Sri Scanda Mahapuranamu-3    Chapters   

తొమ్మిదవ అధ్యాయము

మూ || తతః సవిప్రః ప్రత్యూషే పుత్రశోకేన పీడితః | అశోకదత్తా సంయుక్తో భార్యయా విలలాపహ || 1 ||

విలపంతం సమాలోక్య గోవిందస్వామినం ద్విజాః | వణిక్‌సముద్ర దత్తాఖ్యః సమానిన్యే నిజం గృహం || 2 ||

సమానీయ సమాశ్వాస్య దయాయుక్తో వణిగ్వరః | స్వధనానాం హిసర్వేషాం రక్షితార మకల్పయత్‌ || 3 ||

స్మరన్‌ మహాయతివచః పుత్రదర్శన లాలసః | సతస్థౌవణి జోగేహా పుత్రభార్యా సమన్వితః || 4 ||

అశోకదత్త నామాతు ద్వితీమో విప్రనందనః | శ##స్త్రే చైవ తథాశాస్త్రే బభూవాతి విచక్షణః || 5 ||

తథాన్యా స్వపివిద్యాసునాస్తి తత్సదృశోభువి | కృతవిద్యోద్విజసుతః ప్రఖ్యాతోన గరే భవత్‌ || 6 ||

తా || పిదప ఆ బ్రాహ్మణుడు తెల్లవారు ఝామున పుత్ర శోకంతో పీడింపబడుతూ, అశోకదత్తునితో, భార్యతో కూడి, దుఃఖించనారంభించాడు (1) ఏడుస్తున్న గోవిందస్వామిని చూచి, బ్రాహ్మణులారా ! సముద్రదత్తుడనే వ్యాపారి తన ఇంటికి తీసుకెళ్ళాడు (2) తీసుకొచ్చి ఓదార్చి ఆ వణిక్‌ శ్రేష్ఠుడు దయగలవాడై తన ధనానికంతకు రక్షకునిగా నియమించాడు (3) ఆ సన్యాసి మాటలను స్మరిస్తూ పుత్రుని దర్శనం యందు ఆసక్తి గలవాడై పుత్రుడు, భార్య వీరితో కూడి ఆ వ్యాపారి ఇంట్లో ఆ బ్రాహ్మణుడు ఉన్నాడు (4) ఆశోకదత్తుడనే ఆ బ్రాహ్మణుని రెండవకొడుకు శస్త్రమందు శాస్త్రములందును విజ్ఞానవంతుడయ్యాడు (5) అట్లాగే ఇతర విద్యలందును అతనితో సమానమైనవాడు భూమిపైన లేడు. విద్యలను పొంది బ్రాహ్మణ కుమారుడు నగరంలో ప్రఖ్యాతుడైనాడు (6)

మూ || అత్రాంతరే నరపతిం ప్రతాపమకుటాభిధః | కాశీదేశాధి పోమల్లః కశ్చిదభ్యాయ ¸°బలీ || 7 ||

ప్రతాపముకు టోరాజా మల్లస్యాస్య జయాయసః | బలినం ద్విజపుత్రంత మాహ్వయామాసభృత్యకైః || 8 ||

తమాగతం సమాలోక్య ప్రతాపముకు టో7 బ్రవీత్‌ | అశోకదత్త సహసావ్లుమేనం బలోత్కటం || 9 ||

దుర్జయం జహి సంగ్రామే త్వం వై బలవతాంపరః | దాక్షిణాత్య మహామల్లవతావస్మిన్జితే త్వయా || 10 ||

యదిష్టం తవ తత్సర్వం దాస్యామ్యహంస సంశయః | ఇతిత స్యవచః శ్రుత్వాబలవాన్ద్వి జనందనః || 11 ||

దాక్షిణాత్యమహామల్ల నృపతిం సమతాడయత్‌ | తాపితో ద్విజపుత్రేణ మల్లః సబలినాబలీ || 12 ||

సద్యోవివృత్త నయనః పరాసుఃన్యపతత్‌ భువి | ద్విజపుత్రస్యతత్కర్మ దేవైరపి సుదుష్కరం || 13 ||

ప్రతాపము కుటోదృష్ట్వా ప్రసన్న హృదయోభవత్‌ | దత్వాబహుధనాన్‌ గ్రామాన్‌ సమీపేస్థాపయత్తదా || 14 ||

సకదాచిన్మ హారాజః సహితోద్విజసూనునా | సంధ్యాయాం విజనే దేశేచచార తురగేణవై || 15 ||

ద్విజసూనుసఖస్త త్రదీనాం వాణి మథా శృణోత్‌ | రాజన్నల్పాపరాధో7హం శత్రుప్రేరణయా సకృత్‌ || 16 ||

దండపాలేన నిహితః శూలేనిర్‌ ఘృణ చేతసా | దినమధ్యచతుర్థం మేశూలస్థ సై#్యవ జీవితః || 17 ||

ప్రాణాః సుఖేన నిర్యాంతి నహిదుష్కృత కర్మణాం | భృశంమాం బాధతే తృష్ణాతాంనివారయ భూపతే || 18 ||

ఇతిదీనాం సమాకర్ణ్య వాచం రాజాద్విజాత్మజం | అశోకదత్త నామానం ధైర్యవంత మభాషత || 19 ||

అసై#్మనిరపరాధాయ శూలప్రోతా య జంతవే | తృష్ణార్దితాయదాతవ్యం ధైర్యవంత మభాషత || 20 ||

ఇత్యాదిష్టోనరేంద్రేణ సహసా ద్విజసందనః | జలపూర్ణం సమాదాయకలశం వేగవాన్‌ య¸° || 21 ||

తచ్ఛ్మశానం సమాసాద్యభూతవేతాలసంకులం | శూలప్రోతాయవైతసై#్మ జలందాతుం సముత్సుకః || 22 ||

దదర్శాథస్థితాంనారీం నవ¸°వనశాలినీం | ఉదైక్షత మహాకాంతిం మూర్తామివరతింద్విజ || 23 ||

తా || ఈ మధ్యకాలంలో ప్రతాపముకుటుడనే రాజు దగ్గరకు కాశీదేశాధిపుడు బలవంతుడైన ఒక మల్లుడు వచ్చాడు (7) ప్రతాపముకుటరాజు ఈ మల్లుని జయించే కొరకు బలవంతుడైన ద్విజపుత్రుని తన భటుల ద్వారా పిలిపించాడు (8) వచ్చిన ఆతనిని చూచి ప్రజా పముకుటుడు ఇట్లన్నాడు. అశోకదత్తా! బలవంతుడైన జయించరాని ఈ మల్లుని (9) తొందరగా యుద్ధంలో చంపు నీవు బలమంతులలో శ్రేష్ఠుడవు కదా! దక్షిణాత్య మహామల్లపతియైన ఈతణ్ణి నీవు జయిస్తే (10) నీవేదికోరితే అదంతా ఇస్తాను. అనుమానించకు. అనే అతని మాటలను విని బలవంతుడైన బ్రాహ్మణ కుమారుడు (11) దాక్షిణాత్యమహామల్ల నృపతిని కొట్టాడు. బ్రాహ్మణకుమారునితో కొట్టబడి ఆశక్తి శాలి మల్లుడు (12) వెంటనే కళ్ళు తేలేసి ప్రాణాలు పోయి భూమిపై పడ్డాడు. దేవతలు కూడా చేయలేని, బ్రాహ్మణకుమారుని ఆ పనిని (13) ప్రతాపముకుటుడు చూచి ప్రసన్న హృదయుడైనాడు. బహుధనము గ్రామములు ఇచ్చి సమీప మందుంచుకున్నాడు (14) ఆమహారాజు బ్రాహ్మణకుమారునితో కలిసి సంధ్యాకాలమందు గుర్రముమీద నిర్జన ప్రదేశంలో తిరుగసాగాడు (15) బ్రాహ్మణ పుత్రుడు తోడుగా గల ఆరాజు అక్కడే దీనంగా పల్కుతున్న మాటలను విన్నాడు. రాజ! నేను చాలా చిన్న తప్పు చేశాను అది కూడా శ్రతువుల ప్రేరణవల్ల ఒక్కసారే (16) దయలేని నీదండపాలుడు నన్ను శూలమందుంచాడు. ఇది నాలుగవ రోజు శూలమందే జీవించటం. (17) దుష్కర్మచేసిన వారి ప్రాణాలు సుఖంగాపోవు. నాకు దప్పిక ఔతోంది బాగా దానిని వారించు ఓ రాజా! (18) అనే దీనమైన మాటలను విని రాజు బ్రాహ్మణ పుత్రునితో ధైర్యవంతుడైన ఆశోకదత్తునితో ఇట్లా అన్నాడు (19) నిరపరాధయై శూలమందున్న ఈ ప్రాణికి దప్పిగొన్న దానికి ఓ బ్రాహ్మణకుమార! నీవు నీరివ్వాలి (20) అని రాజుతో ఆదేశించబడి వెంటనే బ్రాహ్మణకుమారుడు కలశమును నీళ్ళతో నింపి తేవటానికి తొందరగా వెళ్ళాడు. (21) భూతవేతాళములతో నిండిన ఆశ్మశాసనమునకు వచ్చి శూలమందున్న ఆతనికి నీరు ఇవ్వాలని ఉత్సహించాడు (22) నవ¸°వనం గల స్త్రీని అక్కడ నిల్చున్నదాన్ని చూచాడు. కాంతి గల రతీదేవి మూర్తిలాగ ఉన్నదాన్ని బ్రాహ్మణుడు చూచాడు (23).

మూ || తామాలోక్య తతః ప్రాహధైర్యవాన్‌ ద్విజనందనః |కాసి భ##ద్రే వరారోహెశ్మ శానే విజనే స్థితా || 24 ||

అస్యాధస్తాత్‌ కి మర్ధం త్వం శూలప్రోతస్యతిష్ఠసి | ఇతితస్యవచః శ్రుత్వా సాప్రాహరుచిరాననా || 25 ||

పురుషోవల్లభో7యంమే శూలేరాజ్ఞాసమర్పితః | ధనం యథాచకృపణః ప్రశ్యప్రాణాన్నముంచతి || 26 ||

ఆసన్న మరణంచైనం అనుయాతుమిహస్థితా | తృషితో యాచతేవారి మామయం వ్యధతేముహుః || 27 ||

శూలప్రోతోద్ధతం గ్రీవం ముముర్షుప్రాణనాయకం | నాస్తిపాయయితుం శక్తా జలమేన మధః స్థితా || 28 ||

అశోకదత్తస్తచ్ఛృత్వా కరుణావరుణాలయః | తత్కాల సదృశం వాక్యం తాంవధూమ బ్రవీత్తదా || 29 ||

అశోకదత్త ఉవాచ -

మాతర్మత్‌ స్కంధమారుహ్యదేహ్యసై#్మ శీతలంజలం | సాతధేతి తమాభాష్య తరుణీత్వర యాన్వితా || 30 ||

ఆనమ్రవపుషస్తస్య స్కంధం పద్భ్యాం రురోహవై | ద్విజసూనుర్ద దర్శాథ శోణితం సూతనంపతత్‌ || 31 ||

కిమేత దితి సోపశ్యత్‌ ఉన్నమ్యసహసాముఖం | భక్ష్యమాణం తయా తత్సవిజ్ఞాయ ద్విజసందనః || 32 ||

అశోకదత్తోజగ్రాహ తస్యాః పాదం ససూపురం | తతో7గాన్నూపురంత్యక్త్వా బద్ధరత్నం విహాయతత్‌ || 33 ||

ప్రత్యుప్తానేకరత్నాఢ్యం తదాదాయచనూపురం| అశోకదత్తః ప్రయ¸°తత్‌ శ్మశానాత్‌ నృపాంతికం|| 34 ||

స్మశానవృత్తంతత్సర్వం ననృపాయ నివేద్యవై | మహార్ఘ్య రత్న ప్రత్యుప్తం నూపురంచ దదౌతదా || 35 ||

జ్ఞాత్వాతద్వీరచరితం వరైరన్యైః సుదుష్కరం | దదౌమదన లేఖాఖ్యాం సుతాంతసై#్మ మహీపతిః || 36 ||

తా || ఆమెను చూచి ధైర్యముగల ద్విజకుమారుడు ఇట్లన్నాడు. ఓ ఉత్తమ స్త్రీ ! నీవెవరు, శ్మశానంలో ఒంటరిగా ఉన్నావు (24) ఈ శూలప్రోతము క్రింద నీవెందుకున్నావు - అని అతడనగా విని అందమైనముఖం గల ఆమె ఇట్లా అంది (25) ఈ పురుషుడు నా భర్త. రాజు ఈతనిని శూలమందుంచాడు. లోభి డబ్బును వదలనట్లు ఈతడు ప్రాణాలను వదలటం లేదు (26) చావు దగ్గరకు వచ్చిన ఈతనిని అనుసరించి వెళ్ళటానికినేనిక్కడున్నాను దప్పిగొని నీరు అడుగుతున్నాడు. ఇది నన్ను బాధిస్తోంది మాటి మాటికి. (27) శూలప్రోతంపై ఎత్తిన తలగల చావటానికి సిద్ధంగా ఉన్న ప్రాణనాయకునకు క్రింద ఉన్న నేను నీరు త్రాగించటానికి అసమర్థురాలను (28) ఈ మాటలను అశోకదత్తుడువిని దయగలవాడై ఆ సమయానికి తగినట్లు ఆవధువుతో ఆతడిట్లా అన్నాడు (29) ఆశోకదత్తుని వచనం - ఓ తల్లి ! నీవు నా భుజములపైకి ఎక్కి ఈతనికి చల్లనినీరు త్రాగించు. ఆమె అట్లాగేనని అతనితో పలికి ఆయువతి తొందరగా (30) శరీరం వంచిన ఆ పురుషుని భుజమును పాదములతో ఆరోహించింది. బ్రాహ్మణకుమారుడు కొత్తగా పడుతున్న రక్తాన్ని చూచాడు (31) ఆతడు తొందరగా ముఖమెత్తి ఇదేమిటని చూచాడు. ఆమె దాన్ని తినటం చూచిన బ్రాహ్మణ కుమారుడు (32) ఆశోకదత్తుడు నూపురంతో కూడిన ఆమె పాదాన్ని పట్టుకున్నాడు. రత్నంతో కట్టబడ్డనూపురమును వదలి ఆమె వెళ్ళి పోయింది (33) అనేక రత్నములు గల ఆ నూపురమును తీసుకొని అశోకదత్తుడు ఆ శ్మశానం నుండి రాజు సమీపానికి వెళ్ళాడు (34) స్మశానవృత్తాంతాన్నంతా ఆరాజుకు నివేదించాడు. చాలవిలువైన రత్నములు పొదగబడిన నూపురమును రాజుగారికిచ్చాడు (35) ఇతర వీరులు చేయలేని ఆవీర చరితము విని ఆతనికి రాజు మదనలేఖ అనుపేరుగల తన కూతురునిచ్చాడు (36).

మూ || కదాచిదధతద్దివ్యం నూపురం వీక్ష్యభూపతిః | అస్యనూపురవర్యస్యతుల్యం వైనూపురాంతరం || 37 ||

కుతోవాలభ్యత ఇతిసాదరం సమచింతయత్‌ | అశోకదత్తస్తు తదావిజ్ఞాయ నృపకాంక్షితం || 38 ||

నూపురాంతర సిద్ధ్యర్థం చింతయామానచేతసా l శ్మశానే నూవురమిదం యతః ప్రాప్తం మయాపురా ll39 ll

తాంసూపురాంతం ప్రాసై#్య కుత్రద్రక్ష్యామిసాంప్రతం l ఇత్థం వితర్క్య బహధానిశ్చికాయ మహామతి ః ll40ll

విక్రేష్యామి మహామాంసం సమేత్య పితృకాననం l తత్ర రాక్షస వేతాల పిశాచా దిషు సర్వశః ll41ll

మంత్రై రాహూయమానేషు సాప్యాయాస్యతిరాక్షసీ l తామాగతాం బలాద్గృహ్య తద్గ్రహీష్యామి నూపురం ll 42 ll

రాక్షసానాం సహస్రంవాపిశాచానాంతథాయుతం l వేతాలానాం తథాకోటి ఃసలక్ష్యం బలినోమమ ll43ll

ఇతినిశ్చిత్య మనసాశ్మశానం సహసాయమౌ l విక్రీణానోమహామాంసం మంత్రైరాహూయరాక్షసాన్‌ ll44ll

గృహాణత్యుచ్చయావాచా చచార శ్రావయన్‌ దిశి ః l విక్రీయతే మహామాంసం గృహ్యతాం గృహ్యతామితి ll45ll

తత్రరాక్షసవేతాలాః కంకాలాశ్చ పిశాచకా ః lఅన్యేచ భూతనివహాఃసమాజగ్ముఃప్రహర్షితాః ll46 ll

భక్షయిష్యామహెసర్వే మాంసమిష్టతమంత్వితిl తత్రాగచ్ఛత్సుసర్వేషు రక్షః కన్యాసమావృతా ll47 ll

ఆయ¸°రాక్షసీసాపి మాంసభక్షణ లాలసా l గవేషయంస్తదావిప్రస్తాం సముద్వీక్ష్యరాక్షసీం ll48 ll

సేయం దృష్టావపురేత్యేష ప్రత్యభిజ్ఞానమాప్తవాన్‌ l తామాహద్విజపుత్రో 7న్యద్దేహిమే నూపురం త్వితి ll49 ll

సాతస్యవచనం శ్రుత్వాప్రీతా వాక్యమథాబ్రవీత్‌ l మమైవచత్వయానీతం పురావీరేంద్రనూపురం ll 50 ll

గ్యహాణరత్న రుచిరం ద్వితీయమపినూపురం l ఇత్యుక్త్యా నూపురంతసై#్మ స్వసుతాంచదదౌ ప్రియాం ll 51 ll

విద్యుత్‌ కేశ్యాతదాదత్తాం ప్రియాం విద్యుత్‌ ప్రభాభిధాం l విప్ర ః సంప్రాప్యముముదే రూప¸°వనశాలినీం ll 52 ll

విద్యుత్‌ కేశీతుజామాత్రే హెమాబ్జమపిసాదదౌ l విద్యుత్‌ ప్రభాం నూపురంచ హెమాబ్జమపిలభ్యసః ll 53 ll

శ్వశ్రూమాభాష్య సహసాపునః ప్రాయాన్న్సపాంతికం lతతః ప్రతాపముకుటోనూ ప్రాప్తినందితః ll 54 ll

శౌర్యదైర్య సమాయుక్తం ప్రశశంసద్విజాత్మజం ll 541/2 ll

తా ll మహారాజు ఒకసారి ఆ దివ్యమైన నూపురాన్ని చూచి ఈ నూపురంతో సమానమైన మరో నూపురం (37) ఎట్లా లభిస్తుంది . అని ఆలోచించాడు. ఆశోకదత్తుడు రాజుగారి కోరికను తెలుసుకొని (38)మరో నూపురం లభించే కొరకు మనస్సులో ఆలోచించాడు. నేను పూర్వం శ్మశానంలో ఈనూపురాన్ని ఎవరి నుండి పొందానో (39)ఆమెను మరోనూపురం లభించే కొరకు ఇప్పుడెక్కడ చూడను. ఇట్లా చాలా ఆలోచించి ఆ బుద్ధిమంతుడు ఒకనిశ్చయానికొచ్చాడు (40)శ్మశానమునకు వెళ్ళి మహామాంసాన్ని అమ్ముతాను. రాక్షసవేతాల పిశాచాదులందరిని (41)మంత్రములతో ఆహ్వానిస్తుంటే అ రాక్షసి కూడా వస్తుంది. ఆ వచ్చిన ఆమెను బలవంతంగా పట్టుకొని ఆ నూపురాన్ని తీసుకుంటాను (42)వేయిమంది రాక్షసులు కాని పదివేల మంది పిశాచులుకాని కోటిమంది వేతాలురుకాని బలవంతుడనైన నాకు లెక్కకాదు (43)అని మనస్సులో నిశ్చయించుకొని తందరగా శ్మశానానికి వెళ్ళాడు. మంత్రములతో రాక్షసుల నాహ్వానించి మహా మాంసాన్ని అమ్ముతూ (44) దిక్కుల్లో విన్పించేట్టు తీసుకోండి అని గట్టిగా అరుస్తూ తిరిగాడు. మహామాంసము అమ్మబడుతోంది తీసుకోండి తీసుకోండి అని (45) అక్కడ రాక్షస వేతాలురు, కంకాలురు, పిశాచములు ఇతర భూతముల సమూహములు ఆనందతో వచ్చారు (46)ఇష్టతమయైన మాంసమును మన మందరము తిందాము అని అందరు అక్కడికి రాగా రాక్షస కన్య కూడా వచ్చింది (47)మాంసంభక్షించాలనే అసక్తితో ఆరాక్షసి కూడా వచ్చింది. వెతుకుతున్న ఆ బ్రహ్మణుడు ఆ రాక్షసిని చూచి (48)ఈమెను ఇంతకు ముందు చూచాను అనే ప్రత్యభిజ్ఞను పొందాడు(జ్ఞాపకం) ఆమెతో ఇట్లా అన్నాడు నాకు అ రెండో నూపురం ఇవ్వు అని (49) అమె అతని మాటను విని సంతోషపడి ఇట్లాఅంది . ఓ వీర శ్రేష్ట! ఇంతకు ముందు నీవే నా నూపురాన్ని తీసుకెళ్ళావు . (50)రత్నంతో అందమైన రెండోనూపురాన్ని కూడా తీసుకో అని అంటూ రెండో నూపురాన్ని తనకిష్ణమైన తన కూతురును ఆ బ్రహ్మణునకిచ్చింది (51) విద్యుత్కేశితో ఇవ్వబడ్డ. విద్యుత్ప్రభ అనుపేరుగల ప్రేయసిని రూప¸°వనవంతురాలిని పొంది బ్రాహ్మణుడు ఆనందపడ్డాడు (52)విద్యుత్‌ కేశి తన అల్లునకు బంగారు తామర పువ్వును కూడా ఇచ్చింది . విద్యుత్‌ ప్రభను , కాలి అందెను, హెమాబ్జమును పొంది ఆతడు (53)అత్తకు పోయివస్తానని చెప్పి తొందరగా తిరిగి రాజు దగ్గరకు వచ్చాడు, పిదప ప్రతాపముకుటుడు, రాజు నూపురం లభించటంవల్ల ఆనందపడి (54) శౌర్యదైర్యములతో కూడిన బ్రాహ్మణ కుమారుని ప్రశంసించాడు (54 1/2)

మూll అథవిద్యుత్ప్రభాం విప్రః సో7బ్రవీద్రహసి ప్రియం ll 55 ll

మాత్రాతవకుతోలబ్ధం ఏతత్‌ హెమాంబుజం ప్రియే l ఏతత్తుల్యాని చాన్యాని యతః ప్రాప్య్సెవరాననే ll 56 ll

ద్విజాత్మజంతతః ప్రాహపతిం విద్యుత్‌ ప్రభారహ ఃlప్రభోకపాల విస్ఫోటనామ్నెవేతాల భూపతేః ll57 ll

అస్తిదివ్యంసర ః కించిత్‌ హెమాంబుజపరిష్యృతం lతవస్వస్రాజలక్రీడాంవితన్వం త్యేదమాహృతం ll 58 ll

ఇతిశ్రూత్వావచ ః తత్ర మాంనయేతి జగాదస ః తతః సా సహసావిప్రం నిన్యేతత్కాంచనం సరః ll 59 ll

తతఃసహెమసద్మానా మాజి హీర్షుః ద్విజాత్మజః తద్విఘ్నకారిణః సర్వాన్‌ వేతాలాదీన్‌ తతోzధీత్‌ ll 60 ll

స్వయంకపాల విస్పోటం నిహతాశేషసైనికం l దదర్శవేతాలపతింతంచహంతుం ప్రచక్రమే ll 61 ll

అత్రాంతరే మహాతేజా నామ్నావిజ్ఞప్తి కౌతుకః విద్యాధరపతి ః ప్రాప్యవిమానే నైనమబ్రవీత్‌ ll 62 ll

అశోకదత్తవిప్రేంద్ర సాహసం మాకృథాఇతి l తదాక్ణ్యద్విజసుతో విమానవం సంస్థితం ll 63 ll

దదర్శప్రభయాయుక్తం విద్యాధరపతిం దివి తస్యదర్శన మాత్రేణ శాపాన్ముక్తోద్విజాత్మజః ll 64 ll

తాll పిదప విప్రుడు ఏకాంతమున తన ప్రియురాలైన విద్యుత్ప్రభతో ఇట్లా అన్నాడు .(55) మీ అమ్మగారికి హెమాంబుజము ఎట్లా లభించింది . దీనితో సమానమైనవి మరిన్ని ఎక్కడ లభిస్తాయి (56)అని అన్న బ్రాహ్మణునితో(భర్తతో)విద్యుత్ర్పభరహస్యంగా ఇట్లా అంది . కపోటవిస్ఫోటుడను వాడు వేతాలురకురాజు ఆతనికి(57) బంగారుతామ రలుగల దివ్యమైన సరస్సు ఉంది. మీఅత్తగారు జలక్రీడలాడుతూ దీన్నితీసుకువచ్చింది (58)అని వింటూనే ఆతడు నన్నుఅక్కడికి తీసుకవెళ్ళు అనిఅన్నాడు. ఆమె వెంటనే అబ్రాహ్మణుని ఆకాంచన సరస్సుకు తీసుకవెళ్ళింది (59)ఆ బ్రాహ్మణకుమారుడు ఆ బంగారు తామరలను తీసుకునేంతలోనేదానికి విఘ్నంగావచ్చిన వేతాలురనందరిని ఆతడు చంపాడు (60)సైన్యమంతాచనిపోయి ఉన్నకపాలవిస్ఫోటునివేతాలపతినిస్వయంగా వచ్చినవాణ్ణిచూచి, ఆతనినిచంపుటకు ప్రయత్నించాడు బ్రాహ్మణుడు. (61)విజ్ఞాపనచేయటానికి ఉత్సాహంకలమహాతేజుడను పేరుకలవిద్యాధర పతిఇంతలోవచ్చి విమానంలో ఉండి ఈతనితో ఇట్లాఅన్నాడు (62) ఓబ్రహ్మణ !అశోకదత్త! సాహసంచేయొద్దు. అమాటలువినివిమాన మందు నున్న (63) వెలిగిపోతున్న, విద్యాధరపతిని అకాశంలో ఈ బ్రాహణ కూమారుడుచూచాడు అతనినిచూచినంతలోనే బ్రాహ్మణ కుమారుడుశాపము నుండిముక్తుడైనాడు (64)

మూllసంత్యజ్యమానుషంరూపంద్వివ్యంరూపమావాప్తవాన్‌lవిమానవరమారూఢందివ్యాభరణభూషితం ll 65 ll

శాపాన్ముక్తంసుకర్ణంతంప్రాహవిజ్ఞప్తికౌతుకః l అయంసుకర్ణతేభ్రాతాగాలవస్యమహామునే

ll 66 ll

శాపాద్వేతాలతాంప్రావతత్కన్యాస్పర్శపాతకీ l త్వంచశప్తఃపురాతేనతత్పాస్యానుమోదకః ll67 ll

తవాయమల్పపాపస్య శాపోమద్దర్శనావధిః కల్పితస్తేనమునినాశాపాంతో నాస్యకల్పితః ll 68 ll

తదేహిముక్తశాపోసినుకర్ణస్వర్గమారుహ l తతఃసుకర్ణస్తం ప్రాహవిద్యాధరకులాధివం ll 69 ll

విద్యాధరపతేభ్రాత్రావినాజ్యేష్ఠేనసాంప్రతంlసర్వభోగమంతంస్వర్గంనైపగంతుంసముత్సహె ll 70ll

శాపస్యాంతో యధాభూయాత్‌ మమభ్రాతుస్తధాపదlతమువాచమహాతేజాః తధావిజ్ఞాప్తికౌతుక ll 71 ll

దుర్నివారమిమంశాపంఅన్యఃకోవానివారయేత్‌ కింతుగుహ్యతమంకించి తత్‌ వవక్ష్యామిసాంప్రతం ll 72 ll

బ్రహ్మాణాననకాదిభ్యోమునిభ్యః కధితంపురా l సర్వతీర్థాశ్రమేపశ##ణ్యదక్షణస్యోదధేః తటె ll 73 ll

చక్రతీర్థసమీపేతుతీర్థమస్తిమహత్తరం l మహాపాతకసంఘాశ్చయస్యదర్శనమాత్రతః ll 74 ll

సశ్యంతితత్‌క్షణాదేవనజానేస్నానజంఫలంlతత్రగత్వాతవజ్యేష్ఠోయదిస్నాయాతే మహత్తరే ll 75 ll

వేతాలత్వంత్య జేన్నూనంతదాగాలవశాపజంl సుకర్ణంతద్వచః శ్రుత్వాభ్రాతావేతాలరూపిణ ll 76 ll

సహిత ః సహసాప్రాయాత్‌ దక్షిణ స్యోదధేస్తటం ll 76 1/2ll

తాll మనుష్య రూపాన్ని వదలి దివ్యరూపాన్ని పొందాడు. విమానమాధిరోహించిన దివ్యాభరణములతో అలంకరింపబడిన (65) శాపవిముక్తుడైన అసుకర్ణునితో, చెప్పాలనే కుతుహలంకొద్ది ఇట్లా విధ్యాధరపతి అన్నాడు. సుకర్ణ ! ఈతడునీ అన్న గాలవముని యొక్క (66) శాపంవల్ల వేతాలుడైనాడు, ఆకన్యను ముట్టిన పాపి. ఆపాపాన్ని అనుమతించినందువల్ల అతడు నిన్నుకూడా శపించాడు (67)నీ అల్పపాపమునకైన శాపము నా దర్శనంతో పోతుంది . అని ఆ ఋషిఅన్నాడు . అతనికి శాపాంతాన్ని కల్పించలేదు (68)రా ! శాపం నుండి ముక్తుడవైనావు సుకర్ణ ! స్వర్గమారోహించు. అప్పుడు సుకర్ణుడు విద్యాధర కులాధిపునితో ఇట్లా అన్నాడు (69)ఓ విద్యాధరపతి ! ఇప్పుడు నా పెద్ద అన్నయ్య లేకుండా అన్ని భోగములతో కూడిన స్వర్గానికి పోవటానికి నేను ఇష్టపడటం లేదు (70)మా అన్నకు శాపాంతము వచ్చే విధమ చెప్పు . అని అనగా మహాతేజుడు చెప్పాలనే ఉత్సాహంతో అతనితో ఇట్లా అన్నాడు (71)నివారింపశక్యమకాని ఈ శాపమును ఇతరులెవ్వరు నివారిస్తారు . ఐనా చాలా రహస్యమైన ఒక విషయాన్ని ఇప్పుడు నీకు చెప్పెదను (72)బ్రహ్మసనకాది మునులకు ఇది వరలో చెప్పాడు. సర్వతీర్థములకు ఆశ్రయమైన పుణ్యప్రదమైన దక్షిణ సముద్రం ఒడ్డున (73)చక్ర తీర్థ సమీపంలో గొప్ప తీర్థముంది . మహాపాతక సముహములు కూడా దాన్ని దర్శిస్తూనే (74) నశిస్తాయి ఆక్షణంలోనే, అని అంటే స్నానంవల్లవచ్చే ఫలితాన్ని తెలుసుకోలేం . అక్కడికి వెళ్ళి మీ అన్నస్నానం చేసిన యెడల (75)గాలవశాపంవల్ల వచ్చిన వేతాలత్వాన్ని తప్పకుండా వదిలిపెడతాడు . సుకర్ణుడు ఆ మాటలువిని, వేతాలరూపుడైన అన్నతో (76) కూడి దక్షిణ సముద్రతీరానికి తొందరగా వెళ్ళాడు (76 1/2).

మూll దక్షిణ చక్రతీర్థాఖ్యాత్‌ ఉత్తరం గంధమాదనాత్‌ ll 77 ll

బ్రహ్మణాసనకాధిభ్యః కథితం తీర్థమభ్యగాత్‌ l తత్తీర్థకూలమాసాద్య భ్రాతరం చేదమబ్రవీత ll 78 ll

éభ్రాత గోలపశాపస్య ఘోరస్యాస్యనివృత్తయే l తీర్థేస్మిన్న చిరాత్‌ స్నాహి సర్వతీర్థోత్తమోత్తమే ll 79 ll

తస్మిన్నవసరేవిప్రాఃతస్యతీర్థస్య శీకరాఃl న్యపతంస్తన్యగా త్రేషువాయునావైసమాహృతాః ll 80ll

సతచ్ఛీకరసంప్పర్శాత్‌ త్యక్త్వా వేతాలతాంతదా l తదేవ మానుషం భావం ద్విజపుత్రత్వమాప్తవాన్‌ ll 81 ll

తతఃసంకల్ప్యసహసాతస్మింస్తీర్థోత్తమోత్తమేlమనష్యత్వనివృత్యర్థం నిమమజ్జద్విజాత్మజః ll 82 ll

ఉత్తిష్ఠన్నేవసహసాదివ్యం రూపమవాప్తవాన్‌ l విమానవరమారూఢో దేవస్త్రీ పరివారితః ll 83 ll

సర్వాభరణ సంయుక్తః సంకహభ్రాత్రాసుదర్శనః l శ్లాఘమానశ్చత త్తీర్థం సమస్కృత్యపునఃపునః ll 84 ll

విజ్ఞప్తి కౌతుకం చాపి పురస్కృత్య దివం య¸° l తదాప్రభృతి తత్తీర్థం వేతాల వరదాభిదం ll 85ll

వేతాల త్వం వినష్టం యత్‌ శీకరస్పర్శమాత్రతః l య ఇదం తీర్థమాసాద్య చక్రతీర్థస్యదక్షిణ ll 86 ll

స్నానం కదాచిత్‌ కుర్వంతి జీవస్త్ముక్తాభవంతితే l ఏతత్తీర్థనమం పుణ్‌ యం సభూతం సభవిష్మతి ll 87 ll

ఘోరాం వేతాలతాంత్యక్త్వా దివ్యతాం సయదాప్తవాన్‌ ll 87 1/2 ll

అత్రసంకల్ప్యచస్నాత్వావేతాల వరదేశుభే l పితృభ్య ః పిండాదానం చకుర్యాధ్త్యెనియమాన్వితః ll 89 ll

ఏవం వ ః కథితం విప్రా ః తస్యతీర్థస్యవైభవం l వేతాల వరదాభిఖ్యాయధాచాస్యసమాగతా ll 90 ll

యః పఠే దిమ మధ్యాయం శ్రుణుయాద్వాస ముచ్యతే ll 91 (90 1/2) ll

ఇతిశ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్య్మే వేతాల వరద తీర్థ ప్రశంసాయాం సుదర్శన

సుకర్ణశాపమోక్షణం నామ నవమోధ్యాయః ll 9ll

తాll చక్రతీర్థమునకు దక్షణ భాగంలో గంధమా దనమునకు ఉత్తర భాగంలో ఉన్న (77) బ్రహ్మ సనకాదులకు చెప్పిన తీర్థమునకు వెళ్ళారు . ఆ తీర్థము ఒడ్డునకు చేరి అన్నతో ఇట్లనెను (78) ఓ అన్న ఘోరమైన ఈ గాలవ శాపనివృత్తి కొరకు ఈ తీర్థంలో తొందరగా స్నానం చేయి . ఇది సర్వతీర్థ ఉత్తమోత్తమము (79)ఓ బ్రహ్మణులారా ! ఆ సందర్భంలో ఆ తీర్థము యొక్క నీటి తుంపురులు గాలితో తీసుకురాబడి అతని అవయవాలపై పడ్డాయి (80)ఆ నీటి తంపురుల స్పర్శ వల్ల వేతాల రూపాన్ని వదలి, అదేపూర్వమనుష్య రూపాన్ని ద్విజపుత్రరూపాన్ని పొందాడు (81) పిదప సంకల్పం చేసి త్వరగా ఆ ఉత్తమెత్తమ తీర్థంలో మనుష్యత్వనివృత్తి కొరకు అ బ్రాహ్మణకుమారుడు మునిగాడు (82) అందులోంచి లేస్తూనే దివ్యరూపాన్ని పొందాడు . శ్రేష్ఠమైన విమాన మధిరోపించి దేవస్త్రీలతో చుట్టబడి (83)అన్ని అభరణములతో కూడి అన్నయైన సుదర్శనుడు తమ్మునితోకుడి, ఆ తీర్థాన్ని పొగుడుతూ మాటిమటికి ఆ తీర్థానికి నమస్కరిస్తూ (84) విజ్ఞప్తి కౌతుకుని ముందుంచుకొని స్వర్గానికి వెళ్ళాడు. నాటి నుండి ఆ తీర్థమునే తాల వరదమని పిలువబడుతోంది . (85) నీటి తుంపురుల స్పర్శ మాత్రం వల్ల వేతాలత్వం నశింపచేసిన చక్రతీర్థమునకు దక్షిణంలో ఉన్న ఈ తీర్థమునకు వచ్చి (86)ఎప్పుడైనా స్నానం చేసిన వారు జీవన్ముక్తులౌతారు. ఈ తీర్థముతో సమంగా పుణ్యప్రదమైంది ఇదివరలో లేదు . ముందు ఉండదు (87)ఘోరమైన వేతాల రూపాన్ని వదలి దివ్యత్వాన్ని పొందాడు కదా. (88) ఇక్కడ సంకల్పంచేసి శుభ##మైన ఈవేతాల వరదంలో స్నానం చేసి నియమంగా పితరులకు పిండదానం కూడా చేయాలి (89) ఓ బ్రాహ్మణులారా ! ఆ తీర్థవైభవాన్ని ఈ రకంగా మీకు చెప్పాను. వేతా వరదమనే పేరు ఎట్లా వచ్చిందో చెప్పాడు (90) ఎవరీ అధ్యాయాన్ని చదువుతారో, లేదా వింటారో వారు ముక్తులౌతారు (91) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఎనుబది ఒక్క సహస్త్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతు మహాత్య్మమందు వేతాల వరద తీర్థ ప్రశంసయందు సుదర్శన సుకర్ణ శాపమోక్షణ మనునది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము. (9).

Sri Scanda Mahapuranamu-3    Chapters