Sri Scanda Mahapuranamu-3    Chapters   

పందొమ్మిదవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

ఇంద్రసరేనరః స్నాత్వా దృష్ట్వా చేంద్రేశ్వరం శివం | సప్త జన్మకృతాత్‌ పాపాత్‌ ముచ్యతే నాత్ర సంశయః || 1 ||

యుధిష్ఠిర ఉవాచ -

కేనచాదౌనిర్మితం తత్తీర్థం సర్వోత్తమోత్తమం | యథావద్వర్ణనం త్వంమే భగవాన్‌ ద్విజసత్తమ || 2 ||

వ్యాస ఉవచ -

ఇంద్రేణౖవ మహారాజ తపస్తప్తం సుదుష్కరం | గ్రామాదుత్తరదిగ్భాగే శతవర్షాణి తత్రవై || 3 ||

శివోద్దేశం మహాఘోరం ఏకాంగుష్ఠేన భారత | ఊర్థ్వబాహుః మహాతేజాః సూర్యస్యాభిముఖోభవత్‌ || 4 ||

వృత్రస్య వధతోజ్ఞాతం యత్పావంతస్య నుత్తయే | ఏకాగ్రః ప్రయతోభూత్వా శివస్యారాధనేరతః || 5 ||

తపసాచతదాశంభుఃతోషితః శశిశేఖరః | తత్రాజగామ జటిలోభస్మాం గోవృషభద్వజః || 6 ||

ఖట్వాంగీ పంచవక్త్రశ్చ దశబాహుః త్రిలోచనః | గంగాధరో వృషారూఢో భూతప్రేతాది వేష్టితః || 7 ||

సుప్రసన్నః సురశ్రేష్ఠః కృపాలుః పరదాయకః | తదాహృష్ఠ మనాదేవోదేవేంద్ర మిదమూచివాన్‌ || 8 ||

హర ఉవాచ -

యత్త్వం యాచ యసేదేవతదహం ప్రదదామితే || 9 ||

ఇంద్ర ఉవాచ -

యదితుష్టోసి దేవేశ కృపాసింధో మహేశ్వర | బ్రహ్మహత్యాహి మాందేవ ఉద్వేజయతినిత్యశః || 10 ||

వృత్రాసురస్యహననే జాతం పాపం సురోత్తమ | తత్పాపం నాశయ విభో మమదుఃఖప్రదం సదా || 11 ||

హర ఉవాచ -

ధర్మారణ్యసుర పతే బ్రహ్మహత్యాన పీడయేత్‌ | హత్యాగవాం ద్విజాతీనాం బాలస్యయోషితామపి || 12 ||

వచనాన్మమదేవేంద్ర బ్రహ్మణః కేశవస్యచ | యమస్య వచనాజ్జిష్ణోహత్యానైవాత్రతిష్ఠతి ప్రవిశ్యత్వం మహారాజ అతోత్ర స్నానమాచర || 13 ||

ఇంద్ర ఉవాచ -

యదిత్వం మమతుష్టోసి కృపాసింధో మహెశ్వర | మన్నామ్నాచ మహాదేవ స్థాపితో భవశంకర || 14 ||

తథేత్యుక్త్వా మహాదేవః సుప్రసన్నో హరస్తదా | దర్శయామాస తత్రైవ లింగం పాపప్రణాశనం || 15 ||

కూర్మపృష్ఠాత్సముత్పాద్య ఆత్మయోగేన శంభునా| స్థితః తత్రైవ శ్రీకంఠః కాలత్రయవిదోవిదుః || 16 ||

తా || వ్యాసుని వచనము - నరుడు ఇంద్ర సరంలోస్నానం చేసి ఇంద్రేశ్వర శివుని చూచిన ఏడు జన్మల నుండి చేసిన పాపము నుండి ముక్తుడౌతాడు. అనుమానము లేదు (1) యధిష్ఠిరుని వచనము - సర్వోత్తమోత్తమమైన ఆ తీర్థమును తొలుత ఎవరు నిర్మించారు. ఓ భగవాన్‌! ద్విజసత్తమ మీరు నాకు ఉన్నదున్నట్లుగా చెప్పండి. (2) వ్యాసుని వచనము - ఇంద్రుడే సుదుష్కరమైన తపమాచరించాడు, ఓ మహారాజ! గ్రామమునకు ఉత్తర దిగ్భాగంలో నూరు సంవత్సరాలు (3) శివుని ఉద్దేశించి ఒక కాలిబొటన వేలిమీద నిలబడి మహాఘోరమైన తపస్సు చేశాడు. ఆ మహాతేజుడు చేతులుపైకెత్తి సూర్యునకు అభిముఖుడైచేశాడు (4) వృత్రాసురుని చంపటంవల్ల వచ్చినపాపనివృత్తికొరకు, ఏకాగ్రమనస్కుడై పరిశుద్ధడైశివునిఆరాధనలోఆసక్తుడైనాడు (5) శశిశేఖరుడు, శంభువుఆతపస్సుతో అప్పుడుసంతుష్టుడైనాడు. అక్కడికి జటిలుడు (జడలుగల)భస్మముధరించినవాడు, వృషభధ్వజుడు, (6) ఖట్వాంగుడు, పంచవక్త్రుడుపదిచేతులుకలవాడు, త్రిలోచనుడు, గంగాధరుడు, వృషారూఢుడు, భూతప్రేతాదులతోచుట్టబడినవాడు (7) సుప్రసన్నుడు, సురశ్రేష్ఠుడు, కృపాళువు, వరదాయకుడు వచ్చాడు. సంతోషించిన ఆదేవుడు దేవేంద్రునితో ఇట్లా అన్నాడు (8) హరుని వచనము- ఓదేవ! నీవు యాచించేదానిని నేను నీకిస్తాను. (9) ఇంద్రుని వచనము - ఓ కృపాసింధు! మహెశ్వర! దేవశ, నీవు సంతోషిస్తే నన్ను ప్రతిరోజు బ్రహ్మహత్య బాధపెడుతోంది (10) వృత్రాసురుని చంపటంవల్ల వచ్చిన పాపమును ఎప్పుడూ నాకు దుఃఖం కల్గించే దాన్ని నశింపచేయి, ఓవిభు! (11) హరుని వచనము - ఓసురపతి ! ధర్మారణ్యంలో బ్రహ్మహత్య పీడించదు. ఆవులను, బ్రాహ్మణులను, పిల్లలను, స్త్రీలను వీరిని చంపిన పాపము పీడించదు (12) ఓ దేవేంద్ర! నామాట వలన బ్రహ్మ కేశవుల మాటల వలన యముని మాటవలన ఓ జిష్ణు హత్య ఇక్కడ ఉండదు. ఓ మహారాజ! నీవు ప్రవేశించి ఇక్కడ స్నానమాచరించు (13) అనగా ఇంద్రుని వచనము - ఓ కృపాసింధు, మహెశ్వర, నీవు నా విషయమందు తుష్టుడవైతే, ఓ మహాదేవ! శంకర, నా పేరుతో స్థాపించబడి ఉండు (14) ఆ మహాదేవుడు అట్లాగే కాని అని పలికి సుప్రసన్నుడైన హరుడు, అక్కడే పాపప్రణాశకమైన లింగరూపాన్ని చూపించాడు (15) తాబేలుడిప్ప నుండి పుట్టించి శంభువు ఆత్మయోగముతో అక్కడే ఉన్నాడు, శ్రీకంఠుడు, అని కాలత్రయ విదులు అన్నారు (16)

మూ || వృత్రహత్య సముత్రైస్త దేవరాజస్య సన్నిధౌ | ఇంద్రేశ్వరస్తదా తత్ర ధర్మారణ్య స్థితోనృప || 17 ||

సర్వపాపవిశుద్ధ్యర్థం లోకానాం హితకామ్యయా | ఇంద్రేశ్వరంతురాజేంద్ర పుష్పధూపాదికైః సదా || 18 ||

పూజయేచ్చనోభక్త్యా సర్వపాపైః ప్రముచ్యతే | అష్టమ్యాంచ చతుర్దశ్యాం మాఘమాసే విశేషతః || 19 ||

సర్వపాపవిశుద్ధ్యర్థం శివలోకేమహీయతే | నీలోత్సర్గంతుయోమర్త్యః కరోతిచతదగ్రతః || 20 ||

ఉద్ధరేత్సప్తగోత్రాణి కులమేకోత్తరంశతం | సాంగరుద్రజపం యస్తు చతుర్దశ్యాం కరోతివై || 21 ||

సర్వపాప విశుద్ధాత్మాలభ##తే పరమం పదం || 22 ||

సౌవర్ణన యనం కృత్వా మధ్యేరత్న సమన్వితం | యోదదాతి ద్విజాతిభ్యః ఇంద్రతీర్థే తథోత్తమే || 23 ||

అంధతానభ##వేత్తస్యజన్మానిషష్టిసంఖ్యయా | నిర్మలత్వం సదాతేషాం నయనేషు ప్రజాయతే మహారోగాస్తథా చాన్యేస్నాత్వాయాంతి తదగ్రతః || 24 ||

పూచితేచైకచిత్తేన సర్వరోగాత్ప్రముచ్యతే | స్నాత్వాకుండే నరోయస్తు సంతర్పయతియః పితౄన్‌ || 25 ||

తన్యతృప్తాః సదాభూవ పితరశ్చపితామహాః | యేవైగ్రస్తా మహారోగైః కుష్ఠాద్యైశ్చైవదేహినః || 26 ||

స్నానమాత్రేణ సంశుద్ధాః దివ్యదేహాభవంతితే | జ్వరాదికష్టమాపన్నరాః స్వాత్మహితాయవై || 27 ||

స్నానమాత్రేణ సంశుద్ధా దివ్యదేహాభవంతితే | స్నాత్వాచపూజయేద్దేవం ముచ్యతే జ్వరం బంధనాత్‌ || 28 ||

ఏకాహికం ద్వ్యాహికంచ చాతుర్థం వాతృతీయకం | విషమజ్వర పీడాచమాసపక్షాది కంజ్వరం || 29 ||

ఇంద్రేశ్వర ప్రసాదాచ్చనశ్యతేనాత్ర సంశయః | విజ్వరోజాయతే నూనం సత్యం సత్యంచ భూపతే || 30 ||

వంధ్యాచ దుర్భగానారీ కాకవంధ్యామృతప్రజా | మృతవత్సా మహాదుష్టా స్నాత్వా కుండే శివాగ్రతః పూజయే దేక చిత్తేనస్నాన మాత్రేణ శుద్ధ్యతి || 31 ||

ఏవంవిధాశ్చ బహుశో వరాన్‌ దత్వాపినాకథృత్‌ | గతో7సౌ స్వపురం పార్థసేవ్యమానః సురాసురైః || 32 ||

తతః శక్రోమహాతేజాగతోవై స్వపురంప్రతి | జయంతేనాపితత్రైవ స్థాపితం లింగముత్తమం || 33 ||

జయంతస్యహరస్తుష్టః తస్మిల్లింగేస్తుతః సదా | త్రికాలం పుత్రసంయుక్తః పూజనార్థం సురేశ్వరః || 34 ||

ఆయాతిచమహాబాహో త్యక్త్వాస్థానం స్వకంహివై | ఏతత్సర్వం సమాఖ్యాతం సర్వసౌఖ్య ప్రదాయకం || 35 ||

ఇంద్రేశ్వరేతుయత్పుణ్యం జయంతేశస్యపూజవాత్‌ | తదేవాప్నోతి రాజేంద్ర సత్యం సత్యంన సంశయః || 36 ||

స్నాత్వాకుండే మహారాజ సంపూజ్యైకాగ్రమానసః | సర్వపాపవిశుద్ధాత్మా ఇంద్రలోకే మహీయతే || 37 ||

యః శృణోతిసరోభక్త్యా సర్వపాపైః ప్రముచ్యతే | సర్వాన్‌ కామాన వాప్నోతి జయంతేశ ప్రసాదతః || 38 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే ఇంద్రేశ్వర జయంతేశ్వర మహిమ వర్ణనోనామ ఏకోన వింశో7ధ్యాయః || 19 ||

తా || వృత్రుని హత్యతో బాగా భయపడిన దేవరాజు సన్నిధిలో ఇంద్రేశ్వరుడు అప్పుడు అక్కడ ధర్మారణ్యంలో ఉన్నాడు, ఓ నృప! (17) సర్వపాపముల నుండి విశుద్ధి కొరకు, లోకములకు మేలు చేసే కొరకు ఉన్నాడు. ఓ రాజేంద్ర ఇంద్రేశ్వరుని ఎల్లప్పుడు పుష్పధూపాదులతో (18) భక్తితో పూజించిన నరుడు సర్వపాపముల నుండి ముక్తుడౌతాడు. అష్టమి యందు, చతుర్దశి యందు విశేషించి మాఘమాసమందు (19) సర్వపాపముల నుండి విశుద్ధి కొరకు పూజిస్తే శివలోకంలో వెలిగిపోతాడు. ఆతని ఎదుట జలతర్పణము చేసిన నరుడు (20) సప్తగోత్రములను ఉద్ధరిస్తాడు. కులములో నూటొక్కమందిని ఉద్దరిస్తాడు. చతుర్దశి యందు అంగములతో సహా రుద్ర జపము చేసినవారు (21) సర్వపాపముల నుండి విశుద్ధులై పరమ పదాన్ని పొందుతారు (22) బంగారు కన్ను చేసి మధ్యలో ఒకరాయిపెట్టి, దానిని ఉత్తమమైన ఇంద్రతీర్థంలో బ్రాహ్మణులకు దానం చేసినవారి (23)కి అరవైజన్మల వరకు గుడ్డి తనమురాదు. వారి కళ్ళలో ఎప్పుడూ నిర్మలత్వం ఉంటుంది. ఆతని ఎదుట స్నానం చేయగానే మహారోగములు అట్లాగే ఇతరమైనవి తొలగిపోతాయి (24) ఏకాగ్రచిత్తంతో పూజిస్తే అన్ని రోగముల నుండి ముక్తుడౌతాడు. నరుడు కుండంలో స్నానం చేసి పితరులకు తర్పణ చేస్తే (25) ఆతని పితరులు, పితామహులు, ఎల్లప్పుడూ తృప్తులౌతారు, ఓ భూవ! మహారోగములతో కుష్ఠాదులతో పీడింపబడిన ప్రాణులు (26) స్నానమాత్రంతో శుద్థులై వారు దివ్యదేహం కలవారౌతారు. జ్వరాది కష్టములను పొందిన నరులు తమ హితము కొరకు (27) స్నానం చేస్తే చేసినంత మాత్రంలో సంశుద్ధులైవారు. దివ్యదేహంకలవారౌతారు. స్నానం చేసి దేవుని పూజిస్తే జ్వర బంధనం నుండి ముక్తులౌతారు (28) ఒకరోజు జ్వరము రెండు రోజుల జ్వరము, నాల్గురోజుల కొచ్చే జ్వరము, మూడు రోజుల కొచ్చే జ్వరము, విషమ జ్వరపీడ, మాసజ్వరము, పక్షజ్వరము (29) ఇవన్నీ ఇంద్రేశ్వరుని ప్రసాదంవల్ల నశిస్తాయి. అనుమానంలేదు. జ్వరంలేనివాడౌతాడు. నిశ్చయము, ఓ భూపతి! సత్యము ఇది సత్యము (30) వంధ్య, దుర్భగ, కాకవంధ్య, మృతవ్రజ, మృతవత్స, మహాదుష్ట ఇట్టి స్త్రీలు శివుని ఎదుట ఈ కుండమందు స్నానం చేసి, ఏకాగ్ర చిత్తంతో పూజించాలి. స్నాన మాత్రంతో శుద్ధులౌతారు. (31) ఇటువంటి అనేక విధములైన వరములను ఇచ్చి, పినాకధారి, సురాసురులతో సేవించబడుతూ ఆతడు స్వపురమునకు వెళ్ళాడు, ఓపార్థ! (32) మహా తేజస్సు గల శక్రుడు పిదప తన పురమునకు వెళ్ళాడు. జయంతుడు కూడా అక్కడ ఉత్తమమైన లింగాన్ని స్థాపించాడు (33) హరుడు జయంతుని పూజకు తుష్టుడైనాడు. ఆలింగమును సదా స్తుతించాడు జయంతుడు. సురేశ్వరుడు త్రికాలమందు పుత్రునితో కూడినవాడై పూజించే కొరకు వస్తాడు (34) ఓ మహాబాహు! తన స్థానమును వదలి వచ్చి పూజిస్తాడు. సర్వసౌఖ్యప్రదాయకమైన ఇదంతా చెప్పాను (35) ఇంద్రేశ్వరుని పూజిస్తే ఎంతపుణ్యం వస్తుందో జయంతేశుని పూజిస్తే కూడా అంతపుణ్యమే వస్తుంది, ఓరాజేంద్ర! ఇది సత్యము, సత్యము అనుమానము లేదు (36) ఓ మహారాజ! కుండమందు స్నానంచేసి, ఏకాగ్రమానసుడై పూజించి, సర్వపాపముల నుండి విశుద్ధమైన ఆత్మకలవాడై ఇంద్రలోకంలో వెలుగొందుతాడు. (37) భక్తితో దీనిని విన్న నరుడు సర్వపాపముల నుండి ముక్తుడౌతాడు. సర్వకామములను పొందుతాడు. జయంతేశుని అనుగ్రహంవల్ల (38) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు ఇంద్రేశ్వర జయంతేశ్వర మహిమ వర్ణన మనునది పందొమ్మిదవ అధ్యాయము || 19 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters