Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఏడవ అధ్యాయము

మూ || సూత ఉవాచ -

ఇత్యుక్త్వా మునినా సాధ్వీ సావిప్రవనితాపునః | తంప్రణమ్యాథ పప్రచ్ఛ శివపూజా విధేః క్రమం || 1 ||

శాండిల్య ఉవాచ -

పక్షద్వయేత్రయోదశ్యాం నిరాహారో భ##వేద్యదా | ఘటీత్రయా దస్తమయా త్పూర్వం స్నానం సమాచరేత్‌ || 2 ||

శుక్లాంబరధరో ధీరో వాగ్యతో నియమాన్వితః | కృతసంధ్యా జపవిధిః శిపవూజాం సమారభేత్‌ || 3 ||

దేవస్య పురతః సమ్యక్‌ ఉపలిప్యన వాంభసా | విధాయ మండలం రమ్యం ధౌత వస్త్రాదిభి ర్బుధః || 4 ||

వితానాద్యై రలంకృత్య ఫలపుష్పన వాంకురైః | విచిత్ర పద్మముద్థృత్య వర్ణ పంచక సంయుతం || 5 ||

తత్రోపవిశ్య సుశుభే భక్తియుక్తః స్థిరాననే | సమ్య క్సంపాది తాశేష పూజోపకరణః శుచిః || 6 ||

ఆగమోక్తేన మంత్రేణ పీఠమా మంత్రయేత్సుధీః | తతః కృత్వాత్మ శుద్థించ భూతశుద్థ్యా దికంక్రమాత్‌ || 7 ||

ప్రాణాయా మత్రయం కృత్వా బీజవరైః సబిందుకైః | మాతృకాస్యస్యవిధివత్‌ధ్యాత్వాతాందేవతాంపరాం || 8 ||

సమాప్య మాతృకాభూయోధ్యాత్వా చైవ పరంశివం | వామభాగే గురుం సత్వా దక్షిణ గణపం సమేత్‌ || 9 ||

అంసోరుయుగ్మే ధర్మాదీన్న్యస్యనాభౌ చపార్శ్వయోః | అధర్మాదీనసంతాదీన్‌ హృదిపీఠే మనుంస్యసేత్‌ || 10 ||

ఆధారశక్తి మారభ్యజ్ఞానాత్మా సమసుక్రమాత్‌ | ఉక్తక్రమేణ విన్యస్య హృత్పద్మే సాధుభావితే || 11 ||

నవశక్తిమయేరమ్యే ధ్యాయే ద్దేవముపాపతిం | చంద్రకోటి ప్రతీకాశం త్రినేత్రం చంద్రశేఖరం || 12 ||

ఆ పింగల జటాజూటం రత్నమౌలి విరాజితం | నీలగ్రీవము దారాంగం నాగహారోపశోభితం || 13 ||

వరదాభయహస్తంచ ధారిణం చ పరశ్వధం | దధానం నాగవలయకేయూరాంగద ముద్రికం || 14 ||

వ్యాఘ్రచర్మ వరీధానం రత్న సింహాసనే స్థితం | ధ్యాత్వాత ద్వామభాగేచ చింతయేద్గిరి కన్యకాం || 15 ||

భాస్వజ్జపావ్రసూనాభాముదయార్కసమప్రభాం | విద్యుత్పుంజనిభాంతన్వీంమనోనయననందినీం || 16 ||

బాలేందుశేఖరంస్నిగ్థాంనీలకుంచితకుంతలాం | భృంగసంఘాతరుచిరాంనీలాలకవిరాజితాం || 17 ||

మణికుండలవిద్యోతన్ముఖమండలవిభ్రమాం - నవకుంకుమపంకాంకక పోలదలదర్పణాం || 18 ||

మధురస్మితవిభ్రాజదరుణాధరపల్లవాం | కంబుకంఠీం శివాముద్యత్‌కుచపంకజకుడ్మలాం || 19 ||

తా || సూతులిట్లనిరి - అనిమునిచెప్పగా ఆస్వాధివిప్రవనితమరల ఆతనికి నమస్కరించి శివపూజావిధిక్రమాన్ని అడిగింది. (1) శాండిల్యుని వచనము - రెండుపక్షములందు త్రయోదశియందు నిరాహారుడు కావాలి. అస్తమయంకన్న మూడు గడియలుముందు స్నానంచేయాలి (2) శుక్లవస్త్రములుధరించి, ధీరుడై మాటను అదుపులో ఉంచుకొని నియమం కలవాడై, సంధ్యాజపవిధులుచేసి శివపూజను ఆరంభించాలి (3) దేవుని ఎదుటకొత్తనీటితో మంచిగా అలికి, గుండ్రమైన, అందమైన మండపమును తెల్లనివస్త్రములతో ఏర్పరచిబుధుడు (4) చాందిని మొదలగువానితో అలంకరించి ఫలము పుష్పము కొత్తమొలకులు ఏర్పరచి ఐదురంగులుకల, విచిత్రపద్మాన్నివ్రాసి (5) శుభ##మైన స్థిరాసనమందు భక్తితో అక్కడ కూర్చొని, సమస్తపూజోపకరణములను బాగా సంపాదించిశుచియై (6) ఆగమోక్తమైన మంత్రంతో బుద్ధిమంతుడు పీఠమును మంత్రించాలి. ఆత్మశుద్ధిని, భూతశుద్ధి మొదలగు వానిని క్రమంగా ఆచరించాలి (7) బీజములు బిందువులతో కలిపి మూడుసార్లు ప్రాణాయామంచేసి, వీనిమాతృ కలను ఆ పరాదేవతను విధి ప్రకారము ధ్యానించి (8) మాతృకలను సమాప్తి చేసి పరమశివుని తిరిగి ధ్యానించి, వామ భాగమందు గురువును నమస్కరించి దక్షిణ దిక్కులో గణపతిని నమస్కరించాలి (9) భుజములు, తొడలందు ధర్మాదులను ఉంచి నాభియందు పార్శ్వములందు అధర్మాదులను అనంతాదులను హృదయ పీఠమందు మనువును ఉంచాలి (10) ఆధారశక్తి మొదలుకొని జ్ఞానాత్మను వరుసగా చెప్పిన ప్రకారము ఉంచి, బాగుగా భావింపబడిన హృత్పద్మమందు (11) నవశక్తి మయమైన, రమ్యమైన దానియందు దేవుడు ఉమాపతిని ధ్యానించాలి. కోటి చంద్రులతో సమానమైన త్రినేత్రుడైన చంద్రశేఖరుని (12) పింగళ వర్ణముగల జడలుగల వానిని, మౌళి యందు రత్నములతో వెలుగొందువానిని, నీలగ్రీవుని, ఉదారమైన అంగములు కలవానిని, నాగహారములతో శోభించువానిని (13) వరద అభయహస్తములు గల వానిని, నాగవలయమును కేయూరములుగా అంగదములుగా ముద్రికలుగా ధరించిన వానిని (14) వ్యాఘ్రచర్మము ధరించిన వానిని, రత్నసింహాసన మందున్న వానిని శివుని ధ్యానించి ఆతని వామ భాగమందు గిరికన్యకను ధ్యానించాలి (15) వెలుగుతున్న జపాప్రసూనము వంటి కాంతి గల దానిని, స్త్రీని, మనోనయనములను ఆనందింపచేసే దానిని (16) బాల ఇందువును తలలో గల దానిని, స్నిగ్థమైన దానిని, నల్లని వంగినతలనీలాలు గల దానిని,తుమ్మెదల గుంపువలె అందమైన దానిని, నీల అలకలతో వెలుగు దానిని (17) మణి కుండములతో వెలిగే ముఖమండలము కలదానిని, నూతనమైన కుంకుమ వంక చిహ్నముతో ఉన్నక పోలములనే దర్పణము గలదానిని, (18) మధురమైన చిరునగవుతో వెలిగే అరుణ అధరపల్లవము గల దానిని, శంఖమువంటి కంఠముగలదానిని, మంగళకరమైన దానిని, ఎదుగుతున్న కుచములను తామర మొగ్గలు గలదానిని (19)

మూ || పాశాంకు శాభయాభీష్ట విలసత్‌ సుచతుర్భుజా | అనేకరత్న విలసత్‌ కంకణాంకి తముద్రికాం || 20 ||

వలిత్రయేణ విలసత్‌ హేమకాంచీగుణాన్వితాం | రక్తమాల్యాం బరధరాం దివ్యచందన చర్చితాం || 21 ||

దిక్పాల వనితా మౌతిసన్నతాం ఘ్రి నరోరుహాం | రత్నసింహాసనారూఢాం సర్పరాజ పరిచ్ఛదాం || || 22 ||

ఏవంధ్యాత్వా మహాదేవందేవీంచ గిరికన్యకాం | న్యాసక్రమేణ సంపూజ్య దేవంగంధాదిభిః క్రమాత్‌ || 23 ||

పంచభిః బ్రహ్మభిః కుర్యాత్‌ ప్రోక్త స్థానేషువాహృది|పృథక్సుష్టాం జలిందేహే మూలేనచ హృదిత్రిధా || 24 ||

పునః స్వయంశివో భూత్వా మూలమంత్రేణ సాధకః|తతఃసంపూజయేద్దేవం బాహ్యపీఠేపునః క్రమాత్‌ || 25 ||

సంకల్పం ప్రవదేత్తత్ర పూజారంభే సమాహితః|కృతాంజలి పుటో భూత్వా చింతయే ద్థృది శంకరం || 26 ||

ఋణపాతక దౌర్భాగ్య దారిద్ర్య వినివృత్తయే | అశేషాఘ వినాశాయ ప్రసీదమమశంకర || 27 ||

దుఃఖ శోకాగ్ని సంతప్తం సంసార భయపీడితం | బహురోగాకులం దీనంత్రాహిమాం వృషవాహన || 28 ||

ఆగచ్ఛదేవదేవేశ మహాదేవ భయంకర | గృహాణ సహ పార్వత్యా తవపూజాం మయా కృతాం || 29 ||

ఇతి సంకల్ప్య విధివత్‌ బాహ్యపూజాం సమాచరేత్‌ | గురుంగణపతించైవ యజేత్‌ సవ్యాపనవ్యయోః || 30 ||

క్షేత్రేశమీశ కోణతు యజేద్వాస్తోష్పతిం క్రమాత్‌ | వాగ్దేవీం చయజేత్తత్ర తతః కాత్యాయనీం యజేత్‌ || 31 ||

ధర్మం జ్ఞానంచ వైరాగ్యం ఐశ్వర్యం చనమో7తకైః స్వరైరీశాది కోణషు పీఠపాదానను క్రమాత్‌

ఆ భ్యాంబిందువినర్గభ్యాం అథర్మాదీన్‌ ప్రపూజయేత్‌ || 32 ||

సత్వరూపైఃచతుర్దక్షుమధ్యే7సంతంసతారకం|సత్వాదీన్‌త్రీన్‌గుణాంస్తం తురూపాన్‌పీఠేషువిన్యసేత్‌ || 33 ||

అత ఊర్థ్వచ్ఛదేమాయాం సహలక్ష్మ్యా శివేనచ || 34 ||

తదంతే చాంబుజం భూయః సకలం మండల త్రయం|పత్రకేనర కింజల్కవ్యాప్తంతారాక్షరైఃక్రమాత్‌ || 35 ||

పద్మత్రయంతధాభ్యర్చ్యమధ్యేమండల మాదరాత్‌

వామాంజ్యేష్ఠాంచరౌద్రీంచభాగాద్యైఃదిక్షుపూజయేత్‌ || 36 ||

తా || పాశము అంకుశము అభయము అభీష్ట ఫలమిచ్చే నాలుగు చేతులు గలదానిని అనేఏక రత్నములతో వెలిగే కంకణముతో చిహ్నతమైన ముద్రికగల దానిని (20) వలిత్రయముతో వెలిగే బంగారు బడ్డాణముతో కూడిన దానిని, రక్తమాలలను, వస్త్రములను ధరించిన దానిని, దివ్యచందనము కలిగిన దానిని (21) దిక్పాలుర వనితల శిరస్సులతో నమస్కరింపబడే పాద పద్మములు కలదానిని, రత్నసింహాసన మందు కూర్చున్న దానిని, సర్పరాజును కప్పుకున్న దానిని (22) ఐన దేవిని పార్వతిని, మహాదేవుని ధ్యానించి, న్యాసక్రమంగా పూజించి గంధాదులతో క్రమంగా పూజించి (23) ఐదుగురు బ్రహ్మలతో, చెప్పిన స్థానములందు కాని హృదయమందు కాని అర్చించాలి. దేహమందు మూలమంత్రంతో విడిగా పుష్పాంజలిని హృదయమందు మూడు విధములుగా పూజించి (24) సాధకుడు మూల మంత్రంతో తాను స్వయంగా శివుడై, పిదప మళ్ళీ క్రమంగా బ్రమ్మపీఠమందు దేవుని పూజించాలి (25) పూజ ఆరంభమందు చక్కగా అక్కడ సంకల్పం చెప్పాలి. చేతులు జోడించి హృదయంలో శంకరుని ధ్యానించాలి (26) ఋణము, పాతకము, దౌర్భాగ్యము వీని నివృత్తి కొరకు సమస్త పాపముల నాశనం కొరకు ఓ శంకర! నాపై దయచూపు (27) దుఃఖ శోకములనే అగ్నితో తపించిన వాణ్ణి, సంసార భయంతో పీడింపబడిన వాణ్ణి, బహురోగములతో వ్యాకులణ్ణౖన వాణ్ణి, దీనుణ్ణి, ఓ వృషభ వాహన! నన్ను రక్షించు (28) ఓ దేవ దేవేశ! రా ఓ మహాదేవ! అభయం కూర్చేవాడా! రా పార్వతితోకూడి నేను చేసే నీ పూజను స్వీకరించు (29) అని సంకల్పించి విధి ప్రకారము బాహ్యపూజను ఆచరించాలి. నవ్యాపనవ్యములతో గురువైన గణపతిని యజించాలి (30) క్షేత్రేశుడైన వాస్తోష్పతిని ఈ శాన్య కోణమందు పూజించాలి. క్రమంగా వాగ్దేవిని పూజించాలి. పిదప కాత్యాయనిని పూజించాలి. (31) ధర్మము జ్ఞానము వైరాగ్యము, ఐశ్వర్యము, అంతకుడు వీరిని పూజించాలి వ్వరములతో ఈశానాది కోణములందు పీఠ పాదములను వరుసగా పూజించాలి. బిందు విసర్గలతో అధర్మాదులను పూజించాలి (32) నాల్గు దిక్కులందు సత్వరూపముతో, మధ్యలో తారకతో కూడిన అనంతుని, సత్వాది త్రిగుణములను తంతు రూపముగల వానిని పీఠమందుంచాలి (33) పైకప్పిన దానియందు లక్ష్మిత శివునితో కూడిన మాయను (34) దాని చివర తామరను తిరిగి మొత్తం మూడు మండలములను పత్రములు కేసరములు కింజల్కములతో నిండిన దానిని తార అక్షరములతో వ్రాయాలి (35) మూడు పద్మములను అట్లా, ఆదరంతో మధ్య మండలమందు పూజించి వామను, జ్యేష్ఠను రౌద్రిని, భాగాదులను దిక్కులలో పూజించాలి (36).

మూ || వామాద్యానవశక్తీశ్చ నవస్వరయుతా యజేత్‌|హృదిబీజత్రయా ద్యేన పీఠమంత్రేణ చార్చయేత్‌ || 37 ||

ఆవృత్తైః ప్రథమాంగైశ్చ పంచభి ర్మూర్తిశక్తిభిః | త్రిశక్తి మూర్తిభిశ్చాన్యైః నిధిద్వయ సమన్వితైః || 38 ||

అనంతాద్యైః పరీతాశ్చ మాతృభిశ్చ వృషాదిభిః | సిద్ధిభిశ్చాణి మాద్యాభిః ఇంద్రాద్యైశ్చ సహాయుదైః || 39 ||

వృషభ##క్షేత్ర చండేశ దుర్గాశ్చ స్కందనందినీ | గణశః సైన్య పశ్చైవ స్వస్వ లక్షణ లక్షితాః || 40 ||

అణిమా మహిమా చైవ గరిమాలఘిమాతథా | ఈశత్వంచవ శిత్వంచ ప్రాప్తిః ప్రాకామ్య మేవచ || 41 ||

అష్టైశ్వర్యాణి చోక్తాని తేజో రూపాణికేవలం | పంచభిః బ్రహ్మభిః పూర్వంహృల్లేఖాద్యాది భిఃక్రమాత్‌ || 42 ||

అంగైరుమాద్యైరింద్రాద్యైఃపూజోక్తామునిభిస్తుతైః | ఉమాచండేశ్వరాదీంశ్చ పూజయేదుత్తరాదితః | | 43 ||

ఏవమావరణౖర్యుక్తం తేజోరూపం సదాశివం | ఉమయా సహితం దేవం ఉపచారైః ప్రపూజయేత్‌ || 44 ||

సుప్రతిష్ఠత శంఖస్య తీర్థైః పంచామృతైరపి | అభిషిచ్య మహాదేవం రుద్రసూక్తైః సమాహితః || 45 ||

కల్పయే ద్వివిధైర్మంత్రైః ఆచనాద్యుపచారకాన్‌ | ఆసనం కల్పయేద్ధై మంది వ్యవస్త్ర సమన్వితం || 46 ||

అర్ఘ్య మష్ట గుణోపేతం పాద్యం శుద్థోదకేనచ | తేనై వాచమనం దద్యాన్మధుపర్కం మధూత్తరం || 47 ||

పునరాచమనం దత్వా స్నానం మంత్రైః ప్రకల్పయేత్‌ | ఉపవీతం తథా వాసో భూషణాని నివేదయేత్‌

గంధ మష్టాంగ సంయుక్తం సుపూతంవినివేదయేత్‌ ||48 ||

తతశ్చ బిల్వమందార కల్హార సరసీరుహం | ధత్తూర కంకర్ణికారం శణ పుష్పంచ మల్లికాం || 49 ||

కుశాపా మార్గతులసీ మాధవీ చంపకాదికం | బృహతీ కరవీరాణి యధాల బ్ధాని సాధకః || 50 ||

నివేదయేత్సు గంధీని మాల్యాని వివిధానిచ | ధూపం కాలాగ రూత్పన్నం దీపంచ విమలంశుభం || 51 ||

విశేషకం : -

అధపాయస నైవేద్యం సఘృతం సోపదంశకం|మోదకా పూప సంయుక్తం శర్కరాగుడ సంయుతం || 52 ||

మధునాక్తం దధియుతం జలపాన సమన్వితం | తేనైవ హవిషావహ్నౌ జుహు యాన్మంత్ర భావితే || 53 ||

ఆగమోక్తేన విధినా గురువాక్య నియంత్రితః నైవేద్యం శంభ##వే భూయో దత్వా తాంబూల ముత్తమం || 54 ||

ధూపం నీరాజనం దమ్యం ఛత్రం దర్పణముత్తమం|సమర్పయిత్వా విధివత్‌ మంత్రైర్వైది కతాంత్రికైః || 55 ||

యద్యశక్తః స్వయం నిఃస్వో యధావిభవ మర్చయేత్‌|భక్త్యా దత్తేన గౌరీశః పుష్పమాత్రేణ తుష్యతి || 56 ||

తా || వామాది నవ శక్తులను నవ స్వరముగల వానిని పూజించాలి. హృదయమందు బీజ త్రయాద్యముతో పీఠమంత్రముతో పూజించాలి. (37) ఆవృత్తులతో ప్రథమాంగములతో, ఐదుమూర్తి శక్తులతో, త్రిశక్తి మూర్తులతో, ఇతరమైన రెండు నిధులతో కూడిన (38) అనంతాదులతో కూడిన మాతలతో వృషాదులతో కూడిన, అణిమాది సిద్ధులతో, ఆయుధములు గల ఇంద్రాదులతో (39) వృషభ క్షేత్ర చండేశ దుర్గలు స్కందనందులు, గణశుడు, సైన్యపుడు వీరంతా తమ తమ లక్షణములతో కూడి ఉండగా (40) అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ఈశత్వ, వశిత్వ, ప్రాప్తి, ప్రాకామ్యములు (41) ఈ అష్టైశ్వరములు, ఇవి తేజోరూపమైనవి. ఐదుగురు బ్రహ్మలు, హృల్లేఖాదులతో కూడా క్రమంగా (42) ఉమాది లింగములతో, ఇంద్రాదులతో పూజచేయాలి అని మునులు చెప్పారు. ఉత్తరం మొదలుగా ఉమ, చండేశ్వరాదులను పూజించాలి. (43) ఈ విధముగా ఆవరణములతో కూడిన తేజో రూపుడైన సదాశివుని, ఉమతో కూడిన దేవుని ఉపచారములతో పూజించాలి (44) చక్కగా ప్రతిష్ఠించిన శంఖ తీర్థముతో పంచామృతములతో, చక్కగా రుద్రసూక్తములతో మహాదేవుని అభిషేకించి (45) వివిధ మంత్రములతో ఆసనాది ఉపచారములను కల్పించాలి. బంగారు ఆసనమును కల్పించాలి. దివ్య అస్త్రమున దానిపై ఉండాలి (46) అష్టగుణములు కల అర్ఘ్యమును, శుద్ధోదకముతో పాద్యమున దానితోనే ఆచమనమును ఇవ్వాలి. మధు ఉత్తరమైన మదుపర్కమును ఇవ్వాలి (47) తిరిగి ఆచమనం ఇవ్వాలి. మంత్రములతో స్నానం ఏర్పరచాలి. ఉపవీతము, వస్త్రము, భూషణములు ఇవ్వాలి. అష్టాంగములు గల గంధమును పవిత్రమైన దానిని నివేదించాలి (48) పిదప బిల్వమందార కల్హార తామరలను, ధత్తూరము, కర్ణికారము, శణ పుష్పము,మల్లిక (49) కుశలు, అపామార్గము, తులసి, మాధవి, చంపక మొదలగునవి, బృహతి, కరవీరములు దొరికిన విధంగా సాధకుడు (50) వాసనగల వివిధ మాలలను నివేదించాలి. కాలాగరు నుంచి పుట్టిన ధూపాన్ని విమలమైన శుభ##మైన దీపాన్ని (51) విశేషకం అర్పించాలి (బొట్టు). పిదప పాయస నైవేద్యము, నేయి, ఊరగాయలు, మోదకములు, అపూపములు, శర్కరచ గుడము (52) మధువు, దధి, జలపానము నివేదన చేయాలి. అహవిస్పుతోనే, మంత్రభావితమైన అగ్నిలో హోమంచేయాలి (53) ఆగమోక్తవిధితో గురువుల వాక్యములతో నియంత్రింప బడుతూ శివునకు నైవేద్యము ఇవ్వాలి. తిరిగి ఉత్తమతాంబూల మివ్వాలి (54) ధూపము, నీరాజనము, రమ్యమైన ఛత్రము, ఉత్తమమైన దర్పణము సమర్పించాలి. శాస్త్ర ప్రకారము మంత్రములతో వైదికతాంత్రికములతో సమర్పించాలి. (55) శక్తి చాలనిచో స్వయంగా ధనహీనుడైతే ధనానికి తగ్గట్టే పూజించాలి. గౌరీశుడు భక్తితో ఇచ్చిన పుష్పమాత్రంతోనైనా ఆనందిస్తాడు (56).

మూ || అథాంగభూతాన్‌సకలాన్‌గణశాదీన్‌ప్రపూజయేత్‌

స్తవైనానావిదైఃస్తుత్వాసాష్టాంగంప్రణమేద్బుధః || 57 ||

తతః ప్రదక్షిణీకృత్య వృషచండేశ్వరాదికాన్‌ | పూజాం సమర్ప్యవిధివత్‌ ప్రార్థయేద్గిరిజాపతిం || 58 ||

జయదేవ జగన్నాధ జయ శంకర శాశ్వత | జయ సర్వసురాధ్యక్ష జయ సర్వసురార్చిత || 59 ||

జయ సర్వగుణాతీత జయ సర్వవరప్రద | జయనిత్య నిరాధార జయ విశ్వంభరావ్యయ || 60 ||

జయ విశ్వైక వేద్యేశ జయనాగేంద్ర భూషణ | జయ గౌరీపతే శంభో జయచంద్రార్ధ శేఖర || 61 ||

జయకోట్యర్క సంకాశజయానంత గుణాశ్రయ || 62 ||

జయరుద్ర విరూపాక్ష జయా చింత్య నిరంజన

జయనాథ కృపాసింధో జయ భక్తార్తి భంజన | జయదుస్తర సంసార సాగరోత్తారణ ప్రభో || 63 ||

ప్రసీదమే మహాదేవ సంసారార్తస్యభిద్యతః | సర్వపాప భయం హృత్వా రక్షమాం పరమేశ్వర || 64 ||

మహాదారిద్ర్య మగ్నస్య మహాపాప హతస్యచ | మహాశోక వినష్టస్య మహారోగాతు రస్యచ || 65 ||

ఋణభారపరీతస్య దహ్యమానస్య కర్మభిః | గ్రహైః ప్రపీడ్యమానస్య ప్రసీదమమ శంకర || 66 ||

దరిద్రః పార్థయేదేవం పూజాంతే గిరిజాపతిం | అర్ధాఢ్యో వాపి రాజా వాప్రార్థయే ద్దేవమీశ్వరీం || 67 ||

దీర్ఘమాయుః సదారోగ్యం కోశవృద్ధిః బలోన్నతిః | మమాస్తు నిత్యమానందః ప్రసాదాత్త వశంకర || 68 ||

శత్రవః సంక్షయం యాంతు ప్రసీదస్తు మమగ్రహాః నశ్యస్తు దన్యవో రాష్ట్రే జనాః సంతు నిరాపదః || 69 ||

దుర్భిక్ష మారీ సంతాపాః శమం యాతు మహీతలే

సర్వనస్య సమృద్ధిశ్చ భూయాత్‌ సుఖమయాదిశః || 70 ||

ఏవమారాధయేద్దేవం ప్రదోషే గిరిజాపతిం | బ్రాహ్మణాన్‌ భోజయే త్పశ్చాత్‌ దక్షిణాభిశ్చ తోషయేత్‌ || 71 ||

సర్వపాప క్షయకరీ సర్వదారిద్ర్యనాశినీ | శివపూజామయాఖ్యాతా సర్వాభీష్ట వరప్రదా || 72 ||

తా || పిదప అంగభూతులైన సకల గణశాదులను పూజించాలి. రకరకాల స్తవములతో స్తుతించి బుధుడు సాష్టాంగ నమస్కారము చేయాలి (57) పిదప వృష చండేశ్వరాదికులకు ప్రదక్షిణం చేసి విధిప్రకారము పూజను సమాప్తి చేసి గిరిజా పతిని ప్రార్థించాలి (58) ఓ దేవ జగన్నాథ జయము, ఓ శంకర శాశ్వతుడ జయము. సర్వసురాధ్యక్ష! జయము. సర్వసురార్చిత జయము (59) సర్వగుణాతీత జయము. సర్వవరప్రద జయము. నిత్య, నిరాధార జయము. విశ్వంభర అవ్యయ జయము (60) విశ్వ ఏకవేద్య ఈశ జయము. నాగేంద్ర భూషణ జయము. గౌరీపతే శంభు జయము. చంద్రార్థ శేఖర జయము (61) కోటి అర్కసంకాశ జయము. అనంత గుణాశ్రయ జయము (62) రుద్ర విరూపాక్ష జయము. అచింత్య నిరంజన జయము. నాధ కృపాసిందు జయము. భక్త ఆర్తి భంజన జయము. దుస్తర సంసార సాగర ఉత్తారణ, ప్రభుజయము (63) సంసారమందు ఆర్తుడనైన భేదము నందే నా యందు దయచూపు ఓ మహాదేవ. సర్వపాప భయమును తొలగించి నన్ను రక్షించు ఓ పరమేశ్వర! (64) మహాదారిద్ర్యంలో మునిగిన మహా పాపహతుడనైన, మహాశోకంతో నష్టుడనైన మహారోగంతో బాధపడుతున్న (65) ఋణ భారంతో చుట్టబడిన, కర్మలతో తగలబడిపోతున్న గ్రహములతో బాగా పీడింపబడుతున్న నా యందు దయచూపు ఓ శంకర! (66) దరిద్రుడు పూజాంతమందు గిరిజాపతిని ఇట్లాగ ప్రార్థించాలి. డబ్బు గలవాడైనా, రాజైనా దేవుని ఈశ్వరుని ప్రార్థించాలి (67) దీర్ఘాయువు, సదా ఆరోగ్యము, కోశవృద్ధి, బలోన్నతి, నిత్యము ఆనందము నీ దయవల్ల నాకు కలగని ఓ శంకర! (68) శత్రువులు నశించని నా గ్రహములు అనుగ్రహించని. దస్యులు నశించని. రాష్ట్రమందు జనలు ఆపదలు లేకుండా ఉండని (69) దుర్భిక్షము, మారీ సంతాపములు భూమియందు శమించని. సర్వసస్యముల సమృద్ధి కలుగని, దిక్కులు సుఖంగా ఉండని (70) ఈ విధముగా ప్రదోష సమయమందు గిరిజాపతిని దేవుని ఆరాధించాలి. పిదప బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దక్షిణలతో తృప్తి పరచాలి. (71) సర్వపాపముల నశింపచేసేది సర్వదరిద్రముల నశింపచేసేది. శివపూజను గూర్చి నేను చెప్పాను. అన్ని అభీష్టమైన వరముల నిచ్చేది (72)

మూ || మహాపాతక సంఘాతం అధికంచోపపాతకం |

శివ ద్రవ్యాపహరణా దస్యత్‌ సర్వం నివారయేత్‌ || 73 ||

బ్రహ్మహత్యాది పాపానాం పురాణషు స్మృతిష్వపి | ప్రాయశ్చిత్తాని దృష్టాని నశివ ద్రవ్య హారిణాం || 74 ||

బహునాత్రకి ముక్తేన శ్లోకార్థేన బ్రవీమ్యహం | బ్రహ్మహత్యా శతం వాపి శివపూజా వినాశ##యేత్‌ || 75 ||

మయా కథితమే తత్తే ప్రదోషే శివపూజనం | రహస్యం సర్వజంతూనాం మత్రనాస్త్యేవ సంశయః || 76 ||

ఏతాభ్యామపి బాలాభ్యాం ఏవం పూజావిధీయతాం | అతః సంవత్సరాదేవ పరాంసిద్ధి మవాప్స్యథ || 77 ||

ఇతి శాండిల్య వచన మాకర్ణ్య ద్విజభామినీ | తాభ్యాంతు సహ బాలాభ్యాం ప్రణనామమునేః పదం || 78 ||

విప్రస్త్య్రువాచ -

అహమద్య కృతార్థాస్మిత వదర్శన మాత్రతః | ఏతౌకుమారౌ భగవంస్త్వామేవ శరణంగతౌ || 79 ||

ఏషమేతనయో బ్రహ్మన్‌ శుచివ్రత ఇతీరితః | ఏషరాజ సుతో నామ్నాధర్మగుప్తః ఖృతోమయా || 80 ||

ఏతావహంచ భగవాన్‌ భవచ్చరణ కింకరాః | సముద్థరాస్మిన్‌ పతితాన్‌ ఘోరే దారిద్ర్యసాగరే || 81 ||

ఇతి ప్రసన్నాం శరణం ద్విజాం గనామాశ్వాస్య వాక్యై రమృతోపమానైః

ఉపాది దేశాధత యోః కుమారయోః మునిః శివారాధనమంత్ర విద్యాం || 82 ||

అధోపదిష్టౌముని నా కుమారౌ బ్రహ్మణీ చసా | తప్రణమ్య సమామంత్ర్య జగ్ముస్తే శివమందిరాత్‌ || 83 ||

తతః ప్రభృతితౌ బాలౌ మునివర్యో పదేశతః | ప్రదోషే పార్వతీశస్య పూజాంచక్రతు రంజసా || 84 ||

ఏవం పూజయతో ర్దేవం ద్విజరాజకుమారయోః | సుఖేనైవ వ్యతీయాయ తయోర్మాస చతుష్టయం || 85 ||

కదా చిద్రాజ పుత్రేణ వినాసౌ ద్విజనందనః | స్నాతుంగతో నదీతీరే చ చారబహులీలయా || 86 ||

తత్ర నిర్‌ఝర నిర్ఘాత నిర్భిన్నే వ ప్రకుట్టిమే | నిధాన కలశం స్థూలం ప్రస్షురంతం దదర్శహ || 87 ||

తందృష్ట్వా సహసాగత్య హర్షకౌతుక విహ్వలః | దైవోపవన్నం మన్వానో గృహీత్వాశిరమాయ¸° || 88 ||

నసంభ్రమం సమానీయనిధాయ కలశం బలాత్‌ | నిధామ భవనస్యాంతే మాతరం సమభాషత || 89 ||

మాతర్మాత రిమం పశ్య ప్రసాదం గిరిజాపతేః | నిధానం కుంభరూపేణ దర్శితం కరుణాత్మనా || 90 ||

అథసావిస్మితా సాధ్వీ సమాహూయ నృపాత్మజం | స్వపుత్రం ప్రతినం ద్యాహమానయంతీ శివార్చనం || 91 ||

శృణుతంమేవచః పుత్రౌ నిధాన కలశీమిమాం | సమం విభజ్య గృహ్ణీతం మమ శాసన గౌరవాత్‌ || 92 ||

తా || మహాపాతక సమూహములు అధికమైన ఉపపాతకముల, శివద్రవ్యాపహరణం తప్ప అన్నీ తొలగించవచ్చు. (73) బ్రహ్మహత్యాది పాపములకు పురాణములందుస్మృతులందు ప్రాయశ్చిత్తములు కన్పించాయి. శివ ద్రవ్యాన్ని హరించిన వారి ప్రయాశ్చిత్తములేదు. (74) అధికంగా చెప్పపనిలేదు. సగం శ్లోకంలో చెప్తాను. బ్రహ్మహత్యా శతమునైనా శివపూజ నశింపచేస్తుంది. (75) నేను నీకు ఈ ప్రదోషమందు శివపూజను గూర్చి చెప్పాను. ప్రాణులన్నింటికి ఇది రహస్యమైంది. ఇందులో అనుమానంలేదు (76) ఈ పిల్లలతోకూడా ఇట్లా పూజ చేయించండి. అందువల్ల సంవత్సరంలోనే ఉత్తమ సిద్ధిని పొందుతారు. (77) అని శాండిల్యుడు చెప్పగా విని ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ పిల్లలతో కూడి ముని పాదాలకు నమస్కరించింది (78) విప్ర స్త్రీ వచనము - నేనీవేళ కృతార్థురాలినైనాను. మీ దర్శనంవల్లనే ఓ భగవాన్‌! ఈ ఇద్దరు కుమారులు నిన్నే శరణు వేడారు (79) వీడు నాకుమారుడు. ఓ బ్రహ్మన్‌! శుచి వ్రతుడని వీని పేరు ఈ రాజసుతునిపేరు ధర్మగుప్తునిగా నేను పెట్టాను (80) వీరు నేను మీ చరణ దాసులము ఓ భగవాన్‌! ఘోరమైన దారిద్ర్య సాగరమందు పడిన మమ్ములను ఉద్ధరించు (81) అని శరణుపొందిన ద్విజాంగనను, అమృతము వంటి మాటలతో ఓదార్చి, ఆ ముని ఆకుమారులకు శివారాధన మంత్రవిద్యను ఉపదేశించాడు (82 ) ఇట్లా మునితో ఉపదేశింపబడిన ఆకుమారులు, బ్రాహ్మణి, ఆమునికి నమస్కరించి పోయి వస్తామని చెప్పి శివమందిరం నుంచి వెళ్ళారు. (83) నాటి నుండి ఆ పిల్లలిద్దరు మునివర్యుని ఉపదేశాన్ననుసరించి ప్రదోష సమయమందు పార్వతీశుని పూజను త్వరగా చేయసాగారు. (84) ఇట్లా ద్విజరాజకుమారులు దేవుని పూజిస్తుండగా నాలుగు నెలలు సుఖంగా గడిచాయి, వారికి (85) ఒకసారి రాజపుత్రుడు లేకుండా ఈ బ్రాహ్మణకుమారుడు నదీ తీరానికి స్నానం చేయటానికి వెళ్ళాడు. స్వేచ్ఛగా తిరిగాడు (86) అక్కడ ప్రవాహపు దెబ్బతో భిన్నమైన కోటగోడలో స్థూలంగా కన్పిస్తున్న నిధాన కలశాన్ని చూచాడు. (87) దానినిచూచి త్వరగా ఆనందం ఎక్కువైనవాడై దైవమిచ్చిన దానినిగా భావించి తలపై ధరించి ఇంటికొచ్చాడు. (88) త్వరత్వరగాతెచ్చి బలంగా కలశాన్ని అక్కడ ఉంచి, భవనం చివర ఉంచి తల్లితో ఇట్లన్నాడు (89) ఓఅమ్మ! అమ్మ! గిరిజా పతి యొక్క ఈ ప్రసాదాన్ని చూడు ఆకరుణాత్ముడుకుంభరూపంలోని ధానాన్ని చూపాడు (90) అప్పుడు ఆశ్చర్యపడిన ఆతల్లి రాకుమారుని పిలిచి తన పుత్రుని అభినందించి శివార్చనను మెచ్చుకుంటూ ఇట్లా అంది. (91) ఓ కుమారులార! నా మాటను వినండి. ఈ నిధాన కలశమును సమంగా పంచి తీసుకోండి. నాశాసనం మీది గౌరవంతో (92).

మూ || ఇతిమాతుర్వచః శ్రుత్వా తుతోష ద్విజనందనః | ప్రత్యాహ రాజపుత్రస్తాం విస్రబ్థః శంకరార్చనే || 93 ||

మాతః తవసుతసై#్యవ సుకృతేన సమాగతం | నాహం గ్రహీతు మిచ్ఛామి విభక్తం ధన సంచయం || 94 ||

ఆత్మనః సుకృతాల్లబ్థం స్వయమేవ భునక్త్వాసౌ | సఏవ భగవానీశః కరిష్యతి కృపాంమయి || 95 ||

ఏవమర్చయతోః శంభుం భూయోపి పరయాముదా|సంవత్సరో వ్యతీయాయతస్మిన్నేవ గృహేతయోః || 96 ||

అథైకదారాజ సూనుః షహతేన ద్విజన్మనా | వసంత సమయే ప్రాప్తే విజహార వనాంతరే || 97 ||

అథదూరం గతౌ క్వాపి వనేద్విజ నృపాత్మజౌ | గంధర్వ కన్యాః క్రీడంతీః శతశస్తా పవశ్యతాం || 98 ||

తాఃసర్వాశ్చా రుసర్వాంగ్యో విహరంత్యో మనోహరం | దృష్ట్వా ద్విజాత్మజోదూరాత్‌ ఉవాచనృపనందనం || 99 ||

ఇతః పురోనగంతవ్యం విహరంత్యc గతఃస్త్రియః | స్త్రీ సననిధానం విబుధాః త్యజంతి విమలాశయాః || 100 ||

ఏతాః కైతవకారిణ్యో ఘన ¸°వన దుర్మదాః | మోహయంత్యో జనం దృష్ట్వా వాచానునయ కోవిదాః || 101 ||

అతః పరిత్యజేత్‌ స్త్రీణాం సన్నిధిం సహభాషణం | నిజధర్మరతో విద్వాన్‌ బ్రహ్మచారీ విశేషతః || 102 ||

అతో7హం నోత్సహెగంతుం క్రీడా స్థానంమృగీదృశాం | ఇత్యుక్త్వా ద్విజపుత్రస్తు నివృత్తో దూరతఃస్థితః || 103 ||

అథాసౌ రాజ పుత్రస్తు కౌతుకావిష్టమాససః | తాసాం విహార పదవీమేక ఏవాభయో య¸° || 104 ||

తత్ర గంధర్వ కన్యానాం మధ్యేత్వేకా వరాననా | దృష్ట్వా7యాంతం రాజపుత్రం చింతయామా నచేతసా || 105 ||

అహోకోయము దారాంగోయు వాసర్వాంగ సుందరః | మత్తమాతంగ గమనోలావణ్యామృత వారిధిః || 106 ||

లీలాలోల విశాలక్షో మధురస్మితపేశలః | మదనోప మరూపశ్రీః సుకుమారాంగ లక్షణః || 107 ||

ఇత్యాశ్చర్య యుతా బాలా దూరాద్దృష్ట్వా నృపాత్మజం | సర్వాఃసఖీః సమాలోక్య వచనం చేదమబ్రవీత్‌ || 108 ||

ఇతో విదూరోహె సఖ్యో వనమస్త్యే కముత్తమం | విచిత్ర చంపకాశోక పున్నాగ వకులైర్యుతం || 109 ||

తత్ర గత్వా, వనం సర్వాః సంచీయకుసుమోత్కరం | భవత్యఃపునరాయాంతుతాపత్తిష్ఠామ్యహంత్విహ || 110 ||

తా || అనే తల్లి మాటలను విని ద్విజనందనుడు ఆనందపడ్డాడు. శంకరార్చన యందు విశ్వాసం కలవాడై రాజపుత్రుడు ఆమెతో ఇట్లాఅన్నాడు (93) ఓ తల్లి! ఇది నీకొడుకు సుకృతం వల్ల నేలభించింది. నేను తీసుకోను. పంచిధనాన్ని తీసు కోను (94) తననుకృతంవల్ల వచ్చినదానిని ఆతడుతానే అనుభవించని. ఆభగవాన్‌ ఈశుడునామీద దయచూపుతాడు (95) ఈవిధంగా శివుని పూజించే, వారికి తిరగి ఆ ఇంట్లోనేవారికి ఒక సంవత్సర కాలంగడిచింది (96) ఒకసారి ఆరాకుమారుడు ఆబ్రాహ్మణ కుమారునితో వసంతమాసంలో అడవిలో తిరుగసాగాడు (97) ద్విజనృపాత్మజులు అడవిలో దూరంగా వెల్ళారు. నూర్లకొలది గంధర్వకన్యలు క్రీడిస్తున్నారక్కడ. వారిని వీరు చూచారు (98) వారంతా అందమైన సర్వావయవములు కలవారుమనోహరంగా విహరిస్తున్నారు. బ్రాహ్మణకుమారుడు దూరం నుండిచూచి రాకుమారునితో ఇట్లన్నాడు (99) ఇక ముందుకు వెళ్ళగూడదు. ముందు స్త్రీలు విహరిస్తున్నారు. విమల ఆశయంగల బుధులు స్త్రీసన్నిదానమును విడిచి పెడ్తారు. (100) వీరు మోసగించేవాళ్ళు. మంచి ¸°వ్వన దుర్మదులు. జనులను చూచి మోహింపచేస్తారు. మాటలతో ఒప్పించటంలో సమర్థులు. (101) అందువల్ల స్త్రీసన్నిధిని విడిచిపెట్టాలి. వారితో భాషించరాదు. విద్వత్‌బ్రహ్మచారి, నిజధర్మమందున్నవాడు విశేషించి మాట్లాడరాదు (102) అందువల్ల స్త్రీలు క్రీడించే చోటికి వెళ్ళటానికి నేనిష్ఠపడటంలేదు. అని పలికి ద్విజపుత్రుడు మరలిపోయిదూరంగా నిలబడ్డాడు (103) ఇక ఆరాజపుత్రుడు కౌతుకంతో నిండిన మనసుగల వాడైవారు విహరించే ప్రదేశానికి ఒక్కడే భయంలేకుండా వెళ్ళాడు (104) అక్కడ గంధర్వకన్యలలో మధ్యలో ఒక వర ఆననవస్తున్న రాజపుత్రునిచూచి మనసులో ఇట్లా ఆలోచించింది. (105) ఓహో ఎవడీ ఉదారాంగుడు యువకుడు, సర్వాంగసుందరుడు. మదించిన ఏనుగవంటినడకవాడు లావణ్యమను అమృతమునకువారిధి (106) విలాసంతో చంచలమైన విశాలమైన కన్నులవాడు మధురమైన చిరునగవుతో మృదులమైనవాడు మన్మథుని వంటి రూపసంపదవాడు సుకుమారమైన అంగలక్షణములవాడు (107) అని ఆశ్చర్యపడి ఆబాలరాకుమారుని దూరంనుండే చూచి సఖులందిరని చూచి ఈమాట అంది (108) దీనికి దగ్గరలో ఓ సఖులార! ఒక ఉత్తమవనముంది. విచిత్రమైన చంపక అశోక పున్నాగవకుళములతో కూడింది (109) ఆ అడవికి మీరంతా వెళ్ళి చాలా పూలన తెంపుకొని మీరు తిరిగిరాండి. అప్పటిదాకా నేనిక్కడుంటాను (110)

మూ || ఇత్యాది ష్టఃసఖీవర్గో జగామవిపినాంతరం | నాపిగం ధ్వరజాతస్థౌన్యస్త దృష్టిః నృపాత్మజే || 111 ||

తంస మాలోక్య తన్వంగీం నవ¸°వనశాలినీం | బాలాం స్వరూపసంపత్యా పరిభూతతిలోత్తమాం || 112 ||

రాజపుత్రః సమాగమ్య కౌతుకోత్ఫుల్ల లోచనః | అవావదైవ యోగే సమదసస్యశరవ్యధాం || 113 ||

గంధర్వతనయాసాపిప్రాప్తాయనృపసూనవే | ఉత్థాయతరసాతసై#్మప్రదదౌ వల్లవాసనం || 114 ||

కృతోపచారమాసీనం తమాసాద్యసుమధ్యమా | పప్రచ్ఛతద్రూపగుణౖఃధ్వస్తదైర్యాకులేంద్రియా || 115 ||

కస్తంకమల పత్రాక్ష కస్మాద్దేశాదిహాగతః | కస్యపుత్ర ఇతి ప్రేవ్ణూపృష్టః సర్వంస్య వేదయత్‌ || 116 ||

విదర్భరాజతనయంవిధ్వంస్తపితృమాతృకం | శత్రుభిశ్చహృతస్థానమాత్మానం వరరాష్ట్రగం || 117 ||

సర్వమావేద్యభూయస్తాం వప్రచ్ఛనృపనందనః | కాత్వంవామోరుకించాత్రకార్యంతేకస్యచాత్మజా || 118 ||

కిమవధ్యాయసిహృదాకింవావక్తుమిహెచ్ఛసి | ఇత్యుక్తాసాపునఃప్రాహా శృణు రాజేంద్రసత్తమ || 119 ||

అస్త్యేకోద్రవికోనామగంధర్వాణాంకులాగ్రణీః | తస్యాహమస్మితనయానామ్నాచాంశుమతీస్మృతా || 120 ||

త్వామాయాంతంవిలోక్యాహంత్వత్సంభాషణలాలసా | త్యక్త్వాసఖీజనంసర్వంఏకైవాస్మిమహామతే || 121 ||

సర్వసంగీవిద్యాసునమత్తో7న్యాస్తికాచన | మమయోగేసతుష్యంతినర్వాఅపిసురస్త్రియః || 122 ||

సాహంసర్వకలాభిజ్ఞాజ్ఞాతసర్వజనేంగితా | తవాహమీప్సితావేద్మిమయితేసంగతంమనః || 123 ||

తధామమాపిచౌత్సుక్యందైవేనప్రతిపాదితం | ఆవయోఃస్నేహాభేదో7త్రనాభిభూయాదితఃపరం || 124 ||

ఇతి సంభాష్యతేనాశుప్రేవ్ణూగంధర్వనందినీ | ముక్తాహారందదౌతసై#్మన్వకుచాంతరభూషణం || 125 ||

తమాదాయాద్భుతంహారంసతస్యాఃప్రణయాకులః | గాఢహర్షభరోత్సిక్తామిదమాహనృపాత్మజః || 126 ||

సత్యముక్తంత్వయాభీరుతథాస్యేకంవదామ్యహం | త్యక్తరాజ్యస్యనిఃస్వస్యకథంమేభవసిప్రియా || 127 ||

సాత్వంపితృమతీబాలావిలంఘ్యపితృశాసనాత్‌ | స్వచ్ఛందా చరణంకర్తుంమూఢేవకథమర్హసి || 128 ||

ఇతితస్యవచఃశ్రుత్వాతంప్రత్యాహశుచిస్మితా | అస్తునామతథైవాహంకరిష్యేపశ్యకౌతుకం || 129 ||

గచ్ఛస్వభవనంకాంత పరశ్వంప్రాతరేవతు | ఆగచ్ఛపునరత్రైవకార్యమస్తిచనోమృషా || 130 ||

తా || అని ఆదేశించగాసఖీవర్గము అడవిలోకి వెళ్ళింది. ఆగంధర్వకాంతరాకుమారుని యందు దృష్టినిలిపి నిలిచి పోయింది (111) నవ¸°వనశాలినిఐన ఆతన్వంగినిచూచి స్వరూపసంపదతోతిలోత్తమనుమించిన ఆబాలను చూచి (112) రాజపుత్రుడు వచ్చి కౌతుకంతో విప్పారిన కళ్ళుగలవాడై దైవయోగంవల్లమదనుని బాణబాధకు గురైనాడు (113) గంధర్వ తనయకూడా వచ్చిన రాకుమారునకులేచిత్వరగా ఆతనికి పల్లవముల ఆసనాన్ని ఏర్పరచింది (114) ఉపచారములపొంది కూర్చొన్న ఆతనిని చేరి ఆసుమధ్యమ! ఆతని రూపగుణములతో దైర్యమునశించి ఆకులమైన ఇంద్రియములు కలదై ఇట్లా అడిగింది. (115) నీవెవరు ఏదేశంనుండి ఇక్కడకు వచ్చావు ఓ కమలపత్రాక్ష! ఎవరికుమారుడవు అని ప్రేమతో అడుగగా అంతా ఆతడు వివరించాడు (116) నేను విదర్భరాకుమారుణ్ణి. తలిదండ్రులునశించారు. శత్రువులురాజ్య మాక్రమించారు. నేనుపరరాష్ట్రంలో ఉన్నాను. (117) అంతాచెప్పితిరిగి ఆరాకుమారుడు ఆమెనడిగాడు. ఓ వామోరు! నీవెవరు.ఇక్కడ నీకేంపని. ఎవరికూతురువునీవు (118) హృదయంలో ఏమికోరుకుంటున్నావు. ఇక్కడ ఏంచెప్పదలిచావు అని ఆమెతో అనగా ఆమె ఆతనితో అంది ఓ రాజేంద్రసత్తమవిను (119) ద్రివికుడనిపేరుగలవాడు గంధర్వకులాగ్రణి ఒకడున్నాడు. ఆతని కూతురునునేను నాపేరు అంశుమతి (120) వస్తున్ననిన్నుచూచి నీతో మాట్లాడాలని ఆశతో నేను, చెలులందరిని వదలి ఒంటరిగా ఉన్నాను, ఓ మహామతి (121) సంగీత విద్యలన్నింటిలో నన్నుమించి మరొకతెలేదు. నా యోగంతో దేవతాస్త్రీలంతా ఆనందిస్తున్నారు (122) నేను అన్నికళలలో ఆరితేరినదాన్ని. సర్వజనుల ఇంగితమెరిగిన దానని. నీకోరికనునేను తెలుసుకున్నాను. నా పైనీమనస్సు లగ్నమైంది (123) అట్లాగేనాఔత్సుక్యముదైవికంగా ప్రతిపాదితమైంది. ఇకముందుమనిద్దరికి స్నేహభేదము ఇక్కడ కలుగరాదు (124) అనిపలికి ఆతనితో, ఆమె గంధర్వనందిని ప్రేమతో త్వరగా తనరొమ్ములపైని సొమ్మైన ముత్యాల హారమును ఆతనికిచ్చింది. (125) ఆ అద్భుతహారాన్ని తీసుకొని ఆతడు ఆమె ప్రేమలోవ్యాకులుడైఆరాకుమారుడు మిక్కిలి ఆనందభరముతో ఉత్సహించిన ఆమెతో ఇట్లన్నాడు (126) ఓ భీరు! నీవునిజంచెప్పావు. ఐనానేనొకటిచెప్తాను. రాజ్యంపోగొట్టుకున్ననన్నువిశ్వసించి (ఏమీలేనినాకు) నాకెట్లా ప్రియురాలు అవుతావు (127) నీవు తండ్రిగలదానవు. తండ్రి ఆజ్ఞను మీరే ఓబాలా! స్వచ్ఛందంగాచేయటానికి మూఢురాలిలా నీవెట్లా సమర్థురాలివి. (128) అని అనగా ఆతని మాటలు విని ఆతనితో ఆమెఇట్లాఅంది. అట్లాగే కాని. నేనట్లాగేచేస్తాను. కౌతుకాన్నిచూడు (129) ఓ కాంత నీ భవనానినివెళ్ళు. తిరిగి ఎల్లుండిప్రొద్దున్నే ఇక్కడికిరా. కొంచంపనుంది. అబద్ధంకాదు అని (130)

మూ || ఇత్యుక్త్వాతంనృపసుతం సాసంగతనభీజనా | అపాక్రామతచార్వంగీనచాపినృపనందనః || 131 ||

ససమఖ్యేత్యహర్షేణద్విజపుత్రస్యసన్నిధిం | సర్వమాఖ్యాయతేనైవసార్థంపస్వభవనంయ¸° || 132 ||

తాంచవిప్రసతీంభూయోహర్షయిత్వానృపాత్మజః | పరశ్వోద్విజపుత్రేణసార్థంతేనవసంయ¸° || 133 ||

సతయాపూర్వనిర్దిష్టంస్థానంప్రాప్యనృపాత్మజః | గంధర్వరాజమద్రాక్షీత్‌స్వదూహిత్రాసమన్వితం || 134 ||

సగంధర్వపతిఃప్రాప్తావభినంద్యకుమారకౌ | ఉపవేశ్యాసనేరమ్యేరాజపుత్రమభాషత || 135 ||

గంధర్వఉవాచ -

రాజేంద్రపుత్రపూర్వేద్యుః కైలాసంగతవాసహం | తత్రాపశ్యంమహాదేవం పార్వత్యాసహితంప్రభుం || 136 ||

ఆహూయమాంసదేవేశఃసర్వేషాంత్రిదివౌకసాం | సన్నిధావాహభగవాన్‌కరుణామృతవారిధిః || 137 ||

ధర్మగుప్తాహ్వయఃకశ్చిత్‌రాజపుత్రో7స్తిభూతలే | అకించనోభ్రష్టరాజ్యఃహృతదేశశ్చశత్రుభిః || 138 ||

సబాలోగురువాక్యేనమదర్చాయాంరతఃసదా | అద్యతత్పితరన్సర్వేమాంప్రాప్తాస్తత్ర్ప

భావతః ||139 ||

తస్యత్వమపిసాహాయ్యంకురుగంధర్వసత్తమ | అధాసౌనిజరాజ్యస్థోహతశత్రుఃభవిష్యతి || 140 ||

ఇత్యాజ్ఞప్తోమహేశేనసంప్రాప్తోనిజమందిరం | అనయామ ద్దుహిత్రాచబహుశో7భ్యర్థితస్థథా || 141 ||

జ్ఞాత్వేమంసకలంశంభోఃనియోగంకరుణాత్మనః | ఆదాయేమాందుహితరం ప్రాప్తో7స్మీదంవనాంతరం || 142 ||

అతఏనాంప్రయచ్ఛామికన్యామంశుమతీంతవ | హత్వాశత్రూన్‌స్వరాష్ట్రేత్వాంస్థాపయామిశివాజ్ఞయా || 143 ||

తస్మిన్‌పురేత్వమనయాభుక్త్వాభోగాన్‌యథేప్సితాన్‌ | దశవర్షసహస్రాన్తేగంతాసిగిరిశాలయం || 144 ||

తత్రాపిమమకన్యేయంత్వామేవప్రతివత్స్యతే | అనేనైవస్వదేహెనదివ్యేనశివసన్నిధౌ || 145 ||

ఇతి గంధర్వరాజస్తమాభాష్య నృపనందనం | తస్మిన్‌ వనే స్వదుహితుః పాణిగ్రహమకారయత్‌ || 146 ||

పారిబర్హమదాత్తసై#్మరత్నభారాన్మహోజ్జ్వలాన్‌ | చూడామణించంద్రనిభంముక్తాహారాంశ్చభానురాన్‌ || 147 ||

దివ్యాలంకారవాసాంసికార్తస్వరపరిచ్ఛదాన్‌ | గజానామయుతంభూయోనియుతంనీలవాజినాం || 148 ||

స్యందనానాంసహస్రాణి సౌవర్ణానిమహాంతిచ | పునరేకంరధందివ్యం ధనుశ్చేంద్రాయుధోపమాన్‌ || 149||

అస్త్రాణాంచనహస్రాణి తూణీచాక్షయ్యసాయకౌ | అభేద్యంవర్మసౌవర్ణం శక్తించరిపుమర్దినీం || 150 ||

తా || ఆరాజకుమారునితోపలికి ఆమె చెలులతో కలిసి ఆ అర్వాంగి వెళ్ళిపోయింది. ఆరాకుమారుడు వెళ్ళాడు (131) ఆతడు బ్రాహ్మణకుమారునిదగ్గరకు ఆనందంతో వచ్చి, అతనికి అంతాచెప్పి, ఆతనితోపాటుతన ఇంటికివెళ్ళాడు (132) ఆవిప్రస్త్రీని ఆరాకుమారుడు చాలాసంతోషపెట్టి, ఎల్లుండి (మూడోవాడు) ఆబ్రాహ్మణ కుమారునితో కలిసి అడవికి వెళ్ళాడు (133) ఆతడు, ఆగంధర్వస్త్రీచెప్పిన ప్రకారము ఆస్థానానికిచేరి, తనకూతురుతోకూడి ఉన్న, గంధర్వరాజునుచూచాడు (134) ఆగంధర్వపతివచ్చిన ఆ ఇద్దరుకుమారులను అభినందించిఅందమైనాసనంలో కూర్చో బెట్టి రాజపుత్రునితో ఇట్లా అన్నాడు (135) గంధర్వునివచనము - ఓ రాజేంద్రపుత్ర నిన్నటిరోజునేనుకైలాసానికి వెళ్ళాను. అక్కడ పార్వతితోకూడిఉన్న ప్రభువును మహాదేవునిచూచాను ( (136) ఆదేవేశుడునన్ను పిలిచి, అందరు దేవతల సన్నిధిలో ఇట్లన్నాడు.ఆ భగవానుడు, కరుణామృతవారిధి, (137) భూమిపైన ధర్మగుప్తుడు ఆనుపేరుగల ఒకరాజపుత్రుడున్నాడు. ఏమిచేయలేనివాడు, రాజ్యభ్రష్టుడు, శత్రువులు అతని రాజ్యాన్నిఆక్రమించారు (138) ఆబాలడు గురువుల వాక్యంత ఎప్పుడూ నాపూజయందు ఆసక్తుడై ఉంటాడు. ఇవ్వేళ ఆతని పితరులంతా ఆతని ప్రభావంవల్లనాదగ్గరికొచ్చారు. (139) ఓ గంధర్వసత్తమ ! ఆతనికి నీవు కూడా సాహాయ్యముచేయి. ఆ పిదప ఆతడు రాజ్యాన్ని పొందుతాడు. ఆతని శత్రువులు నశిస్తారు. (140) అని మహేశ్వరుడు ఆజ్ఞాపించగా నా ఇంటికి వచ్చాను. ఈనాకూతురుతో కూడా చాలాసేపు ప్రార్థింప బడ్డాను. (141) కరుణాత్ముడైన శివుని ఆజ్ఞను, ఇదంతా తెలుసుకుని ఈనాకూతురును తీసుకొని ఈ అడవిమధ్యకు వచ్చాను. (142) అందువ్ల ఈనాకన్యను అంశుమతినినీకు ఇస్తున్నాను. నీశత్రువులను చంపిశివుని ఆజ్ఞప్రకారము నీ రాజ్యంలోనిన్నుఉంచుతాను. (143) ఆపట్టణంలో నీవు ఈమెతో కూడి ఇష్టమైన సుఖములు, అనుభవించి, పదివేల సంవత్సారాల తరువాత శివునిమందిరానికి వెళ్తావు (144) ఆప్రదేశంలో కూడా నా ఈకన్యనిన్నే పొందుతుంది.దివ్యమైన ఈ స్వదేహంతోనే శివుని సన్నిధిలో (145) ఉంటారు.అని గంధర్వరాజు పలికి ఆఅడవిలో రాకుమారునితో తనకూతురు వివాహాన్ని జరిపించాడు (146) తెల్లని గొడుగు వంటి రాజార్హవస్తువులు ఇచ్చాడు. మహాఉజ్జ్వలమైన రత్నరాసులను ఆతనికిచ్చాడు. చంద్రునివంటిచూడామణిని, ప్రకాశిస్తుముక్తాహారములను ఇచ్చాడు (147) దివ్యఅలంకారములను, వస్త్రములను, బంగారువి కప్పుకునే వస్త్రములను, పదివేల ఏనుగులను, లక్ష నల్లని గుఱ్ఱములను ఇచ్చాడు (148) వేల కొలది బంగారు మయమైన చాలాగొప్పవైన రధములను ఇచ్చాడు. ఇంకా ఒక దివ్యరధమును ఇంద్రాయుధముతో సమానమైన ధనుస్సును ఇచ్చాడు. (149) వేలకొలది అస్త్రములను అక్షయ్య సాయకములుగల అమ్ములపొదిలను, భేదించరాని కవచాన్ని శత్రువులన మర్దించేసువర్ణశక్తినిచ్చాడు (150)

మూ || దుహితుః పరిచర్యార్థం దాసీపంచసహస్రకం | దదౌప్రీతమనాస్తసై#్మధనానివివిధానిచ || 151 ||

గంధర్వసైన్యమత్యుగ్రంచతురంగసమన్వితం | పునశ్చతత్సహాయార్థేగంధర్వాధిపతిర్దదౌ || 152 ||

ఇత్థంరాజేంద్రతనయః సంప్రాప్తః శ్రియముత్తమాం | అభీష్టజాయాసహితోమముదేనిజసంపదా || 153 ||

కారయిత్వాన్వదుహితుః వివాహంసమయోచితం | య¸° విమానమారుహ్యగంధర్వాధిపతిర్దివం || 154 ||

ధర్మగుప్తఃకృతోద్వాహః సహగంధర్వసేనయా | పునఃస్వనగరం ప్రాప్యజఘానరిపువాహినీం || 155 ||

దుర్ధర్షణంరణహత్వాశక్త్యాగంధర్వసేనయా | నిఃశేషితారాతి బలః ప్రవివేశనిజంపురం || 156 ||

తతోభిషిక్తఃసచివైఃబ్రాహ్యణౖశ్చమహోత్తమైః | రత్నసింహాసనారూఢఃచక్రేరాజ్యమకంటకం || 157 ||

యావిప్రవనితాపూర్వంతమపుష్ణాత్‌స్వపుత్రవత్‌ | సైవమాతాభవత్తస్యస్యభ్రాతాద్విజనందనః || 158 ||

గంధర్వతనయాజాయావిదర్భనగరేశ్వరః | ఆరాధ్యదేవంగిరిశంధర్మగుప్తోనృపో7భవత్‌ || 159 ||

ఏవమన్యే సమారాధ్యప్రదోషేగిరిజాపతిం | లభంతే భీప్సితాన్‌కామాన్‌దేహాంతేతుపరాంగతిం || 160 ||

సూతఉవాచ -

ఏతన్మహావ్రతంపుణ్యంప్రదోషేశంకరార్చనం | ధర్మారథకామమోక్షాణాం యదేతత్సాధనంపరం || 161 ||

యఏతత్‌శృణుయాత్పుణ్యంమాహాత్మ్యంపరమాద్భుతం | ప్రదోషేశిపూజాంతేకథయేద్వాసమాహిత || 162 ||

భ##వేన్నతస్యదారిద్ర్యం జన్మాంతరశ##తేష్వపి | జ్ఞానైశ్వరసమాయుక్తః సోన్తేశివపురంప్రజేత్‌ || 163 ||

యేప్రాప్యదుర్లభతరంమనుజాఃశరీరంకుర్వంతిహంతపరమేశ్వరపాద పూజాం

ధన్యాన్తఏవనిజపుణ్యజితత్రిలోకాస్తేషాంపదాంబుజరజోభువనంపునాతి || 164 ||

ఇతి శ్రీ స్కాందేమహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాంసంహితాయాంతృతీయే బ్రహ్మోత్తరఖండే ప్రదోషమహిమావర్ణనం నామసప్తమో7ధ్యాయః | 7 |

తా || కూతురునకు పరిచర్యచేసేకొరకు ఐదువేలదాసీలను ఇచ్చాడు రకరకాలధనసంపత్తిని ఆతనికిచ్చాడు ఆనందంతో (151) ఉగ్రమైన గంధర్వసైన్యము చతురంగములుకలది,అతనికి సహాయంకొరకు గంధర్వాధిపతి ఆతనికి చ్చాడు (152) ఈ విధముగారాకుమారుడు ఉత్తమమైన సంపదనుపొంది, ఇష్టమైనభార్యనుపొంది, ఆమెతో కూడి తన సంపదతో ఆనందించాడు (153) సమయోచితముగా తనకూతురు వివాహమును చేసి గంధార్వాధిపతి విమానమెక్కి స్వర్గానికివెళ్ళాడు. (154) ధర్మగుప్తుడు వివాహమయ్యాకగంధర్వసేనతోకూడి, తిరిగి తననగరానికివచ్చి, శత్రుసైన్యాన్ని సంహరించాడు (155) గంధర్వసేన శక్తితోదుర్థర్షణుని యుద్ధంలో చంపి, శత్రుసైన్యాన్నంతాచంపితననగరానికివచ్చాడు (156) మంత్రులతో మహోత్తమ బ్రాహ్మణులతోకూడి అభిషేకాన్ని పొంది, రత్నసింహాసనమందధిరోహించిరాజ్యమును ఎదురులేకుండా పాలించాడు (157) పూర్వము ఇతన్ని తనకొడుకులా పోషించిన బ్రాహ్మణవనితయే ఆతనికి తల్లైంది. ఆ బ్రాహ్మణకుమారుడు. భ్రాతయైనాడు (158) ఆతని భార్యగంధర్వతనయ. ఆతడు విదర్భనగరాధిపతి. దేవుడైన గిరీశుని పూజించి ధర్మగుప్తుడు రాజైనాడు. (159) ఈ విధంగా ఇతరులూ ప్రదోషసమయమందు గిరిజాపతినిపూజించి ఈప్సితమైన కామములను పొందుతున్నారు. దేహాంతమందు ఉత్తమగతిని పొందుతారు (160) సూతుని వచనము - ఇదిపుణ్యప్రదమైన వ్రతము ప్రదోషకాలమందుశంకరుని పూజనము. ధర్మఅర్థకామమోక్షములకు ఇదిఉత్తమసాధనము (161) పరమాద్భుతమైన ఈ మాహాత్మ్యాన్ని విన్నవారు, శివపూజచివరప్రదోషకాల మందు చక్కగా చెప్పినవారు (162) అట్టివారికి నూరు జన్మలందు కూడా దారిద్ర్యముండదు. జ్ఞాన ఐశ్వర్యములు కలవాడై అంతమందు ఆతడు శివపురికి వెళ్తాడు (163) దుర్లభ##మైన మనుజశరీరాన్ని పొంది పరమేశ్వరపాదపూజచేసినవారుమాత్రమేధన్యులు తమపుణ్యంతో ముల్లోకాలను జయించినవారు. వారిపాదధూళిఈలోకాలను పవిత్రంచేస్తూంది. (164) అని శ్రీ స్కాందమహాపురాణమందు ఏకాశీతి సహస్రసంహితయందు తృతీయమైనబ్రహ్మోత్తర ఖండమందు ప్రదోష మహిమ వర్ణన మనునది ఏడవ అధ్యాయము || 7 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters