Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువది నాలుగవ అధ్యాయము

సనత్కుమార ఉవాచ :

అథోవాచమహేదేవో దేవాన్‌ బ్రహ్మపురోగమాన్‌ | ఋషీణాంచైవప్రత్యక్షం తీర్థమాహాత్మ్యముత్తమమ్‌. 1

ఏతత్సాన్నిహితం ప్రోక్తం సరః పుణ్యతమంమహత్‌ | మయోపసేవితంయస్మా త్తస్మాన్ముక్తిప్రదాయకమ్‌. 2

ఇహయేపురుషాః కేచి ద్బ్రాహ్మణాః క్షత్రియావిశః | లింగస్య దర్శనాదేవ పశ్యంతిపరమంపదమ్‌. 3

అహస్యహనితీర్థాని అసముద్రసరాంసిచ | స్థాణుతీర్థంసమేష్యంతి మధ్యం ప్రాప్తేదివాకరే. 4

స్తోత్రేణానేనచనరో యోమాంస్తోష్యతిభక్తితః | తస్యాహంసులభోనిత్యం భవిష్యామి నసంశయః. 5

ఇత్యుక్త్వాభగవాన్‌ రుద్రో హ్యంతర్ధానంగతః ప్రభుః | దేవాశ్చఋషయస్పర్వే స్వానిస్థానానిభేజిరే. 6

తతోనిరంతరంస్వర్గం మానుషైర్మిశ్రితంకృతమ్‌ | స్థాణులింగస్య మహాత్మ్యం దర్శనాత్స్వర్గమాప్నుయాత్‌.

తతోదేవాఃసర్వఏవ బ్రహ్మాణంశరణంయయుః | తానువాచతదాబ్రహ్మా కిమర్థమిహచాగతాః. 8

తతోదేవాః సర్వఏవ ఇదంవచనమబ్రువన్‌ | మానుషేభ్యోభయంతీవ్రం రక్షాస్మాకం పితామహ. 9

తానువాచతదాబ్రహ్మా సురాంస్త్రీదశనాయకః | పాంశునాపుర్యతాంశీఘ్రం సరఃశ##క్రేహితంకురు. 10

తతోవవర్షభగవాన్‌ పాంశునాపాకశాసవః | సప్తాహంపూరయామాన సరోదేవైస్తదావృతః. 11

తందృష్ట్వాపాంశువర్షంచ దేవదేవోమహేశ్వరః | కరేణధారయామాస లింగతీర్థవటం తదా. 12

సనత్కుమారుడు చెప్పనారంభించెను: అంతట దేవాధిదేవుడైన శంకరుడు ఋషుల సమక్షంలో బ్రహ్మ పురోగాములైన దేవతలతో ఆ ఉత్తమ తీర్థ మహిమ వివరించాడు. ఈ సాన్నిహిత సరస్సు సకల తీర్థాలలో ఉత్తమోత్తమమైనది. ఇది నాకు నివాసం కావడం వల్ల ముక్తి ప్రదాయకమైనది. ఇక్కడి నా లింగ దర్శనం చేసినంత మాత్రాన్నే బ్రహ్మ, క్షత్రియ, వైశ్యాదు లందరకు పరమపదం లభిస్తుంది. మధ్యాహ్న సమయాన, ప్రతిరోజూ, సముద్ర నదీ సరోవరాల సమస్త తీర్థాలు యిక్కడ ఈ స్థాణుతీర్థంలో చేరికలుస్తాయి. ఈ స్తోత్రం ఎవరు శ్రద్దాభక్తులతో యిక్కడ చదివు నన్ను ప్రసన్నుణ్ణి చేసుకుంటారో వారలకు నేనెల్లప్పుడు అందుబాటులో ఉంటాను. సందేహం లేదు. ఆ విధంగా సెలవిచ్చి భగవానుడగు రుద్రుడంతర్థాన మొందాడు. దేవతలందా తమతమ నెలవులకు వెళ్ళారు. ఆ స్థాణు లింగమహిమ వల్ల ఆ లింగ దర్శనం చేసిన మానవులందరకూ స్వర్గప్రాప్తి కలిగి స్వర్గలోకం మనుష్యులతో నిండిపోయింది. దానితో భయమునందిన దేవతలు ఆ మానవుల ఉపద్రవాన్నుంచి తమ్ము రక్షింపమని బ్రహ్మకడకు పోయి మొరబెట్టుకున్నారు. ఆ త్రిదశాధిపతి అయిన బ్రహ్మ, అలాగైతే ఆలస్యము చేయక వెంటనే సరోవరాన్ని మట్టితోపూడ్చి యింద్రునకూరట కలిగించండని దేవతలతో చెప్పాడు. అంతయింద్రుడు వారం రోజులపాటు, ధూళివర్షం కురిపించి ఆ సరస్సును పూడ్చినాడు. అది చూచి మహేశ్వరుడా లింగాన్ని వటవృక్షాన్ని చేతితో ఎత్తి పట్టుకున్నాడు.

తస్మత్‌ పుణ్యతమంతీర్ధం మాన్యం యత్రోదకంస్థితమ్‌ | తస్మిన్‌ స్నాతః సర్వతీర్థైః స్నాతోభవతిమానవః.

యస్తత్రకురుతేశ్రాద్ధం వటలింగస్య చాంతరే | తస్యప్రీతస్యపితరో దాస్యంతి భువిదుర్లభమ్‌. 14

పూరితంచతతోదృష్ట్వా ఋషయఃసర్వఏవతే | పాంశునాసర్వగాత్రాణి స్పృశంతి శ్రద్ధయాయుతాః. 15

తే7పినిర్దూతపాపాస్తే పాంశునామున యోగతాః | పూజ్యమానాః సురగణౖః ప్రయతాబ్రహ్మణః పదమ్‌. 16

యేతుసిద్దామహాత్మాన స్తేలింగపూజయంతిచ | వ్రజంతి పరమాంసిద్ధిం పునరావృత్తిదుర్లభామ్‌. 17

ఏవంజ్ఞాత్వాతదాబ్రహ్మా లింగంశైలమయంతదా | ఆద్యంలింగం తదాస్థాప్య తస్యోపరిదధారతత్‌. 18

తతఃకాలేనమహతా తేజసాయస్యరంజితమ్‌ | తస్యాతిస్పర్శనాత్సిద్ధః పరంపదమవాప్నుయాత్‌. 19

తతోదేవైఃపునర్బ్రహ్మా విజ్ఞప్తోద్విజసత్తమ | ఏతేయాంతిపరాంసిద్ధిం లింగస్యదర్శనాన్నరాః. 20

తచ్ఛ్రుత్వాభగవాన్‌ బ్రహ్మా దేవానాంహితకామ్యయా | ఉసర్యుపరిలింగాని సప్తతత్రచకారహ. 21

తతోయేముక్తికామాశ్చ సిద్ధాఃశమపరాయణాః | సేవ్యపాంశుప్రయత్నేన ప్రయాతాః పరమం పదమ్‌. 22

పాంశవో7పికురుక్షేత్రే వాయునాసముదీరితాః | మహాదుష్కృతకర్మాణం ప్రయాంతిపరమంపదమ్‌. 23

ఆజ్ఞానాజ్‌ జ్ఞానతోవాపి స్త్రియోవాపురుషస్యవా | నశ్యతేదుష్కృతంసర్వం స్థాణుతీర్థప్రభావతః. 24

లింగస్యదర్శనాన్ముక్తిఃస్పర్శనాచ్చవటస్యచ | తత్సన్నిధౌజలేస్నాత్వా ప్రాప్నోత్యభిమతంఫలమ్‌. 25

పితౄణాం తర్పణంయస్తు జలేతస్మిన్‌ కరిష్యతి | బిందౌ బిందౌ తుతోయస్య అనంతఫలభాగ్భవేత్‌. 26

యస్తుకృష్ణ తిలైస్సార్థం లింగస్యపశ్ఛిమేస్థితః | తర్పయే చ్ఛ్రద్దయాయుక్తః సప్రీణాతియుగత్రయమ్‌. 27

యావన్మన్వంతరంప్రోక్తం యావల్లింగస్యసంస్థితిః | తావత్ర్పీతాశ్చపితరః పిబంతిజలముత్తమమ్‌ 28

కృతయుగేసాన్నిహిత్యం త్రేతాయాంవాయుసంజ్ఞితమ్‌ |

కలిద్వాపరయోర్మధ్యే కూపంరుద్రహ్రదంస్మృతమ్‌. 29

చైత్రస్యకృష్ణవక్షేచ చతుర్దశ్యాంనరోత్తమః | స్నాత్వారుద్రహ్రదేతీర్థం పరమం పదమవాప్నుయాత్‌. 30

యస్తువటేస్థితోరాత్రిం ధ్యాయతేపరమేశ్వరమ్‌ | స్థాణోర్వటప్రసాదేన మనసాచింతితంఫలమ్‌. 31

ఇతి శ్రీ వామనమహాపురాణ సరోమాహాత్మ్యే చతుర్వింశో7ధ్యాయః.

అందుచేత ఆద్యతీర్థంలోని నీరు పుణ్యతమైనది. అచట స్నానం చేస్తే సర్వతీర్థస్నానఫలంలభిస్తుంది. ఆవట లింగేశ్వర సమీపంలో శ్రాద్ధం చేసినవాని పితరులు సంతోషించి దుర్లభ##మైన ఫలం యిస్తారు. పూడిపోయిన సరోవరాన్ని చూచి ఋషులక్కడి ధూళిని శ్రద్ధాభక్తులతో తమ శరీరాలకు పూసుకునేనవారు. అందువల్ల ఆమునులు కూడా పాపముక్తులై దేవతలకు సైతం పూజ్యులై బ్రహ్మపదానికి వెళ్తారు. సిద్ధమహాత్ములెవరైననూ ఆలింగాన్ని పూజించినచో పరమసిద్ధిని పొంది పునరావృత్తిరహితలోకానికి వెళ్తారు. ఈ విషయం గ్రహించినంతనే బ్రహ్మ అచట ఆద్య లింగాన్ని ప్రతిష్ఠించి దానిమీద శిలాలింగాన్ని పెట్టాడు. తర్వాత చాలా కాలానికి ఆద్యలింగ ప్రభావ స్పర్శతో శిలాలింగం కూడ తనను ముట్టుకున్న వారలకు పరమ పదప్రాప్తి కలిగించింది. ఓ విప్రోత్తమలారా! శైలలింగ స్పర్శమాత్రాన్నే మానవులు పరమపదం పొందడంచూచి దేవతలు బ్రహ్మతో ఆ విషయం చెప్పుకున్నారు. అది విని విరించి దేవతలకు మేలు చేయుటకై ఆ శిలాలింగం మీద ఒక దానిపై నొకటిగా ఏడు లింగాలు స్థాపించాడు. అప్పుటినుంచి శమదమపరాయణులయిన ముముక్షువులు అక్కడి ధూళిసేవనం వల్లనే పరమ పదాన్ని పొందుతున్నారు. కురుక్షేత్రంలోగాలిలో ఎగిరే ధూళి కణాలుకూడ తమస్పర్శతో మహాపాపులను గూడ పవిత్రులను పరమ పదసంపాదకులను చేయ జాలియున్నవి. ఆ స్థాణుతీర్థంలో ప్రవేశించిన స్త్రీ పురుషాదులకు, వారు తెలిసి ప్రవేశించినా తెలియక ప్రవేశించినా సరే, సర్వ దుష్కృతనాశం కలుగుతుంది. లింగదర్శనంవల్ల వటవృక్షస్పర్శవల్ల ముక్తికలుగుతుంది. అచట సన్నిధి జలాల్లో స్నానమాడిన వారి కోరికలు సిద్ధిస్తాయి. అక్కడ పితృదేవతలకు వదలెడి తర్పణోదకాల బిందుబిందువూ అనంత ఫలంయిస్తుంది. లింగానికి పడమర భాగాన నల్ల నువ్వులతో శ్రద్ధాతర్పణాలుయిచ్చిన వారు మూడుయుగాల పర్యంతం సుఖిస్తారు. మన్వంతర కాలంవరకూ లింగం అక్కడ నిలచియున్నంతకాలం అలాంటి వారల పితరులు ఉత్తమోదకాలు పానం చేస్తుంటారు. కృతయుగంలో దానికి సాంనిహిత్య తీర్థమనీ, త్రేతాయుగంలో వాయు తీర్థమనీ ద్వాపర కలియుగాలమధ్య రుద్రహ్రదమనీ పేర్లు. చేత్రకృష్ణ చతుర్దశినాడు రుద్రహ్రదంలో స్నానం చేసినవారలకు పరమపద ప్రాప్తి కలుగుతుంది. అచటి వటమూలాన కూర్చుని పరమ శివుని ధ్యానించిన వారల కా స్థాణువటమహిమ వల్ల చింతమనోరథాలు నెరవేరుతాయి.

ఇతి శ్రీ వామన మహా పురాణం సరోవర మహాత్మ్యంలో యిరువది నాల్గవ అధ్యాయము.

Sri Vamana Mahapuranam    Chapters