Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువదిఎమిదవ అధ్యాయము

మార్కండేయ ఉవాచ :

చతుర్ముఖానాముత్పత్తిం విస్తరేణమమానఘ ః | తథాబ్రహ్మేశ్వరాణాంచ శ్రోతమిచ్ఛాప్రవర్తతే. 1

సనత్కుమార ఉవాచ :

శృణుసర్వమశేషేణ కథయిష్యామితే7నఘః | బ్రహ్మణఃస్రష్టుకామస్య యద్వృత్తంపద్మజన్మనః. 2

ఉత్పన్న ఏవభగవాన్‌ బ్రహ్మాలోకపితామహః | ససర్జసర్వభూతాని స్థావరాణిచరాణిచ. 3

పునశ్చింతయతః సృష్టిం జజ్ఞే కన్యామనోరమా | నీలోత్పలదలశ్యామా తనుమధ్యాసులోచనా. 4

తాందృష్ట్వాభిమతాంబ్రహ్మా మైథునాయాజుహావతామ్‌ | తేనపాపేనమహతా శిరో 7శీర్యతవేధసః. 5

తేనశీర్ణేససయ¸° తీర్థంత్రైలోక్యవిశ్రుతమ్‌ | సాంనిహిత్యంసరఃపుణ్యం సర్వపాపక్షయావహమ్‌. 6

తత్రపుణ్యస్థాణుతీర్థేఋషిసిద్ధనిషేవితే | సరస్వత్యుత్తరేతీరే ప్రతిష్ఠాప్యచతుర్ముఖమ్‌. 7

ఆరాధయామాసతదా ధూపైర్గంధైర్మనోరమైః | ఉపహారైస్తథాహృద్యై

రౌద్రసూక్తైర్దినేదినే. 8

తసై#్యవంభక్తియుక్తస్య శివపూజాపరస్యచ | స్వయమేవాజగామాథ భగవాన్‌

నీలలోహితః. 9

తమాగతంశివందృష్ట్వా బ్రహ్మలోకపితామహః | ప్రణమ్యశిరసాభూమౌ స్తుతింతస్య చకారహ. 10

బ్రహ్మోవాచ :

నమస్తే7స్తుమహాదేవ భూతభవ్యభవాశ్రయ | నమస్తేస్తుతినిత్యాయ

నమసై#్త్రలోక్యపాలినే. 11

నమఃపవిత్రదేహాయ సర్వకల్మషనాశినే | చరాచరగురోగుహ్య గుహ్యానాంచ

ప్రకాశకృత్‌. 12

రోగానయాంతిభిషజైః సర్వరోగవినాశన | రౌరవాజినసంవీత వీతశోకనమో7స్తుతే. 13

వారికల్లోలసంక్షుబ్దమహాబుద్దివిఘట్టినే | త్వన్నామజాపినోదేవ నభవంతిభవాశ్రయాః. 14

నమస్తేనిత్యనిత్యాయ నమసై#్త్రలోక్యపాలన | శంకరాయాప్రమేయాయ వ్యాధీనాంశమనాయచ. 15

పఠాయాపరిమేయాయ సర్వభూతప్రియాయచ | యోగేశ్వరాయదేవాయ సర్వపాపక్షయాయచ. 16

నమఃస్థాణవేసిద్దాయ సిద్దవందిస్తుతాయచ | భూతసంసార దుర్గాయ విశ్వరూపాయతేనమః. 17

ఫణీంద్రో కమహిమ్నేతే ఫణీంద్రాంగదధారిణ | ఫణీంద్రవరహారాయ భాస్కరాయనమోనమః. 18

మార్కండేయు డిట్లనెను : ఓ పాపరహితా! చతుర్ముఖులూ, బ్రహ్మేశ్వరులు ఉత్పత్తిప్రకారం విశదంగా వినదలచుచున్నాను. ఆనతీయుడు. అందులకు సనత్కుమారుడిలా చెప్పసాగాడు. ఓ నిష్పాపుడనగు మార్కండేయా! పద్మసంభవుడగు బ్రహ్మసృష్టి చేయదలచగా జరిగిన వృత్తాంతమంతా విశదీకరింతును వినుము. లోక పితామహుడగు బ్రహ్మపుట్టగానే, స్థావర జంగమాత్మకమైన భూతజాలాన్నంతా సృష్టించాడు. మరల సృష్టికి సంకల్పించుకొని, నల్ల కలువరేకుల వంటి నేత్రాలు సన్నని నడుము గలిగి నేత్రపర్వము చేయు నొక మనోహరాకృతి గల కన్యను సృష్టించాడు, ఆ బాలిక అందానికి ముగ్ధుడై తానే ఆమెను మైథునక్రీడకు ఆహ్వానించాడు. ఆ ఘోర పాపఫలంగా బ్రహ్మతలతెగిపోయెను. అలా తలతెగిపోయిననాతడు త్రిలోక ప్రసిద్దము సర్వపాప క్షయకరము అయిన సాన్నిహిత్య పుణ్యసరస్సు వద్దకు వెళ్లాడు. అక్కడ ఋషి సేవితమైన పవిత్ర స్థాణుతీర్థంలో సరస్వతి నదికి ఉత్తరపుటొడ్డున చతుర్ముఖుని ప్రతిష్ఠించి ధూపదీప గంధ నైవేద్యాదులర్పిస్తూ రుద్రసూక్త పారాయణతో ప్రతినిత్యమూ ఆరాధించాడు. భక్తియుక్తుడగు నా శివపూజా ధురంధరుని వద్దకు భగవంతుడగు నీలలో హితుడు స్వయముగా వచ్చెను. అలా వచ్చిన శివుని జూచి లోక పితామహుడగు బ్రహ్మ భూమిపై సాష్టాంగ ప్రణామం చేసి యిలా స్తోత్రం చేశాడు-

ఓ మహాదేవా! భూతభప్యభవాశ్రయా! నీకు నమస్సులు ! ఓ త్రిలోకపాలకా!స్తుతినిత్యా! పవిత్రదేహా, సర్వకల్మష హరా! చరాచరగురో! నీకు నమోవాకములు. రహస్య ప్రత్యక్ష విషయాలన్నీ తెలుపువాడాః వైద్యులకసాధ్యమైన సకల రోగములు నశింపజేయువాడా! కురుచర్మవాసా!శోకరహితా! నీకు ప్రణామములు! వారికల్లోల సంక్షుబ్ద మహాబుద్ధి విఘటకా! దేవా నీ నామంజపించువారు సంసారంలో చిక్కుకొనరు. ఓ నిత్యులలో నిత్యా! త్రిలోకపాలకాః శంకరా! అప్రమేయా! వ్యాధినాశకా!పరా! అపరిమేయా ! సర్వజీవప్రియా! నీకు నమోవాకములు. యోగేశ్వరా! సర్వపాప క్షయకరా! దేవా! స్థాణూ! సిద్ధా! సిద్దులు వందిమాగధులచే స్తుతించబడువాడ! సంసార జీవులకు అందని వాడా! విశ్వరూపీ! నీకు ప్రణామములు! ఫణీంద్ర వర్ణిత మహిమాన్వితా! ఫణీంద్ర భుజబంధ కంకఱధరా! ఫణీంద్ర దివ్యమాలాధరా! భాస్కరా నీకు నమో వాకములు!

ఏవంస్తుతోమహాదేవో బ్రహ్మణంప్రాహశంకరః | నచమన్యుస్త్వయా కార్యోభావిస్యర్థేకదాచన. 19

పురావరాహకల్పేతే యన్మయా7పహృతంశిరః | చతుర్ముఖంచతదభూ న్నకదాచిన్న శిష్యతి. 20

అస్మిన్‌ సాన్ని హితేతీర్థే లింగానిమమభక్తితః | ప్రతిష్ఠాయవిముక్తస్త్వం సర్వపాపైర్భవిష్యసి. 21

సృష్టికామేనచపురా త్వయా7హంప్రేరితఃకిల | తేనాహంత్వాంతథేత్యుక్త్వా భూతానాందేశవర్తిపత్‌. 22

దీర్ఘకాలంతపస్తప్త్వా మగ్నః సంనిహితేస్థితః | సుమహాంతంతతఃకాలం త్వంప్రతీక్షాంమమాకరోః. 23

స్రష్టారంసర్వభూతానాం నమసా కల్పితంత్వయా |

సో7బ్రవీత్‌ త్వాంతదాదృష్ట్వా మాంనుగ్నంతత్రచాంభసి. 2జి

యదిమేనాగ్రజస్త్వన్య స్తతః స్రక్ష్యామ్యహంప్రజాః | త్వయైవోక్తశ్చనైవాస్తి త్వదన్యఃపురుషో7గ్రజః. 25

స్థాణురేషజలేమగ్నో వివశః కురుమద్దికమ్‌ | ససర్వభూతాననృజద్‌ దక్షాదీంశ్చ ప్రజాపతీన్‌. 26

యైరిమంప్రకరోత్సర్వం భూతగ్రామంచ తుర్విదమ్‌ |

తాఃసృష్టమాత్రాఃక్షుధితాః ప్రజాః సర్వాః ప్రజాపతిమ్‌. 27

విభక్షయిషవోబ్రహ్మన్‌ సహసాప్రాద్రవం స్తథా | సభక్ష్యమాణస్త్రాణార్థీ పితామహముపాద్రవత్‌. 28

అథాసాంచ మహావృత్తిః ప్రజానాంసంవిధీయతామ్‌|

దత్తం తాభ్యస్తయాహ్యన్నం స్థావరాణాం మహౌషధీః. 29

జంగమానిచభూతాని దుర్బలానిబలీయసామ్‌ | విహితాన్నాః ప్రజాః సర్వాః పునర్జగ్ముర్యథాగతమ్‌. 30

తతోవవృధిరేసర్వాః ప్రీతియుక్తాః పరస్పరమ్‌ | భూతగ్రామేవివృద్దేతు తుష్టే లోకగురౌత్వయి. 31

నముత్తిష్ఠిన్‌ జలాత్తస్మాత్‌ ప్రజాః సందృష్టవానహమ్‌ | తతో7హంతాఃప్రజాదృష్ట్వా విహితాః స్వేనతేజసా.

క్రోధేన మహతాయుక్తో లింగముత్సాట్యచాక్షిసమ్‌ | తత్‌ క్షిప్తంసరసోమధ్యే ఊర్ధ్వమేవ యదాస్థితమ్‌. 33

తదాప్రభృతిలోకేషు స్థాణురితేషవిశ్రుతః | సకృద్దర్శనమాత్రేణ విముక్తః సర్వకిల్బిషైః. 34

ప్రయాతిమోక్షంపరమం యస్మాన్నావర్తతేపునః | యశ్చేహతీర్థేనివసేత్‌ కృష్ణాష్ట్యమ్యాం సమాహితః. 35

సముక్తఃపాతకైఃసర్వై రగమ్యాగమనోద్భవైః | ఇత్యుక్త్వా భగవాన్‌ దేవ స్తత్రైవాంతరధీయత. 36

ఇలా స్తుతించిన బ్రహ్మతో శంకరుడిలా చెప్పాడు. "పితామహా ! భవిష్యత్తులో జరుగబోవు కార్యాలకు నీవు చింతించనవసరంలేదు. పూర్వం వరాహ కల్పంలో నీ తలల్లో ఒకదానిని నేను సంహరించాను. అప్పుడు నీకు నాలుగు తలలే మిగిలాయి.అవి ఎన్నడూ సశించవు. ఈ సాన్నిహిత్య తీర్థంలో భక్తితో నా లింగ స్థాపన చేసిన సర్వపాపాల నుండి ముక్తుడవు కాగలవు. ప్రాచీన సమయాన సృష్టిచేయు కోర్కెతో నీవు నన్ను ప్రేరేపించగానే నట్లేయని సంనిహిత సరస్సులో మునిగి చిరకాలం తపస్సు గావించుగా నీవు నా కొరకు చాలా కాలం ప్రతీక్షించావు. అంతట నీవు సంకల్ప మాత్రానపుట్టించిన సృష్టికర్త నీతో నన్ను తాను నీళ్ళలో మునిగి ఉండగా చూచానని చెప్పాడు. తన కన్న పెద్దవారు లేనిచో తాను ప్రజాసృష్టి చేస్తాననగా అప్పుడు నీ వాతనితో నీ కన్నజ్యేష్ఠులెవరులేరు. యిక్కడ స్థాణువు విధిలేక నీళ్ళలోబడి యున్నాడు. కనుక నీవు నాకు హితం చేయవలెనని కోరావు. అంతనతడు సకల జీవరాసులను దక్షుడు మొదలగు ప్రజాపతులను సృష్టింపగా వారు జీవులనందరను నాలుగు విధాల విభజించారు. అలా సృష్టించబడిన వెంటనే ఆ ప్రజలంతా ఆకటితో అలమటిస్తూ ప్రజాపతిని భక్షింప పరుగిడినారు. ఆ ప్రజాపతి తన ప్రాణం కాపాడుకొనుటకై పితామహుని వద్దకు పరుగుతీసి ఈ జీవరాసుల జీవిత విధానాన్ని నిర్ణయించమని కోరాడు.అప్పుడు నీవు వారలకు భోజన విధానం ఏర్పాటు చేశావు. స్థావర జీవాలకు మహౌషధులను భోజనంగా చేశావు. జంగమ జీవులందరకు, వారిలో బలవంతులకు దుర్బలులను తిండిగా నియమించావు. ఈ విధంగా తమ తమ అన్న విధానములను తెలిసికొని ఆ వచ్చిన వారంతా తమ తమ చోట్లకు తిరిగి వెళ్ళారు. అప్పటి నుంచీ జీవులంతా పరస్పరం ప్రేమతో వర్థిల్లారు. అలా సృష్టి వృద్ధిబొందటం చూచి లోకగురువైన నీవు సంతోషించితివి. అంతట నేను జలమధ్యంనుండి బయటకువచ్చి ఆ ప్రజలను చూచి నా తేజస్సుతో వారిని నింపాను. తీవ్రమైన కోపంతో నా లింగాన్ని పెరికి సరస్సుమధ్య విసరివేశాను. అది నీటిలో పైకినిటారుగా నిలబడటంతో అప్పటినుండి స్థాణులింగంగా విఖ్యాతమైంది. దానిని సకృత్తుగా చూచినంతనే అన్ని కిల్బిషాలు తొలగిపోవాయి. పునరావృత్తిలేని మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ తీర్థంలో కృష్ణపక్షఅష్టమిరోజున నిర్మల చిత్తంతో నివసించినవాడు పరదారగమన గురుతల్పగతాది సకల పాపాలను నుండీ ముక్తుడౌతాడని ఆజ్ఞాపించి ఆ మహాదేవుడక్కడనే అంతర్హితుడైనాడు.

బ్రహ్మావిశుద్దపాపస్తు పూజ్యదేవంచతుర్ముఖమ్‌ | లింగానిదేవదేవస్య

ససృజేసరమధ్యతః. 37

అద్యంబ్రహ్మసరఃపుణ్యం హరిపార్శ్వేప్రతిష్ఠితమ్‌ | ద్వితీయంబ్రహ్మనదనం స్వకీయేహ్యాశ్రమేకృతమ్‌. 38

తసై#్యవపూర్వదిగ్భాగే తృతీయంచప్రతిష్ఠితమ్‌ | చతుర్థంబ్రహ్మజా లింగంసరస్వత్యాస్తటేకృతమ్‌. 39

ఏతానిబ్రహ్మతీర్థాని పుణ్యానిపావనానిచ | యేపశ్యంతినిరాహారా

స్తేయాంతిపరమాంగతిమ్‌. 40

కృతేయుగేహరేః పార్శ్వే త్రేతాయాంబ్రహ్మణాశ్రమే | ద్వాపరేతస్యపూర్వేణ సరస్వత్యాస్తటేకలౌ. 41

ఏతానిపూజయిత్వాచ దృష్ణ్వాభక్తిసమన్వితాః | విముక్తాకలుషైఃసర్వైః ప్రయాంతిపరమాంగతిమ్‌. 42

సృష్టికాలేభగవతా పూజితస్తుమహేశ్వరః | సరస్వత్యుత్తరేతీరే నామ్నాఖ్యాతశ్చతుర్ముఖః.

423

తంప్రణమ్యశ్రద్ధదానో ముచ్యతేసర్వకిల్బిషైః | లోలాసంకరసంభూతై స్తథావైభాండసంకరైః. 44

తథైవద్వాపరేప్రాప్తే స్వాశ్రమే పూజ్యశంకరమ్‌ | విముక్తోరాజసైర్భావైః వర్ణసంకరసంభ##వైః. 45

తతఃకృష్ణచతుర్దశ్యాం పూజయిత్వాతుమానవః | విముక్తఃపాతకైఃసర్వై రభోజ్యస్యాన్నసంభ##వైః. 46

కలికాలేతుసంప్రాప్తే వసిష్ఠాశ్రమమాస్థితః | చతుర్ముఖంస్థాపయిత్వా య¸°సిద్దిఘనుత్తమామ్‌. 47

తత్రాపియేనిరాహారా శ్రద్దధానాజితేంద్రియాః | పూజయంతిమహాదేవం తేయాంతిపరమంపదమ్‌ 48

ఇత్యేతత్‌ స్థాణుతీర్థస్య మహాత్మ్యంకీర్తితం తవ | యచ్ఛ్రుత్వాసర్వపాపేభ్యో ముక్తోభవతిమానవః . 49

ఇతి శ్రీ వామనమహాపురాణ సరోమహాత్మ్యే అష్టావింశో7ధ్యాయః

అంతట పాపముక్తుడైన బ్రహ్మ చతుర్ముఖ భవుని పూజించి ఆ దేవదేవుని లింగాలను సరోవరం మధ్యన ప్రతిష్ఠించెను. అందులో మొదటిది హరి పార్శ్వాన ప్రతిష్ఠించబడిన మహాపుణ్య లింగం బ్రహ్మసరము. రెండవది తన ఆశ్రమంలోనే నెలకొల్పిన బ్రహ్మసదనం. దానికి తూర్పుగా మూడవ లింగం ప్రతిష్ఠిచాడు. నాల్గవదైన బ్రహ్మలింగం సరస్వతీ తీరాన స్థాపించాడు. ఈ నాలుగు బ్రహ్మతీర్థాలు పరమ పవిత్రాలు. వీనిని ఉపవసించి దర్శించిన వారికి పరమగతి లభిస్తుంది. కృతయుగంలో హరి పార్శ్వంలో ఉన్న లింగాన్ని, త్రేతాయుగంలో బ్రహ్మ ఆశ్రమంలోని లింగాన్ని ద్వాపరంలో దానికి తూర్పున ఉన్నదానిని, కలియుగంలో సరస్వతి ఒడ్డునఉన్న లింగాన్ని భక్తితో దర్శించి అర్చిస్తే సర్వపాపాలు తొలగి పరమగతి లభిస్తుంది. సృష్ట్యాదిలో భగవంతుడు సరస్వతి ఉత్తర తీరాన పూజించిన మహేశ్వర లింగానికి చతుర్ముఖ లింగమని పేరు. దానికి శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తే సర్వపాప పరిహారం కలుగుతుంది. కామ పశు ప్రవృత్తితో కావించిన వర్ణాంతర సంగమ దోషాలు, దూషితాన్నం భుజించిన పాపాలు నశిస్తాయి. అలాగే ద్వాపరంలో శంకరుని ఆయన ఆశ్రమంలోనే పూజిస్తే రజోగుణ సముద్భూతాలయిన వర్ణ సంకర దోషాలు తొలగిపోతాయి. ఇక ప్రతి కృష్ణపక్ష చతుర్దశి (మాసశివరాత్రి) నాడు ఆ స్వామిని పూజించినచో అభోజ్యాన్న (తినరాని తిండ్లుతిన్న) సంభవాలై న పాపాలు నశిస్తాయి. కలియుంగంలో వసిష్ఠాశ్రమంలో ఉంటూ చతుర్ముఖ లింగాన్ని స్థాపించి సర్వోత్తమ సిద్ధిపొందెను. అందుననూ శ్రద్ధాభక్తులతో నిరాహారులై జితేంద్రియులై ఆ మహా దేవుని పూజించు వారలు పరమపదవిని పొందుతారు. ఏ మాత్రము సంశయం లేదు. ఈ విధంగా మీకు మహాత్మ్యకం సమగ్రంగా వివరించాను. దీనిని విన్నమానవుడు సకల పాపములు తొలగి ముక్తి పొందుతాడు.

ఇది శ్రీ వామన మహా పురాణం సరోమాహ్మ్యాంలో యిరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం.

సరోవర మహాత్మ్యం ముగిసినది.

Sri Vamana Mahapuranam    Chapters