Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

శృణు రాజన్యథావృత్తంధర్మారణ్య శుభంమతం | యదిదంకథయిష్యామిఅశేషాఫ°ఘనాశనం || 1 ||

అజేశేనతదారాజన్‌ప్రేరితేనస్వయంభువా | కామధేనుఃసమాహూతాకధయామానతాంప్రతి || 2 ||

విప్రేభ్యోసుచరాన్‌దేహికకైకసై#్మద్విజాతయే | ద్వౌద్వౌశుద్ధాత్మకౌచైవందేహిమాతఃప్రసీదమే || 3 ||

తథేత్యుక్త్వామహాధేనుః క్షీరేణోల్లేఖయద్దరాం | హుంకారాత్తస్యనిష్క్రాంతాఃశిఖాసూత్రధరాసరాః || 4 ||

షట్‌త్రింశచ్చసహస్రాణిపణిజశ్చమహాబలాః | సోపవీతామహాదక్షాఃసర్వశాస్త్రవిశారదాః| || 5 ||

ద్విజభక్తిసమాయుక్తాఃబ్రహ్మణ్యాసై#్తతపోన్వితాః | పురాణజ్ఞాఃసదాచారాఃధార్మికాఃబ్రహ్మభోజకాః || 6 ||

స్వర్గేదేవాఃప్రశంసంతిధర్మారణ్‌యనివాసినః | తపోధ్యయనదానేషుసర్వకాలేవ్యతీంద్రియాః || 7 ||

ఏకైకసై#్మద్విజాయైవదత్తంజాతుచరద్వయం | వాడవస్యచయోద్గోత్రంపురాప్రోక్తంమహీపతే || 8 ||

పరస్పరంచతద్గోత్రంతస్యచానుచరన్యచ | ఇతికృత్వావ్యవస్థాంచన్యవనంస్తత్రభూమిషు || 9 ||

తతశ్చశిష్యతాదేవైర్దత్తాచానుచరాన్‌భువి | బ్రహ్మణాకథితంసర్వంతేషామనుహితాయవై || 10 ||

కురుధ్వంపచనంచైషాందదధ్వంచయదిచ్ఛితం | సమిత్పుష్పకుశాదీనిఆనయధ్వందినేదినే || 11 ||

అనుజ్ఞయైషాంవర్తధ్వంమావజ్ఞాంకురుతక్వచిత్‌ | జాతకంనామకరణంతథాన్నప్రాశనంశుభం || 12 ||

క్షారంచైవోపనయనంమహానామ్న్యాదికంతధా | క్రియాకర్మాదికంయచ్చవ్రతందానోపవానకం || 13 ||

అనుజ్ఞ¸°షాంకర్తవ్యంకాజేశాఇదమబ్రువన్‌ | అనుజ్ఞయావినైషాంయఃకార్యమారభ##తేయది || 14 ||

దర్శంవాశ్రాద్ధాకార్యంవాశుభంవాయదివాశుభం | దారిద్యంపుత్రశోకంచకీర్తినాశంతథైవచ || 15 ||

రోగైర్నిపీడ్యతేనిత్యంనక్వచిత్‌ సుఖమాప్నుయుః | తథేతిచతతోదేవాఃశక్రాద్యాఃసురసత్తమాః || 16 ||

స్తుతింకుర్యంతితేసర్వేకామధేనోఃపురఃస్థితాః | కృతకృత్యాన్తదాదేనాబ్రహ్మవిష్ణుమహేశ్వరాః || 17 ||

తా || వ్యాసునివచనము - ఓనరుడా! ధర్మారణ్యంలోజరిగినదానినిశుభ##మైనదానినిఇష్టమైనదానినిజరిగినట్లు చెప్తాను విను. నేను చెప్పేది అన్నిపావనసమూహములనునశింపచేసేది. (1) అప్పుడు ఓరాజ! విష్ణువుతోప్రేరేపింపబడిబ్రహ్మకామధేనువునుపిలిచిదానితోఇట్లాఅన్నాడు. (2) విప్రులకుఅనుచరులను ప్రసాదించుఒక్కొక్కబ్రాహ్మణునకుఇద్దరిద్దరు, శుద్ధమైన ఆత్మకలవారినిఇవ్వు! ఓ తల్లినన్ననుగ్రహించు (3) అనగా అట్లాగేఅనిమహాధేనువునుభూమిపైపాలతోవ్రాసింది. దాని హుంకారమునుండిశిఖసూత్రములనుధరించిననరులుబయటికొచ్చారు. (4) ముప్పదిఆరువేలపణిజులు. వారు మహాబలవంతులు, యజ్ఞపవీతంకలవారు, మహాదక్షులు, సర్వశాస్త్రవిశారదులు (5) ద్విజభక్తికలవారు, బ్రహ్మకు చెందినవారు, వారు తపోన్వితులు. పురాణజ్ఞులు, సదాచారులు ధార్మికులు, బ్రహయేఆహారముగాగలవారు (6) స్వరంలోదేవతలు ప్రశంసిస్తున్నారు. వీరినిధర్మారణ్యనివాసులుతపస్సుఅధ్యయనుముదానమువీటియందు, అన్నికాలము లందు ఇంద్రియములనతిక్ర మించిన వారు (7) ఒక్కొక్కబ్రాహ్మణునకు ఇద్దరిద్దరుఅనుచరులు ఉండండి. బాడబునకుఏ గోత్రమో (8) ఆతనిఅను చరునకు అదేగోత్రము అనివ్యవస్థనేర్పరచిఆప్రాంతమందున్నారు. (9)ఆపిదపదేవతలు అనుచరులనుశిష్యులుగాచేసారు. బ్రహ్మచెప్పినదంతా వారిక్షేమముకొరకే (10) వారి మాటలను ఆచరించండి. వాళ్ళకు కావలసినదిఇవ్వండి. ప్రతిరోజు, సమిధలు పుష్పములుదర్భలుతీసుకురండి. (11) వీరిఆజ్ఞప్రకారంనడవండి. ఎప్పుడు ఎక్కడవారిని అవమానపరచకండి. జాతకర్మనామకరణముఅన్నప్రాశనము (12) క్షౌరము, ఉపనయనము, మహానామ్ని మొదలగునవి క్రియాకర్మాదులు, దానము ఉపవాసము మొదలగువ్రతములు (13) వీరిఅనుజ్ఞతోచేయాలి. కాజేశులు దీనిని చెప్పారు. వీరి అనుజ్ఞలేకుండా ఎవరైనా కార్యంఆరంభిస్తే (14) దర్శముకానిశ్రాద్ధకర్మగానిశుభముకాని, అశుభముకాని ఆచరిస్తేదారిద్ర్యము, పుత్రశోకము, కీర్తినాశము (15) కల్గుతాయి. రోజురోజురోగములతోబాధపడుతారు. ఎప్పుడూ సుఖపడరు. అట్లాగేఅనిపలుకగా అప్పుడు దేవతలు శక్రాదిదేవతాశ్రేష్ఠులు (16) కామధేనువుముందున్న వారందరుస్తోత్రంచేయసాగారు. దేవతలు బ్రహ్మవిష్ణు, మహేశ్వరులు కృతకృత్యులైఅప్పుడుఇట్లా స్తుతించారు (17)

మూ || త్వంమాతాసర్వదేవానాంత్వంచయజ్ఞస్యకారణం | త్వంతీర్థంసర్వతీర్థానాంనమస్తేస్తునదానఘే || 18 ||

శశిసూర్యారుణాయస్తాలలాటేవృషభధ్వజః | సరస్వతీచహుంకారేసర్వేనాగాశ్చకంబలే || 19 ||

క్షురవృష్ఠేచగంధర్వావేదాశ్చత్వారేవచ | ముఖాగ్రేసర్వతీర్థానిస్థావరాణిచరాణిచ || 20 ||

ఏవంవిదైశ్చబహుశోవచనైస్తోషితాచసా | సుప్రసన్నాతదాధేనుఃకింకరోమీతిచాబ్రవీత్‌ || 21 ||

దేవాఊచుః -

నృష్టాఃసర్వేత్వయామాతఃదేవ్యైతేసుచరాఃశుభాః | త్వత్ర్పసాదాన్మహాభాగేబ్రాహ్మణాఃసుఖినోభవన్‌ || 22 ||

తతోసౌనురభీరాజన్‌గతానాకంయశస్వినీ | బ్రహ్మవిష్ణుమహేశాద్యాఃతత్రైవాంతరధుస్తతః || 23 ||

యుధిష్ఠిరువాచ-

అభార్యస్తేమహాతేజాగోజాఅనుచరాస్తథా | ఉద్వాహితాఃకథంబ్రహ్మన్‌సుతాన్తేషాంకదాభవాన్‌ || 24 ||

వ్యాస ఉవాచ -

పరిగ్రహార్థంవైతేషాంరుద్రేణచయమేనచ | గంధర్వకన్యాఅహృత్యదారాస్తత్రోషకల్పితాః || 25 ||

యుధిష్ఠిరఉవాచ -

కోవాగంధర్వరాజాసౌకింనామాకుత్రవాస్థితిః | కియన్మాత్రాఃతస్యకన్యాఃకిమాచారాబ్రవీహిమే || 26 ||

వ్యాసఉవాచ -

విశ్వావసురితిఖ్యాతోగంధర్వాధిపతిర్‌నృప | షష్ఠికన్యాసహస్రాణిఆసతేతస్యవేశ్మని || 27 ||

అంతరిక్షేగృహంతస్యగంధర్వసగరంశుభం | ¸°వనస్థాఃసురూపాశ్చకన్యాగంధర్వజాఃశుభాః || 28 ||

రుద్రస్యానుచరౌరాజన్నందీభృంగీశుభాననౌపూర్వాదృష్టాశ్చతాఃకన్యాఃకథయామానతుఃశివం || 29 ||

దృష్టాఃపురామహాదేవగంధర్వనగరేవిభో | విశ్వావసుగృహేకన్యాఅసంఖ్యాతాఃసహస్రశః || 30 ||

తాఅనీయబలాదేవగోభుజేభ్యఃప్రయచ్ఛభో | ఏవంశ్రుత్వాతతోదేవస్త్రిపురఘ్నఃసదాశివః || 31 ||

ప్రేషయామానదూతంతువిజయంనామభారత | సతత్రగత్వాయత్రాస్తేవిశ్వావసురరిందమః || 32 ||

ఉవాచవచనంచైవశివేరితం || 32 1/2 ||

తా || దేవతలందరికినీవుతల్లివి. నీవుయజ్ఞమునకుకారణము. నీవుసర్వతీర్థములకు తీర్థస్థానమునీవు ఎప్పుడూ పుణ్య స్వరూపురాల! నీకు నమస్కారము (18) శశిసూర్యలవలెఎర్రనైనది ఆమెలలాటమందు వృషభధ్వజుడు, ఆమె హుంకారమందు సరస్వతి, నాగులందరు ఆమెకుకంబలములు గుఱ్ఱపు (19) గిట్టలవంటిఆమెవృష్ఠభాగమందుగంధర్వులు నాలుగువేదములలు, ముఖాగ్రమందుఅన్నితీర్థములు, స్థావరములు చరములుకూడా (20) ఇటువంటిఅనేకవిధములైన మాటలతో ఆమెనుస్తుతించారు. సంతోషించిన ఆమె ప్రసన్నమై ఆధేనువుఏంచేయాలిఅనిఅడిగింది (21) దేవతలిట్లన్నారు ఓ మాత! దేవి ఈశుభ##మైన అనుచరులనుఅందరినినీవుసృష్టించావు. ఓ మహాభాగే! నీఅనుగ్రహంవల్లబ్రాహ్మణులు సుఖవంతులైనారు. (22) అని అన్నాక ఓరాజ!ఈసురభియశస్విని, స్వర్గానికివెళ్ళింది పిదపబ్రహ్మవిష్ణుమహేశాదులు అక్కడే అంతర్థానమైనారు (23) యుధిష్ఠురుని వచనము - ఆమహాతేజులు, గోవునకుజన్మించినవారు, అనుచరులు భార్యలు లేనివారు. మరివారు ఎట్లావివాహమాడారు. ఓ బ్రహ్మ! వారికి ఎప్పుడుపుత్రులుకలిగారు అనగా (24) వ్యాసుని వచనము - వారివివాహం కొరకు రుద్రుడు యముడు గంధర్వకన్యలనుతీసుకొని వచ్చి భార్యలనుగాకల్పించారు. (25) యుధిష్ఠురునివచనము - అగంధర్వరాజెవడు ఆతనిపేరేమి. ఆతడెక్కడున్నాడు. ఆతని కన్యలెంతమంది. వారినడవడిక ఎట్టిది. ఇవన్నినాకు చెప్పండి. అనగా (26) వ్యాసునివచనము - ఓనృప! విశ్వావసువనుపేరుగల ప్రసిద్ధుడైన గంధర్వాధిపతి ఉన్నాడు. ఆతనిఇంటిలో అరువదివేలమందికన్యలున్నారు. (27) అంతరిక్షంలో గంధర్వనగరమని శుభ##మైన ఇల్లుంది. ¸°వనవంతులు, మంచిరూపవంతులు శుభులు గంధర్వజులైనకన్యలువారు. (28) ఓరాజ! రుద్రుని అనుచరులైనశుభాసనులైననందిభృంగిఅనువారు ఆకన్యలనుఅంతకుముందేచూచారు. శివునితో చెప్పారు. (29) ఓమహదేవ! విభు, గంధర్వనగరంలో ఇదివరకుచూచాము. విశ్వావసు గృహంలో వేలకొలది లెక్కింపరానంత మంది కన్యలున్నారు. (30) వారినిబలవంతంగా తెచ్చి గోభుజులకివ్వండి. అనగావిని ఆపిదప త్రిపురఘ్నుడు ఐన సదాశివ దేవుడు (31) విజయుడనుపేరుగలదూతనుపంపాడు, ఓ భారత! అరిందముడైన విశ్వావసుడున్నచోటికి ఆతడు వెళ్ళి (32) శివుడుచెప్పిన పథ్యమైనమాటనుచెప్పాడు (32 1/2)

మూ || ధర్మారణ్యమహాభాగకాజేశేనవినిర్మితాః || 33 ||

స్థాపితావాడవాస్తత్రవేదవేదాంగపారగాః తేషాంవైవరిచర్యార్థంకామధేనుశ్చప్రార్థితా || 34 ||

తయాకృతాఃశుభాచారాఃపణిజస్తేత్వయోనిజాః | షట్‌త్రింశచ్చసహస్రాణికుమారాస్తేమహాబలాః || 35 ||

శివేనప్రేషితోహంవైత్వత్సమీపముపాగతః | కన్యార్థంహిమహాభాగదేహిదేహీత్యువాచహ || 36 ||

గంధర్వఉవాచ -

దేవానాంచైవసర్వేషాంగంధర్వాణాంమహామతే | పరిత్యజ్యకథంలోకేమానుషాణాందదామినై || 37 ||

శ్రుత్వాతువచనంతస్యనివృత్తోవిజయిస్తదా | కథయామానతత్సర్వంగంధర్వచరితంమహత్‌ || 38 ||

వ్యాసఉవాచ -

తతఃకోపసమావిష్ణోభగవాన్‌లోకశంకరః వృషభేచసమారూఢఃశూలహస్తఃసదాశివః || 39 ||

భూతప్రేతపిశాచాద్యైఃసహసై#్రరావృతఃప్రభుః | తతోదేవాస్తథానాగాఃభూతవేతాలఖేరచాః || 40 ||

క్రోధేసమహతావిష్టాఃసమాజగ్ముఃసహస్రశః | హాహాకారోమహానాసీత్‌తస్మిన్‌సైన్యేవిసర్పతి || 41 ||

ప్రకంపితాధరాదేవీదిశాపాలభయాతురాః | ఘోరావాతస్తదాశాంతాః శబ్దంకుర్వంతిదిగ్గజాః || 42 ||

తదాగతంమహాసైన్యందృష్ట్వాభయవిలోలితం | గంధర్వనగరాత్సర్వేవినేశుస్తేదిశోదశ || 43 ||

గంధర్వరాజోనగరంత్యక్త్వామేరుంగతోనృప | తాఃకన్యా¸°వనోపేతారూపౌదార్యసమన్వితాః || 44 ||

గృహీత్వాప్రదదౌసర్వావణిగ్భ్యశ్చతదానృప | వేదోక్తేనవిధానేసతథావైదేవసన్నిధౌ || 45 ||

ఆజ్యభాగంతదాదత్వాగంధర్వాయగవాత్మజాః | దేవానాంపూర్వజానాంచసూర్యాచంద్రమసోస్తధా || 46 ||

యమాయమృత్యవేచైవ అజ్యభాగంతదాదదుః | దత్వాజ్యాభాగాన్‌విధివత్‌వవ్రిరేతేశుభవ్రతాః || 47 ||

తతఃప్రభృతిగాంధర్వవివాహెసమువస్థితే | ఆజ్యభాగంప్రగృహ్ణంతిఅద్యాపిసర్వతోభృశం || 48 ||

షట్‌త్రింశచ్చసహస్రాణికుమారాయన్న్యవేదయన్‌ | తేషాంపుత్రాశ్చపౌత్రాశ్చశతశోథసహస్రశః || 49 ||

అతఏవహితాఃసర్వాదాసత్వేహివినిర్మితాః | క్షత్రియాశ్చమహావీరాకింకరత్వేహినిర్మితాః || 50 ||

తా || ఓమహాభాగ! ధర్మారణ్యమందుకాజేశుడునిర్మించిన (33) ఉంచిన వాడబులువేదవేదాంగపారగులు అక్కడున్నారు. వారికి పరిచర్యకొరకు కామధేనువును ప్రార్థించారు (34) ఆమె చేసిన శుభాచారులైన వణిజులున్నారు. వారయోనిజులు. ముప్పది ఆరువేల మంది నీకుమార్తెలున్నారు. వారు మహాశక్తి మంతులు. (35) శివుడు పంపగా నేను నీ దగ్గరికొచ్చాను. ఓ మహాభాగ! కన్యల కొరకు వచ్చాను. ఇవ్వుము. ఇవ్వుము అని అడిగాడు (36) గంధర్వుని వచనము - దేవతలనందరిని గంధర్వులందరిని వదలి, ఓ మహామతి! లోకంలోనిమనుష్యులకు ఎట్లా ఇస్తాను. (37) అని అనగా దానిని విజయుడు విని వెళ్ళి పోయాడు. ఆ గంధర్వ చరిత్రనంతా చెప్పాడు (38) వ్యాసుని వచనము - భగవాన్‌, లోకశంకరుడు కోపంతో కూడినవాడై వృషభముపై కూర్చొని, సదాశివుడు చేత శూలము ధరించి (39) ప్రభువు! భూతప్రేత పిశాచాదులతో వేలమందితో చుట్టబడి, అట్లాగే ఆ పిదప దేవతలు, నాగులు, భూతబేతాళ ఖేచరులు (40) చాలా కోపంతో కూడినవారై వేలకొలది వచ్చారు. ఆ సైన్యం కదులుతుండగా పెద్ద హాహాకారం జరిగింది. (41) భూదేవి కంపించింది. దిక్పాలురు భయాతురులైనారు. అప్పుడు ఘోరమైన గాలులు వీచాయి. దిక్కులందలి దిగ్గజములు అరవసాగాయి. (42) వ్యాసుని వచనము - అట్లా వచ్చిన భయంకరముగా చలించిపోతున్న ఆ మహాసైన్యాన్ని చూచి గంధర్వ నగరమందలి వారందరు పదిదిక్కులకు నాయకుడు లేకుండా వెళ్ళారు. (43) ఓనృప! గంధర్వరాజు, నగరాన్ని వదలి మేరువునకు వెళ్ళాడు. ¸°వనోపేతులైన, రూపఔదార్య సమన్వితులైన ఆకన్యలను (44) తీసుకొని అందరిని వణిజులకు ఇచ్చాడు. ఓనృప! వేదోక్తవిధితో దేవసన్నిధి యందు (45) గవాత్మజులు అప్పుడు గంధర్వునకు ఆజ్యభాగమును ఇచ్చిదేవతలకు, పూర్వజులకు, చంద్ర సూర్యులకు (46) యమునకు మృత్యువునకు ఆజ్యభాగమును అప్పుడిచ్చారు. శాస్త్ర ప్రకారము ఆజ్యభాగములనిచ్చి అశుభ ప్రతులు వరించారు. (47) నాటి నుండి గాంధర్వ వివాహము జరిగినప్పుడు ఇప్పటికి అంతట మిక్కిలి ఆజ్యభాగమును స్వీకరిస్తున్నారు (48) ముప్పది ఆరువేల మంది కుమారులు ఇవ్వబడ్డారు. వారికి పౌత్రులు నూర్లకొలది వేలకొలది ఐనారు (49) అందువల్ల వారందరు దాసత్వమందే ఉన్నారు. క్షత్రియులు మహావీరులు కింకరులుగా ఐనారు (50).

మూ || తతోదేవాస్తదారాజన్‌ జగ్ముఃసర్వేయథాతథా | గతేదేవేద్విజాన్సర్వే స్థానేస్మి న్నివసంతితే || 51 ||

పుత్రపౌత్రయుతారాజన్‌ నివసంత్యకుతోభయాః | పఠంతి వేదాన్‌ వేదజ్ఞాః క్వచిచ్ఛా స్త్రార్త ముద్గిరన్‌ || 52 ||

కేచిద్విష్ణుం జపంతీహశివంకేచిజ్జపంతిహి | బ్రహ్మణంచ జపంత్యే కేయమ సూక్తంహికేచన || 53 ||

యజంతి యాజకాశ్చైవఅగ్నిహోత్రము పాసతే | స్వాహాకారస్వథాకార వషట్‌ కారైశ్చ భారత || 54 ||

శ##బ్దైః ఆపూయతే సర్వం త్రైలోక్యం సచరాచరం | పణిశ్చమహాదక్షాద్విజశుశ్రూషణోత్సుకాః || 55 ||

ధర్మారణ్య శుభేదివ్యే తేవసంతి సునిష్ఠితాః | అన్‌ పానాది కంసర్వం సమిత్కుశఫలాదికం || 56 ||

ఆపూరయన్‌ ద్విజాతీనాం వణిజస్తే గవాత్మజాః || 57 ||

పుష్పోవహార నిచయం స్నాన వస్త్రాది ధావనం | ఉపలాదిక నిర్మాణం మార్జనాదిశుభక్రియాః || 58 ||

పణిక్‌స్త్రియః ప్రకుర్వంతి కండనం పేషణాదికం | శుశ్రూషం తిచతాన్‌ విప్రాన్‌ కాజేశవచనేసహి || 59 ||

స్వస్థాజాతాస్తదా సర్వేద్విజా హర్షపరాయణాః కాజేశాదీను పానంతే దివారాత్రౌహి సంధ్యయోః || 60 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వభాగే ధర్మారణ్య మాహాత్మ్యే వణిక్‌ పరిగ్రహ వర్ణనం నామ దశమోధ్యాయః || 10 ||

తా || ఓరాజ! ఆపిదపదేవతలుఅందరుఅప్పుడుఎక్కడివాళ్ళక్కడికివెళ్ళారు. దేవతలు వెళ్ళిపోయాకబ్రాహ్మణులందరు ఈస్థానమందునివసిస్తున్నారు (51) ఓరాజ! పుత్రపౌత్రులతో కూడి, ఎవరినుండిభయంలేకుండాఈస్థానమందునివసిస్తున్నారు. వేదములనెరిగినవారువేదాలుచదువుతూఒకచోటాశాస్త్రార్థమునుచర్చిస్తూ (52) కొందరువిష్ణువును, కొందరుశివుని జపిస్తున్నారు. కొందరుబ్రహ్మనుజపిస్తున్నారు. కొందరుయమసూక్తాన్నిపఠిస్తున్నారు. (53) యాచకులుహోమంచేస్తున్నారు. అగ్నినిఉపాసిస్తున్నారు. సువ్రత! స్వాహాకారస్వధాకారవషట్‌కారములతోఉపాసిస్తున్నారు (54) శబ్దములతో అంతా సచరా చరమైత్రైలోక్యముపవిత్రమైపోతుంది. మహాదక్షులైనవణిజులు బ్రాహ్మణశుశ్రూషయందు ఉత్సుకులుగా ఉన్నారు. (55) శుభ##మైనదివ్యమైనధర్మారణ్యమందువారుమంచినిష్టగలవారైఉన్నారు. అన్నపానాదులు, సమిధలు, కుశలుపండ్లు మొదలగునవి అన్ని (56) బ్రాహ్మణులకుసమకూరుస్తూఆగవాత్మజులైనవణిజులున్నారు. (57) వణిజులస్త్రీలు, పుష్టుప హారములను, స్నానవస్త్రాదులు, ఉతుకుట, పోత్త్రముమొదలగువాటినిఏర్పరుచుట, మార్జనము, (ఊడ్చు) మొదలగు శుభక్రియలు (58) చేస్తున్నారు, తరుగుట, నూరుట మొదలగుశుశ్రూషలుఆబ్రాహ్మణులకుకాజేశునిమాటప్రకారంవారు చేస్తున్నారు. (59) ద్విజులంతాఆనందపరవశులైనారు. దివారాత్రములు, సంధ్యలందుకాజేశాదులనుఉపాసిస్తున్నారు. (60) అనిశ్రీస్కాందమహాపురాణమందుఏకాశీతిసాహస్ర్య సంహితయందు తృతీయ మైనబ్రహ్మఖండమందు పూర్వభాగమందు ధర్మారణ్యమాహాత్మ్యమందుపణిక్‌పరిగ్రహవర్ణనమనునది పదవ అధ్యాయము || 10 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters