Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువది ఎనిమిదవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

తతోగిరౌవసన్‌రుద్రఃస్వేచ్ఛయావిచరన్‌మునే|విశ్వకర్మాణమాహూయప్రోవాచకురుమేగృహమ్‌. 1

తతశ్చకారశర్వస్య గృహంస్వస్తికలక్షణమ్‌ | యోజనానిచతుఃషష్టిః ప్రమాణనహిరణ్మయమ్‌. 2

దంతతోరణనిర్యూహం ముక్తాజాలాంతరంశుభమ్‌ | శుద్ధస్ఫటికసోపానం వైఢూర్యకృతరూపకమ్‌. 3

సప్తకక్షంసువిస్తీర్ణం సర్వైఃసముదితంగుణౖః | తతోదేవపతిశ్చక్రే యజ్ఞగార్హస్థ్యలక్షణమ్‌. 4

తంపూర్వచరితంమార్గ మనుయాతిస్మశంకరః | తథాతతస్త్రినేత్రస్య మహాకాలో7భ్యగాన్మునే. 5

రమతఃసహపార్వత్యాధర్మాపేక్షీజగత్పతిః | తతఃకదాచిన్నర్మార్థం కాళీత్యుక్తాభ##వేనహి. 6

పార్వతీమన్యునావిష్టా శంకరంవాక్యమబ్రవీత్‌ | సంరోహతీషుణావిద్ధం వనంపరశునాహతమ్‌.

వాచారుక్తంబీభత్సం నప్రరోహతివాక్‌క్షతమ్‌. 7

వాక్సాయకావదనాన్నిష్పతంతి తై రాహతఃశోచతిరాత్య్రహాని|

నతాన్‌విముంచేతహిపండితోజన స్తమద్యధర్మంవితథంత్వయాకృతమ్‌. 8

తస్మాద్వ్రజామిదేవేశ తపస్తప్తమనుత్తమమ్‌ | తథాయతిష్యేనయథా భవాన్‌ కాళీతివక్ష్యతి. 9

ఇత్యేవముక్త్వాగిరిజా ప్రణమ్యచమహేశ్వరమ్‌ | అనుజ్ఞాతా త్రినేత్రేణ దివమేవోత్పపాతహ. 10

సముత్పత్యచవేగేన హిమద్రిశిఖరంశివమ్‌ | టంకచ్ఛన్నంప్రయత్నేన విధాత్రానిర్మితంయథా. 11

తతో7వతీర్యసస్మార జయాంచవిజయాంతథా | జయంతీంచ మహాపుణ్యాం చతుర్థీమపరాజితామ్‌. 12

తాఃసంస్మృతాఃసమాజగ్ముః కాళీంద్రష్టుంహిదేవతాః | అనుజ్ఞాతాస్తథాదేవ్యా శుశ్రూషాంచక్రిరేశుభాః. 13

పులస్తుడిలా అన్నాడు : ఓ మునీ ! అలా హరుడా గిరిమీద పార్వతితో యథేచ్ఛగా విహరిస్తూ విశ్వకర్మకు పిలిచి తనకొక గృహం నిర్మించమన్నాడు. అంతటనాతడు స్వస్తిక లక్షణంతో అరవై నాలుగు యోజన ప్రమాణం గల మేలిమి బంగారం భవనాన్ని నిర్మించాడు. దంతాలతోచేసిన తోరణాలు, ముత్యాలుపొదిగిన గవాక్షాలు, వాకిండ్లు, స్ఫటిక సోపాన పంక్తులు, వైదూర్యమణుల చిత్తరువులు, ఏడు విశాలమైన గదులు, సకలవిధాల వసతులు, భోగసామగ్రులు కలిగి ఆ భవనం సర్వాతిశాయిగా రూపొందింది. అందులోచేరి ఆ దేవదేవుడు గృహస్థులు చేయదగిన యజ్ఞం చేశాడు. అందులో పూర్వీకుల పద్ధతినే హరుడు అవలంబించాడు. ఆ సుందరహర్మ్యంలో చాలాకాలం పార్వతితో సుఖాలనుభవిస్తూ శివుడు గడిపాడు. అంతనొకనాడు వినోదానికై పార్వతిని ''కాళీ' యని (నల్లపిల్లా!) అని సంబోధించాడు. అందులకా శర్వాణి కోపించి యిలా అన్నది. ''బాణ విద్ధమైన వృక్షం, గొడ్డలివేటుకు తెగిన కొమ్మ తిరిగి చిగిరించగలవు. నోట వెడలిన దురుక్తితో అపశబ్దాలతో గాయపడిన, వ్రణం తిరిగి మానిపోదు. నోటవచ్చిన శబ్దబాణాలకు ఎర ఆయిన ప్రాణి రాత్రింబవళ్ళూ యాతన అనుభవిస్తుంటాడు. కనుక అలా అపశబ్దాలు పలుకకూడదని పండితలు ధర్మశాసనం చేశారు. ఆ శాసనాన్ని నీవు నేడుఅతిక్రమించి నా మనస్సు నొప్పించావు. కనుకనో దేవదేవా! నేనీ క్షణమే తపోవనానికి వెళ్లున్నాను. నా తపస్సునంతా వెచ్చించి నీచేత మరల ''కాళి'' అని పిలిపించుకోకుండా ఆయత్తమై తిరిగి రాగలను. అలా అని శివుని అనుమతితో ఆ క్షణాన్నే ఆకాశమార్గానవెళ్ళి హిమాద్రి శిఖరాన్ని జేరుకుంది. అది అత్యంత రమణీయంగా మనోహతంగా సాక్షాత్తు బ్రహ్మనిర్మితమా అన్నట్లు కన్నుల పండువు కలిగించింది. అక్కడకు చేరగానే, జయ, విజయ, జయంతి, అపరాజిత అనే పలుగురు దేవాంగనలను స్మరించగానే వారు ఆమె దర్శనం చేసుకున్నారు. ఆమె అనుజ్ఞతో ఆమెకు శుశ్రూషలు చేయసాగారు.

తతస్తపసిపార్వత్యాం స్థితాయాంహిమవద్వనాత్‌ | సమాజగామతందేశం వ్యాఘ్రోదంష్ట్రానఖాయుధః. 14

ఏకపాద స్థితాయంతు దేవ్యాం వ్యాఘ్రస్త్వ చింతయత్‌ | యదాపతిష్యతే చేయం తదాదాస్యామివై అహమ్‌.

ఇత్యేవం చింతయన్నేవ దత్తదృష్టిర్మృగాధిపః | పశ్యమానస్తువదన మేకదృష్టిరజాయత. 16

తతోవర్షశతం దేవీ గృణంతీ బ్రహ్మణః పదమ్‌ | తపో7తప్యత్‌ తతో7భ్యాగద్‌ బ్రహ్మాత్రిభువనేశ్వరః. 17

పితామహ స్తతోవాచ దేవీంప్రీతో7స్మిశాశ్వతే | తపాసాధూతపాపా7సి వరం వృణుయథేప్సితమ్‌. 18

అథోవాచ వచః కాళీ వ్యాఘ్రస్యకమలోద్భవః | వరదోభవ తేనాహం యాస్యే ప్రీతిమనుత్తమమ్‌. 19

తతః ప్రాదాద్వరంబ్రహ్మా వ్యాఘ్రస్యాద్బుతకర్మణః | గాణపత్యం విభౌ భక్తి మజేయత్వం చ ధర్మితామ్‌.

వరంవ్యాఘ్రాయదత్వైవం శివకాంతామథా బ్రవీత్‌ | పృణీష్వవరమవ్యగ్రా వరందాస్యే

తవాంబికేః 21

తతోవరం గిరిసుతా ప్రాహదేవీ పితామహమ్‌ | వరఃప్రదీయతాం మహ్యం వర్ణం కనకసంనిభమ్‌. 22

తథేత్యుక్త్వాగతో బ్రహ్మా పార్వతీచాభవత్తతః | కోశంకృష్ణం పరిత్యజ్య పద్మకింజల్క సంనిభా. 23

తస్మాత్‌కోశాచ్చ సంజాత భూయః కాత్యాయనీమునే | తామభ్యేత్య సహస్రాక్షః ప్రతిజగ్రాహ దక్షిణామ్‌

ప్రోవాచగిరిజాందేవో వాక్యం స్వార్థాయవాసవః. 24

ఇంద్ర ఉవాచ :

ఇయం ప్రదాయతాంమహ్యం భగినీమే7స్తు కౌశిక | త్వత్కోశ సంభవాచేయం కౌశికీ, కౌశికీ, కౌశికో7ప్యహమ్‌. 25

తాంప్రాదాదితి సంశ్రుత్య కౌశికీం రూపసంయుతామ్‌ | సహస్రాక్షో7పితాంగృహ్య వింధ్యంవేగాజ్జగామ చ.

తత్రగత్వా త్వథోవాచ తిష్ఠస్వాత్ర మహాబలేః | పూజ్యమానసురైర్నామ్నా ఖ్యాతాత్వం వింధ్యవాసినీ. 27

తత్రస్థాప్య హరిర్దేవీం దత్వాసింహం చ వాహనమ్‌ | భవామరారి హంత్రీతి ఉక్త్వా స్వర్గముపాగమత్‌.

అలా పార్వతి కఠోర తపస్సులోనుండగా హిమాద్రి అరణ్యంనుచి పెద్దపులి ఒకటి అక్కడకు వచ్చింది. ఒంటి కాలిమీద నిలబడి తపంచేస్తున్న కాళినిచూచి ఆమె క్రిందపడిపోయిన తర్వాతతినెదనని నిశ్చయించుకుని ఆమె ముఖంవైపు దీక్షగా చూస్తూ అలాగే నిలబడిపోయింది. దానికి ఏకాగ్రత సిద్ధించింది. అలా బ్రహ్మనుగూర్చి నూరు సంవత్సరాలు ఆ దేవి తపస్సుచేయగా ఆ పితామహుడు ప్రత్యక్షమై, దేవీ! నీ తపస్సుకు సంతోషించాను. వరం కోరుకోవలసినదన్నాడు. అందులకా ఉమ, స్వామీ మొదట ఈ పెద్దపులికి కావలసిన వరమివ్వండి. దానితో నాకెంతో తృప్తికలుగుతుంది అని అన్నది అంతట అద్భుతదీక్ష నెరపిన ఆ వ్యాఘ్రానికి విఘ్నేశ్నర భక్తి, ధర్మబుద్ధి, అజేయత్వం వరాలుగా యిచ్చి విరించి ఉమను ఏమి కావలెనని ప్రశ్నించాడు. ఆంతటనా కాళి ''ఓ మహానుభావా! నా శరీరం తప్తకుందనంలాగ వెలుగొందునట్లు వరమివ్వండి'' అన్నది. అందులకు తథాస్తని బ్రహ్మ తనచోటికి వెళ్ళిపోయాడు. అంతట పార్వతి వంటిమీద నల్లని కోశల (పొర) ఊడిపోయి పద్మకింజల్క సన్నిభ##మైన స్వర్ణకాంతి కలిగింది. ఆ ఊడిన నల్లని (పొర) కోశాన్నుంచి కాత్యాయని జన్మించింది. ఓ నారదా! అంతట ఇంద్రుడామెను సమీపించి ఆ కాత్యాయనిని దక్షిణగా స్వీకరించి పార్వతిని యిలా అర్థించాడు. ''దేవీ! ఈమెను నాకిచ్చి వేయుము. నీ కోశము నుండి పుట్టిన ఈ కౌశికి నాకు సోదరి కాగలదు. అందుచేత నేను కౌశికుడనయ్యెదను. ''ఇంద్రుని కోర్కెను మన్నించి ఆ సుందరి కౌశికిని, అతనికిచ్చి వేసింది. ఆ సహస్రాక్షుడా కౌశికిని వెంటబెట్టుకొని త్వరత్వరగా వింధ్యాద్రికి చేరుకున్నాడు. ఆమెతో ''ఓ మహాబలశాలినీ ! నీవీ వింధ్యశిఖరాన వింధ్య వాసిని అనే పేరుతో సర్వదేవతలచే కీర్తింపబడుతూ విరాజిల్లుము. ఈ సింహంమీద విహరిస్తూ అమర శత్రువులనందరను సంహరింపుము'' అని చెప్పి ఆ దేవరాజు స్వర్గానికి వెళ్ళిపోయాడు.

ఉమా7పితం వరంలబ్ధ్వా మందరంపునరేత్యచ | ప్రణమ్య చ మహేశానః స్థితా సవినయంమునే. 29

తతో7మర గురఃశ్రీమాన్‌ పార్వత్యా సహితో7వ్యయః | తస్థౌవర్ష సహస్రంహి మహామోహనకే మునే. 30

మహామోహస్థితేరుద్రే భువనాశ్చేలురుద్దతాః | చక్షుభుఃసాగరాః సప్తదేవాశ్చ భయమాగమన్‌ 31

తతఃసురాః సహేంద్రేణ బ్రహ్మణః సదనం గతాః | ప్రణమ్యోచు ర్మహేశానం జగత్‌క్షుబ్థింతుకిం త్విదమ్‌.

తానువాచ భవోనూనం మహామోహనకే స్థితః | తేనాక్రాంతాస్త్విమేలోకా జగ్ముఃక్షోభం దురీత్యయమ్‌. 33

ఇత్యుక్త్వాసో7భవత్‌ తూష్ణీం తతో7వ్యూచుః సురాహరిమ్‌ | ఆగచ్ఛశగ్రచ్ఛామో యావత్తన్న సమాప్యతే.

సమాప్తే మోహనేబాలో యఃసముత్పత్స్యతే7వ్యయః | సమానం దేవరాజస్య పదమైంద్రం హరిష్యతి. 35

తతో7మరాణాం వచనా ద్వివేకో బలఘాతినః | భయాత్‌జ్ఞానంతతో నష్టంభావికర్మ ప్రబోధనాత్‌. 36

తతఃశక్రః సురైస్పార్థం వహ్నినా చ సహాస్రదృక్‌ | జగామమందరగిరిం తచ్ఛృంగేన్యవిశత్తతః. 37

అశక్తాః సర్వఏవైతే ప్రవేష్ఠుం తద్భవాజిరమ్‌ | చింతయిత్వారు సంచిరం పావకం తేవ్యసర్జయన్‌. 38

స చాభ్యేత్య సురశ్రేష్ఠో దృష్ఠ్వాద్వారే చ నందినమ్‌ |

దుష్ట్రవేశం చ తంమత్వా చింతాంవహ్నిః వరాం గతః 39

స తుచింతార్ణవేమగ్నః ప్రాపశ్యచ్ఛంభు సద్మనః |

నిష్క్రామంతీం మహా పంక్తిం హంసానాం విమలాంతథా. 40

అసావుపాయ ఇత్యుక్త్వా హంసరూపోహుతాశనః | వంచయిత్వా ప్రతీహారం ప్రవివేశహరాజిరమ్‌. 41

ప్రవిశ్యసూక్ష్మ మూర్తిశ్చ శిరోదేశే కపర్ధినః | ప్రాహప్రహస్య గంభీరం దేవాద్వారి స్థితా ఇతి 42

తచ్ఛృత్వా సహసోత్థాయ పరిత్య జ్యగిరేః సుతామ్‌ | వినిష్క్రాంతో7జిరాచ్ఛర్వో వహ్నినాసహ నారద

వినిష్క్రాంతే సురపతౌ దేవాముదిత మానసాః | శిరోఖిరవనీంజగ్ముః సేంద్రార్క శశిపావకాః. 44

తతఃప్రీత్యాసురానాహ వదధ్వం కార్యమాశుమే | ప్రణామావనతానాంవో దాస్యే7హం వరముత్తమమ్‌. 45

దేవా ఊచుః :

యదితుష్టో7సి దేవానాం వరందాతు మిహేచ్ఛసి | తదిదంత్య జ్యతాంతావ న్మ

హామైథునమీశ్వరః. 46

ఈశ్వర ఉవాచ :

ఏవం భవతు సంత్యక్తో మయాభావో7మరోత్తమాః | మమేదంతేజ ఉద్రిక్తం కశ్చిద్దేవః

ప్రతీచ్ఛతు 47

నారదా ! ఉమకూడ అట్లు వరాన్ని పొంది తిరిగి మందగిరికి వచ్చి భర్తయైన శివునకుమ్రొక్కి వినయంగా నిలబడింది. అంతనా పార్వతితో కలిసి దేవాధిదేవుడు వేయి సంవత్సరాలు కామోపభోగాలనుభవించాడు. అలా శివుడు కామ క్రీడల్లో మునిగి ఉండగా ముల్లోకాలూ క్షోభించిపోయాయి. సముద్రాలు ఘూర్లిల్లాయి. దేవతలంతా భయంకంపితులై ఇంద్రు నితో కలిసి బ్రహ్మవద్దకు వెళ్ళి నమస్కరించి యీ సంక్షోభానికి కారణమేమని అడిగారు. ఆయన, శివుడు పార్వతితో మహామైథున క్రీడలోమునిగి యున్నాడు. ఆ తీవ్రతకు లోకాలన్నీ కంపించిపోతున్నాయని చెప్పి మౌనం వహించాడు. అంతట దేవతలు యింద్రునితో ''దేవపతీ! త్వరపడుము. శివ పార్వతుల మైథునకర్మ ముగియు లోపల మనమక్కడకు వెళ్ళవలె. అది పూర్తిఅయి బాలకుడు జన్మించినచో అతడు నీ యింద్రాధిపత్యాన్ని హరించి వేస్తాడని భయపెట్టారు. దేవతల మాట వినగానే యింద్రుడి వివేకం విచక్షణా జ్ఞానం నశించి, భయం చోటుచేసుకుంది. అతడా క్షణమే దేవతలను అగ్నిని వెంటబెట్టుకొని మందరగిరి శిఖరాన డేరా వేశాడు. శివుని భవనంలోకి వెళ్ళేందుకు ధైర్యంచాలక చాలసేపు తమలోతామాలోచించుకుని చివరకు అగ్నిని పంపించాడు. అగ్ని శివుని యింటిప్రాంగణం వద్దకు వెళ్ళిచూస్తే నందీశ్వరుడు ద్వారంవద్ద నిలచి ఉన్నాడు. దానికి భయపడి అగ్ని కర్తవ్యం ఆలోచిస్తూ ఉండగా ఒక పెద్ద హంసలగుంపు ఈశ్వర భవనంలో నుంచి బయటకు వస్తూ కనిపించింది. ఇదే తరుణమని ఎంచి అగ్ని ఒక హంసరూపం ధరించి నందికన్నుగప్పి లోపలకు ప్రవేశించాడు. అక్కడ యింకా సూక్ష్మరూపంలో త్రినేత్రుని జటామండలం మీద ఎగురుతూ శివుడికి వినపడునట్లు మెల్లగా దేవతలు ద్వారంవద్ద వేచి యున్నారని చెప్పాడు. అంతట వెంటనే పార్వతిని వదిలి శివుడు అగ్నితోకలిసి ప్రాంగణంలోకి వచ్చాడు. నారదా ! అలా బయటకువచ్చిన హరునిచూచి దేవతలు సంతోషించారు. అందరూ భూమికి తలల ఆనించి నమస్కారాలు చేశారు. అంతట శివుడు మీకోర్కె తీర్చగలను. మీరెందుకు వచ్చారో చెప్పండని అన్నాడు. అందునకు దేవతలందరూ - ప్రభూ మమ్ముల కరుణింపనెంచుచో మీ యీ మైథునక్రీడను చాలించండి, అని విన్నవించారు. అందులకా దేవదేవడట్లేయని అంగీకరించి, అయితే ఉద్రిక్తమైన వాయీ శుక్రాన్ని ఎవరు గ్రహిస్తారని ప్రశ్నించాడు.

పులస్త్య ఉవాచ :

ఇత్యుక్తాః శంభునాదేవాః స్తేంద్రచంద్రదివాకరాః | అసీ దంతయథా మగ్నాః పంకే బృందారకా ఇవ. 48

సీదత్సుదైవతేష్వేవం హుతాశో7భ్యేత్య శంకరమ్‌ | ప్రోవాచంముంచ తేజస్త్యం ప్రతీచ్ఛామ్యేష శంకర. 49

తతోముమోచ భగవాం స్తద్రేతఃస్కన్న మేవతు | జలం తృషాంతే వైయద్వత్‌ తైలపానం పిపాసితః. 50

తతఃపీతే తేజసివై శార్వే దేవేనవహ్నినా | స్వస్థాః సురాః సమామంత్య్ర హరంజగ్ముస్త్రి విష్టపమ్‌. 51

సంప్రయాతేషు దేవేషు హరో7పి నిజమందిరమ్‌ | సమభ్యేత్య మహాదేవీ మిదం వచన మబ్రవీత్‌. 52

దేవి | దేవైరిహాభ్యేత్య యత్నాత్‌ ప్రేష్యహుతాశనమ్‌ | నీతఃప్రోక్తోనిషిద్ధస్తు పుత్రోత్పత్తిందవోదరాత్‌. 53

సా7పిభర్తుర్వచః శ్రుత్వా క్రుద్దారక్తాంతలోచనా | శశాపదైవతాన్‌ సర్వాన్‌ నష్టపుత్రోద్భవాశివా. 54

యస్మాన్నిచ్ఛంతి తే దుష్టా మమపుత్ర మధౌరసమ్‌| తస్మాత్తేన జనిష్యంతి స్వాసుయోషిత్సు పుత్రకాన్‌. 55

ఏవంశప్త్వా సురాన్‌గౌరీ శౌచశాలా ముపాగమత్‌ | ఆహూయమాలినీం స్నాతుం మతించక్రే తపోధనాః 56

మాలినీ సురభింగృహ్య శ్లక్‌ష్ణ ముద్వర్తనం శుభా | దేవ్యం గముద్వర్తయతే కరాభ్యాం కనకప్రభమ్‌

తత్‌స్వేదం పార్వతీ చైన మేనేకీ దృగ్గుణనహి.

మాలినీతూర్ణ మగమద్‌ గృహంస్నానస్య కారణాత్‌ | తస్యాంంగతాయాం శైలేయీ మలాచ్చక్రేగజాననమ్‌.

చతుర్భుజం పీనవక్షం పురుషం లక్షణాన్వితమ్‌ | కృత్వోత్స సర్ణభూమ్యాంచ స్థితాభద్రాసనేపునః 59

మాలినీతచ్ఛిరస్నానం దదౌ విహసతీతదా | ఈషద్ధాసాముమా దృష్ట్వా మాలినీం ప్రాహనారదః 60

కిమర్థం భీరుశనకై ర్హనసి త్వమతీవచ ? | సా7థోవాచహసామ్యేవం భపత్యాస్త నయంకిల. 61

భవిష్యతీత దేవేన ప్రోక్తోనందీగణాధిపః| తత్‌శ్రుత్వా మమహాసో7యం సంజాతో7ద్యకృశోదరి. 62

శంకరుని ప్రశ్నకు ఇంద్ర చంద్ర సూర్యుడు మొదలైన దేవతలు ఊబిలో కూరుకొనిపోయిన ఏనుగుల్లాగ హతాశులయ్యారు. దేవతల దైవ్యాన్ని చూచి అగ్నిముందుకు వచ్చి''శివా నీ శుక్రాన్ని నేను భరిస్తాను, వెంటనే వదులుమనెను. దాహం గొప్పవాడినోట్లో నూనెపోసినట్లు శంకరుడా శుక్లాన్ని అగ్నినోట వదిలాడు. శివ తేజాన్ని అగ్నిపానం చేయగానే దేవతలు స్వస్థులై తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు. దేవతలువెళ్ళిన తర్వాత శివుడులోనికి వెళ్ళి పార్వతితో, దేవీః దేవతలందరు వచ్చి ఎంతో కష్టంతో అగ్నిని లోనికిపంపి నన్ను బయటకు పిలిపించుకున్నారు. నీ గర్భంనుంచి పుత్రుడు కలుగకుండా నన్ను నివారించి వెళ్ళిపోయారని చెప్పాడు అది విన్నంతనే కోపంతో నిప్పులుగ్రక్కుచు దేవతల్లో ఎవరికీ కూడ యిక ముందు భార్యలవల్ల పుత్రులు కలుగరాదని భయంకరంగా శపించింది. నాకు ఔరసుడు కలుగకుండా కుట్రపన్నిన దుష్టులు అపుత్రులుగా ఉండిపోతారని శాసించింది. అలా దేవతలకు శాపమిచ్చి గౌరిశౌచాలయంలోకి వెళ్ళి మాలిని పిలిచి స్నానానికి ఏర్పాట్లు చేయమన్నది. మాలిని పరిమళభరితమైన ఉద్వర్తన (నలుగుపిండి) ద్రవ్యంలో ఆ దేవి బంగారు వన్నెగల కరచరణాదులకు నలుగుపెడుతూ ఉంటే పార్వతి తన స్వేదం (చెమట) ప్రభావాన్ని గురించి ఆలోచించసాగింది. నలుగుపెట్టి మాలిని స్నానం చేసేందుకు లోపలకు పోయింది. ఆమె పోగానే తనవంటి నుండి రాలిన నలుగుపిండితో గజముఖము, నాలుగు చేతులు, వెడల్పు ఛాతీ గలిగి పురుషాకృతి గల బొమ్మనుచేసి నిలబెట్టింది. ఇంతలో మాలిని వచ్చి ఆమెకు శిరస్నానం చేయిస్తూ మధ్యలో తనలోతాను నవ్వుకొనడం సాగించింది. నారదా! అది చూచి పార్వతి ఎందుకే నీలో నీవు మాటిమాటికి అలా నవ్వుకుంటున్నువు ! అని అడిగింది. అందుకు మాలిని నవ్వుతూ అవునమ్మా నీకు కొడుకు కలుగుతాడని శివుడు గణాధిపతి నందితో అంటూంటే విన్నాను. అందుకే యిలా నవ్వుతున్నా. దేవతలు ఆయనను కొడుకును కనకుండా నివారించారు కదా!''

యస్మాద్దేవైః పుత్రకామః శంకరో వినివారితః | ఏతచ్ఛృత్వావచోదేవీ స స్నౌపుత్ర విధానతః. 63

యస్మాద్ధేవైః పుత్రకామః శంకరోవినివారితః | ఏతచ్ఛృత్వాపచోదేవీ సస్నౌ తత్ర విధానతః.

63

స్నాత్వా7ర్చ్యశంకరంభక్త్యా సమభ్యాగాద్‌ గృహం ప్రతి | తతః శంభుంసమాగత్య తస్మిన్‌ భద్రాసనేత్వపి. 64

స్నాతస్తస్యతతో7ధస్తాత్‌ స్థితఃసమలపూరుషః | ఉమాస్వేదంభవస్వేదం జలభృతిసమన్వితమ్‌. 65

తత్పంపర్కాత్‌ సముత్తస్తే పూత్కృత్యకరముత్తమమ్‌ | అపత్యంహివిదిత్వాచ ప్రీతిమాన్‌ భువనేశ్వరః. 66

తంచాదాయహరో నంది మువాచభగనేత్రహా | రుద్రఃస్నాత్వా7ర్చ్యదేవాదీన్‌ వాగ్భిరద్భిఃపితౄనపి. 67

జప్త్వాసహస్రనామాన ముమాపార్శ్వముపాగతః | సమేత్యదేవీంవిహసన్‌ శంకరఃశూలదృగ్‌ వచః. 68

ప్రాహత్వపశ్యశైలేయి స్వసుతంగుణసంయుతమ్‌ | ఇత్యుక్తాపర్వతసుతా నమేత్యాపశ్యదద్భుతమ్‌. 69

యత్తదంగమలాద్దివ్యం కృతం గజముఖం నరమ్‌ | తతఃప్రీతాగిరిసుతా తంపుత్రంపరిషస్వజే. 70

మూర్ద్నిచైనముపాఘ్రాయ తతఃశర్వో7బ్రవీదుమామ్‌ | నాయకేనవినాదేవి తనభూతో7పిపుత్రకః. 71

యస్మాజ్ఞాతస్తతోనామ్నా భవిష్యతివినాయకః | ఏషవిఘ్నసహస్రాణి సురాదీనాంకరిష్యతి.

72

పూజలుష్యంతిచైవాస్య లోకాదేవిచరాచరాః | ఇత్యేవముక్త్వాదేవ్యాస్తు దత్తవాంస్తనయాయహి. 73

సహాయంతుగణశ్రేష్ఠం నామ్నాఖ్యాతంఘటోదరమ్‌ | తథామాతృగణాఘోరా భూతావిఘ్నకరాశ్చయే. 74

తేసర్వేపరమేశేన దేవ్యాఃప్రీత్యోపపాదితాః | దేవీచస్వసుతందృష్ట్వా పరాంముదమవాపచ.

75

రేమే7థశంభునాసార్థం మందరేచారుకందరే | ఏవంభూయో7భువద్దేవీ ఇయంకాత్యాయనీవిభో

యజమానమహాదైత్యౌ పురాశుంభనిశుంభకౌ. 76

ఏతత్తవోక్తంవచనంశుభాఖ్యం | యథోద్భవం పర్వతతో మృడాన్యాః

స్వర్గ్యంయశస్యంచ తథాఘహరి | అఖ్యాన మూర్జస్కర మద్రిపుత్ర్యాః. 77

ఇతి శ్రీ వామనమహాపురాణ అష్టావింశో7ధ్యాయః.

మాలిని మాటలు విని పార్వతి యధావిధిగా స్నానం చేసి భక్తితో శంకరుని అర్చించి యింటిలోనికి వచ్చింది శంకరుడుకూడ పార్వతికూర్చున్న భద్రాసనం మీదనే కూర్చుండి స్నానం చేశాడు. అప్పుడాయన క్రింద నిలబెట్టిన నలుగు పిండి బొమ్మను చూచాడు. ఆ నేల ఉమాశంకరుల చమటితో తడిసినందున ఆ బొమ్మ జీవసంగల పురుషుడుగా తొండంతో పూత్కారం చేస్తూ నిలబడింది. ఆ గజాననుడిని తన పుత్రుడుగా గుర్తించి శివుడు మహదానందపడ్డాడు. అతడిని వెంట బెట్టుకొని నందికి చూపించి ఆ సమాచారం చెప్పాడు. తర్వాత స్నానం చేసి ఆత్మపూజ, దేవపితృ పూజలు పవిత్ర మంత్రాలతో గావించి సహస్రనామాలు జపిస్తూ ఉమను సమీపించి, పర్వతపుత్రీ! ఇడుగో సకల గుణాఢ్యుడైన నీ కుమారుడు'' ని చూపించాడు. అప్పుడా పార్వతి తన శరీర మలం (నలుగుపిండీ) తో చేసిన బొమ్మగజ ముఖంతో నరుడుగా మారడం చూచి సంతోషించి కౌగిలించుకొని ముద్దాడింది. అప్పుడు శర్వుడు, నాయకుడు (తండ్రి) లేకుండా పుట్టిన ఈ బిడ్డ వినాయకుడని ఉమతో అన్నాడు. ఆ పేరుతో మనసుతుడు దేవతలకు వేలవిధాల విఘ్నాలు కలుగజేస్తాడు. ఇతడిని దేవతలు చరాచరజీవులు పూజిస్తారంటూ పార్వతికి అప్పుగించాడు. సర్వగణాల్లో శ్రేష్ఠుడైన ఘటోదరుడను వానిని విఘ్నాలు కలుగుజేసే మాతృగణాలను భూతాలను వినాయకునకు సహాయకులుగా నియమించాడు. పార్వతి తృప్తికోసంగాను హరుడు తన కుమారుని చూచి కొని ఉమ నిజంగానే పరమానందం పొందింది. నారదా ! తర్వాత పార్వతి శివునితో మందరగిరి సుందర కంధరాల్లో విహారాలు గావించింది. ఆ విధంగా కాత్యాయని మరల జన్మించి పురాసమయాన శంభునిశుంభులనే దైత్యులను సంహరించింది. పర్వత పుత్రిగా మృడాని జన్మగాథ చాలా మంగళకరమైనది. పాపహారి. స్వర్గ యశస్సులు చేకూర్చగలిగి భవ్యవృత్తాంతం. నీకు వివరంగా వినిపించాను.

ఇది శ్రీ వామన పురాణంలో యిరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters