Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది మూడవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

అతఃపరంప్రపక్ష్యామిబ్రహ్మణాయత్కృతంపురా | తత్సర్వంకధయామ్యద్యశృనుపై#్వకాగ్రమాసనం ||1 ||

దేవానాందానవానాంచవైరాద్యుద్ధంబభూసహ | తస్మిన్‌యుద్ధేమహాదుష్టేదేవాఃసంక్లిష్టమానసాః || 2 ||

బభూవుఃతత్రసోద్వేగాఃబ్రహ్మాణంశరణంయయుః || 3 ||

దేవాఊచుః- బ్రహ్మన్‌కేన ప్రకారేణదైత్యానాంవధమేవచ|కరోమ్యద్యుపాయంహికధ్యతాంశీఘ్రమేవమే || 4 ||

బ్రహ్మోవాచ -

మయాహిశంకరేణౖవవిష్ణునాహితథాపురా | యమస్యతపసాతుష్టైఃధర్మారణ్యం వినిర్మితం || 5 ||

తత్రయుద్దీయతేదానంయజ్ఞంవాతవఉత్తమం | తత్సర్వంకోటిగుణితంభ##వేదితినసంశయః || 6 ||

పాపంవాయదివాపుణ్యంసర్వంకోటిగుణంభ##వేత్‌ | తస్మాద్దైత్యైఃసధర్షితంకదాచిదపిభోఃసురాః || 7 ||

శ్రుత్వాతుబ్రహ్మణోవాక్యందేవాఃసర్వేసవిస్మయాః | బ్రహ్మాణంత్వగ్రతఃకృత్వాధర్మారణ్యముపాయయుః || 8 ||

నత్రంతత్రసమారభ్యసహస్రాబ్దమనుత్తమం | వృత్వా7చార్యంచాంగిరసంమార్కండేయంతదైవచ || 9 ||

అత్రించకశ్యపంచైవహోతాకృత్వామహామతిః | జమదగ్నింగౌతమంచఅధ్వర్యుత్వంస్యవేదయన్‌ || 10 ||

భరద్వాజంవసిష్ఠంతుప్రత్యధ్వర్యుత్వమాదిశన్‌ | నారదంచైవవాల్మీకింనోదనాయాకర్తోతదా || 11 ||

బ్రహ్మాసనేచబ్రహ్మాణంస్థాపయామానురాదరాత్‌ | క్రోశచతుష్కమాత్రాంచవేదింతృత్వాసురైస్తతః || 12 ||

ద్విజాన్సర్వేసమాహూతాయజ్ఞస్యార్థేహిజాపకాః | ఋగ్యజుస్సామాధర్వాన్వైవేదాసుద్గిరయంతియే || 13 ||

గణనాధంశంభుసుతంకార్తియేయంతథైవచ | ఇంద్రంవజ్రధరంచైవజయంతంచేంద్రసూనకం || 14 ||

చత్వారోద్వారపాలాశ్చదేవాః శూరాఃవినిర్మితాః | తతోరక్షోఘ్నమంత్రేణహూయతేహవ్యవాహనః || 15 ||

తిలాంశ్చమనమిశ్రాంశ్చమధ్వాజ్యేనచమిశ్రితాన్‌ | జుహువుస్తేతదాదేవావేదమంత్రైఃసరేశ్వర || 16 ||

తా || వ్యాసునివచనము - ఈమీదట పూర్వంబ్రహ్మేంచేశాడోదానినిచెబుతాను అదంతాఈవేళ##చెబుతాను. ఏకాగ్ర చిత్తంతోవినండి (1) దేవతలకుదానవులకువైరంవల్లయుద్ధంజరిగింది. మహాదుష్టమైన ఆయుద్ధమందుదేవతలుసంక్లిష్ట మానసులైనారు. (2) ఉద్వేగంతోవారుబ్రహ్మనుశరణువేడారు. (4) బ్రహ్మవచనము - నేను శంకరుడు విష్ణువు మేము పూర్వము యమునితపస్సుకుసంతసించి ధర్మారణ్యాన్నినిర్మించాము. (5) అక్కడచేసినదానము, యజ్ఞము ఉత్తమతపము అదంతా కోటిగుణితమౌతుంది. అనుమానంలేదు. (6) పాపముకానిపుణ్యముకాని అంతాకోటిగుణితమౌతుంది. అందువల్లదైత్యులు ఎప్పుడూ తిరస్కరించబడలేదు. ఓ సురలార! (7) బ్రహ్మవాక్యమునువినిదేవతలంతాఆశ్చర్యపడి,బ్రహ్మనుముందు పెట్టుకొని ధర్మారణ్యమునేచేరారు (8) అక్కడవేయిసంవత్సరాలు ముఖ్యమైనసత్రము (యజ్ఞం) ఆరంభించి, ఆంగిరసుని మార్కండేయుని ఆచార్యునిగాచేసుకొని, (9)మహామతియైన ఆతడు, అత్రినికశ్యపునిహోతగాచేసుకొని, జమదగ్నినిగౌతముని అధ్వర్యునిగాఏర్పరచారు. (10) భరద్వాజుడు, వసిష్ఠుడు ప్రత్యధ్వర్యులుగాఏర్పాటైనారు. నారదునివాల్మీకిని,నోదనకొరకు ఏర్పరచారు. (డ్రైవర్‌) (11) బ్రహ్మాసనమందు బ్రహ్మను ఆదరంతోఉంచారు. దేవతలునాలుగుకోసులంతవెడల్పువేదిని చేశారు. (12) యజ్ఞంలోజపంకొరకుద్విజులందరినిపిలిచారు. వారుబుక్‌యజున్‌సామఅధర్వవేదములను పలుకుతున్నారు. (13) గణనాధుని శంభుసుతుని, కార్తికేయుని, వజ్రధరుడైన, ఇంద్రుని, జయంతుని, చంద్రునిసూర్యుని (14) నలుగురు ద్వారపాలకులను శూరులనుదేవతలనుఏర్పరచారు. హవ్యవాహనుడు (అగ్ని) రక్షోఘ్నమంత్రముతోహోమంచేస్తున్నాడు (15) తిలలు, యువలు మధువు ఆజ్యముకలిపివేదమంత్రములతోఅప్పుడు ఆదేవతలు హోమంచేశారు ఓ నరేశ్వర (16).

మూ || ఆఘారావాజ్యభాగౌచహుత్వాచైవతతఃపరం | ద్రాక్షేక్షుపూగనారింగజంబీరంబీజపూరకం || 17 ||

ఉత్తరతోవాలికేరందాడిమంచయధాక్రమం | మధ్వాజ్యంపయసాయుక్తంకృశరశర్కరాయుతం || 18 ||

తండులైఃశతపత్రైశ్చయజ్ఞేవాచంనియమ్యచ | విచింత్యచమహాభాగాఃకృత్వాయజ్ఞంన దక్షిణం || 19 ||

ఉత్తమంచశుభంస్తోమంకృత్వాహర్షముపాయుయుః | అవారితాన్నమదదన్‌దీనాంథకృపణష్వపి || 20 ||

బ్రాహ్మణభ్యోవిశేషేణదత్తమన్నంయథేప్సితం | పాయసంశర్కరాయుక్తం పాయశాకసమన్వితం || 21 ||

మండకాపటాకాపూసాఃతథావైవేష్టికాఃశుభాః | సహస్రమోదకాశ్చాపిఫేణికాఘుర్ఘురాదయః || 22 ||

ఓదనశ్చతథాదాలీఆఢకీసంభవాశుభా | తథావైముద్గదాలీచపర్పటావటికాతధా || 23 ||

వ్రలేహ్యానివిచిత్రాణియుక్తాస్త్యూషణసంచయైః | కుల్మాషావేల్లకాశ్చైవకోమలావాలకాఃశుభాః || 24 ||

కర్కటికాశ్చార్ద్రయుతామరిచేనసమన్వితాః | ఏవంవిధానిచాన్నానిశాకానివినిధానిచ || 25 ||

భోజయిత్వాద్విజాన్‌సర్వాన్‌ధర్మారణ్యనివాసినః | అష్టాదశసహస్రాణినపుత్రాంశ్చతదానృప || 26 ||

ప్రతిదినంతదాదేవాభోజయంతిస్మవాడవాన్‌ | ఏవం వర్షసహస్రవైకృత్వాయజ్ఞంతదామరాః || 27 ||

కృత్వాదైత్యవధంరాజన్‌నిర్భయత్వమవాప్నుయుః | స్వర్గంజగ్ముస్తేసహసాదేవాఃసర్వేమరుద్గణాః || 28 ||

తథైవాప్సరసఃసర్వాబ్రహ్మవిష్ణుమహేశ్వరాః | కైలాసవిఖరంరమ్యంవైకుంఠంవిష్ణువల్లభం || 29 ||

బ్రహ్మలోకంమహాపుణ్యంప్రాప్యసర్వేదివౌకనః | పరంహర్షముపాగజ్ముఃప్రాప్యనందనముత్తమం || 30 ||

స్వేస్వేస్థానేస్థిరీభూత్వాతస్థుఃసర్వేహినిర్భయాః || 31 ||

తతఃకాలేసమాహతాకృతాఖ్యయుగపర్యయే | లోహానురోమదోన్మత్తోబ్రహ్మవేషధరఃసదా || 32 ||

తా || 2 ఆఘారములు (నెయ్యి అగ్నిలోచల్లటం) 2 ఆజ్యభాగములు హోమంచేసి, ఆపిదపద్రాక్ష, చెరుకుపోక, నారింగ, నిమ్మ, మాదిఫలములు (17) ఉత్తరంనుండి (తర్వాత) నారికేళముదాడిమయుయధాక్రమముగామధువు, ఆజ్యము పాలుపోసినవి నువ్వులు శర్కరగలవి (18) తండులములతో శతపత్రములతో (తామరపూలు) యజ్ఞములో మౌనంగా (మాటనుఅదుపులోఉంచుకొని) హోమంచేయాలి. మహాభాగులులోచించి, యజ్ఞమునుసదక్షిణముగాచేసి (19) ఉత్తమముగా శుభముగా యజ్ఞముచేసిఆనందమును పొందారు. ఎడతెగనిఅననమునుదీనుకులకుఅంధులకుకృపణులకు పెట్టారు. (20) విశేషించిబ్రాహ్మణులకు వారికోరికననుసరించి అన్నముపెట్టారు. శర్కరతోచేసినపాయసము, నేయిశాకములతో పాటుపెట్టారు. (21) మండకములు (కేకులవంటివి) వడియాలు, అపూపములు, మంచి గుమ్మడులు, వేయిలడ్డూలు, ఫేణీలు ఘుర్‌ ఘురాదులు (22) ఓదనము, కందిపప్పుతో చేసినది (దాలీ = దారీ = పగిలిన) శుభ##మైనది, అట్లాగే పెసరప్పుతోచేసినది పర్పటముతో (చేసిన) వటికలు (గడ్డితోని) (23) విచిత్రమైన లేహ్యములు శొంఠి, పిప్పళ్ళు, మిరియాలువేసి చేసినవి గుగ్గిళ్ళు కోమలమైన మిరియాలు, శుభ##మైనవారి కేళములు (24) అల్లంకలిగిన మిర్యాలు కూడిన దోసకాయకూర, ఈ విధమైన అన్నములు రకరకాలశాకములు (25) వీటితో బ్రాహ్మణులకు అందరికి భోజనంపెట్టి ధర్మారణ్యమందు నివసించేపద్దెనిమిదివేల, పుత్రసహితులైనబ్రాహ్మణులనుభుజింపజేయాలి. (26) ప్రతిదినముదేవతలు వాడవులను భుజింపచేస్తున్నారు. ఈవిధముగావేయిసంవత్సరాలుదేవతలుయజ్ఞంచేసి (27) పిదపదైత్యవధ చేసి నిర్భయత్వాన్ని పొందారు. వారు దేవతలంతా, మరుద్గణములు త్వరగా స్వర్గానికి వెళ్ళారు. (28) అట్లాగే అప్సరసలంతా బ్రహ్మవిష్ణుమహెశ్వరులువెళ్ళారు. రమ్యమైన కైలాసమునకు, విష్ణువల్లభ##మైనవైకుంఠమునకు, (30) తమతమస్థానాల్లోస్థిరులై అందరు నిర్భయులైఉన్నారు. (31) పిదపచాలాకాలంతరువాత మరో కృతయుగమందు లోహాసురుడు మదోన్మత్తుడు ఎప్పుడూ బ్రహ్మవేషంధరించేవాడు (32)

మూ || ఆగత్యసర్వాన్‌విప్రాంశ్చధర్షయేద్ధర్మవిత్తమాన్‌ | శూద్రాంశ్చవణిజశ్చైవదండఘాతేనతాడయేత్‌ || 33 ||

విధ్వంసయేచ్చయజ్ఞాదీన్‌హోమద్రవ్యాణిభక్షయేత్‌ | వేదికాదీర్ఘికాదృష్ట్వాకష్మలేనప్రదూషయేత్‌ || 34 ||

మూత్రోత్సర్గపురీషేణదూషయేత్పుణ్యభూమికాః | గహనేనతథారాజన్‌స్త్రియోదూషయతేహినః || 35 ||

తతస్తేవాడవాఃసర్వేలోహానురభయాతురాః | ప్రనష్టాఃసపరీవారాఃగతాస్తేవైదిశోదశ || 36 ||

పణిజస్తేభయోద్విగ్నావిప్రాననుయయుర్‌నృప | మహాభ##యేనసంభీతాదూరంగత్వావిమృశ్యచ || 37 ||

సహశూద్రైఃద్విజైఃసర్వేఏకీభూత్వాగతాస్తదా | ముక్తారణ్యంపుణ్యతమంనిర్జసంహియయుశ్చతే || 38 ||

నివాసంకారయామాసుఃనాతిదూరంసరేశ్వర | విజిఙ్‌నామ్నాహితద్గ్రామంవాసయామానురేవత్‌ || 39 ||

లోహాసురభయాద్రాజన్‌విప్రనామ్నావినిర్మితం | శంభునాపణిజాయస్మాత్‌తస్మాత్తన్నామధారణం || 40 ||

శంభుగ్రామమిత్యిఖ్యాతంలోకేవిఖ్యాతిమాగతం | అధకేచిద్భయాన్నష్టావణిజఃప్రధమంతదా || 41 ||

తేనాతిదూరేగత్వావైమండలంచక్రురుత్తమం | విప్రాగమనకాంక్షాస్తేతత్రవాసమకల్పయన్‌ || 42 ||

మండలేతిచనామ్నావైగ్రామంకృత్వాస్యవీపనన్‌ | విప్రసార్థపరిభ్రష్టాఃకేచిత్తుపణిజస్తదా || 43 ||

అన్యమార్గేగతాయేవైలోహానురభయార్దితాః | ధర్మారణ్యాన్నాతిదూరేగత్వాచింతాముపాయయుః || 44 ||

కస్మిన్‌మార్గేవయంప్రాప్తాకస్మిన్‌మార్గేద్విజాతయః | ఇతిచింతాంపరంప్రాప్తావానంతత్రత్వకారమన్‌ || 45 ||

అన్యమార్గేగతాయస్మాత్‌తస్మాత్తన్నామసంభవం | గ్రామంనివాసయామానుఃఅడాలంజమితిక్షితౌ || 46 ||

యస్మిన్‌గ్రామేనివాసీయోయత్సంజ్ఞశ్చవణిగ్భవేత్‌ | తస్యగ్రామస్యతన్నామహ్యభవత్‌పృథివీవతే || 47 ||

ఫణిజశ్చతధానిప్రామోహంప్రాప్తాభయార్దితాః | తస్మాన్మోహెతిసంజ్ఞాస్తేరాజన్‌సర్వేనిరబ్రువన్‌ || 48 ||

ఏవంప్రనషణంనష్టాస్తేగతాశ్చదిశోదశ | ధర్మారణ్యనతిష్టంతివాడవాపణిజో7పివా || 49 ||

ఉద్వసంహితదాజాతంధర్మారణ్యంచదుర్లభం | భూషణంసర్వతీర్థానాంకృతంలోహానురేణతత్‌ || 50 ||

నష్టద్విజంనష్టతీర్థంస్థానకృత్వాహిదానవః | పరాంముదమవాప్యూవజగామస్వాలయంతతః || 51 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్య్రాంసంహితాయాంతృతీయే బ్రహ్మఖండేపూర్వభాగేధర్మారణ్యమాహాత్మ్యే జ్ఞాతిభేదవర్ణనంనామత్రయో వింశో7ధ్యాయః || 23 ||

తా || వచ్చివిప్రులందరిని ధర్మవిత్తములనుభయపెడ్తాడు. శూద్రులను ఫణిజులను దండ(పుదెబ్బల)ముతో కొడ్తాడు. (33) యజ్ఞాదులు ధ్వంసంచేస్తాడు. హోమద్రవ్యాలుభక్షిస్తాడు. వేదికలను, బావులను చూచి కష్మలంతో పాడుచేస్తాడు. (34) పుణ్యభూములను మాత్రమువిడిచిపురీషముతోపాడుచేస్తాడు. ఓ రాజ! వాడు దుఃఖముతోస్త్రీలను దూషిస్తాడు. (35) అప్పుడు బాడబులందరులోహాసుర భయాతురులై, నష్టులైనపరివారులైనదిదిక్కులకువెళ్తారు. (36) ఆపణిజులు భయోద్విగ్నులై బ్రాహ్మణులనుఅనుసరిస్తారు. మహాభయంతో బాగాభయపడి దూరముపోయి, విచారించి (37) బ్రాహ్మణులతో, శూద్రులతో అందరు ఏకమై వెళ్ళారు. పుణ్యతమమైన ముక్తారణ్యమునకు నిర్జనమైనచోటికివారువెళ్ళారు. (38) ఓ నరేశ్వర! చాలా కొద్ది దూరంలో నివాసం ఏర్పరచుకున్నారు. ఆ గ్రామముపణిక్‌నామముతో పిలువడింది. వారు నివసిస్తున్నారు (39) లోహాసుర భయముతో విప్రనామముతోనిర్మితమైంది. పణిజులు నిర్మించారు. కాబట్టి ఆపేరుతో పిలిచాడు శంభువు (40) శుంభుగ్రామమనిలోకంలో ప్రసిద్ధమైంది. విఖ్యాతిని పొందింది. కొందరు భయంతో నష్టులైన పణిజులు మొదట (41) వారు కొద్ది దూరంపోయి ఉత్తమమైన గ్రామము ఏర్పరచారు. విప్రుల సహవాసంనకు దూరులైకొందరు పణిజులు (43) లోహానురభయార్దితులై వేరే మార్గమున పోయినవారు ధర్మారణ్యమునకు కొద్ది దూరంగా పోయి విచారించసాగారు. (44) మనం ఏ మార్గంలో వచ్చాము. ద్విజాతులు ఏ మార్గంలో వెళ్ళారు. అని చాలా చింతను పొంది అక్కడైతే నివసించారు (45) అన్యమార్గంలో వెళ్ళారు కాబట్టి ఆపేరొచ్చింది. ఈ భూమియందు అడాలంజమని గ్రామమును ఏర్పరచారు (46) ఏ గ్రామంలో నివసించే పణిజుడు ఏ పేరుగలవాడౌతాడో ఆ గ్రామమునకు ఆతనిపేరే ఏర్పడింది, ఓ పృథ్విపతి! (47) పణిజులు అట్లాగే విప్రులు భయార్దితులై మోహం పొందారు. అందువల్ల వారందరు మోహ అనే సంజ్ఞను పొందారు (48) ఇట్లా ప్రనాశము నశించారు. వారు పది దిక్కులకు వెళ్ళారు కూడా. ధర్మారణ్యమందు బాడబులుకాని పణిజులుకాని ఉండరు (49) అప్పుడు ధర్మారణ్యము వసించేవారు లేకుండా ఐంది. దుర్లభ##మైంది. సర్వతీర్థములకు భూషణమైంది. దాన్ని లోహాసురుడు అట్లాచేశాడు (50) నష్టద్విజము, నష్టతీర్థముగా ఆ స్థానాన్ని చేసి, దానవుడు అధికమైన ఆనందాన్ని పొంది పిదప తన ఇంటికి వెళ్ళాడు (51) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు జ్ఞాతిభేద వర్ణనమనునది ఇరువది మూడవ అధ్యాయము || 23 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters