Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పదవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

పురాత్రేతాయుగే ప్రాప్తే వైష్ణవాంశోరఘూద్వహః సూర్యవంశే సముత్ప న్నోరామోరాజీవలోచనః || 1 ||

నరామోలక్ష్మణశ్చైవ కాకపక్షధరాపుభౌ | తాతస్య వచనాత్తౌతు విశ్వామిత్రమనుప్రతౌ || 2 ||

యజ్ఞ సంరక్షణార్థాయ రాజ్ఞా దత్తౌకుమారకౌ | ధనుః శరథరౌ వీరౌ పితుర్వచన పాలకౌ || 3 ||

వధిప్రవ్రజతో యావత్‌ తాడకానామరాక్షసీ | తావదాగమ్య పురతః తస్థౌ వై విఘ్నకారణాత్‌ || 4 ||

ఋషేరసుజ్ఞయారామః తాడకాంస మఘాతయత్‌ | ప్రాదిశచ్చధనుః వేదవిద్యాం రామాయ గాధిజః || 5 ||

తస్యపాదతల స్పర్శాచ్ఛిలా వాసవయోగతః | అహల్యాగౌతమ వధూః పునర్జాతా స్వరూపిణీ || 6 ||

విశ్వామిత్ర స్యయజ్ఞేతు సంప్రవృతే రఘూత్తమాః | మారీచంచ సుబాహుంచ జఘాన పరమేషుభిః || 7 ||

ఈశ్వరస్యధనుర్భగ్నం జనక స్యగృహెస్థితం | రామః పంచదశే వర్షషడ్వర్షాం చైవమైథిలీం || 8 ||

ఉపయేమే తదారాజన్‌ రమ్యాం సీతాం అయోనిజాం | కృతకృత్యః తదాజాతః సీతాంసంప్రాప్యరాఘవః || 9 ||

అయోధ్యామగమన్మార్గే జామదగ్న్య మవేక్ష్చచ | సంగ్రామో భూత్త దారాజన్‌ దేవానామ పిదుః సహః || 10 ||

తతోరామం పరాజిత్య సీతయా గృహమాగతః | తతోద్వాద శవర్షాణి రామేరామస్తయాసహ || 11 ||

సప్తవింశతిమే వర్షే ¸°వరాజ్య ప్రదాయకం | రాజాన మథకై కేయీ వరద్వయమయాచత || 12 ||

తయోరేకేనరామస్తునసీతః సహలక్ష్మణః | జటాధరంప్రవ్రజసతాంవర్షాణీహచతుర్దశ || 13 ||

భరతస్తుద్వితీయేన¸°వరాజస్యాథిపోస్తుమే | మంథరావచనాన్మూఢాపరమేతమయాచత || 14 ||

జానకీలక్ష్మణసఖంరామంప్రవ్రాజయన్నృపః | త్రిరాత్రముదకాహారఃచతుర్థేహ్నిఫలాశనః || 15 ||

పంచమేచిత్రకూటేతురామోవాసమకల్పయిత్‌ |తదాదశరథఃస్వర్గంగతోరామ ఇతిబ్రువన్‌ || 16 ||

బ్రహ్మశాపంతుసఫలంకృత్వాస్వర్గంజగామకిం | తతోభరతశత్రుఫ్ర°చిత్రకూటేసమాగతౌ || 17 ||

స్వర్గతంపితరంరాజన్‌రామాయవనివేద్యచ | సాంత్వసంభరతస్యాస్యకృత్వానిర్వర్తనంప్రతి || 18 ||

తా || వ్యాసులిట్లాఅన్నారు. పూర్వంత్రేతాయుగంవచ్చాకవిష్ణుఅంశతోరాఘవుడుసూర్యవంశమందుపుట్టాడు. ఆతడే రాముడురాజీవలోచనుడు (1) ఆరాముడులక్ష్మణుడు ఇద్దరుకాక పక్షధరులు (పిల్లజుట్టు) తండ్రిగారిమాటలతో వారిద్దరు విశ్వామిత్రునిఅనుసరించారు (2) యజ్ఞసంరక్షణకొరకురాజుఆకుమారులనుపంపాడు. ధనుర్బాణములుధరించిన వీరులు వారు తండ్రి ఆజ్ఞాపాలకులు (3) దారిలో వెళ్తున్నంతలోతాటక అనురాక్షసివచ్చి విఘ్నాన్ని కల్గిస్తూ ముందునిలబడింది. (4) ఋషిఆజ్ఞతోరాముడుతాటకనుచంపాడు. విశ్వామిత్రుడురామునకుధనుర్వేదవిద్యనుఇచ్చాడు (5) ఇంద్రుని యోగంతో శిలయైనఅహల్యగౌతమునిభార్యరామునిపాదస్పర్శతోతిరిగినిజరూపానికిచేరింది (6) విశ్వామిత్రునియజ్ఞంముగిశాక రఘూత్తముడు, పరమమైనబాణములతో మారీచునినుబాహునికొట్టాడు (7) జన కునిఇంటియందున్న ఈశ్వరధనువునుభగ్న మొనర్చాడురాముడు పదునైదవ ఏట ఆరేళ్ళవయస్సుగలసీతను (8) రమ్యమైనసీతను, అయోనిజనుఅప్పుడువివాహ మాడాడు, ఓరాజ! రాముడు సీతనుపొందిఅప్పుడు కృతకృత్యుడయ్యాడు (9) అయోధ్యకువెళ్తూమార్గంలో జామదగ్నిని చూచాడు. ఓరాజ! అప్పుడు దేవతలకుకూడా సహింపరానియుద్ధం జరిగింది వారికి (10) పిదపపరశురామునివదలి సీతతోకూడిఇంటికివచ్చాడు. రాముడు పిదపపన్నెండుసంవత్సరాలు ఆమెతోకూడిరాముడు సుఖించాడు. (11) ఇరువది ఏడవసంవత్సరమందు రాముని యువరాజుగా చేయదలచినదశరధుని, కైకేయిరెండువరములడిగింది. (12) అందులో ఒకటిరాముడుసీత, లక్ష్మణులతోకూడిజడలుధరించిపదునాల్గుసంవత్సరాలు అడవికి వెళ్ళాలి. (13) రెండవవరము నాకొడుకు భరతుడు యువరాజ్యాధిపుడుకావాలి. మంధరవచనంతోమూఢూరాలైన ఆమె ఈ వరాన్నికోరింది (14) జానకిలక్ష్మణులు తోడుగా రాముని రాజుఅడవికి పంపాడు. మూడు రాత్రులు నీరుమాత్రమే భుజించి, నాల్గవరోజు ఫలాహారుడై (15) ఐదవరోజురాముడు చిత్రకూటమందు వాసాన్నికల్పించాడు. పిదప దశరధుడు రామ, అని అరుస్తూ పలవరిస్తూ స్వర్గం చేరాడు. (16) బ్రాహ్మణశాపంను సఫలంచేస్తూ స్వర్గానికివెళ్ళాడా ఏమి. ఆపిదప భరతశత్రఘ్నులు చిత్రకూటమునకు వచ్చారు. (17) తండ్రిస్వర్గగతుడైనాడని రామునకు నివేదించాడు, ఓ రాజ భరతుని ఓ దార్చి ఆతని తిరిగి వెళ్ళమని చెప్పాడు రాముడు. (18)

మూ || తతోభరతశఫ°్ననంది గ్రామంసమాగతౌ | పాదుకాపూజసరతౌతత్రరాజ్యధరావుభౌ || || 19 ||

cతిందృష్ట్వామహాత్మానందండకారణ్యమాగమాత్‌ | రక్షోగణవధారంభేవిరాధేవినిపాతితే || 20 ||

అర్ధత్రయోదశేవర్షేపంచవట్యామువాసహ | తతోవిరూపయామానశూర్పణఖాంనిశాచరీం

వనేనిచరతస్తస్యజానకీసహితస్యచ || 21 ||

అగతోరాక్షసోఘోరఃసీతాపహరణాయనః | తతోమాఘాసితాష్టమ్యాంముహూర్తేవృందసంజ్ఞకే || 22 ||

రాఘవాభ్యాంవినాసీతాంజహారదశకంధరః | మారీచస్యాశ్రమంగత్వామృగరూపేణతేనచ || 23 ||

నీత్వాదూరంరాఘవంచలక్ష్మణనసమన్వితం | తతోరామోజఘానాశుమారీచంమృగరూపిణం || 24 ||

పునఃప్రాప్యాశ్రమంరామోనినాసీతాందదర్శహ | తత్రైవహ్రియమాణాసాచక్రందకురరీయథా || 25 ||

రామరామేతిమాంరక్షరక్షమాంరక్షసాహృతాం | యథాశ్యేనఃక్షుధాయుక్తఃక్రందంతీంవర్తికాంనయేత్‌ || 26 ||

తథాకాయవశంప్రాప్తోరాక్షసోజనకాత్మజాం | నయత్యేషజనకజాంతచ్ఛ్రుత్వాపక్షిరాట్‌తదా || 27 ||

యుయుధేరాక్షసేంద్రేణరావణసహతో7పతత్‌ | మాఘసితనవమ్యాంతువసంతీంరావణాలయే || 28 ||

మార్గమాణౌతదాతౌతుభ్రాతరౌరామలక్ష్మణౌ || 29 ||

జటాయుషంతుదృషై#్వవజ్ఞాత్వారాక్షపవంహృతాం | సీతాంజ్ఞాతాతతః పక్షీసంస్కృతస్తేసభక్తితః || 30 ||

అగ్రతఃప్రయ¸°రామోలక్ష్మణస్తత్పదాసుగః | పంపాభ్యాశమనుప్రాప్యశబరీమనుగృహ్యచ || 31 ||

తజ్జలం సముప స్పృశ్య హనుమద్దర్శనం కృతం | తతోరామోహనుమతా సహసఖ్యం చకారహ || 32 ||

తతః సుగ్రీవమభ్యేత్య అహన ద్వాలి వానరం | ప్రేషితా రామదేవేన హనుమత్ర్పముఖాః ప్రియాః || 33 ||

అంగులీయక మాదాయ వాయుసూమస్తదాగతః | సంపాతి ర్దశ##మే మాసి అచఖ్యౌవానరయాతాం || 34 ||

తతస్తద్వచనాదబ్ధిం పుప్లువేశతయోజనం | హనుమాన్నిశిత స్యాంతు లంకాయాం పరితో7చినోత్‌ || 35 ||

తా || పిదప భరత శత్రుఘ్నులు నంది గ్రామమునకు వచ్చారు. వారిద్దరు రాజ్యమును ధరించి అక్కడ పాదుక పూజచేయసాగారు

(19) మహాత్ముడైన అత్రినిచూచి దండకారణ్యమునకు వెళ్ళాడు రామడు - రక్షోగణముల వథ ఆరంభమందు విరాధుని చంపాక (20) పన్నెండున్నర సంవత్సరమందు పంచవటి యందున్నాడు. రాముడు పిదప శూర్పణఖ యను నిశాచరిని వికృతరూపిగా చేశాడు. జానికితో కూడి అడవి యందు తిరుగుతున్న ఆతని దగ్గరకు (21) సీతాపహరణం కొరకు అఘోర రాక్షసుడు వచ్చాడు. పిదప మాఘకృష్ణ అష్టమియందు వృందసంజ్ఞగల ముహూర్త మందు (22) దశకంధరుడు రామలక్ష్మణులు లేకుండా, సీతనెత్తుకువెళ్ళాడు. మారీచాశ్రమమునకు వెళ్ళగావాడు మృగరూపంధరించి (23) లక్ష్మణునితో కూడిన రాముని దూరంగా తీసుకెళ్ళాడు. మృగరూపం ధరించిన మారీచుని రాముడు వేగంగా చంపాడు (24) తిరిగి ఆశ్రమమునకు వచ్చాక రాముడు అక్కడ సీత లేని ఆశ్రమం చూశాడు. అక్కడే సిగ్గుపడుతూ ఆమె ఆడలకుముకి పిట్టలా ఏడ్చింది (25) రామరామ అని రాక్షసు నిచేహరింపబడుతున్న నన్ను రక్షించు నన్ను రక్షించు అని. ఆకలిగొన్న డేగ, ఏడ్చే మీన పల్లంకి పిట్టను ఎత్తుకుపోయినట్టు (26) కామవశుడై రాక్షసుడు జనకాత్మజను ఎత్తుకెళ్ళాడు. వీడు సీతనెత్తుకెళ్తున్నాడు. అనేమాటను అప్పుడు పక్షిరాజువిని (27) రాక్షసేంద్రునితో యుద్ధంచేశాడు. రావణుడు చంపగా పడిపోయాడు. మాఘకృష్ణ నవమి యందు రావణుడు ఇంట్లో ఆమెనుంచాడు (28) అన్నదమ్ములు రామలక్ష్మణులు వారు ఆమెను వెదుకుతూ వచ్చి (29) జటాయువునుచూచి, రాక్షసునితో సంహరింపబడ్డ ట్టుగా గ్రహించి, సీతను గూర్చి తెలుసుకొన్నాక రాముడు భక్తితో ఆ పక్షికి సంస్కారం చేశాడు (30) ముందు రాముడు నడువగా లక్ష్మణుడు ఆతని అడుగులననుసరించాడు. పంపాతీరమునకు వచ్చి శబరిని అనుగ్రహించి, (31) ఆ నీటిని స్పృశించాక హనుమంతుని చూచాడు. పిదప రాముడు హనుమంతునితో కూడా స్నేహం చేశాడు (32) పిదప సుగ్రీవుని సమీపించి, వాలి అనుపేరుగల వానరుని చంపాడు. రామునితో పంపబడి హనుమంతుడు మొదలగు వారు ప్రియను వెదుక వెళ్ళారు (33) అప్పుడు వాయుసూనుడు అంగుళీయకమును తీసుకొని వెళ్ళాడు. పదవ నెలలో పంపాతి వానరులకు ఆమెను గూర్చి చెప్పాడు (34) పిదప ఆతని మాట ప్రకారము శతయోజనమైన లబ్దిని దాటాడు. హనుమంతుడు రాత్రిపూట ఆలంకలో అంతట ఆమెను వెతికాడు. (35) ఆ రాత్రి శేషమందు హనుమంతునకు సీత దర్శనం లభించింది. ద్వాదశియందు హనుమంతుడు శింశుపా వృక్షమందు కూర్చున్నాడు (36).

మూ || తస్యాంనిశాయాంజానక్యావిశ్వాసాయాహసంకధాం | అక్షాదిభిఃత్రయోదశ్యాంతతోయుద్ధమవర్తత || 37 ||

బ్రహ్మాస్త్రేణ త్రయోదశ్యాంబద్ధః శక్రజితాకపిః | దారుణానిచ రూక్షాణి వాక్యాని రాక్షసాధివం || 38 ||

అబ్రవీద్వాయునూనుస్తం బద్ధోబ్రహ్మాస్త్రం సంయుతః | వహ్నినాపుచ్ఛయుక్తేన లంకాయా దహనం కృతం || 39 ||

పూర్ణిమాయాం మహేంద్రాద్రౌ పునరాగమనం కపేః | సూర్గశీర్షప్రతిపదః పంచభిః పథివానరైః || 40 ||

పునరాగత్య వర్షేహ్ని ధ్వస్తం మధువసంకిల | సప్తమ్యాం ప్రత్యభిజ్ఞానదానం సర్వనివేదనం || 41 ||

మణిప్రదానం సీతాయాః సర్వం రామాయశం సయత్‌|అష్టమ్యుత్తర ఫాల్గున్యాంముహూర్తేవిజయాభిదే || 42 ||

మధ్యంప్రాప్తే సహస్రాంశౌ ప్రస్థానం రాఘవన్యచ | రామఃకృత్వాప్రతిజ్ఞాంహి ప్రయాంతుందక్షినాందిశం || 43 ||

తీర్త్వాహంసాగరమపిహనిష్యే రాక్షసేశ్వరం | దక్షిణాశాం ప్రయాతస్య సుగ్రీవో7థాభవత్సఖా

వానరైఃసప్తభిఃసింధోః తీరేసూన్యనివేశనం || 44 ||

పౌషశుక్లప్రతిపదః తృతీయాం యావదంబుధౌ | ఉపస్థానం ససైన్యస్య రాఘవస్య బభూవహ || 45 ||

విభీషణః చతుర్థ్యాంతు రామే సహసంగతః | సముద్రతరణార్థాయ పంచమ్యాం మంత్ర ఉద్యతేః || 46 ||

ప్రాయోపవేశనం చక్రేరామోదిన చతుష్టయం | సముద్రతరణార్థాయ పంచమ్యాం మంత్ర ఉద్యతేః || 47 ||

సేతోః దశమ్యామారంభః త్రయోదశ్యాంసమాపనం | చతుర్దశ్యాం సువేలాద్రౌరామః సేనాంస్యవేశయత్‌ || 48 ||

పూర్ణిమా స్యాద్వితీయాయాంత్రిదినైఃసైన్యతారణం | తీర్త్వాతోయనిధిం రామః శూరవానరసైన్యవాన్‌ || 49 ||

రురోధచ పురీం లంకాం సీతార్థం శుభలక్షణః | తృతీయాది దశమ్యంతం నివేశశ్చ దినాష్టకః || 50 ||

శుకసారణయోస్తత్రప్రాప్తి రేకాదశీదినే | పౌషాసితే చద్వాదశ్యాం సైన్యసంఖ్యాసమేవచ || 51 ||

శార్దూలేన కపీంద్రాణాం సారాసారోపవర్ణనం | త్రయోదశ్యాద్యమాంతేచ లంకాయాంది వసైఃత్రిభిః || 52 ||

రావణః సైన్య సంఖ్యానం రణోత్సాహంతదాకరోత్‌ | ప్రయయావంగదోదౌత్యే మాఘశుక్లాద్యవానరే || 53 ||

తా || ఆరాత్రి, సీతకు విశ్వాసం కలిగే కొరకు రామకథ చెప్పాడు. త్రయోదశియందు

అక్షయుడ మొదలగువారితో యుద్ధం జరిగింది (37) త్రయోదశి యందు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతోకపిబంధింపబడ్డాడు. దారుణమైన వాక్యములను రాక్షసాధిపతితోకపి అన్నాడు. (38) వాయుసూనుడు బ్రహ్మాస్త్రముతో బంధింపబడి రావణునితో పలికాడు. తోకయందలి వహ్నితో లంకా దహనం చేశాడు (39) పూర్ణిమ నాటికి కపితిరిగి మహేంద్రాద్రికి వచ్చాడు. మార్గశీర్ష ప్రతిపద నుండి ఐదురోజులు మార్గంలో (40) వర్షంపడుతున్న రోజున మధువనాన్ని ధ్వంసం చేశారు. సప్తమియందు సీత, ప్రత్యభిజ్ఞ (గుర్తింపు)ను రామునకిచ్చి కథ అంతా చెప్పాడు (41) సీతమణినివ్వటం అంతా రామునకు చెప్పాడు. అష్టమి ఉత్తర ఫల్గుని విజయం అనుపేరుగల ముహూర్త మందు (42) సూర్యుడు ఆకాశమధ్యానికి రాగా రాముడు బయలుదేరాడు. రాముడు దక్షిణ దిశకు వెళ్ళటానికి ప్రతిజ్ఞచేశాడు. (43) నేను సముద్రాన్ని దాటి కూడా రాక్షసేశ్వరుని చంపుతాను. దక్షిణ దిక్కుగా బయల్దేరిన ఆతనికి సుగ్రీవుడు తోడున్నాడు (44) ఏడురోజులకు సముద్రతీరమందు సైన్యము విడిది చేసింది. పౌషశుక్లపరతివద తృతీయన సముద్రంవైపు సైన్యంతో సహా, రాముడు బయల్దేరాడు (45) చతుర్దిరోజు విభీషణుడు రామునితో కలిశాడు. పంచమిరోజు సముద్రాన్ని దాటే కొరకు ఆలోచన జరిగింది (46) నాల్గురోజులు రాముడు ప్రాయోపదేశం చేశాడు. సముద్రుని నుండి వరం లభించింది. ఉపాయముకూడా చెప్పాడు (47) దశమి యందు సేతువు నారంభించి త్రయోదశి యందు ముగించారు. చతుర్దశిరోజు రాముడు సువేలాద్రియందు సైన్యముంచాడు (48) పూర్ణిమనుండి ద్వితీయ వరకు మూడు రోజులు సైన్యం సముద్రాన్ని దాటింది. శూరవానరసైన్యంతో రాముడు సముద్రాన్ని దాటాడు (49) శుభ లక్షణుడు రాముడు సీత కొరకు అంకను అడ్డగించాడు. (ముట్టడి). తృతీయ నుండి దశమివరకు ఎనిమిది రోజులు సైన్యనివేశము (50) ఏకాదశి రోజున, శుకసారణులు అక్కడికి వచ్చారు. పౌషకృష్ణ ద్వాదశి రోజున సైన్యముల లెక్కింపు (51) శార్దూలుడు వానరుల బలాబలముల వర్ణించాడు. త్రయోదశి నుండి అమా వరకు మూడురోజులు లంకలో (52) రావణుడు సైన్యమును లెక్కించాడు. రణోత్సాహము చేశాడు. మాఘశుక్లం తొలిరోజున అంగదుడు రావణుని దగ్గర కెళ్ళాడు (53).

మూ || సీతాయాశ్చతదాభర్తుఃమాయామూర్థాదిదర్శనం | మాఘశుక్ల ద్వితీయాయాందివైఃసప్తభిరష్టమీం || 54 ||

రక్షసాం వానరాణాంచ యుద్ధమాసీచ్చ సంకులం | మాఘశుక్లస పమ్యాంతు రాత్రా వింద్ర జితారణ || 55 ||

రామలక్ష్మణయోర్నాగ పాశబంధః కృతః కిల | ఆకులేషుకపీశేషు హతాశేషుచ సర్వశః || 56 ||

వాయూపదేశాద్గరుడం సస్మార రాఘవస్తదా | నాగపాశ విమోక్షార్థం దశమ్యాం గరుడో7భ్యగాత్‌ || 57 ||

అపహారో మాఘశుక్లసైకాదశ్యాందినద్వయం | ద్వాదశ్యామాంజనేయేన ధూమ్రాక్షస్యవధః కృతః || 58 ||

త్రయోదశ్యాంతుతే నైవనిహతో7కంపనోరణ | మాయాసీతాం దర్శయిత్వా రామాయ దశకంధరః || 59 ||

త్రాసయామా సచతదా సర్వాన్‌ సైన్యగతానపి | మాఘశుక్లచతుర్దశ్యాం యావత్కృష్ణా దివాసరం || 60 ||

త్రిదినేన ప్రహస్తస్యనీలేన విహితోవధ | మాఘకృష్ణ ద్వితీయాయాః చతుర్థ్యంతం త్రిభిద్దినైః || 61 ||

రామేణతుములే యుద్ధే రావణోద్రావితో రణాత్‌ | పంచమ్యాం అష్టమియావత్‌ రావణనప్రబోధితః || 62 ||

కుంభకర్ణస్తదాచక్రే7భ్యవహారం చతుర్దినం | కుంభకర్ణోకరో ద్యుద్ధం స పమ్యాదిచతుర్దినైః || 63 ||

రామేణుని హతోయుద్దేబహు వానరభక్షకః | ఆమావాస్యాదినే శోకా7భ్యవహారో బభూవహ || 64 ||

ఫాల్గున ప్రతి పదాదౌ చతుర్థ్యంతైః | నరాంతక ప్రభృతయోనిహతాః పంచరాక్షసాః || 65 ||

పంచమ్యాః సప్తమీంయావత్‌ అతికాయవధః త్ర్యహాత్‌ | అష్టమ్యాద్వాదశీం యావన్నిహతౌదినపంచకాత్‌ || 66 ||

నికుంభకుంభౌ ద్వావేతౌ మకరాక్షశ్చతుర్దివైః | ఫాల్గునా సిత ద్వితీయాయాదినే వైశక్రజిజ్జితః || 67 ||

తృతీయాదౌసప్తమ్యంత దిన పంచకమేవచ | ఓషధ్యానయ వైయగ్ర్యా దవహారో బభూవహ || 68 ||

అష్టమ్యాం రావణో మాయామైధిలీం హతవాన్‌కుధీః | శోకావేగాత్తదారామశ్చక్రేసైన్యావధారణం || 69 ||

తతస్త్రయో దశీం యావద్దినైః పంచభిరింద్రజిత్‌ | లక్ష్మణన హతోయుద్ధే విఖ్యాత బలపౌరుషః || 70 ||

తా || సీతకు ఆమె భర్త తలను (మాయతల)చూపారు. మాఘశుక్ల ద్వితీయ నుండి ఏడురోజులు అష్టమి వరకు (54) వానరులకు సంకుల సమరం జరిగింది. మాఘశుక్ల నవమి యందు రాత్రి ఇంద్రజిత్తుతో యుద్ధంలో (55) ఆతడు రామలక్ష్మణులను నాగపాశంతో బంధించాడు. కపీశులంతా వ్యాకులులుకాగా అందరు అన్ని విధముల చావగా (56) రాముడు వాయువు ఉపదేశంతో గరుడుని స్మరించాడు. నాగపాశవిమోక్షం కొరకు దశమినాడు గరుడుడు వచ్చాడు (57) మాఘశుక్ల ఏకాదశిన రెండు రోజులు యుద్ధ విశ్రాంతి. ద్వాదశి రోజున ఆంజనేయుడు ధూమ్రాక్షుని చంపాడు (58) ఆతడే త్రయోదశి రోజున కంసనుని చంపాడు యుద్ధంలో రామునకు రావణుడు మాయాసీతను చూపి (59) అందరిని సైన్యమందున్నవారిని భయపెట్టాడు. మాఘ శుక్ల చతుర్దశి నుండి బహుళ పాడ్యమి వరకు (60) మూడు రోజులలో ప్రహస్తుని, నీలుడు చంపాడు. మాఘకృష్ణ ద్వితీయ నుండి చతుర్ధి వరకు మూడు రోజులు (61) రామునితో జరిగిన ఘోరయుద్ధంలో రావణుడు యుద్ధభూమి నుండి పరుగెత్తాడు. పంచమి నుండి అష్టమి వరకు రావణుడు (62) కుంభకర్ణుని మేల్కొలిపాడు. ఆ పిదప నాలుగురోజులు ఆతడు భుజించాడు. నవమి మొదలు నాలుగు రోజులు కుంభకర్ణుడు యుద్ధంచేశాడు (63) బహువానరుల భక్షించే రాక్షసుని రాముడు యుద్ధంలో చంపాడు (కుంభకర్ణుని) అమావాస్య దినమందు శోకపుతిండి ఐంది (64) ఫాల్గున ప్రతిపద నుండి చతుర్ధి వరకు నాల్గురోజులు నరాంతకుడు మొదలుగా ఐదుగురు రాక్షసులు చంపబడ్డారు (65) పంచమినుండి సప్తమి వరకు మూడు రోజులలో అతికాయ వధ జరిగింది. అష్టమి నుండి ద్వాదశి వరకు ఐదు రోజులలో (66) నికుంభులు వీరిద్దరు చంపబడ్డారు. నాల్గురోజులలో మకరాక్షుడు చంపబడ్డాడు. ఫాల్గున కృష్ణ ద్వితీయనాడు ఇంద్రజిత్తు జయించాడు (67) తృతీయ నుండి సప్తమి వరకు ఐదురోజులు ఓషధి తేవాలనే వ్యగ్రత వలన యుద్ధ విరామము (68) దుర్భుద్ధి గల రావణుడు అష్టమినాడు మాయ మైధిలిని చంపాడు. శోకాధిక్యం వల్ల అప్పుడు రాముడు సైన్యమును జాగ్రత్త పరిచాడు (69) పిదప త్రయోదశి వరకు ఐదు రోజులలో యుద్ధంలో విఖ్యాత బలపౌరుషములు కల ఇంద్రజిత్తు లక్ష్మణునితో చంపబడ్డాడు(70).

మూ || చతుర్దశ్యాందశగ్రీవో దీక్షామా పావహారతః | అమావాస్యాదినే ప్రాగాత్‌ యుద్ధా యదశకంధరః || 71 ||

చైత్రశుక్ల ప్రతిపదః పంచమీ దిన పంచకే | రావణో యుధ్యమానో7భూత్‌ ప్రచురో రక్షసాంవధః || 72 ||

చైత్రశక్లాష్టమీం యావత్‌ స్యందనాశ్వాది సూదనం | చైత్రశుక్లన పమ్యాంతు సౌమిత్రేః శక్తిభేదనే || 73 ||

కోపావిష్టేనరామేణ ద్రావితో దశకంధరః | విభీషణో వదేశేన హనుమద్యుద్థమేవచ || 74 ||

ద్రోణాద్రేరోషధీం నేతుం లక్ష్మణార్థముపాగతః | విశల్యాంతు సమాదాయ లక్ష్మణం తామపాయయత్‌ || 75 ||

దశమ్యామవహరో7భూద్రాత్రౌ యుద్ధంతు రక్షసాం | ఏకాదశ్యాంతు రామాయ రథోమాతలి సారధిః || 76 ||

ప్రాప్తోయుద్ధాయ ద్వాదశ్యాం యావత్కృష్ణాం చతర్దశీం | అష్టాదశదినైః రామో రావణం ద్వైరథే7వధీత్‌ || 77 ||

సంస్కారా రావణదీనాం అబావాస్యాదినే7 భవన్‌ | సంగ్రామే తుములే జాతేరామో జయమ వాప్తవాన్‌ || 78 ||

మాఘశుక్ల ద్వితాయాది చైత్ర కృష్ణచతుర్దశీం | సప్తాశీతి దినాన్యే వం మధ్యే పంచదశాహకం || 79 ||

యుద్ధావహారః సంగ్రామో ద్వాసప్తతి దినాన్యభూత్‌ | వైశాఖాది విధౌ రామ ఉవాసరణ భూమిషు

అభిషిక్తో ద్వితీయాయాంలంకారాజ్యే విభీషణః || 80 ||

సీతాశుద్ధిః తృతీయాయాం దేవేభ్యో వరలంభనం | దశరథస్యాగమనం తత్రచైవాసుమోదనం || 81 ||

హత్యాత్వరేణ లంకేశం లక్ష్మణ స్యాగ్రజోవిభుః | గృహీత్వా జానకీం పుణ్యాం దుఃఖితాం రాక్షసేనతు || 82 ||

ఆదాయ పరయా ప్రీత్యా జానకీం సన్యవర్తత | వైశాఖస్య చతుర్థ్యాంతు రామః పుష్పక మాశ్రితః || 83 ||

విహాయసానివృత్తస్తుభూయో7యోధ్యా పురీంప్రతి | పూర్ణేచతుర్ద శేవర్షే పంచమ్యాం మాధవన్యచ || 84 ||

భారద్వాజాశ్రమే రామః సుగుణః సముపావిశత్‌ | నందిగ్రామేతు షష్ఠ్యాంస పుష్సకేణ సమాగతః || 85 ||

సప్తమ్యామభిషిక్తో7సౌభూయో7యోధ్యాయాంరఘూద్వహః | దశాహాధికమాసాంశ్చచతుర్దశి హిమైధిలి || 86 ||

ఉవాసరా మరహితా రావణ స్యనివేశ##నే | ద్వాచత్వారింశ##కే వర్షే రామోరాజ్యమ కారయత్‌ || 87 ||

సీతాయాస్తు త్రయస్త్రింశత్‌ వర్షాణి తు తదాభవన్‌ | స చతుర్దశవర్షాంతేప్రవిష్టః స్వాంపురీం ప్రభుః || 88 ||

అయోధ్యాం నామముదితో రామోరావణ దర్పహా | భ్రాతృభిః సహితస్తత్ర రామోరాజ్యమ కారయత్‌ || 89 ||

దశవర్ష సహస్రాణి దశవర్షశతానిచ | రామోరాజ్యం పాలయిత్వా జగామత్రి దివాలయం || 90 ||

తా || చతుర్దశి యందు రావణుడు యుద్ధ విరామం నుండి దీక్షితుడైనాడు. అమావాస్య రోజున దశకంధరుడు యుద్ధమునకు వెళ్ళాడు. (71) చైత్రశుక్ల ప్రతి పదనుండి పంచమి వరకు ఐదు రోజులు రావణుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. రాక్షసుల వధ ఎక్కువైంది (72) చైత్రశుక్ల అష్టమి వరకు స్యందన అశ్వముల సంహారము, చైత్కర శుక్లనవమి యందు సౌమిత్రి శక్తి ఛేదించబడింది (73) రాముడు కోపావిష్టుడై రావణుని పరుగెత్తించాడు యుద్ధం నుండి. విభీషణుని ఉపదేశంతో హనుమంతుని యుద్ధము (74) లక్ష్మణుని కొరకు ద్రోణ పర్వతం నుండి ఓషదిని తేవటానికి రావటం. విశల్యను తీసుకొని లక్ష్మణుని రక్షించటం (75) దశమినాడు రాత్రి రాక్షసులకు యుద్ధ విరామము ఏకాదశిన రామునకురధము మరిమాతలి సారిధి (76) ద్వాదశిన యుద్ధానికి వచ్చాడు. బహుళ చతుర్దశి వరకు పదునెనిమిది రోజులు. రాముడు రావణుని ద్విరధ మందు చంపాడు (77) రావణాదులకు సంస్కారములు అమావాస్యరోజు జరిగాయి. యుద్ధము ఘోరంగా జరిగాక రాముడు జయాన్ని పొందాడు (78) మాఘశుక్ల ద్వితీయ మొదలుకొని చైత్రకృష్ణ చతుర్దశి వరకు ఎనుబది ఏడు రోజులు, మధ్యలో పదునైదు రోజులు (79) యుద్ధ విరామము, పోను డెబ్బది రెండు రోజులు యుద్ధంజరిగింది. వైశాఖం తొలిరోజున రాముడు రణభూమి యందున్నాడు. ద్వితీయనాడు లంకారాజ్యమందు విభీషణుడు అభిషిక్తుడైనాడు (80) తృతీయన సీతాశుద్ధి దేవతల నుండి వరలాభము. అక్కడికి దశరథుని రాక, దానిని అంగీకరించటం (81) లంకేశుని త్వరగా చంపి లక్ష్మణాగ్రుడు విభువు రాముడు, రాక్షసునితో బాధింపబడ్డ, పుణ్యవతియైన జానికిని తీసుకొని రావటము (82) పరమ ప్రీతితో జానకిని తోడుకొని రాముడు మరలాడు వైశాఖ చతుర్ధి రోజున రాముడు పుష్పక మెక్కాడు. (83) ఆకాశమార్గం ద్వారా మరలి తిరిగి అయోధ్య నగరాన్ని గూర్చి వచ్చాడు. పదునాట్లు సంవత్సరాలు సంపూర్తిగా నిండాక మాధవ పంచమి యందు (84) భరద్వాజాశ్రమంలో రాముడు తనవారితో కూడి ఉపవిష్టుడైనాడు. షష్ఠినాడు పూష్పకంద్వారా నంది గ్రామానికి వచ్చాడు (85) రాముడు అయోధ్య యందు సప్తమి రోజు తిరిగి అభిషిక్తుడైనాడు. పదునాల్గు నెలల పదిరోజుల కాలం సీత (86) రాముడు లేకుండా రావణుని ఇంట్లో ఉంది. నలుబది రెండవ సంవత్సరమున రాముడు రాజ్యం చేశాడు (87) అప్పుడు సీతకు ముప్పది మూడు సంవత్సరాలున్నాయి. ప్రభువు రాముడు పదునాల్గవ సంవత్సరం చివర తన నగరానికి వచ్చాడు (88) అయోధ్యనగరి ప్రవేశించి ముదితుడై రావణ దర్పహారి రాముడు తమ్ములతో కూడి రాజ్యపాలన చేశాడు (89) పదివేల నూర్ల సంవత్సరాలు రాముడు రాజ్యం పాలించి రాముడు త్రిదివాలయమునకు వెళ్ళాడు (90)

మూ || రామరాజ్యేతదాలోకాః హర్ష నిర్భరమానసాః బభూవుః ధనధాన్యాఢ్యాః పుత్రపౌత్రయుతానరాః || 91 ||

కామవర్షీచ వర్ణన్యః సస్యాని గుణవంతిచ | గావస్తు ఘటదోహిన్యః పాదపాశ్చ సదాఫలాః || 92 ||

నాధయో వ్యాధయశ్చైవ రామరాజ్యేన రాధిప | నార్యః పతివ్రతా శ్చాసన్‌ పితృభక్తి వరానరాః || 93 ||

ద్విజా వేదపరానిత్యం క్షత్రియాద్విజసేవినః | కుర్వతే వైశ్య వర్ణాశ్చభక్తిం ద్విజగవాం సదా || 94 ||

నయోని సంకరశ్చా సీత్‌ తత్ర నాచార సంకరః | నవంధ్యాదుర్భగా నారీకాక వంధ్యామృత ప్రజా || 95 ||

విధవానైవ కాప్యాసీత్‌ సభర్తృ కానలప్యతే | నావజ్ఞాం కుర్వతేకే పి మాతాపిత్రోః గురోస్థథా || 96 ||

నచవాక్యంహి వృద్ధానాం ఉల్లంఘయతి పుణ్యకృత్‌ | నభూమి హరణం తత్ర పరనారీ పరాఙ్‌ముఖాః || 97 ||

నాపవాదపరోలోకో సదరిద్రో నరోగభాక్‌ | నస్తేయోద్యూతకారీ చమైరేయీ పాపినోసహి || 98 ||

హె మహారీ బ్రహ్మఘ్నోనచైవగురతల్పగః నస్త్రీఘ్నోనచ బాలఘ్నో నచైవానృతభాషణః || 99 ||

నవృత్తిలోపకశ్చాసీత్‌ కూటసాక్షీనచైవహి | నశఠోనకృతఘ్నశ్చ మలినోనైవ దృశ్యతే || 100 ||

సదాసర్వత్ర పూజ్యంతే బ్రాహ్మణా వేదపారగాః | నావైష్ణవో7ప్రతీ రాజన్‌ రామరాజ్యే7తి విశ్రుతే || 101 ||

రాజ్యం ప్రకుర్వతస్తస్య పురోధావదతాం పరః | వసిష్ఠో మునిభిః సార్థం కృత్వాతీర్థాస్యనేకశః || 102 ||

ఆ జగామ బ్రహ్మపుత్రో మహాభాగః తపోనిధిః | రామస్తం పూజయామానమునిభిః సహితంగురుం || 103 ||

అభ్యుత్థానార్ఘపాద్యైశ్చ మధుపర్కాది పూజయా | వప్రచ్ఛకుశలం రామం వసిష్ఠోముని పుంగవః || 104 ||

రాజ్యేచాశ్వే గజేకోశే దేశే సద్ర్భాతృ భృత్యయోః | కుశలంవర్తతే రామ ఇతివృష్టే మునేస్తదా || 105 ||

రామ ఉవాచ -

సర్వత్రకుశలం మే7ద్య ప్రసాదాత్‌ భవతః సదా | పప్రచ్ఛకుశలం రామోవసిష్ఠం మునిపుంగవం || 106 ||

సర్వతః కుశలీత్వంహి భార్యాపుత్ర సమన్వితః | ససర్వం కథయామాన యథా తీర్థాస్య శేషతః || 107 ||

సేవితానిథ రావృష్ఠే క్షేత్రాణ్యాయతనానిచ | రామాయ కథయా మాస సర్వత్ర కుశలం తదా || 108 ||

తతః సవిస్మయా విష్టోరామోరాజీవలోచనః | వప్రచ్ఛతీర్థమాహాత్మ్యం యత్తీర్థేషూత్తమోత్తమం || 109 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే రామచరిత్ర వర్ణనం నామ త్రింశోధ్యాయః ||30 ||

తా || రాముడు రాజ్య పాలనచేయగా ప్రజలంతా (లోకములు) హర్షంతో నిండిన మనస్సుగల వారైనారు. నరులు దనధాన్యములు, పుత్రపౌత్రులు గలవారైనారు. (91) వరుణుడు, అనుకున్నట్లు వర్షం కురిశాడు. పంటలు సమృద్ధిగా పండాయి. ఆవులు కుండల కొలది పాలిచ్చాయి.చెట్లు ఎల్లప్పుడు పండ్లతో నిండి ఉన్నాయి (92) ఓ నరాధిప! రామరాజ్యంలో ఆధివ్యాధులు లేవు. స్త్రీలు పతివ్రతలుగా ఉన్నారు. నరులు పితృభక్తి పరులైనారు (93) బ్రాహ్మణులు ఎల్లప్పుడు వేదపరులైనారు. క్షత్రియులు ద్విజసేవనులైనారు. వైశ్యులు ఇతరులు ఎల్లప్పుడు బ్రాహ్మణుల యందు గోవుల యందు భక్తి గలవారైనారు (94) యోని సంకరముగాని, ఆచార సంకరముగాని అక్కడలేదు. వంధ్య దుర్భగ (గయ్యాళి)ఐనస్త్రీ, ఒకే సంతానం గల స్త్రీ (కాక వంధ్య) చచ్చిన సంతానం గల స్త్రీలేరు. (95) ఒక్క విధవ లేదు. భర్తగల స్త్రీ దుఃఖించేది కన్పించలేదు. మాతాపితరులను గురువును అవమానపరిచేవారు ఎవ్వరూలేరు (96) పుణ్యాత్ముడెవ్వడూ వృద్ధుల వాక్యాలను ఉల్లంఘించటంలేదు. భూమి హరణములేదు. పరనారీ పరాఙ్‌ముఖులే ఉన్నారు (97) ప్రజలు అపవాదంవేసేవారు కాదు. దరిద్రులు రోగగ్రస్తులు లేరు. దొంగలు, జూదకారులు, కల్లుఅమ్మేవాళ్ళు పావులులేరు. (98) బంగారు దొంగలు, బ్రాహ్మణ హంతకులు, గురు తల్పగులు లేరు. స్త్రీ హంతకులు, బాలహంతకులు, అబద్ధాలాడు వారులేరు. (99) వృత్తి లోపంచేసేవారు, కూటసాక్షులు లేరు. శఠులు కృతఘ్నులు మలినులు కన్పించరు. (100) వేద పారగులైన బ్రాహ్మణులు అంతటా ఎల్లప్పుడు పూజింపబడేవారు అతి ప్రసిద్ధమైన రామరాజ్యంలో అవైష్ణువుడు లేడుప్రతికానివాడు లేడు (101) రాజ్యపాలన చేస్తున్న ఆ రాముని పురోహితుడు వదతాం వరుడు వసిష్ఠుడు మునులతో పాటు అనేక తీర్థములు సేవించి (102) బ్రహ్మపుత్రుడు, మహాభాగుడు ఐన వసిష్టుడు తపోనిధి వచ్చాడు. మునులతో కూడిన గురువును రాముడు పూజించాడు (103) ఎదుర్కొని అర్ఘ్యపాద్యములిచ్చి ముధపర్కాదుల పూజతో గౌరవించాడు. వసిష్ఠుడు, మునిపుంగవుడు రాముని కుశలమును అడిగాడు (104) రాజ్యమందు, అశ్వగజములు కోశ##దేశములు, భ్రాతృభృత్యులు వీరందరు కుశలమేనా అని రాముని అడుగగా రాముడిట్లన్నాడు (105) రాముని వచనము - మీ అనుగ్రహంవల్ల ఎల్లప్పుడు అంతటా నాకీవేళ కుశలమే. రాముడు వసిష్ఠునిముని పుంగవుని కుశలమడిగాడు (106) భార్యాపుత్రులతో కూడి నీవు అన్నివిధముల కుశలమేకదా అని. ఆతడు, అన్ని తీర్థముల గూర్చి అంతా చెప్పాడు (107) భూమి యందలి క్షేత్రములు, ఆలయాలు సేవించాము అని రామునకు చెప్పాడు అంతట క్షేమమే అని (108) అప్పుడు రాజీవలోచనుడైన రాముడు విస్మయా విష్టహృదయుడై తీర్థములన్నింటిలో ఉత్తమోత్తమమైన తీర్థమాహాత్మ్యమును చెప్పమని వసిష్ఠుని అడిగాడు (109) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్యమాహాత్మ్య మందు రామచంద్ర వర్ణన మనునది ముప్పదవ అధ్యాయము || 30 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters