Sri Vamana Mahapuranam    Chapters   

మూడవ అధ్యాయము

బుషయ ఊచుః :

దేవానాం బ్రూహి నః కర్మ యద్‌ వృత్తాన్తే పరాజితాః | కతం దేవాదిదేవోసౌ విష్ణుర్వామనతాంగతః. 1

లోమహర్షణ ఉవాచ :

బలిసంస్థంచ త్రైలోక్యం దృష్ట్వా దేవః పురందరః |

మేరుప్రస్థం య¸° శక్రఃస్వమాతు ర్నిలయం శుభమ్‌. 2

సమీపం ప్రాపయమాతుశ్చ కథయామాస తాం గిరం | అదిత్యాశ్చయథాయుద్దేదానవేనపరాజితాః. 3

బుషులన్నారు. మహర్షే పరాజయం పొందిన దేవతలాతర్వాత ఏం చేశారు? దేవాదిదేవుడైన విష్ణువు ఎలా వామన రూపం ధరించాడు? అందుకు రోమహర్షనుడిలా చెప్పాడు. ముల్లోకాలు బలికి స్వాధీనం కావడంతో ఇంద్రుడు తనమాతృస్థానమైన చక్కని మేరుగిరికి వెళ్ళి తన తల్లి అయిన అదితితో సంగ్రామ భూమిలో దానవులచేత అదిత్యులంతా నిర్జింపబడిన వృత్తాంతం వివరించాడు.

అదితిరువాచ :

యద్యేవం పుత్రయుష్మాభి ర్నశక్యో హంతు మాహవే | బలిర్విరోచనసుతః సర్వైశ్చైవ మరుద్గణౖః. 4

సహస్రశిరసాశక్యః కేవలం హంతుమాహవే | తేనైకేనసహస్రాక్షః నసహన్యేన శక్యతే. 5

తద్వత్‌ పృచ్ఛామి పితరం కశ్యపం బ్రహవాదినమ్‌ | పరాజయార్థందైత్యస్య బలేస్తస్య మహాత్మనః. 6

తతోదిత్యా సహ సురాః సంప్రాప్తాః కశ్యపాంతికమ్‌ | తత్రాపశ్యంతమారీచం మునిం దీప్తతపోనిధిమ్‌. 7

ఆద్యందేవగురుం దివ్యం ప్రదీప్తం బ్రహ్మవర్చసా | తపజసాబాస్కరాకారం స్థితమగ్నిశిఖోపమమ్‌. 8

న్యస్తదండం తపోయుక్తం బద్దకృష్ణాజినాంబరమ్‌ | వల్కలాజిన నంవీతం ప్రదీప్తమివతేజసా. 9

హుతాశమివదీప్యంత మాజ్యగంధపురస్కృతమ్‌ | స్వాధ్యాయవంతం పితరం వపుష్మంత మివానలమ్‌. 10

బ్రహ్మవాదిసత్యవాది సురాసురగురుంప్రభుమ్‌ | బ్రాహ్మాణ్యాప్రతిమం లక్ష్మ్యా కశ్యసందీప్తతేజసమ్‌. 11

యఃస్రష్టాసర్వలోకానాం ప్రజానాంపతిరుత్తమః | ఆత్మభావవిశేషేణ తృతీయో యః ప్రజాపతిః. 12

అథప్రణమ్యతేవీరాః సహాదిత్యాసురర్షభాః ఊచుఃప్రాంజలయః సర్వే బ్రహ్మాణ మివమానసాః. 13

ఆజేయో యుధిశ##క్రేణ బలిర్దైత్యో బలాధికః |

తస్మాద్విధత్తనఃశ్రేయో దేవానాం పుష్టివర్దనమ్‌. 14

శ్రుత్వాతువచనంతేషాం పుత్రాణాం కశ్యపఃప్రభుః | అకరోద్‌ గమనేబుద్దిం బ్రహ్మలోకాయ లోకకృత్‌. 15

అదితి వచనము: పుత్రా ! మరుద్గణాల సహాయంతోకూడ నీవు వరోచనసుతుడు బలిని జయించలేనంటివి. అట్టిచో విష్ణువొకడు తప్ప వేరెవ్వరూ ఆతనిని జయించలేరు. కనుక మనం మీ తండ్రి బ్రహ్మజ్ఞుడైన కశ్యపుని వద్దకువెళ్ళి బలిదైత్యుని పరాభవించునుపాయం అడుగుదము. పద. అంతటనాదేవతలు అదితితోగూడి కశ్యపుడుండుచోటికి వెళ్ళి అచట వరమతపోనిధి మరీచ పుత్రుడు ఆద్యదేవగురుడు దివ్యబ్రహ్మ పర్చస్వి, రెండవ భాష్కరునివలె, ఆగ్నిశిఖవలె తేజరిల్లుచూ ఉన్న ఆ మహానీయుని దర్శించారు. ఆ తపస్వి దండం, కృష్టాజినాంబరం, వల్కలాజినం ధర్శించి ఆజ్యగంధముక్తమైన హోమాగ్ని లాస్వాధ్యాయునిరతుడై యున్నాడు. ఆతడు బ్రహ్మవాదులు సత్యవాదులగు సురాసురులకు గురువు, ఆ ప్రతిమానమైన బ్రహ్మ తేజంతో వెలిగిపోతున్నాడు. సర్వలోక స్రష్టప్రజాపతులలోనుత్తముడు. అలాంటి కశ్యపబ్రహ్మను దర్శించి ఆదిత్యులతో కూడిన ఆ దేవవీరులంతా, బ్రహ్మమానస పుత్రులు బ్రహ్మకువలెనమసర్కించి అంజలిఘటించి ఇలా విన్నవించారు. యుద్ధంలో బలి దైత్యుడింద్రునకజేయుడై యున్నాడు. ఈ సంకట సమయంలలో దేవతలశ్రేయస్సుకు వుష్టివృద్దికి తగిన ప్రయత్నం చేయండి. తన పుత్రుల దీపవచనాలు విని కశ్యపుడు, విధాతను దర్వించుటకై బ్రహ్మలోకానికివెళ్ళ నిశ్చయించుకున్నాడు.

కశ్యప ఉవాచ :-

శక్ర : గచ్ఛామ సదనం బ్రహ్మణ్‌ పరమాద్భుతమ్‌ |

తథా పరాజయం సర్వే బ్రహ్మణః ఖ్యాతుముద్యతాః. 16

సహాదిత్యా తతోదేవా యాతాః కాశ్యపమాశ్రమమ్‌ | ప్రస్థితా బ్రహ్మసదనం మహర్షిగణసేవితమ్‌. 17

తే ముహూర్తేన సంప్రాప్తా బ్రహ్మలోకం సువర్చనః '

దివ్యైః కామగమైర్యానై ర్యథార్హై స్తేమహాబలాః. 18

బ్రహ్మాణం ద్రష్టుమిచ్ఛంత స్తపోరాశినమవ్యయం |

అధ్యగచ్ఛంత విస్తీర్ణాం బ్రహ్మణః పరమాం సభామ్‌. 19

షట్పదోద్గీతమధురాం సామగైః సముదీరితామ్‌ |

శ్రేయస్కరీ మమిత్రఘ్నీం దృష్ట్వా సంజహృషు స్తదా. 20

ఋచో బహ్వృచముఖ్యైశ్చ ప్రోక్తాః క్రమపదాక్షరాః శుశ్రువు ర్విబుధవ్యాఘ్రా వితతేషు చకర్మసు. 21

యజ్ఞవిద్యావేదవిదః పదక్రమవిద స్తథా | స్వరేణపరమర్షీణాం సా బభూవ ప్రణాదితా. 22

యజ్ఞ సంన్తవ విద్భిశ్చ శిక్షావిద్భి స్తథా ద్విజైః | ఛందసాంచైవ చార్తజ్ఞైః సర్వవిద్యావిశారదైః. 23

లోకాయతికముఖ్యైశ్చ శుశ్రువుః సర్వమీరితమ్‌ | తత్రతత్రచవిప్రేంద్రా నియతాః శంసితవ్రతాః. 24

జపహోమపరా ముఖ్యా దదృశుః కశ్యపాత్మజాః | తస్యాపంసభాయామాస్తేస బ్రహ్మాలోకపితామహః. 25

సురాసురగురుః శ్రీమాన్‌ విద్యయా వేదమాయయా | ఉపాసంతచతత్రైప ప్రజానాం పతయఃప్రభుమ్‌.

దక్షఃప్రచేతాః పులహోమరీచిశ్ప ద్విజోత్తమాః | భృగురత్రిర్వసిష్ఠశ్చ గౌతమో నారదస్తథా. 27

విద్యాస్తథాంతరిక్షంచ వాయు స్తేజోజలం మహీ | శబ్దః స్పర్శశచరూపంచ రసోగంధస్తథైవచ. 28

ప్రకృతిశ్చ వికారశ్చ యచ్చాన్యత్కారణం మహత్‌ |

సాంగోపాంగాశ్చ చత్వారో వేదాలోకపతి స్తథా. 29

నయాశ్చక్రతవశ్చైవ సంకల్పః ప్రాణఏవచ | ఏతేచాన్యే చ బహవః స్వయంభువ ముపాసతే. 30

కశ్యప వచనము : దేవరాజా ! మనమందరమిప్పుడు పరమాద్భుతమైన బ్రహ్మసదనానికివెళ్ళి ఆయనకీపరాజయ గాథను తెలుపుదము. అంతట కశ్యపాశ్రమమునకు వెళ్ళినదేవతలందరునచట నుండి మహర్షి గణాలచేత కొలవబడుతున్న బ్రహ్మనెలవుకు బయలుదేరారు. ఆ మహాబలులందరు కామగమనం కలిగిన దివ్యయానామీదనెక్కి త్రుటికాలంలో తేజోమయమైన బ్రహ్మలోకాన్ని చేరుకున్నారు. అవ్యయుడు తపోరాశి అయిన బ్రహ్మను దర్శించే కుతూహలంతోవారు, సువిశాలమై సామగానంతో, భ్రమరఝుంకారాలతో ప్రతిధ్వనిస్తూ శ్రేయాలొనగూర్చి శత్రునావనంచేయగల మనోహరమైన ఆబ్రహ్మ సభను చూచి పరమానందం పొందారు. బహ్వృచ ప్రముఖులచేత, క్రమపాదాక్షర సమన్వితంగా, ఆయా సంబద్ధ క్రతువుల కనుగుణంగా చదువబడే బుగ్వేద మంత్రములనా విబుధవర్యులు ఆలకించిరి. యజ్ఞవిద్యాపారగులు పదక్రమ పాఠవిధులు, సస్వర మంత్రపాఠకుల సునాదాలతో నాసభ మారుమ్రోగుచుండినది. యజ్ఞప్రశంసతోబాటు శిక్షాశాస్త్రంలో పారీణులయిన ద్విజులయు, వేదార్ధం తెలసినవారు సర్విద్యాకోవిదులు లౌకికవిద్యల్లోగూడ ప్రవీణులగువారల ప్రవచనాలను ఆ పుణ్యవ్రతులయిన దేవతలు తత్తత్ప్రదేశాలలో వినగలిగారు. జపహోమనిరతులయిన ఆకశ్యపకుమారులు (దేవతలు) ఆ సభా మధ్యంలో శ్రీమంతుడు సురాసురగురుడు లోకపితామహుడునైన బ్రహ్మను చూచారు. ప్రజాపతులందరు ఆయనను ఉపాసిస్తున్నారు. దక్షుడు, ప్రచేతసులు, పులహమరీచులు, భృగువు, అత్రి, వసిష్టుడు, గౌతమనారదులు మొదలయిన బ్రహ్మణ్యులు, విద్యలు అంతరిక్షం, వాయువు తేజం నీరు భూమి శబ్ద స్పర్శ రూపరసగంధాలు ప్రకృతి వికృతులు, మమత్తు, కారణం, సాంగోపాంగాంలయిన నాలుగువేదాలు, లోకపతులు, నయ, క్రతు, సంకల్పప్రాణాలు అన్నీదేహం ధరించి అబ్రహ్మనుపాసిస్తున్నారు. వీరేగాక యింకా ఎందరెందరో ఆ మహనీయుని ఆరాధిస్తున్నారు.

అర్ధోధర్మశ్చ కామశ్చ క్రోధోహర్షశ్చనిత్యశః | శుక్రోబృహస్పతిశ్చైవసంవర్తోథ బుధస్తథా. 31

శ##నైశ్చరశ్చ రాహుశ్చగ్రహాః సర్వేవ్యవస్ధితాః | మరుతోవిశ్వకర్మా చవసవశ్చ ద్విజోత్తమాః | 32

దివాకరశ్చసోమశ్చ దివా రాత్రి స్తథైవచ | అర్దమాసాశ్చమాసాశ్చ బుతవః షట్చసంస్థితాః. 33

తాంప్రవిశ్యసభాం దివ్యాం బ్రహ్మణః సర్వకామికామ్‌ |

కశ్యవస్త్రిదశైఃసార్దః పుత్రై ర్ధర్మభృతాంవరః. 34

సర్వతేజోమయీం దివ్యాం బ్రహ్మర్షిగణసేవితాం |

బ్రాహ్మ్యాశ్రియాసేవయమానా మచింత్యాం విగతక్లమామ్‌. 35

బ్రహ్మాణంప్రేక్ష్యతే సర్వే పరమాసనమాస్థితమ్‌ | శిరోభిః ప్రణతాదేవం దేవా బ్రహ్మర్షిభిఃసహ. 36

తతఃప్రణమ్యచరణౌనియతాః పరమాత్మనః | విముక్తాఃసర్వపాపేభ్యః శాంతా విగతకల్మషాః. 37

దృష్ట్వాతుతాన్‌ సురాన్‌ సర్వాన్‌ కశ్యపేనసహాగతాన్‌ | అహబ్రహ్మామహాతేజా దేఆనాం ప్రభురీశ్వరః. 38

ఇతి శ్రీవామనమమాపురాణ సరోమాహాత్మ్య తృతీయోధ్యాయః.

అర్థధర్మకామాలు, క్రోధహర్షాలు, శుక్రబృహస్పతి సంవర్త బుధశ##నైశ్చర రాహు మొదలయిన సర్వగ్రహాలు ఆయనను సేవిస్తున్నారు. బ్రహ్మ విదులయన మరుత్తులు విశ్వకర్మ వసువులు సూర్యచంద్రులు దివారాత్రులు పక్షాలు మాసాలు షడృతువులు సేవిస్తూఉండగా సర్వకామ్యాలు సమకూర్చే ఆదివ్యసభలోనికి కశ్యపుడు తనసుతులగు దేవతలందరతో కలిసి ప్రవేశించాడు. బ్రహ్మర్షి సమూహంతో సేవించబడుతూ, బ్రాహ్మీశ్రీ (లక్ష్మీ) లు సంభావించగా మనస్సున కాహ్లాదం గొలిపే ఆ పేరోలగంలో ఉత్తమోత్తమమైన ఆసనంమీద కూర్చున్న ఆ బ్రహ్మదేవునకు బ్రహ్మర్షులతో సహా అందరు తలలు వంచి ప్రణామాలు చేశారు. అలా ఆపరమాత్మకు నమస్కరించి పాపరహితులు, కల్పషదూరులనైన ఆసురలు స్వస్థచిత్తులై నిలువబడిరి. దేవప్రముఖుడైన కశ్యపునితో కూడి ఏతెంచిన ఆదేవసమూహాన్ని చూచి దేవేశ్వరుడగు విరించియిలా అన్నాడు.

ఇది శ్రీ వామన మహాపురాణంలో సరోమాహాత్మ్యంలో మూడో అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters