Sri Vamana Mahapuranam    Chapters   

పంతొమ్మిదవ అధ్యాయము

ఋషయః ఊచుః :

వసిష్ఠస్యాపవాహో7సౌ కథంవైసంబభూవహ | కిమర్థంసాసరిచ్ఛ్రేష్ఠాతం ఋషింప్రత్యవాహయత్‌. 1

లోమహర్షణ ఉవాచ :

విశ్వామిత్రస్య రాజర్షే ర్వసిష్ఠస్య మహాత్మనః | భృశంవైరంబభూవేహ తపఃస్పర్థాకృతేమహత్‌. 2

ఆశ్రమోవై వసిష్ఠస్య స్థాణుతీర్థేబభూవహ | తస్య పశ్చిమదిగ్భాగే

విశ్వామిత్రస్యధీమతః. 3

యత్రేష్ట్వాభగవాన్‌ స్థాణుః పూజయిత్వాసరస్వతీమ్‌ | స్థాపయామాసదేవేశో లింగాకారాంసరస్వతీమ్‌. 4

సవసిష్ఠిస్యతపసాఘోరరూపేణ సంస్థితః | తస్యేహతపసాహీనో విశ్వామిత్రోబభూవహ. 5

సరస్వతీంసమాహూయ ఇదంవచనమబ్రవీత్‌ | వసిష్ఠంమునిశార్దూలం స్వేనవేగేనఅనయ. 6

ఇహాహంతం ద్విజశ్రేష్ఠం హనిష్యామినసంశయః |ఏతచ్ఛ్రుత్వాతు వచనం వ్యథితాసామహానదీ. 7

తథాతాంవ్యథితా దృష్ట్వా వైపమానాంమహానదీమ్‌ | విశ్వామిత్రో7బ్రవీత్‌ క్రుద్ధో వసిష్ఠంశీఘ్రమానయ. 8

తతోగత్వాసరిచ్ఛ్రేష్ఠా వశిష్ఠంమునిసత్తమమ్‌ | కథయామాసరుదతీ విశ్వామిత్రస్య తద్వచః. 9

తపఃక్రియావిశీర్ణాంచ భృశంశోకసమన్వితామ్‌ | ఉవాచససరి చ్ఛ్రేష్ఠాం విశ్వామిత్రాయమాంవహ. 10

ఋషులు ప్రశ్నించారు: వశిష్ఠుని సరస్వతీనదికొనిపోవుట ఎలాజరిగినది ? ఆ సర్వోత్తమమైన నది ఆ మహర్షిని ఎందుకు తప జలాల్లో లాగికొనిపోయినది. లోమహర్షణుడిలా అన్నాడు : తమతమ తపోబలాలను పురస్కరించుకొని రాజర్షియైన విశ్వామిత్రునకు, బ్రహ్మర్షియగు వసిష్ఠునకుమధ్య చిరకాలంగా శత్రుత్వం ఉంది. వసిష్ఠుని ఆశ్రమంఉండేది. అక్కడ భగవంతుడగు స్థాణ్వీశ్వరుడు యజ్ఞంచేసిన సరస్వతీనదిని పూజించి ఆమెనొక లింగాకారంలో ప్రతిష్ఠించాడు. వసిష్ఠుడచట ఘోరమైన తపోనిష్ఠలోఉండిపోగా పిలిచి మునిశ్రేష్ఠుడగు వసిష్ఠునిగొనిరమ్మనియూ తానాయనను తప్పకచంపి వైతుననీ ఆజ్ఞాపించాడు. ఆ మాటవిని ఆ మహానది మహావ్యథతో నిలచిపోయినది. అందుకు మరింతకుపితుడై విశ్వామిత్రుడు వసిష్ఠుని వెంటనేపోయి కొనిరమ్ము పొమ్మని గర్జించెను. అంతట నా ఉత్తమనదీమతల్లి వసిష్ఠని సమీపించి విలపిస్తూ విశ్వామిత్రుని వాక్యములు వినిపించింది. తపంవల్ల కృశించి, శోకంతో విలవిలలాడుతున్నచూచి వసిష్ఠుడు విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు తన నాతని వద్దకు తీసికొనిమపొమ్మనెను.

తస్యతద్వచనంశ్రుత్వా కృపాశీలస్యసాసరిత్‌ | చాలయామాసతంస్థానాత్‌ ప్రవాహేణాంభసస్తదా. 11

నచకూలాపహారేణ మిత్రావరుణయోఃసుతః | ఊహ్యామానశ్చతుష్టావ తదాదేవీంసరస్వతీమ్‌. 12

పితామహస్యసరసః ప్రవృత్తాసి సరస్వతీ | వ్యాప్తంత్వ యాజగత్సర్వం తవైవాంభోభిరుత్తమైః. 13

త్వమేవాకాశగా దేవీ మేఘేసృజసేపయః | సర్వాస్త్వాపస్త్వమేవేతి త్వత్తోవయమధీమ

హే. 14

పుష్టిర్ధృతి స్తథాకీ ర్తిః సిద్ధిఃకాంతిఃక్షమాతథా | స్వధాస్వాహాతథావాణీ తవాయత్తమిదంజగత్‌. 15

త్వమేవసర్వభూతేషు వాణీరూపేణసంస్థితా | ఏవం సరస్వతీతేన స్తుతాభగవతీతదా. 16

సుఖేనోవాహతం విత్రం విశ్వామిత్రాశ్రమంప్రతి | న్యవేదయత్తదాఖిన్నా విశ్వామిత్రాయతంఋషిమ్‌. 17

తమానీతంసరస్వత్యా దృష్ట్వాకోపసమన్వితః | అథాన్విషత్‌ ప్రహరణం వశిష్ఠాంతకరంతదా. 18

అపోవాహవసిష్ఠంతం మధ్యేచైవాంభసస్తదా | ఉభయోః కుర్వతీవాక్యం వంచయిత్వాచగాధిజమ్‌. 19

తతో7పవాహితందృష్ట్వా వశిష్టమృషిసత్తమమ్‌| అబ్రవీత్‌ క్రోధరక్తాక్షో విశ్వామిత్రోమహాతపాః. 20

యస్మాన్మాంసరితాంశ్రేష్ఠే వంచయిత్వావినిర్గతా | శోణితంవహకల్యాణిరక్షో గ్రామణిసంయుతా. 21

తతఃసరస్వతీశప్తా విశ్వామిత్రేణధీమతా | అవహచ్ఛోణితోన్మిశ్రం

తోయంసంవత్సరంతదా. 22

ఆ కరుణామయుని వచనానుసారం ఆ నది ఆయనను తన ప్రవాహజలాల్లో కొనిపోసాగెను. అలా నదీప్రవాహంలో కొట్టుకొనిపోతూ ఆ వసిష్ఠముని సరస్వతీనదిని యీవిధంగాస్తుతించాడు. "బ్రహ్మ సరస్సునుంచి ఉద్భవించిన పావనసరస్వతీ! నీ పవిత్రజలాలతో జగత్తునంతను ముంచితివి. నీవే ఆకాశాన ప్రవహించి మేఘాలకు నీరుప్రసాదిస్తున్నావు. జలములన్నియు నీరూపమే. పుష్ట, కీర్తి, సిద్ధులు, కాంతి క్షమాగుణం, స్వాహా, స్వధా, వాణి యిత్యాదులతోకూడిన ఈ జగత్తంతటికీ నీవే ఆధారము అన్ని జీవరాసుల్లోనూ వాణిరూపంలో నీవే నెలకొని ఉన్నావు. నీకు నమస్సులు. "వసిష్ఠుని స్తోత్రానికి సంతసించి సరస్వతీనది ఆయనను సుఖంగా తనప్రవాహంతో విశ్వామిత్రుని కడకు కొనిపోయి ఖిన్నురాలై ఆ విషయం విశ్వామిత్రున కెరిగించినది. అలా వచ్చిన వసష్ఠునిచూచి కోపంతో, ఆయనను సంహరించుటకు విశ్వామిత్రుడు ఆయుధము తీసికొనిరాగాతన ప్రవాహం మధ్యభాగన ముంచివేసింది. ఆ విధంగా యిద్దరి ఆదేశాలను గౌరవించింది. ప్రవాహమధ్యంలో ముంచబడిన వసిష్ఠునికానక విశ్వామిత్రుడు సరస్వతిచేసిన మోసానికి కోపించి, ఓ ఉత్తమ స్రోతస్వినీ! కల్యాణీ! నన్నీవిధంగా వంచించి నందుకు ప్రతిఫలంగా నీవు నీళ్ళకుబదులుగా రక్తం ప్రవహిస్తూ రాక్షసులకు నిలయమైయుండగలవని శపించెను. ఆ శాపఫలంగా ఆ సరస్వతీనది ఒక సంవత్సరకాలం రక్తంప్రవహింపజేస్తూ ఉండినది.

అథర్షయశ్చదేవాశ్చ గంధర్వాప్సరసస్తదా | సరస్వతీంతదాదృష్ట్వా బభూవర్భృశదుఃఖితాః. 23

తస్మింస్తీర్థవరేపుణ్యశోణితంసముపావహత్‌ | తతోభూతపిశాచాశ్చ

రాక్షసాశ్చసమాగతాః. 24

తతస్తేశోణితం సర్వే పిబంతఃసుఖమాసతే | తృప్తాశ్చసుభృశంతేన సుఖితావిగతజ్వరాః.

నృత్యంతశ్చహపంతశ్చ యథాస్వర్గజితస్తథా. 25

కస్యచిత్త్వథకాలస్య ఋషయఃసతపోధనాః | తీర్థయాత్రాంసమాజగ్ముః సరస్వత్యాంతపోధనాః. 26

తాందృష్ట్వారాక్షసైర్ఘోరైః పీయమానాంమహానదీమ్‌ | పరిత్రాణ సరస్వత్యాః పరంయత్నంప్రచక్రిరే. 27

తేతుసర్వేమహాభాగాః సమాగమ్యమహావ్రతాః | ఆహూయసరితాంశ్రేష్ఠా మిదం వచనమబ్రువన్‌. 28

కింకారణం సరిచ్ఛ్రేష్ఠే శోణితేన హ్రదోహ్యయమ్‌ | ఏవమాకుతాంయాతాః శ్రుత్వా వేత్స్యామహేవయమ్‌. 29

తతఃసారస్వమాచష్ట విశ్వామిత్రవిచేష్టితమ్‌ | తతస్తేమునయః ప్రీతాః సరస్వత్యాంసమానయన్‌|

అరుణాం పుణ్యతో¸°ఘాం సర్వదుష్కృతనాశనీమ్‌. 30

అలా రక్తజలాలతో నిండిన సరస్వతినిచూచి దేవగంధర్వాప్సరసలు ఎంతో దుఃఖించారు. రక్తంతోనిండిన ఆనది చుట్టూ భూత పిశాచరాక్షసులు మూగికొని మహాసంతోషంతో ఆ రక్తం త్రాగుతూ తృప్తిగా ఎలాటి విచారంలేకుండా వికటాట్టహాసాలు చేస్తూ స్వర్గాన్ని జయించినట్లుగా ఆనందించసాగారు. ఆమీద కొన్నాళ్ళకు కొందరు ఋషులూ తపోధనులూ యాత్రార్థంగా బయలుదేరి సరస్వతీనదిని సమీపించారు. రక్తమైన రాక్షసులతో నిండిన ఆపుణ్యనదినిచూచి ఆమెను రక్షించాలని సంకల్పించుకొని ఆ మహానదిని పిలిచి ఆ తపోధనులిలా అన్నారు. ఓ నదీశ్రేష్ఠమా! యిలా రక్తజలాలతో నిండియుండుటకు కారణమేమి ? మాకంతయు చెప్పవలసినది. అందుకు సరస్వతి విశ్వామిత్రుడి అగడాన్ని వివరించి చెప్పింది. అంతటనామునులందరు సంతోషించి సమస్త పాపాలనుపోగొట్టే అరుణానదీ పవిత్ర జలాలనుతెచ్చి సరస్వతిలో కలిపారు. ఆమెను పవిత్రను గావించారు.

దృష్ట్వాతోయంసరస్వత్యా రాక్షసాదుఃఖితాభశమ్‌ | ఊచుస్తాన్‌ వైమునీన్‌ సర్వాన్‌ దైన్యయుక్తాఃపునఃపునః. 31

వయంహిక్షుధితాస్సర్వే ధర్మహీనాశ్చశాశ్వతాః | నచనః కామకారోయం యద్వయంపాపకారిణః. 32

యుష్మాకంచాప్రసాదేన దుష్కృతేనచ కర్మణా | పక్షో7యంవర్థతే7స్మాకం యతఃస్మోబ్రహ్మరాక్షసాః.

ఏవం వైశ్యాశ్చశూద్రాశ్చ క్షత్రియాశ్చవికర్మభిః | యేబ్రాహ్మణాన్‌ ప్రద్విషంతి తేభవంతీహరాక్షసాః. 34

యోషితాంచైవపాపానాం యోనిదోషేణవర్థతే | ఇయంసంతతిరస్మాకం

గతిరేషాసనాతనీ. 35

శక్తాభవంతఃసర్వేషాం లోకానామపితారణ | తేషాంతేమునయఃశ్రుత్వా కృపాశీలాః పునశ్చతే. 36

ఊచుఃపరస్పరంసర్వే తప్యమానాశ్చతేద్విజాః | క్షుతకీటావపన్నంచ యచ్చోచ్ఛిష్టాశితంభ##వేత్‌. 37

కేశావపన్నమాధూతం మారుతశ్వాసదూషితమ్‌ | ఏభిఃసంసృష్టమన్నంచ భాగంవైరాక్షసాంభ##వేత్‌. 38

తస్మాత్‌ జ్ఞాత్వాసదావిద్వాన్‌ అన్నాన్యేతానివర్జయేత్‌ | రాక్షసానామసౌభుంక్తే యోభుంక్తే అన్నమీదృశమ్‌.

శోభయిత్వాతుతత్తీర్థ మృషయస్తేతపోదనాః | మోక్షార్థంరక్షసాం తేషాం సంగమం తత్రకల్పయన్‌. 40

అరుణాయాః సరస్వత్యాః సంగమేలోకవిశ్రుతే | త్రిరాత్రోపోషితఃస్నాతో ముచ్యతేసర్వకిల్పిషైః. 41

ప్రాప్తేకలియుగేఘోరే అధర్మే ప్రత్యుపస్థితే | అరుణాసంగమేస్నాత్వా ముక్తిమాప్నోతిమానవః. 42

తతస్తేరాక్షసాస్సర్వే స్నాతాఃపాపవివర్జితాః| దివ్యమాల్యాంబరధరాః

స్వర్గస్థితిసమన్వితాః. 43

ఇతి శ్రీ వామన మహాపురాణ సరోమాహాత్మ్యే ఏకోనవింశో7ధ్యాయః.

అపవిత్రాలైన సరస్వతీ నదీజలాలనుచూచి దుఃఖితులై దీనదీనంగా ఆ రాక్షసులు మునులతో యిలా విన్నపం చేసుకున్నారు. "మేము శాశ్వతంగా ధర్మదూరులమై ఆకలితో అల్లాడుతున్నాము. మేము స్వయంగా ఈ మార్గాన్ని ఎంచుకోలేదు. మేముచేసిన పాపకర్మలూ మీ అనుగ్రహం లభించకపోవడం యీ కారణాలవల్ల మజాతి పెరిగిపోతూ మేము బ్రహ్మరాక్షసులమయ్యాము. బ్రాహ్మణులను ద్వేషించిన వైశ్య శూద్ర క్షత్రియులందరూ బ్రహ్మరాక్షసులౌతారు. పాపిష్టీ స్త్రీలతో సంగమం చేయడంవల్ల మాసంతతి పెరిగిపోతున్నది. ఇది ఎప్పటినుంచో వస్తూన్న కర్మ. తమరో, మహాతపోధనులు! సమస్త లోకాలను తరింపచేయ సమర్థులు !ఆ రాక్షసుల దీనాలాపాలు విని ఆ దయామయులగు మునులు తమలోతాము సంప్రదించుకున్నారు. ఎంగిలి, కీటకాదులు వాలినది, వెండ్రుకలు పడినందున, గాలివల్ల నోటిశ్వాసవల్ల కలిషితమైన భోజనం రాక్షసభోజ్యం. ఆ సంగతి గుర్తించి విజ్ఞులయినవారలట్టి ఆహారాన్ని వర్జించాలి. అలాటి తిండితిన్నవాడు రాక్షస భోజనంచేసినట్లే అలా ఆలోచించుకొని ఆ మహర్షులాతీర్థాన్ని పవిత్రంగావించి రాక్షసులనుద్ధరించుటకై అక్కడ అరుణా సరస్వతీనదుల పవిత్ర సంగమాన్ని కల్పించారు. లోకప్రసిద్ధమైన ఆ నదీసంగమంవద్ద మూడురాత్రులుపవసించి స్నానంచేస్తే సర్వకల్బిషాలు తొలగిపోతాయి. ఘోరకలికాలంలో ధర్మం అడుగంటినరుడు అరుణా సంగమంలో స్నానంచేసి మానవులు ముక్తులుకాగలరు. అంతట ఆ రాక్షసులందరు ఆ సంగమతీరాల్లో మునిగిపాపము క్తులైదివ్యమాల్యాంబరాలు ధరించి స్వర్గలోకాలకు చేరుకున్నారు.

ఇది శ్రీ వామన మహా పురాణంలోని సరోమాహాత్మ్యంలో పందొమ్మిదవ అద్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters