Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువది మూడవ అధ్యాయము

దేవదేవ ఉవాచ:

తస్యాం తపత్యాం నరసత్తమేన జాతఃసుతః పార్థివలక్షణస్తు |

సజాతకర్మాదిభిరేవ సంస్కృతో వ్యవర్థతాజ్యేనహుతోయథా7గ్ని,. 1

కృతో7స్యచూడాకరణశ్చ దేవా విప్రేణమిత్రావరుణాత్మజేన |

నవాబ్దికస్యవ్రతబంధనం చ వేదేచశాస్త్రే విధిపారగో7భూత్‌| 2

తతశ్చతుఃషడ్భిరపీహ వర్షెః సర్వజ్ఞతా మభ్యగమ త్తతో7సౌ |

ఖ్యాతఃపృథివ్యాంపురుషోత్తమో7సౌ నామ్నా కురుః సంవరణస్య పుత్రః. 3

తతోనరపతిర్దృష్ట్వా ధార్మికం తనయం శుభమ్‌ | దారక్రియార్థమకరోద్‌ యత్నం శుభకులే తతః. 4

సౌదామినీం సుదామ్నస్తు సుతాం రూపాధికాం నృపః |

కురోరర్థాయ వృతవాన్‌ సప్రాదాత్‌ కురవే7పి తామ్‌. 5

సతాంనృపసుతాం లబ్ధాం ధర్మార్థా వవిరోధయన్‌ | రేమేతన్వ్యా సహ తయా పౌలోమ్యా మాఘవానివ. 6

తతోనరవతిః పుత్రం రాజ్యభారక్షమం బలీ | విదిత్వా ¸°వరాజ్యాయ విధానేనా7భ్యషేచయత్‌. 7

తతోరాజ్యే7భిషిక్తస్తు కురుః పిత్రా నిజేపదే | పాలయామాస సమహీం పుత్రవచ్చ స్వయంప్రజాః. 8

సఏవక్షేత్రపాలో7భూత్‌ పశుపాలః సఏవహి | ససర్వపాలకశ్చాసీత్‌ ప్రజాపాలో

మహాబలః. 9

తతో7స్య బుద్ధిరుత్పన్నా కీర్తిర్లోకే గరీయసీ | యావత్కీర్తిః సుసంస్థాహి తావద్వాసః సురైస్సహ. 10

సత్వేవంనృపతిశ్రేష్ఠో యథాతథ్య మవేక్ష్యచ | విచచారమహీంసర్వాం కీర్త్యర్థంతు నరాధిపః. 11

తతోద్వైతవనంనామ పుణ్యం లోకేశ్వరో బలీ | తదాసాద్యసుసంతుష్టో వివేశాభ్యంతరం తతః. 12

తత్రదేవీందదర్శాథ పుణ్యాం పాపవిమోచనీమ్‌ | ప్లక్ష్మజాంబ్రహ్మణః పుత్రీం హరిజిహ్వాంసరస్వతీమ్‌. 13

సుదర్శనస్యజననీంహ్రదం కృత్వా సువిస్తరమ్‌ | స్థితాంభగవతీం కూలే తీర్థకోటిభిరాప్లుతామ్‌. 14

తస్యాస్తజ్జలమీక్షైవ స్నాత్వా ప్రీతో7భవన్నృపః | సమాజగామచ పునః బ్రహ్మణో వేదిముత్తరామ్‌. 15

సమంతపంచకంనామ ధర్మస్థాన మనుత్తమమ్‌ | ఆసమంతాద్యోజనాని పంచపంచచ సర్వతః 16

దేవదేవుడగు హరి యిలా అన్నాడు- ఆ నరశ్రేష్ఠుడు తపతియందొక చక్రవర్తి లక్షణాలు గల కుమారుని కనినాడు. జాతకర్మాది విధులు జరిగి ఆ బాలకుడు ఆజ్యాహుతులతో ప్రజ్వలించు హతాశనునకువలె ప్రవర్థమానుడైనాడు. వసిష్ఠుడా బాలునకు చూడాకర్మాది సంస్కారులు జరిపించాడు. తొమ్మిదేండ్ల వయసున ఉపనయనం జరిగి వేదశాస్రాదులలో ప్రావీణ్యం సంపాదించాడు. పదేండ్ల వయసునకే సర్వజ్ఞత్వం గడించి ఆ పురుషశ్రేష్ఠుడు "కురు" అనే పేర ఖ్యాతిచెందాడు. రాజైన సంవరణుడు ధర్మిష్ఠుడైన తన సుపుత్రునకు తగిన వధువుకొరకై ప్రయత్నాలు సాగించాడు. ఒక మంచి వంశానికి చెందిన సుదాముని కుమార్తె సౌదామిని యను రూపవతిని కుమారునకై నిశ్చయం చేసుకున్నాడు. సుదాముడు కూడ సంతోషంతో తన తనయను కురునకిచ్చి వివాహం జరిపించాడు. కురుకుమారుడా కుమార్తెతో కలిసి ధర్మార్థాలకు విఘాతం లేని విధంగా పౌలోమితో యింద్రుడులా సకలభోగాలు అనుభవించాడు. తన కుమారుడు రాజ్యభారదక్షుడగుట గమనించిన సంవరణుడాతని ¸°వరాజ్యపదవికి అభిషేకించాడు. అనంతరం రాజ్యాభిషేకాన్ని పొందిన ఆ కురురాజే తండ్రి అడుగుజాడలలో నడుచుకుంటూ ప్రజలనుకన్న తండ్రివలె పాలించసాగెను. ఆ మహాబలుడు తానే క్షేత్రపాలకుడుగా పశుపాలకుడుగా సర్వపాలకుడుగా మహాసమర్థతతో ప్రజాపాలనం సాగించాడు. ఆతడు కీర్తిని మించినదేదీలేదని గ్రహించాడు. కిర్తి పృథివిమీద నిలచి నంతకాలం స్వర్గంలో దేవతలతోబాటు నిలువవీలగును. కీర్తికిగల శక్తిని గుర్తించిన ఆ రాజశ్రేష్ఠుడు దానిని సంపాదించుటకై ప్రపంచమంతటా పర్యటనం గావించాడు. అంతటనా పృథ్వీపతి ద్వైత వనమను పుణ్యదేశానికి చేరుకొని సంతోషంతో అందు ప్రవేశించెను. అట బ్రహ్మపుత్రిక పాపనాశిని పుణ్యరూపిణి, హరిజిహ్వ, ప్లక్ష్మజ అయిన సరస్వతిని చూచెను. ఆమె సుదర్శనుని తల్లి. ఆ భగవతి కోటి తీర్థాలతో పరివేష్టింపబడి చక్కని సరోవరంగా విరాజిల్లుతోంది. ఆమె పవిత్ర జలాల్లో ఆ రాజు సంతోషంతో స్నానంచేసి ఉత్తరాన ఉన్న బ్రహ్మవేది వద్దకు వెళ్ళాడు. అది ఉత్తమమైన ధర్మభూమి. పేరు సమంత పంచకం. ఎటు చూచినా ఐదు యోజనాల విస్తీర్ణం కలిగిఉంది.

దేవా ఊచుః :

కియంత్యో వేదయః సంతి బ్రహ్మణః పురుషోత్తమ | యేనోత్తరతయా వేదిర్గదితా సర్వపంచకా. 17

దేవదేవ ఉవాచ :

వేదయో లోకనాథస్య పంచ ధర్మస్య సేతవః | యాసు యష్టం సురేశేన లోకనాథేన శంభునా. 18

ప్రయాగో మధ్య మావేదిఃపూర్వావేదిర్గయాశిరః | విరజా దక్షిణా

వేదిరనంతఫలదాయినీ. 19

ప్రతీచీ పుష్కరావేదిః త్రిభిః కుండైరలంకృతా | సమంతపంచకా చోక్తా వేది రేవోత్తరా7వ్యయా. 20

తమమన్యతరాజర్షిరిదం క్షేత్రం మహాఫలం | కరిష్యామికృషిష్యామి సర్వాన్‌ కామాన్‌ యథేప్సితాన్‌. 21

ఇతిసంచిత్య మనసా త్యక్త్వా స్యందనముత్తమమ్‌ | చక్రేకీ ర్త్యర్థమతులం సంస్థానం పార్థివర్షభః. 22

కృత్వాసీరం స సౌవర్ణం గృహ్య రుద్రవృషం ప్రభుః |

పౌండ్రకంయామ్యమహిషం స్వయం కర్షితుముద్యతః. 23

తంకర్షంతంనరవరం సమభ్యేత్య శతక్రతుః | ప్రోవాచరాజన్‌ కిమిదం భవాన్‌ కర్తు మిహోద్యతః . 24

రాజా7బ్రవీత్‌ సురవరం తపః సత్యం క్షమాందయాం |

కృషామిశౌచందానంచ యోగంచ బ్రహ్మచారితామ్‌. 25

తస్యోవాచహరిర్తేవః కస్మాద్‌ బీజోనరేశ్వర | లబ్దో7ష్టాంగేతిసహసా అవహస్య

గతస్తతః. 26

గతే7పిశ##క్రేరాజర్షి రహన్యహనిసీరధృక్‌ | కృషతే7న్యాన్‌ సమంతాచ్చ సప్తక్రోశాన్‌ మహీపతిః. 27

తతో7హమబ్రువం గత్వా కురోకిమిదమిత్యథ | తదా7ష్టాంగంమహాధర్మం సమాఖ్యాతం నృపేణహి. 28

తతోమయా7స్యగతిదం నృపబీజం క్వతిష్ఠతి | సచాహమమదేహస్థం బీజం తమహమబ్రువమ్‌ .

దేహ్యహంవాపయిష్యామి సీరం కృషతు వైభవాన్‌. 29

తతోనృపతినాబాహు ర్తక్షిణః ప్రసృతఃకృతః | ప్రసృతంతంభుజందృష్ట్వా మయా చక్రేణ వేగతః. 30

సహస్రధాతతశ్ఛిద్య దత్తో యుష్మాక మేవహి | తతః సవ్యోభుజో రాజా దత్తశ్ఛిన్నో7ప్యసౌ మయా. 31

తథైవోరుయుగంప్రాదా న్మయాఛిన్నౌచ తావుభౌ | తతః స మే శిరః ప్రాదాత్‌ తేన ప్రీతో7స్మి తస్యచ |

వరదో7స్మీత్యథేత్యుక్తే కురుర్వర మయాచత. 32

దేవతలన్నారు : ఓ పురుషోత్తమా ! ఉత్తరాన ఉన్న సర్వపంచకవేది అంటున్నారు. ఇంతకూ బ్రహ్మావేదీలు ఎన్ని ఉన్నాయేమిటి ? అందుకు నారాయణుడిలా చెప్పాడు. లోకనాధుని వేదికలు ఈ లోకంలో అయిదున్నాయి. అవి ధర్మసేతువులు. ఆ ప్రదేశాల్లో లోకేశ్వరుడు శివుడు యజ్ఞాలు చేశాడు. వానిలో మధ్యవేది ప్రయాగ, తూర్పువేది గయ, దక్షిణాన అనంత ఫలం యిచ్చే విరజవేదిఉంది. పశ్చిమాన మూడుకుండాలతో కూడిన పుష్కరవేది. కాగా ఉత్తరాన ఉన్నదానిని అక్షయమైన సమంతపంచకవేది అంటారు. అంతట నా రాజర్షి ఈ క్షేత్రం మహాఫలదాయకం. కాబట్టి యిక్కడ కృషిచేసి అన్ని కామ్యాలను పండించుకుంటానని నిశ్చయించుకొని తన రథాన్నుంటి క్రిందకు దిగాడు. ఆ క్షేత్రాన్ని తనకీర్తి సాధనకు నిలయం గావించుకొన్నాడు. ఆ రాజశ్రేష్ఠుడు. ఒక బంగారు నాగలికి రుద్రుని ఎద్దును యముని పౌండ్రకమనే మహిషాన్నీ కట్టి స్వయంగా దున్నడం మొదలుపెట్టాడు. అలా సేద్యంచేస్తున్న రాజును సమీపించి యింద్రుడు ఏమిటీ ఈ వ్యవహారమంతా అని అడిగాడు. అందుకు రాజు తపస్సు, సత్యం, క్షమ, దయ, శౌచం, దానం , యోగం, బ్రహ్మచర్యం వీటిని సేద్యం చేస్తున్నానని బదులు చెప్పాడు. అప్పుడు ఇంద్రుడదనితో ఆ అష్టాంగ ధర్మబీజం నీకిచ్చిన వారెవరని చిరునవ్వు నవ్వు అచటనుండి వెడలిపోయెను. ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత గూడ నారాజు నాగలితో సేద్యం సాగిస్తూ ప్రతి దినము ఆ చుట్టుపట్ల ఏడు క్రోశాల మేరభూమిని దున్నివైచెను. అంతట నేను కురురాజు వద్దకు వెళ్ళి ఏమి చేయుచున్నావని యడుగగా నామహీపతి అష్టాంగ మహాధర్మాన్ని నాకు వివరంగా చెప్పాడు. దానికి నేనా బీజం ఎక్కడ ఉన్నదని అడుగగా తన దేహంలో ఉన్నదని ఆతడు సమాధానమిడెను. అంతట నేను దానిని భూమిలోనాటెదనంటిని. అంతట నా రాజు తన కుడిచేతిని చాచగా నేను వెంటనే చక్రంతో దానిని వేయి ముక్కలుగా ఖండించితిని. అంతట నారాజు చాచిన ఎడమచేతిని గూడ నదేవిధంగా ముక్కలు గావించితిని. అనంతరం రాజు తన రెండు ఊరు(తొడ)లను చూపగా వానిని ఖండించితిని. చివరికాతడు తన శిరస్సును అర్పించగా నేను మిగుల సంతోషించి వరమిచ్చెద కోరుకొమ్మనగా కురురాజిట్లనెను.

కురురువాచ :

యావదేతన్మయాకృష్టం ధర్మక్షేత్రం తదస్తుచ | స్నాతానాంచమృతానాంచ మహాపుణ్యఫలం త్విహ. 33

ఉపవాసంచదానంచ స్నానం జప్యంచ మాధవ | హోమయజ్ఞాదికం చాన్య చ్ఛుభంవా ప్యశుభంవిభో. 34

త్వత్ర్పసాదాద్దృషీ కేశ శంఖచక్రగదాధర | అక్షయం ప్రవరేక్షేత్రే

భవత్వత్రమహాఫలమ్‌. 35

తథాభవాన్‌ సురైః సార్ధం సమందేవేనశూలినా | వసత్వంపుండరీకాక్ష మన్నామవ్యంజకే7చ్యుతః

ఇత్యేవముక్త స్తేనాహం రాజ్ఞా బాఢము వాచతమ్‌. 36

తథాచత్వం దివ్యవపు ర్భవభూయోమహీపతే | తథా7తకాలే మామేవ లయమేష్యసి సువ్రత. 37

కీర్తిశ్చశాశ్వతీ తుభ్యం భవిష్యతి నసంశయః | తత్త్రైవయాజకాయజ్ఞాన్‌ యజిష్యంతి సహస్రశః. 38

తస్యక్షేత్రస్యరక్షార్థం దదౌ స పురుషోత్తమః | యక్షంచ చంద్రనామానం వాసుకిం చాపిపన్నగమ్‌. 39

విద్యాధరంశంకుకర్ణం నుకేశిం రాక్షసేశ్వరమ్‌ | అజావనంచనృపతిం మహాదేవం చ పాపకమ్‌. 40

ఏతాని సర్వతో7భ్యేత్య రక్షంతి కురుజాంగలమ్‌ | అమీషాం బలినో7న్యేచభృత్యా శ్చైవానుయాయినః. 41

అష్టౌసహస్రాణి ధనుర్ధరాణాం యేవారయంతీవ సుదుష్కృతాన్‌ వై |

స్నాతుం నయచ్ఛంతి మహోగ్రరూపా స్త్వన్యస్యభూతాః సచరాచరాణామ్‌. 42

తసై#్యవమధ్యే బహు పుణ్యఉక్తః పృథూదకః పాపహరః శివశ్చ |

పుణ్యానదీ ప్రాఙ్‌ ముఖతాం ప్రయాతా యత్రౌ ఘయుక్తస్యశుభాజలాఢ్యా. 43

పూర్వం ప్రజేయం ప్రపితామహేన సృష్టా సమం భూతగణౖః సమసై#్తః|

మహీజలంవహ్నిసమీరమేవ ఖంత్వేవమాదౌ విబభౌ పృథూదకః. 44

తథా చసర్వాణిమహ్ణారవాని తీర్థాని నద్యః స్రవణాఃసరాంసి|

సంనిర్మితానీహ మహాభుజేన తచ్చైక్య మాగా త్సలిలం మహీషు. 45

ఇతి శ్రీ వామనమహాపురాణ త్రయోవింశో7ధ్యాయః.

కురురాజిట్లనెను : నేను సేద్యం చేసిన (దున్నిన) ఈ నేల అంతా ధర్మ క్షేత్రం కావాలి. ఇక్కడ స్నానం చేసిన చనిపోయినా సరే అందరూ మహా పుణ్యఫలం పొందాలి. ప్రభూ మాధవా ! హృషీకేశా ! చక్రధరా ! ఈ చోట గావింపబడిన ఉపవాస దాన స్నాన జపహోమయజ్ఞాది శుభాశుభ కర్మలన్నియు నీ అనుగ్రహం వల్ల అక్షయ ఫలదాయకాలు కావాలి. అంతేకాదు. నా పేర వ్యవహరింపబడునట్టి ఈ ప్రదేవాన సమస్త దేవతలు, త్రిశూలధారియగు వంకరునితో కూడి ఓ పుండరీకాక్షా ! నీవు సదా నివసించుము. అంతట నేరాజుతో- రాజా ! అట్లే అగుగాక! నీవు మరల దివ్యదేహం ధరించుము. అంత్యకాలాన ఓ సువ్రతా ! నాలోలయమగుదువు. నీకీర్తి శాశ్వతంగా నిలచి పోగలదు. ఇందులో సందేహం లేదు. ఈ క్షేత్రాన వేలాది యాజ్ఞికులు క్రతువు లొనరింతురు. అని చెప్పితిని. ఆ క్షేత్రాన్ని రక్షించుటకై శ్రీమన్నారాయణుడు చంద్రుడను యక్షుని, వాసుకి పన్నగుని, శంకుకర్ణుడను విద్యాధరుని, సుకేశియను రాక్షసేశ్వరుని అజావనుడను నరపతిని, పాపకమహాదేవుని నియమించెను. అప్పటినుండియు వారలు వారి శక్తిశాలురైన భృత్యులు అనుచరులు కలసి ఈ కురుజాంగల భూమిని కంటికి రెప్పవలె కాపాడుచున్నారు. పాపులు దుర్మార్గులు ఈ క్షేత్రాన్ని సమీపించకుండా ఎనిమిదివేలమంది ధనుర్ధరులు కాపాడుతున్నారు. అట్టివారిని యిచట స్నానం చేయకుండా నిరోధించు చున్నారు. ఆ కురుజాంగల క్షేత్రం మధ్యగా పైన చెప్పిన పాపహారి, పవిత్రమూ మంగళకరమూనైన పృథూదక తీర్థం ఉంది. అకకడ స్వచ్ఛ జలాలతో నిండిన ఒక పవిత్ర నది తూర్పముఖంగా పారుతుంటుంది. ప్రాచీనకాలంలో బ్రహ్మ భూతజాలలతో కూడిన ఈ సృష్టీనంతటినీ గావించాడు. అనాది కాలం నుంచి భూమి నీరు తేజస్సు వాయు ఆకాశాలతో బాటు ఈ పృథూదక క్షేత్రం గూడ విరాజిల్లుతోంది. అంతేకాక ఆ మహాభుజుని (విష్ణువు) సంకల్పంవల్ల సమస్త మహార్ణవాలు, తీర్థాలు, నదులు, తటాకసరోవరాలన్నీ తమతమ జలాలతో యీ ప్రదేశాన సమీకరింపబడి ఐక్య భావాన్ని భజిస్తున్నాయి.

ఇది శ్రీ వామనమహాపురాణంలో యిరవైమూడవ అధ్యాయము సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters