Sri Vamana Mahapuranam    Chapters   

ఎనిమిదవ అధ్యాయము

రోమహర్షణ ఉవాచ :

నిస్తేజసోసురాన్‌ దృష్ట్వా సమస్తానసురేశ్వర ః | ప్రహ్లాదమథపప్రచ్ఛ బలిరాత్మపితామహమ్‌. 1

బలిరువాచ :

తాత ః నిస్తేజసోదైత్యా నిర్దగ్దాఇవవహ్నినా | కిమేతేసహసైవాద్య బ్రహ్మదండహతా ఇవ ? 2

దురిష్టం కిముదైత్యానాం కిం కృత్యా విధినిర్మితా | నాశాయైషాం సమూధ్భూతా యేననిస్తేజసోసురాః. 3

లోమహర్షన ఉవాచ :

ఇత్యసురవస్తేన పృష్టః పౌత్రేణ బ్రాహ్మణాః | చిరంధ్యాత్వా జగాదేదమసురం తం తదాబలిమ్‌. 4

ప్రహ్లాద ఉవాచ :

చలంది గిరయో భూమి ర్జహాతి సహసాధృతిమ్‌ | నద్యఃసముద్రాఃక్షుభితా దైత్యా నిస్తేజసః కృతాః 5

సూర్యోదయేయథాపూర్వం తథా గచ్ఛంతి న గ్రహాః | దేవానాంచపరాలక్ష్మీః కారాణనాసుమీయతే.6

మహాదేతన్మమహాబాహో కారణం దానవేశ్వరః | నహ్యల్పమితిమంతవ్యం త్వయాకార్యం కథంచన. 7

రోమహర్షణ ఉవాచ :

ఇత్యుక్తోదానవపతిం ప్రహ్లాదః సోసురోత్తమః | అత్యర్థభక్తోదేవేశం జగామ మనసాహరిమ్‌. 8

స ధ్యానపథగం కృత్వా ప్రహ్లాదశ్చ మనోసురః | విచారయామాసతతో యథాదేవో జనార్దనః. 9

సదదర్శోదరేదిత్యాఃప్రహ్లాదో వామనాకృతిమ్‌ | తదంతవ్చవసూన్‌ రుద్రానశ్వినో మరుతస్తథా. 10

సాధ్యాన్‌ విశ్వేతథాదిత్యాన్‌ గంధర్వోరగరాక్షసాన్‌ | విరోచనంచతనయం బలిం చాసురనాయకమ్‌. 11

జంభంకుజంభంనరకం బాణమన్యాం స్తథాసురాన్‌ | ఆత్మానముర్వీంగగనం వాయుం వారి హుతాశనమ్‌. 12

నముద్రాద్రిసరిద్‌ ద్వీపాన్‌ సరాంసిచ పశూన్‌ మహీమ | వయోమనుష్యానఖిలాం స్తథైవచ సరీసృపాన్‌. 13

సమస్తలోకస్రష్టారం బ్రహ్మాణం భవమేవచ | గ్రహనక్షత్రతారాశ్ఛ ప్రజాపతీన్‌. 14

సంపశ్యన్‌ విస్యయావిష్టః ప్రకృతిస్ధః క్షణాత్పునః | ప్రహ్లాదః ప్రాహదైత్యేంద్రం బలిం వైరోచనింతతః. 15

తత్సంజ్ఞాతంమయా సర్వం యదర్థం భవతామియమ్‌ | తేజసోహానిరత్పన్నా శృణ్వంతు తదశేషతః. 16

రోమహర్షణుడు చెప్పనారంభించాడు. ఓ విప్రులారా ! తనవారావిధంగా తేజోహీనులగుటచూచి రాక్షసేశ్వరుడైన బలి తన తాతయైన ప్రహ్లాదుని యిలా ప్రశ్నించాడు. పితామహా ! మనవారలైన దైత్యులందరు అగ్ని దగ్గులయినట్లు తేజస్సు కోల్పోయినారు. ఆకస్మికంగా మనవారు బ్రహ్మదండ తాడితులయినారా ఏమి ? అది వారలదురృష్టమా లేక దైత్యవంశనాశనానికి విధి ప్రయోగించిన అభిచారకృత్యా ప్రయోగమా ? ఇందులకు కారణమేమి? బ్రహ్మణులారా ! మనుమడువేసిన ప్రశ్నవిని ప్రహ్లాదుడు బాగాఆలోచించి ఆతనితో నిట్లనియెను. కొండలు కదలాడుతున్నవి. భూమి తన స్థైర్యాన్ని కోలుపోతున్నది. ఉన్నట్టుండి సాగరాలు క్షోభిస్తున్నాయి. దైత్యులు నిస్తేజులవుతున్నారు. సూర్యోదయ సమయాన ఎప్పటిమాదిరి గ్రహాలు తమతమ కక్ష్యలలో నడవడంలేదు. చూడగా యిది దేవతలకభ్యుదయ కాలమనిపిస్తోంది. ఈ ఉత్పాతాలకు ఏదో పెద్ద కారణమే ఉండాలి. దీనిని మనం తేలికగా త్రోసివేయకూడదు. దానవేశ్వరుడగు బలితో యిలా చెప్పి అసురోత్తముడుగు ప్రహ్లాదుడు ఏకాగ్రచిత్తంతో మనోజగత్తులో శ్రీహరిని వెదకనారంభించాడు. అలా ధ్యానపరుడైన ఆ ప్రహ్లాదునకు ఆదితి గర్భస్థుడై వామనాకృతిలోనున్న బాలుడు కనిపించెను. ఆ చిన్న శిశువులో వసువుల రుద్రాశ్వినులు, మరుత్తులు, సాధ్యులు విశ్వేదేవుల ఆదిత్యులు గందర్వోరగ రాక్షసులు, విరోచనుడు ఆయన కుమారుడు బలి, జంభ, కుజంభ నరకబాణాది అన్యరాక్షసులు, తనతోబాటు పంచభూతాలు సాగర సరిద్‌ ద్వీప సరోవరాలు నరమృగ పక్ష్యాదులు సరీసృపాదులతోకూడిన భూమండలం, విధాతయైన బ్రహ్మ, భవుడు గ్రహనక్షత్రాది జ్యోతిర్మండలం దక్షాది ప్రజాపతులు మొదలు సమస్త విశ్వాన్ని చూచి ఆశ్చర్యచకితుడై వెంటనే ప్రకృతిస్థుడై ఆ ప్రహ్లాదుడు దైత్యరాజు బలితో యిలా అన్నాడు.

రాజా! నీవు మీవారలు తేజోహీనులగుటకు కారణం నేను తెలుసుకున్నాను. దానిని సాకల్యంగా వినుము.

దేవదేవోజగద్యోని రయోనిర్జగదాదిజః | అనదిరాదిర్విశ్వస్య వరేణ్యో వరదోహరిః. 17

పరావరాణాంపరమః పరాపరసతాంగతిః | ప్రభుఃప్రమాణం మానానాం సప్తలోకగురోర్గురుః.

స్థితింకర్తుంజగన్నాథః సోచింత్యోగర్భతాంగతః. 18

ప్రభుఃప్రభూణాం పరమఃపరాణా మనాదిమధ్యోభగవాననంతః |

త్రైలోక్యమం శేనసనాథమేకః కర్తుంమహాత్మాదితిజోవతీర్ణః . 19

నయస్యరుద్రోనచపద్మయోని ర్నేంద్రోన సూర్యేందుమరీచిమిశ్రాః |

జానంతి దైత్యాధిపయత్స్వరూపం సవాసుదేవః కలయావతీర్ణః. 20

యమక్షరం వేదవిదో వదంతి విశంతియం జ్ఞానవిదూతపాపాః.

యస్మిన్‌ ప్రవిష్టానపునర్భవంతి తంవాసుదేవం ప్రణమామి దేవమ్‌.

భూతాన్యశేషాని యతోభవంతి యథోర్మయస్తోయనిధేరజస్రమ్‌ |

లయంచయస్మిన్‌ ప్రలయే ప్రయాంతి తంవాసుదేవం ప్రణతోస్మ్యచింత్యమ్‌.

నయస్యరూపంనబలం ప్రభావో నచప్రతాపః పరమస్యపుంసః |

విజాయతేసర్వపితామహాద్యై స్తంవాసుదేవం ప్రణమామి నిత్యమ్‌.

రూపస్యచక్షుర్గ్రహణత్వగేషా స్పర్శగ్రహిత్రీరసనారసస్య |

ఘ్రాణంచగంధగ్రహణనియుక్తం నష్రూణచక్షుః శ్రవణాదితస్య.

స్వయంప్రకాశః పరమార్థతోయః సర్వేశ్వరోవేదితవ్యః సయుక్త్యా |

శక్యం తమీడ్యమనఘంచదేవం గ్రాహ్యంనతోహం హరిమీశితారమ్‌.

యేనైకదంష్ట్రేణసముద్ధృతేయం ధరాచలాధారయతీహసర్వమ్‌ |

శేతేగ్రసిత్వాసకలంజగద్య స్తమీడ్యమీశం ప్రణతోస్మివిష్ణుమ్‌.

అంశావతీర్ణేనచయేనగర్భే హృతానితేజాంసి మహాసురాణామ్‌ |

నమామితందేవమనంత మీశమశేషసంసారతరోః కుఠారమ్‌.

దేవోజగద్యోనిరయంమహాత్మా సషోడశాంశేనమహాసురేంద్రాః |

సురేంద్రమాతుర్జఠరంప్రవిష్టో హృతానివస్తేన బలం వపూంషి.

అయోని, జగద్యోని, దేవదేవుడు, జగత్తుకుముందు పుట్టినవాడు మొదలులేనివాడు, విశ్వానికి మొదలయినవాడు వరదాతలలో శ్రేష్ఠుడు శ్రీహరి, పరావరేశ్వరుడు అందరకు పరమగతియగువాడు, సమస్తమైనమానము (కొలత)లకు ప్రమాణం ఈరేడు లోకాధిపతులకు అధిపతి అయిన ఆ జగన్నాథుడు ఊహకందని ప్రభువు విశ్వస్థితి (వ్యవస్థ) నుద్ధరించుటకై సామాన్యునివలె గర్భస్థుడైనాడు! ప్రభువులకు ప్రభువు, పరములకు పరముడు తుద నడిమి చివర అంటూలేని భగవంతుడు, తన కలాంశతో ముల్లోకాలను సనాధం చేయుటకై అదితి గర్భంలో అవతరించాడు! ఓ దైత్యపతీ : డుద్రుడు బ్రహ్మ యింద్రుడు సూర్య చంద్ర మరీచ్యాదులు ఏ అప్రమేయుని స్వరూపం తెలియజాలకున్నారో ఆ వాసుదేవుడు తన ఆంశతో అవతరించాడు. వేదవిదులెవ్వని నాశ రహితుడని చెప్పుదురో, జ్ఞానాగ్నిదగ్ధపాపులెవనిలో లయమందుదురో, ఎవనిలో లయించిన వారు మరల జన్మించరో అట్టివాసుదేవ పరమాత్మకు ప్రణామములు. అనంతమైన జీవరాసులెవనినుండి సముద్రంలోలేచే కెరటాలులాగా నిరంతరం ఉద్భవిస్తూ ఉంటాయో, మరల యేదివ్యతత్త్వంలో అవన్నీ లయమైపోవునో అట్టిఅచింత్య స్వభావుడగు వాసుదేవునకు నమస్సులు. ఎవనిరూప బలప్రభావాలు, ప్రతాపశౌర్యాలు సర్వబ్రహ్మాదులుకూడ తెలియలేరో అట్టిపరమపురుషుడగు వాసుదేవునకు ప్రణామాలు. ఎవడు కన్నులకు రూపగ్రహణశక్తిని చర్మమునకు స్పర్శశక్తి, నాలుకకు రసగ్రాహిత్వం ముక్కుకు వాసనచూచుశక్తినీ ప్రదానంచేస్తూ తాను ఆ ఘ్రాణ చక్షుః శ్రవణాలు లేకుండా ఉంటాడో పరమార్థదృష్టితో చూస్తే ఎవడు స్వయంప్రకాశియో, సర్వేశ్వరుడో, యుక్తిచేత తెలియదగిన శరణ్యుడోపాపరహితుడో అట్టిపూజనీయుడగు శ్రీహరికి పరమ ప్రభువుకు నమస్కరించుచున్నాను. ఏ శక్తి సంపన్నుడీభూమినంతనూ ఒక్కపంటితో ఎత్తినాడో, సకలసృష్టినీ ధరించుచున్నాడో, మరల ఈ ఇగత్తునంతనూ తనలోకి చేర్చుకొని యోగనిద్రలో ఉంటాడో అట్టిపూజ్యుడగు విష్ణుదేవునకు ప్రణామం చేస్తున్నాను. మాతృగర్భంలో కలాంశతో ప్రవేశించిన మాత్రాన్నే మహాదైత్యయోధుల తేజస్సునంతటినీ ఎవడు హరించివైచెనో, అట్టి అనంతునకు ఈశ్వరునకు సంసారవృక్షాన్ని ఛేదించే కుఠారరూపి అయిన ప్రభువుకు నమస్సులు. ఓ రాక్షసేంద్రులారా! అలాంటి జగత్ప్రభుడైన దేవదేవుడు తన పదునారవ కలాంశతో దేవమాత అదితి గర్భగతుడైనాడు. అతడే మీ తేజోబలాలను హరించియున్నాడు.

బలిరువాచ :

తాతః కో7యం హరిర్నామ యతో నో భయమాగతమ్‌ | సంతిమేశతశోదైత్యా వాసుదేవబలాధికాః. 29

విప్రచిత్తిఃశిబిః శంకురయఃశంకు స్తథైవచ | హయశిరాఅశ్వశిరా భంగకారో మహాహనుః. 30

ప్రతాపీప్రఘసః శంభుః కుక్కురాక్షశ్చదుర్జయః | ఏతేచాన్యేచమేసంతి దైతేయా దానవా స్తథా. 31

మహాబలామహావీర్యా భూభారధరణక్షమాః | ఏషామేకైకశఃకృష్ణో నవీర్యార్థేన సంమితః. 32

లోమహర్షణ ఉవాచ :

పౌత్రసై#్యతద్వచః శ్రుత్వా ప్రహ్లాదో దైత్యసత్తమః | సక్రోధశ్చబలిం ప్రాహవై కుంఠాక్షేపవాదినమ్‌. 33

వినాశముపయాస్యంతి దైత్యాయేచాపి దానవాః | ఏషాంత్వమీదృశోరాజా దుర్భుద్ధిరవివేకవాన్‌. 34

దేవదేవంమహాభాగం వాసుదేమజం విభుమ్‌ | త్వామృతేపాపసంకల్పః కో7న్య ఏవం వదిష్యతి ? 35

యఏతేభవతా ప్రోక్తాః సమస్తాదైత్యదానవాః | నబ్రహ్మాకాస్తథాదేవాః స్థావరాంతా విభూతయః. 36

త్వంచాహంచజగచ్చేదం సాద్రిద్రుమనదీవనమ్‌ | ససముద్రద్వీపలోకో7యం యశ్చేదం సచరాచరమ్‌. 37

యస్యాభివాద్యవంద్యస్య వ్యాపినఃపరమాత్మనః | ఏకాంశాంశకలాజన్మ కస్తమేవంప్రవక్ష్యతి. 38

ఋతేవినాశాభిముఖం త్వామేకమవివేకినమ్‌ | దుర్భుద్ధిమజితాత్మానం వృద్ధానాం శాసనాతిగమ్‌. 39

శోచ్యో7హంయస్యమేగేహే జాతస్తవ పితా7ధమః | యస్యత్వమీదృశః పుత్రో దేవదేవావమానకః. 40

తిష్ఠత్వనేకసంసారసంఘాతౌఘ వినాశిని | కృష్ణేభక్తిరహంతావదవేక్ష్యో భవతా నకిమ్‌ ?

41

నమేప్రియతరః కృష్ణాదపి దేహో7యమాత్మనః | ఇతిజానాత్యయం లోకోభవాంశ్చ దితినందన. 42

జానన్నపిప్రియతరం ప్రాణభ్యో7పి హరింమమ | నిందాంకరోషితస్యత్వ మకుర్వన్‌ గౌరవంమమ. 43

విరోచనస్తవగురు ర్గురుస్తస్యాప్యహం బలేః | మమాపి సర్వజగతాం గురుర్నారాయణోహరిః. 44

నిందాంకరోషి తస్మింస్త్వం కృష్ణే గురుగురోర్గురౌ | యస్మాత్తస్మాదిహైవ త్వమైశ్వర్యాద్‌ భ్రంశ##మేష్యసి. 45

సదేవోజగతాం నాథోబలే ప్రభుర్జనార్దనః | నన్వహంప్రత్యవేక్ష్యస్తే భక్తిమానత్రమేగురుః.

46

ఏతావన్మాత్రమప్యత్ర నిందాతాజగతోగురుమ్‌ | నాపేక్షితస్త్వయాయస్మా త్తస్మాచ్ఛాపందదామితే. 47

యథామేశిరసశ్ఛేదా దిదంగురుతరంబలేః | త్వయోక్తమచ్యుతాక్షేపం రాజ్యభ్రష్టస్తథాపత.

48

యథానకృష్ణాదపరః పరిత్రాణం భవార్ణవే | తథా7చిరేణపశ్యేయం భవంతంరాజ్యవిచ్యుతమ్‌ః 49

ఇది శ్రీ వామనమహాపురాణ సరోమాహాత్మ్యే అష్టమో7ధ్యాయః.

బలియిలా అన్నాడు - తాతా! మనకు భయోత్పాతకుడైన ఆ హరి ఇంతకూ ఎవడు ? ఆ వాసుదేవుని మించిన బలాఢ్యులు నావద్ద ఎందరో ఉన్నారు. విప్రచిత్తి, శిబి, అయఃశంకు, అశ్వశిరుడు, హయశిరుడు, భంగకారుడు మహాహనువు, ప్రతాపి, ప్రఘసుడు, శంభువు కుక్కురాక్షుడు దుర్జయుడు యింకా ఎందరెందరో మొనగాళ్ళు దైత్యదానవులున్నారు. వీరందరు మహాబలవీర్య సంపన్నులు భూమిభారాన్నంత మోయ సమర్థులు. వీరిలో ఏ ఒక్కరి సగంబలానికి గూడ కృష్ణుడు సరిపోలడు.

మనుమడి మాటలు వింటూనే దైత్యసత్తముడు ప్రహ్లాదుడా వైకుంఠపతిని దూషిస్తున్న బలిని చురచుర చూస్తూ యిలా గర్జించాడు. దైత్యదానవులకు వినాశకాలం సమీపించినది. కనుకనే నీకీవిపరీత బుద్ధి దాపురించినది. నీవంటి పాప సంకల్పుడైన రాజనామధారి తప్ప ఆదేవ దేవుని, జగద్విభుని, ఆజుడు మహాభాగుడగు వాసుదేవుని గూర్చి యిలాంటి వాక్యాలు, మరెవ్వడూ నోటరానీయడు. నీవుచెప్పుకున్న ఈ దైత్య దైనవులు, బ్రహ్మాది దేవతలు, జంగమస్థావవరాంతాలైనవిభూతులు, నీవు, నేను, గిరివననదీ సముద్రద్వీపాదులతో కూడిన చరాచర జగత్తంతయూ, ఆవిశ్వవంద్యుడూ సర్వవ్యాపీ అయిన పరమాత్మ యొక్క అల్పాంశం నుండి ప్రభవించినది. నీవు తప్ప ఆదేవదేవుని గురించి యిలా ఎవడు మాటాడగలడు? సర్వనాశనం దిశగా పరుగిడుతున్న అవివేకివీ దుర్భుద్ధివీ, అహంకారివీ, గురుజనశాసనా తిక్రముడవునగు నీవు మాత్రమే ఇలా ప్రేలదగియున్నావు ! నేనెంత దౌర్భాగ్యుడను! నీవంటి దేవావమానిని కన్న అధమునకు తండ్రిననిపించుకున్నాను. అనంతమైన సంసారపాశ సంఘాలను తెగటార్చే కృష్ణునిపట్లభక్తి విషయం అలావదలి వేద్దాం. నాపట్లనైనా నీకు కించిత్తు గౌరవం ఉండవద్దా: నాయీ దేహం కన్నా నాకు కృష్ణుడే ప్రియుడనే విషయం లోకమంతా ఎరుగును, నీకు గూడ తెలుసు. శ్రీహరి నాకు ప్రాణాలకంటె ఎక్కువన్న విషయం తెలిసి కూడ నా పెద్దరికాన్ని మంట గలిపి ఆ మహనీయుని నిందించావు. ఓ బలీ ! రాక్షసా ! విరోచనుడు నీకు గురువు. వానికి తండ్రి అయిన నేను గురువును. జగత్తుకంతకూ గురుడైన ఆనారాయణుడు అలాంటి నాకుగురువు. అలాంటి సర్వగురువులకు గురులైన హరిని నీవు నిందించావు. కాబట్టి నీవైశ్యర్య పదవినుంచి భ్రంశం పొందుతావు ! బలిరాజా! ఆజనార్దనుడు సర్వలోకాధినాధుడు నేను నీకు గురువును కనుక, నీవునన్నవమానించరాదు. ఈ మర్యాదలనన్నింటి నీకాలదన్ని ఆజగద్గురువును నిందించిన నీవు శాపార్హుడవు. నీవాడిననిందా వాక్యాలు నాకు తలగొట్టిన దానికన్నా ఎక్కువ అవమానకారణాలు. కాబట్టి నీవు రాజ్య భ్రష్టుడవై పతనం పొందగలవని యిదిగో శపిస్తున్నాను. ఈ సంసారసముద్రం దాటడానికి కృష్ణుని మించిన నావలేదు. ఇక నేను అచిరకాలాన్నే నీవు రాజ్యాన్ని కోలుపోవుట చూడగలను.

ఇది శ్రీ వామన మహాపురాణంలో సరోమాహత్మ్యంలో ఎనిమిదవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters