Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువది ఒకటవ అధ్యాయము

ఋషయఊచుః :

కామ్యకస్యతుపూర్వేణ కుంజందేవైర్ని షేవితమ్‌ | తస్యతీర్థస్యసంభూతిం విస్తరేణ బ్రవీహినః| 1

లోమహర్షణ ఉవాచ :

శృణ్వంతుమునయస్సర్వే తీర్థమహాత్మ్యముత్తమమ్‌ | ఋషీణాంచరితంశ్రుత్వా ముక్తోభవతికిల్బిషైః. 2

నైమిషేయాశ్చఋషయః కురుక్షేత్రేసమాగతాః | సరస్వత్యాస్తుస్నానార్థం ప్రవేశం తేనలేభిరే. 3

తతస్తేకల్పయామాసు స్తీర్థం యజ్ఞోపవీతికమ్‌ | శేషాస్తుమునయస్తత్ర నప్రవేశం హి లేభిరే. 4

రంతుకస్యాశ్రమాత్తావద్‌ యావత్తీర్థం సచక్రకమ్‌ | బ్రాహ్మణౖః పరిపూర్ణం తద్దృష్ట్వా దేవీసరస్వతీ. 5

హితార్థంసర్వవిప్రాణాం కృత్వా కుంజానిసానదీ | ప్రయాతాపశ్చిమంమార్గం సర్వభూతహితే స్థితా. 6

పూర్వప్రవాహేయఃస్నాతి గంగాస్నానఫలం లభేత్‌| ప్రవాహేదక్షిణతస్యా నర్మదాసరితాం వరా. 7

పశ్చిమేతుదిశాభాగే యమునా సంశ్రితానదీ | యదాఉత్తరతోయాతి సింధుర్భవతి

సానదీ. 8

ఏవం దిశాప్రవాహేణ యాతి పుణ్యాసరస్వతీ | తస్యాంస్నాతః సర్వతీర్థేస్నాతోభవతిమానవః. 9

తతోగచ్ఛేద్ద్విజ శ్రేష్ఠామదనస్యమహాత్మనః | తీర్థంత్రైలోక్యవిఖ్యాతం విహారంనామ నామతః. 10

యత్రదేవాఃసమాగమ్య శివదర్శసకాంక్షిణః | సమాగతానచాపశ్యన్‌ దేవందేవ్యాసమన్వితమ్‌. 11

తేస్తువంతోమహాదేవం నందినం గణనాయకమ్‌ | తతః ప్రసన్నోనందీశః కథయామాస చేష్టితమ్‌. 12

భవస్యఉమయాసార్థం విహారేక్రీడితంమహత్‌ | తచ్ఛ్రుత్వాదేవతా స్తత్రపత్నీ రాహూయక్రీడితాః. 13

తేషాంక్రీడావినోదేన తుష్టఃప్రోవాచశంకరః |యో7స్మింస్తీర్థేనరఃస్నాతి విహారేశ్రద్ధయాన్వితః. 14

ఋషులిలా అన్నారు. కామ్యకవనానికి తూర్పున దేవతలచే సేవింపబడేలాతాగృహంఉంది. ఆ కుంజతీర్థం పుట్టుక వివరాలు తెలియజేయండి. అందుకు లోమహర్షుణుడిలా చెప్పసాగాడు. మునులారా ! ఉత్తమైన ఆ తీర్థమహిమనూ ఋషుల దివ్యగాథనూ వినండి. అందువలన పాపముక్తికలుగుతుంది. ఒక పర్యాయం సరస్వతీనదీ స్నానార్థం నైమిషారణ్య వాసులైన ఋషులు కురుక్షేత్రానికి వెళ్ళారు. కాని వారికక్కడ ప్రవేశం దొరకలేదు. అంతటనాఋషులు యజ్ఞోపవీతికమనే తీర్థాన్ని నెలకొల్పారు. మిగిలిన ఋషులకుగూడా అందులోకి ప్రవేశందొరకలేదు. రంతుకాశ్రమం నుంచి చక్రతీర్థం పర్యంతంగల ప్రదేశమంతా బ్రాహ్మణులతోనిండియుండుటచూచి ఆ సరస్వతీనది ఆ మునుల వసతికొరకై ఎన్నోలతాగృహాలునిర్మించి సర్వప్రాణుల కల్యాణార్థమై పశ్చిమాభిముఖంగా ప్రవహించసాగింది. తూర్పుప్రవాహంలో స్నానంచేస్తే గంగాస్నాన ఫలం కలుగుతుంది. దక్షిణదిక్కున పవిత్ర నర్మదాస్నానఫలం లభిస్తుంది. పడమరదిశలో యమునానదిగాను, ఉత్తర దిక్కున సింధునదిగాను ఆనది రూపొందుతుంది. యిలా ఆ పుణ్యాపగ నలుదిశలలో ప్రవహిస్తుంది. అట్టిసరస్వతిలో మునిగిన వానికి సర్వతీర్థ స్నానఫలం లభిస్తుంది. అటనుండి విహారమనే పేరుతో త్రిలోకఖ్యాతి వహించిన మహాత్ముడగు మదనుని తీర్థానికి వెళ్ళాలి. అచట శివదర్శనార్థం దేవతలందరూ గుమిగూడగా వారలకు శివపార్వుతుల దర్శనంకాలేదు. అంతట అందరూ కలిసి మహాదేవుని నందీశ్వర గణశ్వరులను స్తుతించారు. అంతట సంతోషించి నంది, శివుడు ఉమాదేవితో విహార తీర్థంలో విహరిస్తున్నాడని చెప్పాడు. అదివిని దేవతలుగూడ తమతమ భార్యలను పిలిపించి వారలతోకలిసి విహరించారు. వారలక్రీడలకు సంతోషించి ఈ విహారతీర్థంలో స్నానంచేసిన వారలు ధనధాన్యప్రియురాండ్రతో సుఖిస్తారని ఈశ్వరుడు వరమిచ్చాడు.

ధనధాన్యప్రియైర్యుక్తో భవతేనాత్రసంశయః | దుర్గాతీర్థంతతోగచ్ఛే ద్దుర్గయా సేవితంమహత్‌. 15

యత్రస్నాత్వాపితౄన్‌ పూజ్యనదుర్గతిమవాప్నుయాత్‌ | తత్రపిచ సరస్వత్యాః కూపంత్రైలోక్యవిశ్రుతమ్‌. 16

దర్శనాన్ముక్తిమాప్నోతి సర్వపాతకవర్జితః | యస్తత్రతర్పయేద్దేవాన్‌ పితౄంశ్చశ్రద్దయాన్వితః. 17

అక్షయ్యంలభ##తేసర్వం పితృతీర్థంవిశిష్యతై | మాతృహాపితృహాయశ్చ బ్రహ్మహాగురుతల్పగః. 18

స్నాత్వాశుద్దిమవాప్నోతి యత్రప్రాచీసరస్వతీ | దేవమార్గప్రవిష్టాచ

దేవమార్గేణనిఃసృతా. 19

ప్రాచీసరస్వతీపుణ్యా అపిదుష్కృతకర్మణామ్‌ | త్రిరాత్రంయేకరిష్యంతి ప్రాచీంప్రాప్యసరస్వతీమ్‌. 20

నతేషాందుష్కృతం కించిద్‌ దేహమాశ్రిత్యతిష్ఠతి | నరనారాయణౌదేవౌ బ్రహ్మాస్థాణుస్తఢారవిః. 21

ప్రాచీందిశంనిషేవంతే సదాదేవాఃసవాసవాః | యేతుశ్రాద్ధంకరిష్యంతి ప్రాచీమాశ్రిత్యమానవాః. 22

తేషాంనదుర్లభంకించిదిహలోకేపరత్రచ | తస్మాత్‌ ప్రాచీసదాసేవ్యా పంచమ్యాం చ విశేషతః. 23

పంచమ్యాంసేవమానస్తు లక్ష్మీవాన్‌ జాయతేనరః తత్రతీర్థమౌశనసం త్రైలోక్యస్యాపిదుర్లభమ్‌. 24

ఉశనాయత్రసంసిద్ధ అరాధ్యపరమేశ్వరమ్‌ | గ్రహమధ్యేషుపూజ్యతే తస్యతీర్థస్య సేవనాత్‌. 25

ఏవంశుక్రేణమునినా సేవితంతీర్థముత్తమం | యేసేవంతే శ్రద్దధానాస్తేయాంతి పరమాంగతిమ్‌. 26

యస్తుశ్రాద్దంనరోభక్త్యా తస్మింస్తీర్థేకరిష్యతి | పితరస్తారితాస్తేన భవిష్యంతి

నసంశయః. 27

చతుర్ముఖంబ్రహ్మతీర్థం సరోమర్యాదయాస్థితమ్‌ | యేసేవంతేచతుర్దశ్యాం సోపవాసావసంతిచ. 28

అష్టమ్యాంకృష్ణపక్షస్య చైత్రైమాసి ద్విజోత్తమాః | యేపశ్యంతిపరంసూక్ష్మం యస్మాన్నావర్తతేపునః. 29

స్థాణుతీర్థంతతోగచ్ఛేత్‌ సహస్రలింగశోభితమ్‌ | తత్రస్థాణువటం దృష్ట్వా ముక్తోభవతి కిల్బిషైః. 30

ఇతి శ్రీవామనమహాపురాణ సరోమాహాత్మ్యే ఏకవింశోధ్యాయః.

అనంతరం దుర్గాదేవికి ఆవాసమైన దుర్గాతీర్థానికి వెళ్ళాలి. అచట స్నానంచేసి పితృపూజచేస్తే ఎలాటి దుర్గతులు కలుగవు. అక్కడే త్రిలోకవిశ్రుతమైన సరస్వతీకూపం ఉంది. దానిని దర్శించినంతనే పాపాలు నశించి విముక్తి కలుగు తుంది. అక్కడ శ్రద్ధాభక్తులతో దేవపితృ తర్పణాలు చేస్తే అంతాఅక్షయ ఫలప్రదం అవుతుంది. పితృతీర్థం చాల విశిష్టమైనది. ప్రాచీసరస్వతిలో స్నానంచేస్తే మాతాపితృ బ్రహ్మహత్య చేసినవాడు, గురుభార్యా సంగమంచేసిననాడు సైతం పాపరహితులై శుద్ధులౌతారు. దేవమార్గాన (ఆకాశాన ) ఉద్భవించి ఆకాశాన ప్రవహించిన ప్రాచీసరస్వతి వరమదుర్మార్గులను సైతం పవిత్రులను గావిస్తుంది. ప్రాచీసరస్వతీ తీరాన మూడురాత్రులు గడిపినవారి శారీరికాలయిన దుష్కర్మలు నిలువజాలవు. నరనారాయణులు బ్రహ్మరుద్రాదిత్యులు ఇంద్రాదిదేవతలందరూ తూర్పుదిక్కును సేవిస్తూ ఉంటారు. అలాంటి ప్రాచీదినాశ్రయించి శ్రాద్ధకర్మలొనర్చు మానవులకు యిహపరాల్లో దుర్లభ##మైనదేదీ ఉండదు. కనుక మానవుడెల్లప్పుడూ, ముఖ్యంగా పంచమీతిథులతో తూర్పుదిక్కును ఆరాధించాలి. పంచమినాడు తూర్పుదిశనారాధించినవాడు ఐశ్వర్యవంతుడౌతాడు. అక్కడ ముల్లోకాల్లో దుర్లభ##మైన ఉశనాతీర్థం ఉంది. అక్కడ ఉశమడు (శుక్రాచార్యులు) పరమేశ్వరునారాధించి సిద్ధిబొంది గ్రహమండలంలో పూజ్యుడైనాడు. అలా శుక్రసేవితమైన ఆ ఉత్తమతీర్థాన్ని శ్రద్ధగాసేవిస్తే పరమగతి లభిస్తుంది. అక్కడ భక్తితో శ్రాద్ధంచేసినవాని పితరులు తరిస్తారు. సందేహములేదు. చతుర్దశినాడుపవసించి విధ్యుక్తంగా చతుర్ముఖ బ్రహ్మతీర్థ సరస్సును సేవించినా, చైత్రకృష్ణ అష్టమినాడు దానినారాధించినా అట్టివారలు ఓ విప్రోత్తములారా! పునరావృత్తిలేనిపరమ సూక్ష్మపదమును పొందుతారు. అక్కడనుండి సహస్రలింగశోభితమైన స్థాణుతీర్థానికి వెళ్ళి స్థాణువటాన్ని దర్శిస్తే సకల కిల్బిషాలు తొలగిపోతాయి.

ఇది శ్రీ వామన మహాపురాణంలోని సరోమహాత్మ్యంలో యిరవై ఒకటవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters