Sri Vamana Mahapuranam    Chapters   

పదునైదవ అధ్యయము

ఋషయ ఊచుః :

యచ్చవర్జ్యం మహాబాహో సదా ధర్మస్థితైర్నరైః |

యద్భోజ్యం చ సముద్దిష్టం కథయిష్యామహే వయమ్‌. 1

భోజ్యమన్నం పర్యుషితం స్నేహాక్తం చిరసంభృతమ్‌ | అస్నేహా వ్రీహయః శ్లక్ష్నా వికారాః పయసస్తథా. 2

శశకః శల్యకో గోధా శ్వావిధో మత్స్యకచ్ఛపౌ | తద్వద్‌ద్విదలకాదీని భోజ్యాని మనురబ్రవీత్‌. 3

మణిరత్నప్రవాళానాం తద్వన్ముక్తాఫలస్యచ | శైలదారుమయానాంచ తృణమూలౌషధాన్యపి. 4

శూర్పధాన్యాజినానాం చ సంహతానాంచ వాససామ్‌ | వల్కలానా మశేషాణా మంబునా శుద్ధిరిష్యతే. 5

సస్నేహాన మథోష్ణేన తిలకల్కేన వారిణా | కార్పాసికానాం వస్త్రాణాం శుద్ధిః స్యాత్సహభస్మనా. 6

నాగదంతాస్థిశృంగాణాం తక్షణా చ్ఛుద్ధిరిష్యతే | పునఃపాకేన భాండానాం మృన్మయానాంచ మేధ్యతా. 7

శుచిభైక్షం కారుహస్తః పణ్యం యోషిన్ముఖం తథా | రథ్యాగత మవిజ్ఞాతం దాసవర్గేణ యత్కృతమ్‌. 8

వాక్ర్పశస్తం చిరాతీతమనేకాంతరితం లఘు | చేష్టితం బాలవృద్ధానాం బాలస్యచ ముఖంశుచి. 9

కర్మాంతాంగారశాలాసు స్తనంధయసుతాః స్త్రియః | వాగ్విప్రుషో ద్విజేంద్రాణాం సంతప్తాశ్చాంబు బిందవః

ఋషుల వచనముః మహావీరా! ఎల్లపుడు ధర్మమునందు నిలకడ గల మానవుడు భుజింప దగినవేవో వర్జింప దగినవేవో చెప్పుచున్నాము వినుము. నూనె లేక నేతితో బాగావండబడిన అన్నము చాలకాలము క్రిందటిదైనను తినవచ్చును. నూనె నేయి తగలకుండ వండబడిన బియ్యపుటన్నము, పాయసాన్నము, కుందేలు, ఏదుపంది, మొసలి, ముళ్ళపంది, తాబేలు మాంసము, చేపలు పప్పులు కూరలు మొదలగు వానిని తినవచ్చునని మనువు ఆదేశము. మణిరత్న ప్రవాళాలు శిలాదారుమయాలు, తృణధాన్యాలు, గడ్డలు, జల్లెడ, జింకచర్మము, నూతనవస్త్రాలు, అన్నిరకముల నారగుడ్డలు (చెట్ల బెరడుతో చేసినవి) నీటితో కడిగి శుద్ధిచేయాలి. జిడ్డు తగిలిన వస్తువులన్నింటిని నువ్వుల నూనెతో కాచిన కషాయంలో శుభ్రం చేయాలి. నూలు ఉన్నిబట్టలను బూడిద కలిసిన నీటితో శుద్ధిచేయాలి. ఏనుగుదంతాలు, కొమ్ములు పరిశుద్ధములే. మట్టిపాత్రలకు అగ్ని సంస్కారం శుద్ధిసాధనం. భిక్షాటనవల్ల తెచ్చిన అన్నం పనివాని (శిల్పి) చేయి, స్త్రీ ముఖము, బజారు నుండి కొనితెచ్చినవి, దాసదాసీలు తెచ్చినవి, ప్రశంసించబడిన వస్తువులు, చిరకాలంనుంచీ ఉంచబడిన వస్తవులు, చాలచేతులు మారినవి, తేలికవస్తువులు, బాలవృద్ధుల కృత్యాలు, బాలల ముఖలు, యివన్నియు పరిశుద్ధాలే. ధాన్యపుకొట్లు, బొగ్గు నిల్వచేయు కొట్లు బాలింతస్త్రీలు, పాలుత్రాగే శిశువులు, బ్రాహ్మణుల నోటినుండి వెలువడు తుంపరలు ఉష్ణోదకములు ఇవన్నియు పరిశుద్ధములే.

భూమిర్విశుధ్యతే ఖాతదాహమార్జనగోక్రమైః | లేపదుల్లేఖనాత్‌ సేకాద్‌ వేశ్మ సంమార్జనార్చనాత్‌. 11

కేశకీటావపన్నే77న్నే గోఘ్రాతే మక్షికాన్వితే | మృదంబుభస్మక్షారాణి ప్రక్షే ప్తవ్యాని శుద్ధయే. 12

ఔదుంబరాణాం చావ్లుెన క్షారేణ త్రపుసీసయోః | భస్మాంబుభిశ్చ కాంస్యానాం శుద్ధిః ప్లావో ద్రవస్యచ. 13

అమేధ్యాక్తస్యమృత్తోయైర్గంధాపహరణనచ | అన్యేషామపిద్రవ్యాణాం శుద్ధిర్గంధాపహారతః. 14

మాతుఃప్రస్రవణ వత్సః శకునిః ఫలపాతనే | గర్దభో భారవాహిత్వే శ్వామృగగ్రహణ శుచిః. 15

రథ్యాకర్దమతోయాని నావః పథి తృణానిచ | మారుతేనైవ శుధ్యంతి పక్వేష్టకచితానిచ. 16

శృతంద్రోణాఢకస్యాన్న మమేధ్యాభిప్లుతం భ##వేత్‌|

అగ్రముద్ధృత్య సంత్యాజ్యం శేషస్య ప్రోక్షణం స్మృతమ్‌. 17

ఉపవాసం త్రిరాత్రంవా దూషితాన్నస్య భోజనే | అజ్ఞాతేజ్ఞాతపూర్వేచ నైవశుద్ధి ర్విధీయతే. 18

భూమిశుద్ధి, పారతో గడ్డిగాదం తొలగించిగాని, పైనున్న చెత్త కాల్చిగాని చీపురుతో చిమ్మిగాని, ఒకరాత్రిపగలు ఆవుల చేత త్రొక్కించిగాని, ఆవుపేడతో అలికించిగాని ఆవు పంచితం చల్లిగాని చేసుకోవచ్చు. యింటిని ఊడ్చిగాని అందులో పూజచేసిగాని శుద్ధిచేసుకోవలె. వెంట్రుకలు పడినా మక్షికాది కీటకాలు వాలినా, ఆవులు వాసననచూచినా, అలాంటి అన్నం మీద మృత్తిక భస్మక్షారాలు కలిసిన జలం చిలికించి పవిత్రం చేసుకోవలెను. సత్తు గిన్నెలు సీసపు పాత్రలు క్షార జలంతోను రాగిపాత్రలను పులుసుతోను, కంచుపాత్రలను బూడిదకలిపిన నీటితోను, శుద్ధిచేయవలె. మలస్పర్శ కలిగిన వస్తు వులను దుర్వాసన వదిలే వరకు మట్టితో శుద్ధి చేసుకోవలె. ఇతర వస్తువులు కూడా దుర్గంధం వదిలేవరకు అట్లే శుద్ధి చేసుకోవలెను. చనుబాలు త్రాగే శిశివు పవిత్రుడు. పక్షి (చిలుక) కొరికి పడవేసిన పండు, బరువుమోయుచున్న గాడిద, లేడిని పట్టుకున్న కుక్క పరిశుద్ధాలు. దారి, బురద, నీరు, పడవలు, దారిలో పెరిగిన గడ్డి, వీనిని గాలి శుభ్రపరుచును. కాల్చిన ఇటుకలు గూడ నట్లే. అమేధ్యంలాంటి ఆపవిత్ర వస్తుస్పర్శ గలిగిన భోజనం (అన్నం) , అడ్డెడు మానెడు వండినది, ఎక్కువ ప్రయాణంలో ఉన్నపుడు దానిపై పొరతీసి పారవైచి మిగిలిన దానిపై నీరు ప్రోక్షించి శుద్ధి చేసుకోవలెను. అశుద్ధాన్నం తెలియక తినినచో ఒకరాత్రిగాని, మూడు రాత్రులుగాని ఉపవాసం చేసి దోషం పోగొట్టుకోవచ్చు. తెలిసిగూడ దూషితాన్నం తింటే దానికి శుద్ధియేలేదు.

ఉదక్యాశ్వాననగ్నాంశ్చ సూతికాంత్యావసాయినః | స్పృష్ట్వా స్నాయీత శౌచార్థం తథైవ మృతహారిణః. 19

నస్నేహ మస్థి సంస్పృశ్య సవాసాః స్నానమాచరేత్‌ | ఆచమ్యైవతు నిఃస్నేహం గామాలభ్యార్క మీక్ష్యచ

నలంఘయే త్పురీషాసృక్‌ ష్ఠీవనోద్వర్తనానిచ | గృహాదుచ్ఛిష్టవిణ్మూత్రపాదాంభాంసి క్షిపేద్‌ బహిః. 21

పంచపిండా ననుద్ధృత్య నస్నాయాత్‌ పరవారిణి | స్నాయీత దేవఖాతేషు సరోహ్రదసరిత్సుచ. 22

నోద్యానాదౌ వికాలేషు ప్రాజ్ఞస్తిష్ఠేత్‌ కదాచన | నాల పేద్‌ జనవిద్విష్టం వీరహీనాం తథాస్త్రియమ్‌. 23

దేవతాపితృసచ్ఛాస్త్రయజ్ఞవేదాదినిందకైః | కృత్వాతు స్పర్శమాలాపం శుధ్యతే7ర్కావలోకనాత్‌. 24

ఆభోజ్యాః సూతికాషంఢమార్జారాఖుశ్వకుక్కుటాః | పతితాపవిద్ధనగ్నా శ్చాండాలాద్యధమాశ్చయే. 25

రజస్వల అయిన స్త్రీని, కుక్కను, దిగంబరుడిని, ప్రసూతయగు స్త్రీని, అంత్యజులను, శవవాహకులను తాకినచో స్నానంతో శుద్ధియగును. మాంసంతో కూడిన ఎముకను తాకినచో సచేల స్నానంచేయాలి. ఎండిన ఎముక అయితే ఆచమనంచేసి గాని ఆవును తాకిగాని సూర్యుని చూచిగాని శుద్ధిచేసుకోవచ్చు. మలం రక్తం ఉమ్మి నలుగుపెట్టి పారవేసిన పిండి వీనిని దాటకూడదు. ఎంగిలి, చెత్త చెదారం, పెద్దలకు పాద ప్రక్షాళనం చేసిన నీరు, మూత్రాదులు యింటికి దూరంగా పారవేయాలి. ఇతరులకు చెందిన జలాశయాల్లో స్నానం చేసేముందు అయిదు దోసిళ్ళ నీరు బయటకు చిమ్మవలెను. ప్రకృతి సిద్ధాలయిన చెరువుల్లో జలాశయాల్లో నదీనదాల్లోను స్నానం చేయాలి. అనుచిత సమయాల్లో ప్రాజ్ఞుడు ఉద్యానవనాలలో నిలవడు, జనవిద్వేషియయిన వ్యక్తితో మాటాడడు, విధవలతో వ్యర్థ స్త్రీలతో మాట్లాడడు. దేవపితృనిందకులు వేదశాస్త్ర యజ్ఞాది దూషకులను తాకినను సంభాషించినను, వెంటనే సూర్యునిచూచి పవిత్రులు కావచ్చును. సూతికులు, షండులు, మార్జార, మూషిక, శునక, కుక్కుట, పతితులు, అపవిద్ధులు, నగ్న చండాలాది హీనుల నుండి భోజనం గ్రహించరాదు.

సుకేశి రువాచ:

భవద్భిః కీర్తితా7భోజ్యా యఏతే సూతికాదయః |అమీషాం శ్రోతు మిచ్ఛామితత్వతో లక్షణానిహి. 26

ఋషయ ఊచుః :

బ్రాహ్మణీ బ్రాహ్మణసై#్యవయా7వరోధత్వమాగతా | తావుభౌ సూతి కేత్యుక్తౌ తయోరన్నం విగర్హితమ్‌. 27

నజుహోత్యుచితేకాలే నస్నాతి నదదాతిచ | పితృదేవార్చనాద్దీనః స షంఢః పరిగీయతే. 28

దంభార్థం జపతే యశ్చ తప్యతే యజతే తథా | నపరత్రార్థ ముద్యుక్తో సమార్జారః ప్రకీర్తితః. 29

విభ##వే సతి నైవాత్తి నదదాతి జుహోతిచ | తమాహు రాఖుం తస్యాన్నం భుక్త్వా కృచ్ఛ్రేణ శుద్ధ్యతి. 30

యఃపరేషాం హి మర్మాణి నికృంతన్నివ భాషతే | నిత్యం పరగుణద్వేషీ సశ్వాన ఇతికథ్యతే. 31

సభాగతానాం యః సభ్యః పక్షపాతం సమాశ్రయేత్‌|

తమాహుః కుక్కుటం దేవా స్తస్యాప్యన్నం విగర్హితమ్‌. 32

స్వధర్మం యః సముత్సృజ్య పరధర్మం సమాశ్రయేత్‌ | అనాపదిసవిద్వద్భిః పతితః పరికీర్త్యతే. 33

దేవత్యాగీ పితృత్యాగీ గురుభక్త్యరత స్తథా | గోబ్రాహ్మణస్త్రీవధకృ దపవిద్ధః సకీర్త్యతే. 34

యేషాంకులే నవేదో7స్తి నశాస్త్రం నైవచ వ్రతమ్‌ | తేనగ్నాఃకీర్తితాఃసద్భి స్తేషామన్నంవిగర్హితమ్‌. 35

ఆశార్తానామదాతాచ దాతుశ్చప్రతిషేధకః | శరణాగతంయస్త్యజతి సచండాలోధమోనరః. 36

యోబాంధవైః పరిత్యక్తః సాధుభిర్‌బ్రాహ్మణౖరపి | కుండాశీయశ్చతస్యాన్నం భుక్త్వాచాంద్రాయణంచరేత్‌.

యోనిత్య కర్మణో హానిం కుర్యాన్నైమిత్తికస్యచ | భుక్త్వాన్నంతస్యశుద్ధ్యేత త్రిరాత్రోషోషితోనరః. 38

గణకస్యనిషాదస్య గణికా భిషజో స్తథా | కదర్యస్యాపిశుద్ధ్యేత త్రిరాత్రోపోషితోనరః. 39

నిత్యస్యకర్మణోహానిః కేవలం మృతిజన్మసు | నచనైమిత్తికోచ్ఛేదః కర్తవ్యోహికథంచన. 40

సుకేశి వచనం : మహనీయులారా! సూతికాదులనుండి భోజనం గ్రహించకూడ దన్నారు. అలాంటి వారి లక్షణాలేవో వివరించండి.

ఋషుల వచనము: బ్రాహ్మణుని భ్రష్టుని గావించిన బ్రాహ్మణస్త్రీ, యిద్దరూ సూతికులనబడతారు. వారల చేతినుండి తినరాదు. సకాలంలో స్నానజప సంధ్యావందనాదులు, హోమాది కర్మలు, దేవపితృ కార్యాలు దాన ధర్మాదులు చేయనివాడు షంఢుడు. డాంబికంగా జపం తపం యజ్ఞాదులు చేస్తూ పరలోక చింతన లేనివారు మార్జారులు. సంపద కలిగి ఉండి కూడా దానహోమాదులు చేయకుండా తామే అనుభవించేవారు మూషికులు. వారల అన్నం తినరాదు. కృచ్ఛ్రాదులు చేస్తేనే ఆ పాపం పోతుంది. ఎల్లపుడూపరులను సూటిపోటు మాటలతో వేధిస్తూ పరులలోని సద్గుణాలను ద్వేషించేవానిని శునకుండంటారు. సభలోనున్న సభ్యులపట్ల పక్షపాత బుద్ధితో బాహాటంగా వ్యవహరించేవాడు కుక్కులుడు. అటువంటి వాడొసగిన అన్నం తినరాదు. ఏలాంటి ఆపద కలగనప్పటికీ స్వధర్మాన్ని వదలి పరధర్మాన్ని ఆశ్రయించేవాడు పతితుడు. వాని చేతిఅన్నం తినగూడదు. దేవపితృకార్యాలు వదలి గరువులపట్ల భక్తిలేక, గోవులను బ్రాహ్మణులను స్త్రీలను వధించు దుష్టుడు అపవిద్ధుడు. ఎవడి యింట్లో ఎప్పుడూ కూడ ఎలాంటి వ్రతాలుగాని వేదాధ్యయన శాస్త్ర చర్చలు గాని జరగవో వాడు నగ్నుడు (దిగంబరడు) . వాడొసగు భోజనం గర్హించదగినది. ఇతరులకు ఆశగొలిపి దానిని పూర్తిచేయనివాడు, దానం చేసేవాడిని అడ్డగించేవాడు, తన్నాశ్రయించు వానిని నట్టేటముంచువాడు చండాలుడు. అధముడు. బంధు పరిత్యక్తుడు సాధువులు బ్రాహ్మణులచే విడువబడిన వాడు, దుశ్శీలునిచే తిండితినేవాడి ఇంట భుజించినచో చాంద్రాయణం చేస్తేనే శుద్ధి నిత్యమైమిత్తిక కర్మలు వదలిన వానింట భుజిస్తే మూడు రాత్రులు ఉపవాసం చేయాలి. గణకుడు (జ్యోతిషి), వ్యాధుడు, వేశ్య , వైద్యుడు. లోభి. వీరలొసగిన అన్నం భుజిస్తే ప్రాయశ్చిత్తంగా మూడు రాత్రులు ఉపవసించాలి. జాతాశౌచమృతాశౌచములు కలిగినప్పుడు నిత్య విధులు మానుకోవచ్చ. కాని ఎట్టిపరిస్థితులలోను నైమిత్తిక కర్మలు వదులుకోరాదు.

జాతేపుత్రేపితుఃస్నానం సచైలన్య విధీయతే | మృతచసర్వబంధూనా మిత్యాహభగవాన్‌ భృగుః. 41

ప్రేతాయసలిలందేయం బహిర్ధగ్ధ్వాతుగోత్రజైః | ప్రథమే7హ్ని చతుర్థేవా సప్తమేవా7స్థి సంచయమ్‌. 42

ఊర్థ్వం సంచయనాత్తేషా మంగస్పర్శోవిధీయతే | సోదకైస్తు క్రియాకార్యా సంశుద్ధైస్తు సపిండజైః. 43

విషోద్బంధన శస్త్రాంబు వహ్నిపాతమృతేషుచ | బాలే ప్రవ్రాజిసంన్యాసే దేశాంతరమృతే తథా. 44

సద్యఃశౌచంభ##వేద్వీర తచ్చాప్యుక్తం చతుర్విధమ్‌ | గర్భస్రావేతదేవోక్తం పూర్ణకాలే న చేతరే. 45

బ్రాహ్మణానామహోరాత్రం క్షత్రియాణాం దినత్రయమ్‌|

షడ్రాత్రంచైవ వైశ్యానాం శూద్రాణాంద్వాదశాహ్నికమ్‌. 46

దశ ద్వాదశ మాసార్ధ మాససంఖ్యై ర్దినైశ్చ తైః |

స్వాః స్వాః కర్మక్రియాః కుర్యుః సర్వే వర్ణా యథాక్రమమ్‌. 47

ప్రేతముద్దిశ్య కర్తవ్య మేకోద్దిష్టం విధానతః | సపిండీకరణం కార్యం ప్రేతే ఆవత్సరా న్నరైః. 48

తతః పితృత్వ మాపన్నే దర్శపూర్ణాదిభిః శుభైః | ప్రీణనం తస్య కర్తవ్యం యథాశ్రుతి నిదర్శనాత్‌. 49

పితురర్థం సముద్దిశ్య భూమిదానాదికం స్వయం | కుర్యా ద్యేనాస్య సుప్రీతాః పితరో యాంతి రాక్షస. 50

యద్యదిష్టతమం కించి ద్యచ్చాస్య దయితం గృహే | తత్త ద్గుణవతే దేయం తదేవాక్షయ మిచ్ఛాతా. 51

అధ్యేతవ్యా త్రయీ నిత్యం భావ్యంచ విదుషా సదా | ధర్మతో ధన మాహార్యం యష్టవ్యం చాపి శక్తితః 52

యచ్చాపి కుర్వతో నాత్మా జుగుప్సామేతి రాక్షస | తత్కర్తవ్య మశంకేన యన్నగోప్యం మహాజనే. 53

ఏవ మాచరతొ లోకే పురుషస్య గృహే సతః | ధర్మార్థకామసంప్రాప్తిః పరత్రేహచ శోభనమ్‌. 54

ఏషతూద్ధేశతః ప్రోక్తో గృహస్థాశ్రమ ఉత్తమః | వానప్రస్థాశ్రమం ధర్మం ప్రవక్ష్యామో7వధార్యతామ్‌. 55

పుత్రజన్మ కలుగగానే సచేలస్నానం తండ్రి చేయాలి. కుటుంబంలోని వారెవరైనను మరణించినచో బంధువు లందరు స్నానం చేయాలని భృగుమహర్షి వచనం. మరణించిన వానిని యింటిబయట దూరంగా దహనం చేయాలి. సగోత్రీయులు జలతర్పణం వదలాలి. మొదటివాడుగాని నాలుగవ లేక ఏడవ దినాన అస్థి సంచయనం చేయాలి. అస్థి సంచయనానంతరం సోదరులందరు తమ అంగస్పర్శ చేసుకోవలె. సపిండీకులు శుద్ధిఅనంతరం శ్రాద్ధకర్మ చేయాలి. విషప్రయోగం వల్ల, ఉరి, శస్త్రాలద్వారా, అగ్నివల్ల, నీళ్ళలో మునిగినందున, పైనుండి క్రిందపడినందున మృతి కలిగినప్పుడు, బాలురు సన్యాసులు మరణించినప్పుడు దేశాంతరగతుడు చనిపోయినను యీ పరిస్థితులలో నాలుగు రకాలయిన సద్యఃశుద్ధి (వెంటనే శుద్ధి) చెప్పబడింది. గర్భస్రావం జరిగినప్పుడు కూడ యింతే. ఇతరులకు మాత్రం శౌచకాల పరిసమాప్తినుందే శుద్ధి - బ్రాహ్మణుల కొకరోజు క్షత్రియులకు మూడురోజులు, వైశ్యులకు ఆరురోజులు, శూద్రులకు పండ్రెండు రోజులు అశుచి. ఈ అన్నిజాతుల వారును వారివారి ఆచారాల ననుసరించి వరుసగా పది, పండ్రెండు పదిహేను రోజులకు శ్రాద్ధములు చేసుకోవాలి. విధివిధానంగా చనిపోయిన వారికి ఏకోద్దిష్ట కర్మ జరపాలి. సంవత్సరాంతంలో సపిండీకరణంచేయాలి. ప్రేతత్వవిముక్తి కలిగిన పితృత్వం కలిగి తర్వాత వేదవిహితంగా ధర్మపూర్ణ కర్మలు నిర్వర్తించి వారికి తర్పణ చేయాలి. ఓ రాక్షసేశ్వరా! పితరులకు ఉత్తరోత్తర సద్గతులు గలుగుటకు భూగో హిరణ్య దానాదులు చేయాలి. పితరులకు వారి జీవిత కాలంలో ఏయేవస్తువులు యిష్టతమాలో ఆయావస్తువును దానం చేసినచో వారల కక్షయ లోకములు గలుగును. విద్వాంసుడు ప్రతిదినం వేదాధ్యయనం చేయవలె, ధర్మంతప్పకుండా ధనార్జనం చేసి తన శక్త్యానుసారం యజ్ఞాదులు చేయాలి. తన అంతరాత్మకు జుగుస్సావహములు కానిపనులు, పెద్దలయెడ దాచనవసరం లేని పనులు గృహస్థుడైన వాడు సంకోచం లేకుండా ఆచరించాలి. భార్యా బిడ్డలతో కూడియుండియూ ఈ విధంగా సదాచరణం చేయు మానవుడు ధర్మార్థ కామములు సమకూర్చుకొని ఈ లోకంలోను అనంతరం పరలోకంలోను సుఖాలు పొందుతాడు. ఇంతవరకు ఉత్తమ గృహస్థధర్మాలు చెప్పితిమి. ఇక వానప్రస్థుని విధులు వివరించుకొన్నాము జగ్రత్తగా వినుము.

ఆపత్యసంతతిం దృష్ట్వా ప్రాజ్ఞో దేహస్య చానతిమ్‌ | వానప్రస్థాశ్రమం గచ్ఛే దాత్మనః శుద్ధికారణమ్‌. 56

తత్రారణ్యోపభోగైశ్చ తపోభి శ్చాత్మకర్షణమ్‌ | భూమౌ శయ్యా బ్రహ్మచర్యం పితృదేవాతిథిక్రియా. 57

హోమ స్త్రిషవణం స్నానం జటావల్కలధారణమ్‌ | వన్యస్నేహనిషేవిత్వం వానప్రస్థవిధి స్త్వయమ్‌. 58

సర్వసంగపరిత్యాగో బ్రహ్మచర్య మమానితా | జితేంద్రియత్వ మావాసే నైకస్మిన్‌ వసతిశ్చిరమ్‌. 59

అనారంభ స్తథా7హారో భైక్షాన్నం నాతికోపితా | ఆత్మజ్ఞానావబోధేచ్ఛా తథా చాత్మవబోధనమ్‌. 60

చతుర్థేత్వాశ్రమే ధర్మా అస్మాభిస్తే ప్రకీర్తితాః | వర్ణధర్మాని చన్యాని నిశామయ నిశాచర. 61

గార్హస్థ్యం బ్రహ్మచర్యంచ వానప్రస్థం త్రయాశ్రమాః | క్షత్రియస్యాపి కథీతా యేచాచారా ద్విజస్యహి. 62

వైఖానసత్వం గార్హస్థ్య మాశ్రమద్వితయం విశః | గార్హస్థ్యముత్తమం త్వేకం శూద్రస్య క్షణదాచర. 63

స్వాని వర్ణాశ్రమోక్తాని ధర్మాణీహ న హాపయేత్‌ | యో హాపయతి తస్యాసౌ పరికుప్యతి భాస్కరః. 64

కుపితః కులనాశాయ ఈశ్వరో రోగవృద్ధయే | భానుర్వై యతతేతస్య నరస్య క్షణదాచర. 65

తస్మాత్‌ స్వధర్మం న హి సంత్యజేత న హాపయేచ్చాపి హి నాత్మవంశమ్‌|

యఃసంత్యజేచ్ఛాపి నిజం హి ధర్మంతసై#్మ ప్రకుప్యేత దివాకరస్తు. 66

పులస్త్య ఉవాచ:

ఇత్యేవ ముక్తో మునిభిః సుకేశీ ప్రణమ్యతాన్‌ బ్రహ్మనిధీన్‌ మహర్షీన్‌|

జగామ చోపత్యపురం స్వకీయం ముహుర్ముహు ర్ధర్మ మవేక్షమాణః. 67

ఇతి శ్రీ వామన మహాపురాణ పంచదశోధ్యాయః.

తెలివిగల గృహమేధి పుత్రపౌత్రులు కలిగిన తర్వాత తన శరీరపాటవం తగ్గడం గమనించి వెంటనే ఆత్మశుద్ధి కోసం వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. అరణ్యంలో దొరకే కందమూలాదులు తింటూ యింద్రియాలను అదుపులో నుంచుకొని తపస్సు చేసుకోవాలి. భూమిమీద శయనిస్తూ బ్రహ్మచర్యం నెరపాలి. పితరులను దేవతలనుపాసిస్తూ అతిథి అభ్యాగతుల సేవ చేయాలి. హోమం త్రికాలస్నానసంధ్యానుష్ఠానం జటావల్కల ధారణం వనాల్లో లభ్యమయ్యే తైలాదులుపయోగిస్తూ వానప్రస్థ జీవితం నెరపాలి. సర్వసంగ పరిత్యాగం, బ్రహ్మచర్యం, నిరహంభావం, ఇంద్రియ విజయం, ఒకేచోట దీర్ఘ కాలం నివసించకుండుట, లౌకిక కార్యాలకు దూరంగా ఉండటం, భిక్షాన్నగ్రహణం, చీటికిమాటికి కోపించకుండుట, ఆత్మజ్ఞానాపేక్ష, ఆత్మను తెలుసుకోవడం, తెలియజెప్పడం, ఇవి సన్యసాశ్రమ ధర్మాలు. నిశాచరా! యిప్పుడు చతుర్వర్ణాల వారి విధులేమో చెప్పెదము. వినవలసినది; బ్రహ్మచర్య గార్హస్థ్యవానప్రస్థాశ్రమ విధులు బ్రాహ్మణులతోబాటు క్షత్రియులు కూడ ఆచరించాలి. ఇక గార్హస్థ్య వానప్రస్థ ఆశ్రమ ధర్మాలు వైశ్యులు అనుష్ఠించాలి. కాగా శూద్రులకు గృహస్థాశ్రమ నిర్వహణమే ఉత్తమంగా చెప్పబడినది. ఈ విధంగా తమకు విధించబడిన ఆశ్రమ ధర్మాలను నాలుగు వర్ణాలవారూ వదలకుండా ఆచరించాలి. అలాకాక తమతమ ధర్మాలను త్యజించిన వారు ప్రత్యక్షదైవం సూర్యుని కోపానికి గురికాగలరు. సూర్యుడు కోపిస్తే మానవులు వ్యాధిపీడితులౌతారు. కులనాశనం సంభవిస్తుంది. కావున ఓ రాక్షస రాజా! తన క్షేమం, వంశ క్షేమం కోరిన మానవుడెట్టి పరిస్థితిలోను స్వధర్మాచరణంవదలకూడదు. వదలినచో భాస్కరుని కోపాగ్నికి ఆహుతి కాగలడు సుమాః''

పులస్త్యవచనము: నారదా! ఆవిధంగా ఋషులచే ప్రబోధింపబడి, ఆసుకేశి వారలకు ప్రణమిల్లి, వారల యుపదేశములను మాటిమాటికి నెమరువేసుకుంటూ ఆకాశమార్గాన తన నగరికి తిరిగి వెళ్ళాడు.

ఇది శ్రీ వామన మహా పురాణంలోని పదిహేనవ అధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters