Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువదిరెండవ అధ్యాయము

మూ || యుధిష్ఠిర ఉవాచ -

స్థానవాసిన్యోయోగిన్యఃకాజేశేనవినిర్మితాః | కస్మినస్థానేహికాదేన్యఃకీదృశ్యస్తావదస్వమే || 1 ||

వ్యాస ఉవాచ -

సర్వజ్ఞోసికులీనోసి సాధువృష్టంత్వయానఘ | కథయిష్యామ్యహం సర్వం అఖిలేనయుధిష్ఠిర || 2 ||

నానాభరణభూషాఢ్యానానారత్నోపశోభితాః | నానాససనసంవీతానానాయుధసమన్వితా || 3 ||

నానావాహసంయుక్తాఃనానాస్వరనినాదినీః | భయనాశాయవిప్రాణాంకాజేశేనవినిర్మితాః || 4 ||

ప్రాచ్యాంయామ్యాముదీచ్యాంచవ్రతీచ్యాంస్థాపితాహితాః | ఆగ్నేయాంనైఋతేదేశేవాయవ్యేశానయోస్తథా || 5 ||

ఆశాపురీచగాత్రాఈఛత్రాఈజ్ఞానజాతథా | పిప్పలాంబాతథాశాంతాసిద్ధాభట్టారికాతథా || 6 ||

కదంబావికటామీఠాసువర్ణావసుజాతథా | మాతంగీచమహాదేవీవారాహీముకుటేశ్వరీ || 7 ||

భద్రాచైవమహాశక్తిః సింహారాచమహాబలా | ఏతశ్చాన్యాశ్చబహవః కధితుంనైవశక్యతే || 8 ||

నానారూపధరాదేవ్యోనావావేషసమాశ్రితాః | స్థానాదుత్తరదిగ్భాగేఆశాపూర్ణాసమీపతః || 9 ||

పూర్వేతువిద్యతేదేవీఆనందానందదాయినీ | వసంతీచోత్తరేదేవ్యోనానారూపధరాముదా || 10 ||

ఇష్టాన్కామాన్దదాత్యేతాజలదానేసతర్పితాః | స్థానేనైఋతిదిగ్భాగేశాంతాశాంతిప్రదాయినీ || 11 ||

సింహోపరిసమాసీనాచతుర్హస్తావరప్రదా | భట్టారీచమహాశక్తిఃపునస్తత్తైవతిష్ఠతి || 12 ||

సంస్తుతాపూజితాభక్త్యాభక్తానాంభయనాశినీ|

స్థానాత్తుసప్తమేక్రోశేక్షేమలాభావ్యవస్థితా || 13 ||

సావిలేవమయీపూజ్యాచింతితాసిద్ధిదాయినీ | పూర్వస్యాందిశిలోకైస్తుబలిదానేసతర్పితా || 14 ||

అచింత్యరూపచరితాసర్వశత్రువినాశినీ | సంధ్యాయాఃత్రిషుకాలేషుప్రత్యక్షైవహిదృశ్యతే || 15 ||

స్థానాంత్తుసప్తమేక్రోశోదక్షిణావింధ్యవాసినీ | సాయుధారూపసంప్నాభక్తానాంభయహారిణీ || 16 ||

పశ్చిమేనింబజాదేవీతావద్భూమిసమాశ్రితా | మహాబలాసాదృష్టాపినయనానందదాయినీ || 17 ||

స్థానాదుత్తరదిగ్భాగేతావధ్భూమిసమాశ్రితా | శక్తిఃబహుసువర్ణాక్షాపూజితాసాసువర్ణదా || 18 ||

స్థానాద్వాయవ్యకోణచక్రోశమాత్రమితేశ్రితా | క్షేత్రధరామహాదేవీసమయేచ్ఛాగధారిణీ || 19 ||

పురాదుత్తరదిగ్భాగే క్రోశమాత్రేతుకర్ణికా | సర్వోపకారరతాస్థానోపద్రవనాశనీ || 20 ||

స్థానాన్నిర్‌ఋతిదిగ్భాగేబ్రహ్మాణీప్రముఖాస్తధా | నానారూపధరాదేవ్యోవిద్యంతే జలమాతరః || 21 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్‌ యమాహాత్మ్యే దేవతాస్థాపనంనామద్వా వింశో7ధ్యాయః || 22 ||

తా || స్థానవాసినులైన యోగినులు కాజేశునితోనిర్మింపబడ్డవారు ఎవరు. ఏ స్థానమందు ఏ దేవత వారెలాంటి వారు, నాకు చెప్పు అనగా (1) వ్యాసుని వచనము - సర్వజ్ఞుడవుకులీనుడవు. ఓ అనఘుడ నీవు బాగా అడిగావు. ఓ యుధిష్ఠిర! నేనంతా చెబుతాను మిగలకుండా (2) నానాఆభరణములతోభూషణములతో కూడిన వారు నానారత్నములతో శోభిస్తున్నవారు, రకరకాల వస్త్రములు ధరించినవారు, రకరకాల ఆయుధములుకలవారు (3) నానావాహనములు కలవారు నానాస్వరములతో గర్జించువారువిప్రుల భయనాశముకొరకుకాజేశులు నిర్మించారు (4) ప్రాచియందుదక్షిణమందు, పడమర ఉత్తరమందు వారిని ఏర్పరచారు. ఆగ్నేయనైఋతవాయవ్యీశానములందును కూడా (5) ఆశాపురీ, గాత్రా ఈ ఛత్రా ఈ జ్ఞానజా, పిప్పలాంబా, శాంతా, సిద్ధా భట్టారిక (6) కదంబ, వికటా, మీరా, సువర్ణా, వసుజా, మాతంగీ, మహాదేవీ, వారాహీముకుటేశ్వరీ (7) భద్రా, మహాశక్తి, సింహర, మహాబలావీరు ఇంతేకాక ఇతరులు అనేకమంది స్థాపించబడ్డారు చెప్పటానికి శక్తిచాలదు. (8) దేవతలు (స్త్రీలు) నానారూపధరులు నానావేషములనాశ్రయించినవారు స్థానమునుండి ఉత్తరదిగ్భాగమందు సమీపంలోఆకాశపుర్ణా (9) పూర్వమందు ఆనందానందదాయినిదేవి ఉంది. ఉత్తరమందు దేవతాస్త్రీలు నానారూపములు ధరించిఉన్నారు. (10) జలదానంతో తర్పితులైఇష్టమైనకోరికలనువీరిస్తారు నైఋతిదిగ్భాగమందు శాంతినిచ్ఛేశాంతుంది. (11) సింహముపై ఆసీనురాలు, నాల్గుచేతులుగలది, వరములనిచ్చేది భట్టారిమహాశక్తి అక్కడే ఉంది (12) స్తుతించినపూజించినభక్తిగలభక్తులకుభయమునునశింపచేస్తుంది. స్థానంనుండి ఏడవకోసు యందుక్షేమలాభఉంది. (13) ఆమెవిలేపనములతోనిండింది. పూజ్యమైనది. ధ్యానిస్తేచాలు సిద్ధినిప్రసాదిస్తుంది. పూర్వదిక్కుయందులోకములతో, బలిదానంతో తృప్తినందింపబడేదేవతపరివారంతో కూడినదైభక్తిముక్తులనుకల్గిస్తుంది. (14) అంచిత్యరూపము, చరిత్రగలది. సర్వశత్రువులనునశింపచేసేది. మూడుసంధ్యలందు ప్రత్యక్షంగా కన్పిస్తుంది. (15) స్థానంనుండిఏడవకోనుయందు దక్షిణమందు వింధ్యవాసిసి ఉంది. ఆయుధములుకలది. రూపముగలది. భక్తులభయముతీర్చేది (16) పశ్చిమమందు నింబంజదేవి అంతభూమినాశ్రయించింది. మహాబల ఆమెనుచూస్తేచాలు నయనములకు ఆనందంకల్గుతుంది. (17) స్థానమునకుఉత్తరదిగ్భాగమందు అంతభూమినాశ్రయించింది శక్తి. బహుసువర్ణముగలరుద్రాక్షలుగలది. ఆమెను పూజిస్తే ఆమెసువర్ణమునిస్తుంది. (18) స్థానమునుండి వాయువ్యకోణమందు కోసుదూరంలో ఆశ్రయించినది క్షేత్రధరామహాదేవి, సంకేతముగామేకనుధరించింది (19) పురమునకు ఉత్తరాదిగ్భాగమందు కోసుదూరంలోకర్ణికఉంది. అందరికి ఉపకారం చేయటంలో ఆసక్తురాలు. స్థానమందలిఉపద్రవముల నశింపచేసేది (20) స్థానమునుండినిర్‌ఋతిదిగ్భాగ మందుబ్రహ్మాణీ ప్రముఖులున్నారు. నానారూపములధరించిన దేవతలుజలమాతలు ఉన్నారు (21) అని శ్రీ స్కాందమహాపురాణమందు ఏకాశీతిసహస్రసంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందుధర్మారణ్య మాహౄత్మ్యమందుదేవతాస్థాపన మనునది ఇరువది రెండవ అధ్యాయము.

Sri Scanda Mahapuranamu-3    Chapters