Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది ఏడవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

తత్రతస్యసమీ వస్థం మార్కండేనో వలక్షితం | తీర్థం గోవత్స సంజ్ఞంతు సర్వత్ర భువిసంస్థితం || 1 ||

తత్రావతీర్యగోవత్స స్వరూపేణాంబికాపతిః | స్వయంభూ లింగరూపేణ సంస్థితో జగతాంపతిః || 2 ||

ఆ సీద్వలా హకోనామరుద్ర భక్తో మహాబలః | ఆ ఖేటక సమాయుక్తో నృపః పరపురంజయుః || 3 ||

మృగయూథేస్థితం దృష్ట్వా గోవత్సం తత్పాదాతినా | ఉక్తోరాజా మయాదృష్టం కౌతుకం నృపసత్తమ || 4 ||

గోవత్సో మృగయూథస్య దృష్టోమథ్య స్థితోమయా | తేషామే వాసురక్తో7సౌ జనన్యా రహితస్తథా || 5 ||

ద్రష్టుంతుం కౌతుకం రాజా తంవదాతి పురః స్థితం | ఉవాచ దర్శయస్వేతి గోవత్సంచ సమావిశత్‌ || 6 ||

గత్వాటవీం తదారాజ్ఞో దర్శితః సపదాతినా | పదాతిభిః మృగానీకం దుద్రాపత్రాసితం యదా || 7 ||

పీలుగుల్మం ప్రతిగతం గోవత్సః ప్రస్థితస్తదా | రాజాతద్ధరణాకాంక్షో ప్రావిశత్‌ గుల్మమాదరాత్‌ || 8 ||

తత్రస్థితం స గోవత్సమ పశ్యన్నృపతిః స్వయం | యావద్గృహాతితం తాపత్‌ లింగం జాతం సముజ్జ్వలం || 9 ||

తందృష్ట్వావిస్మితో రాజాకిమేత దిత్యచింతయత్‌ | యావచ్చింతయతేహ్యెవం దేహంత్యక్త్వాది వంగతః || 10 ||

అత్రాంతరే గగనతలే సమంతతః | శ్రూయతే సురజయకార గర్జితం

పపాత పుష్పవృష్టిరంబరాద్రాజాగతః శివభువనం చతత్‌ క్షణాత్‌ || 11 ||

తావత్పశ్యతి తన్నాభ్యం గోవత్సం బాలకం స్థితం | సూనమేషమహాదేవో వత్సరూపీమహెశ్వరః || 12 ||

తమానేతుం సముద్యుక్తో రాజా తముజ్జహారచ | తదాతద్దేవలింగంతునోత్తిష్ఠతి కథంచన

తదాదేవాః సహానేన ప్రార్థ యామాసురీశ్వరం || 13 ||

దేవా ఊచుః -

భగవన్సర్వ దేవేశస్థాతవ్యం భవతావిభో | శుక్లేన లింగరూపేణ సర్వలోకహితైషిణా || 14 ||

శ్రీ మహాదేవ ఉవాచ -

స్థాస్యామ్యహం సదైవాత్ర లింగరూపేణ దేవతాః | యస్మాద్భాద్రపదేమాసి కృష్ణపక్షే కుహూదినే || 15 ||

తథాతద్దివసే తత్ర స్నానం కృత్వా విధానతః | లింగంయే పూజయిష్యంతి సతేషాం విద్యతే భయం || 16 ||

ఋతేచ పిండదానేన పూర్వజాః శాశ్వతీః సమాః | రౌరవే నరకే ఘోరే కుంభీపాకేచయే గతాః || 17 ||

అనేకనరక స్థాశ్చతిర్యగ్‌ యోనిగతాశ్చయే | సకృత్పిండ ప్రదానేన స్యాత్తే షామక్షయాగతిః || 18 ||

తా || సూతుని వచనము - అక్కడ దాని సమీపంలో ఉన్న మార్కండుడు చూచిన తీర్థము గోవత్సమను పేరు గలది. లోకమంతా ప్రసిద్ధమైంది. (1) అక్కడ అంబికావతి గోవత్సరూపంతో అవతరించి, ఆ జగత్పతి స్వయంభూలింగ రూపంలో ఉన్నాడు. (2) రుద్ర భక్తుడు, మహాబలుడు వలాహకుడని ఉండేవాడు. వరపురముల జయంచే ఆ రాజు వేట వస్తువులతో వేటాడు వారితో కూడి ఉన్నాడు (3) ఆ రాజు యొక్క పదాతి (కాలిబంటు) మృగముల మధ్య యందున్న గోవత్సమును చూచి రాజుతో అన్నాడు. ఓ నృపసత్తమ కుతూహలం కలిగించే విషయాన్ని నేను చూశాను (4) మృగసమూహం మధ్య ఉన్న గోవత్సమును నేను చూశాను. ఆ దూడతల్లి లేకుండా ఆమృగములందే అనురక్తఐంది (5) చూడాలని కుతూహలంగా రాజు ముందు పదాతిసైన్యంతో అన్నాడు. నాకు చూపండి. గోవత్సము ఉన్నచోటును, అని (6) ఆ పదాతి అడవికి వెళ్ళి ఆ వత్సమును రాజుకు చూపారు. కాలిబలమును చూచి భయపడి మృగములు పరుగెత్తాయి (7) వస్తున్న ఏనుగులనుసైన్యాన్నిచూచి గోవత్సము అప్పుడు నిలిచింది. రాజుదాన్ని పట్టుకోదలచి ఆదరంతో సైన్యంలో ప్రవేశించాడు (8) అక్కడున్న గోవత్సాన్ని రాజు స్వయంగా చూచాడు. రాజు పట్టుకోబోయేంతలో అది ఒక సముజ్జ్వల లింగంగా మారింది (9) దానిని చూచి రాజు ఆశ్చర్యపడి, ఇదేమిటి అని ఆలోచించాడు. ఇట్లా ఆలోచిస్తున్నంతలో రాజు తన దేహాన్ని విడిచి దివమునకు వెళ్ళాడు (10) ఇంతలో ఆకాశంలో అంతట దేవతల జయధ్వని వినిపించింది. ఆకాశం నుండి పుష్ప వర్షం కురిసింది. ఆ క్షణంలోనే రాజు శివలోకమునకు వెళ్ళాడు (11) ఇంతలో ఆశివ సంబంధమైన గోవత్సమును, బాలకమును ఎదుట ఉన్నదానిని చూచాడు. నిజంగా ఇది మహాదేవుడే, వత్సరూపిమహెశ్వరుడే (12) అని దానిని పట్టుకోవటానికి రాజు ప్రయత్నించాడు. దానిని పట్టుకున్నాడు కూడా. అప్పుడు ఆ దేవలింగము ఎంత ప్రయత్నించినా లేవలేదు. అప్పుడు దేవతలు ఈతనితో పాటు ఈశ్వరుని ప్రార్థించసాగారు. (13) దేవతల వచనము - ఓ సర్వదేవేశ, భగవాన్‌, విభు మీరిక్కడే ఉండాలి. సర్వలోకముల హితము కొరకు శుక్లలింగరూపములో ఉండాలి (14) అనగా శ్రీ మహాదేవుని వచనము - ఓ దేవతలార! ఇక్కడ ఎల్లప్పుడు నేన లింగరూపంలో ఉంటాను. భాద్రపద కృష్ణ పక్షం అమావాస్యనాడు (15) ఆరోజు విధానం ప్రకారము స్నానంచేసి, లింగాన్ని పూజించిన వారికి భయముండదు (16) పిండదానం లేనందువల్ల పూర్వజులు, శాశ్వతకాలము రౌరవనరకము ఘోరమైన కుంభీపాకమునకు పోయినవారు (17) అనేక నరకములందున్నవారు, తిర్యగ్యోనిగతులు వీరందరికి ఒక్కసారి పిండప్రదానంచేస్తే వారకి అక్షయమైనగతి కలుగుతుంది (18)

మూ || తతోపలాహకోరాజా సర్వదేవసమన్వితః | స్థాపయామానతల్లింగం సర్వదేవ సమీపతః || 19 ||

చకార బహు దానా నిలోకానాం హితకామ్యయా | యావదర్చయతేహ్యెవం రుద్రో7పి స్వయమాగతః || 20 ||

రుద్ర ఉవాచ -

అస్యాం రాత్రౌతు మనుజాః శ్రద్ధాభక్తి సమన్వితాః | యేర్చయిష్యంతి దేవేశం తేషాం పుణ్యమనంతకం || 21 ||

జాగరంయే కరిష్యంతి గీతశాస్త్ర పురః నరం | ఉద్ధరిష్యంతి తేమర్త్యాః కులమేకోత్తరం శతం || 22 ||

తావద్గర్జంతి తీర్థాని నైమిషం పుష్కరం గయా | ప్రయాగంచ ప్రభాసంచ ద్వారకామధురా7ర్భుదః || 23 ||

యావన్నదృశ్యతే లింగం గోవత్సం పరమాద్భుతం | యదాహికురుతేభావం గోవత్సగమనం ప్రతి || 24 ||

స్వపం శజాస్త దాసర్వే నృత్యంతి హర్షితా ధ్రువం | || 25 ||

సూత ఉవాచ -

యచ్చాన్యదద్భుతం తత్ర వృత్తాంతం శృణుతద్విజాః | యేనవై శ్రుతమాత్రేణ సర్వపాపక్షయోభ##వేత్‌ || 26 ||

యదావైస్థాపితం లింగం సర్వదేవైః | విష్ణోః ప్రతిష్ఠాన గుణాత్‌ సర్వేషాంచ దివౌకసాం || 27 ||

అణుమాత్ర ప్రయాణన ప్రత్యహం సమవర్ధత | తతస్తే మనుజాదేవాభీతాస్తం శరణం యయుః || 28 ||

దేవా ఊచుః -

వృద్ధిం సంహర దేవేశలోకానాం స్వస్తితద్భవేత్‌ | ఏవముక్తేతతోలింగాత్‌ వాగువాచా శరీరిణీ || 29 ||

శివవాణ్యువాచ -

హెలోకామాభయంవోస్తుఉపాయఃశ్రూయాతామయం | కంచిచ్చండాలమానీయమత్పురఃస్థాప్యతాంధ్రువం || 30 ||

చండాలాశ్చ సమానీయ దధుః దేవస్యతేపురః | తథాపితస్యవృద్ధి స్తునైవ నిర్వర్తతే పునః || 31 ||

వాగువాచ -

కర్మణా యస్తుచండాలః సో7గ్రేమే స్థాప్యతాంజనాః | తచ్ఛ్రుత్వామహాదాశ్చర్యం మతించక్రుర్విలోచనే || 32 ||

మార్గమాణాస్తదా తేతు గ్రామాణిచ పురాణిచ | కంచిత్కర్మరతం పాపం దదృశుః బ్రాహ్మణబృవం || 33 ||

వృషభాన్‌భారసంయుక్తాన్‌మధ్యాహ్నెవాహయత్తుసః | క్షుత్తృట్‌ శ్రమపరీతాంశ్చదుర్బలాన్‌క్రూరమానసః || 34 ||

అప్నాత్వాపి పర్యుషితం భక్షయంతీహనైద్విజాః | తంసమాదాయదేవేశం జగ్ముర్యత్ర జగద్గురుః || 35 ||

దేవాలయాగ్రభూమౌతం స్థాపయామానురాదృతాః | భస్మీ బభూవసహసా గోవత్సాగ్రే నిరూపితః || 36 ||

తా || పిదప ఆవలాహకరాజు దేవతలందరితో కూడి సర్వదేవతలకు సమీపముగా ఆలింగాన్ని స్థాపించాడు (19) లోకంలహితం కొరకు అనేక దానాలు చేశాడు. ఈ విధంగా పూజిస్తుండగా రుద్రుడు స్వయంగా వచ్చాడు (20) రుద్ర వచనము - ఈ రాత్రియందు మనుజులు శ్రద్ధాభక్తి సమన్వితులై దేవేశుని పూజించిన వారి పుణ్యము అనంతమైనది (21) గీతశాస్త్ర పురః సరముగా జాగరము చేసిన వారు ఆమర్త్యులు నూటొక్క కులమును ఉద్ధరిస్తారు (22) పరమాద్భుతమైన గోవత్సలింగమును చూడనంత వరకు తీర్థములు నైమిషము, పుష్కరము, గయ, ప్రయాగ, ప్రభాసము (తీర్థము) ద్వారక, మథుర అర్బుదము (23) ఇవన్నీ గర్జిస్తాయి. గోవత్సమునకు వెళ్ళాలని మనసులో తలిస్తేచాలు (24) అప్పుడు తన వంశములోని వారంతా ఆనందంతో నృత్యంచేస్తారు. ఇది నిశ్చయము (25) సూతుని వచనము - అక్కడ అద్భుతమైన మరో వృత్తాంతముంది. దానిని వినండి, ఓ ద్విజులార! దానిని విన్నమాత్రంచేత సర్వపాప క్షయమౌతుంది (26) దేవతలంతా కలిసి పురాతనమైన లింగాన్ని స్థాపించాక విష్ణువు, దేవతలందరు ప్రతిష్ఠించిన శక్తివల్ల (27) ఆలింగము ప్రతిరోజు అణు మాత్రం ప్రమాణంగా వృద్ధిచెందసాగింది. అప్పుడ ఆ మనుజులు దేవతలు భయపడి ఆతనిని శరణువేడారు (28) దేవతల వచనము - ఓదేవేశ! నీ వృద్ధిని ఉపసంహరించుకో. దానివల్ల లోకము లకుమే లౌతుంది. ఇట్లా అనగా అప్పుడు లింగం నుండి అశరీరవాణి ఇట్లా పలికింది (29) శివవాణి వచనము - ఓ లోకములార! మీకు భయమక్కరలేదు. ఈ ఉపాయం వినండి. ఒక చండాలుని తీసుకొని వచ్చి నా ఎదురుగా ఉంచండి. తప్పదు (30) వారు చండాలురను తీసుకొని వచ్చి దేవుని ఎదురుగా ఉంచారు. ఐనా ఆతని వృద్ధి తిరిగి ఆగిపోలేదు (31) వాక్‌ ఇట్లాపలికింది - కర్మచండాలుని తెచ్చి నా ఎదురుగా ఉంచండి, ఓ జనులార, అనగా మహదాశ్చర్యకరమైన ఆ మాటనువిని, అట్టివాణ్ణి వెతకటానికి ప్రయత్నించారు (32) వారు గ్రామములు పురములు వెతుకుతూ కొద్దిగా కర్మయందు ఆసక్తి గల పాపిని ఒకనిని బ్రాహ్మణ బ్రువుని (అట్లా పిలుస్తారు కాని ఆ లక్షణాలులేవు) చూచారు (33) బరువుతో కూడిన వృషభములను మధ్యాహ్నమందు నడిపిస్తున్న వానిని ఆకలి, దప్పిక, శ్రమ కలిగిన బలహీనమైన వానిని నడిపిస్తూ, క్రూరమైన మనస్సుగల వానిని (34) స్నానం చేయకుండా చలిది తింటున్న వానిని తీసుకొని జగద్గురువున్న దేవేశుడున్న చోటికి వచ్చారు (35) ఆదరించి దేవాలయ అగ్రభూమి యందు ఆతనిని నిలిపారు. గోవత్సాగ్రమందు ఉంచబడ్డవాడై వాడు త్వరగా భస్మమైనాడు (36).

మూ || చండాలస్థల ఇత్యేష ప్రసిద్ధోసౌ7 భవత్‌ క్షితౌ | తత్రస్థితైర్నచాద్యాపి ప్రాసాదోదృశ్యతే హిసః || 37 ||

తదాప్రభృతితల్లింగం సామ్యభావ ముపాగతం | ధౌత పాప్మాగతస్తీర్థం ద్విజోలింగనిరీక్షణాత్‌ || 38 ||

ప్రత్యహం పూజయామానగోవత్సం గతకిల్బిషః | విశేషాత్‌ కృష్ణ వక్షస్య చతుర్దశ్యాం సమాగతః || 39 ||

ఏతత్తదద్భుతం తస్యదేవస్య చత్రిశూలినః | శృణుయాద్యోనరోభక్త్యా సర్వపాపైః ప్రముచ్యతే || 40 ||

సూత ఉవాచ -

గోవత్సమితి విఖ్యాతం నరాణాం పుణ్యదం వరం | అనేకజన్మ పాపఘ్నం మార్కండేయేన భాషితం || 41 ||

తత్రతీర్థే నకృత్‌ స్నానం రుద్రలోక ప్రదం నృణాం | పాపదేహ విశుద్ధ్యర్థం పాపేనోపహతాత్మనాం || 42 ||

కూపే తర్పణ తశ్చైవ శ్రాద్ధతశ్చై వతృప్తతా | భాద్రపదే విశేషేణ వక్షస్యాం తే భవత్కలౌ || 43 ||

ఏక వింశతి వారాంస్తు గయాయాం తర్పణకృతే | పితౄణాం పరమాతృప్తిః సకృద్వైగంగకూపకే || 44 ||

తస్మిన్‌ గోవత్స సామీప్యే తిష్ఠతే గంగ కూపకః | తస్మింస్తిలోదకేనాపి సద్గంతి యాంతి తర్పితాః || 45 ||

పితరోనరకాద్వాపిసు పుణ్యన సుమేధసా | గోప్రదానం ప్రశంసంతి తస్మింస్తీర్థే మునీశ్వరాః || 46 ||

విప్రాయ స్వర్గదానంతు రుద్రలోకేనయేన్నరం | సరస్వతీ శివక్షేత్రే గంగాచగంగ కూపనే || 47 ||

ఏకస్థమేతత్త్రితయం స్వర్గాపవర్గకారణం | సేవితం చర్షిభిః సిద్ధైః తీర్థం సర్వత్ర విశ్రుతం || 48 ||

పీలుయుగ్మం స్థితం తత్ర తత్తీర్థం మునిసేవితం | స్నానాత్‌ స్వర్గప్రదం చైవపానాత్‌ పాపవిశుద్ధిదం || 49 ||

కీర్తనాత్‌ పుణ్య జననం సేవనాత్‌ ముక్తిదంపరం | | తద్వైపశ్యంతియే భక్త్యా బ్రహ్మహాయదిమాతృహా || 50 ||

బాలఘాతీచగోఘ్నశ్చయేచ స్త్రీశూద్రఘాతకాః | గరదాశ్చాగ్ని దాశ్చైవ గురుద్రోహ రతాశ్చయే || 51 ||

తపస్వినిందకాశ్చైవ కూటసాక్ష్యం కరోతియః | వక్తాచ పరదోషన్య పరస్య గుణలోపకః || 52 ||

సర్వపాప మయో7ప్యత్రముచ్యతే లింగదర్శనాత్‌ || 53 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పాతాళ ఖండే ధర్మారణ్య మాహాత్మ్యే బలాహకోపాఖ్యాన వర్ణనం నామ సప్తవింశో7ధ్యాయః || 27 ||

తా || ఈ స్థలము చండాల స్థలమని ఈ భూమి యందు ప్రసిద్ధమైంది. అక్కడున్నవారు ఇప్పటికి ఆ ఆలయాన్ని చూడటంలేదు (37) నాటినుండి ఆ లింగము సామ్యభావాన్ని పొందింది. ద్విజుడు లింగాన్ని చూడటం వలన పాపాలన్నీ కడగబడి పవిత్రుడైనాడు (38) పాపములన్ని పోయి ప్రతిరోజు గోవత్సమును పూజించసాగాడు. విశేషించి కృష్ణపక్ష చతుర్దశి రాగానే వచ్చి (39) దేవుడైన త్రిశూలి యొక్క ఈ అద్భుతాన్ని భక్తితో విన్న నరుడు అన్ని పాపములనుండి ముక్తుడౌతాడు (40) సూతుని వచనము - గోవత్సనుని ప్రసిద్ధమైంది, నరులకు పరమపుణ్యము నిచ్చేది. అనేక జన్మల పాపాన్ని నశింపచేసేది. అని మార్కండేయుడు చెప్పాడు (41) ఆ తీర్థంలో ఒక్కసారి స్నానంవల్ల నరులక రుద్రలోకం వస్తుంది. పాపముతో కొట్టబడిన ఆత్మకలవారికి, పాపదేహవిశుద్ది కొరకు (42) స్నానం అవసరము. కూపంలో తర్పణం వల్ల శ్రాద్ధం వల్ల తృప్తత. విశేషించి భాద్రపదంలో కలియుగంలో పక్షాంతమందు ఐతే ఇంకాతృప్తినిస్తుంది (43) గయలో ఇరువది ఒక్కమారులు తర్పణచేస్తే పితరులక పరమతృప్తి కాని గంగకూ పకంలోఐతే ఒకసారికే తృప్తి (44) అక్కడ గోవత్స సమీపమందు గంగకూపకం ఉంది. అక్కడ తిలోదకమిచ్చిన తర్పింపబడ్డవాడు సద్గతిని పొందుతారు (45) నరకమునుండైనా పితరులు సుపుణ్యుడు సుమేధస్సు కలవాడు ఇచ్చే గోప్రదానమును, ఆ తీర్థంలో ఇచ్చేదానిని ప్రశంసిస్తారు, ఓ మునీశ్వరులార (46) విప్రునకు స్వర్ణదానం చేస్తే అది నరుని రుద్రలోకానికి తీసుకెళ్తుంది. శివక్షేత్రమందు సరస్వతి, గంగ, గంగకూపకము (47) ఒక్కచోట చేరిన ఈ మూడు స్వర్గ అపవర్గములకు కారణము. ఋషులు సిద్ధులు ఈ తీర్థాన్ని సేవించారు. ఇది అంతట ప్రసిద్ధమైంది (48) రెండు పీలువులు అక్కడున్నాయి. ఆ తీర్థాన్ని మునులు సేవించారు. స్నానం వల్ల స్వర్గాన్నిస్తుంది. పానం వల్ల పాపములనుండి శుద్ధిని కల్గిస్తుంది (49) కీర్తనం వల్ల పుణ్యాన్ని కల్గిస్తుంది, సేవనం వల్ల వరమముక్తినిస్తుంది. బ్రహ్మహత్య చేసినవారు, మాతృహత్యచేసినవారు (50) పిల్లలను చంపినవారు, గోవులనుచంపినవారు, శూద్రులను, స్త్రీలనుచంపినవారు, గరళమిచ్చువారు, అగ్నిపెట్టేవారు, గురుద్రోహరతులు, (51) తపస్వినిందకులు కూటసాక్ష్యం చెప్పేవారు, పరుల తప్పులు చెప్పేవారు, పరుల గుణములు దాచేవారు (52) సర్వపాప మయులు వీరంతా భక్తితో లింగాన్ని దర్శిస్తే ముక్తులౌతారు. (53) అనిశ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పాతాల ఖండమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు వలాహక ఉపాఖ్యాన వర్ణనమనునది ఇరువది ఏడవ అధ్యాయము || 27 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters