Sri Scanda Mahapuranamu-3    Chapters   

తొమ్మిదవ అధ్యాయము

మూ || వ్యాస ఉవాచ -

శ్రూయతాం రాజశార్దూల పుణ్యమాఖ్యానముత్తమం | స్తూయమానోజగన్నాథ ఇదం వచనమ బ్రవీత్‌ || 1 ||

విష్ణురువాచ -

కిమర్థ మాగతాః సర్వేబ్రహ్మాద్యాః సురసత్తమాః | పృథివ్యాం కుశలం కచ్చిత్‌ కుతోవోభయమాగతం || 2 ||

తతః ప్రోవాచ వైహృష్టో బ్రహ్మాతం కేశవం పచః | సభయం విద్యతేస్మాకం త్రైలోక్యే సచరాచరే || 3 ||

ఏకవిజ్ఞాపనార్ధాయ ఆగతోహంతవాంతికే | తదహంసంప్రక్ష్యామి తదేతచ్ఛృణుమేవచః || 4 ||

పరంతు పూర్వం ధర్మేణ స్థాపితం తీర్థముత్తమం | తద్ద్రష్టకామోహం దేవ త్వత్ర్పసాదాజ్జనార్దన || 5 ||

తత్రత్వందేవదేవేశ గమనేకురు మాసనం | యథా సత్తీర్థతాంయాతి ధర్మారణ్య మనుత్తమం || 6 ||

విష్ణురువాచ -

సాధుసాధు మహాభాగ త్వర్యతాం తత్రమాచిరం | మమాపి చిత్తం తత్రైవ తద్దర్శనేస్తి లాలనం || 7 ||

వ్యాస ఉవాచ -

తార్‌క్ష్యమారుహ్య గోవిందస్తత్రాగా చ్ఛీఘ్రమేవహి | తతోధర్మేణ తేదేవాః సేంద్రాః సర్షిగణాస్తథా || 8 ||

బ్రహ్మవిష్ణు మహేశాద్యాదృష్టా దూరాన్ముమోదచ | దర్మరాజోపి తాన్‌ దృష్ట్వా దేవాన్విష్ణు పురోగమాన్‌ || 9 ||

ఆగతః స్వాశ్రమాత్త త్రపూజాంప్రగృహ్యతత్పురః | అసనాదుత్తితః శీఘ్రం నపర్యాద్యం ప్రగృహ్యచ

ఏకైకస్య చకారథ పూజాం చైవ పృథక్‌ పృథక్‌ || 10 ||

చకార పూజాం విధివత్తేషాం తత్రార్కనందనః | ఆసనేషూ పవేశ్యాథ పూజాం కృత్వా గరీయసీం || 11 ||

యమ ఉవాచ -

తీర్థరూప మిదం క్షేత్రం ప్రసాదాద్దే వకీసుత | త్వత్తోష విధినా చాద్య కృపయాచ శివస్యచ || 12 ||

అద్యమే సఫలం జన్మ అద్యమే సఫలంతపః | అద్యమే సఫలం స్థానం కాజేశానాం సమాగమాత్‌ || 13 ||

వ్యాస ఉవాచ -

ఏవంస్తు తస్తదావిష్ణుః ప్రోవాచ మధురం వచః | తుష్టోస్మి ధర్మరాజేంద్ర అహంస్తోత్రేణతే విభో || 14 ||

కించిత్ర్పార్థయమత్తోహం కరోమి తవవాంఛితం 7 యత్తేస్త్య భీప్సితం తుభ్యం తద్దదామిన సంశయః || 15 ||

యమ ఉవాచ -

యదితుష్టోసి దేవేశ వాంఛితం కురుషేయది | ధర్మారణ్య మహాపుణ్య ఋషీణా మాశ్రమాన్‌కురు || 6 ||

వసంతి బాడబాయత్ర యజంతి చైవ యాజ్ఞికాః | వేద నిర్ఘోష సంయుక్తం భాతితత్తీర్థముత్తమం || 17 ||

అబ్రహ్మాణ మిదం తీర్థం పీడయిష్యంతి జంతపః | తస్మాత్త్వం బాడవాన్‌ శౌరే సమానయఋషీన్‌ బహూన్‌

ధర్మారణ్యం యథాభాతి త్రైలోక్యే సచరాచరే || 18 ||

తా || వ్యాసుని వచనము - ఓ రాజసింహమ! పుణ్యమైన ఉత్తమమైన కథను వినండి. గన్నాథుని స్తుతింస్తుండగా, అతడు ఇట్లా పలికాడు (1) విష్ణు వచనము - అందరు బ్రహ్మాదులు దేవతాశ్రేష్టులు ఎందుకొరకొచ్చారు. భూమి యందు అంతా క్షేమమేనా? ఎవరి వల్లనైనా భయమొచ్చిందా (2) అప్పుడు బ్రహ్మ ఆనందపడి ఆ కేశవునితో ఇట్లా అన్నాడు. సచరాచరమైన ముల్లోకములందు మాకు భయము లేదు (3) ఒక విజ్ఞాపన చేయటానికి నేన నీ దగ్గరి కొచ్చాను. దానిని నేను చెబుతున్నాను. ఈ నా మాటలను వినండి. (4) పూర్వము ధర్ముడు శ్రేష్టమైన ఉత్తమ తీర్థాన్ని స్థాపించాడు. ఓ దేవ, జనార్దన, నీ అనుగ్రహంతో దానిని నేను చూడదలిచాను (5) ఓదేవదేవేశ! నీవు నేనక్కడికి వెళ్ళదలిచేట్టుగా నా మనసును మార్చు. ప్రధానమైన ధర్మారణ్యము ఉత్తమ తీర్థంగా మారేట్లు చేయి (6) విష్ణువు వచనము - మంచిది మంచిది, ఓ భాగ్యశాలి అక్కడికి త్వరగా వెళ్ళండి. ఆలసించకండి. నా మనస్సు కూడా అక్కడే ఉంది. నాకుగూడా దానిని చూడాలని కోరికగా ఉంది (7) వ్యాసుని వచనము - గోవిందుడు గరుడుని ఎక్కి త్వరగా అక్కడికి వెళ్ళాడు. అప్పుడ ధర్ముడు ఇంద్రుడు మొదలుగా దేవతలను, అట్లాగే ఋషి గణములను (8) బ్రహ్మవిష్ణువు మహేశుడు మొదలగు వారిని దూరం నుండే చూచాడు. ఆనంద పడ్డాడు కూడా. ధర్మరాజు, విష్ణువు మొదలుగా గల ఆ దేవతలను చూచి (9) పూజా సామగ్రిని తీసుకొని తన ఆశ్రమం నుండి అక్కడికి వారికి ఎదురుగా వచ్చాడు. ఆసనము నుండి లేచి త్వరగా సపర్యకు కావలసిన వానిని తీసుకొని, ఒక్కొక్కరికి విడివిడిగా పూజచేశాడు (10) సూర్యుని కుమారుడై నయముడు శాస్త్ర ప్రకారము వారికి పూజ చేశాడు గొప్పగా పూజించి ఆసనములలో కూర్చో పెట్టాడు (11) యముని వచనము - ఓ దేవకీసుత! మీద యవల్ల ఈ క్షేత్రము తీర్థ రూపమైంది. మీరు సంతోషించినందువలన, శివుని కృపవల్ల ఈవేళ అది తీర్థమైంది (12) ఈ నాటికి నా జన్మ సఫలమైంది. ఈనాటికి నా తపస్సు ఫలించింది. ఇప్పటికి నా స్థానము సఫలమైంది. బ్రహ్మవిష్ణు మహేశుల సమాగమం వల్ల సార్థకమైంది. (13) వ్యాసుని వచనము - ఈ రకముగా స్తుతించగా అప్పుడు విష్ణువు మధురమైన మాటలతో ఇట్లా అన్నాడు. ఓ విభు! ధర్మరాజేంద్ర నేను నీ స్తోత్రంతో ఆనందపడ్డాను (14) నేను మహా ఆనందంలో ఉన్నాను. ఏదైనా కోరుకో. నీ కోరికను నెరవేరుస్తాను. నీ కిష్టమైన దానిని నీకిస్తాను. అనుమానం వద్దు. (15) యముని వచనము - ఓదేవేశ! నీవు ఆనందిస్తే నావాంఛితాన్ని ఇవ్వదలిస్తే మహాపుణ్యమైన ధర్మారణ్య మందు ఋషుల ఆశ్రమాలను ఏర్పరచు (16) బ్రాహ్మణులు ఎక్కడ ఉంటారో యాజ్ఞకులు ఎక్కడ యజ్ఞం చేస్తారో వేద ధ్వనితోకూడిన ఆ ప్రదేశము ఉత్తమ తీర్థమౌతుంది (17) ఈ తీర్థ మందు బ్రాహ్మణులు లేరు. జంతువులు పీడిస్తున్నాయి. అందువలన ఓశారి!నీవు బాడబులను అనేకమంది ఋషులను తీసుకొనిరా. ముల్లోకములలో సచరాచర మందంతా ధర్మారణ్యము వెలిగి పోయేట్టుగా చేయి (18).

మూ || తతోవిష్ణుః సహస్రాక్షః సహస్ర శీర్షః సహస్రపాత్‌ | సహస్రశస్తదారూపం కృతవాన్‌ ధర్మవత్సలః

యస్మిన్‌ స్థానే చయేవిప్రాః సదాచారాః శుభవ్రతాః || 19 ||

అశేష ధర్మకుశలాః సర్వశాస్త్ర విశారదాః తపోజ్ఞానే మహాఖ్యాతా బ్రహ్మయజ్ఞ పరాయణాః

స్థాపితా ఋషయ న్సర్వే సహస్రాణ్యష్టాదశైవతు || 20 ||

నానాదేశాత్సమానీయ స్థాపితాస్తత్రతైఃసురైః ఆశ్రమాంశ్చ బహూంస్తత్రకాజేశైరపి నిర్మితాన్‌ || 21 ||

ధర్మోపదేశాత్కృష్ణేన బ్రహ్మణాచ శివేన చ | స్వేస్వేస్థానే యథాయోగ్యే స్థాపయామా సకేశవః || 22 ||

యుధిష్ఠిర ఉవాచ -

కస్మిన్వంశేసముత్పన్నా బ్రాహ్మణా వేదపారగాః | స్థాపితాః సపరీవారాః పుత్రపౌత్ర సమావృతాః

శిషై#్యశ్చ బహుభిర్యుక్తాః అగ్నిహోత్ర పరాయణాః | తేషాం స్థానాని నామాని యథాపచ్చవదస్వమే || 23 ||

వ్యాస ఉవాచ -

శ్రూయతాం నృపశార్దూల ధర్మారణ్య నివాసినాం | || 24 ||

మహాత్మనాం బ్రాహ్మణానాంఋషీణామూర్థ్వ రేతసాం | తేషాంవైపుత్రపౌత్రాణాంనామానిచవదామ్యహం || 25 ||

చతుర్వింశతి గోత్రాణి ద్విజానాం పాండవర్షభ | తేషాంశాఖాః ప్రశాఖాశ్చపుత్రపౌత్రా దయస్తథా || 26 ||

జజ్ఞిరేబహవః పుత్రాః శతశోథ సహస్రశః

చతుర్వింశతిముఖ్యానాం నామాని ప్రపదామితే | ద్విజానాం ఋషయః ప్రోక్తాః ప్రవరాణి తథాశృణు || 27 ||

భారద్వాజః తథావత్సః కౌశికః కుశఏవచ | శాండిల్యః కాశ్యపశ్చైవ గౌతమ శ్ఛాంధసస్తథా || 28 ||

జాతుకర్ణ్యః తథావాత్సో వసిష్టో ధారణస్థథా | ఆత్రయో భాండిలశ్చైవ లౌకి కాశ్చితః పరం || 29 ||

కృష్ణాయ నోపమన్యుశ్చ గార్గ్యముద్గల మౌషకాః | పుణ్యాసనః పరాశరః కౌండిన్యశ్చతతః పరం || 30 ||

తథాగాన్యసనశ్చైవ ప్రవరాణి చతుర్వింశతిః | జాగదగ్న్యస్య గోత్రస్య ప్రవరాః పంచ ఏవహి || 31 ||

భార్గవః చ్యవనాప్నువానౌ ర్వశ్చ జమదగ్నికః | పంచైతేవ్రవరారాజన్‌ విఖ్యాతాలోక విశ్రుతాః || 32 ||

ఏవం గోత్ర సముత్పన్నా వాడవా వేదపారగాః ద్విజ పూజాక్రియా యుక్తానానాక్రతుక్రియాపరాః || 33 ||

గుణన సంహితా ఆసన్‌ షట్‌ కర్మనిరతాశ్చయే | ఏవం విధా మహాభాగానానాదేశ భవాద్విజాః || 34 ||

భామేవసంతృతీయంచ ప్రపరాః పంచ ఏవహి | భార్గవచ్యావనాప్ను వానౌర్వజామదగ్న్య సంయుతాః

ఆత్రేయోర్చనాసనశ్చశ్యావాస్యేతి తృతీయతః | || 35 ||

అస్మిన్‌గోత్రేభవానిప్రాదుష్టాః కుటిలగామినః | ధనినోధర్మనిష్ఠాశ్చ వేద వేదాంగ పారగః || 36 ||

దాన భోగరతాః సర్వే శ్రౌతా స్మార్తేషు సంమతాః || 36 1/2 ||

తా || అప్పుడు సహస్రాక్షుడు, సహస్రశీర్షుడు, సహస్రపాదుడు ఐన విష్ణువు ధర్మవత్సలుడై తన రూపాన్ని వేయి విధములుగా చేశాడు. ఆయా స్థానములందున్న విప్రులను సదాచారులను శుభప్రతులను (19) సమస్త ధర్మములందుకుశలులను, సర్వశాస్త్ర విశారదులను, తపోజ్ఞానములందు ప్రసిద్ధమైన వారిని బ్రహ్మయజ్ఞ పరాయణులను ఏర్పరచాడు. పద్దెనిమిది వేల ఋషులను అందరిని ఏర్పరచాడు. (20) అనేక దేశములనుండి తీసుకొని వచ్చి ఆ దేవతలు వీరి నేర్పరచారు. త్రిమూర్తులు అనేక ఆశ్రమములు కల్పించారు (21) కృష్ణుడు ధర్మోపదేశం కొరకు ఆశ్రమములు కల్పించాడు. బ్రహ్మ శివుడు కల్పించారు. కేశవుడు అందరిని ఆయా వారికి యోగ్యములైన స్థానములందు ఆయా వారి ని ఉంచాడు (22) యుధిష్ఠురుని వచనము - వేదపారగులైన ఆ బ్రాహ్మణులు ఏవంశంలో జన్మించినవారు. సపరివారముగా పుత్రపౌత్రలతో కూడిన అనేక మంది శిష్యులతో కూడిన అగ్ని హోత్ర పరాయణులైన అట్లా స్థాపించబడిన ఆ బ్రాహ్మణుల స్థానములు నామములు ఉన్నదున్నట్లుగా నాకు చెప్పండి అని అన్నాడు (23) వ్యాసుని వచనము - ఓ నృప శార్దూల ధర్మారణ్యమందు నివసిస్తున్న (24) మహాత్ములైన బ్రాహ్మణులైన ఊర్ద్వరేతనులైన వారి నామములను పుత్రపౌత్రుల నామములను నేను చెబుతున్నాను విను (25) ఓ పాండవశ్రేష్ఠ! బ్రాహ్మణుల ఇరువది నాలుగు గోత్రములను, వారి శాఖలను, ప్రశాఖలను, అట్లాగే పుత్రపౌత్రాదులను (26) చెప్తాను. పుత్రులు నూర్లకొలది వేలకొలది అనేక మంది జన్మించారు. ప్రధానమైన ఇరువది నలుగురి పేర్లను చెప్తాను. ద్విజుల ఋషులు, ప్రవరలు చెప్పబడ్డాయి. వాటిని విను (27) భారద్వాఉడు, వత్సుడు, కౌశికుడు, కుశుడు, శాండిల్యుడు, కాశ్యపుడు, గౌతముడు, ఛాంధసుడు (28) జాతూకర్ణి, వాత్స్యుడు, వశిష్టుడు, ధారణుడు, ఆత్రేయుడు, భాండిలుడు, లౌకికుడు, ఇంకా (29) కృష్ణాయనుడు, ఉపమన్యుపు గార్గ్యుడు ముద్గలుడు మౌషకుడు, పుణ్యాసనుడు పరాశరుడు కౌండిన్యుడు ఇంకా (30) గాన్యాసనుడు వీరు ఇరువదినాలుగు మంది శ్రేష్ఠమైనవారు. జామదగ్న్య గోత్రమునకు చెందిన ప్రధానులు ఐదుగురే (31) భార్గవచ్యవన అప్నువాన ఔర్వజామదగ్నులు ఈ ఐదుగురు శ్రేష్ఠులు, ఓరాజ! వీరు కీర్తి మంతులు, లోకప్రసిద్ధులు. (32) ఈ విధమైన గోత్రములందు జన్మించిన వాడబులు వేదపారగులు బ్రాహ్మణ పూజాది క్రియలాచరించేవారు రకరకాల యజ్ఞ క్రియాపరులు (33) గుణవంతులు, షట్‌ కర్మనిరతులు ఈ విధమైన మహాభాగులు, నానాదేశములందు జన్మించిన ద్విజులు వీరు (34) భార్గవ చ్యవన అప్నువాన ఔర్వజామదగ్నులతో కూడిన వారు పంచప్రవరులే. ఆత్రేయులు, అర్చనాసనులు శ్యావాస్యులు అని ముగ్గురు (35) ఈ గోత్రమందు పుట్టిన విప్రులు దుష్టులు, వంకరగా పోయేవారు. దనవంతులు, ధర్మనిష్ఠులు, వేదవేదాంగపారగులు (36) దానభోరతులు అందరు శ్రౌతస్మార్తములందు ఇష్టులు (36 1/2)

మూ || మాండవ్యగోత్రేవిజ్ఞేయాః ప్రవరైః పంచభిర్యుతాః | || 37 ||

భార్గవశ్చ్యాపనోత్రిశ్చా ప్నువానౌర్వస్తథైవచ | అస్మిన్‌ గోత్రేభవా విప్రాః శ్రుతిస్మృతి పరాయణాః || 38 ||

రోగినోలోభినోదుష్టాయజనే యాజనే రతాః | బ్రహ్మక్రియా పరాః సర్వేమాండవ్యాః కురుసత్తమ || 39 ||

గార్గ్యస్య గోత్రేయేజాతాః తేషాంతు ప్రవరాస్త్రయః | అంగిరాశ్చాంబరీషశ్చ¸°వనాశ్వస్తృతీయకః || 40 ||

అస్మిన్గోత్రే సముత్పన్నాః సద్వృత్తాః సత్యభాషిణః | శాంతశ్చ భిన్న వర్ణాశ్చ నిర్ధనాశ్చకుచైలినః || 41 ||

సంగవాత్సల్య యుక్తాశ్చ వేదశాస్త్రేషునిశ్చలాః | వత్సగోత్రే ద్విజా భూప ప్రవరాః పంచ ఏవహి || 42 ||

భార్గవ చ్యవనాప్ను వానౌర్వశ్చ జమదగ్నికః | ఏభిస్తువంచవిఖ్యాతా ద్విజా బ్రహ్మస్వరూపిణః || 43 ||

శాంతాదాంతా సుశీలాశ్చ ధర్మపుత్రైః సుసంయుతాః | వేదాధ్యయన హీనాశ్చ కుశలాః సర్వకర్మను || 44 ||

సురూపాశ్చసదాచారః సర్వధర్మేషు నిష్ఠితాః దానధర్మరతాః సర్వే అన్నదా జలదా ద్విజాః || 45 ||

దయాలవః సుశీలాశ్చ సర్వభూతహితేరతాః | కాశ్యపాబ్రాహ్మణా రాజన్‌ ప్రపరత్రయ సంయుతాః || 46 ||

కాశ్యపశ్చా సవత్సారో నైధ్రువశ్చ తృతీయకః | వేదజ్ఞాగౌరవర్ణాశ్చ నైష్ఠికాయ జ్ఞకారకాః || 47 ||

ప్రియవాసా మహాదక్షా గురుభక్తి రతాః సదా | ప్రతిష్ఠా మా సవంతశ్చ సర్వభూతహితేరతాః || 48 ||

యజంతేచ మహాయజ్ఞాన్‌ కాశ్యపేయాద్విజాతయః | ధారీణ సగోత్రజాశ్చ ప్రవర్తైస్త్రి భిరన్వితాః || 49 ||

అగస్తి దర్విశ్వేతాశ్వదధ్య వాహనసంజ్ఞకాః | అస్మిన్‌ గోత్రేచ యేజాతా ధర్మకర్మ సమాశ్రితాః || 50 ||

కర్మక్రూరాశ్చతేసర్వే తథైవోదరిణస్తుతే | లంబకర్ణా మహాదంష్ట్రా ద్విజా ధనపరాయణాః || 51 ||

క్రోధినో ద్వేషిణశ్చైవ సర్వసత్వ భయంకరాః | లౌగాక్షసోద్భవాయేవై వాడవాః సత్యసంశ్రితాః || 52 ||

ప్రవరాశ్చత్రయస్తేషాం తత్వజ్ఞాన స్వరూపకాః | కశ్యపశ్చైవ వత్సశ్చవసిష్ఠశ్చ తృతీయకః || 53 ||

సదాచారాస్తువి ఖ్యాతావైష్ణవాబహుంవృత్తయః | రోమభిర్‌ బహుభిర్వ్యాప్తాః కృష్ణవర్ణాస్తువాడవాః || 54 ||

శాంతాదాంతాః సుశీలాశ్చ స్వదారనిరతాః సదా | కుశిక సగోత్రే యే జాతాః ప్రవరైః త్రిభిరన్వితాః || 55 ||

తా || మాండవ్య గోత్రమందలి వారు ఐదుగురు ప్రవరలతో కూడినవారు (37) భార్గవచ్యవన అత్రి ఆప్నువానౌర్వులు. ఈ గోత్రమందు జన్మించిన విప్రులు శ్రుతిస్మృతి పరాయణులు (38) రోగులు లోభులు దుష్టులు యజన యాజనరతులు. బ్రహ్మక్రియాపరులు. ఓకురుసత్తమ! మాండవ్యులంతా ఇట్టివారు (39) గార్గ్య గోత్రమందు జన్మించిన వారికి ప్రవరులు ముగ్గురు. అంగిరుడు, అంబరీషుడు ¸°వనాశ్వుడు అని ముగ్గురు (40) ఈ గోత్రమందు జన్మించినవారు మంచి నడవడిక గలవారు నిజంపలికేవారు శాంతులు, భిన్నవర్ణములవారు నిర్ధనులు కుచేలులు (41) సహవాసము ననుసరించి పోయేవారు. వారిపై దయగలవారు వేదశాస్త్రము లందు నిశ్చలమైన బుద్ధిగలవారు వత్సగోత్రమందలి ద్విజులకు ప్రవరులు ఐదుగురు (42) భార్గవ చ్యవన ఆప్నువాన ఔర్వజామదగ్నికులు. ఈ ఐదుగురు ప్రసిద్ధులు వీరు బ్రహ్మస్వరూపులు (43) శాంతులు దాంతులు సుశీలులు ధర్మపుత్రులు గలవారు, వేదాధ్యయన హీనులు, అన్ని పనులలో సమర్థులు (44) మంచి రూపం కలవారు, సదాచారులు, అన్ని ధర్మములలో నిష్ఠగలవారు దానధర్మరతులు అందరు అన్నదాతలు జలదానం చేసేవారు. (45) దయాళురు, సుశీలురు, సర్వప్రాణుల హితం కోరేవారు. కాశ్యపులు బ్రాహ్మణులు ముగ్గురు పరవరులు కలవారు (46) కాశ్యపుడు, ఆపవత్సారుడు, నైధ్రువుడు వీరు ముగ్గురు వేదజ్ఞులు, తెలుపు వర్ణం వారు నిష్ఠగలవారు యజ్ఞకారకులు (47) ప్రియమైన వస్త్రధారులు మహాదక్షులు ఎప్పుడూ గురుభక్తి గలవారు ప్రతిష్ఠ మాసము గలవారు అన్ని ప్రాణులందు ప్రేమ గలవారు (48) మహా యజ్ఞముల నాచరిస్తారు. కాశ్యప వంశమందలి బ్రాహ్మణుల ఇట్టి వారు ధారణ గోత్రజులు ముగ్గురు ప్రవరలతో కూడినవారు (49) అగస్తిదర్విశ్వేతాశ్వ దధ్యవాహనులను వారు ఇందుపుట్టిన వారు ధర్మకర్మల నాశ్రయించినవారు (50) క్రూరకర్ములు వారందరు తిండిపోతలు, పొడుగాటి చెవులు పెద్దపండ్లు ద్విజులు ధన పరాయణులు (51) కోవులు ద్వేషం కలవారు అందరికి భయం కల్గించేవారు. లోగాక్షసగోత్రీకులైన బ్రాహ్మణులు సత్యము పలికేవారు. (52) వారి ప్రవరులు ముగ్గురు. వారు తత్వజ్ఞాన స్వరూపకులు. ఆ ప్రవరులు కశ్యప వత్స వసిష్ఠులు. (53) సదాచారులు, ప్రసిద్ధులు, వైష్ణవులు, అనేక వృత్తులవారు. ఒంటినిండా రోమములుగలవారు నల్లనిరంగు గల బ్రాహ్మణులు (54) శాంతులు, దాంతులు, సుశీలురు, ఎప్పుడు తమ భార్యయందు ఆసక్తి గలవారుకు శికస గోత్రమందలివారు ముగ్గురు ప్రవరులు కలవారు (55).

మూ|| విశ్వామిత్రో దేవరాతః ఔదలశ్చ త్రయశ్చయే | అస్మిన్‌ గోత్రేతుయేజాతా దుర్బలాదీసమానసాః || 56 ||

అసత్యభాషిణోవిప్రాః సురూపానృపసత్తమాః | సర్వవిద్యాకుశలినో బ్రాహ్మణా బ్రహసత్తమాః || 57 ||

ఉపమన్యుసగోత్రేయాః ప్రవరత్రయ సంయుతాః | వసిష్ఠశ్చ భరద్వాజ స్త్వింద్ర ప్రమద ఏవవా || 58 ||

అస్మిన్‌ గోత్రేతుయే విప్రాః క్రూరాః కుటిలం గామినః | దూషణాద్వేషిణ స్తుచ్ఛాః సర్వసంగ్రహతత్పరాః || 59 ||

కలహోత్పాదనే దక్షాధనినోమానిసస్తథా | సర్వదైవప్రదుష్టాశ్చ దుష్ట సంగరతాస్థథా || 60 ||

రోగిణో దుర్బలాశ్చైవ వృత్త్యుపకల్పవర్జితాః | వాత్స్యగోత్రేభవావిప్రాః ప్రవరైః పంచభిర్యుతాః || 61 ||

భార్గవచ్యావనాప్నువా నౌర్వశ్చ జమదగ్నికః | అస్మిన్‌ గోత్రేభవావిప్రాః స్థూలాశ్చ బహుబుద్ధయః || 62 ||

సర్వకర్మరతాశ్చైవ సర్వధర్మేషు నిశ్చలాః | వేదశాస్త్రార్థ నిపుణాః యజనేయాజనేరతాః || 63 ||

సదాచారాః సురూపాశ్చ బుద్ధితోదీర్ఘదర్శినః | వాత్స్యాయనసగోత్రేయాః ప్రవరైః పంచభిర్యుతాః || 64 ||

భార్గవచ్యావనాప్నువానౌర్వశ్చ జమదగ్నికః | పూర్వోక్తాః ప్రవరాశ్చాస్య కథితాస్తవ భారత || 65 ||

అస్మిన్‌ గోత్రేతుయే జాతా పాక యజ్ఞరతాఃసదా | లోభినః క్రోధిసశ్చైవ ప్రజాయంతే బహుప్రజాః || 66 ||

స్నానదానాదినిరతాః సర్వదాశ్చ జితేంద్రియాః | వాపీకూపతడాగానాం కర్తారశ్చ సహస్రశః

వ్రతశీలాగుణజ్ఞాశ్చ మూర్ఖావేద వివర్జితాః || 67 ||

కౌశిక వంశేయేజాతాః ప్రవరత్రయ సంయుతాః | విశ్వామిత్రో ఘమర్షీచ కౌశికశ్చతృతీయకః || 68 ||

అస్మిన్‌ గోత్రేచయే జాతాః బ్రాహ్మణాః బ్రహ్మవేదినః | శాంతాః దాంతాః సుశీలాశ్చ సర్వధర్మపరాయణాః || 69 ||

అపుత్రిణస్తథారూక్షాస్తేజోహీనాద్విజోత్తమాః | భారద్వాజసగోత్రేయాః ప్రవరైః పంచ భిర్యుతాః || 70 ||

ఆంగిరసోబార్హస్పత్యో భారద్వాజస్తుసైన్యనః | గార్గ్యశ్చైవేతి విజ్ఞేయాః ప్రవరాః పంచ ఏవచ || 71 ||

అస్మిన్‌ గోత్రేచ యేజాతాః వాడవాధనినః శుభాః | వస్త్రాలంకారణోపేతా ద్విజ భక్తి పరాయణాః || 72 ||

బ్రహ్మభోజ్య పరాః సర్వే సర్వధర్మ పరాయణాః | కాశ్యపగోత్రేయే జాతాః ప్రవరత్ర యసంయుతాః || 73 ||

కాశ్యపశ్చావవవత్సారోరైభ్యేతి విశ్రుతాస్త్రయః | అస్మిన్గోత్రే భవావిప్రా రక్తాక్షాః క్రూరదృష్టయః || 74 ||

జిహ్వాలౌల్య రతాః సర్వేసర్వేతేపారమార్ధినః | నిర్ధనారోగిణశ్చైతే తస్కరానృతభాషిణః || 75 ||

శాస్త్రార్థవే దినః సర్వే వేదస్మృతి వివర్జితాః | శునకేషుచయే జాతాః విప్రాః ధ్యాన పరాయణాః || 76 ||

తపస్వినోయోగినశ్చ వేదవేదాంగ పారగాః || 76 1/2 ||

తా || విశ్వామిత్రుడు దేవరాతుడు ఔదలుడు అని ముగ్గురు. ఈ గోత్రమందు పుట్టినవారు దుర్బలులు, దీనమాననులు (56) అబద్ధాలనాడేవారు విప్రులు సురూపులు రాజశ్రేష్ఠులు. అన్ని విద్యలలో ఆరితేరినవారు బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానం కలవారు (57) ఉపమన్యు గోత్రం వారు ముగ్గురు ప్రవరులను కలవారు. వసిష్టుడు భరద్వాజుడు ఇంద్ర ప్రమదుడనువారు (58) ఈ గోత్రమందలి బ్రాహ్మణులు క్రూరులు, వక్రబుద్ధిగలవారు, దూషించతగిన వారు, ద్వేషించేవారు, తుచ్ఛులు అన్ని సంగ్రహించే లక్షణం కలవారు (59) తగాదాలు పెట్టుటలో సమర్థులు ధనవంతులుఅభిమానం గలవారు ఎప్పుడూ దుష్టస్వభావం గలవారు అట్లాగే చెడు సహవాసం కోరేవారు (60) రోగులు దర్బలులు నిర్జీతవృత్తి లేనివారు. వాత్స్య గోత్రమందలి విప్రులు ఐదు ప్రవరులను కలవారు. (61) భార్గవచ్యవన ఆప్నువాన, జమదగ్ని, ఔర్వులువారు. ఇందలి బ్రాహ్మణులు లావుపాటివారు బహుబుద్ధులు (62) సర్వకర్మలలో నిష్ణాతులు, సర్వ ధర్మములలో నిశ్చలబుద్ధిగలవారు. వేదశాస్త్రార్థ నిపుణులు. యజన యాజనరతులు (63) సదాచారులు సురూపులు బుద్ధి ద్వారా (దీర్ఘకాలాన్ని గూర్చి ఆలోచించేవారు) దీర్ఘదర్శులు. వాత్స్యాయన సగోత్రేయులు. ఐదుగురు ప్రవరులు కలవారు (64) భార్గవ చ్యావన ఆప్పువాన ఔర్య జమదగ్నికులువారు. పూర్వోక్త ప్రవరులే ఈతనికి చెప్పాము. మీకు భారత! (65) ఈ గోత్రమందు పుట్టినవారు ఎల్లప్పుడు పాక యజ్ఞం అంటే ఇష్టం కలవారు. లోభులు, క్రోథం కలవారు. చాలా సంతతి కలిగి ఉంటారు (66) స్నాన దానాదు లందు ఆసక్తి కలవారు అన్నీ ఇస్తారు. జితేంద్రియులు. వేలకొలది వాపి కూపతటాకములకు కర్తలు, వ్రతశీలురు గుణజ్ఞులు, మూర్ఖులు, వేదాలు వదలినవారు (67) కౌశిక వంశంలో జన్మించిన వారు ముగ్గురు ప్రవరులు కలవారు. విశ్వామిత్ర అఘమర్షీ కౌశికులు వారు (68) ఈ గోత్రంలో జన్మించిన వారు బ్రాహ్మణులు బ్రహ్మవిదులు శాంతులు, దాంతులు, సుశీలురు సర్వధర్మపరులు (69) సంతాన హీనులు, ప్రేమహీనులు, తేజోహీనులు, బ్రాహ్మణులు, భారద్వాసగోత్రులు ఐదు ప్రవరలు కలవారు (70) ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ, సైన్యస, గార్గ్య అని పంచ ప్రవరులు (71) ఈ గోత్రమందు పుట్టిన బాడబులు ధనవంతులు, శుభ##మైనవారు వస్త్ర అలంకారములు గలవారు బ్రాహ్మణ భక్తి కలవారు (72) భగవన్ని వేదనమందు ఆసక్తి కలవారు అందరు అన్ని ధర్మకార్యము లందు ఆసక్తులు. కాశ్యప గోత్రమందు జన్మించినవారు ముగ్గురు ప్రవరులు కలవారు (73) కాశ్యప అపవత్సారరైభ్యులని ముగ్గురు ప్రసిద్ధులు. ఈ గోత్రమందు పుట్టిన విప్రులు రక్తాక్షులు క్రూరదృష్టులు (74) జిహ్వాచాపల్యము కలవారు వారంతా వారంతా పరమార్థ చింతకలవారు ధనహీనులు రోగులు దొంగతనము అబద్ధమాడేవారు (75) అందరు శాస్త్రార్థము తెలిసినవారు, వేదముస్మృతులు వీనిని వదలినవారు శునక గోత్రమందు బుట్టినవారు విప్రులు, ధ్యాన పరాయణులు (76) తపస్వులు యోగులు వేదవేదాంగపారగులు (76 1/2)

మూ || సాధపశ్చ సదాచారాః విష్ణుభక్తి పరాయణాః || 77 ||

హ్రస్వకాయాభిన్నవర్ణాబహురామాద్విజోత్తమాః | దయాలాః నరలాః శాంతాః బ్రహ్మభోజ్య పరాయణాః || 78 ||

శౌనకసేషుయేజాతాః ప్రవరత్రయ సంయుతాః | భార్గవశౌసహోత్రేతి గార్త్య స్రమద ఇతిత్రయః || 79 ||

అస్మిన్వం శేనముత్పన్నావాడవాదుఃసహానృప | మహోత్కటామహాకాయాః ప్రలంబాశ్చ మదోద్థతాః || 80 ||

క్లేశరూపాః కృష్ణ వర్ణాః సర్వశాస్త్ర విశారదాః | బహుభుజోమానినోదక్షారాగద్వేషోవవర్జితాః || 81 ||

సువస్త్ర భూషారూపావై బ్రాహ్మణా బ్రహ్మవాదినః | వసిష్ఠగోత్రేయేజాతాః ప్రవరత్రయ సంయుతాః || 82 ||

వసిష్ఠో భారద్వాజ శ్చ ఇంద్రప్రమద ఏవచ | అస్మిన్‌ గోత్రే భవావిప్రా వేదవేదాంగ పారగాః || 83 ||

యాజ్ఞకాయజ్ఞశాలాశ్చ సుస్వరాః సుఖినస్తథా | ద్వేఫిణో ధనవంతశ్చ పుత్రిణోగుణిసస్తథా || 84 ||

విశాల హృదయారాజన్‌ శూరాః శత్రుని బర్హణాః | గౌతమసగోత్రేయేజాతాః ప్రవరాః పంచఏవహి || 85 ||

కౌత్సగార్గ్యోమ వాహాశ్చ అసితోదేవలస్తథా | అస్మిన్‌ గోత్రేచయేజాతాః విప్రాః పరమపావనాః || 86 ||

పరోపకారిణః సర్వేశ్రుతి స్మృతి పరాయణాః | బకాసనాశ్చ కుటిలాః ఛద్మవృత్తి పరాస్తథా || 87 ||

నానాశాస్త్రార్థ నిపుణాః నానా భరణ భూషితాః | వృక్షాది కర్మకుశలాః దీర్ఘరోషాశ్చరోగిణః || 88 ||

ఆంగిరసగోత్రేయే జాతాః ప్రవర త్రయసంయుతాః | ఆంగిరసోంబరీషశ్చ ¸°వనాశ్వస్తృతీయకః || 89 ||

అస్మిన్‌ గోత్రేచయేజాతాః సత్య సంభాక్షిణస్తథా | జితేంద్రియాః సురూపాశ్చ అల్పాహారాః శుభాననాః || 90 ||

మహావ్రతాః పురాణ జ్ఞాః మహాదాన పరాయణాః | నిర్ద్వేషిణోలోభయుతా వేదాధ్యనతత్పరాః || 91 ||

దీర్ఘదర్హిమహాతేజోమహామాయా విమోహితాః | శాండిలసగోత్రయే ప్రవరత్రయసంయుతాః || 92 ||

అసితోదేవలశ్చైవ శాండిలస్తు తృతీయకః | అస్మిన్‌ గోత్రే మహాభాగాః కుబ్జాశ్చ ద్విజసత్తమాః || 93 ||

నేత్రరోగీ మహాదుష్టా మహాత్యాగా అనాయుషః | కలహోత్పాదనేదక్షాః సర్వసంగ్రహతత్పరాః || 94 ||

మలినా మానినశ్చైవ జ్యోతిః శాస్త్ర విశారదాః | ఆత్రేయసగోత్రేయేజాతాః పంచ ప్రవర సంయుతాః || 95 ||

తా || సాధువులు, సదాచారులు, విష్ణుభక్తి పరాయణులు (77) పొట్టి శరీరము కలవారు. భిన్న వర్ణముల వారు అనేక మంది భార్యలు కలవారు బ్రాహ్మణోత్తములు. దయాళువులు. సరళ స్వభావులు శాంతులు, భగవన్నివేదపరులు (78) శౌనకస మందు పుట్టినవారు మూడు ప్రవరుల గలవారు భార్గవ శౌన హోత్రగా ర్‌త్స్య ప్రమదుడు అనువారు ముగ్గురు (79) ఈ వంశమందు పుట్టిన బాడబులు, దున్సహులు ఓరాజ! చాలా గర్వం కలవారు, మహాకాయులు, మదోద్ధతులు, పొడగరులు (80) దుఃఖించేవారు, నలుపురంగువారు సర్వశాస్త్ర విశారదులు, బాగా భోంచేసేవారు, మానవంతులు, సమర్థులు రాగద్వేషములను విడిచినట్లుంటారు (81) మంచి వస్త్రములు, భూషణములు, రూపము గలవారు, బ్రహ్మను గూర్చి వాదించే బ్రాహ్మణులు వసిష్ఠ గోత్రమందు పుట్టినవారు ముగ్గురు ప్రవరులను గలవారు (82) వసిస్టుడు, భారద్వాజుడు, ఇంద్ర ప్రమదుడు. ఈ గోత్రమందు పుట్టిన బ్రాహ్మణులు వేదవేదాంగపారగులు (83) యాజ్ఞకులు, యజ్ఞశీలుడు, సుస్వరం కలవారు, సుఖవంతులు ద్వేషం కలవారు, ధనవంతులు సంతానవంతులు, గుణవంతులు (84) విశాల హృదయులు, శూరులు, శత్రు సంహారకులు గౌతమ సగోత్ర మందు పుట్టినవారి ప్రవరులు ఐదుగురు (85) కౌత్స్యగార్గ్య ఉమవాహ, అసిత, దేవలులు ఈ గోత్రమందు పుట్టినవారు పరమ పావనమైన విప్రులు (86) అందరు పరోపకారులు శ్రుతిస్మృతి పరాయణులు, దొంగజపం చేసేవారు, కుటిలులు, మోసపువృత్తి గలవారు (87) నానా శాస్త్రార్థములందు నిపుణులు, నానాభరములతో అలంకృతులు, చెట్లు మొదలగు పనులలో కుశలులు. దీర్ఘరోషం కలవారు రోగులు (88) ఆంగిరస గోత్రమందు జన్మించిన వారు ముగ్గురు ప్రవరులను గలవారు. ఆంగీరస, అంబరీష ¸°వనాశ్వులు (89) ఈ గోత్రమందు జన్మించిన వారు సత్యం మాట్లాడేవారు, జితేంద్రియులు మంచి రూపం కలవారు, అల్పాహారులు, శుభ##మైన ముఖం కలవారు (90) మహావ్రతము కలవారు, పురాణాలు, మహాదాన పరాయణులు, దోషరహితులు, లోభం కలవారు, వేదాధ్యయన తత్పరులు (91) దీర్ఘ దర్శులు, మహా తేజస్సంపన్నులు, మహామాయతో మోహమందినవారు. శాండిలసగోత్రమువారు, ప్రవరత్రయము కలవారు (92) అసితుడు, దేవలుడు, శాండిలుడు ఈ గోత్ర మందలివారు అదృష్ట శాలులు, పొట్టివారు బ్రాహ్మణ శ్రేష్ఠులు (93) నేత్ర రోగం కలవారు, మహా దుష్టులు, మహాత్యాగులు, ఆయుష్య హీనులుతగాదాలు కల్పించుటలో సమర్థులు, అన్నిటినిసంగ్రహించే ఆసక్తికలవారు (94) మలినస్వభావులు అభిమానంగలవారు, జ్యోతిఃశాస్త్రవిశారదులు. ఆత్రేయసగోత్రమందలివారు పంచప్రవరలుకలవారు (95)

మూ|| ఆత్రేయోర్చనానసశ్యావాశ్వోంగిరసోత్రిశ్చ | అస్మిన్‌వంశేచయేజాతాః ద్విజాస్తేసూర్యవర్చనః || 96 ||

చంద్రవచ్ఛీతలాఃసర్వేధర్మారణ్యవ్యవస్థితాః | సదాచారాఃమహాదక్షాః శ్రుతిశాస్త్రపరాయణాః || 97 ||

యాజ్ఞికాశ్చశుభాచారాఃసత్యశౌచపరాయణాః | ధర్మజ్ఞాఃదానశీలాశ్చనిర్మలాశ్చమహోత్సుకాః || 98 ||

తపఃస్వాధ్యాయనిరతాఃన్యాయధర్మపరాయణాః || 99 ||

యుధిష్ఠిరఉవాచ -

కథయస్వమహాబాహోధర్మారణ్యకథామృతం | యచ్ఛ్రుత్వాముచ్యతేపాపాత్‌ఘోరాద్ర్బహ్మవధాదపి || 100 ||

వ్యాస ఉవాచ -

శృణురాజన్ర్పవక్ష్యామికథామేతాంసుదుర్లభాం ||101 ||

యక్షరక్షః పిశాచాద్యాఉద్వేజయంతివాడవాన్‌ | జృంభకోనామయక్షోభూద్ధర్మారణ్యసమీపతః || 102 ||

ఉద్వేజయతిపిత్యంసథర్మారణ్యనివాసినః | తతసై#్తశ్చద్విజాగ్రైస్తుదేవేభ్యోవినివేదితం || 103 ||

యక్షరక్షాదినాచైవపరిభూతావయంసురాః | త్యక్షామోద్యపరంస్థానంతద్భయాన్నాత్రసంశయః || 104 ||

తతోదేవైఃసగంధర్వైఃస్థాపితాఃతత్రభూమిషు | సి ద్థాశ్చపరయోగిస్యఃశ్రీమాతృప్రభృతయస్తథా || 105 ||

రక్షణార్థంహివిప్రాణాంలోకానాంహితకామ్యయా | గోత్రాస్ర్పతితదైకైకాస్థాపితాయోగినీతదా || 106 ||

యస్యగోత్రస్యయాశక్తీరక్షణపాలనేక్షమా | సాతస్యకులదేవీతిసాక్షాత్తత్రబభూవహ || 107 ||

తా || ఆత్రేయ, అర్చనాసన, శ్యావాశ్వ, అంగిరస అత్రులు ఈ వంశమందుపుట్టినబ్రాహ్మణులుసూర్యవర్చస్సు గలవారు (96) అందరుచంద్రునివలెచల్లనివారుధర్మారణ్యమందున్నారు. సదాచారులు మహాదక్షులుశ్రుతిశాస్త్రపరాయణులు (97) యాజ్ఞికులు, శుభాచారులు, సత్యశైచపరాయణులు, ధర్మజ్ఞులు దానశీలురు నిర్మలులు మహాఉత్సాహంకలవారు (98) తపఃస్వాధ్యాయనిరతులు న్యాయధర్మపరాయణులు (99) యుధిష్ఠిరునివచనము - ఓమహాబాహు, ధర్మారణ్య కథామృతమునుచెప్పండి. దానినివింటే ఘోరమైనవధపాపమునుండిముక్తులౌతారు. (100) వ్యాసునివచనము - ఓరాజ! చాలాదుర్లభ##మైన ఈకథనుచెప్తాను, విను. (101) యక్షులు రాక్షసులు పిశాచాదులు, బ్రాహ్మణులనుబాధపెడ్తున్నారు. ధర్మారణ్యంసమీపంలోజృంభకుడనుయక్షుడుండేవాడు. (102) వాడుధర్మారణ్యమందునివసించినవారిని ప్రతిరోజుఇబ్బంది పెట్టేవాడు. పిదపాబ్రాహ్మణులుదేవతల కునివేదించారు. (103) ఓ దేవతలార! మేముయక్షులురాక్షసులతోఅవమానింప బడ్డాము. వారిభయంతో ఈవేళ ఈఉత్తమమైన స్థానాన్ని వదలిపెడ్తున్నాము. అనుమానంలేదు. (104) అనగా అప్పుడు దేవతలు గంధర్వులు అక్కడ ఆప్రదేశంలోసిద్ధులను, పరయోగినులను శ్రీమాతృప్రభృతులను స్థాపించారు (105) బ్రాహ్మణులరక్షణకొరకు, లోకములక్షేమముకొరకుఒక్కొక్కగోత్రమునకు ఒక్కొక్కయోగినినిఅప్పుడు స్థాపించారు (106) ఏ గోత్రమునుఏశక్తిరక్షించగలదోఏశక్తిపాలించటంలోసమర్థురాలో, అగోత్రమునకు ఆమెకులదేవత అని అక్కడ ఏర్పడింది. (107)

మూ || శ్రీమతాతారణీదేవీఆశాపూరీచగోత్రపా | ఇచ్ఛా೭೭ర్తినాశినీచైవపిప్పలీవికారవశా || 108 ||

జగన్మాతామహామాతాసిద్ధాభట్టారికా తథా | కదంబా వికరామీఠసువర్ణావసుజాతధా || 109 ||

మాతంగీచమహాదేవీవాణీచముకుటేశ్వరీ | భద్రీచైవమహాశక్తిఃసంహారీచమహామలా || || 110 ||

చాముండాచమహాదేవీఇత్యేతాగోత్రమాతరః | బ్రహ్మవిష్ణుమహేశాద్యైఃస్థాపితాస్తత్రరక్షణ || 111 ||

తాఃపూజయంతివిప్రేంద్రాఃస్వధర్మనిరతాఃసదా | తతఃప్రభృతియోగిన్యఃస్వేస్వేకాలేసురక్షితాః || 112 ||

వాడవాఃస్వస్థతాంజగ్ముఃపుత్రపౌత్రైఃసమావృతాః | తతోదేవాఃసగంధర్వాఃహర్షనిర్భరమానసాః

విమానపరమారూఢాజగ్ముర్నాకేమృతాశనాః || 113 ||

గతేవర్షశ##తేరాజన్‌బ్రహ్మవిష్ణుమహేశ్వరాః | స్మృత్వాతుధర్మారణ్యస్యప్రేక్షణార్థంకుతూహలాత్‌ || 114 ||

సమాజగ్మస్తదారాజన్‌ప్రభాతేఉదితేరవౌ | విమానపరమారుహ్యఅప్సరోగణసేవితాః || 115 ||

గంధర్వైఃగీయమానాస్తేస్తూయమానాఃప్రబోధకైః | తత్రస్థానేద్విజారాజన్‌సమిత్సుష్పకుశాన్బహూన్‌ || 116 ||

ఆశ్రమాంస్తాన్పరిత్యాజ్యగతాఃసర్వేదిశోదశ | తమశ్రమపదందృష్ట్వాశూన్యంచైవమహేశ్వరః || 117 ||

ఉవాచవాక్యంధర్మజ్ఞోవాడవాన్‌క్లిశ##తేవిభో | శుశ్రూషార్థంహిశుశ్రూషూన్‌కల్పయేదితిమేమతిః || 118 ||

శ్రుత్వాతువచనంశభోఃదేవదేవోజనార్దనః | సత్యంసత్యమితిప్రోచ్యబ్రహ్మాణమిదమబ్రవాత్‌ || 119 ||

భోభోబ్రహ్మన్‌ద్విజాతీనాంశశ్రూషార్థంప్రకల్పయ | సృష్టిర్హిశాశ్వతీవాద్యద్విజోఘోపినుఖీభ##వేత్‌ || 120 ||

విష్ణోర్వాక్యమభిశ్రుత్వబ్రహ్మలోకపితామహః | సంస్మరన్‌కామధేనుంవైస్మరణనైవతత్‌క్షణ || 121 ||

అగతాతత్రసాధేనుః ధర్మారణ్యపవిత్రకే

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే పూర్వర్థేధర్మారణ్య మాహాత్మ్యేగోత్ర దేవీప్రవర, గోత్రదేవీకథసంనామనవమోధ్యాయః || 9 ||

తా || శ్రీమాత, తారణి, దేవి, ఆశాపూరి, గోత్రప,ఇచ్చాఆర్తినాశిని, పిప్పలి, వికారవశ (108) జగన్మాత, మహామాత, సిద్ధ, భట్టారిక, కదంబ,వికారమీఠ,సువర్ణవనుజ, (109) మాతంగి,మహాదేవి,వాణి,ముకుటేశ్వరి,భదరి,మహాశక్తిసంహారి, మహాబల (110) చాముండ, మహాదేవివీరు ఆయాగోత్రములమాతలు, బ్రహ్మవిష్ణుమహేశాదులు అక్కడరక్షణకొరకు వారినుంచారు (111) వారిని స్వధర్మనిరతులైనబ్రాహ్మణశ్రేష్ఠులుఎల్లప్పుడూపూజిస్తారు. నాటి నుండి యోగినులు తమతమ కాలమందు చక్కగ రక్షించగా (112) బాడబులు,పుత్రపౌత్రులతోకూడక్షేమంగాఉన్నారు. ఆపిదపదేవతలు, గంధర్వులు హర్షనిర్భరమానసులై, మంచివిమానములనెక్కి అమృతాశనులుస్వర్గమునకు వెళ్ళారు. (113) ఓరాజ! నూరుసంవత్సరాలు గడిచాక బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, జ్ఞాపకంవచ్చి కుతూహలముతో ధర్మారణ్యప్రేక్షణకొరకు (114) వచ్చారు. అప్పుడు ప్రభాతమందుసూర్యుడు ఉదయించాకవిమానములనధిరోహించి, అప్సరస,గణములుసేవిస్తుండగా, (115) గంధర్వులు గానంచేస్తుండగావైతాళికులుపొగడు తుండగావారొచ్చారు. ఓరాజ! ఆధర్మారణ్యంలోద్విజులు, సమిధలు, పూలు,కుశలు, (116) అనేకముతెచ్చేకొరకు ఆఆశ్రమములను వదలిఅందరు,తలోదిక్కువెళ్ళారు మహీశ్వరుడు,శూన్యమైన ఆఆశ్రమప్రాంతాన్ని చూచి (117) ధర్మజ్ఞుడైఇట్లాఅన్నాడు. ఓవిభు! బాడబులుకష్టపడుతున్నారు. వారిశుశ్రూషకొరకు శుశ్రూష చేసేవారిని కల్పించాలి. అని నా అభిప్రాయము. (118) శంభువు మాటను దేవదేవుడైనజనార్దనుడు వినిసత్యము సత్యముఅనిపలికిబ్రహ్మతోఇట్లాఅన్నాడు (119) ఓ బ్రహ్మ! బ్రాహ్మణులను శుశ్రూషకొరకు ఎవరినైనా కల్పించుఅని. ఈనాటికి సృష్టిశాశ్వతమైనది. బ్రాహ్మణసమూహములు ఆనందిస్తాయి సుఖిస్తాయి. అనగా విష్ణువు వాక్య మునువినిలోకపితామహుడు బ్రహ్మ (120) కామధేనువునుస్మరించాడు. స్మరించినంతలో ఆక్షణంలోనే అక్కడికి ఆఆవువచ్చింది, పవిత్రమైన ధర్మారణ్యానికి (121) అని శ్రీస్కాందమహాపురాణమందు ఏకాశీతిసహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండ మందు పూర్వార్థమందు ధర్మారణ్యమాహాత్మ్యమందు గోత్రదేవకథనమనునది తొమ్మిదవ అ ధ్యాయము || 9 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters