Sri Vamana Mahapuranam    Chapters   

సరోమాహాత్మ్యమ్‌

ఒకటవ అధ్యాయము

దేవదేవ ఉవాచ :

సరస్వతీదృషద్వత్యో రంతరే కరుజాంగలే | మునిప్రవరమాసీనం పురాణం లోమహర్షణమ్‌|

అపృచ్ఛంత ద్వాజవరాః ప్రభావం సరతస్తదా. 1

ప్రమాణం సరసో బ్రూహీతీర్థానాంచ విశేషతః | దేవతానంచ మహాత్మ్యముత్పత్తిం వానస్యచ. 2

ఏతచ్ఛ్రుత్వా వచస్తేషా రోమహర్షసమన్వితః | ప్రణిపత్యపురాణర్షి పరిదంవచన మబ్రవీత్‌. 3

లోమహర్షణ ఉవాచ :

బ్రహ్మణమగ్య్రం కమలాసనస్థం విష్ణుంతథాలక్ష్మి సమన్వితంచ |

రుద్రంచదేవంప్రణిపత్య మూర్ధ్నాతీర్థం మహద్బ్రహ్మసరఃప్రవక్ష్యే. 4

రంతుకాదౌజనం యావత్పావనాచ్చ చతుర్ముఖమ్‌ | సరఃసన్‌ఇనహితం ప్రోక్తం బ్రహ్మణా పూర్మమేవతు. 5

కలిద్వాపరయోర్మధ్యేవ్యా సేనచమహాత్వనా | సరఃప్రమాణంయత్‌ప్రోక్తం తచ్ఛృణుధ్వం ద్విజోత్తమాః . 6

విశ్వేశ్వరాదస్థిపురం తథాక్న్యా జరుద్గవీ | యావతోఘవతీ ప్రోక్తా తావత్సన్నిహితం సరః. 7

మయాశ్రుతం ప్రమాణం యత్పఠ్యమానం తు వామనే |

తచ్ఛృణుధ్వం ద్విజశ్రేష్ఠాః పుణ్యం వృద్ధికరంమహత్‌. 8

విశ్వేశవరాద్‌ దేవవరా నృపావనాత్‌ సరస్వతీ | సరఃసంనిహితం జ్ఞేయం సమంతా దర్థయోజనమ్‌. 9

ఏతదాశ్రిత్యదేవాశ్చ ఋషయశ్చ సమాగతాః | సేవంతేముక్తికామార్థం స్వర్గార్థే చాపరేస్థితాః. 10

బ్రహ్మణసేవిత మిదం నృష్టికామేన యోగినా | విష్ణునాస్థితికామేన హరిరూపేణ పసేవితమ్‌. 11

రుద్రేణచసరోమధ్యం ప్రవిష్టేన మహాత్మనా | సేవ్యంతీర్థంమహాతేజాం స్థాణుత్వం ప్రాప్తవాన్‌ హరః 12

అద్యైషాబ్రహ్మణోవేది స్తతోరామహ్రదః స్మృతః |

కురుణాచయతః కృష్టంకురుక్షేత్రం తతః స్మృతమ్‌. 13

తరంతుకారంతుకయోర్యదంతరం యదంతరం రామహ్రదా చ్చతుర్మఖమ్‌ |

ఏతత్కురుక్షేత్రసమంతపంచకం పితామహస్యోత్తరవేది రుచ్యతే. 14

ఇతి శ్రీవామనమహాపురాణ సరోమాహాత్మ్యే ప్రథమో7ధ్యాయః.

దేవవచనము: కురజాంగలక్షేత్‌ంలో సరస్వతీ దృషద్వతీ నదులమధ్య ఆసీనుడైన లోమహర్షణ మునిని బ్రాహ్మణులా పవిత్ర సరోవర ప్రభావం తెలుపవలసినదిగా అర్థించారు. మహర్షే ! ఆ సరోవర ప్రమాణం, అందలి తీర్థాలు, వాటి ప్రమాణం, అందలి దేవతల వివరంతో బాటు వామనుని జనన వృత్తాంతం కూడ తెలియజేయనగును. బ్రాహ్మణుల మాటవిని ఆనందంలో దేహం గగుర్పాటు చెందిన రోమహర్షణుడు ప్రణమిల్లి యిట్లనియెను.

లోమహర్షణ వచనము : కమలాసనాసీనుడైన బ్రహ్మకు లక్ష్మీసహితుడగు నారాయణునకు రుద్రదేవునకు నమస్కరించి బ్రహ్మ సరోవర మహిమను చెప్పుచున్నాను. బ్రహ్మ పూర్వం, రందుకం నుంచి ఔజనం వరకు పావనం నుంచి చతుర్ముఖ పర్యంతం వ్యాపించి సరస్సును సంవిహిత సరోవరమని చెప్పియున్నారు. ద్వాపరకలియుగాల మధ్య కాలంలో మహాత్ముడైన వ్యాసభగవానుడు పసరోవర ప్రమాణం చెప్పియున్నాడు. అది వినండి. విశ్వేశ్వరం నుంచి అస్థిపురం వరకు సరద్గవికన్యనుండి ఓఘవతి వరకు సన్నిహిత సరస్సు వ్యాపించి ఉన్నది. నేను వామనపురాణం నుండి తెలుసుకున్న ప్రమాణ వివరాలు పరమ పుణ్యప్రదాలు. అవికూడవినండి. విశ్వేశ్వరం నుండి దేవవరం, నరపావనం నుండి సరస్వతి, వీనికి మధ్య విస్తరించిన అర్ధయోజన సరస్సే సంనిహితం. దాని నావ్యయించుకొని దేవతలు ఋషులు తదితరులు స్వర్గమోక్షప్రాప్తికై పా పావన తీర్థాన్ని సేవిస్తారు. సృష్టికార్యం సాగించుటకై యోగనిష్ఠుడై బ్రహ్మ దీనిని సేవించాడు. స్థితి కార్య నిర్వహణకై విష్ణువు యిచట తపించాడు. రుద్రుడీ సరోవర మధ్య భాగంలో ప్రవేశించి మహాతేజోవంతమైన స్థాణుపదాన్ని సంపాదించాడు. మొదట దానిపేరు బ్రహ్మవేది. తర్వాత రామహ్రదం. అనంతరం కరుమహారాజు దున్ని నందున కురుక్షేత్రమైంది. ఆ కురుక్షేత్రం తరంతుక అరంతుక, రామహ్రద చతుర్ముఖా మధ్య భాగాన విస్తరించి ఉంది దానినే కురుక్షేత్ర సమంత పంచకమనీ, బ్రహ్మ ఉత్తరవేది అనీ అంటారు.

ఇది శ్రీ వామన మహాపురాణంలో సరోవర మహాత్మ్యంలో ప్రథమాధ్యాయం.

Sri Vamana Mahapuranam    Chapters