Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువదిమూడవ అధ్యాయము

సనత్కుమార ఉవాచ :

బ్రహ్మణోవచనం శ్రుత్వా ఋషయః సర్వఏవతే | పునరేవచపప్రచ్ఛు ర్జగతః శ్రేయకారణమ్‌. 1

బ్రహ్మోవాచ :

గచ్ఛానుః శరణం దేవం శూలపాణింత్రిలోచనమ్‌ | ప్రసాదాద్దేవదేవస్య భవిష్యథయథాపురా. 2

ఇత్యుక్తాబ్రహ్మణాసార్థం కైలాసంగిరిముత్తమమ్‌ | దదృశుస్తేసమాసీన ముమయాసహితంహరమ్‌. 3

తాతఃస్తోతుంసమారబ్ధో బ్రహ్మాలోకపితామహః | దేవాధిదేవంవరదం త్రైలోక్యస్యప్రభుంశివమ్‌. 4

బ్రహ్మోవాచ:

అనంతాయనమస్తుభ్యం వరదాయపినాకినే | మహాదేవాయ దేవాయ స్థాణువేపరమాత్మనే. 5

నమో7స్తుభువనేశాయ తుభ్యంతారకసర్వదా | జ్ఞానానాందాయకోదేవ స్త్వమేకఃపురుషోత్తమః. 6

నమస్తేపద్మగర్భాయ పద్మేశాయనమోనమః | ఘోరశాంతిస్వరూపాయ చండక్రోధనమో7స్తుతే. 7

నమస్తేదేవవిశ్వేశ నమస్తేసురనాయక | శూలపాణనమస్తే7స్తు నమస్తేవిశ్వభావన. 8

ఏవంస్తుతోమహాదేవో బ్రహ్మణాఋషిభిస్తదా | ఉవాచమాభైర్వ్రజతలింగంవోభవితాపునః. 9

క్రియతాంమద్వచఃశీఘ్రం యేనమేప్రీతిరుత్తమా | భవిష్యతి ప్రతిష్ఠాయాం లింగస్యాత్రనసంశయః. 10

యేలింగంపూజయిష్యంతి మామకంభక్తిమాశ్రితాః | నతేషాందుర్లభంకించి ద్భవిష్యతికదాచన. 11

సర్వేషామేవపాపానాం కృతానామపిజానతా | శుద్ద్యతేలింగపూజాయాం నాత్రకార్యావిచారణా. 12

యుష్మాభిఃపాతితంలింగం సారయిత్వామహత్సరః|

సంనిహిత్యంతువిఖ్యాతం తస్మిన్‌ శ్రీఘ్రం ప్రతిష్ఠితమ్‌. 13

యథాభిలషితంకామంతతఃప్రాప్యథబ్రాహ్మణాః | స్థాణుర్నామ్నాహిలోకేషు పూజనీయోదివౌకసామ్‌. 14

సనత్కుమార వచనం : అలా బ్రహ్మపలికిన మాటలువిని ఋషులందరు యిప్పుడు జగత్తునకు శ్రేయస్సు ఎలా కలుగుతుందని మరల ప్రశ్నించారు. అందరు విరించి యిలా అన్నాడు. మనమందరంవెళ్లి ఆ దయామయుడు త్రిలోచనుడు శూలపాణి శరణుకోరుదము. ఆయన అనుగ్రహంవల్ల యథాపూర్వస్థితి ఏర్పడుతుంది. అంతట బ్రహ్మతో కలిసి ఆ మునులందరు కైలాసానికి వెళ్ళి ఉమాసహితుడైన శంకరుని దర్శించారు. అప్పుడు లోకపితామహుడగు బ్రహ్మ వరదాయకుడు దేవాది దేవుడునైన ముల్లోకేశ్వరుడు శివుని యిలా స్తోత్రం చేశాడు.

ఓ అనంతా నీకు నమస్కారం ! పినాకధారీ వరదా, మహాదేవా, స్థాణూ ! పరమాత్మా నీకు ప్రణామాలు ! భువనేశా ! తారకా ! సకలజ్ఞానప్రదాయకా ! నీకు నమస్సులు ! దేవా ! నీవొక్కడవే పురుషోత్తముడవు. పద్మగర్భా ! పద్మేశా ! నీకు ప్రణామములు. ఘోరరూపా, శాంతిరూపా, చండకోపనా ! విశ్వేశా ! నీకు నమస్కారములు. సురనాయకా! శూలపాణీః విశ్వభావనా ! ప్రభూ ! నీ కనేక ప్రణామాలు !

బ్రహ్మ ఋషులుచేసిన స్తోత్రంవిని మహాదేవుడిలా అన్నాడు. భయపడకండి, వెళ్ళండి, లింగం పునఃప్రతిష్ఠిత మౌతుంది. నాకు ప్రీతికరంగా నేను చెప్పినట్లు చేయండి. నిస్సందేహంగా లింగప్రతిష్ఠజరుగుతుంది. నాలింగాన్ని ఎవరు భక్తితో పూజిస్తారో వారలకు అసాధ్యమంటూ ఉండదు. పాపాలు తెలిసిచేసినప్పుటికీ, ఎలాంటివైనా లింగార్చన చేసినంతటనే పటాపంచలౌతాయి. సందేహింపకుడు. మీరలు పడగొట్టిన లింగాన్ని వెంటనే తీసుకవెళ్ళి సాన్నిహిత్యమనే మహత్సరోవరంలో ప్రతిష్ఠించండి. అందువల్ల మీ మనోవాంఛితాలన్నీ నెరవేరతాయి. స్థాణువనే పేర దానిని దేవతలంతా పూజిస్తారు.

స్థాణ్వీశ్వరేస్థితోయస్మాత్‌ స్థాణ్వీశ్వరస్తతః స్మృతః | యేస్మరంతిసదాస్థాణుం తేముక్తాః సర్వకిల్బిషైః . 15

భవిష్యంతి శుద్ధదేహా దర్శనాన్మోక్షగామినః | ఇత్యేవముక్తాదేవేన ఋషయో బ్రహ్మణానహ. 16

తస్మాద్ధారువనాల్లింగం నేతుంసముపచక్రముః | నతంచాలయితుంశక్తా స్తేదేవాఋషిభిఃసహ. 17

శ్రమేణమహతాయుక్తా బ్రహ్మాణంశరణం యయుః | తేషాంశ్రమాభితప్తానా మిదం బ్రహ్మా7 బ్రవీద్వచః. 18

కింవాశ్రమేణమహతా నయూయంవహనక్షమాః | స్వేచ్ఛయాపాతితంలింగం దేవదేవేనశూలినా. 19

తస్మాత్తమేవశరణం యాస్యామః సహితాః సురాః | ప్రసన్నశ్చమహాదేవః స్వయమేవనయిష్యతి. 20

ఇత్యేవముక్తాఋషయో దేవాశ్చబ్రహ్మణాసహ | కైలాసంగిరిమాసేదూ రుద్రదర్శనకాంక్షిణః. 21

నచపశ్యంతితందేవం తతశ్చింతాసమన్వితాః | బ్రహ్మాణమూచుర్మునయః క్వసదేవోమహేశ్వరః. 22

తతోబ్రహ్మాచిరంధ్యాత్వా జ్ఞాత్వాదేవం మహేశ్వరమ్‌ | హస్తిరూపేణతిష్ఠంతం మునిభిర్మానసైఃస్తుతమ్‌. 23

అథతేఋషయస్సర్వే దేవాశ్చబ్రహ్మణాసహ | గతామహత్సరః పుణ్యం యత్రదేవః స్వయంస్థితః. 24

నచవశ్యంతితందేవం అన్విష్యంతస్తతస్తతః | తతశ్చింతాన్వితాదేవా బ్రహ్మణానహితాఃస్థితాః. 25

పశ్యంతిదేవీం సుప్రీతాం కమండలువిభూషితామ్‌ | ప్రీయమాణాతదాదేవీ ఇదంవచనమబ్రవీత్‌. 26

శ్రమేణమహతాయుక్తా అన్విష్యంతోమహేశ్వరమ్‌ | పీయతామమృతందేవా స్తతోజ్ఞాస్యథశంకరమ్‌.

ఏతచ్ఛ్రుత్వాతువచనం భవాన్యాసముదాహృతమ్‌. 27

సుఖోపవిష్టాస్తేదేవాః పపుస్తదమృతంశుచి | అనంతరంసుఖాసీనాః పప్రచ్ఛుఃపరమేశ్వరీమ్‌. 28

క్వసదేవఇహాయాతో హస్తిరూపధరఃస్థితః | దర్శితశ్చతదాదేవ్యా సరోమధ్యేవ్యవస్థితః. 29

దృష్ట్వాదేవంహర్షయుక్తాః సర్వేదేవాః సహర్షిభిః | బ్రహ్మాణమగ్రతఃకృత్వా ఇదంవచనమబ్రవీత్‌. 30

స్థాణ్వీశ్వరంలో ఉన్నందున నన్నచట స్థాణ్వీశ్వరుడని పిలుస్తారు. స్థాణువును సదా స్మరిస్తే సర్వకిల్బిషాలసు తొలగిపోతాయి. ఆ దేవుని దర్శనమాత్రాననే పరిశుద్ధ దేహులై మోక్షగాములౌతారు. పరమేశ్వరుని మాటలువిని బ్రహ్మాది దేవతలతోకూడి ఆ ఋషులు దారువనం నుంచి లింగాన్ని కదలించి తీసికొని వెళ్ళుటకుపక్రమించారు. అయితే వారందరూ కలిసి ప్రయత్నించినా ఆ లింగాన్ని కదలించలేకపోయారు. ఇక దారిఏమని బ్రహ్మనుప్రశ్నిచగా ఆయన మీరెంతగా శ్రమించినా దేవదేవుని ఇచ్ఛానుసారం భూపతితమైన లింగాన్ని తీసి కొనపోలేరు. కనుక ఆయననేమరల శరణువేడితే ఆయనే దయతో దానిని తీసికొనిరాగడు. అంతఅందరూ మరలకైలాసానికి వెళ్ళారు. అయితే అక్కడ వారలకు రుద్రుడగుపించలేదు. అప్పుడు బ్రహ్మధ్యానస్థుడై ఆలోచించగా శంకరుడు ఏనుగురూపంలో, ఆయననుస్తోత్రంచేస్తున్న ఆ దేవతలు, ఋషుల మనస్సులలోనే ఉన్నట్టు కనుగొన్నాడు. అంతట బ్రహ్మను ముందుంచుకొని ఆ దేవతలు ఋషులంతా, ఆ దేవుడు స్వయంగా విరాజిల్లే ఆ మహత్సరోవరానికి వెళ్ళారు. అక్కడకూడ ఆ శివుని కాక వారంతా అన్వేషణసాగించారు. చింతాకులమైన హృదయాలతో ఉండిపోయారు. అప్పుడచట పార్వతీదేవి కమండలధారిణియై ప్రసన్నవదనంతో కనిపించగా ఆమె నందరు స్తోత్రం చేశారు. ప్రీతురాలైన ఆ ఉమామహేశ్వరుని వెదకివెదకి బాగా అలసిపోయారు. కాబట్టి మీరంతా ముందీ అమృతాన్ని త్రాగండి. అనంతరం శంకరుని జాడతెలిసికోగలరు. అన్నది. ఆ భవాని మాటలకు సంతుష్టులై వారందరచటకూర్చొని ఆ పవిత్రమైన అమృతపానం చేశారు. అనంతరం సుఖాసీనులై వారామెను హస్తిరూపంలో అచ్చటికి వచ్చిన ఈశ్వరుడెచటనున్నాడని అడిగారు. అప్పుడామె ఆ సరోవర మధ్యంలో హస్తిరూపాన ఉన్న శివుని చూపించింది. నీటిలో మునిగి యున్న నామహాదేవుని చూచి బ్రహ్మను ముందుంచుమని ఆ దేవర్షులిలా అన్నారు.

త్వయాత్యక్తంమహదేవ లింగంత్రైలోక్యవందితమ్‌ | తస్యచానయనేనాన్యః సమర్థఃస్మాన్యహేశ్వర. 31

ఇత్యేవముక్తోభగవాన్‌ దేవోబ్రహ్మాదిభిర్హరః | జగామఋషిభిఃసార్దం దేవదారువనాశ్రమమ్‌. 32

తత్రగత్వామహాదేవో హస్తిరూపధరోహరః | కరేణజగ్రాహతతో లీలయాపరమేశ్వరః. 33

తమాదాయమహాదేవః స్తూయమానోమహర్షిభిః | నివేశయామాసతదా సరఃపార్శ్వేతుపశ్చిమే. 34

తతోదేవాఃసర్వఏవ ఋషయశ్చతపోధనాః | ఆత్మానంసఫలందృష్ట్వా స్తవంచక్రుర్మ హేశ్వరే. 35

నమస్తేపరమాత్మన్‌ అనంతయోనే లోకసాక్షిన్‌ పరమేష్ఠిన్‌ భగవన్‌ సర్వజ్ఞ క్షేత్రజ్ఞ పరావరజ్ఞ

జ్ఞానజ్ఞేయ సర్వేశ్వర మహావిరించ మహావిభూతే మహాక్షేత్రజ్ఞ మహాపురుష సర్వభూతావాన

మనోనివాస ఆదిదేవ మహాదేవ సదాశివ.

ఈశాన దుర్విజ్ఞేయ దురారాద్య మహాభూతేశ్వర పరమేశ్వర మహాయోగేశ్వర త్ర్యంబక మహాయోగిన్‌

పరబ్రహ్మన్‌ పరమజ్యోతిః బ్రహ్మవిదుత్తమ ఓంకార వషట్కార స్వాహాకార స్వధాకార పరమకారణ

సర్వగత సర్వదర్శిన్‌ సర్వశ##క్తే అజ

సహస్రార్చిః పృషార్చిః సుధామన్‌ హరధామ అనంతధామ|

సంవర్త సంకర్షణ బడవానల అగ్నీ షోమాత్మక |

పవిత్ర మహాపవిత్ర మహామేఘ మహామాయాధర మహాకామ

కామహన్‌ హంస పరమహంస మహారాజిక మహేశ్వర

మహాకాముక మహాహంస భవక్షయకర సురసిద్దార్చిత 15

హిరణ్యవాహ హిరణ్యరేతః హిరణ్యనాభ హిరణ్యాగ్రకేశ |

ముంజకేశిన్‌ సర్వలోకవరప్రద సర్వానుగ్రహకర

కమలేశయ కుశేశయ హృదయేశయ జ్ఞానోదధే శంభో

విభో మహాయజ్ఞ మహాయాజ్ఞిక సర్వయజ్ఞమయ

సర్వయజ్ఞ హృదయ సర్వయజ్ఞసంస్తుత నిరాశ్రయ.

సముద్రేశయ అత్రినంభవ భక్తానుకంపిన్‌ అభగ్నయోగ యోగధర వాసుకిమహామణి

విద్యోతితవిగ్రహ హరితనయన త్రిలోచనజటాధర నీలకంఠ చంద్రార్థధర ఉమాశరీరార్దహర.

గజచర్మధర దుస్తరసంసారమహాసంహారకర ప్రసీదభక్తజనవత్సల 25

ఏవం స్తుతో దేవగణౖ | సుభక్త్యా సబ్రహ్మముఖైశ్చ పితామహేన |

త్యక్త్వా తదా హస్తిరూపం మహాత్మా లింగే తదా సంవిధానం చకార. 60

ఇతి శ్రీవామనమహా పురాణ సరోమాహాత్మ్యే త్రయోవింశో7ధ్యాయః.

మహాదేవా ! నీవు వదలిన త్రిలోకవందనీయమైన లింగాన్ని యితరులెవ్వరూకొని తెచ్చుటకు సమర్థుల కాకున్నారు. బ్రహ్మాదుల నివేదనము విని ఈశ్వరుడు వారందరను వెంటబెట్టుకొని దేవదారువనాశ్రమానికి వెళ్ళి ఏనుగురూపంతో లింగాన్ని తొండంతో అలవోకగా పట్టుకొనితెచ్చి మహర్షుల స్తోత్రపాఠాలమధ్య నామహాసరస్సుకు పశ్చిమదిక్కున నిలిపాడు. అంతనా దేవతలు ఋషులందా తమ జన్మలు ధన్యమైనవని సంతోషించి ఆ పరమశివుని యిలా స్తోత్రం చేశారు.

పరమాత్మా అనంతయోనీ లోకసాక్షీ పరమేష్ఠీ భగవాన్‌ సర్వజ్ఞా క్షేత్రజ్ఞా నీకు నమస్కారము.

పరావరజ్ఞా జ్ఞానజ్ఞేయా సర్వేశ్వరా మహావిరించీ

మహావిభూతీ మహాక్షేత్రజ్ఞా మహాపురుషా సర్వభూతావాసా

మనోనివాసా ఆదిదేవా సదాశివా మహాదేవా నీకుప్రణామము. 5

ఈశానా దుర్విజ్ఞేయా దురూరాధ్యా మహాభూతేశ్వరా

పరమేశ్వరా మహాయోగేశ్వరా త్రినేత్రా మహాయోగీ

పరబ్రహ్మా పరమజ్యోతీ బ్రహ్మవేత్తలలో ఉత్తముడా ప్రణవస్వరూపా

వషట్కారస్వాహాకారస్వధాకారరూపా పరమకారణా

సర్వగతా సర్వదర్శీ సర్వశక్తిరూపా సర్వదేవా ఆభవా 10

సహస్రార్చీ అనేకకిరణా సుధామా హరధామా అనంతధామా

మేఘస్వరూపా సంకర్షణా బడవానలా అగ్నిచంద్రమయా నీకునమస్సులు.

పవిత్రుడా మహాపవిత్రుడా మహామేఘుడా మహామాయాధారీ

మహాకామా కామాంతకా హంసా పరమహంసా పరమాధీశ్వరా

మహేశ్వరా మహాకాముకుడా మహాహంసా భవనాశకా సురసిద్ధార్చితా 15

హిరణ్యవాహా సువర్ణవీర్యా సువర్ణ నాభా హిరణ్యకేశా ముంజకేశా

సర్వలోకవరప్రదా సర్వానుగ్రహకరా కమలశయనా దర్భశయమా

హృదయనివాసా జ్ఞానసింధూ శంభూ విభూ

మహాయజ్ఞా మహాయాజ్ఞీకుడా సర్వయజ్ఞమయుడా

సర్వయజ్ఞప్రియా సర్వయజ్ఞసంస్తుతా నిరాశ్రయా 20

సముద్రశయనా అత్రిపుత్రా భక్తులయెడదయగలవాడా

అభగ్నయోగా యోగధరా వాసుకిమహామణికాంతులతో

వెలిగేవాడా హరితనేత్రుడా ముక్కంటీ జటాధరా నీకునమస్సులు.

నీలకంఠా చంద్రమౌళీ అర్దనారీశ్వరా కృత్తివాసా

దుస్తరమైన సంసారాన్ని హరించేవాడా భక్తవత్సలా మమ్మనుగ్రహింపుము.

నీకు వేలాది ప్రణామములు. ఆ విధంగా బ్రహ్మపురోగాములయిన దేవతలు వాలఖిత్యాది ఋషులు భక్తి ప్రపత్తులతో చేసిన స్తోత్రానికి సంతోషించి ఆ మహాదేవుడా ఏనుగురూపాన్ని వదలి ఆ లింగమధ్యంలో సన్నిహితుడైనాడు.

ఇది శ్రీవామనమహాపురాణం సరోమాహాత్మ్యంలో యిరువది మూడవ అధ్యాయము.

Sri Vamana Mahapuranam    Chapters