Sri Vamana Mahapuranam    Chapters   

పదవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

తతః ప్రవృత్తే సంగ్రామే భీరూణాం భయవర్దనే | నహస్రాక్షో మహాచాప మాదాయ వ్యసృజచ్ఛారాన్‌. 1

అంధకో7పి మహావేగం ధనురాకృష్య భాస్వరమ్‌ | పురందరాయ చిక్షేప శరాన్‌ బర్హిణవాససః. 2

తావన్యోన్యం సుతీక్‌ష్ణగ్రైః శ##రైః సంవతపర్వభిః | రుక్మపుంఖై ర్మహావేగై రాజఘ్నతు రుభావపి. 3

తతఃక్రుద్దః శతమఖః కులిశం భ్రామ్య పాణినా | చిక్షేప దైత్యరాజాయ తందదర్శ తథాంధకః. 4

అజఘానచ బాణౌఘై రసై#్రఃశ##సై#్రః సనారద | తాన్‌భస్మసాత్తథాచక్రే నగానివ హుతాశనః. 5

తతోతివేగినంవజ్రం దృష్ట్వా బలవతాం వరః | సమాప్లుత్య రథాత్తస్థౌ భువి బాహుసహాయవాన్‌. 6

రథం సారథినా సార్థం సాశ్వధ్వజ సకూబరమ్‌ | భస్మ కృత్వాథ కులిశ మంధకం సముపాయ¸°. 7

తమాపతంతం వేగేన ముష్టనా7హత్య భూతలే | పాతయామాస బలవాన్‌ జగర్జచ తథా7ంధకః. 8

తం గర్జమానం వీక్ష్యాథ వాసవః సాయకై ర్దృఢమ్‌ |

వవర్ష తాన్‌ వారయన్‌ స సమభ్యాయా చ్ఛతక్రతుమ్‌. 9

ఆజఘాన తలేనేభం కుంభమధ్యే తదా కరే | జానునాచ సమాహత్య విషాణం ప్రబభంజచ. 10

వామముష్ట్యా తథా పార్శ్వం సమాహత్యాంధక స్త్వరన్‌ | గజేంద్రం పాతయామాస ప్రహారైర్జర్జరీకృతమ్‌.

గజేంద్రాత్‌ పతమానాచ్చ అవప్లుత్య శతక్రతుః | పాణినా వజ్రమాదాయ ప్రవివేశరామరావతీమ్‌. 12

పరాజ్‌ ముభే సహస్రాక్షే తద్దైవతబలం మహత్‌ | పాతయామాస దైత్యేంద్రః పాదముష్టితలాదిభిః. 13

తతో వైవస్వతో దండం పరిభ్రామ్య ద్విజోత్తమ | సమభ్యధావత్‌ ప్రహ్లాదం హంతుకామః సురోత్తమః. 14

తమాపతంతం బాణౌఘై ర్వవర్ష రవినందనమ్‌ | హిరణ్యకశిపోః పుత్ర శ్చాపమానమ్య వేగవాన్‌. 15

తాంబాణవృష్టిమతులాం దండేనాహత్య భాస్కరిః | శాతయిత్వా ప్రచిక్షేవ దండం లోకభయంకరమ్‌. 16

స వాయుపథమాస్థాయ ధర్మరాజకథే స్థితః | జజ్వాలకాలాగ్ని నిభో యద్వద్దగ్దుం జగత్త్రయమ్‌. 17

జాజ్వాల్యమానమాయం తం దండం దృష్ట్వా దితేః సుతాః |

ప్రాక్రోశంతి హతః కష్టం ప్రహ్లాదో7యం యమేన హి. 18

తమాక్రందిత మాకర్ణ్య హిరణ్యాక్షసుతో7ంధకః | ప్రోవాచ మాభైష్టమయి స్థితే కో7యం సురాధమః. 19

ఇత్యేవముక్త్వా వచనం వేగేనాభిససార చ | జగ్రాహ పాణినాదండం హసన్‌ సవ్యేన నారద. 20

తమాదాయ తతోవేగాత్‌ భ్రామయామాస చాంధకః | జగర్జచ మహానాదం యథా ప్రావృషి తోయదః. 21

ప్రహ్లాదం రక్షితందృష్ట్వా దండా ద్దైత్యేశ్వరేణ హి | సాధువాదం దదుర్‌ హృష్టా దైత్యదానవయూథపాః. 22

భ్రామయంతం మహాదండం దృష్ట్వా భానుసుతో మునే |

దుఃసహం దుర్ధరం మత్వా అంతర్ధాన మగాద్‌ యమః. 23

అంతర్హితే ధర్మారాజే ప్రహ్లాదో7పి మహామునే | దారయామాస బలవాన్‌ దేవసైన్యం సమంతతః. 24

వరుణః శిశుమారస్థో బద్ధ్వా పాశైర్మహా7సురాన్‌ | గదయా దారయామాస తమభ్యాగా ద్విరోచనః. 25

తోమరై ర్వజ్రసంస్పర్శైః శక్తిభిర్మార్గణౖరపి | జలేశం తాడయామాస ముద్గరైః కణపై రపి. 26

తతస్తం గదయా7భ్యేత్య పాతయిత్వా ధరాతలే | అభిద్రుత్య బబంధాథ పాశై ర్మత్తగజంబలీ 27

తాన్‌ పాశాన్‌ శతధా చక్రీ వేగాచ్చ దనుజేశ్వరః | వరుణంచ సమభ్యేత్య మధ్యే జగ్రాహ నారద. 28

తతో దంతీచ శృంగాభ్యాం ప్రచిక్షేప తదా7వ్యయః | మమర్దచ తదా పద్భ్యాం సవాహం సలిలేశ్వరమ్‌. 29

తంమర్ధ్యమానం వీక్ష్యాథ శశాంకః శిశిరాంశుమాన్‌ | అభ్యేత్య తాడయాఃమాస మార్గణౖః కాయదారణౖః. 30

స తాడ్యమానః శిశిరాంశుబాణౖ రవాప పీడాం పరమాం గజేంద్రః.

దష్టశ్చ వేగాత్‌ పయసామధీశం ముహుర్ముహుః పాదతలై ర్మమర్ద. 31

పులస్త్యుడనెను. ఆ విధంగా పిరికివాండ్లను హడలెత్తించే సంగ్రామం జరుగుతుండగా, ఇంద్రుడు తన పెనుచాపాన్నెక్కుపెట్టి బాణాలు వదలసాగాడు. అంధకుడు సైతం, దేదీప్యనామంగా వెలిగిపోతున్న తన వింటిని వంచి, మహావేగంతో

వా. పు. 7

నెమలి ఈకలతో నలంకరించిన తీవ్ర శరాలను దేవేంద్రుని మీద కురిపించాడు. వారొకరినొకరు, బంగారు వికారము గల పదునైన బాణాలతో కడువేగంతో ప్రహరింపసాగారు. అంతట దేవేంద్రుడు కుపితుడై తన వజ్రాయుధాన్ని గిరగిర త్రిప్పి అంధకునిపై వేయగా నంధకుడది చూచి తీవ్రమైన శస్త్రాస్త్రాలు ప్రయోగించగా వానినతడెండు చెట్లను అగ్ని కాల్చి వేయునట్లు బూడిద గావించెను. తనపై విరుచుకుపడనున్న యింద్రుని వజ్రాన్ని చూచి దైత్యపతి తన రథం వదలి క్రిందకు దుమికెను. అంతట నా వజ్రము రథాన్ని సారథిని గుర్రాలను ధ్వజకూబరాలను దగ్ధం కావించి యంధకుని సమీపించెను. మహాబలశాలి యగు నంధకుడు తన కఠోర ముష్టిఘాతంతో, వేగంగా వస్తూన్న వజ్రాన్ని భూమ్మీద పడగొట్టి, భీషణంగా గర్జించాడు. గర్జారావం చేస్తున్న శత్రునిపై యింద్రుడు బాణాలు గుప్పింపగానాతడు వాటిని వారించి యింద్రునిపై లఘించెను. అతనిమదపుటేనుగు కుంభస్థలాన్ని అరచేతితోను తొండమును కాళ్ళతోను మర్దించి మోకాళ్ళతో దాని దంతాన్ని ముక్కలు గావించెను. ఎడమ చేతి పిడికిలితో ఏనుగు పార్శ్వాలను నుగ్గు నుగ్గుగావించి నేలపై పడగొట్టెను. నేలమీద కొరిగిపోవుచున్న ఐరావతం మీదినుంచి క్రిందకు దుమికి యింద్రుడు త్వరత్వరగా తన వజ్రాయుధాన్ని తీసికొని అమరావతికి పారిపోయెను. నాయకుడు పారిపోగా మిగిలిన దేవతలనందరను ఆదైత్యనాథుడు పదాఘాతాలతో ముష్టిఘాతాలతో మర్దించివై చెను. బ్రాహ్మణోత్తమా ! అంతట తన దండాన్ని ఝళిపిస్తూ ప్రహ్లాదుని చంపుటకై ఆతనిని వెంబడించెను. అంతనా హిరణ్యకశ్యపసుతుడు త్వరగా విల్లెక్కు పెట్టి బాణ వృష్టితో యముని ముంచెత్తెను. అంతట నా సూర్యతనయుడా బాణ సమూహాన్ని చెదరగొట్టి లోక భయంకరమైన తన దండాన్ని ప్రహ్లాదునిపైకి విసరివైచెను. యమునిచే వదలబడిన ఆ దండం ముల్లోకాలను దహించి వేసే కాలాగ్నిలాగ మండుతూ రావడం చూచి రాక్షసభటులు ''అయ్యో ! ప్రహ్లాదుడు యముని చేతిలో హతుడయినాడని ఆక్రోశించారు. వారి ఆర్తనాదం విన్న అంధకుడు వెంటనే ''నేనుండగా భయమెందుకు? ఎవడా సురాధము'' డంటూ నొక్క యుదుటున దుమికి ఎడమ చేతితో నాదండాన్ని పట్టుకొని అట్టహాసం గావించెను. తమ నాయకుడావిధంగా ప్రహ్లాదుని రక్షించుట చూచిన దైత్య దానవయోధులు ఆనందోత్సాహాంతో వారినభినందించిరి. తన కాలదండాన్ని ఆ విధంగా అంధకుడు గిరగిర త్రిప్పుడం చూచి భరించలేక రవిపుత్రుడు యముడు అంతర్హితుడై పోయాడు. ధర్మరాజు పలాయనంకావడంతో ప్రహ్లాదుడు దేవసైన్యాన్ని చెల్లాచెదరు కావించెను. అంతట వరణుడుకుపితుడై, తన శిశుమారాన్నెక్కి రాక్షసులను తన పాశాలతో బంధించి గదతో మోదసాగెను. అంతట వరుణునిపై విరోచనుడు లంఘించి వజ్రోపమాలైనతోమరశక్తి ముద్గర కణపాది ఆయుధాలతో, నాతని ప్రహరించెను. దానితో రెచ్చిపోయిన వరుణుడు తన గదతో విరోచనుని నేలబడగొట్టి మదపుటేనుగును వలె తన బలమైన పాశాలతో కట్టివైచెను. నారదా! అంతట క్షణ మాత్రాన విరోచనుడా వరుణపాశాలను త్రెంచివైచికొని వరుణునిపై దూకి ఆతని నడుము నొడిసిపట్టెను. అపుడాతని ఏనుగు వరుణుని తనదంతాలతో క్రిందకుబడ ద్రోసి వాహనంతో కూడ ఆజలాధిపతిని తన కాళ్ళతో మర్దించివైచినది. వరుణుని దుర్గతి చూచినంతనే చంద్రుడు పరుగు పరుగున వచ్చి దానిని పదునైన బాణాలతో ప్రహరించెను. చంద్రుని వాడి బాణాల బాధకు ఓర్వలేక ఘీంకరిస్తూ ఆ గజం వరుణుని మరింతగా తనపాదాల క్రింద మర్దించసాగినది.

స మృద్యమానో వరుణో గజేంద్ర పద్భ్యాం సుగాఢం జగృహే మహర్షే |

పాదేషు భూమిం కరయోః స్పృశంశ్చ మూర్థానముల్లాల్యబలాన్మహాత్మా. 32

గృహ్యాంగుళీభిశ్చ గజస్య పుచ్ఛం కృత్వేహబంధం భుజగేశ్వరేణ |

ఉత్పాట్య చిక్షేప విరోచనంహి సకుంజరం ఖే సనియంతృవాహమ్‌. 33

క్షిప్తోజలేశేన విరోచనస్తు సకుంజరో భూమితలే పపాత |

సాట్టం సయంత్రార్గలహర్మ్య భూమి పురంసు కేశేరివ భాస్కరేణ. 34

తతో జలేశః సగదః సపాశః సమభ్యదావ ద్దితిజం నిహంతుమ్‌ |

తతః సమాక్రంద మనుత్తమంహి ముక్తంతు దైత్యైర్ఘనరావతుల్యమ్‌. 35

హాహాహతో7సౌ వరుణన వీరో విరోచనో దానవసైన్యపాలః |

ప్రహ్లాదహేజంభకుజంభకాద్యా రక్షధ్వమభ్యేత్య సహాంధకేన. 36

అహో మహాత్మా బలవాన్‌ జలేశః సంచూర్ణయన్‌ దైత్యభటం సవాహమ్‌ |

పాశేన బద్ద్వా గదయానిహంతి యథాపశుం వాజిమఖే మహేంద్రః. 37

శ్రుత్వా7థశబ్దం దితిజైః సమీరితం జంభప్రధానా దితిజేశ్వరాస్తతః|

సమభ్యదావం స్త్వరితాజలేశ్వరం యథాపతంగా జ్వలితంహుతాశనమ్‌. 38

తాగాగతాన్‌ వై ప్రసమీక్ష్య దేవః ప్రాహ్లాదిముత్సృజ్యవితత్యపాశమ్‌ |

గదాంసముద్భ్రామ్య జలేశ్వరస్తు దుద్రావతాన్‌ జంభముఖానరాతీన్‌. 39

జంభంచపాశేన తథానిహత్య తారం తలేనాశనిసంనిభేన |

పాదేనవృత్రం తరసాకుజంభం నిపాతయామాస బలంచముష్ట్యా. 40

తేనార్థితా దేవవరేణదైత్యాః సంప్రాధ్రవన్‌ దిక్షువిముక్త శస్త్రాః |

తతో7ంధకః సత్వరితో7భ్యు పేయా ద్రణాయ యోద్దుం జలనాయ కేన. 41

తమాపతంతం గదయాజఘాన పాశేనబద్ద్వా వరుణో7సురేశమ్‌|

తంపాశమావిధ్య గదాం ప్రగృహ్య చిక్షేపదైత్యః సజలేశ్వరాయ. 42

తమాపతంతం ప్రసమీక్ష్యపాశం గదాంచ దాక్షాయణి నందనస్తు |

వివేశ##వేగాత్‌ పయసాంనిధానం తతో7ంధకో దేవబలంమమర్ద. 43

తతోహుతాశః సురశత్రుసైన్యం దదాహరోషాత్‌ పవనావధూతః |

తమభ్యయాద్‌ దానవవిశ్వకర్మా మయోమహాబాహు రుదగ్రవీర్యః. 44

తమాపతంతం సహశంబరేణ సమీక్ష్య వహ్నిః పవనేనసార్థం|

శక్త్యామయం శంబరమేత్యకంఠే సంతాడ్యజగ్రాహ బలాన్మహర్షే. 45

శక్త్యాసకాయావరణ విదారితే సంభిన్నదేహోన్యపతత్‌ పృథివ్యామ్‌ |

మయఃప్రజజ్వాల చ శంబరో7పి కంఠావలగ్నే జ్వలనేప్రదీప్తే. 46

సదహ్యమానో దితిజో7గ్నినా7థ సువిస్వరం ఘోరతరంరురావ |

సింహాభిపన్నో విపినేయథైవ మత్తోగజః క్రందతి వేదనార్తః. 47

తంశబ్దమాకర్ణ్యచ శంబరస్య దైత్యేశ్వరః క్రోధవిరక్తదృష్టిః |

ఆఃకింకిమేత న్నను కేనయుద్ధే జితోమయఃశబరదానవశ్చ. 48

తతో7బ్రువన్‌ దైత్యభటాదితీశం ప్రదహ్యతే హ్యేషహుతూశ##నేన |

రక్షస్వచాల్యేత్య తశక్యతే7న్యై ర్హురాశవోరయితుంరబాగ్రే. 49

ఇత్థం సదైత్యై రభినోదితస్తు హిరణ్యచక్షుస్తనయో మహర్షే |

ఉద్యమ్యవేగా త్పరిఘంహుతాశం సమాద్రవత్తిష్ఠతిష్ఠబ్రువన్‌ హి. 50

మహర్షే! అంతట వరుణుడు తన బలమంతా కూడగట్టుకొని తనను మర్దిస్తున్న ఏనుగు కాళ్ళనుగట్టిగా పట్టుకొని తలతో బలంగా నెట్టెను. వెంటనే అతివేగంతో దాని తోకను తన వ్రేళ్ళతో పట్టికొని నాగపాశాలతో పైనున్న విరోచనుని బంధించి, బలం కొలదీ ఆకాశానికి విసరివైచెను. అలా పైకెగర గొట్టబడి విరోచనుడు, సూర్యునిచే భూమి మీదకు సాట్టగోపుర ప్రాకారహర్మ్యాదులతో త్రోసివేయబడిన సుకేశి నగరం వలె తన గజంతో గూడ నేలమీద పడిపోయెను. అతనిని చంపివేయుటకు తన గదను పాశాలను తీసుకొని మీదబడుతూన్న వరుణుని చూచి దైత్యభటులు ''అయ్యో ! వరుణుని చేతిలో విరోచనుడు హతుడౌతున్నాడు గదా ! ఓ ప్రహ్లాదా ! జంభకుజంభులారా ! ఎవరైనా అడ్డుపడండి. అంధకా ! ఈ జలాధిపతి వాహనంతో కూడ విరోచనుని పాశబద్ధుని చేసి గదతో మర్దించి అశ్వమేధంలో ఇంద్రుడు పశువును వలె చంపుచున్నాడు. రండు ! రక్షించు'' డంటూ హాహాకారాలు చేశారు. ఆ అరుపులు విని జంభాదులైన రాక్షస నాయకులు అగ్ని శిలలపై దూకి శలభాల వలె జలేశ్వరునిపైకి లంఘించారు. వారి రాక గమనించిన వరుణుడు, విరోచనుని వదలిపెట్టి తన పాశాన్ని పెంచి గదాదండం త్రిప్పుతూ నా శత్రువులపై విరుచుకపడెను. జంభుణ్ణి పాశంతో సంహరించాడు. అరచేతితో తారుడి తల పగలగొట్టాడు. పాదాలతో వృత్ర కుజంభులను తన్ని, పిడికిటిపోటుతో బలుణ్ణి యమపురికి పంపాడు. అలా ఆ దేవశ్రేష్ఠుని చేత చావుదెబ్బలు తిని రాక్షసులు ఆయుధాలు వదలి తలకొక దారిగా పారిపోయారు. అది తెలిసిన అంధకుడు జలాధిపతితో సమరానికి త్వరత్వరగా పరుగులతో వచ్చిపడ్డాడు. తనమీద లంఘించిన ఆ దైత్యనాథుణ్ణి వరుణుడు పాశాలతో బంధించి గదతో ప్రహరించబోగా నాతడాకట్లు త్రెంచుకొని తన గదాదండం వరుణుని మీద ప్రయోగించాడు. తన గదాపాశాలు లాక్కొని తననే చంపవచ్చుచున్న అంధకుని ధాటికి తట్టుకోలేక వరుణుడు సముద్రంలో మునిగి దాక్కున్నాడు. మిగిలిన దేవ సైన్యాన్ని అంధకుడు మర్దించసాగాడు. అదిచూచి పవనుడు తోడు కాగా అగ్ని విజృంభించి దైత్యసేనలను దహించసాగగా, వాండ్లపైకి విశ్వకర్మమయ దానవుడు శంబరునితో కూడి దాడి చేశాడు. వారిర్వురను చూచి అగ్ని వాయువుతో కలిసి శక్తితో శూలంతో వారల కంఠాలను ప్రహరించి, యిద్దరిని గట్టిగాపట్టుకున్నారు. శక్తిఘాతానికి వాళ్ళదేహాలు చీలిపోయాయి. అగ్ని పట్టుకు యిద్దరి దేహాలు జ్వాలల్లో మాడిపోయాయి. అలా తగలబడుతూ వాళ్ళిద్దరూ సింహంచేత చిక్కిన మదపుటేనుగుల వలె ఆర్తనాదాలు చేశారు. ఆ శబ్దం విని దైత్యేశ్వరుడు కోపంతో మండిపడుతూ ''ఏమిది ? మయశంబరులను జయించిన వాడెవ్వడు ? వాడెక్కడ ?'' అని అరిచాడు. అప్పుడు రాక్షసభటులు ''ప్రభూ ! అగ్ని వాయువులు వీరిని దహిస్తున్నారు. రక్షించండి ! ఈ అగ్ని నివారించడం ఎవ్వరితరం గాదు'' అని మొర పెట్టారు. మహర్షీ! ఆ మాట వింటూనే హిరణ్యాక్ష పుత్రుడు మహావేగంతో ఇనుపగుదియ పట్టుకొని ''అగ్నీ ! నిలు నిలువు'' మంటూ వెంబడించాడు.

శ్రత్వా7ధకస్యాపి వచో7వ్యయాత్మా సంక్రుద్దచిత్త స్త్వరితోహిదైత్యమ్‌ |

ఉత్పాట్యభూమ్యాం చవినిష్పి పేష తతో7ంధకః పావకమాససాద. 51

సమాజఘానాథ హుతాశనంహి వరాయుధేనాథ వరాంగమధ్యే |

సమాహతొ7గ్నిః పరిముచ్యశంబరం తథా 7ంధకం స త్వరితో7 భ్యధావత్‌. 52

తమాపతంతం పరిఘేణభూయః సమాహనన్మూర్థ్ని తదా7ంధకో7పి |

సతాడితో7గ్ని ర్దితింజేశ్వరేణ భయాత్‌ ప్రదుద్రావరణాజిరాద్ధి. 53

తతో7ంధకో మారుతచంద్రభాస్కరాన్‌ సాధ్యాన్‌ సరుద్రాశ్వివసూన్‌ మహోరగాన్‌ |

యాన్‌ యాన్‌ శ##రేణ స్పృశ##తేపరాక్రమీ పరాజ్‌ ముఖాంస్తాన్‌ కృతవాన్‌ రణాజిరాత్‌. 54

తతో విజిత్యామరసైన్యముగ్రం సేంద్రంసరుద్రంసయమంససోమమ్‌ |

సంపూజ్యమానో దనుపుంగవైస్తు తదా7ంధకో భూమిముపాజగామ. 55

అసాద్యభూమిం కరదాన్‌ నరేంద్రాన్‌ కృత్వావ శేస్థాప్యచరాచరంచ |

జగత్సమగ్రం ప్రవివేశ ధీమాన్‌ పాతాళమగ్ర్యం పురమశ్మకాహ్వమ్‌. 56

తత్రస్థితస్యాపి మహా7సురస్య గంధర్వవిద్యాధరసిద్దసంఘాః |

సహాప్సరోభిః పరిచారణాయ పాతాళమభ్యేత్య సమావసంత. 57

ఇతి శ్రీ వామనమహాపురాణ దశమో7ధ్యాయః.

అంధకుని కేక వినగానే అగ్ని లాగిపట్టి నేలపై బడగొట్టెను. దానితో మండిపడి ఉత్తమాలయిన శస్త్రాలతో అంధకుడాహుతాశనుణ్ణి ప్రహరించాడు. నెత్తిపై బలమైన దెబ్బతగలడంతో అగ్ని శంబరుణ్ణి వదలిపెట్టి అంధకుడి మీద దూకాడు. అగ్ని తనను పరిఘతో ప్రహరించరాగా, అంధకుడు మరల గట్టిగా నతనిని కొట్టెను. దాంతో అగ్ని యుద్ధభూమి వదలి భయంతో పారిపోయెను. మహర్షే ! అంతటబోక, అంధకుడు చంద్ర సూర్య వాయువులను, రుద్రాశ్వి వసువులతోబాటు సాధ్యనాగులను, ఆయుధాలు పట్టి నిలబడిన ప్రతివారిని, బాణాలతో ప్రహరించి యుద్ధభూమి వదలి పారిపోవునట్లు చేశాడు. ఆ విధంగా ఇంద్ర రుద్ర యమ సోమాదులతో కూడిన దేవతలను దేవ సైన్యాన్ని జయించి దైత్యదానవుల పూజలందుకొని అంధకుడు భూలోకానికి తిరిగి చేరుకున్నాడు. భూలోకంలోని రాజులందరను లోబరచుకొని వారి నుండి పన్నువు వసూలు చేస్తూ చరాచర జగత్తునంతను తన వశం గావించుకొని ఆ ధీమంతుడైన అంధకుడు పాతాళానికి పోయి అశ్మకమనే నగరాన్ని చేరుకున్నాడు. ఆ మహాదానవుడక్కడ ఉండగా, గంధర్వ విద్యాధర అప్సరాదులు పాతాళానికి వెళ్ళి అతనికి పరి చర్యలు చేయసాగారు.

ఇది వామన మహా పురాణ మందలి పదవ అధ్యాయము సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters