Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదనొకండవ అధ్యాయము

మూ || యుధిష్ఠర ఉవాచ-

అతఃపరంకిమభవత్‌బ్రవీతుద్విజసత్తమ | త్వద్వచనామృతంపీత్వాతృప్తిర్నాస్తిమమప్రభో ||1||

వ్యాస ఉవాచ -

అథకించిద్గతేకాలేయుగాంతసమయేసతి | త్రేతాదౌలోలజిహ్వాక్షఅభవద్రాశ్‌క్షసేశ్వరః ||2||

తేనవిద్రావితంసర్వంత్రైలోక్యంసచరాచరం | జిత్వాస సకలానంలోకాన్‌ధర్మారణ్య సమాగతః ||3||

తద్దృష్ట్వాసకలంపుణ్యంరమ్యంద్విజనిషేవితం | బ్రహ్మద్వేషాచ్చతేనైవదాహితం చపురంశుభం ||4||

దహ్మమానంపురందృష్ట్వాప్రణష్టాద్విజసత్తమాః | యధాగతంపుజగ్ముస్తేధర్మారణ్య నివాసినః ||5||

శ్రీమాతాద్యాస్తదాదేవ్యఃశతశో7థసహస్రశః | ఘాతయంత్యేవశ##బ్దేనతర్జయిత్వాచరాక్షసం ||16||

సముచ్ఛ్రితాస్తదాదేవ్యఃశతశో7థసహస్రశః | త్రిశూలవరధారిణ్యఃశంఖ చక్రగదాధరాః ||7||

కమండలుధరాఃకాశ్చిత్‌కశాఖడ్గధరాఃపరాః | పాశాంకుశధరాకాచితంఖడ్గఖేటకధారిణీ ||8||

కాచిత్పరశుహస్తాచదివ్యాయుధధరాపరా | నానాభరణభూషాఢ్యానానారత్నాభిశోభితా ||9||

రాక్షసానాంవినాశాయబ్రాహ్మణా నాంహితాయచ | ఆజగ్ముస్తత్రయత్రాస్తేలోల జిహ్వోహిరాక్షసః ||10||

మహాదంష్ట్రోమహాకాయోవిద్యుజ్జిహ్వోభయంకరః | దృష్ట్వాతారాక్షసోఘోరం సింహనాదమథాకరోత్‌ ||11||

తేననాదేనమహతాత్రాసితంభువనత్రయం | అపూరితాదిశఃసర్వాఃక్షుభితానేకసాగరాః ||12||

కోలాహలోమహానాసీత్‌ధర్మాణ్యతదానృప | తచ్ఛ్రుత్వావాసవేనాథలవ్రేషితోనలకూబరః ||13||

కిమిదంపశ్యగత్వాత్వందృష్ట్వామహ్యంనివేదయ | తత్తస్యవచనంశ్రుత్వాగతోవైనలకూబరః ||14||

దృష్ట్వాతత్రమహాయుద్ధంశ్రీమాతాలోలజిహ్వాయోః | యథాదృష్టంయథాజాతంశక్రాగ్రేసన్య వేదయత్‌ ||15||

తా || యుధిష్ఠిరుని వచనము - ద్విజసత్తమ! ఆతరువాత ఏంజరిగిందోచెప్పండి. మీవచనామృతమునుతాగినాక, నాకుతృప్తికలగలేదుఓప్రభు అనగా (1) వ్యాసునివచనము - కొఃత కాలం గడిచాక యుగాంత సమయంకాగా త్రేతాయుగం ఆదియందులోలజిహ్వాక్షుడను రాక్షసుడుపుట్టాడు. (2) వానితో నచారచరమైనముల్లోకమంతాభయపెట్టబడింది. ఆతడు అన్నిలోకములను జయించి ధర్మాణ్య మునకు వచ్చాడు. (3) పుణ్యమైన రమ్యమైనదాన్నంతాచూచి, బ్రాహ్మణులున్నదానిని చూచిబ్రహ్మద్వేషంవల్లశుభ##మైన ఆనగరాన్ని తగులబెట్టాడు. (4) పట్టణంతగలబడిపోతోంటే చూచి బ్రాహ్ముణులంతానష్ట పోయారు. ఆధర్మారణ్య మందున్నవారు వచ్చిన చోటికి వెళ్ళారు. (5) అప్పుడ్రు శ్రీమాతాదు లైన దేవతలను రాక్షసుడు కోపగించాడు. శబ్దముతోనే భయపెడ్తూరాక్షసుని బాధిస్తూనే ఉన్నారు. (6) అప్పుడు ఆదేవతలునూర్ల కొలది వేలకొలది కూడి, త్రిశూలములు ధరించి, శంఖముచక్రముగదలుధరించి (7) కమండలులుధరించి, కొందరు, కొరడ, ఖడ్గములు ధరించి, ఒకరు పాశాంకుశములు ధరించి, మరొకరు ఖడ్గడాలువులుధరించి (8) ఒకతెపరశుధరించి, ఇంకొకతెదివ్యఆయుధమునుధరించి, రకరకాల ఆభరణములతో భూషణ ములతోకూడి, రకరకాలరత్నములతోశోభిస్తూ (9) రాక్షసులనాశనంకొరకు, బ్రాహ్మణుల హితంకొరకు, లోలజిహ్వుడను రాక్షసుడున్న చోటికివారువచ్చారు. (10) మహాదంష్ట్రలు, మహాకాయము, విద్యుత్‌జిహ్వము, భయంకరరూపముగల రాక్షసుడువారినిచూచి సింహనాదముచేశాడు. (11) ఆగొప్పధ్వనితో ముల్లోకములుభయపడ్డాయి. ఆశబ్దందిక్కులనిండా నిండిపోయింది. అనేకసముద్రములు క్షోభించాయి. (12) ఓకృప! అప్పుడు ధర్మారణ్య మందుపెద్దకోలాహలమైంది. దానిని చూచివానపుడునల కూబరునిపంపాడు. (13) ఓనలకూబర! నీవువెళ్ళి అదేమిటోచూడు, చూసి నాకుచెప్పు. అతని మాటను వినినలకూబరుడువెళ్ళాడు. (14) అక్కడు శ్రీమాత లోలజిహ్వులకు జరిగిన మహా యుద్ధమునుచూచి, జరిగింది జరిగినట్టు, చూచింది చూచినట్టు ఇంద్రుని ఎదురుగా అతడుచెప్పాడు. (15) మూ || ఉద్వేజయతిలోకాంస్త్రీన్‌ ధర్మారణ్యమితోగతః | తచ్ఛ్రుత్వావాస వోవిష్ణుంనివేద్యక్షితిమాగమత్‌ ||16||

దాహితంతత్పురంరమ్యందేవానామపిదుర్లభం | నదృష్టావాడవాస్తత్రగతాఃసర్వేదిశోదశ ||17||

శ్రీమాతాయోగినీతత్ర కురుతే యుద్ధముత్తమం | హాహాభూతాప్రజాసర్వాఇతశ్చేతశ్చధావతి ||18||

తచ్ఛ్రుత్వావాసుదేవోహిగృహీత్వాచసుదర్శనం | సత్యలోకాత్తదారాజన్‌ సమాగచ్ఛ న్మహీతలే ||19||

ధర్మారణ్యంతతోగత్వాతచ్చక్రంప్రముమోచహ | లోలజిహ్వస్తదారక్షోమార్భితోనిపపాతహ ||20||

త్రిశూలేనతతో భిన్నః శక్తిభిఃక్రోధమూర్ఛితః | హన్యమానస్తదారక్షఃప్రాణాంస్త్యక్త్వాదివంగతః ||21||

తతోదేవాఃసగంధర్వాహర్ష నిర్భరమానసాః | తుష్టువుస్తంజగన్నాథం సత్యలోకాత్సమాగతాః ||22||

ఉద్వసంతత్సమాలోక్యవిష్ణుర్వచనబ్రవీత్‌ | క్వచతే బ్రాహ్మణాఃసర్వేఋషీణామాశ్రమేపునః ||23||

తతోదేవాః సగంధర్వాఃఇతస్తతః పలాయితాన్‌ | సంశోధ్యతరసారాజన్‌ భ్రాహ్మణానిదమబ్రువన్‌ ||24||

శ్రూయంతాంనోవచోవిప్రానిహతోరాక్షసాధమః | వాసుదేవేనదేవేనచక్రేణనిరకృంతత ||25||

తచ్ఛ్రుత్వావాడవాఃసర్వేప్రహర్షోత్ఫుల్లలోచనాః | సమాజగ్ముస్తదారాజన్‌స్వస్వస్థాన్‌ సమావిశన్‌ ||26||

శ్రీకాంతాయతదారాజన్‌ వాక్యముక్తంమనేరమం | యస్మాత్త్వంసత్యలోకాచ్చఆగతో7సి జగత్ప్రభుః స్థాపితంచపురంచేదంహితాయచద్విజాత్మనాం ||27||

సత్యమందిరమితిఖ్యాతంతదాలోకేభవిష్యతి | కృతేయుగేధర్మారణ్యంత్రేతాయాంసత్యమందిరం ||28||

తచ్ఛ్రుత్వావాసుదేవేసతథేతిప్రతిపద్యచ | తతస్తేవాడవాస్సర్వేపుత్రపౌత్రసమన్వితాః ||29||

సవత్నీకాఃసానుచరాఃయధాపూర్వంన్యవాత్సిషుః | తపోయజ్ఞక్రియాద్యేషువర్తంతే7ధ్యయనాదిషు ||30||

ఏవంతేసర్వమాఖ్యాతంధర్మవైసత్యమందిరే ||31||

ఇతి శ్రీస్కాందమహాపురాణ ఏకాశీతి సాహస్య్రాంసంహితాయాంతృతీయేబ్రహ్మఖండే ధర్మారణ్యమాహాత్మ్యేలోల జిహ్వాసుర వధపూర్వకంసత్యమందిర సంస్థాపనవర్ణనంనామఏకాదశో7ధ్యాయః ||11||

తా || ఇక్కడి నుండి ధర్మారణ్యమునకువెళ్ళి ముల్లోకములను బాధిస్తున్నాడు. దానిని విని ఇంద్రుడు విష్ణువునకు నివేదించి భామికివచ్చాడు. (16) రమ్యమైన ఆనగరం తగుల బెట్టబడింది. దేవతలకూదుర్లభ##మైంది ఆనగరము. అక్కడ బ్రాహ్మణులులేరు. వారంతా పదిదిక్కులకుపోయారు. (17) శ్రీమాతయోగినిఅక్కడయుద్ధాన్ని చేస్తోంది. ప్రజలంతాహాహా కారంచేస్తూఇటు అటుపరుగెత్తు తున్నారు (18) దానిని వినివాసుదేవుడు సుదర్శనాన్ని గ్రహించి సత్యలోకం నుండి అప్పుడు భూలోకానికి వచ్చాడు (19) పిదపధర్మారణ్యమునకువచ్చి ఆచక్రమును వదిలాడు. అప్పుడు ఆలోల జిహ్వుడు మూర్ఛ పోయిపడిపోయాడు. (20) త్రిశూలంతో శక్తులుభిన్నంచేయగా క్రోధమూర్ఛితుడై కొట్టబడుతూ రాక్షసుడు ప్రాణములు వదిలిస్వర్గమునకు వెళ్ళాడు. (21) అప్పుడు దేవతలు గంధర్వులు హర్షనిర్భరమానసులై సత్యలోకంనుండి వచ్చి జగన్నాధుని స్తుతించారు. (22) చనిపోయిన రాక్షసునిచూచివిష్ణువు ఇట్లా అన్నాడు. ఋషులఆశ్రమములలోని ఆబ్రాహ్మణులందరు ఎక్కడున్నారు. (23) పిదపదేవతలు గంధర్వులు ఇటునటు పరుగెత్తిన బ్రాహ్మణులను త్వరగాశోధించిఇట్లాపలికారు. (24) ఓ విప్రులార! మామాటవినండి. రాక్ష సాధముడు చంపబడ్డాడు. దేవుడైన వాసుదేవుని చక్రంతో చంపబడ్డాడు (25) దానిని విని బ్రాహ్మణులందరు ఆనందంతో వికసించినకళ్ళుగలవారై అప్పుడువారు తిరిగి వచ్చారు. ఓరాజ! తమతమ స్థానము లందు ఉన్నారు. (26) అప్పుడు ఓరాజ! మనోహరమైన వాక్యముశ్రీకాంతునితో అన్నారు. ఓ జగత్ప్రభు, నీవు సత్యలోకంనుండి వచ్చి, బ్రాహ్మణులక్షేమంకొరకు ఈపట్టణాన్ని తిరిగిస్థాపించావు. (27) ఇది సత్యమందిరమని లోకంలో ప్రసిద్ధమౌతుంది. కృతయుగమందుధర్మారణ్యము త్రేతా యుగమందు సత్యమందిరము అని (28) దానిని విని వాసుదేవుడు అట్లాగేకాని అని అన్నాడు. పిదప బ్రాహ్మణులందరు పుత్ర పౌత్రసమన్వితులై (29) భార్యలతో, అనుచరులతోకూడి పూర్వంమాదిరిగా నివసించారు. తపస్సు యజ్ఞముమొదలగు క్రియలలో, అధ్యయనాదులందు ఉన్నారు. (30) ఓధర్మ! సత్యమందిర మందలి విషయాన్ని అంతానీకే చెప్పాను. (31) అని శ్రీ స్కాందమహైపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందుధర్మారణ్య మాహత్మ్య మందులోల జిహ్వుడను రాక్షసుని చంపటము మొదలుగా సత్యమందిర సంస్థాపనవర్ణనమనునది పదకొండవ అధ్యాయము. ||11||

Sri Scanda Mahapuranamu-3    Chapters