Sri Scanda Mahapuranamu-3    Chapters   

పన్నెండవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

తతోదేవైఃనృపశ్రేష్ఠరక్షార్థంసత్యమందిరం | స్థాపితంతత్తదాద్యైవనత్యాభిఖ్యాహిసాపురీ || 1 ||

పూర్వంధర్మేశ్వరోదేవోదక్షిణసగణాధివః | పశ్చిమేస్థాపితోభాగుఃఉత్తరేచస్వయంభువః || 2 ||

యుధిష్ఠిర ఉవాచ -

గణశఃస్థాపితఃకేనకస్మాత్‌స్థాపితవాససౌ | కింనామాసౌమహాభాగతన్మేకథయమాచిరం || 3 ||

వ్యాస ఉవాచ -

అధునాహంప్రవక్ష్యామిగణశోత్పత్తికారణం || 4 ||

సమయేమిలితాఃసర్వేదేవతామాతరస్తధా| ధర్మారణ్యమహారాజస్థాపితశ్చండికాసుతః || 5 ||

ఆదౌదేవైఃనృపశ్రేష్ఠభూమౌవైతస్యయోషితాం | ప్రాకారశ్చాభవత్తత్రపతాకాధ్వజశోభితః || 6 ||

బ్రాహ్మణాయతనేతత్రప్రాకారమండలాంతరే | తస్యధ్యేరచితంపీఠంఇష్టకాభిఃసుశోభితం|| 7 ||

వ్రతోల్యశ్చచతస్రోవైశుద్ధాఏవసతోరణాః | పూర్వేధర్మ్యేశ్వరోదేహోదక్షిణగణనాయకః || 8 ||

పశ్చిమేస్థాపితోభానుఃఉత్తరేచస్వయంభువః | ధర్మేశ్వరోత్పత్తివృత్తమాఖ్యాతంతత్త వాగ్రతః || 9 ||

అధునాహంప్రవక్ష్యామిగణశోత్పత్తిహేతుకం | కదాచిత్పార్వతీగాత్రోద్వర్తనంకృత వత్యభూత్‌ || 10 ||

మలంతజ్జనితందృష్ట్వాహస్తేధృత్వాస్వగాత్రజం | ప్రతిమాంచతతఃకృతవ్‌ఆసురూంచద దర్శహ || 11 ||

జీవంతస్యాంచసంచార్య ఉదతిష్ఠత్తదగ్రతః | మాతరంసతదోవాచకింకరోమితవాజ్ఞయా || 12 ||

పార్వత్యువాచ -

యావత్‌జ్ఞానంకరిష్యామితావత్త్వంద్వారితిష్ఠమే | ఆయుధానిచసర్వాణిపరశ్వాదీనియానితు || 13 ||

త్వయితిష్ఠతిమద్ద్వారేకోపివిఘ్నంకరోతున | ఏవముక్తోమహాదేవ్యాద్వారే తిష్ఠత్ససాయుధః || 14 ||

ఏతస్మిన్నంతరేదేవోమహాదేవోజగామహ | ఆభ్యంతరేప్రవేష్టుంచమతిందధ్రేమహశ్వరః|| 15 ||

ద్వారస్థేనగణశేనప్రవేశోదాయితస్యన | తతఃక్రుద్ధోమహాదేవఃపరస్పరమయుధ్యత || 16 ||

యుద్ధంకృత్వాతతోశ్చోభౌపరస్పరవదైషిణౌ | పరశుంజఘ్నింవాన్‌దేవలలాటేపరమేశుభం || 17 ||

తతోదేవోమహాదేవఃశూలముద్యమ్యచాహనత్‌ | శిరశ్ఛిచ్ఛేదశూలేనతద్భూమౌనిపపాతహ|| 18 ||

తందృష్ట్వాపతితంపుత్రంపార్వతీప్రరురోదహ | హాహాకారోమహానాసీత్‌తదాతత్రనిపాతితే|| 19 ||

తా || వ్యాసునివచనము - ఓనృపశ్రేష్ఠ! దేవతలు సత్యమందిరమును రక్షణకొరకు ఏర్పరచారు. అది మొదటిదే. ఆనగరం పేరు స్థారకమైనట్టిదే (1) తూర్పున ధర్మేశ్వరుని ఆలయము. దక్షిణ మందు గణాధిపతి, పశ్చిమమందు సూర్యుడు స్థాపించబడ్డాడు. ఉత్తరమందు స్వయంభువుడు (2) యుధిష్ఠిరునివచనము - గణశుని ఎవరుస్థాపించారు. ఎందుకు అతనిని స్థాపించారు. ఓమహాభాగ! స్థాపించినవానిపేరేమి. ఆలసించకుండా నాకు చెప్పండి. అనగా (3) వ్యాసవచనము - ఇప్పుడు నీకు నేను గణోత్పత్తికారణమును చెప్తున్నాను. (4) ఆచారము ప్రకారము దేవతలు మాతలు అంతకలిశారు! ఓమహారాజ ధర్మారణ్యమందు చండికాసుతుని స్థాపించారు. (5) ఓనృపశ్రేష్ఠ! సత్యయోషితులభూమి యందు దేవతలుదీనిని నిర్మించారు. పతాకములుధ్వజములతో శోభిస్తూప్రాకారము గూడాఏర్పడింది. (6) ప్రాకారమండలముల మధ్యబ్రాహ్మణుల ఆయ తన మందు, వాని మధ్యి ఇటుకలతో బాగాశోభిస్తున్న పీఠాన్ని రచించారు. (7) శుద్ధమైన, తోరణములుగల నాలుగు రాజ మార్గములు ఏర్పరచబడ్డాయి. పూర్వమందు ధర్మేశ్వరుడు దక్షిణమందు గణనాయకుడు (8) పశ్చిమమందు భానువు ఉత్తరమందు స్వయంభువువు స్థాపించబడ్డారు. ధర్మేశ్వరోత్పత్తి వృత్తాంత కథను మీ ముందు చెప్పాను (9) గణశ ఉత్పత్తి హెతువును ఇప్పుడు నేను చెప్తున్నాను. ఒకసారి పార్వతి శరీరమును నలుగుపిండి పెట్టుకోసాగింది. (10) అందువల్ల పుట్టిన, తన శరీరం నుండి వచ్చిన మలమును చూచి దానిని చేత థరించి దానితో సురూపమైన ప్రతిమను చేసి చూసింది (11) అందులో ప్రాణం పోసింది. అది ఆమె ఎదురుగా నిల్చుంది. అప్పుడు అతడు తల్లితో ఇట్లన్నాడు. మీ ఆజ్ఞతో నేనేం చేయాలి, అని (12) పార్వతి వచనము-నేను స్నానం చేసే వరకు నీవు నా ద్వారమందుండు, అని పరశు మొదలుగా గల ఆయుధములన్ని (13) నా ద్వారమందు నీవుండగా తోడుంటాయి. ఎవరు విఘ్నం చేయరాదు అనగా మహేదేవి ఇట్లా పులుకగా ఆతడు సాయుధుడై ద్వారమందున్నాడు (14) ఇంతలో దేవుడైన మహాదేవుడు వచ్చాడు. మహేశ్వరుడు లోపలికి ప్రవేశించటానికి మతిలో తలచాడు (15) ద్వారమందున్న గణశుడు ఆతనికి ప్రవేశాన్ని కల్గించలేదు. అప్పుడు కోపగించిన మహాదేవుడు, ఆతడు పరస్పరము యుద్దము చేశారు (16) యుద్ధముచేసి వారిద్దరు ఒకరినొకరు చంపదలిచారు. శివుని లలాటమందు పరమమైన దాని యందు పరశువుతో కొట్టాడు (17) అప్పుడు మహాదేవుడు శూలమెత్తి కొట్టాడు. శూలంతో శిరస్సును ఛేదించాడు. ఆతల భూమిపై పడింది (18) పడిపోయిన కొడుకును చూచి పార్వతి దుఃఖించింది. అప్పుడు ఆతడు అక్కడ పడగా పెద్ద హాహాకారమైంది (19).

మూ || పార్వతీంవికలాందృష్ట్వాదేవదేవోమహేశ్వరః | చింతయామాసదేవోపి కింకృతంవా ముధామయా || 20 ||

ఏతస్మిన్నంతరే తత్ర గజాసురమవశ్యత | తందృష్ట్వాచ మహాదైత్యం సర్వలోకైక పూజితః || 21 ||

జఘ్నివాంస్తచ్ఛిరోగృహ్య పార్వత్యాకృత మర్భకం | ఉత్తస్థౌ సగణస్తత్ర మహాదేవస్య సన్నిధౌ || 22 ||

తతోనామచకారాన్య గజానన ఇతిస్ఫుటం | సురాః సర్వేచ సంవృక్తా హర్షితా మునయస్తథా || 23 ||

స్తువంతిస్తుతిభిః శశ్వత్‌ కుటుంబకుశలంకరం | విక్రీణాతి కుటుంబం యోమోదకార్థం సమర్చకే || 24 ||

దక్షిణస్యాం వ్రతోల్యాం తమేకదంతం చపీవరం | ఆర్చయచ్చ మహాదేవం స్వయంభూః సురపూజితం || 25 ||

జటిలం వామనం చైవనాగయజ్ఞోపవీతకం | త్ర్యక్షం చైవమహాకాయం కరథ్వజ కుఠారకం || 26 ||

దధానం కమలం హస్తే సర్వవిఘ్న వినాశనం | రక్షణాయచలోకానాం నగరాద్ధక్షిణాశ్రితం|| 27 ||

సుప్రసన్నం గణాధ్యక్షం సిద్ధిబుద్ధి నమస్కృతం | సింధూరాభం సురేశ్రేష్ఠం తీవ్రాంకురధరంశుభం || 28 ||

శతపుషై#్పః శుభైః అర్చితం హ్యమరాధివః | ప్రణమ్యచ మహాభక్త్యా తుష్టుపుస్తం సురాస్తతః || 29 ||

దేవా ఊచుః -

నమస్తేస్తు సురేశాయ గణానాం పతయేనమః గజానన నమస్తుభ్యం మహాదేవాధిదైవత || 30 ||

భక్తిప్రియాయదేవాయ గణాధ్యక్ష నమోస్తుతే | ఇత్యేతైశ్చశుభైః స్తోత్రైః స్తూయమానోగణాధిపః

సుప్రీతశ్చ గణాధ్యక్షః తదాసౌవాక్య మబ్రవీత్‌ || 31 ||

గణాధ్యక్ష ఉవాచ -

తుష్టోహం వోసురాబ్రూత వాంఛి తంచదదామివః || 32 ||

దేవా ఊచుః

త్వమత్రస్థోమహాభాగ కురుకార్యంచనః ప్రభో - ధర్మారణ్యచ విప్రాణాం పణిగ్జన నివాసినాం || 33 ||

బ్రహ్మచర్యాది ముక్తానాం ధార్మికాణాం గణశ్వర | వర్ణాశ్రమేతరాణాం చరక్షితా భవసర్వదా || 34 ||

త్వత్ర్పనదాన్మహాభాగధనసౌఖ్యయుతాద్విజాః | భవంతు సర్వేసతతం వణిజశ్చ మహాబలాః || 35 ||

రక్షిత వ్యాస్త్వయాదేవ యావచ్చం ద్రార్కమేదినీ | ఏవమస్త్వితి సోవాదీత్‌ గణనాథోమహేశ్వరః || 36 ||

దేవాశ్చహర్షమాపన్నాః పూజయంతి గణాధివం | తతోదేవా ముదాయుక్తాఃపుష్పధూపాది తర్పణౖః || 37 ||

యేచాన్యే మనుజాలోకే నిర్విఘ్నార్థంచ పూజయన్‌ || 38 ||

వివాహోత్సవ యజ్ఞేషు పూర్వమారాధితోభ##వేత్‌ | ధర్మారణ్యోద్భవానాంచ ప్రసన్నో భవసర్వదా || 39 ||

ఇతి శ్రీ స్కాంద మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగేగణశ ప్రస్థాపనా వర్ణనం నామద్వాదశోధ్యాయః || 2 ||

తా || వికలమైన పార్వతిని చూచి దేవదేవుడైన మహేశ్వరుడు, దేవుడు తానుకూడా చింతించసాగాడు. వ్యర్థంగా నేను ఎంతపని చేశాను అని (20) ఇంతలో అక్కడ గజాసురుని చూచాడు. సర్వలోకైక పూజితుడు ఆ మహాదైత్యుణ్ణి చూచి (21) పార్వతిచేసిన ఆ పిల్లవానిని తీసుకొని వాని శిరస్సుపై కొట్టాడు వాడు చచ్చాడు. ఆ మహాదేవుని సన్నిధి యందు ఆ గణపతి లేచాడు (22) పిదప ఆతనికి గజాసనుడనే పేరును పెట్టాడు. దేవతలంతా కూడాను ఆనందించారు. మునులుకూడా హర్షించారు (23) కుటుంబమునకు కుశలమును చేసే అతనిని స్తోత్రములతో ఎప్పుడూ స్తుతిస్తున్నారు. మోదకముల కొరకు అర్చనకు తనకుటుంబమును అమ్ముకునే ఆ ఏకదంతుని, బలిసిన వానిని, దక్షిణ రాజమార్గమందు పూజించి స్వయంభువుడు, దేవతల పూజనందిన మహాదేవుని అర్చించాడు (25) జడలుగలవాడు, వామనుడు, నాగము యజ్ఞోపవీతముగా గలవాడ. మూడు కన్నుల వాడు, మహాకాయమువాడు, రెండు చేతులలో గొడ్డలి గలవాడు (26) చేతకమలమున ధరించినవాడు, సర్వవిఘ్నములను నశింపచేసేవాడు, లోకరక్షణకొరకు నగరమునకు దక్షిణ దిక్కు నందున్నవాడు (27) సుప్రసన్నుడు, గణాధ్యక్షుడు, సిద్ధిబుద్ధులతో నమస్కరింపబడేవాడు, సింధూరము వంటివాడు, దేవతాశ్రేష్ఠుడు తీవ్రమైన అంకుశము ధరించినవాడు, శుభుడు (28) ఐన ఆతనిని అందరు నూరు పూలతో శుభ##మైన పూలతో అర్చించారు. అట్లా అర్చించబడ్డ వానిని, అమరాధిపుడు మహాభక్తితో నమస్కరించాడు. పిదప ఆతనిని దేవతలు స్తుతించారు. (29) దేవతల వచనము - సురేశునకు నమస్కారము, గణములకు పతియైన వానికి నమస్కారము. గజానన! నీకు నమస్కారము. మహాదేవునకు ఆదిదేవతమైనవాడ (30) భక్తికి ప్రీతి చెందేవాడ, దేవ, గణాధ్యక్ష నీకు నమస్కారము. ఈ విధమైన శుభ##మైన స్తోత్రములతో గణాధిపుని స్తుతించగా, ఆనందించి గణాధ్యక్షుడు ఇట్లా పలికాడు (31) గణాధ్యక్షుని వచనము - ఓ దేవతలార ! మీ విషయంలో నేను తుష్టుడనైనాను. మీ వాంఛితమేమిటో చెప్పండి. మీ వాంఛితాన్ని ఇస్తాన. అనగా (32) దేవతలిట్లన్నారు - ఓ మహాభాగ! నీవిక్కడ ఉండి మా కార్యాన్ని నెరవేర్చు. ధర్మారణ్య మందుసన విప్రుల, పణిక్‌ జనుల (33) బ్రహ్మచర్యాది యుక్తుల, ధార్మికుల, వర్ణాశ్రమేతరుల రక్షకుడవుగా ఎల్లప్పుడూ ఉండు, ఓ గణశ్వర (34) నీ అనుగ్రహం వల్ల ద్విజులు ధనసౌఖ్యయుతులై, ఓ మహాభాగ! ఉండనీ మహాబలులైన వణిజులను అందరిని ఎప్పుడూ (35) నీవు రక్షించు ఓదేవ! చంద్రుడు సూర్యుడు భూమి ఉన్నంతకాలము రక్షించు అని అనగా ఆ మహేశ్వరుడు గణనాథుడు అట్లాగే కానిమ్మని ఆతడు పలికాడు (36) దేవతలు ఆనందపడి గణాధిపుని పూజించసాగాడు. పిదప దేవతలు ఆనందపడి పుష్పము ధూపము మొదలగు తర్పణములతో (37) పూజించారు. లోకంలోని ఇతరులైన మనుజులు నిర్విఘ్నము కొరకు పూజించాలి (38) వివాహ ఉత్సవ యజ్ఞములందు తొలుత ఈతనిని ఆరాధించాలి. ధర్మారణ్యోద్భవులకు ఎల్లప్పుడూ ప్రసన్నుడవుకమ్ము (39) అని శ్రీ స్కాంద మహా పురాణ మందు ఏకాశీతి సహస్ర సంహితయందు మూడవదైన బ్రహ్మఖండమందు పూర్వ భాగమందు గణశ ప్రస్థాపన వర్ణన మనునది పన్నెండవ అధ్యాయము || 12 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters