Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది ఒకటవ అధ్యాయము

మూ || శ్రీరామ ఉవాచ -

భగవాన్‌ యాని తీర్థాని సేవితానిత్వయావిభో | ఏతేషాం పరమం తీర్థం తన్మమా చక్ష్వమానద || 1 ||

మయాతు సీతాహరణ నిహతా బ్రహ్మరాక్షసాః | తత్సాపస్య విశుద్ధ్యర్థం వరతీర్థోత్తమోత్తమం || 2 ||

వసిష్ఠ ఉవాచ -

గంగాచ నర్మదా తాపీ యమునాచ సరస్వతీ | గండకీగోమతీ పూర్ణా ఏతానద్యః సుపావనాః || 3 ||

ఏతాసాం నర్మదా శ్రేష్ఠాగంగా త్రిపథగామినీ | దహతే కిల్బిషం సర్వం దర్శనాదేవరాఘవ || 4 ||

దృష్ట్వాజన్మశతం పాపం గత్వాజన్మశతత్రయం | స్నాత్వాజన్మ సహస్రంచ హంతిరేవాకలౌయుగే || 5 ||

నర్మదాతీర మాశ్రిత్య శాకమూలఫలైరపి | ఏకస్మిన్‌ భోజితే విప్రే కోటిభోజ ఫలంలభేత్‌ || 6 ||

గంగా గంగేతి యో బ్రూయాత్‌ యోజనానాంశ##తైరపి | ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణు లోకం సగచ్ఛతి || 7 ||

ఫాల్గునాంతే కుహూం ప్రాప్యతథా ప్రౌష్ఠ పదే7సితే | వక్షేగంగా మధిప్రాప్య స్నానంచ పితృతర్పణం || 8 ||

కురుతే పిండదానాని సో7క్షయం ఫలమశ్నుతే | శుచౌమాసే చనం ప్రాప్తే స్నానం వాప్యాంకరోతియః || 9 ||

చతురశీతి నరకాన్న పశ్యతి నరోనృప | తపత్యాః స్మరణరామ మహాపాతకి నామపి || 10 ||

ఉద్దరేత్సప్త గోత్రాణి కులమే కోత్త రంశతం | యమునా యాంనరః స్నాత్వా సర్వపాపైః ప్రముచ్యతే || 11 ||

మహాపాతకయుక్తో7పి నగచ్ఛేత్‌ పరమాంగతిం | కార్తిక్యాం కృత్తికాయోగే సరస్వత్యాం నిమజ్జయేత్‌ || 12 ||

గచ్ఛేత్స గరుడా రూఢః స్తూయమానః సురోత్తమైః | స్నాత్వాయః కార్తికేమాసి యత్ర ప్రాచీసరస్వతీ || 13 ||

ప్రాచీం మాధవమాస్తూ యనగచ్ఛేత్‌ పరమాంగతిం | గండవీ పుణ్యతీర్థేహి స్నానం యః కురుతే నరః || 14 ||

శాలగ్రామ శిలామర్చ్యన భూయః స్తన పోభ##వేత్‌ | గోమతి జలకల్లోలైః మజ్జయే త్కృష్ణ సన్నిధౌ || 15 ||

చతుర్భుజో నరో భూత్వా వైకుంఠే మోదతేచిరం | చర్మణ్వతీం నమస్కృత్య అపః స్పృశతియోనరః || 16 ||

సతారయతి పూర్వజాన్‌ దశ పూర్వాన్‌ దశాపరాన్‌ | ద్వయోశ్చ సంగమం దృష్ట్వా దృష్ట్వా వాసా గరధ్వనిం || 17 ||

బ్రహ్మహత్యాయుతో వాపి పూతోగచ్ఛేత్పరాంగతిం | మాఘమాసే ప్రయాగేతు మజ్జనం కురుతే నరః || 18 ||

ఇహలోకే సుఖం భుక్త్వాఅంతే విష్ణు పదం ప్రజేత్‌ | ప్రభాసేయే నరా రామత్రిరాత్రం బ్రహ్మచారిణః || 19 ||

తా || శ్రీ రాముడిట్లన్నాడు - ఓవిభు! మీరు ఏయే తీర్థములను సేవించారు. ఓ మానద! వీనిలో ఉత్తమ తీర్థమేదో దానిని గూర్చి నాకు చెప్పండి (1) నేను సీతాహరణ సందర్భంలో బ్రహ్మరాక్షసులను చంపాను. ఆ పాప విశుద్ధి కొరకు ఉత్తమోత్తమమైన తీర్థమును గూర్చి చెప్పండి (2) అనగా వసిష్ఠులిట్లా అన్నారు - గంగ నర్మద, తాపి, యమున, సరస్వతి గండకి, గోమతి, పూర్ణ ఈ నదులు పరమపావనమైనవి (3) వీనిలో నర్మద శ్రేష్ఠమైనది, త్రివథ గామిని గంగ ఓ రాఘవ! దర్శన మాత్రంచేతనే పాపములను అన్నిటిని కాల్చివేస్తుంది. (4) చూడటం వలన నూరు జన్మల పాపము, వెళ్ళటం వల్ల, మూడు వందల జన్మల పాపము, స్నానం వల్ల వేయి జన్మల పాపమును హరిస్తుంది. రేవానది. కలియుగంలో (5) నర్మదా తీరమును చేరి, శాకమూలములతో పండ్లతో ఒక బ్రాహ్మణునికి భోజనంపెడ్తే ముక్తుడై ఆతడు విష్ణులోకమునకు వెళ్తాడు (7) ఫాల్గుణమా సాంతమందు అమావాస్యయందు, అట్లాగే భాద్రపద కృష్ణ పక్షమందు గంగనుచేరి స్నానము పితృతర్పణము (8) ఆచరిస్తే పిండదానమాచరిస్తే ఆతడు అక్షయఫలము పొందుతాడు. జ్యేష్ఠ/ఆషాఢ మాసము వచ్చాక బావియందు స్నానమాచరించినవారు (9) ఎనుబదినాల్గు విధములైన నరకములను చూడరు. ఓ మహారాజ! మహాపాతకులైన ఓ రామ! తపతినదిని స్మరించగానే (10) సప్త గోత్రములను ఉద్ధరిస్తారు. నూటొక్కకులమును ఉద్ధరిస్తారు. యముననది యందు నరుడు స్నానం చేసి సర్వపాపముల నుండి ముక్తుడౌతాడు (11) మహాపాతక యుక్తుడైన ఆతడు కూడా ఉత్తమ గతిని పొందుతాడు. కార్తిక మాసం కృత్తిక నక్షత్ర యోగమందు సరస్వతి నదియందు స్నాన మాచరించాలి. (12) ఆతడు గరుడుని అధిరోహించి, దేవతలతో స్తుతింపబడుతువెళ్తాడు. కార్తిక మాసమందు తూర్పుముఖమైన సరస్వతి యందు స్నానంచేసి (13) ప్రాచి యందలి మాధవుని స్తుతిస్తే ఆతడు ఉత్తమ గతిని చేరుకుంటాడు. గండకి పుణ్య తీర్థమందు స్నానం చేసిన నరుడు (14) శాలగ్రామ శిలను పూజిస్తే ఆతడు తిరిగి తల్లి పాలుతాగువాడు(జన్మ) కాడు. కృష్ణుని సన్నిధి యందు గోమతి నది జలములందు స్నానమాచరించాలి (15) నరుడు చతుర్భుజుడై చిరకాలము వైకుంఠ మందు ఆనందిస్తాడు. చర్మణ్వతికి నమస్కరించి ఆనీటిని స్పృశించిన నరుడు (16) పూర్వజులైన దశపూర్వులను దశపరులను తరింపచేస్తాడు. రెంటి సంగమమును చూచి లేదా సాగరధ్వనిని విన్ననరుడు (17) పదివేల బ్రహ్మహత్యల పాతకియైన పవిత్రుడై ఉత్తమగతికి చేరుకుంటాడు. మాఘమాసమందు ప్రయాగయందు మజ్జన మాచరించిన నరుడు (18) ఈ లోకమందు సుఖమనుభవించి, చివర విష్ణు పదమును చేరుతాడు. ప్రభాస తీర్థమందు నరులు మూడు రాత్రులు బ్రహ్మచారులుగా ఉంటే ఓరామ! (19)

యమలోకంస పశ్యేయుః కుంభీపాకాది కంతథా | నైమిశారణ్య వాసీయోనరోదేవత్వమాప్నుయాత్‌ || 20 ||

దేవానామాలయం యస్మాత్‌ తదేవ భువిదుర్లభ | కురుక్షేత్రే నరోరామ గ్రహణ చంద్ర సూర్యయోః || 21 ||

హేమదానాచ్చ రాజేంద్రన భూయః స్తనపోభ##వేత్‌ | శ్రీస్థలే దర్శనం కృత్వానరః పాపాత్‌ ప్రముచ్యతే || 22 ||

సర్వదుఃఖ వినాశేచ విష్ణులోకే మహీయతే | కాశ్యపీం స్పర్శయే ద్యోగాం మానవోభువి రాఘవ || 23 ||

సర్వకామదుఘావాస మృషిలోకం సగచ్ఛతి | ఉజ్జయిన్యాంతు వైశాఖే శిప్రాయాంస్నాన మాచరేత్‌ || 24 ||

మోచయేత్‌ రౌరవాద్గోరాత్‌ పూర్వజాంశ్చ సహస్రశః | సింధుస్నానం నరోరామ ప్రకరోతి దినత్రయం || 25 ||

సర్వపాప విశుద్ధాత్మాకైలాసే మోదతే నరః | కోటీతీర్థేనరః స్నాత్వా దృష్ట్వాకోటీశ్వరం శివం || 26 ||

బ్రహ్మహత్యాదిభిః పాపైః లిప్యతేన చసక్వచిత్‌ | అజ్ఞానమపి జంతూనాం మహా7మే ధ్యేతు గచ్ఛతాం || 27 ||

పాదోద్భూతం వయః పీత్వా సర్వపాపంప్రణశ్యతి | వేదవత్యా నరోయస్తుస్నాతి సూర్యోదయే శుభే || 28 ||

సర్వరోగాత్ప్రముచ్యేత పరంసుఖమవాప్నుయాత్‌ | తీర్థానిరామసర్వత్రస్నానపానావగాహనైః || 29 ||

నాశయంతిమనుష్యాణాంసర్వపాపానిలీలలా | తీర్థానాంపరమంతీర్థంధర్మారణ్యంప్రచక్షతే || 30 ||

బ్రహ్మవిష్ణుశివాద్యైర్యత్‌ఆదౌసంస్థాపితంపురా | అరణ్యానాంచసర్వేషాంతీర్థానాంచవిశేషతః || 31 ||

ధర్మారణ్యాత్‌పరంనాస్తిభుక్తిముక్తిప్రదాయకం | స్వర్గేదేవాః ప్రశంసతిధర్మారణ్యనివాసినః || 32 ||

తేపుణ్యాఃతేపుణ్యకృతోయేవసంతికలౌనరాః | ధర్మారణ్యరామదేవసర్వకిల్సిషనాశ##నే || 33 ||

బ్రహ్మహత్యాదిపాపానిసర్వస్తేయకృతానిచ | వరదారప్రసంగాదిఅభక్ష్యభక్షణాదివై || 34 ||

అగమ్యగమనాద్యానిఅస్పర్శస్పర్శనాదిచ | భస్మీభవంతిలోకానాంధర్మారణ్యావగాహనాత్‌ || 35 ||

బ్రహ్మఘ్నశ్చకృతఘ్నశ్చబాలఘ్నో7నృతభాషణః | స్త్రీగోఘ్నశ్చైవగ్రామఘ్నోధర్మారణ్యవిముచ్యతే || 36 ||

ఇతఃపరంపావనంహిపాపినాంప్రాణినాంభువి | స్వర్గ్యంయశస్యమాయుష్యంవాంఛితార్థప్రదంశుభం || 37 ||

కామినాంకామదంక్షేcతంయతీనాంముక్తిదాయకం | సిద్ధానాంసిద్ధిదంప్రోక్తంధర్మారణ్యంయుగేయుగే || 38 ||

తా || అట్టినరులు మయలోకమును, కుంభీపాకాదినరకమునుచూడరు. నైమిశారణ్యవాసియైననరుడుదేవత్వాన్ని పొందుతాడు (20) ఆదిదేవతలకు ఆలయంకనుక, అదే,భూమియందుదుర్లభము. ఓ రామ! కురుక్షేత్రమందుచంద్రసూర్య గ్రహణమందునరుడు (21) హెమముదానంచేస్తే ఓ రాజేంద్ర ! ఆతడు తిరిగిస్తనపాయి (శిశుజన్మనెత్తాడు) కాడు శ్రీ స్థలము దర్శనమాచరించిననరుడుపాపముల నుండిముక్తుడౌతాడు. (22) అన్నిదుఃఖములునాశనమైవిష్ణులోకమందు ప్రకాశిస్తాడు. ఓ రాఘవ! ఈ భూమియందు నరుడుభూమినిగోవునుపూజ్యభావంతోస్పృశిస్తే (23) అన్నికోరికలనుతీర్చేఋషిలోకమునకు ఆనరుడువెళ్తాడు. వైశాఖమాసమందు ఉజ్జయిని యందు శిప్రనదియందుస్నానమాచరించాలి (24) ఆతడుతనపూర్వులకు వేలకొలదిమందికిఘోరమైనరౌరవ నరకం నుండి విముక్తిని కల్గిస్తాడు. ఓరామ నరుడ మూడురోజులుపింధునదిలో స్నానంచేస్తే (25) ఆతడు సర్వపాపములనుండి విముక్తుడైకైలాసమందు ఆనందమందుతాడు. కోటితీర్థమందు నరుడుస్నానంచేసి, కోటీశ్వరుడైనశివునిచూచిననరుడు (26) ఎప్పుడూబ్రహ్మహత్యాది పాపములతో తాకబడడుమహా అయోధ్యయందుతిరిగేజ్ఞానహీనుమైనజంతువులుకూడా (27) విష్ణు పాదోద్భవమైనగంగాజలంతాగితే పాపములన్నింటినుండిముక్తమౌతాయి. శుభ##మైనసూర్యోదయమందువేదవతియందుస్నానం చేసిననరుడు (28) రోగములన్నింటినుండి ముక్తుడౌతాడు. వరమైనసుఖమునుపొందుతాడు. ఓ రామ! అంతట తీర్థములు స్నానపానములతోమునకలతో (29) మనుష్యులపాపములను అవలీలగానశింపచేస్తాయి. తీర్ఘములన్నింటిలో ఉత్తమ తీర్థము ధర్మారణ్యమనిఅన్నారు. (30) బ్రహ్మ విష్ణు శివుడు మొదలగు వారితో పూర్వం మొదట స్థాపించబడింది అన్ని అరణ్యములకు అన్ని తీర్థములకు విశిష్టమైంది (31) భుక్తిముక్తులనిచ్చేది ధర్మారణ్యముకన్న ఉత్తమమైనది లేదు. ధర్మారణ్యమందున్న వారిని స్వర్గమందు దేవతలు ప్రశంసిస్తారు (32) వారు పుణ్యులు వారు పుణ్యంచేసిన వారు, కలిలో ధర్మారణ్యమందు అన్ని పాపముల నశింపచేసే ఆ స్థలమందు నివసించిన నరులు, ఓ రామదేవ! (33) బ్రహ్మహత్యాది పాపములు, అన్ని దొంగతనముల పాపములు, వరదార ప్రసంగాదులు, అభక్ష్యభక్షణాదులు (34) ఆగమ్య గమనాదులు, అస్పర్శస్పర్శ నాదులు ఇవన్ని ధర్మారణ్యమందు మునగటంవల్ల లోకులకు (పాపములు) నాశనమౌతాయి. (35) బ్రహ్మఘ్నుడు, కృతఘ్నుడు బాలఘ్నుడు, అబద్ధమాడువాడు, స్త్రీలను గోవులను చంపువాడు గ్రామనాశకుడు వీరంతా ధర్మారణ్యమందు పాపవిముక్తులౌతారు (36) పాపులైన ప్రాణులకు ఈ భువియందు ఇంతకన్న పవిత్రమైనది లేదు. స్వర్గమును,కీర్తిని, ఆయుస్సును, వాంఛితమైన కోరికలను ఇచ్చేది శుభ##మైనది (37) కాములకు కోరికలనిచ్చేది. యతులకు ముక్తినిచ్చే క్షేత్రము. సిద్ధులకు సిద్ధినిచ్చేదని ప్రతియుగంలో ధర్మారణ్యము చెప్పబడింది (38).

మూ || బ్రహ్మోవాచ -

వసిష్ఠ వచనం శ్రుత్వా రామోధర్మభృతాం పరః | పరం హర్షమను ప్రాప్యహృదయానంద కారకం || 39 ||

ప్రోత్ఫుల్ల హృదయోరామో రోమాంచితతసూరుహః | గమనాయమతించక్రే ధర్మారణ్య శుభప్రతః || 40 ||

యస్మిన్‌కీటపతంగా దీమానుషాః వశవస్తథా | త్రిరాత్ర సేవనే నైవముచ్యంతే సర్వపాతకైః || 41 ||

కుశస్థలీ యథాకాశీశూలపాణిశ్చ భైరవః | యథావైముక్తి దోరామ ధర్మారణ్యం తథోత్తమం || 42 ||

తతోరామో మహేష్ల్వాసోముదా పరమయాయుతః | ప్రస్థితః తీర్థయాత్రాయాం సీతయాభ్రాతృభిఃసహ || 43 ||

అనుజగ్ముః తదారామం హనుమాంశ్చ కపీశ్వరః | కౌసల్యాచ సుమిత్రా చకైకేయీ చముదాన్వితా || 44 ||

లక్ష్మణో లక్షణో పేతో భరతశ్చ మహామతిః | శత్రుఘ్నః సైన్యసహితోప్యయోధ్యావాసిన స్థథా || 45 ||

ప్రకృతయోనర వ్యాఘ్ర ధర్మారణ్య వినిర్మయుః | అనుజగ్ముః తదారామం ముదాపరమయా యుతాః || 46 ||

తీర్థయాత్రా విధిం కర్తుం గృహాత్ర్ప చలితోనృపః | వసిష్ఠం స్వకులాచార్య మిదమాహ మహీపతే || 47 ||

శ్రీరామ ఉవాచ -

ఏతదాశ్చర్యమతులం కిమాది ద్వారకాభవత్‌ | కియత్కాల సముత్పన్నా వసిష్ఠేదం పదస్వమే || 48 ||

వసిష్ఠ ఉవాచ -

నజానా మిమహారాజ కియత్కాలాద భూదిదం | లోమశోజాం బవాంశ్చైవ జానాతీతిచకారణం || 49 ||

శరీరే యత్కృతం పాపం నానాజన్మాంతరే ష్వపి | ప్రాయశ్చిత్తం హి సర్వేషామేతత్‌ క్షేత్రం పరంస్మృతం || 50 ||

శ్రుత్వేతి వచనం తస్యరామంజ్ఞానవతాంపరః | గస్తుం కృతమతిస్తీర్థం యాత్రా విధిమథాచరత్‌ || 51 ||

వసిష్ఠం చాగ్రతః కృత్వా మహామండలికైః నృపైః | పునశ్చర విధిం కృత్వా ప్రతస్థే పశ్చిమాందిశం || 52 ||

వసిష్ఠంచాగ్రతఃకృత్వాప్రతస్థేపశ్చిమాందిశం | గ్రామాద్గ్రామమతి క్రమ్యదేశాద్దేశం పనాద్వసం || 53 ||

విముచ్య నిర్య¸° రామః ససైన్యః న పరిచ్ఛదః | గజవాజి సహస్రౌఘైః రథైర్యానైశ్చకోటిభిః || 54 ||

శిబికాభిశ్చా సంఖ్యాభిః ప్రయ¸° రాఘవస్తదా | గజారూఢః ప్రవశ్యం శ్చదేశా న్వివిధసౌ హృదాన్‌ || 55 ||

శ్వేతాతపత్రం విధృత్య చామరేణ శుభేనచ | వీజితశ్చజనౌఘేన రామస్తత్ర సమభ్యగాత్‌ || 56 ||

వాదిత్రాణాం స్వనైఃఘోరైః నృత్యగీత పురః నరైః | స్తూయమానోపి సూతైశ్చ య¸° రామోముదాన్వితః || 57 ||

దశ##మే7హని సంప్రాప్తం ధర్మారణ్య మనుత్తమం | అదూరేహి తతోరామో దృష్ట్వా మాండలికంపురం || 58 ||

తా || బ్రహ్మవచనము - వసిష్ఠుని వచనమును విని ధర్మాచరణులలో శ్రేష్ఠుడైన రాముడు హృదయానంద కారకమైన చాలా ఆనందాన్ని పొంది(39) వికసించిన హృదయంగల రాముడు, శరీరం, గగుర్పొడువగా శుభవ్రతుడు రాముడు ధర్మారణ్యమునకు వెళ్ళుటకు తలచాడు (40) అక్కడ పురుగులు పక్షులు మొదలగునవి మనుష్యులు, పశువులు మూడురాత్రులు సేవిస్తే అన్ని పాపములనుండి ముక్తులౌతారు (41) కుశస్థలము, కాశి, శూలపాణి,భైరవుడు వీరెట్లాముక్తి నిచ్చేవారో అట్లాగే ధర్మారణ్యము ఉత్తమమైనది, ఓ రామ! (42) ఆ పిదప మహేష్వాసుడు రాముడు చాలా ఆనందం పొందినవాడై సీతతో తమ్ములతో కూడి తీర్థయాత్రకై బయలుదేరాడు (43) అప్పుడు రాముని కపీశ్వరుడు హనుమంతుడు అనుసరించారు ఆనందంతో కౌసల్యసుమిత్రకైకేయి (44) లక్షణోవేతుడైన లక్ష్మణుడు మహామతి భరతుడు, సైన్యంతో శత్రుఘ్నుడు, అయోధ్యావాసులు (45) ప్రకృతులు (పౌరులు) ధర్మారణ్యమునకై బయలుదేరారు, ఓ నరవ్యాఘ్ర! పరమానందంతో కూడినవారై అప్పుడు రాముని వారు అనుసరించారు (46) రాజు తీర్థయాత్ర విధిని అనుసరించుటకు గృహమునుండి బయలుదేరాడు. రాజు స్వకులమునకు ఆచార్యుడైన వసిష్ఠునితో ఇట్లా అన్నాడు (47) శ్రీరాముని వచనము - ఇది గొప్ప ఆశ్చర్యము. ద్వారకయందు మొదట ఏం జరిగింది. ఎంత కాలానికిది సంభవించిందో, వసిష్ఠుడ! నాకు చెప్పు (48) వసిష్ఠుని వచనము - ఓ మహారాజ! ఎంత కాలమునకు ఇది ఏర్పడిందో నాకు తెలియదు. లోమశుడు, జాంబవంతుడు కారణాన్ని తెలుసుకొని ఉంటారు. (49) నానా జన్మాంతరములందు చేసిన పాపము శరీరమందు ఏదుందో వాటన్నిటికి ఈ క్షేత్రము ఉత్తమ ప్రాయశ్చిత్తము అని అన్నారు (50) అనే వసిష్ఠుని మాటను విని జ్ఞానవంతులలో శ్రేష్ఠుడైన రాముడు తీర్థయాత్రకు బయలుదేరుటకు స్థిరనిశ్చయం కలవాడై ఇక యాత్రా విధిని ఆచరించాడు. (51) వసిష్ఠుని ముందుంచుకొని మహామండల నృపులను ముందుండేట్లు ఏర్పరచి ఉత్తరదిక్కుగా బయల్దేరాడు (52) వసిష్ఠుని ముందుంచుకొని పశ్చిమదిక్కుగా బయల్దేరాడు. గ్రామము నుండి గ్రామానికి దాటుతూ దేశము నుండి దేశానికి, వనం నుండి మరోవనానికి దాటుతూ (53) అన్నిటిని వదలి రాముడు సైన్యంతో కూడి, పరిజనంతో కూడి బయలుదేరాడు. ఏనుగులు, గుఱ్ఱములు వేలకొలది రథములు బండ్లు కోట్లకొలది (54)

లెక్కలేనన్ని పల్లకీలు వీటితో అప్పుడు రాముడు బయల్దేరాడు. గజమునధిరోహించి, అనేకములైన మిత్రదేశములను చూస్తూ (55) తెల్లని గొడుగు, శుభ##మైన చామరములు కలిగి, జనము వీస్తుండగా రాముడక్కడికి వెళ్ళాడు (56) నృత్య గీతములతో కూడిన భయంకరమైన వాదిత్రముల ధ్వనితో సూతులు పొగడ్తుండగా ఆనందంతో రాముడు వెళ్ళాడు (57) పదిరోజులనాటికి ఉత్తమమైన ధర్మారణ్యానికి రాముడు వచ్చాడు. దగ్గర్లోనే రాముడు గుండ్రంగా ఉన్ననగరాన్ని చూచి (58)

తత్రస్థిత్వా ససైన్యస్తు ఉవాస నిశితాం పురీం | శ్రుత్వాతు నిర్జనం క్షేత్రం ఉద్వసంచ భయానకం || 59 ||

వ్యాఘ్రసింహాకులం తత్రయక్ష రాక్షస సేవితం | శ్రుత్వాజన ముఖాద్రామో ధర్మారణ్యమరణ్యకం

తచ్ఛ్రుత్వారామదేవస్తున చింతా క్రియతామితి || 60 ||

తత్రస్థాన్‌ పణిజః శూరాన్‌ దక్షాన్‌ స్వవ్యవసాయకే || 61 ||

సమర్థాన్‌ హి మహాకాయాన్‌ మహాబల పరాక్రమాన్‌ | సమాహూయతదాకాలేవాక్యమే తదధాబ్రవీత్‌ || 62 ||

శిబికాం సుసువర్ణాంమే శీఘ్రం వాహయతాచిరం | యధాక్షణన చైకేన ధర్మారణ్యం ప్రజామ్యహం || 63 ||

తత్రస్నాత్వా చపీత్వా చ సర్వపాపాత్ప్రముచ్యతే | ఏవంతే పణిజః సర్వే రామేణ ప్రేరితాస్తదా || 64 ||

తథేత్యుక్త్వాచతే సర్వే ఊహూస్తచ్ఛిబికాంతదా | క్షేత్రమధ్యే యదారామః ప్రవిష్టః సహసైనికః || 65 ||

తద్యానస్యగతిర్మందా సంజాతా కిలభారత | మంద శబ్దాని వాద్యాని మాతంగా మందగామినః || 66 ||

హయశ్చతా దృశాజాతా రామో విస్మయమాగతః | గురుం పప్రచ్ఛ వినయాత్‌ విశిష్ఠం ముని పుంగవం || 67 ||

కిమేతస్మంద గతయః చిత్రం హృదిమునీశ్వర | త్రికాలజ్ఞోమునిః ప్రాహ ధర్మక్షేత్రము పాగతం || 68 ||

తీర్థే పురాతనే రామపాదచారేణ గమ్యతే | ఏవంకృతే తతః పశ్చాత్‌ సైన్యసౌఖ్యం భవిష్యతి || 69 ||

పాదచారీ తతో రామః సైన్యేన సహసంయుతః | మధు వాసనకే గ్రామే ప్రాప్తః పరమ పావనః || 70 ||

గురుణాచోక్త మార్గేణ మాతౄణాం పూజనం కృతం | నానోపహారైః వివిధైః ప్రతిష్ఠావిధి పూర్వకం || 71 ||

తతోరామోహరిక్షేత్రం సువర్ణాదక్షణతటే | నిరీక్ష్య యజ్ఞయోగ్యాశ్చ భూమీర్వై బహుశస్తథా || 72 ||

కృతకృత్యం తదాత్మానాం మేనే రామోరఘూద్వహాః | ధర్మస్థానం నిరీక్ష్యాథ సువర్ణాక్షోత్తరేతటే || 73 ||

సైన్యసంఘం సముత్తీర్యబభ్రామక్షేత్రమధ్యతః | తత్రతీర్థేషు సర్వేషు దేవతాయత నేషుచ || 74 ||

యథోక్తానిచ కర్మాణి రామశ్చcకే విధానతః | శ్రాద్ధాని విధివచ్చక్రే శ్రద్ధయా పరమాయుతః || 75 ||

స్థాపయామాన రామేశం తథాకామేశ్వరం పునః | స్థానా ద్వాయు ప్రదేశేతు సువర్ణో భయతస్తటే || 76 ||

కృత్వైవం కృతకృత్యో7భూద్రామో దశరథాత్మజః త | కృత్వాసర్వ విధించైవ నభాయాం సముపావిశత్‌ || 77 ||

తాంనిశాం సనదీతీ రేనుష్వా పరఘునందనః | తతో7ర్థ రాత్రే నంజాతే రామో రాజీవలోచనః || 78 ||

జాగృతస్తుత దాకాలే ఏకాకీ ధర్మవత్సలః | అశ్రౌషీచ్ఛక్షణతస్మిన్‌ రామోనారీవిరోదనం || 79 ||

నిశాయాం కరుణౖర్వాక్యైః రుదంతీకురరీమివ | చారై ర్విలోకయామానరామస్తామతి సంభ్రమాత్‌ || 80 ||

దృష్ట్వాతి విహ్వలాం నారీం క్రందంతీ కరుణౖః స్వరైః | వృష్టాసాదుఃఖితా నారీ రామ దూతైస్తదానఘ || 81 ||

దూతా ఊచుః -

కాసిత్వం సుభ##గే నారి దేవీవాదానవీసుకిం | కేనవాత్రాసితాసిత్వం ముష్టంకేన ధనంతవ || 82 ||

వికలాదారుణాచ్చబ్దానుద్గిరంతీ ముహుర్ముహుః కథయస్వ యథాతథ్యం రామోరాజాభి పృచ్ఛతి || 83 ||

తయోక్తంస్వామినందూతాఃప్రేషయధ్వంమమాంతికం|యధాహంమాననందుఃఖంశాం త్యైతసై#్మనివేదయే || 84 ||

తథేత్యుక్త్వాతతో దూతా రామమాగత్య చా బ్రువన్‌ || 85 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే దూతా

గమనం నామ ఏకత్రింశో7ధ్యాయః || 31 ||

తా || అక్కడ నిలబడి సైన్యంతో కూడి ఆ రాత్రి ఆ నగరంలో గడిపాడు. ఆ క్షేత్రము నిర్జనమైనదనివిని, భయానకంగా ఉన్నదాన్ని చూచాడు (59) అక్కడ వసించాడు. వ్యాఘ్ర సింహములతో నిండిందని, యక్షరాక్షసులున్నారని జనుల వలన రాముడు విన్నాడు. ధర్మరాణ్యమను పేరుగల అరణ్యమిది. దానిని విని రాముడు చింతంచకండి అని (60) అక్కడున్న పణిజులకు శూరులకు, తమతమ పనులలో సమర్థులైన వారికి చెప్పాడు (61) సమర్థులు గొప్ప శరీరం కలవారు మహాబలపరాక్రమ వంతులు ఐనవారిని అందరిని సమావేశ పరచి ఆ సమయంలో ఇట్లా రాముడు వారితో అన్నాడు (62) బంగారుతో చేసిన నా పల్లకిని తొందరగా ఆలసించకుండా మోయండి. ఒక్క క్షణకాలంలో నేను ధర్మారణ్యం చేరేట్లు చేయండి. (63) అక్కడ స్నానం చేసి, పానంచేస్తే అన్ని పాపముల నుండి ముక్తుణ్ణౌతాను. ఈ విధముగా వణిజులందరు రామునితో ప్రేరేపించండి (64) అట్లాగే కానిమ్మని వారంతా ఆ పల్లకిని అప్పుడు మోశారు. సైనికులతో రాముడు క్షేత్ర మధ్యంలోకి ప్రవేశించగానే (65) ఆతని పల్లకి యొక్క నడక మందగించింది, ఓ భారత, వాద్యముల ధ్వని మందగించింది. ఏనుగులు మందగమనలైనాయి (66) గుఱ్ఱుములు అట్లాగే ఐనాయి. రాముడాశ్చర్యపడ్డాడు. వినయంతో రామడు మునిపుంగవుడు గురువు ఐన వసిష్ఠునడిగాడు (67) ఓమునీశ్వర! నా మనస్సులో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ ఇట్లా మందగమనం కలవిగా ఎందుకైనాయి. త్రికాలజ్ఞుడైన ముని ధర్మక్షేత్రమునకు వచ్చిన రామునితో ఇట్లాఅన్నాడు. (68) ఓరామ! పురాతన తీర్థమందు పాదచారుడవై వెళ్ళిన, ఆ పిదప సైన్యమునకు సుఖం కలుగుతుంది (69) పిదప రాముడు పాదచారియై సైన్యంతో కూడినవాడై పరమభావనుడై మధువాసక మనుగ్రామానికి వచ్చాడు (70) గురువు చెప్పిన పద్ధతిలో మాతృపూజ చేశాడు. నానావిధములైన అనేక రకముల ఉపహారములతో ప్రతిష్ఠావిధి పూర్వకముగా పూజించాడు (71) పిదప రాముడు సువర్ణ దక్షిణ తటమందు హరిక్షేత్రమునుచూచి ఆ ప్రదేశములు అన్ని విధముల యజ్ఞ యోగ్యములని భావించి (72) రఘూధ్వహుడు రాముడు తనను కృతకృత్యునిగా భావించాడు. సువర్ణాక్ష ఉత్తరతట మందు ధర్మస్థానమును చూచి (73) సైన్యసమూహము నుండి దిగి క్షేత్రమధ్యమందు తిరిగాడు. అక్కడ అన్ని తీర్థములందు దేవాలయములందు (74) రాముడు శాస్త్ర ప్రకారం చెప్పిన కర్మలన విధి ప్రకారం ఆచరించాడు. మిక్కిలి శ్రద్ధకలవాడై విధి ప్రకారము శ్రాద్ధము చేశాడు (75) రామేశుని స్థాపించాడు. తిరిగి కామేశ్వరుని స్థాపించాడు. ఆ స్థానం నుండి వాయు ప్రదేశమందు సువర్ణ ఉభయ తటములందు (76) ఈ విధముగా స్థాపించి దశరథాత్మజుడు రాముడు కృతకృత్యుడైనాడు. అన్ని విధులను చేసి సభ యందు కూర్చున్నాడు (77) ఆ రఘునందనుడు ఆ రాత్రి ఆనదీ తీరమందు నిద్రపోయాడు. పిదప అర్థరాత్రి అయ్యాక రాజీవలోచనుడు రాముడు (78) మేల్కొని అప్పుడ ఏకాకియైన ధర్మవత్సలుడైన రాముడు ఆ క్షణకాలమందు రాముడు స్త్రీరోదనమును విన్నాడు (79) అర్ధరాత్రి దీనమైన వచనములతో లేడిపిల్లవలె ఏడుస్తున్న ధ్వని విన్నాడు. రాముడు చాలా తొందరగా చారులతో ఆమెను వెతికించాడు. (80) కరుణమైన స్వరముతో ఏడుస్తున్న అతి విహ్వలయైన ఆ స్త్రీని చూచారు. రాముని దూతలు ఏడుస్తున్న ఆమెను అడిగారు. (81) దూతల వచనము - ఓ సుభ##గే! నీవెవరు. దేవతాస్త్రీవా, కాక రాక్షస స్త్రీవా ఎవ్వనిచే భయపెట్టబడ్డావు. నీధనాన్ని ఎవరెత్తుకెళ్ళారు. (82) వికలవై దారుణ శబ్దములను మాటి మాటికి చేస్తున్నావు. రాజైన రాముడడుగుతున్నాడు. ఉన్నదున్నట్లుగా చెప్పు అనగా ఆమె అంది. ఓ దూతలార! మీ స్వామిని నాదగ్గరకు పంపండి. నేన నా మానవ మందలి దుఃఖమును శాంతి కొరకు ఆతనికి నివేదిస్తాను (84) అట్లాగే అని పలికి ఆ పిదప దూతలు రాముని దగ్గరకు వచ్చి ఇట్లన్నారు. (85) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండమందు పూర్వభాగ మందు ధర్మారణ్య మాహాత్మ్య మందు దూతల రాక అనునది ముప్పది ఒకటవ అధ్యాయము || 31 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters