Sri Vamana Mahapuranam    Chapters   

పదవ అధ్యాయము

లోమహర్షణ ఉవాచ :

సపర్వతవనాముర్వీం దృష్ట్వాసంక్షుభితాంబలిః | పప్రచ్ఛోశనసంశుక్రం ప్రణిపత్య కృతాంజలిః. 1

ఆచార్యః క్షోభమాయాతి సాబ్దిభూమిధరామహీ | కస్మాచ్చనాసురాన్‌ భాగాన్‌ ప్రతిగృహ్ణంతివహ్నయః? 2

ఇతిపృష్టో7థబలినా కావ్యోవేదవిదాంవరః | ఉవాచదైత్యాధిపతిం చిరంఢ్యాత్వామహామతిః.

3

అవతీర్ణోజగద్యోనిః కశ్యవస్యగృహేహరిః | వామనేనేహ రూపేణ పరమాత్మా సనాతనః. 4

సనూనంయజ్ఞమాయాతి తవదానవపుంగవ ః | తత్పాదన్యాసవిక్షోభా దియంప్రచలితామహీ. 5

కంపంతేగిరయశ్చేమే క్షుభితామకరాలయాః | నేయంభూతపతింభూమిః సమర్థావోఢుమీశ్వరమ్‌. 6

సదేవాసురగంధర్వా యక్షరాక్షసపన్నగా | అనేనైవధృతాభూమి రాపో7గ్ని పవనౌనభః.

ధారయత్యఖిలాన్‌ దేవాన్‌ మనుష్యాంశ్చమహాసురాన్‌. 7

ఇయమస్యజగద్దాతు ర్మాయాకృష్ణస్యగహ్వరీ | ధార్యధారకభావేన యయాసంపీడితంజగత్‌. 8

తత్సన్నిధానాదసురా నభాగార్హాఃసురద్విషః | భుంజతేనాసురాన్‌ భాగా నపితేనత్రయో7గ్నయః. 9

శుక్రస్యవచనంశ్రుత్వా హృష్టరోమా7బ్రవీద్బలిః | ధన్యో7హంకృతపుణ్యశ్చ యన్మేయజ్ఞపతిః స్వయమ్‌.

యజ్ఞమభ్యాగతోబ్రహ్మన్‌ః మత్తఃకో7న్యో7ధికఃపుమాన్‌. 10

యంయోగినఃసదోద్యుక్తాః పరమాత్మానమవ్యయమ్‌ | ద్రష్టుమిచ్ఛంతిదేవో 7సౌమమాధ్వరముపేష్యతి.

యన్మయాచార్యః కర్తవ్యం తన్మమాదేష్టుమర్హసి. 11

లోమహర్షణుడిట్లనియె : సమస్త పర్వతవనాలతో కూడిన భూమి అలా కంపించుటచూచి తనగురువు శుక్రాచార్యులకు ప్రణమిల్లి బలి యిట్లడిగెను. ఆచార్యదేవా ! సముద్ర పర్వతాదులతోసహా ఈభూమి కదలాడుతున్నది. అసురులిచ్చుహవిస్సులను అగ్నులు నిరాకరిస్తున్నవి. ఈ విపరీతానికి కారణమేమి ? బలి అడిగినప్రశ్నకు మహామేధావియగు శుక్రా చార్యుడు చాలాసేపు ఆలోచించి ఆ దైత్యపతితో యిలా అన్నాడు. దానవశ్రేష్ఠా ! జగత్కారణుడగు శ్రీహరి కరిశ్యపునింట నవతరించాడు. వామనరూపుడగునా సనాతన పరమాత్మనీ యజ్ఞవాటికకు రానున్నాడు. ఆయన అడుగుల బరువునకు భూమి కంపిస్తున్నది. కొండలు సముద్రాలు అల్లకల్లోలమవుతున్నాయి. ఆ భూతేశ్వరుని భారం భూమి మోయజాలకున్నది. దేవాసుర గంధర్వ యక్ష పన్నగ మానవాదులతో కూడిన పంచభూతాత్మకమైన విశ్వాన్నంతా ఆయన ధరించియున్నాడు. అట్టి సర్వాధారుడగు కృష్ణుని అనిర్వచనీయమైన మాయవల్ల ధార్యధారక సంబంధం ఏర్పడి జగత్తు పీడింపబడుతోంది. ఆయన సన్నిధాన ప్రభావాన సురద్వేషులయిన రాక్షసులు యజ్ఞార్హతను కోల్పోయినారు. అందుచేతనే అగ్నులువారలర్పించు హవిస్సులను గ్రహించుటలేదు. తనగురువు చెప్పిన మాటలు విన్నంతనే బలిచక్రవర్తి సంతోషంతో పొంగిపోయాడు. ఆచార్యదేవా! ఆహా! ఏమి నా అదృష్టం, ఎంత ధన్యుడను నేను! సాక్షాత్తు యజ్ఞేశ్వురుడైన ఆ పరమాత్ముడే నా యజ్ఞవాటికకు రానున్నాడు! నాకన్న అధికుడెవ్వడు ? ఏ మహాత్ముని యోగిజనులెంతో శ్రమించి చూడవలెనని ఉబలాటపడతారో అట్టిదేవదేవుడు తనంతట తానే నాయజ్ఞానికి వస్తున్నాడు. ఆహా ఏమి నాభాగ్యము. గురుదేవా ! ఈ సంతోష సమయాన నేను ఏం చేయాలో దయతో ఆదేశించండి!

శుక్ర ఉవాచ :

యజ్ఞభాగభుజోదేవా వేదప్రామాణ్యతో7సుర | త్వయాతుదానవాద్వైత్య యజ్ఞభాగభుజః కృతాః. 12

అయంచదేవఃసత్వస్థః కరోతిస్థితి పాలనమ్‌ | విసృష్టంచ తథా7యంచ స్వయమత్తిప్రజాః ప్రభుః. 13

భవాంస్తుబందీభవితా నూనం విష్ణుః స్థితౌస్థితః | విదిత్వైవంమహాభాగః కురుయత్తేమనోగతమ్‌. 14

తవాస్యదైత్యాధిపతే స్వల్పకే7పిహీవస్తుని | ప్రతిజ్ఞానైవవోఢవ్యా వాచ్యంసామతథా7ఫలమ్‌. 15

కృతకృత్యస్యదేవస్య దేవార్థంచైవకుర్వతః | అలందద్యాంధనం దేవే త్వేతద్వాచ్యంతుయాచతః.

కృష్ణస్యదేవభూత్యర్థం ప్రవృత్తస్యమహాసురః 16

శుక్రుడిలా హితవు చెప్పాడు : దైత్యరాజా ! వేదాలననుసరించి సత్వగుణ సంపన్నులైన దేవతలకే యజ్ఞ భాగ భోజ్యార్హత ఏర్పడింది. కాని నీవు నీ శక్తి సామర్థ్యంవల్ల దానిని రాక్షసులకు గూడ సంపాదించిపెట్టినావు. సత్వస్వరూపి అయిన ప్రభువు సృష్టీపాలనం చేస్తూనే మరొకవంక తన సృష్టించిన ప్రజలకు తానేభక్షిస్తుంటాడు. స్థితిపాలకుడగు నీ విష్ణువు నిన్ను తప్పకబందీగా చేస్తాడు. ఈ సత్యాన్ని తెలుసుకుని నీకెలా తోచునో అలా చేయుము. ఎట్టి పరిస్థితిలో కూడ ఆయనకు ఏ చిన్నవస్తువుకూడ యిస్తానని మాటయివ్వకుము. అయితే ఆయనతో తియ్యగా, ప్రయోజనశూన్యంగా మాటలు చెప్పి పంపివేయుము. కృతకృత్యుడగు కృ ష్ణుడు దేవకార్యం చక్కబెట్టుటకు నిన్ను యాచించినచో చాలినంత ధనమిస్తానని మాత్రం చెప్పు.

బలిరువాచ :

బ్రహ్మన్‌ కథమహంబ్రూయా మన్యేనాపిహియాచితః | నాస్తీతి, కిముదేవస్య సంసారస్యాఘహారిణః. 17

వ్రతోపవాసైర్వివిధై ర్యఃప్రభుర్‌ గృహ్యతేహరిః | సమేవక్ష్యతిదేహీతి గోవిందః కిమితో7ధికమ్‌.? 18

యదర్థంసమహారంభా దమశౌచగుణాన్వితైః | యజ్ఞాఃక్రియంతేయజ్ఞేశః సమేదేహీతివక్ష్యతి. 19

తత్సాధుసుకృతంకర్మతపఃసుచరితంచనః | యన్మాందేహీతివిశ్వేశః స్వయ మేవ వదిష్యతి. 20

నాస్తీత్యహంగురోవక్ష్యే తమభ్యాగతమీశ్వరమ్‌ | ప్రాణత్యాగం కరిష్యే7హం నతునాస్తిజనేక్వచిత్‌. 21

నాస్తీతియన్మయానోక్త మన్యేషామపయాచితమ్‌ | వక్ష్యామికథమాయాతే తదద్యచామరే7చ్యుతే. 22

శ్లాఘ్యఏవహివీరాణాందానాచ్చాపత్సమాగమః | నబాధాకారియుద్దానం తదంగబలవత్‌ స్మృతమ్‌. 23

మద్రాజ్యేనాసుభీకశ్చిన్నదరిద్రోనచాతురః| నదుఃఖితోనచోద్విగ్నో నసమాధివివర్జితః. 24

హ్పష్టస్తుష్టః సుగంధీచ తృప్తఃసర్వసుఖాన్వితః | జనఃసర్వోమహాభాగః కిముతాహం సదాసుఖీ. 25

ఏతద్విశిష్టమాత్రోహం దాన బీజఫలంలఖే | విదితం మునిశార్దూలః మయైతత్‌ త్వన్ముఖాచ్ఛ్రుతమ్‌. 26

మత్ర్పసాదపరోనూనం యజ్ఞేనారాధితోహరిః | మమదానమవాప్యాసౌ పుష్ణాతియదిదేవతాః. 27

ఏతద్బీజవరేదానబీజం పతతిచేత్‌ గురౌ | జనార్దనేమహాపాత్రే కింనపాత్రంతతోమయా. 28

విశిష్టంమమతద్దానం పరితుష్టాశ్చ దేవతాః | ఉపభోగాచ్ఛతగుణం దానం సుఖకరంస్మృతమ్‌. 29

మత్ర్పసాదపరోనూనం యజ్ఞేనారాధితోహరిః | తేనాభ్యేతినసందేహో దర్శనాదుపకారకృత్‌. 30

అథకోపేనచాభ్యేతి దేవభాగోపరోధతః | మాంనిహంతుంతతోహిస్యా ద్వధః శ్లాఘ్యతరో7చ్యుతాత్‌. 31

ఏతద్‌ జ్ఞాత్వామునిశ్రేష్ఠ దానవిఘ్నకరేణమే | నైవభావ్యంజగన్నాథే గోవిందేసముపస్థితే.

32

గురువు చెప్పిన హితవచనాలకు బలియిట్లు బదులు పలికెను. భగవన్‌, దేహియని యాచించిన వానికి లేదని ఎలా చెప్పగలను.? అట్టిచో, సంసారపాపాలు పోగొట్టే దేవదేవుడే అడిగినచో వేరే చెప్పవలెనా ? ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేస్తేగాని లభించని ప్రభువు గోవిందుడే వచ్చియాచించడాన్నిమించిన భాగ్యమే ముంటుంది ? శమ దమాది సద్గుణ సంపన్నులేయజ్ఞేశ్వరుని కొరకై యజ్ఞ కార్యాలన్నీ చేస్తుంటారో ఆ భగవంతుడు మనలను యాచించుట చూడగా మనమెంతటి సుకృతాలు తపసదాచరణాలు చేసిన వారమో తెలియగలదు. అలాంటి విశ్వేశ్వరునకు లేదని చెప్పడం కన్న ప్రాణత్యాగం మేలు. అట్టి అభ్యాగతుడగు సాక్షాద్విష్ణుదేవుని తిరస్కరించను. ఇంతవరకు యితర యాచకుల నెవ్వరికీ నేను యివ్వనని చెప్పలేదు. అలాంటప్పుడు నేను అచ్యుతునే ఎట్లు పొమ్మందును ? తనకు బాధ కలిగించని దానం ఎంతో ముఖ్యమని పెద్దల వచనం. ఇక నావిషయమా, చూడండి, నా రాజ్యంలో సుఖికాని వాడు కాని, దరిద్రుడు కాని, అతురుడుగాని, దుఃఖితుడు గాని మనశ్శాంతి లేని వాడు కాని, శమదమాదులు విడిచినవాడుగాని ఒక్కడూ లేడు. అందరూ సంతుష్టులూ, సుఖులు, తృప్తులు, నీతిపరులు, అందరకన్నా నేను ఎల్లపుడూ సుఖంగా ఉంటున్నాను. ఈ వైశిష్ట్యం దాన బీజం యొక్క ప్రభావమేగదా. యిలాగనే తమరే చెప్పియున్నారు గదా ? ముని శ్రేష్ఠాః నాదానం స్వీకరించినందున, దేవతలకు అభ్యుదయం కలుగజేసే పక్షంలో, ఆయజ్ఞారాధితుడగు శ్రీహరినన్ను తప్పక అనుగ్రహిస్తాడు. ముల్లోకాలకూ శ్రేష్ఠమగు బీజం - మూలకారణుడై సర్వోత్తమపాత్రత గలిగిన ఆ గురుబీజం జనార్దనుని చేతిలో నాదాన బీజం పడటం కన్న మేలు అభ్యుదయం ఏముంటుంది ? నాకు లభించనిదంటూ ఏముండగలదు? సర్వదేవతలను తృప్తి పరచగలనాదానం అతి విలక్షణమైనది కాగలదు. తాను అనుభవించటం కన్నా దానమిచ్చుట నూరురెట్లు శ్రేష్ఠమని పెద్దల మాట, యజ్ఞాలచేత నారాధింపబడిన శ్రీహరినన్ను అనుగ్రహించుటకే, తన దుర్లభ##మైన దర్శన భాగ్యం కలిగించుటకే, నాయింటికి వస్తున్నాడు. గురుదేవా! ఇందులో అణు మాత్రం సందేహం లేదు. అలాకాక ఒకవేళ, దేవతల యజ్ఞ భాగాలు ఆపినందుకు నామీద కోపంతో, నన్ను వధించుటకే వచ్చినా అదినాకు యింకా మంగళ ప్రదం అవుతుంది. ఆయన చేత మరణం సామాన్యంగా దొరుకునా ? గురూత్తమా ! ఇవన్నీ సాకల్యంగా ఆలోచించి గుర్తించిన మీదట, జగన్నాధుడగు గోవిందుడు యాచించినచో కాదనుట, లేదనుట ఈ రాదనుట ఎంతమాత్రమూ భావ్యము కాదు.

లోమహర్షణ ఉవాచ :

ఇత్యేవంపదత స్తస్య ప్రాప్తస్తస్యజనార్దనః | సర్వదేవమయో7చింత్యో మాయావామనరూపధృక్‌. 33

తందృష్ట్వాయజ్ఞవాటంతు ప్రవిష్టమసురాఃప్రభుమ్‌ | జగ్ముః ప్రభావతఃక్షోభం తేజసాతస్యనిష్ప్రభాః. 34

జేపుశ్చమునయస్తత్ర యేసమేతామహాధ్వరే | వసిష్ఠోగాధిజోగర్గో అన్యేచమునిసత్తమాః.

35

బలిశ్చైవాఖిలంజన్మ మేనేసఫలమాత్మనః | తతః సంక్షోభమాపన్నో నకశ్చిత్‌ కించిదుక్తవాన్‌. 36

ప్రత్యేకందేవదేవేశం పూజయామాసతేజసా | అథ7సురపతిఃప్రహ్వం దృష్ట్వామునివరాంశ్చతాన్‌. 37

దేవదేవపతిః సాక్షాద్‌ విష్ణుర్వామనరూపధృక్‌ | తుష్టావయజ్ఞంవహ్నించ యజమానమథార్చితః.

యజ్ఞకర్మాధికారస్థాన్‌ సదస్యాన్‌ ద్రవ్యసంపదమ్‌. 38

సదస్యాఃపాత్రమఖిలం వామనంప్రతితత్‌ క్షణాత్‌ | యజ్ఞవాటస్థితంవిప్రాః సాధుసాధ్విత్యుడైరయన్‌. 39

సచార్ఘమాదాయబలిః ప్రోద్భూతపులకస్తదా | పూజయామాసగోవిందం ప్రాహచేదం మహాసురః. 40

బలిరువాచ :

సువర్ణరత్నసంఘాతో గజాశ్వసమితి స్తథా | స్త్రియోవస్త్రాణ్యలం కారాన్‌ గావోగ్రామాశ్చపుష్కలాః. 41

సర్వేచ సకలా పృథ్వీ భవతో వా యదీప్సితామ్‌ | తద్దదామివృణుష్వేష్టం మమార్థాః సంతితేప్రియాః. 42

ఇత్యుక్తోదైత్యపతినా ప్రీతిగర్భాన్వితం వచః | ప్రాహసస్మిత గంభీరం భగవాన్‌ వామనాకృతిః. 43

మమాగ్ని శరణార్థాయ దేహిరాజన్‌ పదత్రయం సువర్ణగ్రామరత్నాది తదర్థిభ్యః ప్రదీయతామ్‌. 44

లోమహర్షణుడిట్లనియె. మునులారా ! బలియిలా అంటూండగానే సర్వదేవమయుడు, అచింత్యుడునగు జనార్దనుడు కపట వామనరూపంలో అచటకు వచ్చిచేరాడు! అలావచ్చిన ఆ తేజోమయుని చూస్తూనే యజ్ఞశాలలోనున్న దైత్యులంతా సంక్షోభంతో తమ తేజస్సుకోలు పోయారు. కాగా జపదీక్షలో ఉన్నమునులు వసిష్ఠ విశ్వామిత్ర గర్గాదిమహర్షులు బలి చక్రవర్తి వీరంతా తమ జన్మలు సార్థకమైనట్లు ఆనందించారు, సంభ్రమాశ్చర్యాల్లో మునిగి వారెవ్వరు మాటాడలేక పోయారు. అందరూ ఆ దేవదేవుని తమ తమ భక్తి కొద్ది పూజించి నిలబడ్డారు. వినయానతులైన ఆదైత్యేశ్వరునీ ఋషిమున్యాదులను చూచి ప్రీతుడైన విష్ణుదేవుడు ఆయజ్ఞాన్నీ, అగ్నులను, యజమానిని. అర్చితులను, యజ్ఞకర్మాధికారులను సభ్యులను ఉత్తమమైన యజ్ఞ సంఖారాలను బహువిధాల ప్రశంసించాడు. సర్వోత్తమాధికారి (పాత్ర) అయిన ఆవామన దేవుని చూచి సదస్యులందరు సాధువాక్యాలు పలికారు. అంతట ఆనందంతో దేహమంతా పులకించగా నాబలి రాజేంద్రుడర్ఘ్య పాద్యాదులతో నా గోవిందునే అర్చించి యిలా అన్నాడు. వటూత్తమా ! నాకు కలిగిన సంపదలో నీకేది యిష్టమో దానిని కోరుకొనుము. తప్పక యిచ్చెదను. బంగారం, రత్నరాసులు, గజాశ్వసమూహాలు, సుందరాంగనలు, వస్త్రాభరణాదులు, ఆలమందలు, గ్రామాలు, నారాజ్యమంతా నీముందున్నది. యిందులో ఏమి కావలెనో కోరుకొనుము. దైత్యేశ్వరుడత్యంత ప్రేమాతిశయంతో పలికిన మాటలు విని చిరునవ్వు పెదవుల మీద నాట్యం చేయగా గంభీరమైన స్వరంతో, నాకు మాత్రం పవిత్రాగ్నులుంచుకొనుటకు మూడడుగుల నేల నొసగి, తక్కినవన్నియు అవి కావలసిన అర్ధులకొసగుమనెను.

బలిరువాచ :

త్రిభిఃప్రయోజనం కింతే పదైఃపదవతాంవరః | శతం శతసహస్రంవాపదానాం మార్గతాం భవాన్‌. 45

శ్రీవామన ఉవాచ :

ఏతవతాదైత్యపతేః కృతకృత్యో7స్మిమార్గణ | అన్యేషామర్థినాం విత్తమిచ్ఛయా దాస్యతే భవాన్‌. 46

ఏదచ్ఛ్రుత్వాతుగదితం వామనస్య మహాత్మనః | వాచయామాసవైతసై#్మ వామనాయ మహాత్మనే. 47

పాణౌతుపతితేతోయే వామనో7భూదవామనః | సర్వదేవమయంరూపం దర్శయామాస తత్‌ క్షణాత్‌. 48

చంద్రసూర్యౌ తు నయనే ద్యౌః శిరశ్చరణౌ క్షితిః |

పాదాంగుల్యః పిశాచాస్తు హస్తాంగుల్యశ్చ గుహ్యకాః. 49

విశ్వేదేవాశ్చ జానుస్థాజం ఘే సాధ్యాః సురోత్తమాః | యక్షానఖేషుసంభూతా రేఖాస్వప్సరస స్తథా. 50

దృష్టిర్‌ ఋక్షాణ్యశేషాణి కేశాః సుర్యాంశవః ప్రభోః | తారకా రోమకూపాణి రోమేషు చ మహర్షయః. 51

బాహ వో విదిశస్తస్య దిశః శ్రోత్రే మహాత్మనః | అశ్వినౌశ్రవణ తస్య నాసా వాయుర్మహాత్మనః. 52

ప్రసాదేచంద్రమాదేవో మనోధర్మః సమాశ్రితః | సత్యమస్యాభవద్వాణీ జిహ్వా దేవీ సరస్వతీ. 53

గ్రీవా7దితిర్దేవమాతా విద్యాస్తద్వలయస్తథా | స్వర్గద్వారమభూన్‌ మైత్రం త్వష్టాపూషాచ వైభ్రువౌ. 54

ముఖేవైశ్వానరశ్చాస్య వృషణౌతు ప్రజాపతిః | హృదయంచపరం బ్రహ్మ పుంస్త్వం వైకశ్యపోమునిః. 55

పృష్ఠే7స్య వసవోదేవా మరుతః పర్వసంధిషు | వక్షఃస్థలేతథారుద్రో ధైర్యే చాస్య మహార్ణవ. 56

ఉదరేచాస్య గంధర్వా మరుతశ్చ మహాబలాః | లక్ష్మీర్మేధాధృతిః కాంతిః సర్వవిద్యాశ్చ వైకటిః. 57

సర్వజ్యోతీంషి యానీహ తపశ్చ పరమం మహత్‌ | తస్య దేవాదిదేవస్య తేజ ప్రోద్భూతముత్తమమ్‌. 58

బలి యిలా అన్నాడు. పదవీధారులలో శ్రేష్ఠుడా! మూడు పదాలనేలతో నీకేంలాభం? ఏ నూరువేల అడుగుల భూమియో అడుగుము. అందుకు వామనుడు బదులు చెప్పాడు. ఓ రాక్షసేశ్వరా! ఈ మాత్రం దానం నాకు చాలు. ఇంకా ఎందరో యాచకులున్నారు. వారలుకోరినవన్నీ యిచ్చి వేయుము. అంతట బలి వామనునకు అడిగినదిత్తునని మాటయిచ్చాడు. దానజలంచేతిలో పడగానే అంతవరుకు పొట్టిగానున్న ఆ ప్రభువు అవామనుడై గట్టివాడైనాడు. సర్వదేవమయమైన తన విరాడ్రూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపుడి నేత్రాలు చంద్ర సూర్యులు, శిరస్సుద్యులోకం, కాళ్ళు భూమి, పాదాంగు శులు పిశాచాలు, చేతులు వ్రేళ్లు యక్షులు, మోకాళ్ళు విశ్వదేవులు జంఘలు, గోళ్ళుయక్షులు, రేఖలు అప్సరోగణం, చూపులు నక్షత్రాలు, కేశాలు సూర్యకిరణాలు, తారలు రోమకూపాలు, ఆ రోమాలలో మహర్షులున్నారు. బాహువులు విదిశలు, శ్రోతృగుణందిశలు, అశ్వనీ దేవతలు బాహ్యశ్రవణాలు, నాసిక వాయువులు, ఆ మహాత్ముని అనుగ్రహం చంద్రుడు, మనస్సులో ధర్మదేవత, సత్యమాయన వాక్కు, సరస్వతి నాలుక, కంఠం దేవమాత ఆదితి, త్రయీవిద్య దానిలోని త్రివళులు, అనూరాధ స్వర్గద్వారం, కనుబొమలు త్వష్టపూషులు, నోరు వైశ్వానరాగ్ని, వృషణాలు ప్రజాపతులు, పర బ్రహ్మ హృదయం, పుంస్త్వం(మగటిమి) కశ్యపుడు, వీపుపసువులు, సకలసంధులు మరుత్తులు, వక్షోభాగంరుద్రుడు , ధృతి (సహనశక్తి) మహాసముద్రాలు, కడుపు గంధర్వులు, లక్ష్మి మేధాధృతి కాంతి సకల విద్యలు కటి ప్రదేశం. ఆ ప్రభువుయొక్క తేజస్సే సకలమైన గ్రహ నక్షత్రాదిజ్యోతిర్గణంగా వెలిగిపోతోంది.

తనౌకుక్షిషువేదాశ్చ జానునీచ మహామఖాః | ఇష్టయఃపశవశ్చాస్య ద్విజానాం చేష్టితానిచ.

59

తస్యదేవయమంరూపం దృష్ట్వా విష్ణోర్మహాత్మనః | ఉపసర్పంతితేదైత్యాః పతంగా ఇవ పావకమ్‌ . 60

చిక్షురస్తు మహాదైత్యః పాదాంగుష్ఠం గృహీతవాన్‌ | దంతాభ్యాంతస్యవైగ్రీవా మంగుష్ఠే నాహనద్దరిః. 61

ప్రమథ్యసర్వానసురాన్‌ పాదహస్తతలైర్విభుః | కృత్వారూపంమహాకాయం సంజహారాశు మేదినీమ్‌. 62

తస్యవిక్రమతోభూమిం చంద్రాదిత్యౌ స్తనాంతరే | నభోవిక్రమమాణస్య సక్థిదేశే స్థితావుభౌ.

63

పరం విక్రమమాణస్య జానుమూలే ప్రభాకరౌ | విష్ణోరాస్తాంస్థితసై#్యతౌ దేవపాలనకర్మణి.

64

జిత్వాలోకత్రయంతాంశ్చ హత్వాచాసురపుంగవాన్‌ | పురందరాయత్రైలోక్యం దదౌవిష్ణురురుక్రమః. 65

సుతలంనామపాతాళ మధస్తాధ్వసుధాతలాత్‌ | బలేర్దత్తంభగవతా విష్ణునాప్రభవిష్ణునా.

66

అథతైత్యేశ్వరం ప్రాహ విష్ణుఃసర్వేశ్వరేశ్వరః | యత్త్వయాసలిలందత్తం గృహీతంపాణినామయా. 67

కల్పప్రమాణంతస్మాత్తే భవిష్యత్యాయురుత్తమమ్‌ | వైవస్వతేతథా 7తీతే కాలేమన్వంతరే తథా. 68

సావర్ణికేతుసంప్రాప్తే భవానింద్రోభవిష్యతి | ఇదానీంభువనం సర్వం దత్తంశక్రాయవైపురా.

69

చతుర్యుగవ్యవస్థాచ సాధికాహ్యేకసప్తతిః | నియంతవ్యామయా సర్వే యే తస్యపరిపంథినః. 70

తేనాహంపరయాభక్త్యాపూర్వమారాధితో బలే | సుతలంనామ పాతాళం సమాసాద్య వచోమమ. 71

వసాసుర మమాదేశం యథావత్పరిపాలయన్‌ | తత్రదేవసుఖోపేతే ప్రాసాదశతసంకులే.

72

ప్రోత్ఫుల్లపద్మసరసి హ్రదశుద్దసరిద్వరే | సుగంధీ రూపంసంపన్నో వరాభరణభూషితః.

73

న్రక్చందనాదిదిగ్ధాంగో నృత్యగీతమనోహరాన్‌ | ఉపభుంజన్‌ మహాభోగాన్‌ వివిధాన్‌ దానవేశ్వర. 74

మమాజ్ఞయాకాలమిమం తిష్ఠ స్త్రీశతసంవృతః | యావత్సురైశ్చ విపై#్రశ్చ న విరోధంగమిష్యసి. 75

తావత్త్వం భుంక్ష్వ సంభోగాన్‌ సర్వకామ సమన్వితాన్‌ | యదాసురైశ్చవిపై#్రశ్చ విరోధం త్వం కరిష్యసి.

బందిష్యంతితదా పాశావారుణా ఘోరదర్శనాః. 76

నిగమాలన్నీ ఆయన శరీరంలో కుక్షిలో ఉన్నాయి. మహాయజ్ఞాలన్నీ యిష్టులు పశువు బ్రాహ్మణ కర్మలు మోకాళ్ళలో నిలిచాయి. మహాత్ముడగు విష్ణువుయొక్క ఆ సర్వదేవాత్మక విశ్వరూపాన్ని చూచి రాక్షసులందరు అగ్ని జ్వాలల్లోదూకే శంభాల్లాగా ఆయన మీదకు లంఘించారు, చిక్షురుడా ప్రభువు బొటన వ్రేలిని తన దంతాలతో పట్టుకోగా ఆహరి వానికంఠాన్ని ఆ కొన గోటితో త్రుంచి వేశాడు. ఆ విధంగా రాక్షసులందరను తన అరచేతులతో అరకాళ్ళతో నణగద్రొక్కి త్రివిక్రమరూపంతో విజృంభిచాడు. అడుగుతో భూమిని ఆక్రమించినపుడు సూర్య చంద్రులాయనస్తనాలమధ్య నిలచారు. ఆకాశాన్ని ఆక్రమించగా వారిద్దరు పిరుదుల వద్దకు దిగారు. యింకా పైభాగాన్ని ఆక్రమించగా ఆ సూర్యచంద్రులు మోకాళ్ళ క్రిందకు చేరారు. ఈవిధంగా దేవతల కార్యం సాధించుటకు ఆ విష్ణువు విరాడ్‌ రూపాన్ని ధరించి రాక్షస సంహారంగావించి త్రిలోక రాజ్యాన్ని పురందురునకిచ్చాడు. పరమ ప్రదాతయైన బలిరాజేంద్రునకు భూమికి క్రింద ఉన్న సుతలమనే పాతాళలోకాన్ని ప్రసాదించాడు. అంతట నాదైత్యపతితోయిలా అన్నాడు ఓ బలి రాజా! నీవిచ్చిన దానజలాన్ని నేను నాచేతితో గ్రహించాను. ఈ కారణంవల్ల నీకు కల్పాయుర్దాయము, ఉత్తమమైనది. చేకూరినది. ఇప్పుడు జరుగుతున్న వైవస్వతమన్వంతరం గడచిన తర్వాత రాబోవు సావర్జిమన్వంతరంలో నీవు యింద్ర పదవి పొందగలవు. ఈ లోపల సంభవించు డెబ్బదియొక్క చతుర్యుగ చక్రాల లోపల యింద్రుని నెదిరించు శత్రువులందరు నాచేత దండింపబడుతారుసుమా! ఎందుకంటే అతడు నన్ను పూర్వం ఎంతో భక్తితో ఆరాధించాడు కనుక నా ఆదేశానుసారం సుతల లోకానికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉండు. అక్కడ నీకు నూర్లుకొలది ఉత్తుంగసౌధాలు, కమలాకరాలు, ఉపవనాలు, చీనిచీరాంబరాలు రత్నభరణాదులు స్రక్చందనాది సకల సౌఖ్యాలు సమకూరుతవి. నృత్యగీతాది వినోదాలనుభవిస్తూ శతధిక సుందరీమణులతో విహరించ గలవు. దేవ బ్రాహ్మణులకు విరోధంగా ప్రవర్తించనంతకాలము నీవు అన్ని భోగాలు అనుభవించగలవు. అలాకాక దేవ బ్రాహ్మణులతో వైరం పెట్టుకొనినచో భయంకరమైనపరుణ పాశాలు నిన్ను బంధించ గలవు.

బలిరువాచ:

తత్రాసతో మే పాతాళే భగవన్‌ భవదాజ్ఞయా | కింభవిష్యత్యుపాదాన ముపభోగోపపాదకమ్‌.

అప్యాయితోయేనదేవఃస్మరేయం త్వమహం సదా. 77

శ్రీ భగవానువాచ ః

దానాన్యవిధిదత్తాని శ్రాద్దస్యశ్రోత్రియాణి చ | హుతాన్యశ్రద్ధయా యాని తాని దాస్యంతి తేఫలమ్‌. 78

అదక్షిణా స్తథా యజ్ఞాః క్రియాశ్చావిధినా కృతాః | ఫలానితవదాస్యంతి అధీతాన్యవ్రతాని చ.

79

ఉదకేన వినాపూజా వినాదర్భేణ యాక్రియా | ఆజ్యేనచ వినాహోమం ఫలం దాస్యంతి తేబలే. 80

యశ్చేందంస్థానమాశ్రిత్య క్రియాః కాశ్చిత్కరిష్యతి | న తత్ర చాసురోభాగో భవిష్యతి కదాచన. 81

జ్యేష్ఠాశ్రమే మహాపుణ్యతథా విష్ణుపదేహ్రదే | యేచశ్రాద్ధానిదాస్యంతి వ్రతం నియమమేవ చ. 82

క్రియాః కృత్వాచ యాఃకాచి ద్విధినా7విధినాపి వా | సర్వంతదక్షయంతస్య భవిష్యతి నసంశయః 83

జ్యేష్ఠేమాసిసితే పక్షే ఏకాదశ్యా ముపోషితః | ద్వాదశ్యాం వామనందృష్ట్వా స్నాత్వా విష్ణుపదేహ్రదే.

దానందత్వాయథాశక్త్యా ప్రాప్నోతి పరమం పదమ్‌. 84

లోమహర్షణ ఉవాచ :

బలేర్వరమిమం దత్వా శక్రాయచ త్రివిష్టపమ్‌ | వ్యాపినాతేనరూపేణ జగామాదర్శనం హరిః. 85

శశానచయథాపూర్వం ఇంద్రసై#్త్రలోక్యమూర్జితః | నిఃశేషంచతదాకాలం బలిః పాతాళమాస్థితః. 87

ఇత్యేతత్కథితంతస్య విష్ణోర్మాహాత్మ్య ముత్తమమ్‌ | వామనస్యశృణ్వన్‌ యస్తు సర్వపాపైః ప్రముచ్యతే. 87

బలిహ్రహ్లాదసంవాదం మంత్రితం బలిశుక్రయోః | బలేర్విష్ణోశ్చచరితం యేస్మరిష్యంతి మానవాః. 88

నాథయో వ్యాధయస్తేషాం నచ మోహాకులం మనః | భవిష్యతిద్విజశ్రేష్ఠాః పుంసస్తస్య కదాచన. 98

చ్యుతరాజ్యోనిజం రాజ్యమిష్టప్రాప్తిం వియోగవాన్‌ | సమాప్నోతి మహాభాగా నరః శ్రుతవా కథామిమామ్‌.

బ్రాహ్మణో వేదమాప్నోతి క్షత్రియో జయతే మహీమ్‌ | వైశ్యోధనసమృద్ధించ శూద్రః సుఖమవాప్నుయాత్‌|

వామనస్య చమహాత్మ్యం శృణున్‌ పాపైః ప్రముచ్యతే. 91

ఇతి శ్రీవామన మహాపురాణ సరోమాహాత్మ్యే దశమోధ్యాయః.

బలి యిలా అన్నాడు: భగవన్‌, నీ యాజ్ఞప్రకారం పాతాళంలో ఉన్ననాళ్ళు నిరంతరం నీ స్మరణచేస్తూ ఉండుటకు అచట నాకుతగిన భోగపదార్థములేవి గలవు ? అందులకు భగవంతుడిలా చెప్పాడు. ''ఓ బలిరాజా! బాగావినుము. అవిధిపూర్వకంగాచేసిన దానాలు, అవైదికంగా చేసిన శ్రాద్ధకర్మలు, శ్రద్ధలేకుండా చేసిన హోమాలు, వానిఫలం నీవు పొందగలవు. దక్షిణ యివ్వకుండాచేసిన యజ్ఞాలు, విధివిహితాలుకాని క్రియలు, బ్రహ్మచర్య దీక్షలేకుండాచేసిన వేదాధ్యయనాలు, ఉదకం లేకుండాచేసిన పూజలు, దర్భలేకుండా జరిగిన కర్మలు, నేయిలేని హోమాలు నీకుకావలసిన ఫలాన్నిస్తాయి. ఈ ప్రదేశాన చేయబడిన ఎలాంటికర్మలలోనూ అసురులకు హవిర్భాగాలుండవు. పరమపావనమైన జ్యేష్ఠాశ్రమంలో విష్ణుపద సరోవరంలో, నియమపూర్వకంగా యేయేశ్రాద్ధములాచరింపబడునో, విధివిధానంగాగాని, అవిధిపూర్వకంగాగాని చేయబడు సమస్తకర్మలకూ అక్షయఫలప్రాప్తి కలుగుతుంది. సందేహంలేదు. జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు పవసించి ద్వాదశినాడు వామనదర్శనం చేసికొని విష్ణు పదసరోవరంలో స్నానంచేసి తనశక్తికొలది దానంచేయుచో పరమపదప్రాప్తి లభించగలదు.'' రోమహర్షణుడు మునులతో యిలా అన్నాడు. మహర్షులారా ! శ్రీహరి ఈ విధంగా బలిరాజేంద్రునకు వరములు, శతకత్రువుకు స్వర్గరాజ్యాన్ని యిచ్చి తనవిశ్వరూపంతో అంతర్ధానం పొందాడు. ఇంద్రుడెప్పటివలె దర్పంతో ముల్లోకాలను పాలించాడు. గడువుపూర్తి అగునంతవరుకు బలిరాజేంద్రుడు పాతాళంలో ఉండిపోయాడు. ఇలాంటి వామనరూపియగు విష్ణుదేవుని మహాత్మ్యగాథ విన్న వారల పాపములు తొలగిపోవును. బలి ప్రహ్లాదుల సంవాదం, బలి శుక్రాచార్యుల మంత్రాలోచనము, బలివామన దేవుల చరిత్రము స్మరించిన వారలకెటువంటి ఆధులు వ్యాధులు, మనోవ్యథలు కలుగజాలవు. అధికారం, రాజ్యంకోలుపోయిన వారలకు తత్రాప్తి వియోగిజనులకు యిష్టజనుల సమాగమము, ఈకథాశ్రవణంచేయు మానవులకు లభించగలవు; బ్రాహ్మణులకు వేదవిద్య, క్షత్రియులకు భూమివిజయం వైశ్యులకు ధనసమృద్ధి శూద్రులకు సుఖప్రాప్తి కలుగును. శ్రీవామన దేవుని మహాత్మ్య శ్రవణం వల్ల సర్వపాపాలు నశించును.

ఇది శ్రీ వామన మహాపురాణంలోని సరోవరమాహాత్మ్యంలో పదవ అధ్యాయం సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters