Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదనాల్గవ అధ్యాయము

మూ || యుధిష్టిర ఉవాచ

కృపాసింధో మహాభాగ సర్వవ్యాపిన్‌ సురేశ్వర | కదాహ్య త్రత పస్తప్తం విష్ణునామిత తేజసా || 1 ||

స్కందాయ కథితంచైవ శ##ర్వేణచ మహాత్మనా | అనుపూర్వ్యేణ సర్వంహి కథయ స్వత్వమేవహి || 2 ||

వ్యాస ఉవాచ -

శృణు వత్సప్రవక్ష్యామి ధర్మారణ్య నృపోత్తమ | ఏకదాత్ర తపస్తప్తం విష్ణు నామిత తేజసా || 3 ||

స్కంద ఉవాచ -

కథందేవనరోనామ పంపాచంపాగయాతథా | వారాణస్యధికాచైవకథమశ్వముఖోహరిః || 4 ||

ఈశ్వర ఉవాచ-

అత్రనారాయణోదేవః తపస్తేపే సుదుష్కరం | దివ్యవర్షశతం త్రీణి జాతః సుష్ట్వాన నశ్చనః || 5 ||

తపస్తే పేమహావిష్ణుః సురూపార్థంచ పుత్రక | వాజిముఖక్షహరిస్తత్ర సిద్ధస్తానే మహాద్యుతే || 6 ||

స్కంద ఉవాచ -

కారణంబ్రూహినోద్యత్వమశ్వాసనః కథంహరిః | మహారిశపోశ్చ హంతాచ దేవదేవో జగత్పతిః || 7 ||

యస్యనామ్నా మహాభాగ పాతకానిబహూన్యపి | విలీయంతే తువేగేన తమః సూర్యోదయే యథా || 8 ||

శ్రూయంతే యస్యకర్మాణి అద్భుతాస్యద్భుతానివై | సర్వేషామేవజీవానాం కారణం పరమేశ్వరః || 9 ||

ప్రాణరూపేణ యోదేవో హయరూపః కథంభ##వేత్‌ | సర్వేషామపితంత్రాణాం ఏకరూపః ప్రకీర్తితః || 10 ||

భక్తిగమ్యో ధర్మభాజాం సుఖరూపః సదాశుచిః | గుణాతీతోపినిత్యోసౌ సర్వగో నిర్గుణస్తథా || 11 ||

ప్రష్టాసౌ పాలకోహంతా అవ్యక్తః సర్వదేహినాం | అనుకూలో మహాతేజాః కస్మాదశ్వముఖోభవత్‌ || 12 ||

యస్యరోమోద్భవా దేవా వృక్షాద్యాః పన్నగాఃనగాః | కల్పేకల్పే జగత్సర్వం జాయతే యస్య దేహతః || 13 ||

స ఏవ విశ్వప్రభవః స ఏవాత్యంత కారణం | యేనానీతాః పునర్విద్యాయ జ్ఞాశ్చ ప్రలయంగతాః || 14 ||

ఘాతితో దుష్టదైత్యోసౌ వేదార్థం కృత ఉద్యమః | ఏవమాసీన్మహా విష్ణుః కథమశ్వముఖోభవత్‌ || 15 ||

రత్నగర్భాధృతాయేన పృష్ఠదేశేచలీలయా | కృత్యావ్యవస్థితం సర్వం జగత్ఛావరజంగమం || 16 ||

సదేవో విశ్వరూపోవైకథంవాజిముఖోభవత్‌ || 16 1/2 ||

తా || యుధిష్టిరుని వచనము - ఓ కృపాసింధు, మహాభాగ, సర్వవ్యాపి, సురేశ్వర, అమిత తేజస్సంపన్నుడైన విష్ణువు ఇక్కడ తపస్సెప్పుడు చేశాడు (1) శర్వుడైన మహాత్ముడు స్కందునకు చెప్పిన దానిని వరు సక్రమంగా అంతా నీవే చెప్పు (2) అనగా వ్యాసుని వచనము - ఓ వత్స! చెప్తున్నాను విను. ఓ నృపోత్తమ! ధర్మారణ్య మందు ఒకసారి అమిత తేజస్సంపన్నుడైన విష్ణువు తపమాచరించాడు. (3) స్కందుని వచనము - పంప, చంప, గయ వారాణాసివీని కన్న దేవనరము ఎట్లా అధికమైంది. విష్ణువు అశ్వముఖుడు ఎట్లా ఐనాడు. (4) ఈశ్వరుని వచనము - ఇక్కడ నారాయణుడు దేవుడు సుదుష్కరమైన తపమాచరించాడు. మూడు వందల దేవతల వర్షములు తపమాచరించాడు. మంచి ముఖము కలవాడుగా ఆతడైనాడు (5) ఓ పుత్రక! మహా విష్ణువు! మంచి రూపము కొరకు తపమాచరించాడు. మహాద్యుతి గల సిద్ధస్థానమందు హరి అక్కడ అశ్వముఖుడైనాడు (6) స్కందుని వచనము - మాకీవేళ హరి ఏ కారణంగా అశ్వముఖుడైనాడో, ఎట్లా ఐనాడో చెప్పండి. మహా రివుల సంహరించే దేవదేవుడు, జగత్పతి ఎట్లా ఇట్లా ఐనాడు (7) ఓ మహాభాగ! అనేక పాతకములు గూడా అతని నామంతో నశిస్తాయి. చాలా వేగంగా సూర్యోదయమందు చీకట్లు తొలగిపోయినట్లుగా (8) ఆతని కర్మలు అద్భుతములు, అద్భుతాద్భుతములు అని వింటాము అన్ని జీవులకు పరమేశ్వరుడే కారణము (9) ప్రాణ రూపంగా ఉన్న ఆ దేవుడు హయ రూపుడెట్లా ఐనాడు. అన్ని తంత్రములకు ఒకే రూపుడని చెప్పబడ్డాడు (10) ధర్మాను సారులకు భక్తి గమ్యుడు, సుఖరూపుడు, సదాశుచి గుణాతీతుడు, నిత్యుడు, సర్వగుడు, నిర్గుణుడు (11) ఈతడు స్రష్ట, పాలకుడు, హంత, అవ్యక్తుడు, అన్ని ప్రాణులకు అనుకూలుడు. మహా తేజస్సంపన్నుడు అట్టివాడు ఎందువల్ల అశ్వముఖుడైనాడు (12) అతని రోమముల నుండి దేవతలు, వృక్షములు మొదలగునవి, పన్నగములు ఉద్భవించాయి. ఈ జగత్తంతా ప్రతికల్ప మందు అతని శరీరం నుండి పుడ్తోంది. (13) ఆతడే విశ్వప్రభువు. ఆతడే అత్యంత కారణము. ప్రలయ మందిన విద్యలను యజ్ఞములను ఆతడు తిరిగి తెచ్చాడు (14) వేదముల కొరకు ప్రయత్నించి దుష్టదైత్యుని ఆతడు సంహరించాడు. ఇంతటి మహావిష్ణువు ఎట్లా అశ్వముఖుడైనాడు. (15) రత్నగర్భయైన భూమిని వృష్ఠదేశమందు అవలీలగా ధరించి స్థావర జంగమాత్మకమైన జగత్తును అంత చక్కగా ఉంచినవాడు (16) ఆ దేవుడు, విశ్వరూపుడు ఎట్లా ఎట్లా అశ్వముఖుడైనాడు (16 1/2)

మూ || హిరణ్యాక్షస్యహంతా యోరూపం కృత్వా వరాహజం || 17 ||

సుపవిత్రం మహాతేజాః ప్రవిశ్య జలసాగరే | ఉద్ధృతాచ మహీ సర్వా ససాగర మహీధరా || 18 ||

ఉద్ధృతాచ మహీసూనం దంష్ట్రాగ్రే యేనలీలయా | కృత్వారూపం వరాహంచ కపిలంశోకనాశనం || 19 ||

సదేవః కథమీశానోహయగ్రీవత్వ మాగతః | ప్రహ్లాదార్థేనచేశానో రూపంకృత్వా భయావహం || 20 ||

నారసింహం మహాదేవం సర్వదుష్టనివారణం | పర్వతాగ్ని సముద్రస్థం రరక్షభక్త సత్తమం || 21 ||

హిరణ్య కశిపుందుష్టం జఘానరజనీముఖే | ఇంద్రాసనేచ సంస్థాప్య ప్రహ్లాదస్య సుఖప్రదం || 22 ||

ప్రహ్లాదార్థేచ వైనూనం నృసింహత్వముపాగతః | విరోచన సుత స్యాగ్రే యాచకోసౌభ##వేత్తదా || 23 ||

యజ్ఞేచైవాశ్వమేధే వైబలినాయః సమర్చితః | హృతావసుమతీతస్యత్రిపదీకృత రోదసీ || 24 ||

విశ్వరూపేణ వైయేన పాతాలేక్ష పితోబలిః | త్రిః సప్తవారం యేనైవ క్షత్రియానవ నీతలే || 25 ||

హత్వాదదాచ్చ విప్రేభ్యో మహీమతి మహౌజసా | ఘాతితోహైహయో రాజాయే నైవ జననీ హతా || 26 ||

యేనవైశిశునోర్వ్యాంహిఘాతితా దుష్టచారిణీ | రాక్షసీతాడకానామ్నీ కౌశికస్య ప్రసాదతః || 27 ||

విశ్వామిత్రస్య యజ్ఞేతు యేసలీలీనృదేహినా | చతుర్దశ సహస్రాణి ఘాతితా రాక్షసాబలాత్‌ || 28 ||

హతాశూర్పణ భాయేన త్రిశిరాశ్చని పాతితః | సుగ్రీవం వాలినం హత్వా సుగ్రీవేణ సహాయవాన్‌ || 29 ||

కృత్వాసేతుం సముద్రస్యరణహత్వాదశాననం | ధర్మారణ్యం సమాసాద్య బ్రాహ్మణా నన్వపూజయత్‌ || 30 ||

శాసనం ద్విజవర్మేభ్యో దత్వా గ్రామాన్‌ బహుంస్తథా | స్నాత్వాచైవ ధర్మవాప్యాం సుదానాన్యదదాత్‌గవాం || 31 ||

సాధునాం పాలనంకృత్వాని గ్రహాయ దురాత్మనాం | ఏవమన్యాని కర్మాణి శ్రుతానిచ ధరాతలే || 32 ||

సదేవో లీలయా కృత్వా కథంచాశ్వముఖోభవత్‌ | యోజాతో యాదవేవంశే పూతనాశకటాదికం || 33 ||

అరిష్ట దైత్యః కేశీచ వృకాసురబకాసురౌ | శకటాసురో మహాసురస్తృణా వర్తశ్చ ధేనుకః || 34 ||

మల్లశ్చైవ తథా కంసోజరా సంధస్తథైవచ |

కాలయవనస్య హంతాచ కథవై సహాయాననః | తారకాసురం రణ జిత్వా అయుతషట్‌పురం తథా || 35 ||

కన్యాశ్చో ద్వాహితాయేన సహస్రాణిచ షట్‌దశ | అమానుషాణి కృత్వేత్థం కథంసోశ్వముఖోభవత్‌ || 36 ||

త్రాతాయః సర్వభక్తానాం హంతా సర్వదురాత్మనాం | ధర్మస్థాపన కృత్పోపి కల్కిర్‌ విష్ణు వదేస్థితః || 37 ||

ఏతద్వైమహదాశ్చ ర్యం భవతాయత్‌ ప్రకాశితం | ఏత దాచక్ష్వమేసర్వం కారణం త్రిపురాంతక || 38 ||

తా || వరాహరూపమును ధరించి హిరణ్యాక్షని సంహరించినవాడు (17) మహాతేజ స్వంతుడు, సుపవిత్ర రూపంతో జలసాగరము ప్రవేశించి, సాగరములతో పర్వతములతో కూడిన భూమినంతా ఎత్తినవాడు (18) దంష్ట్రాగ్రమందు అవలీలగా భూమినెత్తినవాడు, కపిల (ఎర్రని) వరాహరూపము ధరించి శోకము నశింపచేసిన (19) ఆ దేవుడు, ఈశానుడు హయగ్రీవుడెట్లా ఐనాడు. ఆ ఈశానుడు ప్రహ్లాదునికొరకు భయావహరూపమును ధరించి (20) సర్వదుష్టుని వారకమైన మహాదైవమైన నారసింహరూపం ధరించి పర్వత అగ్ని సముద్రము లందున్న భక్త సత్తముని రక్షించాడు (21) సంధ్యాకాలమందు దుష్టుడైన హిరణ్యక శివుని సంహరించాడు. ప్రహ్లాదునకు ఆనందాన్ని కల్గించే ఇంద్రాసన మందు ఆతణ్ణి ఉంచాడు. (22) ప్రహ్లాదుని కొరకు నృసింహ రూపాన్ని ధరించాడు. విరోచనుని ఎదుట ఈతడు యాచకుడైనాడు . (23) అశ్వమేథ యజ్ఞమందు బలితో పూజింపబడి ఆతని భూమిని లాగుకున్నాడు రోదస్సు అంతా మూడు పాదములుగా కొలువబడింది. (24) విశ్వరూపమెత్తి బలిని పాతాళానికి పడతోశాడు. ఇరువది ఒక్క మారులు భూమి యందలి క్షత్రియులను (25) చంపి భూమిని, గొప్ప ఓజస్సుతో బ్రాహ్మణులకు ఇచ్చాడు. హైహయవంశపురాజును చంపాడు తన తల్లిని చంపాడు (26) బాలుని రూపంలో ఉండి దుష్ట నడవడికగల తాడక అనుపేరు గల రాక్షసిని విశ్వామిత్రుని అనుగ్రహం వలన ఈ భూమిపై చంపాడు (27) లీలామానుషరూపధారియై విశ్వామిత్రుని యజ్ఞమందు పదునాలుగు వేలమంది రాక్షసులను బలంతో చంపాడు (28) శూర్పణఖను చంపాడు త్రిశురులను చంపాడు. సుగ్రీవుని కారణంగా వాలిని చంపి, సుగ్రీవుని సహాయం పొంది (29) సముద్రంపై సేతువును నిర్మించి, రణంలో దశాననుని చంపి, ధర్మారణ్యమునకు వచ్చి బ్రాహ్మణులను పూజించాడు. (30) బ్రాహ్మణులకు అనేక గ్రామములను దానముచేసి, శాసనాధికారము ఇచ్చి, ధర్మ వాపి యందు స్నానం చేసి, గోవులను దానం చేశాడు. (31) దురాత్ములను నిగ్రహించి, సాధువులను పాలించి, ఇట్లాగే ఇతర కర్మలు ఈ భూమిపై చేశాడని విన్నాము (32) అవలీలగా విలాసం కొరకు చేసిన ఆ దేవుడు అశ్వముఖుడెందుకైనాడు. యాదవ వంశంలోపుట్టి పూతన శకటాదులను చంపి (33) అరిష్టం కల్గించేదైత్యుని కేశుని వృకాసుర బకాసురులను చంపి, శకటాసుర, మహాసుర, తృణావర్త, ధేనుకులను చంపి (34) మల్లులను, కంస జరాసంధులను, కాలయవనుని చంపినవాడు హయాననుడు ఎట్లా ఐనాడు. రణమందు తారకాసురుని జయించి, అయుతుని షట్‌ పురములను జయించి (35) పదహారువేల కన్యలను వివాహమాడిన, ఈ విధముగా అమానుషముల నాచరించిన అతడు అశ్వముఖుడు ఎట్లా ఐనాడు (36) భక్తులందరిని రక్షించేవాడు దురాత్ములందరిని సంహరించేవాడు, ధర్మాన్ని స్థాపించే ఆకల్కి కూడా విష్ణు పదమందున్నాడు (37) మీరు చెప్పింది చాలా ఆశ్చర్యకరమైన అంశము. ఓ త్రిపురాంతక ! దీనికంతకూ కారణమును నాకు చెప్పండి (38)

మూ || శ్రీ రుద్ర ఉవాచ -

సాధువృష్టం మహాబాహో కారణం తస్యవచ్మ్యహం | హయగ్రీవస్య కృష్ణస్య శృణుష్వేకాగ్రమాసనం || 39 ||

వ్యాస ఉవాచ -

పురాదేవైః సమారభ్థోయజ్ఞోసూనం ధరాతలే | వేదమంత్రై రాహ్మయితుం సర్వేరుద్ర పురోగమాః || 40 ||

వైకుంఠేచ గతాః సర్వే క్షీరాబ్థౌచని జాలయే | పాతాలేపి పునర్గత్వాన విదుః కృష్ణ దర్శనం || 41 ||

మోహావిష్ణాస్తతః సర్వే ఇతశ్చేతశ్చధావితాః | నైవదృష్టస్తదాత్తెస్తు బ్రహ్మరూపో జనార్దనః || 42 ||

విచారయంతితే సర్వేదేవా ఇంద్రపురోగమాః | క్వగతోసౌ మహావిష్ణుః కేనోపాయేన దృశ్యతే || 43 ||

ప్రణమ్యశిరసాదేవం వాగీశం ప్రోచురాదరాత్‌ | దేవదేవ మహావిష్ణుం కథయస్వ ప్రసాదతః || 44 ||

బృహస్పతి రువాచ -

నజానేకేన కార్యేణ యోగారూఢో మహాత్మవాన్‌ | యోగరూపోభవద్విష్ణుః యోగీశోహరిరచ్యుతః || 45 ||

క్షణం ధ్యాత్వాస్వమాత్మానం ధిషణన ఖ్యాపితోహరిః | తత్ర సర్వేగతా దేవాయత్ర దేవో జగత్పతిః || 46 ||

తదాదృష్టో మహావిష్ణుః ధ్యానస్థోసౌ జనార్దనః | ధ్యాత్వాకృత్య సమాకారం సశరందైత్య సూదనం || 47 ||

సమాస్థానం తతో దృష్ట్వా బోధోపాయం ప్రచక్రమే | అహంతాంశ్చత దావమ్ర్యోధనుర్గుణం ప్రయత్నతః

ఛేత్స్యంతి చేత్తచ్ఛబ్దేన ప్రభుధ్యేత హరిః స్వయం || 48 ||

దేవా ఊచుః -

గుణ భక్షం కురుథ్వంవై యేనా సౌబుథ్యతే హరిః | క్రత్వర్థినోవయం వమ్ర్యః ప్రభుం విజ్ఞాపయామహే || 49 ||

వమ్ర్య ఊచుః -

నిద్రా భంగం కథాచ్ఛేదం దంపత్యోర్‌ మైత్రభేదనం | శిశు మాతృవిభేదం వాకుర్వాణో నరకం ప్రజేత్‌ || 50 ||

యోగారూఢో జగన్నాధః సమాధి స్థోమహాబలః | తస్యశ్రీ జగదీశస్య విఘ్నం నై వతుకుర్మహే || 51 ||

బ్రహ్మోవాచ -

భవతాం సర్వభక్షత్వం దేవకార్యం క్రియేత చేత్‌ | కర్తవ్యంచతతోపమ్ర్యోయజ్ఞ సిద్ధిర్య థాభ##వేత్‌

వమ్రీశా సాతదావత్స పునరేవము వాచ హ || 52 ||

వమ్ర్యువాచ -

దుఃఖసాధ్యో జగన్నాధో మలయానిల సన్నిభః | కథం వాబోధ్యతాం బ్రహ్మన్‌ అస్మాభిః సుర పూజితః || 53 ||

నైవయజ్ఞేనమే కార్యం సురైశ్చైవతథైవచ | సర్వేషు యజ్ఞకార్యేషు భాగంద దతుమే మరాః || 54 ||

దేవా ఊచుః -

ప్రదాస్యామోవయం వమ్ర్యైభాగం యజ్ఞేషు సర్వదా | యజ్ఞాయదత్తమ స్మాభిః కురుషై#్వవం వచోహినః || 55 ||

తథేతివిధినాప్యుక్తం వమ్రీ చోద్యమమాశ్రితా | గుణభక్షాదికం కర్మతయా సర్వం కృతం నృప || 56 ||

యుధిష్ఠిర ఉవాచ -

అన్యవాబోధనే దేవా గుణభంగే సమాధిషు | ఏతాదాశ్చర్యం విప్రర్షే సత్యం సత్యవతీ సుత || 57 ||

వ్యాస ఉవాచ -

వ్యగ్రచిత్తాః సురాః సర్వే అకృష్టం హరి కార్ముకం | నజానే కేనకార్యేణ విష్ణుమాయా విమోహితాః || 58 ||

ముదితాస్తాః ప్రముంచంతి వాల్మీకం చాగ్రతోహరేః | కోటిపార్శ్వేతతో నీతం వాల్మీకం పర్వతోపమం || 59 ||

గుణచ భక్షితే తస్మిన్‌ తత్‌క్షణాదేవ దూషితే | జ్యాఘాత కోటిభిః సార్థం శీర్షం ఛిత్వా ది సంగతం || 60 ||

గతే శీర్షే చతే దేవా భృశముద్విగ్న మానసాః ధావంతి సర్వతః సర్వే శిర అలోకనాయతె || 61 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే విష్ణు శిరోనాశో నామ చతుర్దశోధ్యాయః || 14 ||

తా || శ్రీ రుద్రుని వచనము - ఓ మహాబాహు ! బాగా అడిగావు. దానికి కారణాన్ని చెపుతాను. హయగ్రీవ కృష్ణుని కథను చెబుతాను. ఏకాగ్రమానసుడవై విను (39) వ్యాసుని వచనము - పూర్వం దేవతలు భూమిపై యజ్ఞమారంభించారు. రుద్రుడు మొదలగువారు అందరు వేదమంత్రములతో పిలువసాగారు. (40) అందరు వైకుంఠానికెళ్ళారు. తన నివాసమైన క్షీరాబ్థికి వెళ్ళారు. పాతాళమునకు కూడా వెళ్ళినారు. ఐనా కృష్ణ దర్శనము కాలేదు (41) మోహావిష్ణులై అందరు ఇటు అటు పరుగెత్తారు. వారికి బ్రహ్మరూపుడైన జనార్దనుడు కన్పించలేదు. (42) ఇంద్రుడు మొదలుగా గల దేవతలందరు ఆలోచించసాగారు. ఈ మహా విష్ణువు ఎక్కడికెళ్ళాడు. ఏ ఉపాయంతో ఈతనిని చూడగలుగుతాము (43) తలవంచి బృహస్పతికి నమస్కరించి ఆ దేవునితో ఇట్లా అన్నారు. ఓ దేవదేవ: మహావిష్ణువు ఎక్కడున్నాడో దయతో చెప్పండి. (44) అనగా బృహస్పతి వచనము - మహాత్ముడు, ఏ కారణముగా యోగ రూఢుడైనాడో తెలియదు. యోగీశ్వరుడు అచ్యుతుడైన హరి, విష్ణువు యోగ రూపుడైనాడు (45) క్షణకాలము తన ఆత్మలో ధ్యానించి బృహస్పతి విస్ణువు స్థానాన్ని తెలిపాడు. జగత్పతియైన దేవుడు ఉన్నచోటికి దేవతలంతా వెళ్ళారు (46) ధ్యానమందున్న ఆ జనార్ధనుని విష్ణువును వారు చూచారు. కృత్యవంటి ఆకారముగల, చేత శరము ధరించిన రాక్షసులను చంపే దానిని స్మరించగా (47) అది వచ్చి ఆ సభను చూచి విష్ణువును మేల్కొలిపే మార్గాన్ని చెప్పింది. చెద పురుగులు అల్లిత్రాడును ప్రయత్నంతో ఛేదిస్తే ఆ శబ్దంతో హరి స్వయంగా మేల్కొంటాడు అని వారితో అప్పుడు చెప్పింది (48) దేవతల వచనము - హరి మేల్కొనేట్లుగా మీరు ధనుర్గుణమున తినండి. ఓ చెదపురుగులార! మేము యజ్ఞం కొరకు ప్రభువునకు విన్నవించుకుంటాము (49) అనగా చెదపురుగులు ఇట్లా అన్నాయి. నిద్రాభంగం, కథలో అడ్డుచెప్పడం, ఆలుమగల స్నేహాన్ని భగ్నం చేయటం, తల్లి పిల్లలను వేరు చేయటం వీటిని చేసేవారు నరకానికి పోతారు (50) జగన్నాథుడు యోగా రూఢుడైనాడు. సమాధి యందున్నాడు. ఆతడు మహాబలుడు. ఆ జగదీశునకు విఘ్నం కల్గించలేము (51) అనగా బ్రహ్మవచనము - ఈ దేవతల పనిని మీరు చేస్తే మీకు అన్నింటిని భక్షించే శక్తి వస్తుంది. యజ్ఞసిద్ధి అయ్యేట్టుగా చెయ్యండి. ఓ చెదపురుగులార! ఓవత్స! ఆ చెదపురుగుల నాయకురాలు మళ్ళా ఇట్లా అంది (52) వమ్రి వచనము - జగన్నాథుడు దుఃఖ సాధ్యుడు. మలయానిలము వంటివాడు. దేవతలతోపూజనందే ఆతనినిమేమెట్లా లేపాలి, ఓ బ్రహ్మన్‌ (53) నాకు యజ్ఞంతో పనిలేదు. నాకు దేవతలతో పనిలేదు. ఓ దేవతలార! అన్ని యజ్ఞకార్యములలో నాకు భాగమివ్వండి (54) అనగా దేవతలిట్లన్నారు. యజ్ఞములలో ఎల్లప్పుడు మనం వమ్రికి భాగము ఇద్దాము. యజ్ఞము కొరకు ఇచ్చిన దానిలో మేం భాగం ఇస్తాము. మా మాటను చెప్పినట్లు చేయి అనగా (55) బ్రహ్మకూడా సరే అని అన్నాడు. వమ్రి తన పనిని ఆరంభించింది. గుణ భక్షణము మొదలుగా కర్మనంతా అది చేసింది, ఓ నృప! (56) యుధిష్ఠిరుని వచనము - సమాధిలో ఉన్న ఈతనిని లేపటానికి దేవతలు గుణభంగంచేయించటం, ఇది సత్యంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓ ప్రవర్షి! సత్యవతీసుత! (57) వ్యాసుని వచనము - వ్యగ్రచిత్తులై (భయం) దేవతలంతా హరికార్ముకమును లాగారు. ఏ కారణంగా విష్ణుమాయా విమోహితులైనారో తెలియదు (58) వారు ఆనందంతో విష్ణువు ఎదుట పుట్టను వదలసాగారు. పిదప పర్వతమంతైన పుట్టను, ధనుస్సు కోటి (కొప్పు) పక్కకు తీసుకెల్ళారు (59) గుణమును తినివేయగా ఆ క్షణంలోనే అది చెడిపోగా, అల్లితాడు, బాణము, కొప్పులతో పాటు తలతెగి స్వర్గానికి పోయింది (60) తలతెగిపోగా ఆ దేవతలంతా చాలా కలత చెందిన మనసు కలవారై, వారంతా తలను వెతికేకొరకు అన్ని దిక్కుల పరుగెత్తారు (61) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్య మాహాత్మ్యమందు విష్ణుశిరోనాశమనునది పదునాల్గవ అధ్యాయము || 14||

Sri Scanda Mahapuranamu-3    Chapters