Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువదవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

తతస్తు తాం తత్ర సదావసంతీం కాత్యాయనీం శైలవరస్యశృంగే |

అపశ్యతాం దానవసత్తమౌద్వౌ చండశ్చముండశ్చ తపస్వినీంతామ్‌. 1

ద్పష్ట్వైశైలాదవతీర్యశీఘ్ర మాజగ్మతుః స్వంభవనం సురారీ |

దృష్ట్వాచతుస్తౌమహిషాసురస్య దూతావిదం చండముండౌదితీశమ్‌. 2

స్వస్థోభవాన్‌ కింత్వసురేంద్రఃసాంప్రత మాగచ్చ పశ్యామచతత్రవింధ్యమ్‌.

తత్రాస్తిదేవీసుమహానుభావా కన్యా సురూపా సురసుందరీణామ్‌. 3

వా. పు. 13

జితాస్తయాతో యధరా7లకైర్హి జితః శశాంకో వదనేన తన్వ్యాః |

నేత్రైస్త్రిభిస్త్రీణిహుతాశనాని జితాని కంఠేన జితస్తుశంఖః. 4

స్తనౌసువృత్తావథమగ్నచూచుకౌ స్థితౌ విజిత్యేవ గజస్య కుంభౌ |

త్వాంసర్వజేతారమితిప్రతర్క్య కుచౌ స్మరేణౖవ కృతౌ సుదుర్గౌ. 5

పీనాఃసశస్త్రాఃపరిఘోపమాశ్చ భుజాస్తథాష్టాదశ భాంతి తస్యాః |

పరాక్రమంవై భవతోవిదిత్వా కామేనయంత్రా ఇవతేకృతాస్తు. 6

మధ్యంచ తస్యాస్త్రివలీతరంగం విభాతిదైత్యేంద్రసురోమరాజి |

భయాతురారోహణకాతరస్య కామస్యసోపానమివ ప్రయుక్తమ్‌. 7

సారోమరాజీసుతరాంహితస్యా విరాజితే పీనకుచావలగ్నా |

ఆరోహణత్వద్భయకాతరస్య స్వేదప్రవాహో7సురమన్మథస్య. 8

నాభిర్గభీరాసుతరాంవిభాతి ప్రదక్షిణా7స్యాః పరివర్తమానా |

తసై#్యవలావణ్యగృహస్యముద్రా కందర్పరాజ్ఞా స్వయమేవదత్తా. 9

విభాతిరమ్యంజఘనంమృగాక్ష్యాః సమంతతో మేఖలయా7వజుష్టమ్‌|

మన్యామతంకామనరాధిపస్య ప్రాకారగుప్తం నగరంసుదుర్గమ్‌. 10

వృత్తావరోమౌచమృదూకుమార్యాః శోభేత ఊరూసమనుత్తమోహి |

ఆవాసనార్థంమకరధ్వజేన జనస్య దేశావివసన్ని విష్టౌ. 11

తజ్జానుయుగ్మం మహిషాసురేంద్ర అర్ధోన్నతం భాతితథైవతస్యాః |

సృష్ట్వావిధాతాహినిరూపణాయ శ్రాంతస్తథా హస్తతలేదదౌహి. 12

జంఘేసువృత్తే7పి చ రోమహీనే శోభేత దైత్యేశ్వరతేతదీయే |

ఆక్రమ్యలోకానివనిర్మితాయా రూపార్జితసై#్యవ కృతాధరౌహి. 13

పాదౌచతస్యాఃకమలోదరాభౌ ప్రయత్నతస్తౌహి కృతౌవిధాత్రా.

ఆజ్ఞాపితాభ్యాంనఖరత్నమాలా నక్షత్రమాలాగగనేయథైవ. 14

ఏవంస్వరూపాదనునాథకన్యా మహోగ్రశస్త్రాణి చ ధారయంతీ |

దృష్ట్వా యథేష్టంనచవిద్మ కాసా సుతా7థవాకస్య చిదేవ బాలా. 15

తద్భూతలేరత్నమనుత్తమం స్థితం స్వర్గం పరిత్యజ్య మహాసురేంద్ర |

గత్వా7థవింధ్యంస్వయమేవ పశ్య కురుష్వయత్‌ తే7భిమతం క్షమంచ. 16

పులస్తుని వచనము : నారదా ! ఆ పర్వత శిఖరాన తపస్వినిగా ఉన్న కాత్యాయనిని చండుడు, ముండుడు అనే యిద్దరు రాక్షస వీరులు చూచారు. వెంటనే ఆ అసురులు పర్వతం దిగి తమ భవనానికి వెళ్ళి రాక్షసరాజైన మహిషాసురునితో ఇలా అన్నారు - ప్రభూ ! నీవిలా సుఖంగా చేతులు ముడుచుకొని కూర్చొని ఉంచుటకు కారణమేమి ? అలా వింధ్యకు వెళ్ళిచూతము పద. ముల్లోకాల్లో సౌందర్యవతీ, మహమహిమాన్వితురాలై, సురకాంతల తలదన్నే ఒక కన్యారత్నం అక్కడ ఉన్నది. ఆమె కేశాలు మేఘాలను జయించాయి. చంద్రుని ఆమె ముఖం ధిక్కరిస్తుంది. మూడు నేత్రాలు త్రేతాగ్నులను వెక్కిరిస్తాయి. కంఠానికి శంఖం దాసోహమంటుంది. ఆమె గుండ్రని స్తనాలు ఏనుగు కుంభస్థలాలను జయించాయి. ముల్లోకాలను జయించిన నీ వృత్తాంతం విని మన్మథుడామె కుచాలను తనకు చక్కని దుర్గాలుగా చేసుకున్నాడు. పరిఘలులాగా కండలుదీరిన పద్ధెనిమిది బాహువులతో వివిధ శస్త్రాస్త్రాలు ధరించి ఉంది. నీ పరాక్రమాన్ని గ్రహించిన మన్మథుడు వాటిని వివిధ యంత్రాలుగా మలుచుకున్నాడనిపిస్తుంది. మూడువళులతో, రోమసమూహంతో అందమైన ఆమె నడుము చూస్తే భయంతో మన్మథుడు ఎక్కుటకేర్పరచుకున్న సోపానపంక్తిలా ఉంటుంది. ఆమె పీనకుచాలక్రింద ఉన్న చక్కని రోమ పంక్తి నీప్రతాపోద్ధతికి భయాతురుడైన మన్మథుని వంటి నుండి జారిన చెమట బిందువుల్లాగా కనిపిస్తుంది. కుడివైపు ప్రదక్షిణంగా తిరిగి లోతైననాభి, సౌందర్య గృహంమీద దానికి రాజైన మన్మథుడు వేసినముద్ర (తాళము) గా భాసిస్తుంది. వడ్డాణంతో పరివేష్టితమైన ఆమె జఘన (పిరుదు) ప్రదేశం చూస్తే మన్మథుడు ఎత్తైన ప్రహరీగోడతో నిర్మించుకున్న శత్రుదుర్భేద్యమైన దుర్గమా అనిపిస్తుంది. రోమరహితాలై, గుండ్రనివై, మృదువుగా ఉన్న ఊరువులు, మన్మథ నరేశ్వరుడు తన వారలకై ఏర్పరచుకొన్న నివేశన స్థలముల్లాగా కనిపిస్తవి. మహిషేశ్వరా! కొంచెం ఉబ్బెత్తుగా ఉన్న ఆమె అందమైన మోకాళ్ళను చూస్తే బ్రహ్మ ఆమెను సృష్టించి అలసిపోయి, తన సృష్టి సౌందర్య సమగ్రతను నిరూపించుటకు తన రెండు అరచేతులను వానిపై పెట్టుకున్నట్లు తోస్తుంది. ఆ సుందరి వట్రువలై, రోమరహితాలైన జంఘలు (పిక్కలు) ప్రపంచంలోని సౌందర్య సృష్టినంతటినీ అధఃకరిస్తాయి. తామరపూల లోపలి మృదుత్వాన్ని తలతన్నే ఆమె పాదాలనైతే విధాత ఎంతో శ్రమపడి నిర్మించాడు. ఆమె అంగుళ్యాభరణాల సౌరు, నక్షత్రాల కాంతిని మరపిస్తుంది. ఇంతటి అందాల రాశి అయిన ఆ బాలిక ఓ దనుజేశ్వరా ! భయంకరమైన శస్త్రాస్త్రాలు ధరిస్తుంది! మేమెంతో దీక్షగా ఆమెను చూచాము. అయినప్పుటికీ ఆమె ఎవరి కుమార్తెయో, ఎవరో, ఏమో తెలుసుకొనలేకపోయాము ! దివి నుండి భువికి దిగిన అనర్ఘ రత్నం ఆ బాలిక ! స్వయంగా నీవే వెళ్ళి వింధ్యా శిఖరాన ఆమెను చూడుము. అనంతరం నీకు తోటినట్టుగా చేతనైనది చేయుము.''

శ్రుత్వైవతాభ్యాం మహిషాసురస్తు దేవ్యాః ప్రవృత్తింకమనీయరూపమ్‌ |

చక్రేమతింనాత్రవిచారమస్తి ఇత్యేవముక్త్వామహిషో7పినాస్తి. 17

ప్రాగేవపుంసస్తుశుభాశుభాని స్థానేవిధాత్ర ప్రతిపాదితాని |

యస్మిన్‌ యథా యానియతో7థవిప్ర సనీయతేవా వ్రజతి స్వయంవా. 18

తతో7నుముండంనమరంసచండం బిడాలనేత్రం సపిశంగవాష్కలమ్‌|

ఉగ్రాయుధంచిక్షురరక్తబీజౌ సమాదిదేశాథమహాసురేంద్రః. 19

ఆహత్యభేరీంరణకర్కశాస్తే స్వర్గం పరిత్యజ్య మహీధరంతు |

ఆగమ్యమూలేశిబిరం నివేశ్య తస్థుశ్చసజ్ఞాదనునందనాస్తే. 20

తతస్తుదైత్యో మహిషాసురేణ సంప్రేషితో దానవయూథపాలః |

మయస్యపుత్రోరిపుసైన్యమర్దీ సదుందుభిర్దుందుభినిస్వనస్తు. 21

అభ్యేత్యదేవీం గగనస్థితో7పి సదుందుభిర్వాక్యమువాచవిప్ర |

కుమారి దూతో7స్మి మహాసురస్య రంభాత్మజస్యాప్రతిమస్య యుద్ధే. 22

కాత్యాయనీదుంధుభిమభ్యువాచ ఏహ్యేహి దైత్యేంద్రభయం విముచ్య |

వాక్యంచయద్రంభసుతోబబాషే వదస్వ తత్సత్యమపేతమోహః. 23

తథోక్తవాక్యేదితిజఃశివాయా స్త్యజ్యాంబరం భూమితలే నిషణ్ణః |

సుఖోపవిష్టఃపరమాసనేచ రంభాత్మజేనోక్తమువాచ వాక్యమ్‌. 24

దుందుభి రువాచ :

ఏవం సమాజ్ఞాపయతే సురారి స్త్వాందేవిదైత్యో మహిషాసురస్తు |

యథామరాహీనబలాఃపృథివ్యాం భ్రమంతి యుద్దే విజితా మయాతే. 25

స్వర్గం మహీవాయుపథాశ్చవశ్యాః పాతాళమన్యేచ మహేశ్వరాద్యాః|

ఇంద్రో7స్మిరుద్రో7స్మిదివాకరో7స్మి సర్వేషులోకేష్వధిపో7స్మిబాలే. 26

నసో7స్తినాకే న మహీతలే వా రసాతలే దేవభటో7సురోవా |

యోమాంహిసంగ్రామ ముపేయివాంస్తుభూతో నయక్షో న జిజీవిషుర్యః. 27

యాన్యేవరత్నాని మహీతలేవస్వర్గే7పి పాతాళతలే7థముగ్ధే|

సర్వాణిమామద్యసమాగతాని వీర్యార్జితానీహవిశాలనేత్రే. 28

స్త్రీరత్నమగ్ర్యంభవతీచ కన్యాప్రాప్తో7స్మి శైలం తవకారణన |

తస్మాద్భజస్వేహ జగత్పతిం మాం పతిస్తవార్హో7స్మి విభుః ప్రభుశ్చ. 29

దేవి సౌందర్య ప్రవృత్తులను గురించి ఆ రాక్షసులు చెప్పినదంతయు విని మహిషాసురుడు "యిందులో యింకా ఆలోచించవలసినదేమి? ఏమీ లేదని" అనుకున్నాడు. నారదా! జీవుల శుభాశుభాలు ముందుగానే బ్రహ్మ ద్వారా నిర్ణయింపబడే ఉంటాయి. ఎప్పుడు ఎవడు ఎక్కడకు వెళ్ళాలో అక్కడకు స్వయంగానైనా వెళ్ళతాడు లేక తీసికొనిపోబడతాడు. అప్పుడా అసురేంద్రుడు చండముండ నమరబిడాల నేత్ర పిశంగ, బాష్కల ఉగ్రాయుధ చిక్షుర రక్తబీజాదులను ఆజ్ఞాపించుటతో ఆ యుద్ధోన్మాదులందరు యుద్ధ భేరీలు మ్రోగించి స్వర్గం వదలి భూమి మీద వింధ్య పర్వతాన్ని చేరి ఆ గిరి మూలాన స్కంధా వారాలు నిర్మించుకున్నారు. అప్పుడా మహిషుడు, శత్రు సంహారకుడు, తన సేనాపతి, మయాసురుని కుమారుడు దుందుభి ఘోషం వంటి కంఠధ్వని కలిగిన దుందుభి అనే రాక్షసుని దేవి వద్దకు దుతగా పంపాడు. వాడు దేవికి సమీపంగా ఆకాశంలో నిలబడి యిలా అన్నాడు."ఓ కుమారీ ! అప్రతిమ వీరుడు రంభ దైత్యుని కుమారుడు అసురలోకాధిపతి అయిన మహిషాసురుని దూతను నేను". ఆ మాట వింటూనే కాత్యాయని, రావయ్యా దైత్యేంద్రా ! రా. నిర్భయంగా జంకులేకుండా నీ యజమాని రంభ పుత్రుడు పంపిన సందేశం చెప్పుమనెను. దేవి మాటలు విని దుందుభి ఆకాశం నుంచి భూమికి దిగి దేవి కెదురుగా సుఖోపవిష్టుడై మహిషాసురుని సందేశాన్ని యిలా వినిపించాడు. "దేవీ! మహిషదైత్యుడు నీకిలా ఆజ్ఞాపించాడు. "యుద్ధంలో నాతో ఓడిపోయి హీనబలులై అమరులు భూమి మీద తిరుగుతున్నారు. స్వర్గమర్త్య పాతాళాలు వాయుమండలం అక్కడి రాజులు, అంతా నాకు వశ్యులైనారు. నేనే యింద్రుణ్ని, రుద్రుణ్ని, సూర్యుణ్ని పరలోకాధిపతిని ! ఓ బాలాః స్వర్గమర్త్య పాతాళాలలో ఎవ్వరూ కూడా- దేవాసుర యక్షభూతగణాల్లో-యుద్ధంలోనన్నెదురు కొని జీవింపగలవారులేరు. స్వర్గమర్త్యపాతాళాలలో ఉన్న అనర్ఘరత్నాలన్నీ యీనాడు నా ప్రతాపానికి లోబడి నన్ను చేరాయి. స్త్రీ జాతి కంతకూ ఓ విశాలనేత్రా ! నీవు రత్నానివి. అలాంటి నీ కోసం నేను ఈ వింధ్య మూలానికి వచ్చాను. జగత్పతినీ సర్వప్రభువునూ అయిన నన్ను కన్యా రత్నమవైన నీవు వరించి భజింపుము.

పులస్త్య ఉవాచ :

ఇత్యేవముక్త్వా దితిజేన దుర్గా కాత్యాయనీ ప్రాహ మయస్యపుత్రమ్‌|

సత్యం ప్రభుర్దానవరాట్‌ పృథివ్యాం సత్యంచ యుద్ధే విజితామరాశ్చ. 30

కింత్వస్తి దైత్యేశ కులే7స్మదీయే ధర్మోహిశుల్కా ఖ్యఇతిప్రసిద్ధః|

తంచేత్ర్పదద్యా న్మహిషో మమాద్య భజామిసత్యేనపతింహయారిమ్‌. 31

శ్రుత్వా7థవాక్యం మయజో7బ్రవీచ్చ శుల్కంవదస్వాంబుజపత్రనేత్రే|

దద్యాత్స్వమూర్ధానమపిత్వదర్థే కింనామ శుల్కం యదిహైవ లభ్యమ్‌. 32

పులస్త్య ఉవాచ ః

ఇత్యేవముక్తా దనునాయకేన కాత్యాయనీ సస్వనమున్నదిత్వా |

విహస్యచైతద్వచనంబభాషే హితాయ సర్వస్య చరాచరస్య. 33

దేవ్యువాచ :

కులే7స్మదీయే శృణుదైత్యశుల్కం కృతంహి యత్పూర్వతరైః ప్రసహ్య |

యోజేష్యతే7స్మత్కులజాం రణాగ్రే తస్యాః సభర్తాపి భవిష్యతీతి. 34

పులస్త్య ఉవాచ :

తచ్ఛ్రుత్వా వచనం దేవ్యా దుందుభిర్దానవేశ్వరః | గత్వా నివేదయామాస మహిషాయ యథాతథమ్‌. 35

సచాభ్యగాన్మహాతేజాః సర్వదైత్యపురఃసరః | ఆగత్యవింధ్యశిఖరం యోద్దుకామః సరస్వతీమ్‌. 36

తతఃసేనాపతిర్దైత్యో చిక్షురో నామనారద | సేనాగ్రగామినం చక్రే నమరం

నామదానవమ్‌. 37

సచాపితేనాధికృతశ్చతురంగం సమూర్జితమ్‌ | బలైకదేశమాదాయ దుర్గాం

దుద్రావవేగితః. 38

తవూపతంతంవీక్ష్యాథ దేవా బ్రహ్మపురోగమాః | ఊచుర్వాక్యం మహాదేవీం వర్మహ్యాబంధచాంబికే. 39

అథోవాచసురాన్‌ దుర్గా నాహం బధ్నామిదేవతాః | కవచం కో7త్ర సంతిష్ఠేత్‌ మమాగ్రే దానవాధమాః. 40

యదానదేవ్యా కవచం కృతం శస్త్రనిబర్హణమ్‌| తదారక్షార్థమస్యాస్తు విష్ణుపంజరముక్తవాన్‌. 41

సాతేనరక్షితాబ్రహ్మన్‌ దుర్గా దానవసత్తమమ్‌ | అవధ్యందైవతై ః సర్వైర్మహిషం ప్రత్యపీడయత్‌. 42

ఏవంపురాదేవవరేణ శంభునా తద్వైష్ణవంపంజరమాయతాక్ష్యాః|

ప్రోక్తంతయాచాపి హి పాదఘాతై ర్నిషూదితో7సౌమహిషాసురేంద్రః. 43

ఏవంప్రభావో ద్విజవిష్ణుపంజరః సర్వాసురక్షాస్వధికోహిగీతః|

కస్తస్య కుర్యాద్యుధిదర్పహానిం యస్య స్థితశ్చేతసి చక్రపాణిః. 44

ఇతి శ్రీవామన మహాపురాణ వింశో7ధ్యాయః.

పులస్త్య వచనము: మయ పుత్రుడు దుందుభి మాటలు విని కాత్యాయని వానితో నిట్లనెను. నిజమే! మీప్రభువు దానవేశ్వరుడు దేవతలను యుద్ధంలో జయించిన మాట వాస్తవం. అయితే ఓ దైత్యపతీ ! మా కులాచారం ప్రకారం ధర్మశుల్కం అంటూ చెల్లించి కన్యను వివాహమాడవలసి యున్నది. మీ మహిషుడది చెల్లించునో వానిని తప్పక పెండ్లాడెదను. కాత్యాయని మాటలు విని దుందుభి- "పద్మనేత్రీ ! ఆశుల్కమేదో చెప్పుము. నీకొరకై మా ప్రభువు తన శిరస్సునైనా సమర్పించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైన వివాహ శుల్కం ఏదియు యుండజాల"దనెను. మయ పుత్రుని మాటలు విని కాత్యాయని పకాలున నవ్వి ఉచ్చైస్వరంతో చరాచర జీవులందరకు కళ్యాణము కలుగజేయు పలుకులు పలికెను. "ఓ రాక్షసా ! మా కుల కన్యను పెండ్లాడనెంచిన వాడు ముందుగా ఆ కన్యను యుద్ధంలో జయించాలి. ఇది అనూచానంగా మా పెద్దల ఆచారము."

పులస్త్యుడన్నాడు: నారదా ! శ్రీదేవి మాటలు విని దుందుభి యథా తథంగా తన స్వామి మహిషుని వద్దకు వెళ్ళి చెప్పాడు. అంతట మహా తేజస్వి అయిన ఆ రాక్షసుడు తన సమస్త దైత్య సేనతో కాత్యాయనిని జయించుటకై బయలుదేరి వింధ్య పర్వత మూలమును జేరెను. సేనాధ్యక్షుడయిన చిక్షురుడు నమర దైత్యవీరుని సేనా ముఖాన నిలబెట్టెను. నాడు కూడ చతురంగ బలాలతో మరొకవైపు నుంచి దుర్గాదేవితో యుద్ధానికి తలపడెను. వాని యుద్ధతికి వెరగుపడి బ్రహ్మ పురస్సరులైన దేవతలు దేవితో "అమ్మా! కవచం ధరించు తల్లీ !" యని విన్నవించిరి. అంతటనా దుర్గ దేవతలతో "కవచం నాకెందులకు ? ఈ రాక్షస కీటకాలు నాయెదుట అసలు నిలబడగలవా ?" అంటూ కవచం ధరించకుండానే విష్ణుపంజర స్తోత్రాన్ని స్మరించింది. ఆ స్తోత్ర ప్రభావంతో ఓ నారదా ! ఆ తల్లి సర్వ దేవతలకు నవధ్యుడైన ఆ మహిషదైత్యుని నేలబెట్టి కాలరాచి సంహరించింది ! ఆ విధంగా పురాసమయాన దుర్గాదేవికి విష్ణు పంజర కవచాన్ని పరమశివుడపదేశించాడు. ఆమె దాని ప్రభావంతో సకల రాక్షస సంహారం గావించింది. విప్రోత్తమా ! లోకంలోని సమస్త రక్షాకవచాలన్నింటిలోనికీ విష్ణు పంజరం సర్వోత్తమంగా కీర్తింపబడుతోంది. ఆ చక్రధారి విష్ణువును హృదయంలో ప్రతిష్ఠించుకున్న వానిని యుద్ధంలో ఎదుర్కొనగలవాడెవ్వడు ?

ఇది శ్రీ వామన మహా పురాణంలోని ఇరువదవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters