Sri Vamana Mahapuranam    Chapters   

పదునెనిమిదవ అధ్యాయము

లోమహర్షణ ఉవాచ :

తతస్త్వౌశనసం తీర్థం గచ్ఛేత్తుశ్రద్ధయాన్వితః | ఉశనాయత్ర సంసిద్ధో గ్రహత్వంచనమాప్తవాన్‌. 1

తస్మిన్‌స్నాత్వా విముక్తస్తు సాతకైర్జన్మసంభ##వైః | తతోయాతి పరంబ్రహ్మయస్మాన్నావర్తతే పునః. 2

రహోదరో నామ ముని ర్యత్రముక్తోబభూవహ | మహాతాశిరసాగ్రస్త స్తీర్థ మహాత్మ్యదర్శనాత్‌. 3

ఋషయ ఊచుః :

కథంరహోదరో గ్రస్తః కథంమోక్షమవాప్తవాన్‌ ? | తీర్థస్యతస్యమాహాత్వ్యమిచ్ఛామః శ్రోతుమాదరాత్‌. 4

లోమహర్షణ ఉవాచ:

పురవైదండకారణ్య రాఘవేణమహాత్మనా | వనతాద్విజశార్దూలా రాక్షసాస్తత్రహింసితాః. 5

తత్రైకస్యశిరశ్ఛిన్నం రాక్షసస్యదురాత్మనః | క్షురేణశితధారేణ తత్పపాతమహావనే. 6

రహోదర్స్యతల్లగ్నం జంఘాయాంవై యదృచ్ఛయా | వనేవిచరతస్తత్ర అస్థిభిత్త్వావివేశహ. 7

సతేనలగ్నేనతదా ద్విజాతి ర్నశశాకహ | అభిగంతుంమహాప్రాజ్ఞస్తీర్థాన్యాయతనానిచ. 8

న పూతినావిస్రవతావేదనార్తో మహామునిః | జగామసర్వతీర్థాని పృథివ్యాం యానికానిచ. 9

తతఃసకథయామాస ఋషీణాం భావితాత్మనామ్‌ | తే7బ్రువన్‌ఋషయోవిప్రంప్రయాహ్యౌశనసంప్రతి. 10

తేషాంతద్యవచనంశ్రుత్వా జగామనరహోదరః | తతస్త్వౌశనసే తీర్థే తస్యోపస్పృశతస్తదా.11

తచ్ఛిరశ్చరణంముక్త్వా వపాతాంతర్జలే ద్విజాః | తతఃసవిరజోభూత్వా పూతాత్మా పవీతకల్మషః 12

అజగామాశ్రమంప్రీతః కథయామాన చాఖిలం | తేశ్రుత్వాఋషస్సర్వే తీర్థమాహాత్మముత్తమమ్‌.

కపాలమోచనమితి నామచక్రుంసమాగతాః. 13

లోమహర్షణ వాక్యము : అచట నుండి విప్రోత్తములారా ! ఔశనస తీర్థానికి శ్రద్ధాభక్తులతో వెళ్ళవలెను. అక్కడనే ఉశనసుడు (శక్రుడు) సిద్ధిపొంది గ్రహత్వాన్ని సంపాదించాడు. అక్కడ స్నానంచేస్తే జన్మజన్మల్లో చేసిన పాపాలన్నీ నశించి నరుడు పునరావృత్తిలేని బ్రహ్మలోకానికిపోతాడు. భయంకరమైన శిరస్సుతో పీడింపబడిన రహోదరుడనేముని అక్కడనే ఆ శిరస్సునుండి విముక్తుడైనాడు. అంతట ఋషులిలా అడిగారు. రహోదర మునికి శిరోగ్రహణం ఎలా పట్టింది? అది ఆ తీర్థమహిమవల్ల ఎలాతొలగిపోయింది. దయచేసిచెప్పండి. అందుకు లొమహర్షణుడిలా చెప్పసాగాడు. ఓ బ్రాహ్మణులారా ! పూర్వం దండకారణ్యంలో ఉన్నప్పుడు మహాత్ముడగు శ్రీరాముడెందరో దుష్టరాక్షసులను సంహరించాడు. అప్పుడొక దుర్మార్గుడి తలను నిశితకరవాలంతో ఖండించగా అదిపోయి ఒకమహారణ్యంలోపడ్డది. ఆ అడవిలో తిరుగుతున్న రహోదరుని తొడకు ఆ రాక్షసుని తలతగిలి ఎముకను చీల్చుకొని లోపలప్రవేశించింది. తొడ భిన్నమైనందున ఆ బ్రాహ్మణుడు సంకల్పించుకొన్న తీర్థాలకు వెళ్ళలేకపోయాడు. అలా చముకారుతున్నప్పటికీ ఆ బాధను సహిస్తూ ఆ బ్రాహ్మణుడు భువిలోగల సర్వతీర్థాలనూ సేవించాడు. దారిలో తాను దర్శించిన ఋషులకు తనబాధతెలుపుకోగా వారాతనిని ఔశనస తీర్థానికి వెళ్ళమని సలహా ఇచ్చారు. అంతరహోదరుడక్కడకు వెళ్ళి జలస్పర్శ చేయగానే ఆ శిరస్సు ఆయనతొడ నుండి ఊడి నీళ్ళలోపడి పోయింది. అలా అతనిబాధ తొలగిపోయి పాపముక్తుడైనాడు. అలా పవిత్రుడై ఆశ్రమానికి తిరిగివెళ్ళి ఆ విషయం అందరకూ వివరంగా చెప్పడు. అది వినిన ఋషులంతా ఆ తీర్థమహిమకు సంతసించి దానికి కపాలమోచనమని నామకరణం చేశారు.

తత్రాపినుమహత్తీర్థం విశ్వామిత్రస్యవిశ్రుతమ్‌ | బ్రాహ్మణ్యం లబ్ధవాన్‌ యత్రవిశ్వామిత్రోమహామునిః. 14

తస్మింస్తీర్థవరేస్నాత్వా బ్రాహ్మణ్యం లభ##తేధ్రువమ్‌ | బ్రాహ్మణస్తువిశుద్ధాత్మా పరంపదమవాప్నుయాత్‌. 15

తతఃపృథూదకంగచ్ఛే న్నియతోనియతాశనః | తత్రసిద్ధస్తుబ్రహ్మర్షీ రుషంగుర్నామనామతః . 16

జాతిస్మరోరుషంగుస్తు గంగాద్వారేనదాస్థితః | అంతకాలంతతోదృష్ట్వా పుత్రాన్‌వచనమబ్రవీత్‌.

ఇహశ్రేయోన పశ్యామి నయధ్వం మంపృథూదకమ్‌. 17

సతైఃపుత్రైఃసమానీతః సరస్వత్యాంసమాప్లుతః | స్మృత్వాతీర్థగుణాన్‌ సర్వాన్‌ ప్రమేదమృషిసత్తమః

సరస్వత్యుత్తరేతీర్థే యన్త్యజేదాత్మనస్తనుమ్‌ | పృథూదకేజప్యపరోనూనం చామరతాంవ్రజేత్‌.

తత్రైవబ్రహ్మయోన్యస్తి బ్రహ్మణాయత్రనిర్మితాః పృథూదకం సమాశ్రిత్య సరస్వత్యాన్తలేస్థితః 21

చాదుర్వర్ణ్యస్యసృష్ట్యంర్థం ఆత్మజ్ఞానవరో7భవత్‌ | తస్యాభిధ్యాయతఃసృష్టిం బ్రహ్మణో7వయక్తజన్మనః.

ముఖతోబ్రాహ్మణాజాతా మాహుఖ్యాంక్షత్రియాస్తథా |

ఊరుభ్యాంవైశ్య జాతీయాః పద్భ్యాంశూద్రాస్తతో7భవన్‌. 23

చాతుర్వర్ణ్యంతతో దృష్ట్వా ఆశ్రమస్థంతతస్తతః | ఏవంప్రతిష్ఠితంతీర్థం బ్రహ్మయోనీతిసంజ్ఞితమ్‌. 24

అక్కడే సుప్రసిద్ధమైన గొప్పతీర్థం విశ్వామిత్ర తీర్థంఉంది. అక్కడ విశ్వామిత్రుడు బ్రహ్మత్వాన్ని పొందాడు. ఆ మహాముని తీర్థంలో స్నానంచేస్తే బ్రాహ్మణత్వం లభిస్తుంది. పరిశుద్ధాత్ములయిన బ్రాహ్మణులు పరమపదం పొందుతారు. తప్పదు. అక్కణ్ణుంచి మితాహారియైనరుడు పృథూదక తీర్థానికెళ్ళాలి. అక్కడ రుషంగుడనే బ్రహ్మర్షి సిద్ది పొందాడు. పూర్వజన్మస్మృతి గల్గిన రుషంగుడు మొదట గంగాద్వారంలో ఉండేవాడు. తనకు అంత్యకాలం రానున్నట్లు తెలిసికొని పుత్రులతో యిలా అన్నాడు. ఇక్కడ నాకు శ్రేయస్సు కలుగదు. వెంటనే నన్ను పృథూదక క్షేత్రానికి తరలించండి. తండ్రి భావాన్ని గుర్తించిన కుమారు లాయనను వెంటనే పృథూదకానికి తీసికెళ్ళారు. రుషంగుడు సరస్వతీ నదిలో స్నానంచేసి ఆ తీర్థమహిమను తలంచుకొని యిలా అన్నాడు. సరస్వతి ఉత్తరపుటొడ్డున పృథూదక తీర్థంలో జపం చేస్తూ శరీరం చాలించిన వానికి తప్పక అమరత్వం లభిస్తుంది. అక్కడే బ్రహ్మ నిర్మితమైన బ్రహ్మయోని ఉంది. బ్రహ్మ సరస్వతి తటాన పృథూదకంలో నివసించి చతుర్వర్ణముల సృష్టించేందుకు తగిన ఆత్మజ్ఞానం పొందాడు. అవ్యక్తజన్ముడైన బ్రహ్మసృష్టించాలని సంకల్పించుకొనినంతనే అతని ముఖమునుండి బ్రాహ్మణులు, బాహువులనుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు పాదములనుండి శూద్రులు జన్మించారు. ఆ నాలుగు వర్ణాల వారిని ఆశ్రమ ధర్మాల్లో అన్నిచోట్ల స్థాపించాడు. ఆ కారణాన ఆతీర్థం బ్రహ్మయోనిగా పిలవబడింది. ముముక్షువగునాతడక్కడ స్నానంచేస్తే మరల జన్మ అంటూ పొందడు.

తత్రస్నాత్వాముక్తికామః పునర్యోనింనపశ్యతి | తత్రైవతీర్థంవిఖ్యాత మవకీర్ణేతినామతః. 25

యస్మింస్తీర్థే బకోదాల్భ్యోధృతరాష్ట్రమమర్షణమ్‌ | జుహావవాహనైఃసార్ధం తత్రాబుధ్వత్తతోనృపః 26

ఋషయః ఊచుః :

కథంప్రతిష్ఠితంతీర్థ మవకీర్ణేతినామతః | ధృతరాష్ట్రేణరాజ్ఞాచ సకిమర్థంప్రసాదితః. 27

లోమర్షణ ఉవాచ :

ఋషయోనైమిషేయో యే దక్షిణార్థంయయుఃపురా | తత్రైవచబకోదాల్భ్యోధృతరాష్ట్రమయాచత. 28

తేనాపితస్యనిందార్థముక్తం పశ్వనృతంతుయత్‌ | తతఃక్రోధేనమహతా మాంసముత్కృత్యతత్రహ. 29

పృథూదకేమహాతీర్థే అవకీర్ణేతినామతః | జుహావధృతరాష్ట్రస్య రాష్ట్రం నరపతేస్తతః. 30

హూయమానేతదా రాష్ట్రే ప్రవృత్తేయజ్ఞ కర్మణి | అక్షీయత తతో రాష్ట్రం నృపతేర్దుష్కృతేనవై. 31

తతఃసచింతయామాన బ్రాహ్మణస్య విచేష్టితమ్‌ | పురోహితేన సంయుక్తో రత్నాన్యాదాయ సర్వశః. 32

ప్రాసాదనార్థంవిప్రస్య హ్యవకీర్ణం య¸°తదా | ప్రసాదితఃసరాజ్ఞాచ తుష్ఠః ప్రోవాచతంనృపమ్‌. | 33

బ్రాహ్మణానావమంతవ్యాః పురేషేణ విజానతా | అవజ్ఞాతోబ్రాహ్మణస్తు హన్యాత్‌ త్రిపురుసంకులమ్‌. 34

ఏవముక్త్వాసనృపతిం రాజ్యేనయశసాపునః | ఉత్థావయామాన తతస్తస్యరాజ్ఞో హితేస్థితః 35

తస్మింస్తిర్థేతుయః స్నాతి శ్రద్దధానో జితేంద్రియః | సప్రాప్నోతినరో నిత్యం మనసా చిందితంఫలమ్‌. 36

తత్రతీర్థం సువిఖ్యాతం యాయాతంనామనామతః | యస్యేహయజమానస్య మధు సుస్రావవైనదీ 37

తస్మిన్‌స్నాతో నరో భక్త్యా ముచ్యతే సర్వకిల్బిషైః | ఫలంప్రాప్నోతి యజ్ఞస్య అశ్వమేధస్యమానవః. 38

మధుస్రవంచతత్రైవ తీర్థం పుణ్యతమంద్విజాః | తస్మిన్‌స్నాత్వానరోభక్త్యామధునాతర్పయేత్‌పితౄన్‌. 39

తత్రాపిసుమహత్తీర్థం వసిష్ఠోద్వాహసంజ్ఞితమ్‌ | తత్రస్నాతోభక్తియుక్తో వాసిష్ఠంలోకమాప్నుయాత్‌. 40

ఇతి శ్రీవామనమహాపురాణ సరోమాహాత్మ్యే అష్టాదశో7ధ్యాయః.

అక్కడనే అవకీర్ణమనే తీర్థం ఉంది. అక్కడే దాల్ఛ్యుడైన బకుడు అసహిష్ణుడైన ధృతరాష్ట్రుని అతని బోయీలతో గడిపి యజ్ఞంలో బలియివ్వ సిద్ధపడగారాజుకు బుద్ధివచ్చింది. అంతట ఋషుడు, ఆ అవకీర్ణ తీర్థమెలా ఏర్పడ్డది? దానిని ధృతరాష్ట్రుడెందులకు సేవించాడని అడిగారు. అందుకు లోమహర్షణుడిలా చెప్పాడు. పూర్వం ఋషులు నైమిషారణ్యవాసులు, ధృతరాష్ట్రుని వద్దకు దక్షిణకై వెళ్ళారు. వారలతరపునదాల్భ్యుడైన బకుడానరపతిని యాచించాడు. ధృతరాష్ట్రుడు పలికిన నిందాగర్భితమైన అసత్యానికి మండిపడి దాల్భ్యుడైన బకుడు అభిచారిక హోమం ఒకటి పృథూదకక్షేత్రం లోని అపకీర్ణ తీర్థంవద్ద ప్రారంభించి అందులో ధృతరాష్ట్రుని రాజ్యంలో సహా పేల్చేందుకై తనతొడ మాంసాన్ని బయటకు తీసి హోమగ్నిలో వేశాడు. అలా యజ్ఞం ప్రారంభంకావడంతో అదుష్టుడైన నరపతి రాజ్యం క్షీణించిపోయింది. రాజ్యనాశనానికి చింతాకులితుడై వెనుక తాను ఋషులనవమానించుట జ్ఞప్తికిరాగా భీతుడై తన పురోహితునితోబాటు రత్న రాసులు తీసికొన అవకీర్ణ తీర్థానికి వెళ్ళి దాల్భ్యునకవి సమర్పించి పాదాల మీదబడి శరణాగతుడయ్యాడు. అందులకు సంతోషించి ఆ మహర్షి యిలా అన్నాడు. విజ్ఞానియైనవాడు బ్రాహ్మణులనెన్నడు నవమానించరాదు. బ్రాహ్మణులకు గావించిన అవమానం మూడు తరాలవారిని దహించివేస్తుంది సుమా. అలా హెచ్చరించి ధృతరాష్ట్రుని రాజ్యాన్నీ అతని కీర్తి ప్రతిష్ఠలనూ తిరిగి నిలబెట్టాడు. అలాంటి అవకీర్ణంలో విజితేంద్రియుడై శ్రద్ధాసక్తులతో స్నానంచేస్తే చింతిత ఫలాలన్నీ ప్రాప్తిస్తాయి. ఆపైన ప్రసిద్ధి చెందినయాయూత తీర్థం వస్తుంది. యయాతి చక్రవర్తి చేసిన యజ్ఞ ఫలంగా అచ్చట తేనెవాకలు ప్రవహించాయి. అచట భక్తితో స్నానం చేసి సర్వకిల్చిషాలు పోగొట్టుకోవచ్చు. అశ్వమేధ ఫలం పొందవచ్చు. మధు స్రవమనే పవిత్ర తీర్థం అక్కడే ఉంది. అందులో మునిగి పితరులకు తేనెతో తర్పణాదులిచ్చి నరుడు తరించగలడు. అక్కడనే వాసిష్ఠోద్వాహమనే మహత్తరమైన తీర్థం ఉంది. అక్కడ భక్తితో స్నానంచేస్తే వసిష్ఠలోకం సంప్రాప్తిస్తుంది.

ఇది శ్రీ వామన మహాపురాణంలో సరోమహాత్మ్యంలో పదునెనిమిదవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters