Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదునేడవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

దక్షిణ స్థాపితారాజన్‌ శాంతాదేవీ మహాబలా | సావివిధాం బరధరా వనమాల విభూషితా || 1 |7

తామసీసామహారాజ మధుకైటభనాశినీ | విష్ణునాతత్రవైన్యస్తాశివపత్నీ నృపోత్తమ || 2 |7

సాచైవాష్టభుజారమ్యామేఘశ్యామా మనోరమా | కృష్ణాంబరధరా దేవీ వ్యాఘ్రవహన సంస్థితా || 3 ||

ద్వీపిచర్మ పరీధానా దివ్యాభరణ భూషితా | ఘంటాత్రిశూలాక్షమాలాకమండలు ధరాశుభా || 4 ||

అలంకృత భుజాదేవీ సర్వదేవ నమస్కృతా | ధనం ధాన్యం సుతాన్‌ భోగాన్‌ స్వభ##క్తే భ్యః ప్రయచ్ఛతి || 5 ||

పూజయేత్కమలైర్దివ్యైః కర్పూరాగరుచందనైః | తదుద్దేశేన తత్రైవ పూజయేద్ద్విజసత్తమాన్‌ || 6 ||

కుమారీః భోజయేదన్నైః వివిధైః భక్తి భావతః | ధూపైర్దీపైః ఫలైః రమ్యైః పూజయేచ్చనురాధిభిః || 7 ||

మాంసైన్తువివిధైః దివ్యైః అథవాధాన్యపిష్టజైః | అన్యైశ్చవివిధైః ధాన్యైః పాయసైః వటకైస్తథా || 8 ||

ఓదనైః కృశరావూపైః పూజయేత్సునమాహితః | స్తుతిపాఠేన తత్రైవ శక్తిస్తోత్రైః మనోహరైః || 9 ||

రివవస్తస్యనశ్యంతి సర్వత్ర విజయీభ##వేత్‌ | రణరాజకులేద్యూతేలభ##తే జయమంగలం || 10 ||

సౌమ్యాశాంతా మహారాజస్థాపితా కులమాతృకా | శ్రీమాతా సాప్రసిద్ధాచ మాహాత్మ్యం శృణుభూవతే || 1 ||

కులమాతా మహాశక్తిః తత్రాస్తే నృపసత్తమ | కుమారీ బ్రహ్మపుత్రీ సారక్షార్థం విధినాకృతా || 12 ||

స్థానమాతాచ సాదేవీ శ్రీమాతా సాభిధానతః | త్రిరూపాసాద్విజాతీనాం నిర్మితా రక్షణాయచ || 13 ||

కమండలు ధరాదేవీ ఘంటాభరణ భూషితా | అక్షమాలా యుతారాజన్‌ శుభాసాశుభరూపిణీ || 14 ||

కుమారీచాది మాతాచ స్థాన త్రాణ కరాపిచ | దైత్యఘ్నీకామదాచైవ మహామోహవినాశినీ || 15 ||

భక్తిగమ్యాచ సాదేవీ కుమారీ బ్రహ్మణం సుతా | రక్తాంబరధరా సాధురక్త చందన చర్చితా || 16 ||

రక్తమాల్యా దశభుజా పంచవక్త్రా సురేశ్వరా | చంద్రా వతంసి కామాతా సురాసురనమస్కృతా || 17 ||

సాక్షాత్‌ సరస్వతీ రూపారక్షార్థం విధినాకృతా | ఓంకారా సామహాపుణ్యా కాజేశేన వినిర్మితా || 18 ||

ఋషిభిః సిద్ధయక్షాది సురపన్నగ మానవైః | ప్రణమ్యాంఘ్రియుగా తేభ్యోదదాతి మనసేప్సితం || 19 ||

పాలయంతీచ సంస్థానం ద్విజాతీనాం హితాయవై | యథౌర సాన్‌సుతాన్‌మాతా పాలయంతీహనద్గుణౖః || 20 ||

అథపాలయతీ దేవీ శ్రీమాతా కులదేవతా | ఉపద్రవాణి సర్వాణి నాశ##యేత్సతతంస్తుతా || 21 ||

తా || వ్యాసుని వచనము - దక్షిణ మందు స్థాపించబడిన శాంతాదేవి, మహాబలవంతురాలు, ఓరాజ! ఆమె రకరకాల వస్త్రాలు ధరించేది, వనమాలతో అలంకరింపబడింది (1) ఆమె తామసి ఓ మహారాజ! ఆమె మధుకైటభనాశినీ శివపత్నియైన ఆమెను విష్ణువు అక్కడ ఉంచాడు (2) ఆమె ఎనిమిది చేతులు గలది, రమ్యమైనది, మేఘమువలె శ్యామల వర్ణము గలది, మనోరమమైనది నల్లని వస్త్రమును ధరించింది దేవి, వ్యాఘ్ర వాహనమందు కూర్చున్నట్టిది (3) ఏనుగు చర్మమును ధరించింది. (చుట్టుకుంది) దివ్య ఆభరణములతో అలంకృతమైంది. ఘంట, అక్షమాల, త్రిశూలము, కమండలువు వీటిని ధరించింది. శుభ##మైనది (4) అలంకరింపబడిన భుజములు కలది, దేవి, సర్వదేవతలతో నమస్కరింపబడినది, ఆమె ధనము, ధాన్యము, సుతులు, భోగములు తన భక్తులకు ఇస్తుంది (5) దివ్యమైన కమలములతో కర్పూర అగరు చందనములతో ఆమెను పూజించాలి. ధూదీపములతో మంచి పండ్లతో, సురాదులతో పూజించాలి (6) కుమారీల ను వివిధమైన అన్నములతో భక్తి భావంతో పూజించాలి. ధూపదీపములతో మంచి పండ్లతో, సురాదులతో పూజించాలి (7) దివ్యమైన వివిధమాంసములతో, లేదా పిష్టంవల్ల చేసిన వస్తువులో ధాన్యములతో, ఇతరములైన వివిధ ధాన్యములతో పాయసములతో వడియములతో (8) ఓదనములతో నువ్వులు బెల్లముకల అపూపములతో చక్కగా పూజించాలి. స్తుతి పారములుతో, మనోహరములైన స్తోత్రములతోశక్తినిపూజించాలి. (9) ఆతనిశత్రువులునశిస్తారు. అంతటవిజయంసాధిస్తాడు. రణమందు, రాజకుల మందు, ద్యూతమందు, జయమంగళమునుపొందుతాడు. (10) ఓమహారాజ! సౌమ్య, శాంత, కులమాతృకస్థాపించ బడింది. ఆమెశ్రీమాతాప్రసిద్ధమైంది. ఓ భూపతి ఆమెమాహత్మ్యాన్నివిను. (11) కులమాత, మహాశక్తికలది, ఓ నృపసత్తమ! అక్కడఉంది. ఆమెకుమారి, బ్రహ్మపుత్రిరక్షణకొరకువిధిఏర్పాటుచేశాడు. (12) ఆమెస్థానమాత. పేరు శ్రీమాత. ఆమెత్రిరూప, ద్విజాతులరక్షణకొరకు నిర్మింపబడింది. (13) ఆదేవికమండలువుధరించి, ఘంటాభరణములతో అలంకరింపబడింది. అక్షమాలకలది, ఆమెశుభ##మైనది. ఆమెరూపముశుభ##మైనది. (14) కుమారి, ఆదిమాత, స్థానమందురక్షించేది కూడా. దైత్యులనుచంపేది, కోరికలనిచ్చేది. మహామోహమునునశింపచేసేది (15) ఆదేవి భక్తిగమ్యమైనది. కుమారి, బ్రహ్మకుపుత్రి. రక్తవస్త్రముధరించింది. మంచిరక్తచందనముతో పూయబడింది. (16) రక్తమాలగలది, పదిచేతులుకలదిఐదుముఖములుకలది, దేవతలకీశ్వరి, చంద్రునితలలోభూషణముగాగలది, మాతా. సురలతోఅసురులతోనమస్కరింపబడేది (17) సాక్షాత్తుసరస్వతిరూపముగలది, రక్షణకొరకువిధి ఏర్పరచాడు. ఆమెఓంకారము, మహాపుణ్యమైనది. కాజేశుడునిర్మించాడు. (18) ఋషులు, సిద్ధయక్షులు, సురలుపన్నగులు, మానవులుమొదలగువారితోనమస్కరించ తగిన పాదయుగళముగలది. వారిమనసులోనికోరికనుఇస్తుంది. (19) బ్రాహ్మణ జాతిహితము కొరకు సంస్థానమును పాలిస్తోంది. మంచి గుణములతో తల్లి తన స్వంతపుత్రులను రక్షించేట్లుగా రక్షిస్తుంది. (20) దేవి, శ్రీమాత, కులదేవత, రక్షిస్తుంది ఎప్పుడూస్తుతిస్తూఉంటేసర్వ ఉపద్రవములనునశింపచేస్తుంది. (21)

మూ || సర్వవిఘ్నోపశమనీశ్రీమాతాస్మరణనహి | వివాహేచోపవీతేచసీమంతేశుభకర్మణి || 22 ||

సర్వేషుభక్తకార్యేషుశ్రీమాతాపూజ్యతేసదా | యథాలంబోదరందేవంపూజయిత్వాసమారభేత్‌ || 23 ||

కార్యంశుభంసర్వమపిశ్రీమాతరంతథానృప | యత్కించిద్భోజనంత్వత్రబ్రాహ్మణభ్యఃప్రయచ్ఛతి || 24 ||

అథవానినివేద్యంచక్రియతేయత్పరస్పరం | అనివేద్యచతాంరాజన్‌ కుర్వాణోవిఘ్నమేష్యతి || 25 ||

తస్మాత్తసై#్యనివేద్యాథతతఃకర్మసమారభేత్‌ | తద్వరేణాఖిలంకర్మఅవిఘ్నేనహిసిద్ధ్యతి హేమంతేశిశిరేప్రాప్తేపూజయేద్ధర్మపుత్రికాం || 26 ||

హేమపాత్రేసమాలిఖ్యరాజతేవాథకారయేత్‌ | పాదుకాంచోత్తమాంరాజన్‌శ్రీమాతాయైనివేదయేత్‌ || 27 ||

స్నాత్వాచైవశుచిర్భూత్వాతిలామలకమిశ్రతైః | వాసోభిఃసుమనోభిశ్చదుకూలైఃసుమనోహరైః || 28 ||

లేవయేచ్చందనైఃశుభ్రైఃకుంకుమైఃసింధురాసకైః |

కర్పూరాగరుకస్తూరీమిశ్రితైఃకర్దమైస్తధా || 29 ||

కర్థికారైశ్చకల్హారైఃకరవీరైఃసితారుణౖః | చంపకైఃకేతకీభిశ్చజపాకుసుమకైస్తథా || 30 ||

యక్షకర్ధమకైశ్చైవబిల్వవత్రైరఖండితైః

పాలాశజాతిపుష్టైశ్చవటకైర్మాషసంభ##వైః | పూవభక్తాదిదాలీభిఃతోషయేచ్ఛాకసంచయైః || 31 ||

ధూపదీపాదిపూర్వంతుపూజయేజ్జగదంబికాం

తద్ధియైవకుమారీర్వైవిప్రానపిచభోజయేత్‌ | పాయసైఃఘీతముక్తైశ్చశర్కరామిశ్రితైఃనృప || 32 ||

పక్వాన్నైఃమోదకాద్యైశ్చతర్పయేద్భక్తిభావతః | తర్ప్యమాణద్విజైకస్మిన్‌ సహస్రఫలమశ్నుతే || 33 ||

దైత్యానాంఘాతకంస్తోత్రం వాచయేచ్చపునఃపునః | ఏకాగ్రమానసోభూత్వాశ్రీమాతరంస్తువీయయః || 34 ||

తస్యతుష్టావరందద్యాత్‌స్నాపితాపూజితాస్తుతా | అనిష్టానిచసర్వాణి నాశ##యేద్ధర్మపుత్రికా || 35 ||

అపుత్రోలభ##తేపుత్రాన్‌నిర్దానోధనవాన్‌భ##వేత్‌ | రాజ్యార్థీలభ##తేరాజ్యంవిద్యార్థీలభ##తేచతాం || 36 ||

శ్రేయోర్థీలభ##తేలక్ష్మీంభార్యార్థీలభ##తేచతాం | ప్రసాదాచ్చసరస్వత్యాలభ##తేనాత్రసంశయః || 37 ||

అంతచే పరమం స్థానంయత్సురైరపిదుర్లభం | ప్రాప్నోతిపురుషోనిత్యంసరస్వత్యాఃప్రసాదతః || 38 ||

ఇతి శ్రీస్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయె బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే శ్రీమాతామాహాత్మ్యవర్ణసంనామసప్తదశో7ధ్యాయః || 17 ||

తా || అన్నివిఘ్నములను తొలగించేది, శ్రీమాతనుతలచుకుంటేచాలు. వివాహము, ఉపవీతము, సీమంతము, శుభకర్మలు, (22) వీనియందు భక్తులఅన్నికార్యములందుశ్రీమాతఎప్పుడూ పూజింపబడుతుంది. దేవునిలంబో దరుని, పూజచేసికర్మారంభించినట్లే (23) శుభకార్యములన్నిటిలో శ్రీమాతనుపూజించిఆరంభించాలి. ఓ నృప. బ్రాహ్మణులకు ఏకొంచెము భోజనముగాని పెట్టినా (24) లేదా పరస్పరమునివేదనచేసి నానత్ఫలితమిస్తుంది. ఆమెకు నివేదించ కూడచేస్తే విఘ్నాన్ని పొందుతారు (25) అందువల్ల ఆమెకునివేదించిఆపి దవకర్మారంభించాలి. ఆమెవరంతో కర్మలన్ని అవిఘ్నంగా సిద్ధిస్తాయి. హేమంతము, శిశిరకాలమువస్తేధర్మపుత్రికనుపూజించాలి. (26) బంగారు పాత్ర యందుగాని, వెండి పాత్రయందు గాని ఆమెబొమ్మనుగీసిపూజించాలి. ఉత్తమమైనపాదుకనుశ్రీమాతకునివేదించాలి. (27) నువ్వులు, వుసిరితో కూడిన నీటిలో స్నానంచేసిశుచియై వస్త్రములతో, పూలమాలతో మనోహరమైనదు కూలములతోపూజించాలి. (28) శుభ్రమైన చందనములు పూయాలి. కుంకుమతో సిందురాసకముతో, కర్పూరము, అగురు, కస్తూరి వీటితో కూడిన బురదతో పూయాలి (29) కర్ణికారములతో కల్హారములతో తెల్లని ఎర్రని కరవీరములతో (గన్నేరు) చంపకములతో మొగిలి పూలతో జపాకు సుమములతో (30) యక్షకర్దమములతో (కర్పూరము, అగరు చందనము, కస్తూరి, తక్కోలము, కుంకుమ పువ్వు వీనితో చేయబడిన పూత వస్తువు) ఖండింపబడని బిల్వపత్రములతో పాలాశజాతి పుష్పములతో పూజించాలి. మినుములతో చేసిన వడియములతో, అపూవము, అన్నము, మొదలగు వానితో దానిమ్మలతో(ఏలకులతో) శాకసంచయములతో సంతోషపరచాలి (31) జగదంబికను ధూపదీపాది పూర్వకముగా పూజించాలి. ఆమె బుద్ధితోనే కుమారీలను, బ్రాహ్మణులను భుజింపచేయాలి. ఓనృప! నేతితోకూడిన పాయసములతో శర్కరతో కూడిన వానితో (32) వక్వాన్నములతో మోదకాదులతో భక్తి భావంతో తృప్తి పరచాలి. ఒక్కొక్క బ్రాహ్మణుడు తృప్తిపడితే దానికి వేయింతలు ఫలము పొందుతారు (33) దైత్యఘాతక స్తోత్రమును (దుర్గాసప్తశతి) మాటి మాటికి చదువాలి. ఏకాగ్ర మనస్కుడై శ్రీమాతను స్తుతించినవా (34)రికి సంతసించి వరమిస్తుంది. ఆమెకు స్నానం చేయించినా, పూజించినా స్తుతించినా వరమిస్తుంది. సర్వ అరిష్టములను నశింపచేస్తుంది. ధర్మపుత్రిక (35) సంతానహీనుడు సంతానాన్ని పొందుతాడు. ధనహీనుడు ధనవంతుడౌతాడు. రాజ్యం కోరేవాడు రాజ్యం పొందుతాడు. విద్యను కోరేవాడు, విద్యను పొందుతాడు. సరస్వతి ప్రసాదం వల్ల (అనుగ్రహం) పొందుతాడు, అనుమానము లేదు (36) శ్రేయోర్ధి లక్ష్మిని పొందుతాడు. భార్యను కోరేవాడు భార్యను పొందుతాడు. సరస్వతి ప్రసాదం వల్ల (అనుగ్రహం) పొందుతాడు అనుమానము లేదు (37) దేవతలకు కూడా దుర్లభ##మైన వరమమైన స్థానమును చివరి దశలో పొందుతాడు నిత్యము. సరస్వతి అనుగ్రహం వల్ల నరుడు పొందుతాడు (38) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మ ఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్య మందు శ్రీ మాతా మహాత్మ్య వర్ణన మనునది పదునేడవ అధ్యాయము || 17 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters