్న రథంతో, క్రోధోన్మత్తుడైదేవిని సమీపించాడు. మెరిసి పోతున్న ఖడ్గం డాలు పట్టుకొని నిలబడి, ఆదేవి సౌందర్యానికి ముగ్ధుడై వాడు చిత్రలిఖిత ప్రతిమలాగా స్తంభించి చూస్తూ ఉంéడిపోయాడు. అలా కదలికలేక నిలబడిన ఆ దేవవిరోధిని చూచి పకపకనవ్వి - ఈ పౌరుషంతోనేనా నీవు దేవతలను జయించింది ? ఈ వీరత్వంచూపియేనా నన్ను పొందాలని చూస్తున్నావురా ?'' అని గేలి చేసింది. కౌశికి మాటలు విని ఆ మాటకారి అయిన రాక్షసుడు క్షణకాలం ఆలోచించి యిలా అన్నాడు.''ఓ భీరూ ! నీ శరీరమో అతి కుసుమారం! నా బాణాలు అతితీక్షాలు. ఒక్క వ్రేటునకు పచ్చికుండవలె నూరుముక్కలవుతుందే అని విచారిస్తున్నాను. అంచేత నిన్ను ప్రహరించేందుకు మనసొప్పకుండా ఉన్నది. నాకు. కాబట్టి ఓ సుందరీః విశాలాక్షీ! నన్ను సేవించుము. నాకత్తివ్రేటుకు ఇంద్రుడు సైతం నిలవజాలడు. యుద్ధ సంకల్పం వదలి నన్ను వివాహం చేసుకో. ఓ నారదా! వాని మాటలకా యోగీశ్వరి అర్థగర్భితంగా యీ మాటలు పలికింది. ''యుద్ధంలో ఓడిపోకుండానేనెవడి భార్యనగుటకూ వీలుపడదు కదా! వివాహ సంకల్పమే ఉంటే రా! యుద్ధంలో నన్ను ఓడించు.'' ఆ మాట వింటూనే ఆ దానవుడు ఖడ్గాన్ని బలంకొద్దీ దేవిమీదకు విసిరివేశాడు.అంతట కౌశికి ఆరు బాణాలు గుప్పించి ఆ ఖడ్గాన్నీ డాలునూ ముక్కలు ముక్కలుగావించింది. దానితోవాడు మండిపడిరెండు చేతులతో పెద్దగదను త్రిప్పుతూ దేవి మీదకు దుమికాడు. అంతనాయంబిక ఒక క్షురప్రంతో గదతో కూడా వాడి రెండు చేతులనూ నరికివేసింది. నిష్రాణమైనవాడి శరీరం నేలకొరిగింది. ఆ దానవుని మరణానికి చండమారి మొదలయిన మాతృశక్తులు సంతోషంతో కిలకిల రావాలు చేశారు. భూతగణాలు తూర్యాలు మోగించారు దేవతలు ఆ తల్లిమీద పుష్పవర్షం గురిపించారు. నిశుంభుని సంహారంచూచి శుంభుడు కోపంతో పాశం ధరించి ఏనుగుమీదనెక్కి దేవిపైకి లంఘించాడు. అలా వచ్చే ఆ రాక్షసాధముణ్ని చూస్తూనే అంబిక అలవోకగా నవ్వుతూ, నాలుగు అర్థచంద్ర బాణాలు చేతితో తీసికొని రెండు క్షురప్రాలతోవాడి ఏనుగుకాళ్ళను నరికి, యింకొక రెండు బాణాలతో దాని కుంభస్థలాన్ని బద్దలు గావించింది. దానితో ఆ ఏనుగు దేవేంద్రుని వజ్రాఘాతానికి విరిగిన పర్వత శిఖరంలాగా కుప్పకూలిపోయింది. కూలిన ఏనుగుమీద నుంచి దిగుతుండగానే పరమేశ్వరి మరొక బాణంతో కుండలాలతో వెలుగుతున్నవాడి తలను ఖండించింది. తల తెగిన ఆ మహాదైత్యుడు ఏనుగుతో బాటు కార్తికేయుని బాణాహతికి మహిషంతో కూడ నేలకొరిగిన క్రౌంచంవలె పడిపోయాడు. పరమేశ్వరి దేవశత్రువునువధించిన వార్త విని, ఇంద్రుని ముందుంచుకొని సూర్యయమ మరుదశ్వినీ పసువులు మొదలయిన దేవతలంతా వింధ్యగికేరితెంచి వినయావనతులై చేతులు జోడించుకొని ఆ జగదంబిక నిలాస్తుతించారు.

దేవా ఊచుః :

నమో7స్తుతే భగవతిపాపనాశిని నమో7స్తుతేసురరిపుదర్పశాతని |

నమో7స్తుతే హరిహరరాజ్యదాయిని నమో7స్తుతే మఖభుజకార్యకారిణి. 56

నమో7స్తుతే త్రిదశరిపుక్షయంకరి నమో7స్తుతే శతమఖపాదపూజితే|

నమో7స్తుతే మహిషవినాశకారిణి నమోస్తుతే హరిహరభాస్కరస్తుతే. 57

నమో7స్తుతే 7ష్టాదశబాహుశాలిని నమో7స్తుతే శుంభనిశుంభమాతిని|

నమో7స్తులోకార్తిహరేత్రిశూలిని |నమో7స్తునారాయణిచక్రధారిణి. 58

నమో7స్తువారాహిసదాధరాధరే | త్వాంనారసింహిప్రణతానమో7స్తుతే|

నమో7స్తుతేవజ్రధరేగజధ్వజే | నమో7స్తుకౌమారిమయూరవాహిని. 59

నమో7స్తుపైతామహహంసవాహనే | నమో7స్తుమాలావికటేసుకేశిని|

నమో7స్తుతేరాసభపృష్ఠవాహిని | నమో7స్తుసర్వార్తిహరేజగన్మయే. 60

నమో7స్తువిశ్వేశ్వరిపాహివిశ్వం | నిషూదయారీన్‌ ద్విజదేవతానామ్‌|

నమో7స్తుతేసర్వమయిత్రినేత్రే | నమోనమస్తేవరదేప్రసీద. 61

బ్రహ్మాణీత్వంమృడానీ వరశిఖిగమనా శక్తిహస్తాకుమారీ |

వారాహీత్వంసువక్త్రా ఖగపతిగమనా వైష్ణవీత్వంసుశార్జీ

దుర్దృశ్యానారసింహీ ఘరఘురితరవాత్వంత థైంద్రీసవజ్రా |

త్వంమారీచర్మముండా శవగమనరతా యోగినీయోగసిద్ధా. 62

నమస్తేత్రినేత్రే భగవతి తవచరణానుషితా యే అహరహర్వినతశిరసో7వనతాః|

నహినహిపరిభవమస్త్యశుభంచ స్తుతిబలికుసుమకరాః సతతం యే. 63

ఏవంస్తుతాసురవరైః సురశత్రునాశినీ ప్రాహప్రహస్యసురసిద్దమహర్షివర్యాన్‌|

ప్రాప్తోమయా7ద్భుతతమోభవతాంప్రసాదాత్‌ సంగ్రామమూర్ద్ని సురశత్రుజయఃప్రమర్దాత్‌.

64

ఇమాంస్తుతింభ క్తిపరానరోత్తమా భవద్భిరుక్తామనుకీర్తయంతి |

దుఃస్వప్ననాశోబవితానసంశయో వరస్తథాన్యోవ్రియతామభీప్సితః. 65

దేవతలు యిలా స్తోత్రం చేశారు. హే భగవతి ! పాపనాశిని నీకు నమస్సులు ! దేవశత్రువుల దర్పం నాశమొనర్చు తల్లీ! హరిహరులకు రాజ్యమిచ్చు జననీ ! యజ్ఞకార్యాలు రక్షించు తల్లీ ! నీకు నమస్సులు. దేవ శత్రువులనురుమాడు తల్లీ! శుఁభనిశుంభల చంపినమాతా, నమస్సులు! ప్రజల ఆర్తిపోగొట్టే తల్లీ ! త్రిశూలధారిణీః నారాయణీ! చక్రధారిణీ! నీకు నమస్సులు. ఎల్లపుడు భూమిని ధరించెవారాహీ ! నారసింహీ ! వజ్రం ధరించిన ఐంద్రీ! మయూర వాహినివగు కౌమారీ! నీకు నమస్కారము.

హంస వాహినివగు బ్రాహ్మీ ! మాలాధారిణివగు కేశినీ! గార్దభారూఢవగు తల్లీ ! ఎల్లర దుఃఖాలుపోగొట్టు జగన్మయీః నీకు నమస్కారము. దేవబ్రాహ్మణ శత్రువుల సంహరించి విశ్వరక్షణచేసే విశ్వేశ్వరీ, సర్వమయీ, త్ర్యంబకే! వరదాయినీ! నీకు ప్రణామాలు. మమ్మనుగ్రహింపుము. నీవు బ్రహ్మాణివి, మృడానివి, నెమలిమీదనెక్కు శక్తిధారిణి కౌమారివి, వారాహివి, గరుడారూఢవై శార్‌ జ్గం ధరించిన వైష్ణవీదేవిని. చూడభయంకరమై, ఘర్ఘురధ్వనులుచేసే నారసింహివి. వజ్రంధరించి మాహేంద్రివి. చండముండవు, శవగమనప్రియవు, యోగిని, ఇవన్నియు నీ రూపాలే. నీకు నమస్సులు. త్రినయనా భగవతీ, రాత్రింబవళ్ళు అవనతశిరులై నీ చరణాలను సేవించువారలకు, స్తోత్రాలతో బల్యన్నాలతో పుష్పాలతో నిన్ను పూజించు ఘనులకు జీవితంలో పరాభవంగాని అశుభంగాని ఎన్నడూ కలుగవు. తల్లీ నీకు నమోవాకములు!'' దేవతలు గావించిన ఈ స్తోత్రంవిని ఆ అంబిక వారలతో మీ ప్రసాదంవల్లనే సంగ్రామ రంగంలో శత్రు విజయం నాకు చేకూరినదని నవ్వుతూ అన్నది. మీహరందరు గావించిన ఈ స్తోత్రాన్ని భక్తితో కీర్తించు మానవులకు దుస్వప్ననాశనం కలుగుతుంది. సందేహం లేదు. ఇక మీకు కావలసిన వరం కోరుకొనండి అని ఆ తల్లి ఆదేశించింది.

దేవా ఊచుః :

యదివరదాభవతీత్రిదశానాం ద్విజశిశుగోషుయతస్వహితాయ |

పునరపిదేవరిపూనపరాంస్త్వం ప్రదహహుతాశనతుల్యశరీరే. 66

దేవ్యువాచ :

భూయోభవిష్యామ్యసృగుక్షితాననా | హరాననస్వేదజలోద్భవాసురాః|

అంధాసురస్యాప్రతిపోషణ రతా నామ్నా ప్రసిద్ధా భువనేషు చర్చికా. 67

భూయోవధిష్యామి సురారిముత్తమం సంభూయనందస్య గృహేయశోదయా |

తంవిప్రచిత్తింలవళం తతా7పరౌ శుంభం నిశుంభం దశనప్రహారిణీ. 68

భూయః సురాస్తిష్యయుగే నిరాశినీ నిరీక్ష్య మారీచగృహే శతక్రతోః|

సంభూయదేవ్యా మితసత్యధామయా సురాభరిష్యామిచ శాకంభరీవై| 69

భూయోవిపక్షక్షపణాయ దేవా వింధ్యేభవిష్యామ్యృపిరక్షణార్థమ్‌ |

దుర్వృత్తచేష్టాన్‌ వినిహత్య దైత్యాన్‌ భూయః సమేష్యామి సురాలయంహి 70

యదారుణాక్షో భవితా నుహా7సురః తదాభవిష్యామి హితాయదేవతాః|

మహావిరూపేణ వినష్టజీవితం కృత్వా నమేష్యామి పునస్త్రివిష్టపమ్‌ | 71

పులస్త్య ఉవాచ :

ఇత్యేవముక్త్వావరదాసురాణాం కృత్యాప్రణామంద్విజపుంగవానామ్‌ |

విసృజ్యభూతానిజగామదేవీ ఖంసిద్ధసంఘైరనుగమ్యమానాః 72

ఇదంపురాణంపరమం పవిత్రం దేవ్యాజయంమంగళదాయి పుంసామ్‌ |

శ్రోతవ్యమేతన్నియతైఃసదైవ రక్షోఘ్నమేతద్భగవానువాచ | 73

ఇతి శ్రీ వామనమహాపురాణ త్రింశో7ధ్యాయః సమాప్తః.

దేవతలన్నారు : తల్లీ! దేవతలకు మరొకవరం యివ్వదలచినచో బ్రాహ్మణ శిశు గోవులకు మేలుగావింపుము. మళ్ళీ నీ అగ్ని శరీరంతో రాక్షసులను భస్మమొనరింపుము. అందులకు అంబిక యిలా అన్నది. దేవతలారా ; నేను మరల శంకరుని ముఖమందలిస్వేదం (చెమట) నుండి రుధిరాననం (ముఖం) తో జన్మించి అంధకాసురుణ్ణి సంహరిస్తాను. అప్పుడు నన్ను చర్చిక అంటారు. మళ్ళీ నందుని యింట యశోదకు జన్మించి విప్రచిత్తి లవణాసురుడు శుంభనిశుంభాదులను నా దంతాలతో చీల్చి చంపుతాను. తర్వాత, దేవతలారా, కలియుగంలో జనులు తిండిలేక మాడిపోవు సమయాన యింద్రునింట మారిగా పుట్టి సత్యభామాదేవి సహాయంతో దేవతలనందరకు అన్ని రకాల కూరగాయలు సమకూర్చి రక్షిస్తాను. అప్పుడు నా పేరు 'శాకంభరి'. ఆ తర్వాత మరల శత్రువులను సంహరించి ఋషులను రక్షించుటకు వింధ్యగిరులలో పుట్టి దైత్యులను వధించి సురాలయానికి చేరుకుంటాను. అంతేకాదు. ఆ తర్వాత కూడ మరొక పర్యాయం అరుణాక్షుడనే రాక్షసుడు ప్రజలను బాధించునపుడు నేను ఒక పెద్ద గండుతుమ్మెదగా పుట్టి వాడిని చంపి దేవతలకు మేలు గావించి మరల స్వర్గానికి వెళ్తాను. ఈ విధంగా భవిష్యత్తులో కూడ మీరు కోరినట్లు సాధుసంరక్షణ చేస్తూ ఉంటాను.

పులస్త్యు డన్నాడు : వరదాయిని అయిన ఆ అంబిక యిలా వరప్రదానం చేసి, బ్రాహ్మణశ్రేష్ఠుల కభివాదనం చేసి భూతగణాదులనందరను పంపివైచి సిద్ధసంఘాలు తన వెంటరాగా స్వర్గానికి వెళ్ళినది. అంబిక యొక్క విజయగాధలు తెలిపే ఈ అభ్యాసం చాల పవిత్రమైనది ప్రాచీనమైనది. ఇది అన్ని శుభాలు చేకూర్చుతుంది. ఇది సకల రాక్షసనాశకమని భగవానుడు స్వయంగా వక్కాణించాడు. కనక మానవులంతా దీనిని సదా శ్రవణంచేస్తూ ఉండాలి.

ఇది శ్రీ వామన పురాణంలో ముప్పదియవ అధ్యాయం.

Sri Vamana Mahapuranam    Chapters