Sri Vamana Mahapuranam    Chapters   

రెండవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

తత స్త్రినేత్రస్య గతః ప్రావృట్కాలో ఘనోపరి | లోకానందకరీ రమ్యా శరత్‌ సమభవ న్మునే. 1

త్యజంతి నీలాంబుధరా నభ స్తలం వృక్షాంశ్చ కంకాః సరిత స్తటాని |

పద్మాః సుగంధం నిలయాని వాయసా రురు ర్విషాణం కలుషం జలాశయాః. 2

వికాస మాయాంతి పంకజాని చంద్రాంశవో భాంతి లతాః సుపుష్టాః |

నందంతి హృష్టాన్యపి గోకులాని సంతశ్చ సంతోష మనువ్రజంతి. 3

సరస్సు పద్మా గగనే చ తారకా జలాశ##యే ష్వేవ తథా పయాంసి |

సతాం చ చిత్తం హి దిశాం ముఖైః వైమల్య మాయాంతి శశాంకకాంతయః. 4

పులస్త్యవచనము: ఆ విధముగ త్రినేత్రుడు మేఘమండలముపైన వర్షర్తువు గడపెను. అంతట లోకమున కంతకూ ఆనందము ప్రసాదిస్తూ రమ్యమైన శరదృతువేతెంచెను. ఓ మునీ! నీలిమొగిళ్ళొకటకటిగ ఆకాశాన్ని వదలినవి. చెట్లను కంక (గద్దలు) ములు, నదులు (ప్రవాహములు) తమ ఒడ్డులు, తామరలు తమవాసనలు, కాకులు తమ నెలవులు, రురు జింకలు తమ కొమ్ములు, పంకాన్ని (బురద) జలాశయాలు విసర్జించినవి. పద్మములు వికసించినవి. చంద్ర కిరణాలు కొత్తకాంతులు సంతరించుకొనినవి. లతలు పుష్పవతులయినవి, ఆలమందలు ఆనంద తుందిలములయినవి. మహాంతులగు సాదువులు పంతుష్టాంతరంగులైరి. కొలకులలో తామరలు, ఆకాశాన తారకలు, జలాశయాల్లో నీరములు, సాధుజనుల అంతరంగాలు, దిశాముఖాలు, వీటన్నింటితోబాటు శశాంకకాంతులు నైర్మల్యాన్ని సంతరించుకొనినవి.

ఏతాదృశే హరః కాలే మేఘపృష్ఠాధివాసినీం | సతీ మాదాయ శైలేంద్రం మందరం సముపాయ¸°. 5

తతో మందరపృష్ఠే7సౌ స్థితః సమశిలాతలే | రరామ శంభు ర్భగవాన్‌ సత్యా సహ మహాద్యుతిః. 6

తతో వ్యతీతే శరది ప్రతిబుద్దే చ కేశ##వే | దక్షః ప్రజాపతిశ్రేష్ఠో యష్టు మారభత క్రతుమ్‌. 7

ద్వాదశైవ సచాదిత్యాఞ్‌ శక్రాదీంశ్చ సురోత్తమాన్‌ | సకశ్యపాన్‌ సమామంత్ర సదస్యాన్‌ సమచీకరత్‌. 8

అరుంధత్యాచ సహితం వసిష్ఠం శంసితవ్రతమ్‌ | సహానసూయయా7త్రిం చ సహధృత్యా చ కౌశికమ్‌. 9

అహల్యయా గౌతమంచ భరద్వాజ మమాయయా |

చంద్రయా సహితం బ్రహ్మన్‌ ఋషి మంగిరసం తథా. 10

ఆమంత్ర్య కృతవాన్‌ దక్షః సదస్యాన్‌ యజ్ఞసంసది | విదుషో గుణసంపన్నాన్‌ వేదవేదాంగపారగాన్‌. 11

ధర్మం చ స సమాహూయ భార్యయా7హింసయా సహ |

నిమంత్ర్య యజ్ఞవాటస్య ద్వారపాలత్వ మాదిశత్‌. 12

అరిష్టనేమినం చక్రే ఇధ్మాహరణకారిణమ్‌ | భృగుం చ మంత్రసంస్కారే సమ్యగ్‌ దక్షః ప్రయుక్తవాన్‌.

తథా చంద్రమసం దేవం రోహిణ్యా సహితం శుచిమ్‌ | ధనానా మాధిపత్యేచ యుక్తవాన్హి ప్రజాపతిః. 14

జామాతృదుహితౄశ్చైవ దౌహిత్రాంశ్చ ప్రాజాపతిః |

సశంకరాం సతీం ముక్త్వా మఖే సర్వాన్‌ న్యమంత్రమత్‌. 15

అలాంటి మనోహర వాతావరణం సమీపించగనే హరుడు దాక్షాయణితో మేఘమండలము నుండి దిగి మందరగిరిని చేరెను. ఆకొండ కొమ్మున చక్కని సమతలమైన శిలావితర్ది మీద జ్యోతిర్మయుడైన శంభుడు సతితోగూడి విహరించెను. రమ్యమైన శరత్కాలము గడచి, (ఉత్థానైకాదశి) ఉత్తరాయణము ప్రవేశించుటతో ప్రజాపతి శ్రేష్టుడైన దక్షుడొక క్రతువును ప్రారంభించెను. ఆయజ్ఞానికి ద్వాదశాదిత్యులను, ఇంద్రాది దేవశ్రేష్ఠులను, కశ్యపమహర్షిని ఆహ్వానించి సదస్యులను గావించెను. సువ్రతుడైన అరుంధతీ వసిష్టులను, అత్రి అనసూయలను,ధృతికౌశికులను, అహల్యా గౌతములను, అమాయా భరద్వాజులను, చంద్రాంగిరసులను ధక్షుడు తన యజ్ఞమున కాహ్వానించి ఆవేదవిదులైన సద్గుణఖనులను యాజ్ఞికులుగ నియమించెను. అహింసాదేవీ సమేతుడైన ధర్ముని పిలిచి ఆయజ్ఞవాటికకు ద్వారపాలకునిగ నుంచెను. అరిష్టనేమికి సమిధలు కొని వచ్చు పనినప్పగించెను. భృగు మహర్షికి మంత్ర సంస్కార బాధ్యత నొసగెను. అనంతరము రోహిణీ సహితుడైన చంద్రునకు ధనాధిపత్యమొసగి, సతీశంకరులను తప్ప తక్కిన అల్లుండ్రను కూతుండ్రను దౌహిత్రులను అందరము క్రతువుకు దక్షుడు పిలిపించుకొనెను.

నారద ఉవాచ :

కిమర్థం లోకపతినా దనాధ్యక్షో మహేశ్వరః | జ్యేష్ఠః శ్రేష్ఠో వరిష్ఠో7పి ఆద్యో7పి న నిమంత్రితః. 16

నారద వచనము : సర్వ లోకేశ్వరుడు, ధనేశ్వరుడు, అలందరలోకి శ్రేష్టుడు, జేష్టుడు ఆద్యుడూనైన మహేశ్వరుడు వరిష్ఠుడైనను, ఆయనను దక్షుడేల పిలువనంప లేదు ?

పులస్త్య ఉవాచ :

జ్యేష్ఠః శ్రేష్ఠో వరిష్ఠో7పి ఆద్యో7పి భగవా న్శివః | కపాలీతి విదిత్వేశో దక్షేన నిమంత్రితః. 17

పులస్త్య వచనము : మునీ ! అన్ని విధాల జ్యేష్ఠుడూ వరేణ్యుడూ భగవంతుడునైనను కపాలి (చేతిలో పుర్రె కలవాడు) ఆయినందువలన దక్షుడు ఆయనను ఆహ్వానించలేదు.

నారద ఉవాచ :

కిమర్థం దేవతాశ్రేష్ఠః శూలపాణి స్త్రిలోచనః | కపాలీ భగవాన్‌ జాతః కర్మణా కేన శంకరః. 18

నారద వచనము : బ్రహ్మర్షీ ! దేవశ్రేష్ఠుడు, శూలపాణి. త్రినేత్రుడునగు శంకరుడేకారణమున కపాలియాయెను ?

పులస్త్య ఉవాచ :

శ్వణుష్వావహితో భూత్వా కథా మేతాం పురాతనీమ్‌ | ప్రోక్తా మాదిపురాణచ బ్రహ్మణా7వ్యక్తమూర్తినా.

పురా త్వేకార్ణవం నర్వం జగత్‌ స్థావర జంగమమ్‌ | నష్టచంద్రార్క నక్షత్రం ప్రణష్జపవనావలమ్‌, 20

అప్రతర్క్య మవిజ్ఞేయం భావాభావవివర్జితమ్‌ | నిమగ్నపర్వత తరుం తమోభూతం సుదుర్థశమ్‌. 21

పులస్త్య వచనము : నారదా ! అవ్యక్త బ్రహ్మ ఆదిపురాణంలో చెప్పిన ఈ ప్రాచీన గాథను శ్రధ్దగా వినుము. తొల్లి స్థావర జంగమాత్మకమైన విశ్వమంతయు ఏకార్ణవమై సూర్య చంద్ర నక్షత్ర పవనానలాలు నశించిపోయినవి. తరు పర్వతాదులను ముంచివేసి ఊహకూ తర్కానికీ అందక ఏ మాత్రము తెలియరాని అంధతమస్సు సర్వత్రా వ్యాపించింది.

తస్మిన్‌ స శేతే భగవాన్‌ నిద్రాం వర్ష సహస్రకీమ్‌ | రాత్ర్యంతే సృజతే లోకాన్‌ రాజసం రూప మాశ్రితమ్‌.

రాజసః పంచవదనో వేదవేదాంగ పారగః | స్రష్టా చరాచరస్యాస్య జగతో7ద్భుత దర్శనః. 23

తమోమయ స్తథైవాన్యః సముద్భూత స్త్రిలోచనః | శూలపాణిః కపర్దీచ అక్షమాలాంచ దర్శయన్‌. 24

తతో మహాత్మా హ్యసృజత్‌ అహంకారం సుదారుణమ్‌ | యేనాక్రాంతా వుభౌ దేవౌ తావేవ బ్రహ్మశఃకరౌ.

అహంకారావృతో రుద్రః ప్రత్యువాచ పితామహమ్‌ |

కో భవా నిహ సంప్రాప్తః కేన సృష్టో7సి మాం వద. 26

పితామహో7ప్యహంకారాత్‌ ప్రత్యువాచాథ కో భవాన్‌ | భవతో జనకః కో7త్ర జననీ వా తదుచ్యతామ్‌. 27

ఇత్యన్యోన్యం పురా తాభ్యాం బ్రహ్మేశాభ్యాం కలిప్రియ |

పరివాదో7భవ త్తత్ర ఉత్పత్తి ర్భవతో7భవత్‌. 28

భవానప్యంతరిక్షంహి జాతమాత్ర స్తదోత్పతత్‌ | ధారయ న్నతులాం వీణాం కుర్వన్‌ కిలకిలాధ్వానిమ్‌. 29

తతో వినిర్జితః శంభు ర్మానినా పద్మయోనినా | తస్థా వధోముఖో దీనో గ్రహాక్రాంతో యథా శశీ. 30

పరాజితే లోకపతౌ దేవేన పరమేష్ఠినా క్రోధాంధకారితం రుద్రం పంచమో7థ ముఖో7బ్రవీత్‌. 31

అహం తే ప్రతిజానామి తమోమూర్తే త్రిలోచన | దిగ్వాసా వృషభారూఢో లోకక్షయకరో భవాన్‌. 32

ఇత్యుక్తః శంకరః క్రుద్ధో వదనం ఘోరచక్షుషా | నిర్దగ్ధుకామ స్త్వనిశం దదర్శ భగవా నజః. 33

తత స్త్రినేత్రస్య సముద్భవంతి వక్త్రాణి పంచాథ సుదర్శనాని |

శ్వేతం చ రక్తం కనకావదాతం నీలం తథా పింగజటం చ శుభ్రమ్‌. 34

వక్త్రాణి దృష్ట్వా7ర్కసమాని సద్యః పైతామహం వక్త్ర మువాచ బాక్యమ్‌ |

సమాహ తస్యాథ జలస్య బుధ్బుదా భవంతి కిం తేషు పరాక్రమో7స్తి. 35

తచ్ఛ్రుత్వా క్రోధయుక్తేన శంకరేణ మహాత్మనా | నఖాగ్రేణ శిరశ్ఛిన్నం బ్రాహ్మం పరుషవాదినమ్‌. 36

తచ్ఛిన్నం శంకరసై#్యవ సవ్యే కరతలే7పతత్‌ | పతతే న కదాచిచ్చ తచ్ఛంకరకరా చ్ఛిరః, 37

అథ క్రోధావృతేనాపి బ్రహ్మణాద్భుతకర్మణా | సృష్టస్తు పురుషో ధీమాన్‌ కవచీ కుండలీ శరీ. 38

ధనుష్పాణి ర్మహాబాహు ర్బాణశక్తిధరో7వ్యయః | చతుర్భుజో మహాతూణీ ఆదిత్యసమదర్శనః. 39

స ప్రాహ గచ్ఛ దుర్బుద్దే మాత్వాం శూలిన్‌ నాపాతయే |

భవాన్‌ పాపసమాయుక్తః పాపిష్ఠం కో జిఘాంసతి. 40

ఇత్యుక్తః శంకర స్తేన పురుషేణ మహాత్మనా | త్రపాయుక్తో జగామాథ రుద్రో బదరికాశ్రమమ్‌. 41

నరనారాచయణ స్థానం పర్వతే హి హిమాశ్రయే | సరస్వతీ యత్ర పుణ్యా స్యందతే సరితాం వరా. 42

తత్ర గత్వా చ తం దృష్ట్వా నారాయణ మువాచ హ |

భిక్షాం ప్రయచ్చ భగవన్‌ మహాకాపాలికో7స్మి భోః. 43

ఇత్యుక్తో ధర్మపుత్రస్తు రుద్రం వచన మబ్రవీత్‌ | సబ్యం భుజం తాడయస్వ త్రిశూలేన మహేశ్వర. 44

నారాయణ వచః శ్రుత్వా త్రిశూలేన త్రిలోచనః | సవ్యం నారాయణ భుజం తాడయామాన వేగవాన్‌. 45

త్రిశూలాభిహతా న్మార్గాత్‌ తిస్రో ధారా వినిర్యయుః | ఏకా గగన మాక్రమ్య స్థితా తారాభిమండితా. 46

ద్వితాయా న్యపతద్‌ భూమౌ తాం జగ్రాహ తపోధనః |

అత్రి స్తస్మాత్‌ సముద్భూతో దుర్వాసాః శంకరాంశతః. 47

తృథీయా న్యపతద్‌ దారా కపాలే రౌద్రదర్శనే | తస్మా చ్ఛిశుః సమభవత్‌ సంనద్ధకవచో యువా. 48

శ్యామావదాతః శరచాపపాణి ద్గద్జన్యథా ప్రావృషి తోయదో7సౌ |

ఇత్థం బ్రువన్‌ కస్య విశాతయామి స్కంధా చ్ఛిరస్‌ తాలఫలం యథైవ. 49

తం శంకరో7భ్యేత్య వచో బభాషే నరంహి నారాయణ బాహు జాతమ్‌ |

నిపాతయైనంనం నర దుష్టవాక్యం బ్రహ్మాత్మజం సూర్యశత ప్రకాశమ్‌. 50

అందులో భగవంతుడు వెయ్యేండ్ల కాలము నిద్రతో ఉండి ఆ నిశాంతాన రాజసరూపం ధరించి లోకాలను సృష్టించెను. ఆ జగత్తు నుండి రజోగుణ ప్రధానుడై పంచముఖాలతో వేద వేదాంగ పారగుడగు చరాచర సృష్టికర్త ఉద్భవించెను. అట్లే తమోగుణమయుడు త్రిలోచనుడు శూలపాణి జటాధారియగు రుద్రుడు రుద్రాక్షమాలతో బయటకు వచ్చెను. అంతట భగవంతుడు భయంకరమైన అహంకారమును సృష్ఠించగా నది బ్రహ్మరుద్రుల నావహించెను. అహంకారావృతుడై శంకరుడు బ్రహ్మతో ''నీ వెవడవు నిన్నెవరు సృజించి పంపిరో నాకెరిగించు'' మనెను. అహంకారమునకు లోనై పితామహుడుకూడ నదే విధమున '' నీ వెవడవు? నీ తలిదండ్రులెవరని'' శంకరుని ప్రశ్నించెను. నారదా ! ఈ విధంగా ప్రాచీన కాలాన బ్రహ్మకు రుద్రునకు వివాద మేర్పడినది. నీవాసమయమున నుద్భవించితివి. పుట్టిన వెంటనే అసదృశ##మైన వీణపై ఆనంద ధ్వని వెలార్చుచు నీ వాకసమున కెగిరితివి. అభిమాని యగు బ్రహ్మ చే నిర్జింపబడి శంకరుడు దీనవదనంతో రాహుగ్రస్తుడైన చంద్రునకు వలె అధోముఖుడై నిలచెను. అవమానభారంతో క్రోధంతో నల్లనైన ముఖంతో నిలచిన రుద్రుని బ్రహ్మయొక్క పంచమముఖమిట్లు గద్దించి పలికెను. ''శంకరా! తమోమూర్తివైన నీవు దిగంబరుడవై త్రినేత్రాలతో ఎద్దుపై నెక్కి లోకసంహారం చేస్తుంటావని నాకు బాగా తెలియును. ఇదే నీ నిర్వాహకము. '' అంతట క్రోధమూర్జిత తామ్రాక్షుడై శంకరుడు ఆ బ్రహ్మ ముఖమును భస్మం చేయుటకై, ఆగ్నేయదృష్టులతో తిలకించెను. వెంటనే శివునకు శ్వేతారుణ స్వర్ణ నీల పింగళ వర్ణములతో నైదు మనోహరములు పవిత్రములునైన ముఖము లేర్పడెను. సూర్య కాంతితో ప్రకాశించే ఆ ముఖాలను చూచి బ్రహ్మ ముఖము హేళనగ నిట్లు పలికెను. ''వానకారు నీళ్ళలో లేచే బుడగలకు నీ ముఖాలకు భేదమేమి ? వీనిదియు నొక పరాక్రమమేనా?'' ఆ మాట వినిన వెంటనే శంకరుడు క్రోధోన్మత్తుడై, అట్లు ప్రేలుచున్న బ్రహ్మ ఐదవ ముఖమును కొనగోట నవలీలగ త్రుంచి వైచెను. ఆ విధముగ తెగిన ముఖము వెంటనే శివుని ఎడమ అరచేతి కంటుకొనిపోయి ఎంత ప్రయత్నించినను ఊడిపడదయ్యెను. అద్భుత శక్తి గల బ్రహ్మ అందులకు కోపించి కవచకుండలశరాలంకృతుడైన బుద్ధిమంతుడగు పురుషు నొకని సృష్టించెను. అతడాజాను చతుర్భాహువు అవ్యయుడు. నాలుగు చేతులలో ధనుర్బాణములు శక్తి గొప్పదగుఅంబులపొది ధరించి సూర్యునివలె వెలుగుచుండెను. ఆ దివ్యపురుషుడు శంకరునితో నిట్లనెను. ''దుర్భుద్ధే! శంకరా ! నీవు పాపిష్ఠుడవు. నిన్ను నేను సంహరింపను. పాపి నెవడు వధింపనెంచును? ఆ మహాపురుషుని మాటకు సిగ్గుపడి భిన్నుడై శంకరుడా ప్రదేశము వదలి బదరికాశ్రమమునకు వెళ్ళెను. బదరికాశ్రమం నరనాయణులతపో భూమి. హిమగిరి ప్రదేశము. పరమపవిత్రమైన సరస్వతీనది యట ప్రవహించుచుండును. అక్కడకు వెళ్ళి నారాయణుని చూచి శంకరుడు ''ప్రభో ! మహాకాపాలికుడను. భిక్షార్థినై వచ్చితి''ననెను. అప్పుడు ధర్మపుత్రుడగు నారాయణడు శంకరుని జూచి మహేశ్వరా ! నీ త్రిశూలముతో నా ఎడమ భుజాన్ని కొట్టుమనెను. వెంటనే శంకరుడు తన త్రిశూలముతో నారాయణుని ఎడమ భుజము గట్టిగా ప్రహరించెను. త్రిశూలాఘాతము సోకిన చోటు నుండి మూడు ధారలు నిర్గమించి అందొకటి ఆకాశ మార్గమున స్థిరపడి నక్షత్రములచే నలంకరించబడెను. భూమిపై దొరలిన రెండవ ధారను తపోధనుడగు నత్రిముని గ్రహించెను. అందుండి శివాంశతో దూర్వాసముని ఉద్భవించెను. మూడవ ధార భయంకరమైన కపాలం మీదపడి అందుండి ఒక శిశువుద్భవించెను. అతడు పుట్టుకతోనే శ్యామమనోహర కాంతితో ధనుర్భాణాలు ధరించి యువకుడై మేఘ గంభీరధ్వనితో నిట్లనెను. ''తాళవృక్షం నుండి తాళఫలాలకు వలె నేనెవరి తలలు పడగొట్టవలెనో చెప్పుడు. నారాయణ బాహువు నుండి జన్మించిన ఆ యువకునితో శంకరుడిట్లనెను. ఓ నరుడా ! శతార్క ప్రభతో వెలుగుతు దుష్టవాక్యాలు ప్రేలుచున్న బ్రహ్మ పుత్రుడైన ఈ దుష్టుని పరిమార్చుము.

ఇత్యేవ ముక్తః స తు శంకరేణ అద్యం దనుస్త్వాజగవం ప్రసిద్వం |

జగ్రాహ తూణాని తథా7క్షయాని యుద్దాయ వీరః స మతిం చకార. 51

తతః ప్రయుద్ధౌ సుభృశం మహాబలౌ బ్రహ్మత్మజో బాహుభవశ్చ శార్వః.

దివ్యం సహస్రవ పరివత్సరాణాం తతో హరో7భ్యేత్య విరంచి మూచే. 52

జిత స్త్వదీయః పురుషః పితామహ నరేణ దివ్యాద్భుత కర్మణా బలీ |

మహాపృషత్కై రభిపత్య తాడిత స్తదద్భుతం చేహ దిశో దశైవ. 53

బ్రహ్మా త మీశం వచనం బభాషే నేహాస్య జన్మాన్యజితస్య శంభో |

పరాజిత శ్చేష్యతే7సౌ త్వదీయో నరో మదీయః పురుషో మహాత్మా. 54

ఇత్యేవ ముక్తోవచనం త్రినేత్ర శ్చిక్షేప సూర్యే పురుషం విరించేః|

నరం నరసై#్యవ తదా స విగ్రహే చిక్షేప ధర్మప్రభవస్య దేవః. 55

ఇతి శ్రీవామనమహాపురాణ ద్వితీయో7ధ్యాయః

శంకరుని ఆదేశము విని ఆ వీరుడజగవమను ప్రసిద్ధ ధనుస్సు, అక్షయశూణీరాన్ని తీసికొని యుద్ధమునకు తలపడెను. అప్పుడు శివ బ్రహ్మలకు సంభవించిన ఆ అద్భుత వీరులకు వేయి దివ్య వర్షములు ఘోరమైన యుద్ధము జరిగెను. అంతట హరుడు విరించితో నిట్లనెను- ''పితామహా! చూడుము! అద్భుత బలశాలియగు నొక నరుని బాణముల తాకిడికి పరాజితుడైనాడు. ఇది దశ దిక్కులలోను పరమాశ్చర్య కరమగు ఘటన! అంతట బ్రహ్మశివునితో ''శంకరా! ఒక సాధారణ మానవునిచే ఓడింపబడిన మహాత్ముడగు నా పురుషుడీ లోకమున జన్మించిన వాడు కాడు. నిజానికి సాధారణుడైన ఈ నరుడే ఓడిపోవలసి యుండె'' ననెను.

వెంటనే శంకరుడు, ఓడిపోయిన బ్రహ్మ పుత్రుని సూర్యునిలోనికీ విజేత అయిన నారాయణ బాహు జన్ముని, నారాయణుని దేహములోనికి విసరివైచెను.

ఇది వామన మహా పురాణమునందలి రెండవ అధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters