Sri Vamana Mahapuranam    Chapters   

పదహారవ అధ్యాయము

పులస్త్య ఉవాచ:

తతఃసుకేశిర్దేవర్షేః గత్వా స్వపురముత్తమమ్‌ | సమాహూయాబ్రవీత సర్వాన్‌ రాక్షసాన్‌ ధార్మికంవచః. 1

అహింసాసత్యమస్తేయం శౌచమింద్రియసంయమః | దానందయాచక్షాంతిశ్చ బ్రహ్మచర్యమమానితా. 2

శుభాసత్యాచ మధురా వాఙ్‌నిత్యం సత్ర్కియారతిః | సదాచారనిషేవిత్వం పరలోకప్రదాయకాః . 3

ఇత్యూచుర్మునయోమహ్యం ధర్మమాద్యంపురాతనమ్‌ | సోహమాజ్ఞాపయే సర్వాన్‌ క్రియతామవికల్పతః. 4

దేవర్షీ! అంతట తన నగరంచేరి సుకేశి, ధర్మిష్ఠులైన రాక్షసుల నందరినీ సమావేశపరచి యిలా అన్నాడు. రాక్షసులారా! పురాతనం భవ్యమూనైన ధర్మ స్వరూపం నేను మునులు చెప్పగా విన్నాను. దానిని ఎలాటిసంకోచంలేకుండా మీరందరూ ఆచరించాలని ఆజ్ఞాపిస్తున్నాను. వినండి, అహింస, సత్యం, అస్తేయం (అచౌర్యం) బ్రహ్మచర్యం అమానిత్వం , శౌచం, ఇంద్రియ సంయమనం, దానం, దయ, క్షాంతి (ఓర్పు), శుభమధుర భాషణం, ఎల్లప్పుడు మంచి పనులు చేయడంలో ఆసక్తి, సదాచరణం చక్కని నడవడి ఉత్తమలోకాలు కలిగిస్తాయి.

తతఃసుకేశివచనాత్‌ సర్వఏవనిశాచరాః | త్రయోదశాంగంతేధర్మం చక్రుర్ముదితమానసాః. 5

తతఃప్రవృద్ధింసుతరా మాగచ్ఛంత నిశాచరాః | పుత్రపౌత్రార్థసంయుక్తాః సదాచారసమన్వితాః. 6

తజ్జ్యోతిస్తేజసస్తేషాం రాక్షసానాం మహాత్మనాం గంతుంనాశక్నువన్‌సూర్యో నక్షత్రాణినచంద్రమాః. 7

తతస్‌త్రిభువనే బ్రహ్మన్‌ నిశాచరపురో7భవత్‌ | దివాచంద్రేనసదృశః క్షణదాయాంచసూర్యవత్‌. 8

నజ్ఞాయతే గతిర్వ్యోమ్ని భాస్కరస్యతతోంబరే | శశాంకమితితేజస్త్వా దమన్యంత పురోత్తమమ్‌. 9

స్వవింకాసం విముంచంతి నిశామితి వ్యచింతయన్‌ | కమాలాకరేషుకమలామిత్రమిత్యవగమ్యహి |

రాత్రౌవికసితా బ్రహ్మన్‌ విభూతిందాతుమీప్సవః. 10

కౌశికారాత్రిసమయం బుద్ధ్వానిరగమన్‌కిల | తాన్‌వాయసా స్తదాజ్ఞాత్వా దివానిఘ్నంతి కౌశికాన్‌. 11

స్నాతకాస్త్వాపగాస్వేవ స్నానజప్యపరాయణాః | ఆకంఠమగ్నాస్తిష్ఠంతి రాత్రౌ జ్ఞాత్వా7థవాసరమ్‌. 12

నవ్యయుజ్యంతచక్రాశ్చ తదావైపురదర్శనే | మన్యమానాస్తుదివస మిదముచ్చైర్‌ బ్రువంతిచ. 13

నూనంకాంతావిహీనేన కేనచిచ్చక్రపత్రిణా | ఉత్సృష్టంజీవితంశూన్యే పూత్కృత్య సరితస్తటే. 14

తతో7నుకృపయావిష్టో వివస్త్వాంస్తీవ్రరశ్మిభిః | సంతాపయన్‌జగత్‌సర్వం నాస్తమేతికథంచన. 15

అన్యేవదంతిచక్రాహ్వో నూనంకశ్చిన్‌మృతోభ##వేత్‌ | తత్కాంతయాతపస్తప్తం భర్తృశోకార్తయా బత. 16

ఆరాధితస్తుభగవాం స్తపసావై దివాకరః | తేనాసౌశశినిర్జేతా నాస్తమేతి రవిర్ధృవమ్‌. 17

పులస్త్య వచనం : సుకేశి ఆజ్ఞానుసారం ఆ రాక్షసులందరు త్రయోదశాంశాలతో కూడిన ధర్మాన్ని ఎంతో నిష్ఠతో, సంతోషంతో అనుష్ఠించసాగారు. ఆ ధర్మాచరణ ప్రభావంతో నిశాచరులు పుత్ర పౌత్రాభివృద్ధి, శక్తి సంపదభివృద్ధీ కలిగి పురోగమించారు. రాక్షసులావిధంగా సంపాదించిన ధర్మజ్యోతి తేజస్సు, సూర్య చంద్ర నక్షత్రాల రాకపోకలను నిరోధించింది. విప్రోత్తమా! ఆ రాక్షసుల నగరం ముల్లోకాల్లోనూ పగటివేల చంద్రుడివలెనూ, రాత్రి సమయాల్లో సూర్యుడివలెను వెలుగ సాగింది. తర్వాత ఆకాశంలో సూర్యగమనమె కనిపించలేదు. రాక్షసుల ఆ దివ్య నగరాన్నే అందరూ చంద్రుడుగా భావించసాగారు. ఆ నగరం వెదజిమ్మే వెలుగు వెల్లువలను రాత్రియని భ్రమించి సరోవరాల్లోని కమలాలు వికసించలేదు. అయితే రాత్రి వేళల్లో ఆ నగరాన్ని సూర్యుడని యెంచి పద్మాలు వికసించసాగాయి. రాత్రి అనే భ్రమతో బయటకు వచ్చిన గుడ్లగూబలను, పగలుగా భావించి బయలుదేరిన కాకులు చంపసాగాయి. పగలని భ్రమించి రాత్రి వేళల్లో గొంతువరకు నీళ్ళలోనికి దిగి జనులు నదుల్లో స్నానాలు చేస్తూ జపాలు చేసే వారు. ఆ నగర కాంతికి రాత్రిని పగలని భ్రమించిన చక్రవాకాలు విడిపోవడం మానేసి తమలో తామిలా బిగ్గరగా మాటాడుకున్నాయి. ''భార్యా వియోగాన్ని సహించలేక ఒక చక్రవాకం నదీ తీరాన ప్రాణం విడిచినట్టు తోస్తున్నది. వాటి కరుణ దశకు జాలిపడి సూర్యభగవానుడు క్షణ కాలమైనా అస్తమించకుండా తన తీవ్ర కిరణాలతో జగత్తునంతటినీ యిలా వెలిగిస్తున్నాడు.'' మరొక చక్రవాకం ''కాదు కాదు, బర్తయైన చక్రవాకం చనిపోతే భర్తృవియోగం భరించలేక చక్రవాకి దీనదీనంగా విలపిస్తూ తపించి ఉంటుంది. దాని తపస్సుకు సంతోషించి, చంద్రుని జయించి సూర్యుడు అస్తమించకుండా ఉన్నాడు. ఇదే ముమ్మాటికి నిజం.'' అన్నది.

యజ్వినో హోమశాలాసు సహఋత్విగ్భి రధ్వరే | ప్రావర్తయంతకర్మాణి రాత్రావపి మహామునే. 18

మమాభాగవతాః పూజాం విష్ణోః కుర్వంతిభక్తితః | రవౌశశినిచైవాన్యే బ్రహ్మణో7న్యే హరస్యచ. 19

కామినశ్చాప్యమన్యంత సాధుచంద్రమసా కృతమ్‌ | యదియంరజనీరమ్యా కృతాసతతకౌముదీ. 20

అన్యే7బ్రువంల్లోకగురు రస్మాభిశ్చక్రభృద్వశీ | నిర్వ్యాజేనమహాగంధై రర్చితః కుసుమైః శుభైః. 21

సహలక్ష్మ్యామహాయోగీ నభస్యాదిచతుర్ష్వపి | అశూన్యశయనానామ ద్వితీయాసర్వకామదా. 22

తేనాసౌభగవాన్‌ప్రీతః ప్రాదాచ్ఛయనముత్తమమ్‌ | అశూన్యంచ మహాభోగై రనస్తమితశేఖరమ్‌. 23

అన్వే7బ్రువన్‌ ధ్రువందేవ్యా రోహిణ్యాశశినః క్షయమ్‌ | దృష్ట్వాతప్తంతపోఘోరం రుద్రారాధనకామ్యయా.

పుణ్యాయామక్షయాష్టమ్యాం వేదోక్తవిధినాస్వయం | తుష్టేనశంభునాదత్తం వరంచాసై#్యయదృచ్ఛయా. 25

అన్యే7బ్రువన్‌ చంద్రమసా ధ్రువమారాదితో హరిః | వ్రతేనేహత్వఖండేన తేనాఖండః శశీదివి. 26

అన్యే7బ్రుంచ్ఛశాంకేన ధ్రువంరక్షాకృతాత్మనః | పదద్వయంసమభ్యర్చ్య విష్ణోరమితతేజసః. 27

తేనాసౌదీప్తిమాంశ్చంద్రః పరిభూయదివాకరం | అస్మాకమానందకరో దివాతపతిసూర్యవత్‌. 28

లక్ష్యతే కారణౖరన్యై ర్బహుభి సత్యమేవహి | శశాంకనిర్జితః | సూర్యోనవిభాతియధాపురా. 29

యథామీకమలాఃశ్లక్‌ష్ణ రణద్‌ భృంగగణావృతాః | వికచాఃప్రతిభాసంతే జాతః సూర్యోదయో ధ్రువమ్‌. 30

యథాచామీవిభాసంతి వికచాః కుముదాకరాః | అతోవిజ్ఞాయతేచంద్ర ఉదితశ్చ ప్రతాపవాన్‌. 31

మహామునీ ! యాజ్ఞికులు ఋత్విక్కులు రాత్రియైనను యజ్ఞకర్మలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. మహాభాగవతులగు భక్తులు విష్ణు దేవునీ, యితరులు హరబ్రహ్మ సూర్య చంద్రాదులను భక్తితో అర్చించసాగారు. ఇక కాముకులకైతే, నిరంతరం వెన్నెలతో వెలిగిపోయే పూర్ణిమారాత్రులు ప్రసాదించిన చంద్రుని కార్యమెంతగానో ప్రశంసా పాత్రమైనది. ఇంకను కొందరు ''మనమెంతో భక్తి శ్రద్ధలతో మంచి పుష్పగంధాదులతో మహావిష్ణువు నర్చించి యున్నాము. ఆ లక్ష్మీ నారాయణుని ''సర్వ కామదాయి ఆశూన్యశయన ద్వీతీయ'' సంభవించే శ్రావణ మాసంతో ప్రారంభించి నాలుగు నెలలపాటు ఆరాధించాము. అందుకు సంతోషించి ఆశ్రియఃపతి మనకు మహాభోగాలతోకూడి ఎల్లప్పుడు శోభాయమానంగా ఉండే ఉత్తమమైన అశూన్య శయన సౌఖ్యం ప్రసాందించాడు'' అన్నారు. మరికొందరైతే - కాదు కాదు, తన భర్త చంద్రుని క్షీణ దశకు దుఃఖించి రోహిణిదేవి శివుని గూర్చి ఉగ్రమైన తపస్సుచేసి, వేదోక్త రీతిలో అక్షయాష్టమినాడా మహదేవుని ప్రసన్నుని చేసుకోగా ఆయన వెంటనే ఆమెకావరం ప్రసాదించాడు. చంద్రుని క్షయరోగముక్తుని గావించాడు'' అని సమాధానం చెప్పుకున్నారు. ఇంకా కొందరు - అదికాదయ్యా, చంద్రుడు శ్రీహరినుద్దేశించి అఖండమైన వ్రతంచేసి ఆయన దయవల్ల అఖండత్వం సంపాదించుకున్నా''డన్నారు. అమిత తేజస్వియగు శ్రీహరి చరణ ద్వయారాధన వలన చంద్రడు, తన కాంతిపుంజంతో దివాకరుని జయించి, అకాశంలో సూర్యుని వలె వెలిగిపోతూ మన బోంట్లకు ఆనదం కలుగజేస్తున్నా''డని మరికొందరు తమ నిశ్చితాభిప్రాయం వెల్లడించారు. ''ఇంకా మరెన్నియో కారణాల వలన చంద్రునికోడిపోయి సూర్యుడు పూర్వం మాదిరిగా వెలగలేకపోతున్నాడు; అంతే. ఎందుకనగా భ్రమరఝుంకారాలతో నిండిన ఈ కమలాలు వికసించడం చూస్తే సూర్యుడుదయించి యుండుట నిజము. అలాగే వికసించిన కలువలతో నిండిన ఈ కుముదాకరాలు గూడా చంద్రోదయాన్ని చెప్పకుండా చెబుతున్నాయి సుమా ! ''

ఏవంసంభాషతాం తత్ర సూర్యోవాక్యాని నారదః | అమన్యత కిమేతద్ధి లోకో వక్తి శుభాశుభమ్‌. 32

ఏవంసంచిత్యభగవాన్‌ దధ్యౌధ్యానం దివాకరః ఆసమంతాజ్జగద్గ్రస్తం త్త్రలోక్యం రజనీచరైః. 33

తతస్తుభగవాన్‌జ్ఞాత్వా తేజసో7ప్యసహిష్ణుతామ్‌ | నిశాచరస్యవృద్ధింతా మచింతయత యోగవిత్‌. 34

తతో7జ్ఞాసీచ్చతాన్‌సర్వాన్‌ సదాచారరతా న్శుచీన్‌ | దేవబ్రాహ్మణపూజాసు సంసక్తాన్‌ ధర్మసంయుతాన్‌.

తతస్తురక్షఃక్షయకృత్‌ తిమిరద్విపకేసరీ | మహాంశునఖరః పూర్య స్తద్‌వఘాతమచింతయత్‌. 36

జ్ఞాతవాంశ్చతతశ్ఛిద్రం రాక్షసానాందివస్పతిః | స్వధర్మవిచ్యుతిర్నామ సర్వధర్మవిఘాతకృత్‌. 37

తతఃక్రోధాభిభూతేన భానునారిపుభేదిభిః | భానుభీరాక్షసపురం తద్‌దృష్టంచయథేచ్ఛయా. 38

సభానునా తదాదృష్టః క్రోధాధ్మాతేనచక్షుషా | నిపపాతాంబరాద్‌ భ్రష్టః క్షీణపుణ్యఇవగ్రహః. 39

పతమానంసమాలోక్య పురంశాలకటంకటః | 'నమోభవాయశర్వాయః' ఇదముచ్చైరుదైరయత్‌. 40

తమాక్రందితమాకర్ణ్య చరణాగగనేచరాః | హా హేతిచుక్రుశుః సర్వేహరభక్తఃపతత్యసౌ. 41

తచ్చారణవచఃశర్వః శ్రుతవాన్‌ సర్వగోవ్యయః | శ్రుత్వా సంచింతయామాస కేనాసౌపాత్యతేభువి. 42

జ్ఞాతవాన్‌ దేవపతినా సహస్రకిరణన తత్‌ | పాతితం రాక్షసపురం తతఃక్రుద్దస్త్రిలోచనః. 43

క్రుద్ధస్తు భగవంతంతం భానుమంతమపశ్యత | దృష్టమాత్రస్త్రిణత్రేణ నిపపాత తతోంబరాత్‌. 44

నారదా ప్రజలీవిధంగా మాట్లాడుకొనడం చూచి సూర్యుడు తనలో ''ఇదేమి! వీరలీవిధంగా నన్ను చూచి శుభాశుభాలు పలుకుచుండుటెందులకని యనుకొనుచు దివాకరుడు ముల్లోకాలు రాక్షసులాక్రమించి యుండుటను గ్రహించెను. అంతట యోగవిదుడైన ఆ భాస్కరుడు నిశాచరుల తేజస్సును అభ్యుదయాన్ని చూచి అందులకుగల హేతువును విచారించి వారందరు సదాచారసంపన్నులనీ, దేవబ్రాహ్మణ భక్తులనీ ధర్మాను రక్తులనీ అదే వారల అభ్యుదయ హేతువనీ తెలుసుకొనెను. అంధకార గజంపాలిటి సింహంః రాక్షసాంతకుడు, తీక్ష్నకరనఖరుడు అయిన సూర్యుడా రాక్షసుల వధోపాయమును గురించి యోచించెను. ఆసహస్రాంశుడు, ధర్మమార్గచ్యుతి ఒక్కటే రాక్షస నిర్మూలనకు మార్గమని గ్రహించి, తన ఆగ్నేయ నేత్రాలతో, క్రోధాభిభూతుడై శత్రువినాశకరాలైన చూపులతో ఆ రాక్షస నగరాన్ని ముంచెత్తాడు. సూర్యుని క్రోధాగ్నికి దగ్ధమై ఆరాక్షస నగరం, పుణ్య క్షయం పొందిన గ్రహంలాగా ఆకాశాన్నుంచి క్రిందకు బడిపోయెను. తననగరమా విధంగా నేల కూలుట చూచి యాసుకేశి ఉచ్చైఃస్వరంతో కరుణంగా, ''ఓభవా! నీకు నమస్కారం, ఓ శర్వా! నీకు నమస్కారం'' అని శంకరుని ప్రార్థించెను. ఆకాశగతులైన చారణులా ఆక్రందనమాలకించి, ''అయ్యో! అయ్యో! ఈ మహేశ్వర భక్తుడు పడిపోవుచున్నాడే !! అని అక్రోశించిరి. సర్వవ్యాపి, అవ్యయుడైన శివుడా చారణుల మాటలు విని తన భక్తుని బడద్రోయువాడెవడా యని ఆలోచించెను. రాక్షస పురాన్ని కూలద్రోసినది సహస్ర కిరణుడు సూర్యుడని గ్రహించినంతనే త్ర్యంబక మహాదేవుడు తన త్రినేత్రం తెరచి సూర్యుని తీక్‌ష్ణంగా విలోకించెను. హరనేత్రాగ్ని స్పర్శ మాత్రాన్నే ఆదివాకరుడు ఆకాశం నుంచి క్రిందబడసాగెను.

గగనాత్స పరిభ్రష్టః పథి వాయునిషేవితే | యదృచ్ఛయానిపతితో యంత్రముక్తోయథోపలః. 45

తతోవాయుపథాన్ముక్తః కింశుకోజ్జ్వలవిగ్రహః | నిపపాతాంతరిక్షాత్స వృతఃకిన్నరచారణౖః. 46

చారణౖర్వేష్టితోభానుః ప్రవిభాత్యంబరాత్పతన్‌ | అర్థపక్వంయథాతాలాత్‌ ఫలంకపిభిరావృతమ్‌. 47

తతస్తుఋషయో7బ్యేత్య ప్రత్యూచుర్భానుమాలినమ్‌ | నిపతస్వహరిక్షేత్రే యదిశ్రేయో7భివాంఛసి. 48

తతో7బ్రవీత్‌ పతన్నేవ వివస్వాంస్తాం స్తపోధనాన్‌ | కింతత్‌క్షేత్రం హరేః పుణ్యం వదధ్వంశీఘ్రమేవమే.

తమూచుర్మునయః సూర్యం శృణుక్షేత్రం మహాఫలమ్‌ | సాంప్రతంవాసుదేవస్య భావితచ్ఛంకరస్యచ. 50

యోగాశాయినమారభ్య యావత్కేశవదర్శనమ్‌ | ఏతత్‌క్షేత్రంహరేః పుణ్యం నామ్నావారాణసీపురీ. 51

తచ్ర్ఛుత్వాభగవాన్‌ భాను ర్భవనేత్రాగ్నితాపితః | వరణాయాస్తథైవాస్యా స్త్వంతరే నిపపాతహ. 52

తతఃప్రదహ్యతితనౌ నిమజ్జ్యాస్యాం లులద్‌ రవిః | వరణాయాంసమభ్యేత్య న్యమజ్జత యథేచ్ఛయా. 53

భూయో7సిం వరణాంభూయో భూయో7పి వరణామసిమ్‌ | లులంస్త్రిణత్రవహ్న్యార్తో భ్రమతే7లాతచక్రవత్‌.

ఏతస్మిన్నంతరేబ్రహ్మన్‌ ఋషయో యక్షరాక్షసాః | నాగావిద్యాధారాశ్చాపి పక్షిణో7ప్సరసస్తథా. 55

యావంతో బాస్కరరథే భూత ప్రేతాదయః స్థితాః | తావంతోబ్రహ్మనదనం గతావేదయితుం మునే. 56

ఆకాశం నుండి భ్రంశం పొంది వడిసెల యంత్రంతో విసరివేయబడిన రాయివలె సూర్యుడు వాయుమండలంలో పడి అక్కడ నుండి తనను పరివేష్టించియున్న కిన్నర చారణులతో బాటు జ్వలించుచున్న కింశుకం లాగ క్రిందకు జారెను. అంతరిక్షం నుంచి ఆవిధంగా చారణులతో గూడి క్రిందపడుతూన్న సూర్యుడు, సగంపండిన కపులచే చుట్టబడిన తాటిపండు లాగ కనిపించెను. పాపమా విధంగా పడి పోతున్న సూర్యుని వద్దకు వచ్చి బుషులు, 'నీకు శుభంకలగాలంటే భూమిమీద హరిక్షేత్రంలో వెళ్ళి పడుమనిరి. అంత నాతపోధనులను ''మహనీయులారా! ఆక్షేత్రమెచట నున్నదో వెంటనే చెప్పుడ''ని క్రిందబడనున్న సూర్యుడు ప్రార్థించెను. అప్పుడా మహర్షులు ఓ భాస్కరుడా ప్రస్తుతం శ్రీ హరికి ప్రీతికరంగా ఉండి భవిష్యత్తులో శివునకు ప్రేమ పాత్రకాబోయే ఆ క్షేత్రమేదో చెబుతున్నాం వినుము. యోగశాయితో ప్రారంభ##మై కేశపుని దర్శనం వరకు వ్యాపించియున్న ఆపవిత్రహరి క్షేత్రమే వారాణసీ నగరం. వారి మాటలు వినిశివ నేత్రాగ్ని జ్వాలలకు దగ్ధమౌతున్న భాస్కరుడు, వరణా అసీనదుల మధ్యప్రదేశంలోపడిపోయెను. శివనేత్రాగ్నిజ్వాలలకు తట్టుకోలేక సూర్యుడు అసీనదిలో పడి అక్కడ నుంచి దొర్లుకుంటూ పోయి వరణా జలాల్లో మునిగాడు. మరల వరుణ నుంచి అసీ, అసీ నుంచి వరుణ నదుల జలాల్లో మాటి మాటికి అగ్ని చక్రంలాగా ఇష్టం వచ్చినట్లు దొర్లుతూ ఆజలాల్లో తనమండే శరీరాన్ని తడుపుకోసాగేడు ఈ లోపున ఓనారదా! బుషులు యక్షరాక్షసులు నాగులు విద్యాధరోప్సరసలు పక్షులు భూత ప్రేతాదులందరు కలిసి ఈ వృత్తాంతం విరించికి తెలియచేయుటకు బ్రహ్మలోకానికి వెళ్లారు.

తతోబ్రహ్మాసురపతిం సురైఃసార్థం సమభ్యగాత్‌ | రమ్యంమహేశ్వరావాసం మందరంరవికారణాత్‌. 57

గత్వా దృష్ట్వాచదేవేశం శంకరంశూలపానినం | ప్రసాద్యభాస్కరార్థాయ వారాణస్యాముపానయత్‌. 58

తతో దివాకరంభూయః పాణినాదాయశంకరః | కృత్వా నామాస్యలోలేతి రథమారోపయత్‌ పున. 59

ఆరోపితే దినకరే బ్రహ్మా7భ్యేత్య సుకేశినమ్‌ | సబాంధవంసనగరం పునరారోపయద్దివి. 60

సమారోప్యసుకేశించ పరిష్వజ్యచ శంకరం | ప్రణమ్యకేశవందేవం వైరాజం స్వగృహంగతః. 61

ఏవంపురానారదః భాస్కరేణ పురం సుకేశిర్భువిసన్ని పాతితమ్‌ |

దివాకరో భూమితలే భ##వేన క్షిప్తస్తు దృష్ట్యానచసంప్రదగ్ధః. 62

ఆరోపితో భూమితలాద్‌ భ##వేన భూయో7పిభానుః ప్రతిభాసనాయ,

స్వయంబువాచాపి నిశాచరేంద్ర స్త్వారోపితః ఖేసపురఃసబంధుః. 63

ఇతి శ్రీవామనమహాపురాణ షోడశో7ధ్యాయః.

అంతట దేవపతి బ్రహ్మ శివుని రమణీయ సదనం మందర పర్వతానికి సూర్యుని రక్షించుటకై దేవగణంతో కూడి బయలుదేరెను. అచట శూలపాణి మహాదేవుని ప్రసన్నుని గావించికొని, భాస్కరుని రక్షించుట కై వారణసీ నగరానికి తోడి తెచ్చెను. మంటల వేడిమికి అటునిటు దొర్లుచున్న సూర్యుని, శివుడు చేతితో స్పృశించి, ఆయనకు *'లోలు'డని పేరిడి రథముపై గూచ్చుండ బెట్టెను. ఆవిధంగా సూర్యుని పునః ప్రతిష్ఠితుని గావించి బ్రహ్మసుకేశిని సమీపించి ఆయనను ఆయన నగరంతో బంధు జనులతోసహా మరల దివియందు ప్రతిష్ఠితుని గావించెను. సుకేశికి పునరావాసం కల్పించి శంకరుని ఆలింగనం చేసికొని విష్ణువుకు సమస్కరించి విరించి తిరిగి తన వైరాజ సదనానికి వెలిలిపోయెను.

నారదా ! ఈ విధంగా పూర్వకాలాన సుకేశినగరం సూర్యుని చేత భూమిమీదకు త్రోయబడగా సూర్యుడు హరనేత్రాగ్ని వల్ల దగ్ధుడై భూమి మీద పడిపోయినాడు కరుణామయుడగు, శివుడా సూర్యుని భూమినుండి ఉద్ధరించి మరల వెలుగు నట్లోనరించెను. కాగా రాక్షసేంద్రుడగు సుకేశిని ఆతని నగరం పరివారంతో సహా, విరించి మరల అంతరిక్షాన నిలిపినాడు.

ఇది వామనమహాపురాణంలో పదునారవ అధ్యాయం సమాప్తము.

____________________________

*ఈనాడు వారణాసిలో ఆప్రదేశం ''లోలార్క'' కుండం అని పిలవబడుతూంది.

Sri Vamana Mahapuranam    Chapters