Sri Vamana Mahapuranam    Chapters   

తొమ్మిదవ అధ్యాయము

లోమహర్షణ ఉవాచ :

ఇతి దైత్యపతిః శ్రుత్వా వచనం రౌద్రమప్రియమ్‌ | ప్రసాదయామాస గురుం ప్రణివత్య పునఃపునః. 1

బలిరువాచ :

ప్రసీద తాత : మాకోపం కురు మోహహతే మయి | బలావలేపమూధేన మయైతద్వాక్య మీరితమ్‌. 2

మోహాపహతవిజ్ఞానః పాపోహందితిజోత్తమ | యచ్ఛప్తో7స్మిదురాచార స్తత్సాధుభవతా కృతమ్‌. 3

రాజ్యభ్రంశంయశోభ్రంశం ప్రాస్స్యామీతి తతస్త్వహమ్‌ | విషణ్ణో7సి యథాతాత తథైవావినయే కృతే. 4

త్రైలోక్యరాజ్యమైశ్వర్య మన్యద్వానాతి దుర్లభమ్‌ | సంసారే దుర్లభాస్తాతః గురువోయేభవద్విధాః. 5

ప్రసీద తాతమాకోపం కర్తుమర్హసిదైత్యప | త్వత్కోపపరిదగ్ధో7హం పరితప్యేదివానిశమ్‌.

6

ప్రహ్లాద ఉవాచ :

వత్స : కోపేనమేమోహో జనితస్తేనతేమయా | శాపోదత్తోవివేకశ్చ మోహేనాపహృతో మమ. 7

యదిమోహేనమేజ్ఞానం నాక్షిప్తంస్యాన్మహాసుర | తత్కథంసర్వగంజానన్‌ హరింకచ్చిచ్ఛపామ్యహమ్‌. 8

యోయంశాపోమయాదత్తో భవతో7సురవుంగవ | భావ్యమేతేననూనంతే తస్మాత్త్వంమావిషీదవై. 9

ఆద్యప్రభృతిదేవేశే భగవత్యచ్యుతేహరౌ | భ##వేథాభక్తిమానీశే సతేత్రాతాభవిష్యతి. 10

శాపంప్రాప్యచమేవీర దేవేశఃసంస్మృతస్త్వయా | తథాతథావదిష్యామి శ్రేయస్త్వంప్రాప్స్యసేయథా. 11

రోమహర్షణుడిలా చెప్పనారంభించెను. ప్రహ్లాదుడు పలికిన క్రోధపూర్ణవచనాలు విని ఆ దైత్యేశ్వరు డాయనను ప్రసన్నుని గావించుకొనుటకై మాటిమాటికి మ్రొక్కి యిట్లనెను. పితామహా ! ప్రసన్నులుకండు ! మోహోపహతుడనైన నాపై కోపించకుడు. దేహబల గర్వంతో అలామాటాడినాను. దైత్యోత్తమా ! మూర్ఖత్వం నావివేకాన్ని వశింపజేసింది. నేను పాపిని దుర్మార్గుడను. నన్ను మీరు శపించుట మంచిదే. మీరు చెప్పినట్లు నా అవినయం వల్ల రాజ్యనాశానాన్నీ కీర్తినాశనాన్ని పొంది విషణ్ణుడవగుట నాకు యుక్తమే. త్రైలోక్యరాజ్యాధికారం యితర ఐశ్వర్యాలు సంపాదించుట కష్టమైన పనికాదు. కాని తమబోటి గురుజనులు లభించుట ఎంతో కష్టము. కనుక తాతా! నన్ను కరుణించి కోపించకుము. నీ కోపాగ్నిలో దగ్ధుడనై రాత్రింబవళ్ళు పరితపిస్తుంటాను.

అంతట ప్రహ్లాదుడిలా అన్నాడు. వత్సా ! కోపం నన్ను మూర్ఖుణ్ణి చేసింది. అంచేత వివేకం నశించి నిన్ను శపించాను. మోహంవల్ల నావివేకం నశింపకపోతే శ్రీహరి సర్వజ్ఞుడని తెలిసియూనేనెందుకు శపించాలి ? నేనిచ్చిన శాపం నీవనుభవింపక తప్పదు. అయితే విచారించవద్దు. ఈ క్షణాన్నుంచీ నాదేవదేవుని అచ్యుతుని భక్తితో ఆరాధించుము. ఆ ఈశ్వరుడు నిన్ను రక్షించగలడు. వీరాగ్రణీ ! నేను శపించినందున ఆదేవదేవుని నిరంతరస్మరణ నీకు లభించినది. నీభావిశ్రేయస్సుకు తగిన ఉపాయాలు నేను చెబుతూ ఉంటాను. భయపడకు.

లోమహర్షణ ఉవాచ :

అదితిర్వరమాసాద్య సర్వకామసమృద్ధిదమ్‌ | క్రమేణహ్యుదరేదేవో వృద్దింప్రాప్తోమహాయశాః. 13

తతోమాసే7థదశ##మే కాలేప్రసవఆగతే | ఆజాయతసగోవిందో భగవాన్‌ వామనాకృతిః.

అవతీర్ణేజగన్నాథే తస్మిన్‌ సర్వామరేశ్వరే | దేవాశ్చ ముముచుర్ధుఃఖం దేవమాతా7దితిస్తథా. 14

వవుర్వాతాఃసుఖస్పర్శా నీరజస్కమభూన్నభః | ధర్మేచ సర్వభూతానాం తదామతిరజాయత. 15

నోద్వేగశ్చాప్యభూద్దేహే మనుజానాంద్విజోత్తమాః | తథాహిసర్వభూతానాం ధర్మేమతిరజాయత. 16

సంజాతమాత్రం భగవాన్‌ బ్రహ్మాలోక పితామహః | జాతకర్మాదికం కృత్వాక్రియా స్తుష్టావచప్రభుమ్‌. 17

బ్రహ్మోవాచ :

జయాధీశః జయాజేయః జయవిశ్వగురోహరే ః | జయమృత్యుజరాతీతః జయానంతః జయాచ్యుత. 18

జయాజిత జయశేష జయవ్యక్తస్థితేజయ | పరమార్థార్థసర్వజ్ఞ జ్ఞానజ్ఞేయార్థనిఃసృత. 19

జయాశేష జగత్సాక్షిన్‌ జగత్కర్తర్జగద్గురో | జగతో7జగదంతేశ స్థితౌపాలయతే జయః . 20

జయా7ఖిలజయాశేష జయసర్వహృదిస్థిత | జయాదిమధ్యాంతమయ సర్వజ్ఞానమయోత్తమ. 21

ముముక్షుభిరనిర్దేశ్య నిత్యహృష్టజయేశ్వరః | యోగిభిర్ముక్తికామైస్తు దమాదిగుణభూషణ.

22

జయాతిసూక్ష్మదుర్జేయ జయస్థూలజగన్మయ | జయసూక్ష్మాతిసూక్ష్మత్వం జయానింద్రియసేంద్రియ. 23

జయస్వమాయాయోగస్థ శేషభోగజయాక్షర | జయైకందష్ట్రప్రాంతేన సముద్దృతవసుంధరః 24

నృకేసరిన్‌ ః సురారాతి వక్షఃస్థలవిదారణః | సాంప్రతం జయవిశ్వాత్మన్‌ మాయావామనకేశవః 25

నిజమాయాపరిచ్ఛిన్న జగద్ధాతర్జనార్దనః | జయాచింత్యజయానేక స్వరూపైకవిధప్రభో.

26

వర్ధస్వవర్ధితానేక వికారప్రకృతేహరే | త్వయ్యేషాజగతామీశే సంస్థితాధర్మపద్ధతిః. 27

సత్వమహంనచేశానో నేంద్రాద్యాస్త్రిదశాహరే | జ్ఞాతుమీశాన మునయః సనకాద్యానయోగినః. 28

త్వంమాయాపటనంవీతో జగత్యత్రజగత్పతే | కస్త్వాంవేత్స్యతిసర్వేశ త్వత్ర్పసాదంవినానరః? 29

త్వమేవారాధితోయస్య ప్రసాదసుముఖఃప్రభో | స ఏవ కేవలందేవం వేత్తిత్వాంనేతరోజనః.

30

తదీశ్వరేశ్వరేశాన విభోవర్ధస్వభావన | ప్రభావాయాస్యవిశ్వస్యభావన | ప్రభావాయాస్యవిశ్వస్య విశ్వాత్మన్‌ పృథులోచనః 31

లోహమర్షణుడిలా చెప్పాడు - మహర్షులారా ! సకల కామదాయియయిన వరం పొందిన వెంటనే అదితి గర్భంలో దేవదేవుడు క్రమంగా పెరగడం మొదలు పెట్టాడు. పదవ నెలలో ప్రసవ సమయాన భగవంతుడగు గోవిందుడు వామనాకృతితో జన్మించాడు. ప్రభువు అవతార సమయాన దేవతలకు దేవమాతకు సకల దుఃఖాలు తొలగిపోయాయి. వాయువులు సుఖ స్పర్శతో వీచాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. సకల జీవులలోను ధర్మాసక్తి పెరిగింది. మానవులకు శరీర బాధలు తొలగి పోయాయి. భగవంతుడు జన్మించిన వెంటనే లోకపితామహుడైన విరించివచ్చి ఆయనకు జాతకర్మాదులు చేసి యీ విధంగా స్తోత్రం చేశాడు.

సర్వాధీశా! సర్వాజేయా, నీకు జయమగుగాక, విశ్వగురూ నీకు జయము. శ్రీహరి, జన్మమృత్యుజరాతీతా, అచ్యుతా జయము జయము! అశేషా, అవ్యక్తరూపా, సర్వజ్ఞా, పరమార్థరూపా, జ్ఞానజ్ఞేయసారరూపా, జగత్సాక్షీ, జగత్కారణా, జగద్గురో, జగత్‌ స్థితిపాలకా నీకు జయమగుగాక ! సకల జీవహృదయ నివాసా, ఆదిమధ్యాంతమయా, జ్ఞానమయా! ముముక్షువులకుగూడ నిర్దేశించినలవిగానివాడా, నిత్యహృష్టా, దయాదిసద్గుఱభూషణా, అతిసూక్ష్మా, స్థూలా, దుర్జేయా సర్వమయాజయము. ఇంద్రియరూపా, యింద్రియరహితా, స్వమాయా యోగస్థితా , శేషశాయి నీకు జయము జయము ! నిజదంష్ట్రాగ్రభాగాన వసుంధరను నిలిపినప్రభూ, నృకేసరీ, దేవశత్రు వక్షఃస్థల విదారణా ప్రస్తుతంకపటవామన రూపందాల్చిన విశ్వాత్మకా కేశవా నీకు జయము. స్వీయమాయాపరిచ్ఛిన్నా! జగద్ధారకా, జనార్దనా, అనేక స్వరూపాలలో వెలిగే ఏకైకతత్వమా, బహువిధ ప్రకృతి వికృతుల పెంపొందిచువాడా నీకు జయము. నీవు వర్థిల్లుము. జగదీశుడవగు నీవు ధర్మానికి మూలాధారుడవు. ఇలాంటి నిన్ను నేనుగాని ఈశుడుగాని ఇంద్రాది దేవతలు గాని సనకాది మునులు యోగులుగాని తెలియజాలరు. నీవు స్వీయమాయ అనే తెరమరుగున ఉంటావు, అలాంటి మాయాపతిని నిన్నెరుగ గలవారెవ్వరు? నీ అనుగ్రహం కలిగినవాడే నిన్నెరుగ గలడు. నిన్నారాధించి నీ కృపకు పాత్రుడగువాడే నిన్ను గుర్తించును. ఓ ఈశానా, ఈశ్వరేశ్వర భూతభావనా వర్థిల్లుము. ఓ విశాలనేత్రా ! విశ్వాత్మా ! విశ్వకల్యాణార్థం నీవు వర్థిల్లుము. ఓ విశాలనేత్రా! విశ్వకల్యాణార్థం నీవు వర్థిల్లుము. నీకు జయమగుగాక !

లోమహర్షణ ఉవాచ :

ఏవంస్తుతోహృషీకేశః సతదావామనాకృతిః | ప్రహస్యభావగంభీర మువాచారూఢసంపదమ్‌. 32

స్తుతో7హంభవతాపూర్వ మింద్రాద్యైః కశ్యపేనచ |

మయాచవః ప్రతిజ్ఞాత మింద్రస్య భువనత్రయమ్‌. 33

భూయశ్చా7హంస్తుతో దిత్యా తస్యాశ్చాపిమయాశ్రుతమ్‌|

యథాశక్రాయదాస్యామి త్రైలోక్యం హతక్యంటకమ్‌. 34

సో7హం తథా కరిష్యామి యథేంద్రోజగతఃపతిః | భవిష్యతి సహస్రాక్షః సత్యమేతద్‌ బ్రవీమివః. 35

తతకృష్ణాజినం బ్రహ్మా హృషీకేశాయదత్తవాన్‌ | యజ్ఞోపవీతంభగవాన్‌ దదౌతస్యబృహస్పతిః. 36

ఆషాడమదదాద్దండం మరీచిర్బ్రహ్మణఃసుతః|

కమండలుంవసిష్ఠశ్చ కౌశంచీరమథాంగిరాః | ఆసనం చైవపులహః పులస్త్యఃపీతవాససీ. 37

ఉపతస్థుశ్చతంవేదాః ప్రణవస్వరభూషణాః | శాస్త్రాణ్యశేషాణితథా సాంఖ్యయోగోక్తయశ్చయాః. 38

సవామనోజటీదండీ ఛత్రీధృతకమండలుః | సర్వదేవమయోదేవో బలేరధ్వరమభ్యగాత్‌.

39

యత్రయత్రవదంవిప్రా, భూభాగేవామనోదదౌ | దదాతిభూమిర్వివరం తత్రతత్రాభిపీడితా.

40

సవామనోజడగతి ర్మృదుగచ్ఛన్‌సపర్వతామ్‌ | సాబ్దిద్వీపతీంసర్వాం చాలయామాసమేదినీమ్‌. 41

బృహస్పతిస్తుశనకై ర్మార్గందర్శయతేశుభమ్‌ తథా క్రీడావినోదార్థ మతిజాడ్యగతో7భవత్‌.

42

తతఃశేషోమహానాగో నిఃసృత్యాసౌరసాతలాత్‌ | సాహాయ్యం కల్పయామాస దేవదేవస్యచక్రిణః. 43

తదద్యాపిచవిఖ్యాత మహేర్బిలమనుత్తమమ్‌ | తస్యసందర్శనాదేవ నాగేభ్యోనభయంభ##వేత్‌. 44

శ్రీవామనమహాపురాణ సరోమహాత్మ్యే నవమో7ధ్యాయః.

లోమహర్షణుడు చెప్పమొదలుపెట్టాడు: బ్రహ్మస్తోత్రంవిని వామనాకృతి దాల్చిన ఆ హృషీకేశుడు చిరునవ్వునవ్వి భావగంభీరముగా నిట్లనెను. విరించీ ! నీవు యింద్రాదులు కశ్యపుడు పూర్వంనన్ను స్తుతించగా యింద్రునకు ముల్లోకాలు యిస్తానని ప్రతిజ్ఞచేసియున్నాను. తర్వాత అదితి స్తోత్రంవిని ఆమెకూ, శక్రునకు త్రిలోకాధిపత్యం యిస్తానని మాటయిచ్చి యున్నాను. ఇంద్రుని జగత్తుకు అధిపతినిచేసి ఆమాట నిలబెట్టుకుంటాను. సహస్రాక్షుడు రాజగుట తథ్యము.

అంతట పొట్టివడుగునకు బ్రహ్మకృష్ణాజినం బృహస్పతి యజ్ఞోపవీతం బ్రహ్మతనయుడు మరీచి ఆషాఢదండాన్ని వసిష్ఠుడు కమండలం అంగిరసులు పట్టుపుట్టము, పులహుడు ఆసనం పులస్త్యుడు పీతాంబరం యిచ్చారు. ప్రణవ ఓంకారం, స్వరాలచేత ముస్తాబై సకలవేదాలు, శాస్త్రాలు సాంఖ్యయోగ విద్యలు ఆ ప్రభువును ఆశ్రయించాయి. జడలు, దండకమండలు ఛత్రాలు ధరించి సర్వదేవమయుడైన ఆ వామనుడు బలియజ్ఞ వాటికలో ప్రవేశించెను. ఆ పొట్టివాడు తన చిట్టిఅడుగు పెట్టినచోటల్లా భూమిపీడితురాలై వివరం (రంధ్రం) యిచ్చింది. అలామెల్లగా అడుగు పెడుతూ నావామనుడు నడువగా సముద్ర పర్వత ద్వీపాదులతోకూడిన భూమి అంతా కంపించింది. బృహస్పతి మెల్లమెల్లగా శివంకరమైన చక్కనిమార్గంచూపిస్తూ ఉండగా నాకుహనావలుపు ఆటంలోవలె సరదాగా అతిమందగమనంతో పయనించాడు. అంతట పాతాళాన్నుంచి మహానాగం శేషుడు బయలుదేరివచ్చి దేవదేవుడైన నాచక్రితోడైనాడు. ఆ ఉత్తమమైన శేషబిలం ఈనాటికీ ప్రసిద్ధివహించియున్నది. దానిని చూచినవారలకు సర్పభయం ఉండదు.

ఇది శ్రీ వామన మహా పురాణంలోని సరోమహాత్మ్యంలో తొమ్మిదవ అధ్యాయము సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters