Sri Vamana Mahapuranam    Chapters   

నాలుగవ అధ్యాయము

బ్రహ్మోవాచ :

యదర్తమిహ సంప్రాప్తా భవంతః సర్వఏవహి | చింతయామ్యహమప్యగ్రే తదర్థంచమహాబలాః. 1

భవిష్యతి చ వః సర్వం కాంక్షితం యత్సురోత్తమాః | బలేర్దానవముఖ్యస్య యోస్య జేతా భవిష్యతి. 2

నకేవలం సురాదీనాం గతిర్మమ స విశ్వకృత్‌ | త్త్రెలోక్యస్యాపినేతాచ దేవానామపి సప్రభుః.3

యఃప్రభుః సర్వలోకానాం విశ్వేశశ్చసనాతనః | పూర్వజోయం సదాప్యాహు రాదిదేవం సనాతనమ్‌. 4

తందేవాపి మమాత్మానం నవిదుః కోప్యసావితి | దేవానస్మాన్‌ శ్రుతి విశ్వం సవేత్తి పురుషోత్తమః. 5

తసై#్యవతుప్రసాదేన ప్రవక్ష్యే పరమాంగతిమ్‌ | యత్రయోగంసమాస్థాయ తపశ్చరతి దుశ్చరమ్‌. 6

క్షీరోదస్యోత్తరే కూలే ఉదీచ్యాం దిశివిశ్వకృత్‌ | అమృతం నామ పరమం స్థానమాహుర్మనీషిణః. 7

భవంత స్తత్రవై గత్వా తపసా శంసితవ్రతాః | అమృతంస్థానమాసాద్య తపశ్చరత దుశ్చరమ్‌. 8

తతః శ్రోష్యథ సంఘుష్టాం స్నిగ్ధగంభీరనిస్వనామ్‌ | ఉష్ణాంతేతోయదస్యేవ తోయపూర్ణస్య నిఃస్వనమ్‌. 9

రక్తాంపుష్టాక్షరాంరమ్యా మభయాం సర్వదాశివామ్‌ | వాణీంపరమసంస్కారాం వదతాం బ్రహ్మవాదినామ్‌. 10

దివ్యాం సత్యకరీం సత్యాం సర్వకల్మషనాశినీమ్‌ | సర్వదేవాధిదేవస్య తతోసౌభావితాత్మనః. 11

తస్యవ్రతసమాప్త్యాంతు యోగవ్రతవిసర్జనే | అమోఘంతస్యదేవస్య విశ్వతేజో మహాత్మనః. 12

దేవతలతో బ్రహ్మయిలా అన్నాడు. ఓ మహాబలులారా ! మీరిచటకు వచ్చిన కారణం నేను ముందుగానే తెలిసి కొన ఆ విషయమే ఆలోచిస్తున్నాను. మీకెర్కె ఫలించగలదు. దానవనేత బలిని నిర్జించు మహాత్ముడు పుట్టగలడు. సమప్త విశ్వాన్నీ సృష్టించగల ఆ మహనీయుడు మిమ్ములను నన్ను మాత్రమేకాక ముల్లోకాలను ఉద్ధరించి మనందరకు నాయకుడు అవుతాడు. సకల విశ్వనిర్మాత, ఈశ్వరుడు, సనాతనుడనగు ఆ ప్రభువు సృష్టికన్నా పూర్వంనుంచి ఉన్న శాశ్వతుడు. ఆ పురుషోత్తమునిగా నేనుగాని మీరుగాని వేదాలుగాని ఎవడో ఎలా ఉంటాడో అనేవిషయం ఎవ్వరూ ఎరుగరు. అయితే ఆ మహాత్ముడు మాత్రం మనలను వేదాలను విశ్వాన్నీ చక్కగా ఎరిగియున్నాడు. ఆ ప్రభువు అనుగ్రహం చేతనే మీకు చక్కని ఉపాయం చెబుతున్నాను. దాని ప్రకారం యోగ దీక్షతో తీవ్రంగా తపస్సు చేయాలి. ఉత్తరదిశన క్షీర సముద్రానికి ఉత్తరాస ఆవిశ్వ ప్రభువునివాసం '' అమృత'' మని కలదు. మీరచటకు వెళ్ళి ప్రతదీక్షబూని దుష్కరమైన తపస్సు చేయండి. అప్పడు మీకు వేసవి చివర తొలకరి మేఘ ధ్వని లాంటి స్నిగ్ధ గంభీరమైన ధ్వని యొకటి రమ్యంగా అభయ ప్రదంగా మంగళకరంగా నిండుగా కర్ణ ప్రియంగా వినిపిస్తుంది. ఆ వాణీ పరమ సంస్కృతమైనది. దివ్యమైనది. సత్యమై సత్య నిర్మాణ దక్షమైనది. అది మీకు వ్రత దీక్షా, సమాప్తి సమయాన ఆ పురుషోత్తముని ముఖ నిర్గతమై ఆమోఘ ప్రభావం కలిగి శ్రవణ గోచరము కాగలదు.

కస్య కింవోకరం దేవా దదామి వరదఃస్థితః | స్వాగతంవఃసురశ్రేష్టా మత్సమీప ముపాగతాః. 13

తతోదితిఃకశ్యపశ్చ గృహ్ణీయాతాం వరంతదా | ప్రణమ్య శిరసాపాదౌ తసై#్మ దేవాయధీమతే. 14

భగవానేవనః పుత్రో భవిష్యతి ప్రసీదనః | ఉక్తశ్చపరయావాచా తథా స్త్వితి సవక్ష్యతి. 15

దేవాబ్రువంతి తే సర్వేకశ్యపోదితిరేవచ | తథాస్త్వితిసురాః సర్వేప్రణమ్య శిరసాప్రభుమ్‌.

శ్వేతద్వీపం సముద్దిశ్యగతాః సౌమ్య దిశంప్రతి. 16

తేచిరేణౖవ సంప్రాప్తాః క్షీరోదం సరితాం పతిమ్‌ | యథోద్దిష్టంభగవతా బ్రహ్మణా సత్యవాదినా. 17

తేక్రాంతాః సాగరా న్సర్వాన్‌ పర్వతాంశ్చసకాననాన్‌ | నదీశ్చవివిధా దివ్యాః పృథివ్యాం తే సురోత్తమాః. 18

అపశ్యంత తతోఘోరం సర్వసత్త్వవివర్జితమ్‌ | అభాస్కరమమర్యాదం తమసాసర్వతో వృతమ్‌. 19

అమృతం స్థానమాసాద్య కశ్యపేన మహాత్మనా | దీక్షితాః కామదం దివ్యం వ్రతం వర్షసహస్రకమ్‌. 20

ప్రసాదార్థం సురేశాయ తసై#్మయోగాయ దీమతే | నారాయణాయదేవాయ సహస్రాక్షాయ భూతయే. 21

బ్రహ్మచర్యేణ మౌనేన స్థానే వారాననేనచ | క్రమేణచసురాః సర్వే తపఉగ్రం సమాస్థితాః. 22

కశ్యపస్తత్రభగవాన్‌ ప్రసాదార్ధం మహాత్మనః | ఉదైరయతవేదోక్తం యమాహుః పరమం స్తవమ్‌. 23

ఇతిశ్రీ వామనమహాపురాణ సరోమాహాత్మ్యే చతుర్థోధ్యాయః.

అప్పుడు నారాయణుడు - ఎవరికి ఏంవరం కావాలి-కోరుకొనుడు. నేనిచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. నా వద్దకు వచ్చిన మీకందరకు స్వాగతమని ప్రశ్నించును. వెంటనే అదితి కశ్యపులు 'ప్రభూ' మీకు మా కుమారుడుగా జన్మించండి అనికోరగలరు. ప్రణామ పూర్వకంగా మీరు యాచించినంతనే ఆ సర్వేశ్వరుడు తథాస్తని కరుణించును. బ్రహ్మదేవుని మాట విని అదితి కశ్యపులతో సహ దేవగణమంతా ఆయనకు శిరసాప్రణమిల్లి అట్లే చేయగలమనిరి. అంతట వారందరు దక్షిణ దిశగా శ్వేతద్వీపానికి ప్రయాణించి అల్పకాలంలోనే నదీపతి క్షీరసముద్రాన్ని చేరుకున్నారు. దారిలో సర్వ సముద్రాలను, పర్వతారణ్యాలను నదీనదాలను భూములను సత్యవాదియగు విరించి చెప్పినట్లు దాటి వారలు మహా భయంకర మైన అంధకారంలో ప్రవేశించారు. అచట సూర్యుడులేడు. ఎలాంటి జీవరాసులు లేవు. దానికి అవధులులేవు. ఎటుచూచినా చీకటి. ఆ అమృత స్థానానికి చేరి కశ్యపుడు, దేవతలందరకూ కామ్యాలు తీర్చే సహస్ర వర్షవ్రత దీక్షయిచ్చాడు, అందరూ శ్రీ మన్నారాయణుని మౌనంగా, బ్రహ్మచర్య యోగదీక్షతో, వీరాసనాలు వైచికొని ఉగ్రమైన తపస్సు ప్రారంభించారు. శ్రీ పురుషోత్తముని ప్రసన్నుని గావించుటకై కశ్యపుడు వేదోక్త విధానాన స్తోత్రం గావించాడు.

ఇది శ్రీ వామన మహాపురాణంలో సరోమాహాత్మ్యంలో నాలుగో అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters