Sri Vamana Mahapuranam    Chapters   

పదునాలుగవ అధ్యాయము

లోమహర్షణ ఉవాచ :

తతో రామహద్రం గచ్చేత్‌ తీర్థసేవీ ద్విజోత్తమః యత్రరామేణవిప్రేణ తరసా

దీప్తతేపసా. 1

క్షత్రముత్సాద్యవీరేణ హ్రదాః పంచనివేశితాః పూరయిత్వానరవ్యాఘ్ర రుధిరేణతి నః

శ్రుతమ్‌. 2

పితరస్తర్పితాస్తేన తథైవచ పితామహాః | తతస్తేపితర ప్రీతా రామమూచుర్ద్విజోత్తమాః. 3

రామరామః మహాబాహో ప్రీతాఃస్మ స్తవ భార్గవ | అనయా పితృ భక్త్యాచ విక్రమేణచ తేవిభో. 4

వరంవృణీష్వభద్రంతే కిమిచ్ఛసి మహాయశః | సఏవముక్తస్తు పితృభీరామఃప్రభవతాంవరః 5

అబ్రవీత్ర్పాంజలిర్యాక్యం సపితౄన్‌ గగనే స్థితాన్‌ | భవంతోయదివై ప్రీతా యద్యనుగ్రాహ్యతా మయి. 6

పితృప్రసాదాదిచ్ఛేయం తపసాప్యాయనంపునః | యచ్చరోషాభిభూతేన క్షత్రమూత్సాదితం మయా. 7

తతశ్చపాపాన్ముచ్యేయం యుష్మాకం తేజసా హ్యహమ్‌ | ప్రదాశ్చైతేతీర్ధభూతా భ##వేయు ర్భువివిశ్రుతాః.

ఏవముక్త్వాశుభంవాక్యం రామస్య పితరస్తదా | ప్రత్యూచుఃపరమప్రీతా రామం హర్షపురస్కృతాః. 9

తవస్తేవర్దతాంపుత్రః పితృభక్త్యా విశేషతః | యచ్చరోషాభిభూతేన క్షత్రముత్సాదితం

త్వయా. 10

తతశ్చపాపాన్మక్తస్త్వం పాతితాస్తే స్వకర్మభిః | హ్రదాశ్చతవతీర్ధత్వంగమిష్యంతి న సంశయః. 11

హ్రదేష్వేతేషుయేస్నాత్వా స్వాన్‌పితౄం స్తర్పయంతిచ | తేభ్యోదాస్యంతిపితరో యథాభిలషితం వరమ్‌. 12

ఈప్సితాన్‌మానసాన్‌ కామాన్‌ స్వర్గవాసంచశాశ్వతమ్‌ | ఏవందత్వావరాన్‌ విప్రారామస్యపితరస్తదా. 13

అమంత్య్రభార్గవం ప్రీతా స్తత్త్రైవాంతర్హితాస్తదా | ఏవంరామహ్రదాఃపుణ్యా భార్గవస్య మహాత్మనః. 14

స్నాత్వాహ్మరదేషురామస్య బ్రహ్మచారీ శుచివ్రతః | రామమభ్యర్చ్యశ్రద్దావాన్‌ విందే ద్బహునువర్ణకమ్‌. 15

రామహర్షణవచనము - అచట నుంచి తీర్ణసేవ చేయగోరు బ్రాహ్మణోత్తముడు రామహ్రదాని కెళ్ళాలి. ఆచోటనే మహాతేజస్వియయిన భార్గవరాముడు క్షత్రియ సంహారం చేసి వారల రక్తంలో అయిదు నరోవరాలను నింపాడు. ఈ విషయం మేము విన్నాము. ఆ జలాలలో పితృపితామహులకు తర్పణా లిచ్చాడు. అంతటపరమ ప్రీతులైరాముని పితరులు అతనిచతో యిలా అన్నారు. మహాపరాక్రమవంతుడవైన రామా ! నీ విక్రమానికి పితరులయెడ భక్తికి సంతోషించాము మహాయశస్వీ ! నీకేమి వరంకావలయునో అడుగుము నీకు కళ్యాణమగుగాక. అంతట మహాబలశాలియైన భార్గవ రాముడు ఆకాశాననిలబడిన పితృదేవతలకు చేతులెత్తి నమస్కరించి యిలా అన్నాడు. మీరలు నాయెడ ప్రసన్నులైనచో నన్ననుగ్రహించుచో మీ అనుగ్రహం వల్ల నేను మరల తపోసిద్ది పొందవలెను. రోషాతిరేకంతో క్షత్రియ సంహారం చేసి నందున నాకు గల్గిన పాపం నశించవలెను. మీ ప్రభావంవల్ల ఈ అయిదు సరోవరాలు పవిత్ర తీర్థాలుగా ప్రసిద్ధి చెందవలె. రాముడు పలికిన ఈ శుభవాక్యాలు విని హర్షంతో ఆయన పితరులు ప్రేమతో అభయమిఇచ్చారు. పుత్రా ! విశిష్టమైన నీ పితృభక్తివల్ల నీ తసస్సు వర్ధిల్లుతుంది. కోపవశాన నీకు సంక్రమించిన క్షత్రియ వధపాతకం తొలగిపోయినది. ఆ క్షత్రియులు తమదుష్కర్మల వల్లనే చంపబడ్డారు. నిస్సందేహంగా, నీవు నిర్మించిన ఈ సరస్సులకు తీర్థత్వం లభిస్తుంది. ఈ సరస్సులలో మునిగి ఎవరు తమ పితరులకు తర్పణాలు విడుస్తారో వారల కోర్కెలు వారి పితరులు సిద్ధింప చేస్తారు. వారలకు శాశ్వత స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా పరశురామునకు వరాలిచ్చి ఆయన పితృదేవతలు అంతర్ధానమైనారు. ఈ విధంగా మహాత్ముడగు భార్గవరామునిచే నెలకొల్పబడిన రామసరోవరాలు పరమపవిత్రాలు. బ్రహ్మచారియై నియమంతో వానిలో స్నానంచేసి రాముని అర్చిస్తే బహుసువర్ణ ప్రాప్తికలుగుతుంది.

వంశమూలం సమాసాద్య తీర్థసేవీ సునంయతః | స్వవంశసిద్ధయేవిప్రాః స్నాత్వావై వంశమూలకే. 16

కాయశోధనమాసాద్య తీర్థం త్రైలోక్యవిశ్రుతమ్‌ | శరీరశుద్ధిమాప్నోతి స్నాత స్తస్మిన్‌ న సంశయః . 17

శుద్దదేహశ్చతం యాతి యస్మా న్నావర్తతే పునః | తావద్‌ భ్రమంతి తీర్థేషు సిద్ధా స్తీర్థపరాయణాః.

యావన్నప్రాప్నువంతీహ తీర్థంత త్కాయశోధనమ్‌. 18

తస్మింస్తీర్థేచ సంప్లావ్య కాయం సంయతమానసః | పరంపద మవాస్నోతి యస్మాన్నావర్తతే పునః 19

తతోగచ్ఛేతవిప్రేంద్రా స్తీర్థం త్రైలోక్యవిశ్రుతమ్‌ | లోకాయత్రోద్ధృతాః సర్వే విష్ణునాప్రభవిష్ణునా. 20

లోకోద్ధారంసమాసాద్య తీర్థస్మరణతత్పరః | స్నాత్వాతీర్థవరేదస్మిన్‌ లోకాన్‌పశ్యతిశాశ్వతాన్‌. 21

యత్రవిష్ణుఃస్తితోనిత్యం శివోదేవః సనాతనః |తౌదేవౌ ప్రణిపాతేన ప్రసాద్యమ క్తిమాప్నుయాత్‌. 22

శ్రీతీర్థంతుతతో గచ్ఛేత్‌ శాలగ్రామమమనుత్తమమ్‌ | తత్రస్నాతస్యసాన్నిధ్యం సదా దేవీ ప్రయచ్ఛతి. 23

కపిలాహ్రదఘాసాద్య తీర్థంత్రైలోక్య విశ్రుతమ్‌ | తత్ర స్నాత్వా7ర్చయిత్వాచ దైవతానిపితౄంస్తథా. 24

కపిలానాం సహస్రస్య ఫలం విందతిమానవః | తత్రస్థితం మహాదేవం కాపిలం వపురాస్థితమ్‌. 25

దృష్ట్వాముక్తిమవాప్నోతి ఋషిభిః పూజితంశివమ్‌ | సూర్యతీర్థంసమాసాద్య స్నాత్వానియతమానసః. 26

అర్చలుత్వాపితౄన్‌దేవా నుపవాసపరాయణః అగ్నిష్టోమమవాప్నోతి సూర్యలోకంచ గచ్ఛతి. 27

సహస్రకిరణందేవం భానుం త్రైలోక్యవిశ్రుతమ్‌ | దృష్ట్వాముక్తిమవాప్నోతి నరోజ్ఞానసమన్వితః. 28

భవానీవనమాసాద్య తీర్థసేవీయథాక్రమమ్‌ | తత్రాభిషేకం కుర్వాణోగోనహస్రఫలం లభేత్‌. 29

పితామహస్యపిబతో హ్యమృతం పూర్వమేవహి | ఉద్గారాత్‌సురభిర్జాతా సా చ పాతాళ మాశ్రితా. 30

తస్యాః సురభయో జాతాః తనయాలోకమాతరః | తాభిస్తత్సకులంవ్యాప్తం పాతాళం సునిరంతరమ్‌. 31

పితామహస్యయజతో దక్షిణార్థముపాహృతాః | ఆహుతాబ్రహ్మణాతాశ్చ విభ్రాంతా విపరేణహి. 32

తస్మిన్వివరద్వారేతు స్థితో గణపతిః స్వయమ్‌ |

యందృష్ట్వాసకలమ్‌ కామాన్‌ ప్రాప్నోతి సంయతేంద్రియః. 33

జితేంద్రియడగు తైర్థికుడు తన వంశాభివృద్ధికోసం వంశమూలంలో స్నానంచేసి అటనుండి కాయశోధనం అనే ముల్లోకాల్లో పేరుగన్న తీర్థంలో స్నానంచేసి తప్పకుండా కాయసిధ్ది పొందుతాడు. పరిశుద్ధమైన దేహం కలిగి పునరావృత్తిలేని లోకాలకుపోతాడు. తీర్థమరాయణులయిన సిద్ధులు కాయశోధనం పొదనంతవరకు తీర్థాటనం చేస్తూ ఉంటారు. ఆ తీర్థంలో స్నానంచేసి సంయతచిత్తులగు వారు పరమపదాన్ని చేరుకుంటారు. అనంతరం ఉత్తములగు విప్రుడు, సకలప్రాణులు విష్ణువుచేత ఉద్ధరించబడిన త్రిలోకఖ్యాతిగల లోకోద్ధారమను తీర్థంలోస్నానంచేసి శాశ్వత లోకాలను పొందుతారు. సనాతనులయిన శివవిష్ణువు లిరువురు నిత్యం సన్నిహితలుగుచోట, నా దేవులకు ప్రణమిల్లి ప్రసన్నుల గావించు కొని ముక్తిపొందనగును. ఆటనుండి పరమోత్తమమైన శాలగ్రామశ్రీతీర్థంలో స్నానంచేసిన సదాపరమేశ్వరి సాన్నిధ్యం పొందవచ్చు. తర్వాత త్రిలోకఖ్యాతి గల కపిల తీర్థంలోస్నానం చేసి. దేవపితరులను అర్చించినచో, వేయి కపిలగోవులు దానమిచ్చిన ఫలం కలుగును. అచటనే కపిలరూపంలో వెలసిన మహాదేవుని, ఋషి పూజితుని దర్శించినచో ముక్తికలుగును. ఆపైని, సూర్యతీర్థంలో స్నానంచేసి స్థిరచిత్తంతో ఉపవాసపూర్వకంగా పితరులను దేవతలను అర్చించిన, అగ్నిష్టోమయాగఫలం కలిగి సూర్యలోకప్రాప్తి పొందనగును. జ్జానియగు నరుడు సహస్రఖరకిరణుడగు సూర్యదేవుని దర్శించి మోక్షగామి అవుతాడు. అనంతరం భవానివనంచేరి అచటనభిషేకాదులొనర్చిన గోసహస్రదాన ఫలందక్కుతుంది. పూర్వకాలాన బ్రహ్మ అమృతపానంచేసి పుక్కిలించగా అందులోంచి సురభి (కామధేనువు) పుట్టిపాతాళానికి వెళ్ళింది. లోకమాత అయిన ఆ సురభికి ఎన్నోగోవులు జన్మించాయి. వానితో పాతాళంనిండి పోయింది. తర్వాత బ్రహ్మయజ్ఞం చేసినపుడు దక్షిణ యివ్వడానికి ఆ గోవులను పిలిచాడు. అవి ఒక బిల ద్వారాన ప్రయాణించి వెళ్లాయి. ఆ బిలద్వార ముఖాన వేంచేసిన గణపతిని దర్శించినచో సకల కోర్కెలు సిద్ధిస్తాయి.

నంగినీంతుసమాసాద్య తీర్థంముక్తిసమాశ్రయమ్‌ | దేవ్యాస్తీర్తేనరఃస్నాత్వా లభ##తేరూపముత్తమమ్‌. 34

అనంతాంశ్రియమాప్నోతి పుత్రపౌత్రసమన్వితః | భోగాంశ్చవిపులాన్‌ భుంక్త్వా ప్రాప్నోతిపరమంపదమ్‌. 35

బ్రహ్మవర్తేనరఃస్నాత్వా బ్రహ్మజ్ఞానసమన్వితః | భవతేనాత్రసందేహః ప్రాణాన్‌ ముంచతిస్వేఛ్ఛయా. 36

తతోగచ్ఛేతవిప్రేంద్రా ద్వారపాలంతురంతుకమ్‌ | తస్యతీర్థంసరస్వత్యాం యక్షేంద్రస్యమహాత్మనః 37

తత్రస్నాత్వా మహాప్రాజ్ఞ ఉపవాస పరాయణః | యక్షస్యచప్రసాదేన లభేతకామికంఫలమ్‌. 38

తతోగచ్ఛేతవిప్రేంద్రాః బ్నహ్మావర్తమనుత్తమమ్‌ | బ్రహ్మావర్తేనరః స్నాత్వా బ్రహ్మాచాప్నోతినిశ్చితమ్‌.

తతోగచ్ఛేత విప్రేంద్రాః సుతీర్థకమనుత్తమమ్‌ | తత్రసంనిహితానిత్యం పితరోదైవతైఃసహ. 40

తత్రాభిషేకం కుర్వీత పితృదేవార్చనేరతః | అశ్వమేధమవాప్నోతి పితౄన్‌ప్రీణాతిశాశ్వతాన్‌. 41

తతో7ంబువనం ధర్మజ్ఞ సమాసాద్యయథాక్రమమ్‌ | కామేశ్వరస్యతీర్థంతు స్నాత్వాశ్రద్ధాసమన్వితః 42

సర్వవ్యాధివినిర్ముక్తో బ్రహ్మావాప్తిర్భవేద్దృవమ్‌ | మాతృతీర్థంచతత్రైవ యత్రస్నాతస్యభక్తితః. 43

ప్రజావివర్ధతేనిత్యమనంతాంచావ్నుయాచ్ఛ్రియమ్‌ | తతంశీతవనంగచ్ఛే న్నియతోనియతాశనః. 44

తీర్థంతత్రమహావిప్రా మహదన్నత్రదుర్లభమ్‌ | పునాతిదర్శనాదేవ దండకంచద్విజోత్తమాః 45

కేశానభ్యుక్ష్యవై తస్మిన్‌పూతోభవతిపాపతః | తత్రతీర్ధవరంచాన్యత్‌ స్వానులోమాయనంమహత్‌. 46

తత్రవిప్రామహాప్రాజ్ఞా విద్వాంసస్తీర్థతత్పరాః | స్వానులోమాయనే తీర్థే విప్రాసై#్త్రలోక్యవిశ్రుతే. 47

ప్రాణాయామైర్నిర్హరంతి స్వలోమానిద్విజోత్తమాః | పూతాత్మానశ్యతేవిప్రాః ప్రయాంతిపరమాంగతిమ్‌. 48

దశాశ్వమేధికంచైవ తత్రతీర్థంసువిశ్రుతమ్‌ | తత్రస్నాత్వాభక్తియుక్తస్తదేవలభ##తేఫలమ్‌. 49

తతోగచ్ఛేతశ్రద్ధావాన్‌ మానుషంలోకవిశ్రుతమ్‌ | దర్శనాత్తన్యతీర్థస్యముక్తోభవతి కల్బిషైః 50

పురాకృష్ణమృగా స్తత్రవ్యాధేన శరపీడితాః | విగాహ్యతస్మిన్‌ సరసి మానుషత్వముపాగతాః 51

తతోవ్యాధాశ్చతేసర్వే తానపృచ్ఛన్‌ద్విజోత్తమాన్‌ | మృగాఅనేనవైయాతా అస్మాభిఃశరపీడితాః 52

నిమగ్నాస్తేసరఃప్రాప్య క్వతేయాతాద్విజోత్తమాః | తే7బ్రువంస్తత్రవైపృష్టా వయంతేచ ద్విజోత్తమాః 53

అస్యతీర్థన్యమాహాత్మ్యా న్మానుషత్వముపాగతాః | తస్మాద్‌యూయంశ్రద్దధానాః స్నాత్వా తీర్థేవిమత్సరాః 54

సర్వపాపవినిర్ముక్తా భవిష్యథనసంశయంః తతఃస్నాతాశ్చతేసర్వే శుద్ధదేహాదివంగతాః 55

ఏత త్తీర్థస్యమాహాత్మ్యం మానుషస్యద్విజోత్తమాః | యేశృణ్వంతిశ్రద్దధానాస్తే7పియాంతి పరాంగతిమ్‌. 56

ఇతి శ్రీ వామనమహాపురాణ సరోమహాత్మ్యే చతుర్ధశో7ధ్యాయః.

అనంతరం ముక్తినిలయమైన సంగిని తీర్తంలోని దేవీతీర్థంలో స్నానంచేసి, నరుడుచక్కని రూపవంతుడు కాగలడు. అనంతైశ్వర్యాలు పుత్రపౌత్రులుగలిగి విస్తారమైన భోగాలనుభవించి పరమపదమందగలడు. బ్రహ్మావర్తంలో స్నానమాడినవాడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. స్వేచ్ఛామరణం పొందుతాడు. సందేహంలేదు. బ్రాహ్మణోత్తముటారా! అచట నుండి రందుకద్వార పాలుని సేవించాలి. మహాత్ముడగు నాయక్షేంద్రుని సరస్వతీతీర్థంలో ఉపవాసముండి స్నానమాడుచో యక్ష ప్రసాదంవల్ల కోరిన ఫలములు పొందనగును. అట నుండి మునిస్తుతమైన బ్రహ్మావర్తతీర్థంలో స్నానంచేసిన తప్పక బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. అచటి నుండి దేవతలకు పితరులకు నిత్యనివాసమైన సుతీర్థకమను ఉత్తమ తీర్థంలో పితృదేవార్చనలు అభిషేకాదులుచేసి వారలను సంతోషపెట్టి అశ్వమేధ ఫలంపొందవచ్చు. అక్కడనుంచి అంబువనంవెళ్ళి అచటకామేశ్వర తీర్థంలో భక్తితోస్నానంచేసినవాడు సర్వరోగముక్తుడై బ్రహ్మజ్ఞాని అవుతాడు. తప్పదు. అక్కడే మాతృతీర్థం ఉంది. అక్కడ భక్తితోస్నానంచేస్తే సంతానవృద్ధి కలిగి అనంతైశ్వర్యాలు అభిస్తాయి. అక్కడ నుంచి నియతాహార సేవియై శీత వనానికి వెళ్లాలి. బ్రాహ్మణులారా ! అక్కడ అన్యత్ర దుర్లభ##మైన తీర్థంఉంది. దర్శనమాత్రన్నే పవిత్రంచేసే ఆ క్షేత్రం దండకం. అక్కడ శిరోముండనం చేసికొని మానవుడు పవిత్రుడౌతాడు. పాపాలుపోతాయి. అక్కడే స్వానులోమాయనమనే మనో త్రైలోక విఖ్యాతిగాంచిన తీర్థంఉంది. అక్కడ మహాప్రాజ్ఞులైన తీర్థపసేవలు ప్రాణాయామవిధిచే తమ శరీరం మీది రోమాలన్నీ పోగొట్టుకుంటారు. అలాంటి పవిత్రులు పరమపదం పొందుతారు. ఆవలదశాశ్వమేధికతీర్థం ప్రఖ్యాతమైనది. అక్కడ భక్తితోస్నాంచేస్తేదశాశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. తర్వాత శ్రద్ధాళువులు, లోకవిఖ్యాతమైన మానుషతీర్థానికి వెళ్తారు. దానిని చూసినంతనే కిల్బిషాలుతొలగి ముక్తులౌతారు. పూర్వసమయాన ఆ ప్రదేశాన వేటకాని బాణాలకు గురియై కృష్ణమృగాలు ఆ సరస్సులోపడి మనుష్యశరీరాలు ధరించాయి. అలావచ్చిన బ్రాహ్మణోత్తములను చూచి వేటగాళ్లు వారలతో ఓ ఋషులారా ! మా బాణాలుతగిలిన లేళ్ళు సరస్సులో మునిగిపోయాయి. అవి తర్వాత ఏమైనవని అడిగారు. అందులకా బ్రాహ్మణులు మేమే ఆ జింకలము. ఈ తీర్థమహిమ వల్ల ఉత్తమమానుష రూపములు ధరించాము. మీరుగూడ మావలెనే మత్సరరహితులై స్నానంచేసి పాపాలనుండి ముక్తులవండి. అని చెప్పారు. అంతటవారుగూడ అందోస్నానంచేసి పవిత్ర శరీరులై స్వర్గానికి వెళ్ళారు. ఓ విప్రోత్తములారా ! యిలాంటిమహిమ గల మానుషతీర్థం గరిమనువిన్న శ్రద్ధాశువులు గూడ పరమపదం పొందుతారు.

ఇది శ్రీ వామన మహాపురాణంలోని సరోమహాత్మ్యంలో పదునాలుగవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters