Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువది ఆరవ అధ్యాయము

మార్కండేయ ఉవాచ :

స్థాణుతీర్థంప్రభావంతు శ్రోతుమిచ్ఛామ్యహంమునే | కేనసిద్ధిరథప్రాప్తా సర్వపాపభయాపహా. 1

సనత్కుమార ఉవాచ :

శృణుసర్వమశేషేణ స్థాణుమాహాత్మ్యముత్తమమ్‌ | యచ్ఛ్రత్వాసర్వపాపేభ్యో ముక్తోభవతిమానవః. 2

ఏకార్ణవేజగత్మస్మిన్‌ నష్టేస్థావరజంగమే | విష్ణోర్నాభిసముద్భూతం పద్మమవ్యక్తజన్మనః.

తస్మిన్‌ బ్రహ్మా సముద్భూతః సర్వలోకపితామహః. 3

తస్మాన్మరీచిరభవ న్మరీచేః కశ్యపఃసుతః | కశ్యపాదభవద్భాస్వాం

స్తస్మాన్మనురజాయత. 4

మనోస్తుక్షువతః పుత్ర ఉత్పన్నోముఖసంభవః | పృథివ్యాంచతురంతాయాం రాజాసీద్‌ధర్మరక్షితా. 5

తస్యపత్నీబభూవాథ భయానామభయామహా | మృత్యోఃసకాశాదుత్పన్నా కాలస్యదుహితాతదా 6

తస్యాంసమభవద్‌వేనో దురాత్మావేదనిందకః | సదృష్ట్వా పుత్రవదనం క్రుద్ధోరాజావనంయ¸°. 7

తత్రకృత్వాతపోఘోరం ధర్మేణావృత్యరోదనే | ప్రాప్తవాన్‌బ్రహ్మ సదనంపునరావృత్తిదుర్లభమ్‌. 8

వేనోరాజాసమభవత్‌ నమస్తేక్షితిమండలే | సమాతామహదోషేణ తేనకాలాత్మజాత్మజః. 9

ఘోషయమాసనగరే దురాత్మా వేదనిందకః | నదాతవ్యంనయష్టవ్యం వహోతవ్యంకదాచన. 10

అహమేకోత్రవైవంద్యః పూజ్యోహంభవతాసందా | మయాహిపాలితాయూయం నివసధ్వంయథాసుఖమ్‌.

తన్మత్తోన్యోనదేవోస్తి యుష్మాకంయఃపరాయణమ్‌ | ఏతచ్ఛ్రుత్వాతువచనం ఋషయఃసర్వఏవతే. 12

పరస్పరం సమాగమ్య రాజానంవాక్య మబ్రువన్‌ | శ్రుతిః ప్రమాణంధర్మస్య తతోయజ్ఞఃప్రతిష్ఠితః. 13

యజ్ఞైర్వినానోప్రీయంతే దేవాఃస్వర్గనివాసినః | అప్రీతానప్రయచ్ఛంతి వృష్ఠింసస్యస్యవృద్ధయే. 14

తస్మాద్యజ్ఞైశ్చదేవైశ్చధార్యతేసచరాచరమ్‌. 14

మార్కండేయు డిట్లనెను : మహామునీ ! స్థాణుతీర్థమహిమ సమగ్రంగా వినగోరెదను. అచట సర్వపాపాలు పోగొట్టే సిద్ధిని ఎవరు పొందారు? అందులకు సనత్కుమారుడిలా చెప్పదొడగెను. ఓ మార్కండేయ మహర్షీ! అత్యుత్తమ మైననీస్థాణుతీర్థమహిమ సాకల్యంగా వినవలసినది. దీనిని వినిన తరుడు సకలపాపలవిముక్తుడౌతాడు. మహాప్రళయ సమయాన ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తంతానశించిపోగా అవ్యక్తజన్ముడైన ఆ విష్ణుమూర్తి బొడ్డునుండి కమలం పుట్టింది. దాని నుండి సర్వలోక పితామహుడగుబ్రహ్మ ఉద్భవించాడు. ఆయన నుండి మరీచి జనించగా ఆయన కుమారుడుగా కశ్యపుడు పుట్టాడు. కశ్యపునకు సూర్యుడుకలగగా ఆయనకు మనువు జన్మించాడు. ఆ మనువు తుమ్మగా ఆయన ముఖం నుంచి ఉద్భవించిన పుత్రుడు చతురంత భూమండలానికంతకూ రాజైనాడు. మృత్యుముఖాన్నుంచి కాలుని కుమార్తెగా జనించి భయాన్ని కల్గించే ''భయా'' అనునామె ఆ రాజు భార్య అయినది. ఆమెకు. దుష్టుడు వేదదూషకుడైనవేనుడు పుట్టాడు. ఆ దుష్టుని ముఖంచూచినంతనే కోపంతో తండ్రి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన కఠోర తపస్సుచేసి ధర్మంతో భూమ్యాకాశాలను నిలిపి పునరావృత్తిలేని బ్రహ్మ సదనానికి వెళ్ళిపోయాడు. కాలుని దౌహిత్రుడైన వేనుడ భూమికంతా పాలకుడై తన మాతామహదోషం వల్ల వేదనిందకుడై రాజ్యంలో యిలా చాటింపచేశాడు. "నా రాజ్యంలో ఎవరూ దానాలు యజ్ఞయాగాలు చేయరాదు. అహుతులు వ్రేల్చరాదు. నేనొక్కడనే వందనీయుడను. నన్నుమాత్రమే అందరూ పూజించాలి. యిలా చేసినా రాజ్యంలోని మీరంతా సుఖించగలరు. నా కంటె వేరైన దేవుడెవడూ లేడు." అతని వాక్యాలకు చింతించి ఋషులంతా కలిసివెళ్ళి యిలా హితంపలికారు. రాజా! వేదాలు ధర్మానికి మూలమైన ప్రమాణాలు. అవి యజ్ఞ కర్మను విధించినవి. యజ్ఞాలుచేయకపోతే దేవతలు సంతోషించి పైరులకు అవసరమైన వర్షాలు గురిపించరు. ఆ విధంగా ఈ సృష్టి అంతా దేవ తలు యజ్ఞాలమీద ఆధారపడి యున్నది.

ఏత్వచ్ఛ్రుత్వాక్రోధదృష్టి ర్వేనఃప్రాహపునఃపునః. 15

నయష్టవ్యంనదాతప్య ­ుత్యాహక్రోధమూర్చితః! తతఃక్రోధసమా­ష్టా

ఋషయఃసర్వఏవతే. 16

నిజఘ్నుర్మంత్రపూతైస్తే కుశైర్వజ్రసమన్వితైః! తతస్త్వరాజకేలోకే తమసాసంవృతేతదా. 17

దస్యుభిఃపీడ్యమానాంస్తాన్‌ ఋషీంస్తేశరణంయముః! తతస్తేఋషయస్సర్వే మమంథుస్తస్యవైకరమ్‌. 18

సవ్యం తస్మాత్సముత్తస్ఠౌపురుషోహ్రస్వదర్శనః! తతస్తేఋషయఃస్సర్వే

నిషిదతుభవానితి. 19

తస్మాన్నిషాదాఉత్పన్నా వేనకల్మషసంభవాః! తతస్తేఋషయస్సర్వే మమంథుర్దక్షిణంకరమ్‌. 20

మథ్యమానేకరేతస్మిన్‌ ఉత్పన్నఃపురుషోపరః! బృహత్సాలప్రతీకాశో దివ్యలక్షణలక్షితః. 21

ధనుర్భాణాంకితకర శ్చక్రధ్వజనమన్వితః! తముత్పన్నంతదాదృష్ట్వా

సర్వేదేవాఃసవానవాః. 22

అభ్యషించన్వృథివ్యాంతం రాజానం భూ­ుపాలకమ్‌! తతఃసరంజయామాస ధర్మేణవృథి­dంతదా. 23

పిత్రావరంజితాతస్య తేనసాపరిపాలితా! తత్రరాజే తిశబ్దోస్య వృథివ్యారంజనాదభూత్‌. 24

నరాజ్యంప్రాప్యతేభ్యస్తు చింతయామాసపార్థివః! పితామమఅధర్మిష్ఠో యజ్ఞ­చ్ఛిత్తికారకః 25

కిథంతస్యక్రియాకార్యా పరలోకసుఖావహా! ఇత్యేవంచింతయానస్య

నారదోభ్యాజగామహ. 26

తస్మైసచాసనందత్వా ప్రణిపత్యచపృష్టవాన్‌! భగవన్‌ సర్వలోకస్య

జానాసిత్వంశుభాశుభమ్‌. 27

పితామమదురాచారో దేవబ్రాహ్మణనిందకః| న్వకర్మరహితోనిప్రః వరలోకమవాప్తవాన్‌. 28

తతోబ్ర­dన్నారదస్తం జ్ఞాత్వాదివ్యేనచక్షుషా| వ్ణుెచ్ఛమధ్యేనముత్పన్నం క్షయకుష్ఠసమన్వితమ్‌. 29

తచ్ఛ్రత్వావచనంతస్య నారదస్య మహాత్మనః | చింతయామాసదుఃఖార్తఃకథంకార్యంమయా భవేత్‌. 30

ఇత్యేవంచింతయానస్య మతిర్జాతామహాత్మనః| పుత్రఃసకథ్యతేలోకే

యఃపితౄంస్త్రాయతేభయాత్‌. 31

ఏవంసంచింత్యసతదానారదంవృష్టనాన్‌ మునిమ్‌ః తారణంమత్పితుస్తస్య మయాకార్యంకథంమునే. 32

ఋషుల మాటలు­ని కోపంతో పిచ్చివాడై దురాత్ముడకు వేనుడు యజ్ఞాలు చేయరాదు. దానాలు యివ్వకూడదు. అంటూ మాటిమాటికీ గర్జించాడు. దానితో ఆ మునులందరూ కోపించి అభిమంత్రించిన వజ్రోపమాలైన కుశలతో నా దుష్టుని ప్రహరించి సంహరించారు. అంతట రాజులేని ప్రజలంతా, దస్యులు తమను పీడించగా నానా బాధలకు లోనై ఘోషిస్తూ మహర్షులను శరణు వేడుకున్నారు. అంతట నా ఋషులా వేనుని ఎడమ చేతిని మథించగా దానినుంచి ఒక మరుగుజ్జు పుట్టాడు. వారంతట నతనితో నీ­క్కడ కూర్చోమని చెప్పారు. ఆ పొట్టివానినుండి వేనుడి పాప ఫలంగా నిషాదులు జన్మించారు. అంతట ఋషులు ఆ వేనుని కుడిచేతిని మథించారు. దానినుంచి సాంవృక్షమంత పొడవుగలిగి దివ్య లక్షణాలతో కూడిన పురుషుడుద్భ­ంచాడు. అతని చేతులలో ధ్వజ ధనుర్బాణ శంఖ చక్రాది రేఖలున్న­. ఆ పురుషుని చూచి ఇంద్రుడు మొదలయిన దేవతలందరు, వృథ్వీ పాలకునిగా అతనికి అభిషేకం చేశారు. అతడు ధర్మాత్ముడై భూ­ుని రంజింప చేశాడు. తన తండ్రి పెట్టిన బాధలకు క్షోభించిన వృథి­ని అతడు తన పాలనతో రంజింపజేసి 'రాజు' అనే శబ్దాన్ని సార్థకం గా­ంచాడు. ప్రజల నుంచి రాజ్యం స్వీకరించిన తదుపరి అతనిలా ఆలోచనలో పడ్డాడు- నా తండ్రి ఆధార్మికుడు. యజ్ఞ ­ఘాతకుడు, ఆయనకు ఉత్తమలోక ప్రాప్తి ఎలా కలుగుతుంది? అలా చింతావ్యాకులుడైన రాజు వద్దకు నారద మహర్షి రాగా నా రాజు తగిన ఆసనం యిచ్చి నమస్కరించి యిలా ప్రశ్నించాడు- భగవన్‌| తమరు సర్యజ్ఞులు. శుభాశుభ కర్మల రహస్యం తెలిసినవారు. నా తండ్రి దుష్టుడు, లోకవేద నిందకుడు, ­హితకర్మలు చేయ కుండానే మరణించాడు. అంతట దివ్యదృష్టితో అంతా గ్రహించి నారదుడిలా అన్నాడు. రాజా! నీ తండ్రి క్షయ కుష్టు రోగాలతో వ్లుెచ్ఛులలో జనించాడు. మహాత్ముడగు నారదుని మాటలు ­ని ఆ రాజు చాలా దుఃఖించి తాను ఏ­ు చేయవలెనా అని ఆలోచనలో దిగాడు. పుత్రుడనగా పితరులను భయాలనుంచి రక్షించువాడే నన్న భావం ఆయనకు తోచింది. అంతట మరల నామహామునిని తన తండ్రి తరించుటకు తానే­ు చేయవలెనో ­వరించమని వేడుకున్నాడు.

నారద ఉవాచ :

గచ్ఛత్వంతస్యతందేహం తీర్థేషుకురునిర్మలమ్‌| యత్రస్థాణోర్మహాతీర్థం సరః సంనిహితంప్రతి. 33

ఏతచ్ఛుత్వాతువచనం నారదన్య మహాత్మనః|సచివేరాజ్యమాధాయ

రాజాసతుజగామహ. 34

నగత్వాచోత్తరాంభూ­ుం వ్లుెచ్ఛమధ్యేదదర్శహ| కుష్ఠరోగేణ మహతాక్షయేణ చసమన్వితమ్‌. 35

తతఃశోకేనమహతా సంతప్తోవాక్యమబ్ర­dత్‌| హేవ్లుెచ్ఛాః నౌ­ుపురుషం స్వగృహంచనయామ్యహమ్‌. 36

తత్రాహమేనంనిరుజం కరిష్యేయదిమన్యథ| తథేతిసర్వేతేవ్లుెచ్ఛా

పురుషంతందయాపరమ్‌. 37

ఊచుఃప్రణతసర్వాంగా యథాజానాసితత్కురు|తతఆనీయపురుషాన్‌

శిబికావాహనోచితాన్‌. 38

దత్వాశుల్కంచ ద్విగుణం సుఖేననయతద్విజం| తతఃశ్రుత్వాతువచనం తస్యరాజ్ఞోదయావతః. 39

గృహీత్వాశిబికాంక్షిప్రం కురుక్షేత్రేణయాంతితే| తత్రనిత్వాస్థాణుతీర్థే అవతార్యచతేగతాః 40

తతఃసరాజామధ్యాహ్నే తంస్నాపయతివైతదా| తతోవాయురంతరిక్షే

ఇదంవచనమబ్ర­dత్‌. 41

మాతాతః సాహసం కార్షీ స్తీర్థం రక్షప్రయత్నతః| అయంపాపేన ఘోరేణ అతీవ

పరివేష్టితః. 42

వేదనిందా మహత్పాపంయస్యాంతో నైవలభ్యతే| సోయం స్నానాన్మహత్తీర్ఖం నాశయిష్యతి తత్‌ క్షణాత్‌.

ఏతద్వాయోర్వచః శ్రుత్వా దుఃఖేసి మహతాన్వితః| ఉవాచ శోకసంతప్త స్తస్య దుఃఖేన దుఃఖిత!

ఏషఘెరేణ పాపేన అతీవ పరివేష్టితః. 44

ప్రాయశ్చిత్తం కరిష్యేహం యద్వదిష్యంతి దేవతాః తతస్తాదేవతాః సర్వ ఇదం వచనమబ్రువన్‌. 45

స్నాత్వా స్నాత్వాచ తీర్థేషు అభిషించస్వ వారిణా| ఓజసాచులుకంయావత్‌ ప్రతికూలే సరస్వతీమ్‌. 46

స్నాత్వాశుద్ధి మవాస్నోతి పురుషః శ్రద్ధయాన్వితః| ఏష స్వపోషణ పరో

దేవదూషణతత్పరః. 47

బ్రాహ్మణౖశ్చ పరిత్యక్తోనైషశుద్ధ్యతి కర్హిచిత్‌| తస్మాదేనం సముద్దిశ్యస్నాత్వా తీర్థేషు

భక్తితః. 48

అభిషించస్వ తోయేన తతః పూతో భ­ష్యతి|

అపుడు నారదుడన్నాడు ః నీవు తీర్థాలన్నింటిని దర్శించి అచట నీళ్ళతో ఈతని దేహాన్ని శుద్ధి చేయము. వానితో సన్నిహిత సరోవరం దగ్గర ఉన్న స్థాణు తీర్థానికి గూడ వెళ్ళుము. నారద మహర్షి వచనాలు ­ని ఆ రాజు తన రాజ్య భారాన్ని మంత్రుల కప్పగించి తాను బయలుదేరాడు. అచట నుండి ఉత్తర భూములకు వెళ్ళి అక్కడ వ్లుెచ్చుల మధ్య కుష్ఠ క్షణ వ్యాధులతో బాధపడుతున్న తండ్రిని చూచి చాలా దుఃఖించి ఆ వ్లుెచ్ఛలతో యిలా అన్నాడు. ఓ వ్లుెచ్చులారా! నేనీ పురుషునకు నమస్కరించి యీయననింటికి తీసికొనిపోయి రోగముక్తుణ్ణి చేసుకుంటాను. ­dురనుమతినివ్వండి. అందులకా వ్లుెచ్ఛులంతా ప్రణామం చేసి అలాగే ­dు యిష్ట ప్రకారం చేసుకోవచ్చని అన్నారు. అంతట నారాజు పల్లకీ బోయీలకు యిబ్బడి కూలి యిచ్చి తన తండ్రిని ఒక శిబికలో ఎక్కించుకుని యంటికి తీసుకొని పోయినాడు. బోయీలా దయామయుని కోర్కె మన్నించి ఆ శిబిక నెత్తుకొని త్వరిత గతిని కురుక్షేత్రంలోని స్థాణు తీర్థం వద్ద దించి వెళ్ళిపోయారు. అంత నా రాజు మధాహ్న కాలాన అతనిని నదిలో స్నానం చేయించాడు. అ సమయాన ఆకసాన్నుంచి వాయువేతెంచి యిలా అన్నది. వత్సా! తొందరపడవద్దు. తీర్థ ప­త్రతను కాపాడుము. ఇతన్ని మహా ఘోరమైన పాపాలు చుట్టుకొని ఉన్న­. వేదనింద అనే పాపానికి నిష్కృతి లేదు. అలాంటి దుష్టుడు స్నానం చేస్తే తీర్థ ప­త్రత నశించి పోతుంది. వాయువు మాటలు ­ని మరింతగా దుఃఖిస్తూ, అయ్యో! ఈయన ఎంతటి భయంకర పాపాలకు నెలవైనాడని ­లపించాడు. యీ పాప పరిహారానికేదైనా ప్రాయశ్చిత్తం ఉంటే నేనది తప్పక చేయగలను. దయతో దేవతలు సెల­య్యండి. అని అర్థించాడు. అంతట దేవతలందరు యిలా సలహాయిచ్చారు. నీవు వరసగా ఒక్కొక్క తీర్థంలో స్నానంచేసి ఆ నీళ్ళతో యీతణ్ణి అభిషేకించుము. ఇలా ఓజస తీర్థం నుంచి సరస్వతి కావలనున్న చలుక తీర్థం వరకు చేయుము. శ్రద్ధాళువు లిలా తీర్థ స్నానం చేస్తే ముక్తలౌతారు. ఇక ఇతడో, అతి స్వార్థపరుడు దేవ దూషకుడు. బ్రాహ్మణులితణ్ణి పరిత్యజించారు. అంచేత ప­త్రుడు కానేరడు. కనుక యితని నుద్ధేశించి నీవు తీర్థాలలో మునిగి ఆనీటితో మార్జనం చేస్తే శుద్ధుడౌతాడు.

ఇత్యేతద్వచనం శ్రుత్వా, కృత్వాతస్యాశ్ర మంతతః. 49

తీర్థయాత్రాం య¸°రాజా ఉద్దిశ్యజనకం స్వకం! సతేషు ప్లావనం కుర్వం స్తీర్థేషు చ దినేదినే. 50

అభ్యషించత్‌ స్వపితరం తీర్థతోయేన నిత్యశంః! ఏతస్మిన్నేవకాలేతు

సారమేయోజగామహ. 51

స్థాణోర్మఠే కౌలపతి ర్దేవద్రవ్యస్య రక్షితా! వరిగ్రహస్యద్రవ్యస్య పరిపాలయితా సదా. 52

ప్రియశ్చ సర్వలోకేషు దేవకార్య వరాయణః! తస్యైవం వర్తమానస్య ధర్మమార్గే స్థితస్య

చ. 53

కాలేన చలితాబుద్ధి ర్దేవద్రవ్యస్య నాశనే | తేనాధర్మేణయుక్తస్య పరలోకగతస్య చ. 54

దృష్ట్వాయమోబ్ర­dద్వాక్యం శ్వయోనిం వ్రజమాచిరం! తద్వాక్యానంతరం జాతః శ్వావైసౌగంధికేవనే.

తతః కాలేన మహతా శ్వయూథ పరివారితః! పరిభూతః సరమయా దుఃఖేన

మహతావృతః. 56

త్వక్త్వాద్వైతవనం పుణ్యం సాన్నిహిత్యం య¸°సరః! తస్మిన్‌ ప్ర­ష్ట మాత్రస్తు స్థాణోరేవ ప్రసాదతః.

అతీవతృషయా యుక్తః సరస్వత్యాం మమజహ్జః తత్ర సంప్లుత దేహస్తు ­ముక్తః సర్వ కల్బిషైః. 58

ఆహారలోభేనతదా ప్ర­వేశకుటీరకమ్‌ | ప్ర­శంతందాదృష్ట్వా శ్వానంభయసమన్వితః. 59

సతంపన్పర్శశనకైః స్థాణుతీర్థేమమజ్జహ | పతతఃపూర్వతీర్థేషు ­ప్రుషైఃపరిషించతః. 60

శునో7స్యగాత్రసంభూతై రబ్బిందుభిఃససించితః | విరక్తదృష్టిశ్చశునః

క్షేపేణచతతఃపరమ్‌. 61

స్థాణుతీర్థస్యమాహాత్మ్యాత్‌ సపుత్రేణచతారితః | నియతస్తత్‌ క్షణాజ్జాతో దివ్యదేహసమన్వితః.

ప్రణిపత్యతదాస్థాణుం స్తుతింకర్తుంప్రచక్రమే. 62

ఆ మాటలు విన్న ఆ రాజు ఆయనకొక కుటీరమచ్చట నిర్మించి అందతని నుంచి, తాను మనస్సులో తండ్రి ముక్తిని కాంక్షిస్తూ తీర్థాటనానికి బయలుదేరాడు. ప్రతిరోజూ ఆయా తీర్థాల్లో మునిగి అందలి పవిత్రోదకాలు తెచ్చి తండ్రి మీద ప్రోక్షణం చేసేవాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకచటకొక కుక్క వచ్చింది. అది పూర్వ జన్మలో స్థాణుమఠంలో కాల స్వామియొక్క ద్రవ్యరక్షిణా బాధ్యత అప్పగించబడిన అధికారిగా ఉండేది. మొదట్లో దేవద్రవ్య రక్షణ, పరిగ్రహం, వినియోగం మొదలయిన విషయాలలో చాలా నిక్కచ్చిగా, పవిత్రంగాఉంటూ అందరి మన్ననలకు పాత్రుడైన అధికారి కాలాంతరంతో బుద్ధి చెడిపోయి దేవద్రవ్య నాశనానికి కారకుడైనాడు. ధర్మదూరుడై మరణించిన అతడు పరలోకానికి పోగా యముడాతనిని చూచి తత్‌ క్షణమే వెళ్ళి కుక్కవై జన్మించమని శిక్షించాడు. అతడు మరుక్షణం సౌగంధిక వనంలో శునక జన్మయెత్తి అనేక శునకాలతో కలిసి తిరుగసాగాడు. కొన్నాళ్ళకొక ఆడకుక్క (సరమ) చేత అవమానం పొంది ఎంతగానో దుఃఖించాడు.అద్వైతవనాన్ని వదలి వంటరిగా పవిత్రమైన సంనిహిత్య సరోవరానికి పారిపోయాడు. అక్కడ స్థాణ్వీశ్వరుని దయవల్ల విపరీతమైన దాహం తీర్చుకోవడానికి సరస్వతీనదిలో మునిగాడు. దాహశాంతికి నీళ్ళలో మునిగిన ఆ కుక్క సకల పాపాల నుంచి విముక్తి పొందింది. స్నానం చేయగానే కరకర ఆకలి వేయడంతో ఆహారాన్ని వెతుక్కుంటూ అది రాజు తండ్రి ఉన్న గుడిసెలో దూరింది. రాజా కుక్కను చూచి భయంతో మెల్లగా తాకాడు. వెంటనే ఆ స్థాణుతీర్థంలో మునిగాడు. వెనకటి తీర్థంలో మునిగిన శరీరాన్ని ఆ కుక్క విదిలించుకొనగా అవి రాజుమీద పడినాయి. కుక్క వంటిమీది నీటిబిందువులు తన మీదపడగా ఆ రాజు భయపడినాడు. స్థాణుతీర్థ మహిమవల్ల ఆ విధంగా కుమారుని మూలాన ఆయన తరించాడు. వెంటనే ఇంద్రియ జయంకలిగి దివ్యశరీరాన్ని పొందాడు. అంతమహానందంతో ఆ వేనుడు ప్రణమిల్లి స్థాణు భగవానుని స్తోత్రం చేయసాగాడు.

వేన ఉవాచ :

ప్రపద్యేదేవమీశానం త్వామజంచంద్రభూషణమ్‌ | మహాదేవంషుహాత్మానం విశ్వస్యజగతఃపతిమ్‌. 63

నమస్తేదేవదేవేశ సర్వశత్రునిషూదన | దేవేశబలవిష్టంభ దేవదైత్యేశపూజిత. 64

విరూపాక్షసహస్రాక్షయక్షేశ్వర ప్రియః | సర్వతఃపాణిపాదాంత సర్వతో7క్షిశిరోముఖ. 65

సర్వతఃశ్రుతిముల్లేకే సర్వమావృత్యతిష్ఠసి | శంకుకర్ణమహాకర్ణ కుంభకర్ణార్ణవాలయ. 66

గజేంద్రకర్ణగోకర్ణ పాణికర్ణనమో7స్తుతే | శతజిహ్వశతావర్త శతోదరశతానన ! . 67

గాయంతిత్వాంగాయత్రిణో హ్యర్చయంత్యర్కమర్చిణః | బ్రహ్మాణంత్వాంశతక్రతో ఉద్వంశమివమేనిరే. 68

మూర్తౌహితేమహామూర్తే సముద్రాంబుధరాస్తథా | దేవతాఃసర్వఏవాత్ర

గోష్ఠేగావఇవాసతే. 69

శరీరేతవపశ్యామి సోమమగ్నింజలేశ్వరమ్‌ | నారాయణం తథా సూర్యం బ్రహ్మాణం చ బృహన్పతిమ్‌. 70

భగవాన్‌ కారణంకార్యం క్రియాకారణమేవతత్‌ | ప్రభవఃప్రలయశ్చైవ సదసచ్చాపిదైవతమ్‌. 71

నమోభవాయశర్వాయ వరదాయోగ్రరూపిణః | అంధకాసురహంత్రేచ పశూనాంపతయేనమః. 72

త్రిజటాయ త్రిశీర్షాయ త్రిశూలసక్తపాణయే | త్ర్యంబకాయత్రినేత్రాయ త్రిపురఘ్ననమో7స్తుతే. 73

నమోముండాయ చండాయ అండాయోత్పత్తిహేతవేః | డిండిమాసక్తహస్తాయ డిండిముండాయతేనమః. 74

నమోర్ధ్వకేశదంష్ట్రాయ శుష్కాయవికృతాయచ | ధూమ్రలోహితకృష్ణాయ నీలగ్రీవాయతేనమః. 75

నమో7స్త్వప్రతిరూపాయ విరూపాయశివాయచ | సూర్యమాలాయసూర్యాయ స్వరూపధ్వజమాలినే. 76

నమోమానాతిమానాయ నమఃపటుతరాయతే |నమోగణంద్రనాథాయ వృషస్కంధాయధన్వనేః. 77

సంక్రందనాయ చండాయ పర్ణధారపుటాయచ| నమోహిరణ్యపర్ణాయ నమః

కనకవర్చసే. 78

నమఃస్తుతాయస్తుత్యాయ స్తుతిస్థాయనమో7స్తుతే | సర్వాయసర్వభక్షాయ సర్వభూతశరీరణ. 79

నమోహోత్రేచహంత్రేచ సితోదగ్రపతాకినే | నమోనమ్యాయనమ్రాయ నమః

కటకటాయచ. 80

నమో7స్తుకృశనాశాయ శయితాయోత్థిరాయచ | స్థితాయధావమానాయ ముండాయకుటిలాయచ. 81

వేనుడిట్లు ప్రార్థించెను. ప్రభూ శంకరా ! దేవుడవు ఈశానుడవు అభవుడవు చంద్రభూషణుడవగు నీకు శరణా గతుడనగుచున్నాను. నీవు మహాదేవుడవు, మహాత్ముడవు జగత్పతివి. దేవదేవేశ్వరా సర్వశత్రు నాశకా, ఇంద్రశక్తిని అదుపులో నుంచువాడా, దైత్యులచేత పూజింపబడువాడా, నిరూపాక్షా సహస్రాక్షా ముక్కంటీ, కుబేరసఖా, నీకు నమస్కారము. సర్వత్రా పాణిపాద అక్షిమస్తక, ముఖాల రూపంలో శ్రవణాల రూపంలో సమస్త విశ్వాన్ని ఆవరించియున్నావు !అన్ని చోట్ల ఉన్నావు. నీవు శంకు కర్ణుడవు (కొసదేలిన చెవులు గలవాడవు) మహాకర్ణుడవు, కుంభకర్ణుడవు, సముద్రాలకు నిలయుడవు, గజేంద్ర కర్ణుడవు, గోకర్ణుడవు, పాణికర్ణుడవు నీకు నమస్సులు. ఓ శతజిహ్వా ! శతావర్తా (అనేక జడలు గలవాడా) శతోదరా!శతాననా! గాయకులు నిన్ను పాడుచున్నారు. సూర్యారాధకులు నిన్నే ఆరాధిస్తున్నారు! ఓ శతక్రతూ! నిన్ను వారంతా పరబ్రహ్మగా పరిగణించుచున్నారు. ఓ మహామూర్తీ! నీ అనంతమైన మూర్తిలో సముద్రాలు, మేఘాలు, దేవతలు అందరూ పశువులకొట్టంలో ఆవులకు వలె ఆశ్రయం పొంది యున్నారు. ప్రభో!నీ శరీరంలో చంద్రాగ్ని వరుణులను నారాయణ సూర్య విరించి బృహస్పతులను దర్శిస్తున్నాను. దేవా! నీవు కారణం, కార్యంక్రియకు కారణుడవు, సర్వం నీ నుంచి ప్రభవిస్తవి, నీవే ప్రలయానివి, సదసత్‌ దైవతానివి నీవే! భవా! నీకు నమస్కారము శర్వా, వరదా, ఉగ్రరూపీ, అంధకాసుర నాశకా, పశుపతీ, త్రిజటేశ్వరా, త్రిశీర్షా త్రిశూలధరా, త్రినేత్రా త్రిపుర సంహారకా నీకు నమోవాకములు! ముండివి, చండుడవు, అండరూపివి, జగద్యోనివి, డిండిమ హస్తుడవు, డిండిముండ (ఒక ఓషధి) రూపి గు నీకు ప్రణామములు. ఊర్ధ్వ కేశివి, ఊర్ధ్వదంష్ట్రుడవు, శుష్కుడవు, విరూపివి, ధూమ్రలోహితకృష్ణ వర్ణుడవు, నీలకంఠడవునగు నీకు నమస్సులు, నీకు సాటి ఎవ్వరూలేరు,వికృతాకారుడవు నీవు, అయినా సర్వకల్యాణకరుడవు, సూర్యుడవు, ఆదిత్యమూలాధారివి, నీ రూపమే నీకు ధ్వజమాలికలు, మానము అతిమానము నీవే, పాటవమంతా నీ రూపమే, సమస్త గణాధీశులకు ప్రభువు నీవే వృషభ స్కంధుడవు, మహాధానుష్కుడవు; నీకు నమస్సులు ! నీవు సంక్రందనుడవు, చండుడవు, పత్రధార పుటములు గలవాడవు, హిరణ్య వర్ణుడవు కనకాభశరీరుడవు నీకు ప్రణామములు. స్తుతింపబడినవాడవు, స్తుతింపబడదగినవాడవు, స్తుతి రూపాన నిలచునాడవు నీవే. నీకు నమస్సులు. సర్వుడవు,సర్వభక్షకుడవు, సర్వభూత శరీరి నీవు. వినతుడవు నీవు, తృణజటాధారివి నీవు, అట్టి నీకు నమోవాకములు. ఓ కృశనాసా! శయితా (శయనించిన) ఉత్థితా (లేచిన) స్థితా (నిలచిన) ధావకా (పరుగిడునట్టి) ముండిత శిరస్కుడా, కుటిలుడా నీకు నమస్సులు!

నమోనర్తనశీలాయ లయవాదిత్రశాలినేః | నాట్యోపహారలుబ్దాయముఖవాదిత్రశాలినేః 82

నమోజ్యేష్ఠాయశ్రేష్ఠాయ బలాతిబలఘాతినే | కాలనాశాయకాలాయ సంసారక్షయరూపిణ 83

హిమవద్దుహితఃకాంతఃభైరవాయనమో7స్తుతే | ఉగ్రాయచనమోనిత్యం నమో7స్తుదశబాహవే. 84

చితిభస్మప్రియాయైన కపాలాస క్తపాణయే | విభీషణాయభీష్మాయ

భీమవ్రతధరాయచ. 85

నమోవికృతవక్త్రాయ నమః పూతోగ్రదృష్టయే | పక్వామమాంసలుబ్ధాయ తుంబివీణాప్రియాయచ. 86

నమోవృషాంకవృక్షాయ, గోవృషాభిరుతే నమః | కటంకటాయభీమాయ సమఃపరపరాయచ. 87

నమఃసర్వపరిష్ఠాయ వరాయవరదాయినే | నమోవిరక్తరక్తాయ భావనాయాక్షమాలినే. 88

విభేదభేదకభిన్నాయ ఛాయాయైతాపనాయచ| ఆఘోర ఘోరరూపా ఘోరఘోరతరాయచ. 89

నమఃశివాయశాంతాయ నమశ్శాంతతమాయచ | బహునేత్రకపాలాయ ఏకముర్తేనమో7స్తుతే. 90

నమఃక్షుద్రాయ లుబ్దాయ యజ్ఞభోగప్రియాయచ | పంచాలాయసితాంగాయ నమోయమనియామినే. 91

సమశ్చితోరుఘంటాయ ఘంటాఘంటనిఘంటినే | సహస్రశతఘంటాయ ఘంటామాలావిభూషిణ. 92

ప్రాణసంఘట్టగర్వాయ నమఃకిలికిలిప్రియే | హుంహుంకారాయపారాయ హుంహుంకారప్రియాయచ. 93

నమఃసమసమేనిత్యం గృహవ్యక్షని కేతినే | గర్జమాంససృగాలాయ

తారకాయతరాయచ. 94

నమోయజ్ఞాయయజినే హృతాయప్రహృతాయచ | యజ్ఞవాహాయహవ్యాయ తప్యాయతపనాయచ. 95

నమస్తుపయసేతుభ్యం తుండానాంపతయే నమః | అన్నదాయాన్నపతయే నమోనానాన్నభోజినే. 96

నమఃసహస్రశీర్షాయ సహస్రచరణాయచ | సహస్రోద్యతశూలాయ

సహస్రాభరణాయచ. 97

గంగాలులితకేశాయ ముంజకేశాయవై నమః | నమఃషట్కర్మతుష్టాయ

త్రికర్మనిరతాయచ. 98

నగ్నప్రాణాయచండాయ కృశాయస్ఫోటనాయచ | ధర్మార్ధకామమోక్షాణాం కథ్యాయకథనాయచ. 100

ఓ నర్తనశీలీ, లయవాడిత్ర శాలీ, నీకు నమస్సులు, నాట్య ప్రదర్శనలోలా ముఖవాద్య ప్రవీణా (సుషిరవాద్యాలు) జ్యేష్ఠా ! శ్రేష్ఠా ! అత్యంత బలశాలురను నిర్జించువాడా, మృత్యునాశకా, కాంస్వరూపా, లయరూపా నీకు నమస్కారము. ఓ పార్వతీ ప్రియా! భైరవా! ఉగ్రా! దశబాహూ నీకు ప్రతతినిత్యమూ నమశ్శతాలు. చితి భస్మప్రియా, కపాలహస్తా, విభీషణ, భయంకరా! కఠోరవ్రతధరా! వికృతముఖా, పవిత్రమైన తీవ్రదృష్టి గలవాడా, పక్వంచేసిన అమమాంసలోలుసా, తుంబి వీణా ప్రియా నీకు ప్రణామములు. వృషాంక (రుద్రాక్ష) వృక్షరూపా, ఆంబోతు రంకెవంటి కంఠధ్వనికల ప్రభూ! కటంకటా (అగ్నిరూపా), భీమా, పరా అపరా స్వరూపా నీకు నమస్సులు. ఓ సర్వశ్రేష్ఠా, వరా, వరదా, నిరాసక్తా, కర్మఫల దాతా (భావనా) రుద్రాక్షమాలాతరా, విభేద భేద భిన్నరూపా, ఛాయారూపా, ఊష్మరూపా, అఘోర ఘోరరూపా (సౌమ్యఘోరరూపా) ఘోరఘోరతరా (ఉగ్రాతి ఉగ్రుడా) నీకు నమస్సులు. శివా నీకు ప్రణామం, శాంతా, శాంతతమ రూపా, బహునేత్ర కపాలా, ఏకమూర్తీ (పరస్పర విరుద్ద గుణరూపా) నీకు నమోవాకములు. క్షుద్రరూపా, లుబ్ధరూపా, యజ్ఞ భాగప్రియా ! పంచాలా (పాంచాల జాతి) శ్వేతాంగధరా, యమా (మృత్యు) నిరోధకా విచిత్రమైన పెద్దగంట కలవాడా, గంట మరియు ధాతు నివాసం కలవాడా, వందలు, వేలు గంటలు కలవాడా, గంటల మూలిక ధరించువాడా నీకు అనంత ప్రణామములు. ప్రాణవాయు సంఘటన శక్తితో గర్వించువాడా, కిలికిలినాద ప్రియా, హుంకారరూపా హుంకార ప్రియా నీకు ప్రణామములు. సమసమా (శాంతినాశకా) గృహ వృక్షనివాసీ (బిల్వరూపీ) గర్భమాంససృగాలా (శిశుమాంస భోజియగునక్క) తారకా, (నావికా) తరా (నౌకారూపా) నీకు నమోవాకాలు. యజ్ఞరూపా, యూజకా, హుతా, ప్రహుతా (సర్వభూత బలి), యజ్ఞవాహకా, హవ్యరూపా, తప్యా, ధపనా (తపస్సు -సూర్యుడు) నీకు నమస్కారం, పయ (జలం) స్వరూపా, తుండపతీ (వక్త్రాధిపతి) అన్నదాతా, అన్నపతీ, నానాన్న భోజీ నీకు ప్రణామములు. సహస్ర శీర్షా! సహస్ర చరణా, సహస్రోద్యత శూలీ, సహస్రాభరణా, బాలానుచర గోప్తా (చిన్న పిల్లలను రక్షించువాడా) బాలలీలావిలాసీ, బాలరూపా, వృద్ధరూపా, క్షోభించినవాడా, క్షోభింపజేయువాడా, గంగాలులితకేశా (గంగాధర) , ముంజకేశా, నమస్కారము. షట్కర్మ సంతోషీ, కర్మత్రయనిరతా, నగ్నప్రాణా, చండా ! కృశా ! స్ఫోటనా (సాక్షాత్కరించువాడా) చతుర్విధ పురుషార్థరూపా, చతుర్విధ పురుషార్థ ప్రతిపాదకా నీకు నమోవాకములు.

సాంఖ్యాయసాంఖ్యముఖ్యాయ సాంఖ్యయోగముఖాయచ | నమోవిరథరథ్యాయ చతుష్పథరథాయచ. 101

కృష్ణాజినోత్తరీయాయ వ్యాళయజ్ఞోపవీతినే | వక్త్రాసంధానకేశాయ హరికేశనమో7స్తుతే.

త్ర్యంబికాంబికనాథాయ వ్యక్తావ్యక్తాయవేధసే. 102

కామకామదకామఘ్న తృప్తాతృప్తవిచారిణ | నమఃసర్వదపాపఘ్న కల్పసంఖ్యావిచారిణ 103

మహాసత్వమహాబాహో మహాబలనమో7స్తుతే | మహామేఘమహాప్రఖ్య మహాకాళమహాద్యుతే. 104

మేఘావర్తయుగావర్త చంద్రార్కపతయేనమః | త్వమన్నమన్నభోక్తాచ పక్వభుక్‌ పావనోత్తమ. 105

జరాయుజాండజాశ్చైవ స్వేదజోద్భిదజాశ్చతే | త్వమేవదేవదేవేశ భూతగ్రామశ్చతుర్విధః. 106

స్రష్టాచరాచరస్యాస్యపాతాహంతాతథైవచ | త్యామాహుర్బ్రహ్మవిద్వాంసో బ్రహ్మ బ్రహ్మ విదాంగతిమ్‌

మనసఃపరమజ్యోతి స్త్వంవాయుర్జ్యోతిషామపి | హంసహృక్షేమధుకర మాహుస్త్వాం బ్రహ్మవాదినః. 108

యజుర్మయోఋఙ్‌ మయస్త్వా మాహుఃసామమయస్తథా | పఠ్యసేస్తుతిభిర్నిత్యం వేదోపనిషదాంగణౖః. 109

బ్రాహ్మణాఃక్షత్రియావైశ్యాః శూద్రావర్ణానరాశ్చయే | త్వమేవమేఘసంఘాశ్చ విద్యుతో7శనిగర్జితమ్‌. 110

సంవత్సరస్త్వమృతవో మాసోమాసార్థమేవచ | యుగానిమేషాః కాష్ఠాశ్చ నక్షత్రాణిగ్రహాఃకళాః. 111

వృక్షాణాంకకుభో7సిత్వం గిరీణాంహిమవాన్‌ గిరిః|

వ్యాఘ్రోమృగాణానంవతతాం తార్‌క్ష్యో 7నంతశ్చభోగినామ్‌. 112

క్షీరోదో7స్యుదధీనాంచ వ్రతానాంసత్యమేవచ | వజ్రంప్రహరణానాంచ ప్రతానాంసత్వమేవచ. 113

త్వమేవద్వేషఇచ్ఛాచ రాగోమోహఃక్షమాక్షమే | వ్యవసాయోధృ తిర్లోభఃకామక్రోధౌజయాజ¸°. 114

త్వంశరీత్వంగదీచాపి ఖట్వాంగీచశరాననీ | ఛేత్తాఛేత్తాస్రహత్తా7సి

మంతానేతాసనాతనః. 115

దశలక్షణసంయుక్తో ధర్మో7ర్థఃకామఏవచ | సముద్రాఃసరితోగంగా

పర్వతాశ్చసరాంసిచ. 116

లతావల్ల్యస్తృణౌషధ్యః వశవోమృగపక్షిణః | ద్రవ్యకర్మగుణారంభః

కాలపుష్పఫలప్రదః. 117

ఆదిశ్చాంతశ్చవేదానాం గాయత్రీప్రణవస్తథా | లోహితోహరితోనీలః

కృష్ణఃపీతఃసితస్తథా. 118

కద్రుశ్చకపిలశ్చైవ కపోతోమేచక స్తథా | సవర్ణశ్చాప్యవర్ణశ్చ కర్తాహర్తాత్వమేవచ. 119

త్వమింద్రశ్చయమశ్చైవ వరుణోధనదో7నిలః | ఉపప్లవశ్చిత్రభానుః (తథా) స్వర్భానురేవచ. 120

ప్రభూ! సాంఖ్య శాస్త్రం నీవే, ఆసాంఖ్యసారతత్వం నీవే. సాంఖ్యయోగ శాస్త్రాధినేతవు నీవే. విరథుడవు, రథ్యుడవు, చతుష్పథరథికుడవు నీవే. ఇట్టి నీకు నమస్కారము. మృగచర్మధరా, సర్పయజ్ఞోపవీతా, వక్త్రా సంధానకేశా (ముఖానికంటుకొనిన కేశములు కలవాడా) హరికేశా నీకు ప్రణామము. మూడు కన్నులుగల అంబికాపతీ, వ్యక్తావ్యక్త స్వరూపా, విరించీ, నీకు నమస్కారము. కామకామదాతా, కామహరా, తృప్తాతృప్త విచారకా, సర్వదాతా, పాపనాశకా, కల్ప సంఖ్యా విచారకా నీకు నమోవాకములు. మహాసత్వా, మహాబాహో, మహాబలా, మహామేఘా, మహాప్రఖ్యా, మహాకాళా, మహాద్యుతీ, మేఘావర్తా, యుగావర్తకా, చంద్రసూర్యపతీ నీకు నమస్సులు. అన్నానివి నీవు అన్నభోక్తవు నీవు, పక్వభోజివి, పోవనోత్తముడవు, జరాయుజ, అండజ, స్వేదజ ఉద్భిజాలనే నాలుగురకాల జీవసమూహంనీవే, ఈ చరాచర జగత్తు సృష్టించినది నీవు. దీనిని రక్షించి లయముచేసేదీ నీవే. బ్రహ్మవేత్తలగువారు నిన్ను సృష్టికర్తగా బ్రహ్మవేత్తలకు పరమ గమ్యముగా పేర్కొంటారు. నీవు మనస్సుయొక్క వెలుగువు. దివ్యజ్యోతులలోని వాయువు నీవే. హంస వృక్షం (జీవాత్మల) పై తిరిగే మధుకరమని నిన్ను బ్రహ్మవాదులు ప్రశంసిస్తారు. ఋగ్యజుస్సామ వేదమయుడవు నీవు, వేదోపనిషత్తు లెల్లప్పుడు నిన్నే స్తుతిచేస్తుంటాయి. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర తదితర వర్ణాలు నీవే, మేఘబృందం, విద్యుత్తు, అశని పాతం, సంపత్సర ఋతుమాస పక్షములు, యుగములు, నిమేషకాష్ఠాలు, నక్షత్రగ్రహ కళలు అన్నీ నీ రూపాలే. నీవు వృక్షాల్లో అర్జున వృక్షానివి, గిరులలో హిమవంతానివి, మృగాల్లో వ్యాఘ్రానివి, పక్షులలో వైనతేయుడవు, సర్పాలలో అనంతుడవు, సముద్రాల్లో క్షీరసముద్రానివి, యంత్రాలలో ధనుస్సువు, ప్రహరణాల్లో వజ్రానివి, వ్రతాలలో సత్యానివి. ద్వేషం, కోరిక, రాగమోహాలు, క్షమాక్షమలు, వ్యవసాయం, ధృతి లోభం కామక్రోధ జయాపజయాలన్నీ నీవే. నీ వద్ద బాణాలు, గదలు, ధనుస్సలు, ఖట్వాంగాలు, తూణీరాలు, ఉన్నవి. నీవు ఛేత్తవు, భేత్తవు, ప్రహర్తవు, మంతవు (మననశీలివి) నేతవు సనాతనుడవు, దశలక్షణ లక్షితమైన ధర్మానివి, అర్థకామాలు నీవే, సముద్రాలు, నదులు, గంగ, పర్వత సరోవరాలు, లతలుతృణాలు, ఓషధులు పశుమృగపక్షి గణాలు అన్నీ నీవే ప్రభూ ! ద్రవ్య, కర్మ గుణాల ఉద్గమం, కాలమనే పుష్పం, దాని ఫలం యిచ్చేది నీవే, వేదాల ఆద్యంతాలు, గాయత్రి, ప్రణవ ఓంకారం, లోహిత, హరిత, నీల, కృష్ణ, పీత, శ్వేత, కద్రు, కపిల, కపోత, మేచకాది వర్ణాలు అన్నీ నీ విలాసాలే. వర్ణ (రంగు) రాహిత్యం, వర్ణత్వం, కర్తృత్వం, ఉపసం హరణం అంతా నీవే. నీవింద్రుడవు, యముడవు, వరుణుడవు, కుబేరుడవు, వాయువు, రాహువు, అగ్నివి.

శిక్షాహౌత్రంత్రిసౌపర్ణం యజుషాంశతరుద్రియం | పవిత్రంచపవిత్రాణాం మంగళానాంచమంగళమ్‌. 121

తిందుకోగిరిజోవృక్షో ముద్గంచాభిలజీవనమ్‌ | ప్రాణఃసత్త్వంరజశ్చైవ తమశ్చప్రతిపత్పతిః. 122

ప్రాణో7పానఃసమానశ్చ ఉదానోవ్యానఏవచ | ఉన్మేషశ్చనిమేషశ్చ

క్షుతంజృంభితమేవచ. 123

లోహితాంతర్గతో దృష్టిః మహావక్త్రోమహోదరః | శుచిరోమాహరిశ్మశ్రు రూర్థ్వకేశశ్చలాచలః. 124

గీతవాదిత్రనృత్యజ్ఞో గీతవాదిత్రకప్రియః | మత్ప్యోజాలోజలౌకాశ్చ

కాలఃకేళికళాకలిః. 125

అకాలశ్చనికాలశ్చ దుష్కాలఃకాలఏవచ | మృత్యుశ్చమృత్యుకర్తాచ

యక్షోయక్షభయంకరః. 126

సంవర్తకోం7తకశ్చైవ సంవర్తకవలాహకః | ఘంటోఘంటీమహాఘంటీ చిరీమాలీచమాతలిః. 127

బ్రహ్మకాలయమాగ్నీనాం దండీముండీత్రిముండ ధృక్‌|

చతుర్యగశ్చతుర్వేద శ్చాతుర్హోత్రప్రవర్తకః | 128

చతురాశ్రమ్యనేతాచ చాతుర్వర్ణ్యకరస్తథా | నిత్యమక్షప్రియోధూర్తో

గణాధ్యక్షోగణాధిపః. 129

రక్తమాల్యాంబరధరో గిరికోగిరిక ప్రియః | శిల్పంచశిల్పినాంశ్రేష్ఠః

సర్వశిల్పప్రవర్తకః. 130

భగనేత్రాంకుశశ్చండః పూష్ణోదంతవినాశనః | స్వాహాస్వధావషట్కారో నమస్కారోనమోనమః. 131

గూఢవ్రతోగుహ్యతపా స్తారకస్తారకామయః | ధాతావిధాతాసంధాతా పృథివ్యాధరణో7పపరః. 132

బ్రహ్మాతపశ్చసత్యంచ వ్రతచర్యమథార్ణవమ్‌ | భూతాత్మాభూతకృద్భూతి ర్భూతభవ్యభవోద్భవః. 133

భూర్భవఃస్వర్‌ ఋతంచైవ ధ్రువోదాంతోమహేశ్వరః | దీక్షితో7దీక్షితఃకాంతో దుర్దాంతోదాంతసంభవః.

చంద్రావర్తోయుగావర్తః సంవర్తకప్రవర్తకః | బిందుఃకామోహ్యణుఃస్థూలః కర్ణికార స్రజప్రియః. 135

నందీముఖోభీమముఖః సుముఖోదుర్ముఖ స్తథా | హిరణ్యగర్భఃశకుని

ర్మహోరగతిర్విరాట్‌. 136

అధర్మహామహాదేవో దండధారోగణోత్కటః | గోనర్దోగోప్రతారశ్చ గోవృషేశ్వర

వాహనః. 137

త్రైలోక్యగోప్తాగోవిందో గోమార్గోమార్గ ఏవచ | స్థిరఃశ్రేష్ఠశ్చస్థాణుశ్చ

విక్రోశఃక్రోశఏవచ. 138

దుర్వారణోదుర్విషహో దుస్సహోదురతిక్రమః | దుర్దరోదుష్ప్రకాశశ్చ దుర్దర్శోదుర్జయోజయః. 139

శశాంకానలశీతోష్ణః క్షుత్తృష్ణాచచిరామయః | అధయోవ్యాధయశ్చైవ వ్యాధిహావ్యాధినాశనః. 140

సమూహశ్చ సమూహస్య హంతాదేవఃసనాతనః | శిఖండీపుండరీకాక్షః పుండరీకవనాలయః. 141

త్ర్యంబకోదండధారశ్చ ఉగ్రదంష్ట్రఃకులాంతకః | విషాదహః సురశ్రేష్ఠః సోమపాస్త్వంమరుత్పతే.

అమృతాశీజగన్నాథో దేవదేవగణశ్వరః 142

మధుశ్చ్యుతానాంమధుపోబ్రహ్మ వాక్త్వంఘృతచ్యుతః | సర్వలోకస్యభోక్తాత్వం సర్వలోకపితామహః. 143

నీవు శిక్షాహోత్రుడవు (యజ్ఞజ్ఞానోపదేష్టవు) త్రిసుపర్ణ ఛందః స్వరూపివి. యజుర్వేదములోని శంరుద్రీ యమవు, పవిత్రులలో పవిత్రుడవు, శివంకరులలో శివంకరుడవు; తిందుక, గిరజ తరువులు, అందతకు జీవనరూపమైన ముద్గ (పెసర) ధాన్యము, ప్రాణతత్వము, సత్వరజస్తమాలు, ప్రతిపత్పతి, ప్రాణాపాన సమానోదాన వ్యానములు, ఉన్మేషనిమేషాలు, చీదుట, ఆవులించుట అన్నియు నీవే; రక్తంలో నీవే దాగియున్నావు, దృష్టివి, మహావక్త్రుండవు, మహోదరుడవు, శ్వేతరోముడవు, హరితశ్మశ్రు (వచ్చని గడ్డముగల) డవు, ఊర్ధ్వకేశివి, చలాచలడవు, నీకు నమస్సులు, గీతవాదిత్రనృత్య జ్ఞాతవు. గీతవాదిత్రనృత్య ప్రియుడవు, మత్స్యానివి, పలవు, జలగవు, కాలుడవు, కేళికశవు, కవివి, అకాల, వికాల, దుష్కాల, కాలములు నీరూ పాలే. మృత్యువు, మృత్యకారకుడు, యక్షుడు, యక్షులకు భయము గొల్పువాడు. సంవర్తకుడు, అంతకుడు, సంవర్తక పలాహక మేఘములు, అన్నీ నీ రూపాలే. గంటవు, గంట కలవాడవు, గొప్ప గంట కలవాడవు, మందగతి, మాలాధండవు, మాతలివి, బ్రహ్మవు, కాలుడవు, యముడవు, అగ్నివి, దండ ధరుడవు, కేశ రహితశిరుడవు, త్రిమస్తకుడవు, నాల్గుయుగాలను నాల్గు వేదాలను, నాల్గు హోత్రాలను ప్రవర్తింపజేయువాడవు. నాలుగాశ్రమాలకు అధినాయకుడవు. చాతుర్వర్ణ్య కర్తవు, అన్నీ నీవే. ఎప్పుడూ జూదప్రియుడవు. ధూర్తుడవు, సర్వ గణాలను నిరీక్షించువాడవు, గణాధీశ్వరుడవు, ఎర్రని మాలలు వస్త్రాలు ధరించువాడవు, కందుకానివి, కందుక ప్రియుడవు, శిల్పానివి, శిల్పులలో శ్రేష్ఠుడవు, సర్వ శిల్పాలను ప్రవర్తింపచేసిన ప్రభుడవునీవు. భగుని నేత్రాలను పూషుని పండ్లను రాలగొట్టిన భయంకరుడవు, స్వహా,స్వధా, పషట్కార నమస్కారరూపివైన నీకు శతశః నమస్సులు. నీవు, గూఢ వ్రతుడవు, గుహ్య తపస్వివి, తాధివు, తారకామయుడవు. ధాతవు, సంధాతవు, పృథివికి వేరొండు ఆధారానివి. వేద బ్రహ్మ, తపస్సు. సత్యం, వ్రతాచచణం, ఆర్జనం, భూతాత్మ, భూతకర్త, ఐశ్వర్యం, భూంభవిష్యద్వర్తమానాలు, భూర్‌ భవఃసురవర్లోకాలు, ఋతఁధ్రువం, దాంతం, అన్నీ నీరూపాలే. నీవు మహేశ్వరుడవు, దీక్షతుడవు. దీక్షా రహితుడవు, చక్కని వాడవు, దుర్దాంతుడవు, దాంతికి మూలానివి! చంద్రుని రూపాన, యుగాల రూపాన, మేఘాల రూపాన నీవే మాటి మాటికీ వస్తుంటావు. బిందురూపివి, అణు రూపివి, స్థూలుడవు, కర్ణికార (గన్నేరు) పుష్పమూలాస్రియుడవు. నంది ముఖుడవు, భీమ ముఖుడవు, సుముఖుడవు, దుర్ముఖుడవు, హిరణ్య గర్భుడవు, పక్షివి, భయంకరమైన సర్ప శ్రేష్ఠుడవు, విరాట్పురుషుడవు, అధర్మ నాశకుడవు, మహా దేవుడవు, దండధారివి, ఉత్కట గణరూపివి, ఎద్దువలె రంకె వేయువాడవు(గోవర్ద) గోవు ను దాటించువాడవు, పృషభేశ్వర వాహనుడవు, త్రిలోక రక్షకుడవు, గోవిందుడవు, గోమార్గానివి, మార్గానివు, స్థిరుడవు, శ్రేష్ఠుడవు, స్థాణు రూపివి, విక్రోశ, క్రోశ రూపివి అయిన నీకు నమస్సులు. నిన్నెవ్వరూ వారించలేరు, సహించలేరు అతిక్రమించలేరు, ధర్షించలేరు: నీ వెలుగు (కొందరకు) దుష్టమైనది, నిన్ను దర్శించుట కష్టము. నిన్నెవరు జయింపలేరు. నీవు విజయానివి. చంద్రాగ్నులవలె చల్లగా వేడిగా ఉంటావునీవు. ఆకలి దప్పిక, ఆరోగ్యము, అధి వ్యాధులు, వ్యాధి శమనము అంతా నీవే. సమూహాలకు సమూహాలనే సంహరిస్తావు. సనాతన దైవానివి, శిఖండివి, పుండరీకాషుడవు, పుండరీకవనాల్లో (సరస్సుల) ఉంటావు. త్ర్యంబకుడవు, దండ ధరుడవు, ఊగ్రదంష్ట్రలు కలవాడవు, కులాంతకుడవు. విషశనాకుడవు, దేవశ్రేష్ఠుడవు, సోమరసపాయివి, మరుత్తుల నాయకుడవు. అమృతభోజివి, దేవతలకు దేవగణాలకు అధిపతివి, మధువులొలికించువారల మధువు త్రాగువాడవు, బ్రహ్మవాణివి వేయిరాల్చువాడవు. సర్వలోకాలు నీకు భోజ్యాలు. సర్వ లోకాలకు పితామహుడవు నీవే. నీకు నమోవాకములు.

హిరణ్యరేతాః పురుషస్త్వమేకఃత్వంస్త్రీ పుమాంస్త్వం హి నపుంసకం చ |

బాలో యువా స్థవిరో దేవదంష్ట్రా త్వన్మో గిరిర్విశ్వకృద్‌ విశ్వహర్తా. 144

త్వంవైధాతావిశ్వకృతాంవరేణ్య స్త్వాంపూజయంతి ప్రణతాఃసదైవ |

చంద్రాదిత్యౌచక్షుషీ తే భవాన్‌ హిత్వమేవచాగ్నిః ప్రపితామహశ్చ |

ఆరాధ్యత్వాం సరస్వతీం వాగ్లభంతే అహోరాత్రే నిమిషోన్మేషకర్తా. 145

న బ్రహ్మానచగోవిందః పౌరాణాఋషయోనతే|మహాత్మ్యం వేదితుంశక్తాయాథాతతథ్యేనశంకర. 146

పుంసాంశతసహస్రాణి యత్పమావృత్యతిష్ఠతి | మహతస్తమసఃపారే గోప్తామంతాభవాన్‌ సదా. 147

యంవినిద్రాజితశ్వాసాః సత్వస్థాఃసంయతేంద్రియాః | జ్యోతిః పశ్యంతియుంజానా స్తసై#్మయోగాత్మనేనమః.

యామూర్తయశ్చ సూక్ష్మాస్తే నశక్యాయానిదర్శితుమ్‌ | తాభిర్మాంసతతంరక్షపితాపుత్రమివౌరసమ్‌. 149

రక్షమాంరక్షణీయో7హం తవానఘనమో7స్తుతే |

భక్తానుకంపీభగవన్‌ భక్తశ్చాహంసదాత్వయి. 150

జటినేదండినేనిత్యం లంబోదరశరీరణ | కమండలువిషంగాయ

తసై#్మతోయాత్మనేనమః. 151

యస్యకేశేషుజీమూతా నద్యఃసర్వాంగసంధిషు | కుక్షౌసముద్రాశ్చత్వార స్తసై#్మతోయాత్మనేనమః. 152

సంభక్ష్యసర్వభూతాని యుగాంతేపర్యుపస్థితే | యఃశేతేజలమధ్యస్థస్తం ప్రపద్యే7బుశాయినమ్‌. 153

ప్రవిశ్యవదనంరాహో ర్యఃసోమంపిబతేనిశి | గ్రసత్యర్కంచస్వర్భానూ

రక్షితస్తవతేజసా. 154

యేచాత్రపతితాగర్భా రుద్రగంధస్యరక్షణ | నమస్తే7స్తుస్వధాస్వాహా ప్రాప్నువంతితదద్భుతే. 155

యే7గుష్ఠమాత్రాఃపురుషా దేహస్థాఃసర్వ దేహినామ్‌ |

రక్షంతుతేహిమాంనిత్యం తేమామాప్యాయయంతువై. 156

యేనదీషుసముద్రేషు పర్వతేషుగుహాసుచ | వృక్షమూలేషుగోష్ఠేషు

కాంతారగహనేషుచ. 157

చతుష్పథేషురథ్యాసు చత్వరేషుసభాసుచ | హస్త్యశ్వరథశాలాసు

జీర్ణోద్యానాలయేషుచ. 158

యేచనంచసుభూతేషు దిశాసువిదిశాసుచ | చంద్రార్క యోర్మధ్యగతా యేచచంద్రార్కరశ్మిషు. 159

రసాతలగతాయేచ యేచతస్మాత్పరంగతాః | సమస్తేభ్యోసమస్తేభ్యో నమస్తేభ్యశ్చనిత్యశః. 160

యేషాంనవిద్యతేసంఖ్యా ప్రమాణంరూపమేవచ | అసంఖ్యేయగణారుద్రా నమస్తేభ్యో7స్తునిత్యశః. 161

ప్రసీదమమభద్రంతే తవభావగతస్యచ | త్వయిమేహృదయందేవ త్వయిబుద్దిర్మతిస్త్వయి. 162

స్తుత్వైవంసమహాదేవం విరరామద్విజోత్తమః, 163

ఇతి శ్రీ వామనమహాపుదాణ సరోమాహాత్మ్యే షడ్వింశో7ధ్యాయః.

ప్రభూ ! నీవు హిరణ్యరేతస్కుడవపు ! ఏకైక పరమపురుషుడవు. నీవు స్త్రీవి, పురుషుడవు, నపుంసకుడవు, బాలుడవు, ముసలివాడవు, స్థవిరుడవు ఐరావత గజానివి. సర్వమాన్యుడవైన విశ్వకారకుడవు. నీకు నమస్సులు. సృష్టిచేయు విధాతలలో నీవు సర్వశ్రేష్ఠుడవు. శ్రద్ధాశువు లెల్ల వేళల నిన్నారాధిస్తారు. చంద్ర సూర్యులు నీ నేత్రాలు. నీవే అగ్నివి బ్రహ్మవు. సరస్వతీ రూపాన నిన్నారాధించి నరులు వాక్కుకు సంపాదింతురు. రాత్రంబవళ్ళు నీవే. నిమేషం (కన్నులుమూయుట) ఉన్మేషం (కండ్లు తెరచుట) నీవే. ఓ మంగళ స్వరూపాః నీ మహిమను యథార్థముగా తెలిసికొనుట బ్రహ్మ విష్ణువు ప్రాచీన మహర్షులకు గూడనలవి కాదు. వేలాది ప్రజల నావరించి నిబిడీకృతమైన ఘోరాంధకారాని కవ్వల వెలుగుచు నీవు వారందరనూ రక్షిస్తూ నడుపుతూ ఉంటావు. నిద్రా ప్రాణాలను నిరోధించి, జితేంద్రియులై సర్వగుణ ప్రధానులగు మహాత్ములు జ్యోతిస్సు రూపంలో దర్శించే యోగాత్మవు, పరమాత్మడవు నీవు, అట్టి నీకు నమస్కారము. నిర్దేశించుట కలవిగాని సూక్ష్మాతి సూక్ష్మాలయిన నీ అనంతమూర్తులలో, కన్నకొడును తండ్రివలె నీవు నన్ను రక్షింపుము. నే నీచే రక్షింపబడదగిన వాడను. అట్టినన్ను సదారక్షించుము. ఓ పాపరహితా నీకు నమస్సులు. భక్తుల కనికరించు భగవాన్‌ నే నెల్లవేలల నీకు దాసుడను. ఓ జటాధరా ! ముండీ ! దండధరా ! లంబోదర దేహా ః కమండలుధరా ! రుద్రరూపా నీకు నమస్కారము. నీ కేశాలలో మేఘాలున్నవి, సర్వాంగ సంధుల యందూ నదులున్నాయి, నీకుక్షి సర్వసముద్రాలకు నిలయం, అలా జలాత్మకుడవగు నీకు ప్రమామాంజలులు ! యుగాంతరవేళల్లో సకల జీవరాశినీ భక్షించి జలాల్లో విశ్రమించే జలశయానుడగు ప్రభువును శరణువేడుచున్నాను. ఆ ప్రుభువు రాహువు నోటిలో ప్రవేశించి రాత్రివేళల్లో సోమపానం చేస్తాడు. అనీ తేజస్సు రక్షా కవచం కాగా రాహువు సూర్యునే మ్రింగుచున్నాడు. రుద్రుని రక్షణలో యిచట గర్భపాతాలు జరుగుతున్నవి ! అద్భుతానికి స్వధా, స్వాహాగా మారుతున్నది. అంగుష్ఠమాత్ర పురుషాకృతిలో సకల శరీరాలలో నెలకొన్న ప్రభువు ప్రతి నిత్యము నన్ను రక్షించుగాక. ముందుకు నడుపుగాక ః నదులలో, సముద్రాల్లో, పర్వత గుహలలో, వృక్షమూలాలలో గోశాలల్లో , కీకారణ్యాలలో, చతుష్పథాలలో, రాజమార్గాలలో, సభాసదనాలలో, గజాశ్వరథశాలల్లో, శిథిలాలయాలలో, ఉద్యానవానాల్లో, పంచభూతాల్లో, దిగ్దిగంతరాలలో, చంద్ర సూర్యులలో, వారలకిరణ సమూహంలో, పాతాళ వాసులలో తదితరస్థానాల్లో సర్వత్రా ఆ విధంగా వ్యాపించియుండే ఆ ప్రుభువు మూర్తులకు అహరహం నమస్సులు, ప్రణామాలు, నతులు చేయుచున్నాను. లెక్కకు మిక్కుటమైన రూపాకృతులలో, అసంఖ్యాకంగా గణాల రూపంలో సర్వత్రా వ్యాపించి యున్న రుద్రులకు నమోవాక శతాంజలులు ! మీరందరు నా యెడ ప్రసన్నులుకండు. మీకు కళ్యాణమగుగాక. నేను మీ వడను. ఓ దేవదేవా ! నీవే నా హృదయం, నా బుద్ధి మతి సర్వస్వమూను. నీకు నమస్సులుః ఆ విధంగా మహాదేవుడైన శంకరుని స్తుతించి ఆ ఉత్తమ ద్విజుడు వినతుడయ్యెను.

ఇది శ్రీ వామన మహాపురాణం సరోమాహాత్మ్యంలో యిరువది యారవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters