Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఏబది రెండవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

భూయోప్యహంప్రవక్ష్యామిసేతుముద్ధిశ్యవైభవం | యుష్మాకమాదరేణాహం శృణుధ్వంమునిపుంగవాః || 1 ||

స్థానా నామపిసర్వేషా మేతత్‌ స్థానం మహత్తరం | అత్ర జప్తం హుతం తప్తం దత్తం చాక్షయముచ్యతే || 2 ||

అస్మిన్నేవ మహాస్థానే ధనుష్కోటౌ నిమజ్జనాత్‌ | వారాణస్యాం దశసమావాస పుణ్యఫలం భ##వేత్‌ || 3 ||

తస్మిం స్థలేధనుష్కోటౌ స్నాత్వారామేశ్వరం శివం | దృష్ట్వానరోభక్తి యుక్తః త్రిదినాని వసే ద్ద్విజాః || 4 ||

పుండరీక పురేతేన దశవత్సర వాసజం | పుణ్యం భవతి విప్రేంద్రా మహాపాతక నాశనం || 5 ||

అష్టోత్తర సహస్రంతు మంత్ర మాద్యం షడక్షరం | అత్రజప్త్వా నరోభక్త్యా శివసాయుజ్యమాప్నుయాత్‌ || 6 ||

మధ్యార్జునే కుంభకోణ మాయూరేశ్వేతకాననే | హాలేస్యేచ గజారణ్య వేదారణ్యచ నైమిశే || 7 ||

శ్రీ పర్వతేచ శ్రీరంగే శ్రీమద్వృద్ధ గిరౌతథా | చిదంబరేచ వల్మీకే శేషా ద్రావరుణాచలే || 8 ||

శ్రీమద్దక్షిణ కైలాసే వేంకటాద్రౌ హరిస్థలే | కాంచీపురే బ్రహ్మపురే వైద్యేశ్వర పురేతథా || 9||

అన్యత్రా పిశివస్థానే విష్ణుస్థానే చ సత్తమాః వర్షవాసభవం పుణ్యం ధనుష్కోటౌ సరోముదా || 10 ||

మాఘమాసే యదిస్నాయ దాప్నోత్యేవన సంశయః | | ఇమంసేతుం సముద్దిశ్యద్వౌ సముద్రావితి విశ్రుతిః || 11 ||

విద్యతే బ్రాహ్మణ శ్రేష్ఠాః మాతృభూతాసనాతనీ | అదోయుద్ధారురిత్యన్యాయత్రాస్తి మునిపుంగవా || 12 ||

విష్ణోః కర్మాణి పశ్యంతీ సే తువైభవశంసినీ | శ్రుతిరస్తి తథాన్యాపి త ద్విష్ణోరితి చాపరా || 13 ||

ఇతిహాస పురాణాని స్మృత యశ్చ తపోధనాః | ఏకవాక్యతయాసేతు మాహాత్మ్యం ప్రబ్రువంతిహి || 14 ||

చంద్రసూర్యో పరాగేషు కుర్వన్‌ సేత్వంగాహనం | అవిముక్తే దశాబ్దంతు గంగా స్నాన ఫలం లభేత్‌ || 15 ||

కోటిజన్మ కృతం పాపం తత్‌ క్షణనైవనశ్యతి | అశ్వమేధ సహస్రస్య ఫలమాప్నోత్యనుత్తమం || 16 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - తిరిగి నేను సేతువునకు చెందిన వైభవాన్ని చెబుతున్నాను. మీకు ఓ మునులార! ఆదరంతో వినండి (1) స్థానములన్నింటి కంటెను ఈ స్థానము మహత్తరమైనది. ఇక్కడ జపము, హోమము, తపస్సు, దానము ఏది చేసినా అది అక్షయమని చెప్పబడింది (2) ఈ మహాస్థాన మందే ధనుష్కోటి యందు స్నాన మాచరిస్తే వారాణసి యందు పది సంవత్సరాలుంటే వచ్చే పుణ్యఫలము లభిస్తుంది (3) ఆ స్థల మందు ధనుష్కోటి యందు స్నాన మాచరించి రామేశ్వరుని చూచి, నరుడు భక్తి యుక్తుడై మూడు రోజులుండాలి, ఓ ద్విజులార (4) దాని వలన పుండరీక పురమందు పదిసంవత్సరములుంటే వచ్చే పుణ్యము లభిస్తుంది. ఓ విప్రులార ! అది మహాపాతక నాశకము (5) ఇక్కడ ఆద్యమైన షడక్షర మంత్రాన్ని వేయి ఎనిమిది సార్లు భక్తితో జపిస్తే ఆనరుడు శివ సాయుజ్యమును పొందుతాడు (6) మధ్యార్జునము, కుంభకోణము, మాయూరము, శ్వేతవనము, హాలాస్యము, గజారణ్యము, వేదారణ్యము, నైమిషము (7) శ్రీ పర్వతము, శ్రీరంగము, శ్రీమత్‌ వృద్ధగిరి, చిదంబరము, వల్మీకము, శేషాద్రి, అరుణాచలము (8) శ్రీమత్‌ దక్షిణ కైలాసము, వేంకటాద్రి, హరిస్థలము, కాంచీ పురము, బ్రహ్మపురము, వైద్యేశ్వర పురము (9) ఇతర శివస్థానములు, విష్ణు స్థానములు ఇక్కడ సంవత్సర కాలము ఉంటే వచ్చే పుణ్యము, నరుడు ఆనందంతో ధనుష్కోటి యందు (10) మాఘమాసమందు స్నానం చేస్తే పొందుతాడు, అనుమానంలేదు. ఈ సేతువునుద్దేశించి, రెండు సముద్రములు అని శ్రుతి (11) బ్రాహ్మణ శ్రేష్ఠమైనది, మాతృభూతమైనది, సనాతనమైనది ''అదోయద్దారు'' అని ఒక శ్రుతి ఉంది మునులార! (12) విష్ణువు కర్మలను చూచేది సేతు వైభవమును ప్రశంసించేది మరొక శ్రుతి కూడా ఉంది. ''తద్విష్ణో'' అని అపరమైనది (13) ఓ తపోధనులార ! ఇతిహాస పురాణములు, స్మృతులు, ఒకే రీతిగా సేతు మాహాత్మ్యమును చెబుతున్నాయి (14) చంద్ర సూర్యుల గ్రహణ మందు సేతువు యందు స్నానమాచరించిన ''అవిముక్త'' మందు పది సంవత్సరాలుంటే లభించే గంగాస్నాన ఫలము, లభిస్తుంది (15) కోటి జన్మలలో చేసిన పాపము ఆక్షణంలోనే నశిస్తుంది.ముఖ్యమైన అశ్వమేధ సహస్రముల ఫలాన్ని పొందుతాడు (16).

మూ || విషువాయన సంక్రాంతౌ శశివారే చ పర్వణి | సేతుదర్శన మాత్రేణ సప్తజన్మార్జితా శుభం || 17 ||

నశ్యతే స్వర్గంతించైవ ప్రయాతి ద్విజపుంగవాః | మకరస్థేర వౌమాఘే కించిదభ్యుదితేరవౌ || 18 ||

స్నాత్వాదిన త్రయం మర్త్యో ధనుష్కోటౌ విపాతకః | గంగాది సర్వతీర్థేషు స్నాన పుణ్య మవాప్నుయాత్‌ || 19 ||

ధనుష్కోటౌనరః కుర్యాత్‌ స్నానం పంచదినేషుయః | అశ్వమేధాది పుణ్యంచ ప్రాప్నుయాద్ర్బాహ్మణోత్తమాః || 20 ||

చాంద్రాయణాదికృచ్ఛ్రాణా మనుష్ఠాన ఫలం లభేత్‌ | చతుర్ణామపివేదానాం పారాయణ ఫలం తథా || 21 ||

మాఘమాసే| దశాహః సుధనుష్కోటౌ నిమజ్జనాత్‌ | బ్రహ్మహత్యాయుతం నశ్యేన్నాత్ర కార్యవిచారణా || 22 ||

మాఘమాసే ధనుష్కోటౌ దశపంచదినానియః | స్నానం కరోతి మనుజః సవైకుంఠ మవాప్నుయాత్‌ || 23 ||

మాఘమాసే రామసేతౌ స్నానం వింశద్దిసంచరన్‌ | శివసామీప్యమాప్నోతి శివేన సహమోదతే || 24 ||

పంచవింశద్దిసంస్నానంకుర్వన్‌సారూప్యమాప్నుయాత్‌ | స్నానంత్రింశద్దినంకుర్వన్‌సాయుజ్యంలభ##తేధ్రువం || 25 ||

అతోపశ్యం రామసేతౌ మాఘమాసే ద్విజోత్తమాః | స్నానం సమాచరే ద్విద్వా న్కించి దభ్యుదితే రవౌ || 26 ||

చంద్రసూర్యో పరాగేచ తథైవార్ధోదయే ద్విజాః | మహోదయే రామసేతౌ స్నానం కుర్వన్ద్విజోత్తమాః || 27 ||

అనేకక్లేశ సంయుక్తం గర్భవాసం నపశ్యతి | బ్రహ్మహత్యాది పాపానాం నాశకం చప్రకీర్తితం || 28 ||

సర్వేషాంనరకాణాంచ బాధకం పరికీర్తితం | సంపదా మపి సర్వాసాం నిదానం పరికీర్తితం || 29 ||

ఇంద్రాది సర్వలోకానాం సాలోక్యాది ప్రదంతథా | చంద్రసూర్యో పరాగేచ తథైవార్థోదయే ద్విజాః || 30 ||

మహోదయే ధనుష్కోటౌ మజ్జనం త్వతి నిశ్చితం | రావణస్య వినాశార్థం పురారామేణ నిర్మితం || 31 ||

సిద్ధచారణ గంధర్వ కిన్నరోరగ సేవితం | బ్రహ్మ దేవర్షిరాజర్షి పితృసంఘనిషేవితం || 32 ||

బ్రహ్మాదిదేవతా వృందై స్సేవితం భక్తి పూర్వకం | పుణ్యం యో రామసేతుంవై సంస్మరన్‌ పురుషోద్విజాః || 33 ||

స్నానాచ్చయత్రకుత్రాపి తటాకాదౌ జలాశ##యే | సతస్యదుష్కృతం కించిత్‌ భవిష్యతి కదాచన || 34 ||

తా || విషవత్తు, అయనము, సంక్రాంతివీనియందుసోమవారము, పర్వమందు సేతువనుదర్శించినమాత్రంతో ఏడుజన్మలలోపొందినఅశుభము (17) నశిస్తుంది. ఓద్విజపుంగవులార! సరస్వతినికూడా పొందుతారు. సూర్యుడుమకరరాశియందుండగామాఘమాసమందుకొద్దిగాసూర్యుడుదయించాక (18) మూడురోజులుధనుష్కోటియందుస్నానంచేసిననరుడు పాతకరహితుడైగంగాదిపర్వతీర్థములలోస్నానంచేస్తే కలిగేపుణ్యమునుపొందుతాడు (19) ధనుష్కోటియందుఐదురోజులు స్నానంచేసిననరుడుఅశ్వమేధాదులవల్లకలిగేపుణ్యమునుపొందుతాడు ఓబ్రాహ్మణోత్తములార! (20) చాంద్రయణము మొదలగుకృచ్ఛ్రములనుఆచరించినఫలమునుపొందుతాడు. నాలుగువేదములపారాయణఫలమునుపొందుతాడు (21) మాఘమాసంలోపదిరోజులుధనుష్కోటియందుస్నానమాచరించినపదివేలబ్రహ్మహత్యలపాపమునశిస్తుంది. ఇందులో ఆలోచించాల్సిందిలేదు (22) మాఘమాసమందుధనుష్కోటియందుపదునైదురోజులుస్నానంచేసినమనుజుడువైకుంఠమునుపొందుతాడు (23) మాఘమాసమందురామసేతువుయందుఇరువదిరోజులుస్నానమాచరించినవారుశివసామీప్యమునుపొందుతారు. శివునితో కలిసి ఆనందిస్తారు. (24) ఇరువదియైదురోజులుస్నానముచేసి సారుప్యమును పొందుతారు. ముప్పదిరోజులుస్నానమాచరించిన సాయుజ్యమునుపొందుతాడు. (25) అందువల్ల ఓ ద్విజులార! మాఘమాస మందురామసేతువుయందు తప్పకుండా విద్వాంసుడుసూర్యుడుకొంచంఉదయించాకస్నానంఆచరించాలి. (26) చంద్రసూర్యులగ్రహణమందు, అర్ధోదయమందు, మహోదయమందురామసేతువుయందుస్నానమాచరించిన(27) నరుడు అనేకక్లేశములతోకూడినగర్భవాసమునుపొందడు. ఇదిబ్రహ్మహత్యాదిపాపనాశనము సంపదలకన్నింటికినిస్థానమనిచెప్ప బడింది. (28) నరకములన్నింటినినశింపచేసేదనిచెప్పబడింది. సంపదలకన్నింటికిస్థానమనిచెప్పబడింది. (29) ఇంద్రాదిసర్వ లోకములయొక్కసాలోక్యముమొదలగువానినిఇచ్చునది. చంద్రసూర్యగ్రహణమందుఅట్లాగేఅర్థోదయమందు (30) మహో దయమందుధనుష్కోటియందుస్నానమాచరించుట తప్పకనిశ్చయమైనది. రావణునివినాశనముకొరకుపూర్వమురాముడు నిర్మించబడినట్టిది. (31) సిద్ధచారణగంధర్వ కిన్నర ఉరగులతో సేవింపబడినది. బ్రహ్మర్సిదేవర్షి, పితృసంఘములతోసేవింప బడినది. (32) బ్రహ్మాదిదేవతాబృందముతోభక్తిపూర్వకముగాసేవింపబడినది పుణ్యప్రదమైనది, ఐనరామసేతువునుస్మరించి నరుడు (33) ఏతటాకాదిజలాశయములందుస్నానమాచరించినా, ఆతని దుష్కృతము ఏమి ఉండదు. భవిష్యత్తులోకలుగదు కూడా (34)

మూ || సేతుమధ్యస్థతీర్థేషుముష్టిమాత్రప్రదానతః | సశ్యంతిసకలారోగాభ్రూణహత్యాదయస్తథా || 35 ||

రామేణధనుషఃపుణ్యాంయోరేఖాంపశ్యతేకృతాం | సతస్యపునరావృత్తిఃవైకుంఠాత్‌స్యాత్కదాచన || 36 ||

ధనుష్కోటిరితిఖ్యాతాయాలోకేపాపనాశినీ | విభీషణప్రార్థనయాకృతారామేణధీమతా || 37 ||

ధనుష్కోటిర్మహాపుణ్యాతస్యాంస్నాత్వాసభక్తికం | దద్యాద్దానానివిత్తానాంక్షేత్రాణాంచగవాంతథా || 38 ||

తిలానాంతండులానాంచధాన్యానాంవయసాంతధా | వస్త్రాణాంభూషణానాంచమాషాణామోదనస్యచ || 39 ||

దధ్నాంఘృతానాంవారీణాంశాకానామప్యుదశ్వితాం | శుద్ధానాంశర్కరానాంచసన్యానాంమధునాంతదా || 40 ||

మోదకానామపూపానాంఅన్యేషాందానమేవచ | రామసేతౌద్విజాఃప్రోక్తంసర్వాభీష్టప్రదాయకం || 41 ||

అతోదద్యాద్రామసేతౌవిత్తలోభవివర్జితః | దత్తంహుతంచతప్తంచజపనిశ్చయమాదికం || 42 ||

శ్రీరామధనుషఃకోటావనంతఫలదంభ##వేత్‌ | తేనవేదాశ్చతుష్యంతితుష్యంతిపితరస్తధా || 43 ||

తుష్యంతిమునయన్సర్వేబ్రహ్మావిష్ణుఃశివస్తథా | నాగాఃకింపురుషాయక్షాఃసర్వేతుష్యంతి నిశ్చితం || 44 ||

స్వయంచపూతోభవతిధనుష్కోట్యవలోకనాత్‌ | స్వవంశజాన్నరాన్‌ సర్వాన్‌ పాపయేచ్చపితామహాన్‌ || 45 ||

తారయేచ్చకులంసర్వంధనుష్కోట్యవలోకనాత్‌ | రామస్యధనుషఃకోట్యాకృతరేఖావగాహనాత్‌ || 46 ||

పంచపాతకకోటినాంనాశఃస్యాత్తక్షణధ్రువం | శ్రీరామధనుషఃకోట్యారేఖాంయఃపశ్యతేకృతాం || 47 ||

అనేకక్లేశసంపూర్ణగర్భవాసంసపశ్యతి | యత్రసీతానలంప్రప్తాతస్మిస్కుండేనిమజ్జనాత్‌ || 48 ||

భ్రూణహత్యాశతంవిప్రానశ్యతిక్షణమాత్రతః | యథారామస్తథాసేతుఃయథాగంగాతథాహరిః || 49 ||

తా||సేతుమధ్యమందున్నతీర్థములలోపిడికెడుమాత్రమైనదానంచేయటంవలనకలరోగములు, అట్లాగేభ్రూణహత్యాదిపాపములునశిస్తాయి. (35) రాముడుగీసినధనుస్సుయొక్కరేఖనుపుణ్యమైనదానినిచూచినవారికివైకుంఠమునుండి పునరావృత్తిఎప్పుడుఉండదు. (36) ఈలోకంలోధనుష్కోటియనిప్రసిద్ధమైనపాపనాశకమైనదానినిధీమంతుడైనరాముడు విభీషణునిప్రార్థనతోఏర్పరచాడు (37) ధనుష్కోటిమహాపుణ్యప్రదమైనది. అందుభక్తిపూర్వకముగాస్నానంచేసిధనము, భూమి, గోవులు మొదలగునవిదానంచేయాలి (38) నువ్వులు, బియ్యము, ధాన్యము, పాలు, వస్త్రములు, భూషణములు, మినుములు, అన్నము (39) పెరుగు, నేయి, నీరు, శాకములు, సగంనీళ్ళుగలమజ్జిగ, శుద్ధమైనశర్కర, పండ్లు, తేనె అట్లాగే (40) లడ్డూలు, అప్పాలు, ఇంకాఇతరమైనదానములురామసేతువయందుచేయాలనిచెప్పారు. ఓద్విజులార! ఇవిసర్వాభీష్టములనుఇచ్చేవి (41) అందువల్లరామసేతువుయందువిత్తలోభంలేక ఉండిదానంచేయాలి. ఇక్కడచేసిన దానము, హోమము, తపము, జపము, నియమాదులు (42) ఈశ్రీరామధనుష్కోటియందుఅనంతఫలమునిస్తాయి. అందువలనవేదములుసంతోషిస్తాయి, అట్లాగేపితరులుసంతోషిస్తారు (43) మునులందరుసంతోషిస్తారు అట్లాగేబ్రహ్మ విష్ణుశిశవులు, నాగులు, కింపురుషులు, యక్షులు, అందరుసంతోషిస్తారుఇదినిశ్చయము (44) ధనుష్కోటినిచూడటంవలన స్వయముగాపవిత్రుడౌతాడు. తనవంశంలోపుట్టినమనుజులనందరిని, పితామహులనుపవిత్రులను చేస్తాడు. (45) ధనుష్కోటినిచూడటంవలనకులమంతాతరిస్తుంది. రాముడుధనస్సుకోటితోచేసినరేఖప్రాంతమునమునుగుటవలన (46) కోట్లకొలదిపంచపాతకములు ఆ క్షణంలోనే నశిస్తాయి, నిశ్చయము. శ్రీరాముడు ధనస్సు చివరతో చేసిన రేఖను చూచిన నరుడు (47) అనేకక్లేశములతోకూడినగర్భవాసమును పొందడు. సీతఅగ్నిప్రవేశంచేసిన కుండమందుస్నానంచేసినయెడల (48) క్షణకాలంలో, నూరుభ్రూణహత్యలవల్లకలిగినపాపమునశిస్తుంది. రాముడెట్లాగో సేతువుఅట్లాంటిది. గంగ ఎట్లాంటి దోహరి అట్లాంటివాడు (49)

మూ || గంగేహరేరామ సేతోత్వితిసంకీర్తయన్నరః | యత్రక్వాపిబహిఃస్నాయాత్‌తేనయాతిపరాంగతిః || 50 ||

సేతావర్థోదయేస్నాత్వాగంధమాదనపర్వతే | పితూనుద్దిశ్యయఃపిండాన్‌దద్యాత్‌సర్షపమాత్రకాన్‌ || 51 ||

పితరస్తృప్తిమాయాంతియావచ్చంద్రదివాకరౌ | శమీపత్రప్రమాణంతుపితౄనుద్దిశ్యభక్తితః || 52||

ద్విజేనపిండందత్తంచేత్‌సర్వపాపవిమోచితః | స్వర్గస్థోముక్తిమాయాతినరకస్థోదిపంవ్రజేత్‌ || 53 ||

సేతౌచపద్మనాభేచగోకర్ణపురుషోత్తమే | ఉదస్వదంభసిస్నానంసార్వకాలికమీప్సితం || 54 ||

శుక్రాంగారకసౌరీణాంవారేషులవణాంభసి | సంతానకామీనస్నాయాత్‌సేతోరస్యత్రకర్హిచిత్‌ || 55 ||

అకృతప్రేతకార్యోవాగర్భిణీపతిరేవవా | సస్నాయాదుదధౌవిద్వాన్‌సేతోరస్యత్రకర్హిచిత్‌ || 56 ||

నకాలాపేక్షణంసేతోనిత్యస్నానంప్రశస్యతే | వారతిథ్యృక్షనియమాఃసేతోరస్యత్రహిద్విజాః || 57 ||

ఉద్దిశ్యజీవతఃస్నాయాన్నతుస్నాయాస్మృతాన్ర్పతి | కుశైఃప్రతికృతిం కృత్వాస్నాప యేత్తీర్థవారిభిః || 58 ||

ఇమంమంత్రంసముచ్చార్యప్రసన్నేంద్రియమానవః | కృశోసిత్వంపవిత్రోసివిష్ణునావిధృతఃపురా || 59 ||

త్వయిస్నాతేసచస్నాతోయసై#్యతత్‌గ్రంధిబంధనం | సర్వత్రసాగరఃపుణ్యఃసదాపర్వణిపర్వణి || 60 ||

సేతౌసింధ్యబ్ధినంయోగేగంగా సాగర సంగమే | నిత్యస్నానంహి నిర్దిష్టంగోకర్ణేపురుషోత్తమే || 61 ||

నాపర్వణిసరిన్నాథంస్పృశేదన్యత్రకర్హిచిత్‌ |పితౄణాంసర్వదేవానాంమునీనామపిశృణ్వతాం || 62 ||

ప్రతిజ్ఞామకరోద్రామఃసీతాలక్ష్మణసంయుతః | మయాహ్యత్రకృతేసేతౌస్నానంకుర్వంతియేనరాః || 63 ||

మత్ర్పసాదేన తేసర్వేసయాస్యంతి పునర్భవం | నశ్యంతిసర్వపాపానిమత్సేతోరవలోకనాత్‌ || 64 ||

రామనాథస్యమాహాత్మ్యంమత్సేతోరపివైభవం | నాహంవర్ణయితుంశక్తోవర్షకోటిశ##తైరపి || 65 ||

ఇతిరామస్యవచనంశ్రుత్వాదేవమహర్షయః | సాధు సాధ్వితిసంతుష్టాఃప్రశశంసుశ్చతద్వచః || 66 ||

సేతుమధ్యేచతుర్వక్త్రఃసర్వదేవసమన్వితః | అధ్యాస్తేతస్యరక్షార్థమీశ్వరస్యాజ్ఞయాసదా || 67 ||

తా || ఓగంగ, హరి, రామసేతు, అనినరుడుసంకీర్తనచేస్తూఇతరత్ర ఎక్కడ స్నానంచేసినాదానితోఉత్తమగతినిపొందుతాడు. (50) గంధమాదనపర్వతమందుసేతువుయందుఅర్థోదయందుస్నానంచేసిపితరులనుద్దేశించి ఆవగింజంతమాత్రమైనపిండ మిచ్చినా (51) ఆతనిపితరులుసూర్యచంద్రులున్నంతకాలముతృప్తినందుతారు. పితరులనుద్దేశించిభక్తితోశమీఆకు ప్రమాణంతో (52) ద్విజుడుపిండముఇస్తే అన్నిపాపములనుండివిముక్తులై అతనిపితరులుస్వర్గమందుంటేముక్తినందుతారు. నరకమందుంటే స్వర్గమునకువెళ్తారు. (53) సేతువుయందు, పద్మనాభమందు, గోకర్ణమందుపురుషోత్తమందుసముద్ర స్నానముఅన్నిసమయములందు, కాలమునందుకోరతగినదే (54) శుక్ర, మంగళ, శనివారములందుసముద్రమందు సంతానముకావాలనికోరువాడు. సేతువునకన్నఇతరమైనచోటఎక్కడాస్నానంచేయరాదు. (55) విద్వాంసుడుప్రేతకార్యము చేయనివాడు. లేదాగర్భిణిభర్తకాని సేతువునకన్నఇతరమైనసముద్రప్రాంతమందైనాస్నానంచేయరాదు (56) సేతుస్నాన మందుకాలంకొరకుఎదిరిచూడటంఅవసరంలేదు. నిత్యస్నానముప్రశస్తమైనది. వారతిధినక్షత్రనియమములుసేతువునకన్న ఇతరత్రస్నానమందే, ఓ ద్విజులార ! (57) బ్రతికి ఉన్న వారినుద్దేశించి స్నానం చేయాలి. మృతులను గూర్చి స్నానం చేయరాదు. కుశలతో ప్రతిరూపానని చేసి తీర్థవారితో స్నానం చేయించాలి (58) ప్రసన్న ఇంద్రియ మానసములు కలవాడై ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్నానం చేయించాలి. ''నీవు దర్భవు నీవు పవిత్రమైన దానివి. విష్ణువు పూర్వం ధరించాడు (59) నీవు స్నానం చేస్తే ఆతడు స్నానం చేస్తాడు. ఈముడితో బంధించటము ఆతనికి చెందినదే'' అని మంత్రము. ఎల్లప్పుడు ప్రతి పర్వమందు సముద్రము అంతట పుణ్యప్రదమైనదే (60) సేతువుయందు సింధు, అబ్ధుల సంయోగమందు (సరస్సుల), గంగా సాగర సంగమ మందు,గోకర్ణమందు, పురుషోత్తమ మందు నిత్యస్నానము చెప్పబడినది (61) పర్వము కానివాడు(పర్వదినములు ఐదు కృష్ణ అష్టమి, చతుర్దశులు పూర్ణి, సూర్యసంక్రమణము, అమావాస్య సరిత్‌నాధుని ఇతరమైన చోట ఎక్కడా తాకరాదు. పితరులు, సర్వదేవతలు, మునులు అందరు వింటుండగా (62) సీతా లక్ష్మణులతో కూడి రాముడు ప్రతిజ్ఞ చేశాడు. నేనిక్కడ నిర్మించిన సేతువు యందు స్నానం చేసిన నరులు (63) నా అనుగ్రహం వల్ల వారందరు తిరిగి జన్మను పొందరు. నా సేతువును చూడటం వలన పాపములన్ని నశిస్తాయి. (64) రామనాథుని మాహాత్మ్యాన్ని, నా సేతువు వైభవమును నూరుకోట్ల సంవత్సరముల కాలానికైనా నేను వర్ణింప శక్తుడనుకాను. (65) అనే రాముని మాటను దేవ మహర్షులు విని, బాగుబాగు అని, సంతుష్టులై ఆ మాటలను ప్రశంసించారు (66) సేతు మధ్యమందు బ్రహ్మ సర్వదేవతలతో కూడి ఈశ్వరుని ఆజ్ఞతో ఎల్లప్పుడు దాని రక్షణ కొరకు అధివహించి ఉన్నాడు (67).

మూ || రక్షార్థం రామసేతౌ హిసేతు మాధవ సంజ్ఞయా | మహావిష్ణుం సమధ్యాస్తే నిబద్ధోనిగడేసవై || 68 ||

మహర్షయశ్చపితరో ధర్మశాస్త్ర ప్రవర్తకాః | దేవాశ్చ సహగంధర్వాః సకిన్నర మహోరగాః || 69 ||

విద్యాధరాశ్చారణాశ్చ యక్షాః కింపురుషాస్తథా | అన్యాని సర్వభూతాని వసంత్యస్మిన్మ హర్నిశమ్‌ || 70 ||

సోయం దృష్టః శ్రుతోవాపి స్మృతః స్పృష్టోవగాహితః | సర్వస్మాద్దురితాత్పాతి రామసేతుర్ద్విజోత్తమాః || 71 ||

సేతావర్ధోదయేస్నాన మానంద ప్రాప్తికారణమ్‌ | ముక్తిప్రదం మహాపుణ్యం మహానరక నాశనం || 72 ||

పౌషేమాసే విష్ణుభ##స్థే దినేశే | భానోర్వారేకించి దుద్యద్దినేశే

యుక్తామాచే న్నాగహీనాతు పాతే | విష్ణోః ఋక్షే పుణ్యమర్ధోదయం స్యాత్‌ || 73 ||

తస్మిన్నర్ధోదయేసేతౌ స్నానం సాయుజ్యకారణం | వ్యతీపాతసహస్రేణ దర్శమేకం సమంస్కృతం || 74 ||

దర్శాయుతసమం పుణ్యంభానువారోభ##వేద్యది | శ్రవణర్‌క్షం యదిభ##వేద్భాను వారేణ సంయుతం || 75 ||

పుణ్యమేవతు విజ్ఞేయ మన్యోన్యసై#్యవ యోగతః | ఏకైక మస్యమృతదంస్నానదాన జపార్చనాత్‌ || 76 ||

పంచస్వపిచ యుక్తేషుకిమువక్తప్యమత్రహి | శ్రవణం జ్యోతిషాంశ్రేష్ఠ మమాశ్రేష్ఠా తిథిష్వపి || 77 ||

వ్యతీపాతం తుయోగానాం వారం వారేషువైరవేః | చతుర్ణామపియో యోగో మకరస్థే రవౌభ##వేత్‌ || 78 ||

తస్మిన్కాలే రామసేతౌ యదిస్నాయాత్తుమానవః | గర్భంనమాతు రాప్నోతి కింతు సాయుజ్యమాప్నుయాత్‌ || 79 ||

అర్ధోదయనమఃకాలోనభూతోనభవిష్యతి | ఏవంమహాదయఃకాలోధర్మకాలఃప్రకీర్తితః || 80 ||

ఏతేషుపుణ్యకాలేషేసీతౌదానంప్రకీర్తితం | ఆచార్యశ్చతపోలేదోలేదాంతశ్రవణంతథా || 81 ||

శివవిష్ణ్వాదిపూజపిపురాణార్థప్రవక్తృతా | యస్మిన్విప్రేతువిద్యంతేదానపాత్రంతదుచ్యతే || 82 ||

పాత్రాయతపై#్మదానానిసేతౌదద్యాత్‌ద్విజాతయే | యదిపాత్రంసలభ్యేతసేతావాచరసంయుతం || 83 ||

సంకల్ప్యోద్దశ్యసత్సాత్రంప్రదద్యాద్గ్రామమాగతః | అతోనాధమపాత్రాయదాతప్యంఫలకాంక్షిభిః

ఉత్తమం సేతు మాహాత్మ్యం వక్తుః దేయం సచాన్యతః || 84 ||

తా || రామసేతువుయందురక్షణకొరకుసేతుమాధవుడను పేరుతోమహావిష్ణువుదేవతలందరితోకూడినివసించిఉన్నాడు (68) మహర్షులు, పితరులు, ధర్మశాస్త్రప్రవర్తకులు, దేవతలు, గంధర్వులు, కిన్నరులు, ఉరగులు, (69) విద్యాధరులు, చారణులు, యక్షులు, అట్లాగే కింపురుషులు, ఇతరమైనసర్వభూతములు, రాత్రింబగళ్ళు ఇక్కడనివసిస్తున్నాయి. (70) అట్టిఈరామసేతువునుచూచిన, దానిగూర్చివిన్న, దానినిస్మరించిన, తాకిన, అందుస్నానమాడినాఇదిఅన్నిపాపములనుండి రక్షిస్తుంది, ఓద్విజోత్తములార! (71) అర్థోదయకాలమందుసేతువుయందుస్నానమాచరించినానందప్రాప్తికిహేతువు. అది ముక్తినిచ్చేది. మహాపుణ్యకరము. మహానరకనాశకము (72) పుష్యమాసం, విష్ణురనక్షత్రంలోసూర్యుడుకొంచంఉదయించి నాకనాగ(వం)లేని అమావాస్యతోకూడినపుడు, రాహువుఅశ్లేషయందున్నపుడుఅర్థోదయముపుణ్యప్రదమైనది (73) ఆఅర్థో దయమందు సేతువుయందుస్నానము సాయుజ్యమునకుకారణము. వేయివ్యతీపాతములతోఒకఅమావాస్యసమమైనది. (74) భానువారమైతే అదిపదివేలఅమావాస్యలతోసమానమైనది.శ్రవణనక్షత్రముకానువారంతోకలిస్తే (75)పరస్పరయోగంవలన పుణ్యప్రదమనేతెలుసుకోవాలి. స్నానదానజపఅర్చనాదులవలనఒక్కొక్కటిఅమృతమునిచ్చేవి. (76) ఒకవేళఐదుకలిస్తే చెప్పాల్సిందేముందిక్కడ. జ్యోతిష్యులకుశ్రవణముశ్రేష్ఠము. తిథులలోఅమావాస్యశ్రేష్ఠమైనది (77) యోగములలోవ్యతీపాత యోగము. వారములలో ఆదివారము శ్రేష్ఠమైనది. ఈనాల్గింటియోగముసూర్యుడుమకరరాశియందుండగాసంభవిస్తే (78) ఆకాలమందు రామసేతువు యందుమానవుడు స్నానంచేస్తేతిరిగితల్లిగర్భవాసాన్నిపొందడు. పైగాసాయుజ్యాన్నిపొందుతాడు. (79) అర్థోదయకాలంతో సమానమైనకాలము గతంలోలేదుభవిష్యత్తులోరాదు. అట్లాగేమహోదయకాలము ధర్మకాలమని చెప్పబడింది. (80) ఈపుణ్యకాలము లందుసేతువుయందు దానముచేయాలనిచెప్పారు. ఆచారము, తపస్సు, వేదములు, వేదాంతశ్రవణము (81) శివుడువిష్ణువు మొదలగు వారిపూజ, పురాణార్థములచెప్పగలిగేశక్తిగలిగినవిప్రునిదానమునకు పాత్రునిగాగుర్తించాలి. (82) పాత్రుడైన ఆబ్రాహ్మణునకు సేతువుయందుదానం చేయాలి. సేతువుయందుఆచారవంతుడైన పాత్రుడులభించకపోతే (83 ) సత్పాత్రునిఉద్దేశించి సంకల్పముచేసి గ్రామమునకువచ్చాక దానంచేయాలి. అందువల్ల ఫలమునుకోరేవారుఅధమపాత్రునకు దానముచేయరాదు. సేతుమాహాత్మ్యమును చెప్పినవారికిఇచ్చుట ఉత్తమము. ఇతరులకు కాదు. (84)

మూ || అత్రేతిహాసంపక్ష్యామివసిష్ఠోక్తమనుత్తమం | దిలీపాయమహారాజ్ఞేదానపాత్రవివిత్సవే || 85 ||

దిలీప ఉవాచ -

దానానికసై#్మదేయానిబ్రహ్మపుత్రపురోహిత | ఏతన్మేతత్త్వతోబ్రూహిత్వచ్ఛిష్యస్యమహామునే || 86 ||

వసిష్ఠ ఉవాచ -

పాత్రాణాముత్తమంపాత్రం వేదాచారపరాయణం | తస్మాదవ్యధికంపాత్రంశూద్రాన్నంయస్యనోదరే || 87 ||

వేదాఃపురాణమంత్రాశ్చశివవిష్ణ్వాదిపూజసం | వర్ణాశ్రమాద్యనుష్ఠానంవర్తతేయస్యసంతతం || 88 ||

దరిద్రశ్చకుటుంబీచతత్పాత్రంశ్రేష్ఠముచ్చతే | తస్మిన్‌పాత్రేప్రదత్తంవైధర్మకామార్థమోక్షదం || 89 ||

పుణ్యస్థలేవిశేషేణదానంసత్పాత్రగర్హితం | అతన్యథాదశజన్మానికృకలాసోభవిష్యతి || 90 ||

జన్మత్రయంరాసభఃస్యాత్‌మండూకశ్చద్విజన్మని | ఏకజన్మనిచాండాలఃతతఃశూద్రోభవిష్యతి || 91 ||

తతశ్చక్షత్రియోవైశ్యఃక్రమాద్విప్రశ్చజాయతే | దరిద్రశ్చభ##వేత్తత్రబహురోగసమన్వితః || 92 ||

ఏవంబహువిధాదోషాదుష్టపాత్రప్రదానతః | తస్మాత్సర్వప్రయత్నేనసత్పాత్రేషుప్రదాపయేత్‌ || 93 ||

సలభ్యతేచేత్తత్పాత్రం తదాసంకల్పపూర్వకం | ఏకంసత్పాత్రముద్ధిశ్యప్రక్షిపేదుదకంభువి|| 94 ||

ఉద్దిష్టపాత్రస్యమృతౌతత్పుత్రాయసమర్పయేత్‌ | తస్యాపిమరణప్రాప్తేమహాదేవేసమర్పయేత్‌

అతోనాధమపాత్రాయదద్యాత్తీర్థేవిశేషతః || 95 ||

శ్రీసూతఉవాచ -

ఏవముక్తోవసిష్ఠేనదిలీవఃసఃద్విజోత్తమాః || 96 ||

తదాప్రభృతిసత్పాత్రేప్రాయచ్ఛద్దాసముత్తమం | అతఃపుణ్యస్థలేసేతావత్రాపిమునిపుంగవాః ||97 ||

యదిలభ్యేతసత్పాత్రంతదాద్యాద్ధనాదికం | నోచేత్సంకల్పపూర్వంతువిశిష్టంపాత్రముత్తమం || 98 ||

సముద్దిశ్యజలంభూమౌప్రక్షిపేద్భక్తిసంయుతః | స్వగ్రామమాగతఃపశ్చాత్‌తస్మిన్పాత్రేసమర్పయేత్‌ || 99 ||

పూర్వంసంకల్పితంవిత్తంధర్మలోపోన్యధాభ##వేత్‌ | సదుఃఖంపునరాప్నోతికింతుసాయుజ్యమాప్నుయాత్‌ || 100 ||

తా || ఇక్కడవసిష్ఠుడుచెప్పినముఖ్యమైనితిహాసాన్నిచెప్తాను. దానపాత్రుడెవడు. అనితెలుసుకోదలచినదిలీపమహారాజునకు చెప్పినదిది (85) దిలీపునివచనము - బ్రహ్మపుత్ర! పురోహితదానమెవ్వరికివ్వాలి. ఓమహామునినీకుశిష్యుడైననాకు దీనినియదార్థముగాచెప్పండి (86) వసిష్ఠునివచనము - దానపాత్రులలోఉత్తమపాత్రుడవేదాచారపరాయణుడు. అతనికన్న ఎక్కువైనపాత్రుడుశూద్రాన్నముతిననివాడు (87) వేదములు, పురాణములు, మంత్రములు, శివవిష్ణువులుమొదలగువారి పూజ, వర్ణాశ్రమాదిఅనుష్ఠానమువీటినిఎప్పటికిని ఆచరించేవాడు (88) దరిద్రుడు, కుటుంబముకలవాడుఅట్టివాడుఉత్తమ పాత్రుడుఅని చెప్పబడింది. అట్టి పాత్రునకుఇవ్వబడినదానము ధర్మకామమోక్షములనుఇస్తుంది. (89) పుణ్యస్థలమందు విశేషించినత్పాత్రము కానిదానముతగదు. సత్పాత్రదానముచేయనిచోపదిజన్మలు తొండగాజన్మిస్తాడు. (90) మూడుజన్మలు గాడిదౌతాడు. రెండుజన్మలు కప్పగా జన్మిస్తాడు. ఒకజన్మలో చండాలుడౌతాడు పిదపశూద్రుడౌతాడు. (91) పిదపక్షత్రియుడు వైశ్యుడుక్రమంగావిప్రుడౌతాడు. దరిద్రుడైబహురోగములతో కూడినవాడౌతాడు. (92) దుష్టుడైనపాత్రునకు దానంచేస్తేఈవిధముగాఅనేకదోషాలుసంభవిస్తాయి. అందువల్లఅన్నివిధముల ప్రయత్నించిసత్‌పాత్రులకుదానం చేయాలి. (93) అటువంటిపాత్రుడులభించని పక్షంలోఅప్పుడుసంకల్ప పూర్వకముగాఒకసత్‌ పాత్రునిఉద్దేశించినీటినిభూమిపై వదలాలి. (94) ఉద్దేశించినపాత్రుడుమరణిస్తే అతనిపుత్రునకుదానంచేయాలి. ఆతడు కూడామరణిస్తేమహాదేవునకుసమర్పించాలి. అందువల్లఅధమపాత్రునకుతీర్థప్రదేశములోవిశేషించిదానంచేయరాదు. (95) శ్రీసూతలవచనము - ఓద్విజోత్తములార ! ఈవిధముగా వసిష్ఠుడుదిలీపునకుచెప్పాడు. (96) నాటినుండిసత్పాత్రునకుఉత్తమమైనదానమునుఇచ్చాడు. అందువల్లోమునిపుంగవులార! పుణ్యస్థలమైనఈసేతువుయందుకూడా (97) సత్పాత్రుడులభిస్తే అప్పుడు ధనాదులను ఇవ్వాలి. లేనిచోసంకల్పపూర్వకముగా ఉత్తమమైనవిశిష్టపాత్రుని (98) ఉద్దేశించి, భక్తితోభూమిపై జలమును వదలాలి. పిదపతనగ్రామమునకువచ్చిఆపాత్రునకుఇవ్వాలి. (99) పూర్వముసంకల్పించినధనాన్నిఇవ్వాలి. లేనిచో ధర్మలోపమౌతుంది. తిరిగిదుఃఖాన్నిపొందడు. కానిసాయుజ్యాన్నిపొందుతాడు (100)

మూ || అర్థోదయసమఃకాలోనభూతోనభవిష్యతి | కుంభకోణంసేతుమూలంగోకర్ణంనైమిషంతథా || 101 ||

అయోధ్యాదండకారణ్యంవిరూపాక్షంచవేంకటం | శాలిగ్రామంప్రయాగంచకాంచీద్వారపతీతథా || 102 ||

మధురాపద్మనాభంచకాశీవిశ్వేశ్వరాలయా | సద్యఃసర్వఃసముద్రాశ్చపర్వతంభాస్కరంస్మృతం || 103 ||

ముండనంచోపవానశ్చక్షేత్రేష్వేషుప్రకీర్తితం | లోభాన్మోహాదకృత్వాయఃస్వగృహంయాతిమానవః || 104 ||

నహైవయాంతితద్గేహెపాతకానిచతేనవై | చతుర్వింశతితీర్థానిపర్వతేగంధమాదనే || 105 ||

తత్రలక్ష్మణతీర్థేతుపవనంమునిభిఃస్మృతం | తీరేలక్ష్మణతీర్థస్యలోమవర్జ్యంశివాజ్ఞయా || 106 ||

శిరోమాత్రస్యవపనంకృత్వాదత్వాచదక్షిణాం | స్నాత్వాలక్ష్మణతీర్థేచదృష్ట్వాలక్ష్మణశంకరం || 107 ||

సర్వపాపవినిర్ముక్తఃశంకరంయాతిమానవః | అర్థోదయేనదాస్నానం సేతావేవంసమాచరేత్‌ || 108 ||

నాస్తిసేతుసమంతీర్థంనాస్తిసేతుసమంతపః | నాస్తిసేతుసమంసపుణ్యంనాస్తిసేతుసమాగతిః || 109 ||

ఉపరాగసహస్రేణసమర్థోదయంస్మృతం | అర్థోదయసమఃకాలోనాస్తిసంసారమోచకః || 110 ||

తస్మిన్నర్థోదయేరామసేతౌస్నానంతుయద్భవేత్‌ | సతత్తుల్యంభ##వేత్పుణ్యంసర్వశాస్త్రేషుసర్వదా || 111 ||

షష్టివర్షసహస్రాణిభగీరథ్యవగాహనాత్‌ | యత్పుణ్యంఋషినిర్దిష్టంతత్పుణ్యంమునిపుంగవాః || 112 ||

ఏకవారంరామసేతౌస్నానాత్‌సిద్ధ్యతినిశ్చితం | అర్థోదయేవిశేషేణతథైవచమహోదయే || 113 ||

మకరస్థేరవౌమాఘేప్రయాగేపాపమోచనే | మాఘస్నానసహస్రేణయత్పుణ్యంలభ##తేనరః || 114 ||

తస్మిన్నర్థోదయేవిప్రారామసేతౌనిమజ్జనాత్‌ | ఏకవారేణతత్పుణ్యంలభ##తేనాత్రసంశయః || 115 ||

త్రైలోక్యస్థేషుతీర్థేషుస్నాతానాంయత్ఫలంభ##వేత్‌ | సకృదర్థోదయేసేతౌస్నాత్వాతత్పుణ్యభాగ్భవేత్‌ || 116 ||

తా || అర్థోదయకాలముతోసమానమైన ఉత్తమకాలముగతంలోలేదు. భవిష్యత్తులోరాదు. కుంభకోణము, సేతు మూలము, గోకర్ణము, నైమిషము, (101) అయోధ్య, దండకారణ్యము, విరూపాక్షము, వేంకటాచలము, శాలిగ్రామము, ప్రయాగ, కాంచి, ద్వారాపతి (102) మధుర, పద్మనాభము, విశ్వేశ్వరునిఆలయమైనకాశి, అన్నినదులు, సముద్రములు, బంగారుపర్వతము అనిచెప్పబడిన (103) ఈస్థానములందుముండనము, ఉపవాసము ఆచరించవలెనని చెప్పబడినది. లోభములవలన, మోహమువలన వీటిని ఆచరించకుండ తనింటికి వెళ్ళేనరుడు (104) వెంటఆతడాచరించిన పాతకములుఅతనిఇంటిలోఆతనితోప్రవేశిస్తాయి. గంధమాదన పర్వతమందు ఇరువదినాలుగుతీర్థములున్నాయి (105) అక్కడలక్ష్మణతీర్థమందుపవనమునుమునులుచెప్పారు. లక్ష్మణతీర్థమందుశివుని ఆజ్ఞప్రకారం వెంట్రుకలులేకుండా (106) తలనుమాత్రమేకొరిగించుకొని, దక్షిణనుఇచ్చిలక్ష్మణతీర్థమందు స్నానమాడిలక్ష్మణశంకరుని దర్శించిన (107) పాపములన్నింటి నుండి విముక్తుడైనఆనరుడు శంకరునిచేరుతాడు. అర్థోదయమందు ఎల్లప్పుడు సేతువుయందు ఇట్లాస్నానముచేయాలి. (108) సేతువుతోసమానమైనతీర్థములేదు. సేతువుతోసమానమైనతపములేదు. సేతువుతోసమానంగాపుణ్యప్రదమైనదిలేదు. సేతువుతోసమానమైనస్థానములేదు. (109) వేయిగ్రహణములతోసమానమైనది. అర్థోదయముఅనిచెప్పబడింది. సంసారం నుండిముక్తినికల్గించేకాలముఅర్థోదయంతోసమానమైనదిలేదు. (110) ఆఅర్థోదయమందు రామసేతువుయందుస్నానం చేస్తే వచ్చేపుణ్యముతోసమానంగాఎల్లప్పుడుసర్వశాస్త్రములుచదివినారాదు (111) అరువదివేలసంవత్సరాలు భాగీరధిలో మునుగుటవలనవచ్చేపుణ్యమునుఋషులుచెప్పారు. కానిఓమునులార!: అంతటిపుణ్యము (112) ఒక్కసారిరామసేతువు యందుస్నానముచేయుటవల్లలభిస్తుంది. నిశ్చయము, ప్రత్యేకించిఅర్థోదయకాలమందు, మహోదయకాలమందుచేసే స్నానము (113) సూర్యుడుమకరరాశియందుండగామాఘమాసమందు, పాపమోచనమైనప్రయాగయందు, వేయిమాఘస్నాన ములతోలభించే పుణ్యమును, నరుడు (114) అర్థోదయకాలమందురామసేతువుయందుమునుగుటవలన, ఒక్కసారికే అంతటిపుణ్యమునుపొందుతాడు. ఇందులోఅనుమానములేదు (115) ముల్లోకములందలితీర్థములోస్నానంచేసినవారికి లభించేఫలముఒక్కసారిఅర్థోదయ కాలమందు సేతువుయందుస్నానమాచరిస్తేఅంతటిపుణ్యమునుసొందుతాడు (116)

మూ || బ్రహ్మజ్ఞానవిహీనానాం కృతఘ్నానాందురాత్మనాం | పాపినామితరేషాంచమహాపాతకినాంతథా || 117 ||

సేతావర్థోదయేస్నానాత్‌విశుద్ధిరితినిశ్చితా | స్థలాంతరేకృతఘ్నానాంనిష్కృతిర్నాస్తికర్హిచిత్‌ || 118 ||

సేతావర్ధోదయేస్నానాత్‌ తేషామపిహినిష్కృతిః | సేతావర్ధోదయేస్నానంయేనకుర్వంతిమోహతః || 119 ||

సంసారేషునిమజ్జంతి తేయథాంధాఃపతంత్యధః | సేతావర్థోదయేస్నాత్వాభిత్వాభాస్కరమండలం || 120 ||

బ్రహ్మలోకంప్రయాస్యంతినాత్రకార్యవిచారణా | అర్థోదయేతుసంప్రాప్తేస్నాత్వాసేతౌవిముక్తిదే || 121 ||

స్నాత్వాసమ్యక్‌జగన్నాథంరాఘవంసీతయాసహ | రామేశ్వరంమహాదేవంసుగ్రీవాదిముఖాన్‌కపీన్‌ || 122 ||

ధ్యాత్వాదేవాన్‌ఋషీంశ్చాపితథాపితృగణానపి | తర్పయేదపితాన్‌సర్వాన్‌స్వదారిద్ర్యవిముక్తయే || 123 ||

అర్థోదయాఖ్యమమలంజగన్నాథంపమర్చయేత్‌ | సేతావర్థోదయేకాలేతేనప్రీణాతికేశవః || 124 ||

దివాకరనమస్తేస్తుతేజోరాశేజగత్పతే | అత్రిగోత్రసమతుత్పన్నలక్ష్మీదేవ్యాఃసహోదర || 125 ||

అర్ఘ్యంగృహాణభగవన్‌సుధాకుంభనమోస్తుతే | వ్యతీపాతమహాయోగిన్‌మహాపాతకనాశన || 126 ||

సహస్రబాహూసర్వాత్మన్‌గృహాణార్ఘ్యంనమోస్తుతే | తిథినక్షత్రవారాణామధీశపరమేశ్వర || 127 ||

మానరూపగృహాణార్ఘ్యంకాలరూపనమోస్తుతే | ఇతిదత్వాపృథక్‌మంత్రైఃఅర్ఘ్యమర్థోదయేనరః || 128 ||

ఉపాయనానివిప్రేభ్యోదద్యాద్విత్తానుసారతః | చతుర్దశద్వాదశాష్టౌసప్తషట్‌పంచవాద్విజాన్‌ || 129 ||

యథాశక్త్యన్నపానాద్యైఃపృథఙ్‌మంత్రైఃసమర్చయేత్‌ | కాంస్యపాత్రంసమాదాయసూతనందారవంతువా || 130 ||

విప్రాణాంపురతఃస్థాప్యవయసాపరిపూరితం | సఫలంసగుడంసాజ్యంసతాంబూలంసదక్షిణం || 131 ||

దద్యాద్యజ్ఞోపవీతంచగాంసపత్సాంపయస్వినీం | అలంకృతేభ్యోవిప్రేభ్యోయథాశక్తిపదేదిదం || 132 ||

తా || బ్రహ్మజ్ఞానవిహీనులు, కృతఘ్నులు, దురాత్ములు, పావులు, ఇతరమహాపాతకులు, వీరందరు (117) సేతువు యందు అర్థోదయకాలమందుస్నానంచేస్తేవిశుద్ధలౌతారు. ఇదినిశ్చయము. వేరుస్థలములందుకృతఘ్నులకుఎక్కడాపాప నిష్కృతిలేదు (118) సేతువుయందుఅర్థోదయంకాలస్నానంవలనవారికిగూడానిష్కృతిలభిస్తుంది. సేతువుయందుఅర్థోదయ మందుమోహంతోస్నానం చేయనివారు (119) అంధులుక్రిందపడునట్లుసంసారమందుమునిగిపోతారు. సేతువుయందు అర్థోదయస్నానంచేసినవారుభాస్కరమండలమునుఛేదించి (120) బ్రహ్మలోకమునకుచేరుతారు. ఇందులోఆలోచించాల్సిన దిలేదు. అర్థోదయంవచ్చినపుడు ముక్తినిచ్చేసేతువు యందుస్నానంచేసి (121) చేసిసీతతోకూడినజగన్నాథుడైనరాముని, రామేశ్వరునిమహాదేవుని సుగ్రీవుడుమొదలుగవానరులను (122) ధ్యానించిదేవతలను, ఋషులను, పితృగణములను ధ్యానించిదారిద్ర్యము నుండివిముక్తికొరకు వారందరికితర్పణం వదలాలి. (123) అర్థోదయముశుద్ధమైనది. అప్పుడు జగన్నాథునిపూజించాలి. సేతువుయందు అర్థోదయకాలమందు పూజించినకేశవుడుసంతోషిస్తాడు (124) ఓదివాకర! నీకు నమస్కారముఓతేజోరాశి, జగత్పతినీకునమస్కారము. ఈఅర్ఘ్యమునుస్వీకరించు. వ్యతీపాతమహాయోగముగలవాడ! మహాపాతకములకునాశకుడ! (125) అమృతకుంభుడ, ఓభగవాన్‌నీకు నమస్కారము. ఈఅర్ఘ్యమునుస్వీకరించు, వ్యతీపాతమహా యోగముగలవాడ! మహాపాతకముల కునాశకుడ! (126) సహస్రబాహు! సర్వాత్మనీకు నమస్కారము. ఈఅర్ఘ్యమును స్వీకరించుతిథినక్షత్రవారములకు అధీశుడ, పరమేశ్వర (127) మానవరూపుడఈఅర్ఘ్యమును స్వీకరించు. కాలరూపుడ నీకునమస్కారము. అనివేరువేరుమంత్రములతోనరుడుఅర్థోదయమందు అర్ఘ్యమునుఇచ్చి (128) బ్రాహ్మణులకుతనకుగల ద్రవ్యశక్తిననుసరించికానుకలుఇవ్వాలి. పదునాలుగు, లేదా పన్నెండులేదా ఎనిమిది, లేదా ఏడులేదాఆరులేదా ఐదుగురు బ్రాహ్మణులను (129) శక్తికొలదిఅన్నపానములు మొదలగువానితోవేరువేరుగా మంత్ర ములతోపూజించాలి. కాంస్యపాత్రను కానిలేదాకొత్తగాకట్టెతోచేసిన పాత్రనుకానితెచ్చి (130) బ్రాహ్మణులఎదురుగాఉంచిదానిని నీటితో నింపి,పండు, బెల్లము,నేయి, తాంబూలము, దక్షిణ, (131) యజ్ఞోపవీతము, పాలిచ్చేదూడతోకూడినఆవును వీటన్నిటినిదానం చేయాలి. అలంకరింపబడిన బ్రాహ్మణులకుశక్తికొలదిపైని ఇచ్చిఇట్లాచెప్పాలి. (132)

మూ|| శ్రవణర్‌క్షేజగన్నాథజన్మర్‌క్షేతవకేశవ | యస్మయాదత్తమర్థిభ్యఃతదక్షయమిహాస్తుతే || 133 ||

నక్షత్రామధిపతేదేవానామమృతప్రద | త్రాహిమాంరోహిణీకాంతకలాశేషనమోస్తుతే || 134 ||

దీననాథజగన్నాధకలానాథకృపాకర | త్వత్పాదపద్మయుగలభక్తిరస్త్వచలామమ || 135 ||

వ్యతీపాతనమస్తేస్తుసోమసూర్యాగ్నిసన్నిభ | యద్దానాదికృతంకిచిత్తదక్షయమిహాస్తుతే || 136 ||

అర్థినాంకల్పవృక్షోసివాసుదేవజనార్దన | మాసర్త్వయనకాలేశపాపంశమయమేహరే || 137 ||

ఇత్యర్చయిత్వావిప్రేంద్రాస్తతఃశ్రాద్‌ధంసమాచరేత్‌ | హిరణ్యశ్రాద్ధమామంవాపాకశ్రాద్ధమధాపివా || 138 ||

పార్వణంచతతఃకుర్యాద్విత్తశాఠ్యంనకారయేత్‌ | ఆచార్యంపూజయేత్పశ్చాత్‌వస్త్రభూషణకుండలైః || 139 ||

ప్రతిమామర్పయేత్తసై#్మగాంచఛత్రముపాసహం | ఏవమర్థోదయేసేతౌఐవ్రతంకుర్యాద్ధ్విజోత్తమాః || 140 ||

తేనైవకృతకృత్యఃస్యాత్‌కర్తవ్యంనాస్తికించన | స్థలాంతరేప్యేవమేతత్‌ప్రతమర్థోదయేచరేత్‌ || 141 ||

సేతుఃసముద్రేరామేణనిర్మితోగంధమాదనే | సేతుఃసేతురితిప్రాజ్ఞాస్తస్యనామ్నఃప్రకీర్తనాత్‌ || 142 ||

స్నానకాలేమనుష్యాణాంపాతకానాంతుకోటయః | తత్‌క్షణాదేవనశ్యంతియాస్యంత్యవ్యచ్యుతంపదం || 143 ||

నిమిషంనిమిషార్థంవాసేతౌతిష్ఠతియోనరః | తద్ధృష్టిగోచరంగంతుంనశక్తాయమకింకరాః || 144 ||

రామసేతుంధనుష్కోటింరామంసీతాంచలక్ష్మణం | రామనాథంహనుమంతంసుగ్రీవాదిముఖాన్‌కపీన్‌ || 145 ||

విభీషణంనారదంచవిశ్వామిత్రంఘటోద్భవం | వసిష్ఠంవామదేవంచజాబాలిమథకాశ్యపం || 146 ||

రామభక్తాన్‌తథాచాన్యాన్‌చింతయన్మనసాతదా | సర్వదుఃఖాద్విముచ్యేతప్రయాతిపరమంపదం || 147 ||

సత్యక్షేత్రే హరిక్షేత్రే కృష్ణ క్షేత్రే చ నైమిషే | శాలగ్రామేబదర్యాంచహస్తిశైలేవృషాచలే || 148 ||

శేషాద్రౌచిత్రకూటేచలక్ష్మీక్షేత్రేకురంగకే | కాంచికే కుంభకోణచ మోహినీపుర ఏవచ || 149 ||

ఐంద్రేశ్వేతాచలేపుణ్య పద్మనాభేమహాస్థలే | పుల్లాఖ్యేఘటి కాద్రౌచ సారక్షేత్రే హరిస్థలే || 150 ||

శ్రీనివాసే మహాక్షేత్రే భక్తనాథ మహాస్థలే | అలిందాఖ్యే మహాక్షేత్రే శుకక్షేత్రేచ వారుణ || 151 ||

మధురాయాం హరిక్షేత్రే శ్రీ గోష్ఠ్యాం పురుషోత్తమే | శ్రీరంగే పుండరీకాక్షే తథాన్యత్ర హరిస్థలే || 152 ||

స్నానేనయాని పాపాని వినశ్యంతి ద్విజోత్తమాః | తాని సర్వాణి నశ్యంతి సేతుస్నానేన నిశ్చితం || 153 ||

తా || ఓ జగన్నాథ ! శ్రవణ నక్షత్రమందు, నీ జన్మ నక్షత్ర మందు ఓ కేశవ ! నేను యాచకులకు చేసిన దానము ఇక్కడ నాకు అక్షయముగా ఉండని (133) నక్షత్రములకు అధిపతి, దేవతలకు అమృతమిచ్చువాడ, రోహిణీకాంత, నన్ను రక్షించు. కలాశేష(ఒకకళ మిగిలిన) నీకు నమస్కారము (134)దీనగాథ! జగన్నాథ, కలానాథ, కృపాకర, నీకు నీ పాదపద్మ ద్వయ మందు భక్తి అచలంగా ఉండని (135) వ్యతీపాత, నీకు నమస్కారము, సోమసూర్య అగ్నులతో సమంగా, వెలుగువాడ, నేను చేసిన ఈ కొద్ది దానములు మొదలగునవి నీకు అవి అక్షయంగా ఇక్కడ ఉండని (136) ఓ వాసుదేవ, జనార్దన, నీవు యాచకులకు కల్పవృక్షమువు. మాస,ఋతు, ఆయనకాలములకు, ప్రభువ, హరి, నా పాపమును శమింప చేయి (137) అని పూజించి, ఓ విప్రులార ! ఆ పిదప శ్రాద్ధ మాచరించాలి. హిరణ్య శ్రాద్ధము కాని అమశ్రాద్ధము కాని పాక శ్రాద్ధముకాని (138) ఆచరించాలి. పిదప పార్వణమాచరించాలి. విత్తలోభము చేయించరాదు. పిదప వస్త్రము, భూషణములు, కుండలములతో ఆచార్యుని పూజించాలి. (139) ఆ పిదప అతనికి ప్రతిమను, గోవును, గొడుగు, చెప్పులు వీటిని అర్పించాలి. ఈ విధముగా అర్థోదయమందు సేతువు యందు వ్రత మాచరించాలి. ఓ ద్విజులార ! (140) దానితోనే అతడు కృతకృత్యుడౌతాడు. చేయవలసింది. మరొకటిలేనే లేదు. ఇతరస్థలములందుకూడాఇట్లాగే అర్థోదయమందువ్రతమాచరించాలి. (141) గంధమాదనమందుసముద్రమందు సేతువును రాముడు నిర్మించాడు. ప్రాజ్ఞుల సేతువుఅనిఆతనినామాన్ని స్నానకాలంలోకీర్తించినందువలన (142) మనుష్యులకోట్ల కొలదిపాతకములు ఆక్షణంలోనే నశిస్తాయి. అచ్యుతపదమునకు కూడా చేరుతారు. (143) ఒకనిమిషముకాని, నిమిషంలో సగభాగంకాలంలో కానిసేతువుయందున్ననరుని దృష్టిలోపడుటకు యమకింకరులు అశక్తులౌతారు (144) రామసేతువును, ధనుష్కోటిని, రాముని, సీతను, లక్ష్మణుని, రామనాథుని, హనుమంతుని సుగ్రీవుడు మొదలుగా గల కవులను (145) విభీషణుని, నారదుని, విశ్వామిత్రుని, అగస్త్యుని, వసిష్ఠుని, వామదేవుని,జాబాలిని, కాశ్యపుని (146) అట్లాగే ఇతరులైన రామభక్తులను అప్పుడు మనస్సులో చింతిస్తూ ఉంటే అన్ని దుఃఖముల నుండి విముక్తుడౌతాడు. పరమ పదమునకు వెళ్తాడు (147) సత్యక్షేత్రము, హరిక్షేత్రము, కృష్ణక్షేత్రము, నైమిషము, శాలగ్రామము, బదరి, హస్తిశైలము, పృషాచలము (148) శేషాద్రి, చిత్రకూటము, లక్ష్మీక్షేత్రము, కురంగక్షేత్రము, కంచి,కుంభకోణము, మోహినీపురము (149) ఐంద్రము (ఐన) శ్వేతాచలము, పుణ్యప్రదమైన పద్మనాభమహాస్థలము, పుల్లగ్రామము, ఘటికాద్రి హరిస్థలమైన సారక్షేత్రము, (150) శ్రీనివాస మహాక్షేత్రము, భక్తుడైన నాథ(ముని) మహాస్థలము, అలిందా అనుపేరుగల మహాక్షేత్రము, శుకక్షేత్రము, వారుణము (151) మదుర అనబడు హరి క్షేత్రము, శ్రీగోష్ఠి, పురుషోత్తమము, శ్రీరంగము, పుండరీకాక్షము, ఇతరహరిస్థలములు (152) వీనియందు స్నానము చేయుట వలన నశించే పాపములు, ఓబ్రాహ్మణోత్తములార! అవన్ని సేతుస్నానము వలన నశిస్తాయి నిశ్చయము (153).

మూ || రఘునాథ కృతేసేతౌ మహామునినిషేవితే | నస్నాంతియేనరాస్తేషాం ససంసారనివర్తనం || 154 ||

యేవానమః శివాయేతి మంత్రం పంచాక్షరం శుభం | సపదంతి నశృణ్వన్తిన స్మరంతి మునీశ్వరాః || 155 ||

నమో నారాయణాయేతి ప్రణవేన సమన్వితం | మంత్రమష్టాక్షరం వాపిన జపంతి స్మరంతివా || 156 ||

ఏవం శ్రీరామచంద్రస్య షడక్షర మనుంతథా | నజపంతి నశృణ్వంతి నస్మరంతిచ సత్తమాః || 157 ||

తేషాం పాపాని నశ్యంతి రామసేతౌ నిమజ్జనాత్‌ | ఉపోషణం నకుర్వంతి యేవా హరిదినే శుభే || 158 ||

సధారయంతి యే భస్మత్రిపుండ్రోద్ధూలనాదినా | జాబాలోపనిషన్మంత్రైః సప్తభిర్మన్తకాదికే || 159 ||

శివం వాకేశవం వాపిత థాన్యానపివైనురాన్‌ | న పూజయంతి వేదోక్త మార్గేణ ద్విజపుంగవాః || 160 ||

తేషాం పాపాని నశ్యంతి రామసేతౌ నిమజ్జనాత్‌ | శివ విష్ణ్వాదిదే వేభ్యో ధూపం దీపం చ చందనం || 161 ||

పుష్పాణిన ప్రయచ్ఛంతి భక్తి పూర్వం ద్విజోత్తమాః | శివ విష్ణ్వాది దేవానాం శ్రీ రుద్రైశ్చ మకైస్తథా || 162 ||

శ్రీమత్పురుష సూక్తేన పాపమాన్యాది సూక్తకైః | త్రిమధుత్రి సుపర్ణైశ్చ పంచశాంత్యాదినాతథా || 163 ||

నాభిషేకం ప్రకుర్వంతి యేనరాః పాపచేతనః | తేషాం పాపాని నశ్యంతి ధనుష్కోటౌ నిమజ్జనాత్‌ || 164 ||

శివవిష్ణ్వాది దేవానాం నమస్కార ప్రదక్షిణ | స ప్రకుర్వంతి భక్త్యాయే పాపోప హత బుద్ధయః || 165 ||

ధనుర్మాసే ప్యుషః కాలే న పూజాం చ ప్రకుర్వతే | శివ విష్ణ్వాది దేవానాం మహానైవేద్య పూర్వకం || 166 ||

తేషాం పాపాని నశ్యంతి రామసేతౌ నిమజ్జనాత్‌ | కీర్తయంతినయే విష్ణో ర్నామానితు హరస్యవా || 167 ||

శాలిగ్రామ శిలాచక్రం శివనాభం చయేనరాః | న పూజయంతిమోహన ద్వారకాచక్రమేవవా || 168 ||

గంగామృదంచ తులసీ మృత్తికాం గోపి చందనం | సథారయంతి యే మూఢాః లలాటే చోర సిద్విజాః || 169 ||

దోర్ద్వం ద్వేచగలే సమ్యక్‌ సర్వపాపౌఘశాంతయే | రుద్రాక్షం తులసీ కాష్ఠం యోన ధారయతే నరః || 170 ||

తస్య పాపాని నశ్యంతి ధనుష్కోటౌ నిమజ్జనాత్‌ |

తా || మహామునులు సేవించే, రఘునాథుడు నిర్మించినసేతువు యందు స్నానము చేయని, నరులకు సంసారము నుండి నివృత్తిలేదు. (154) ఎవరు శుభ##మైన పంచాక్షర మంత్రమును నమః శివాయ అనుదానిని పలకరో వినరో స్మరించరో (155) ప్రణవముతో కూడిన, నమో నారాయణ అను అష్టాక్షర మంత్రమును కానిఎవరు జపించరో, స్మరించరో (156) అదే విధముగా శ్రీరామచంద్రుని యొక్క షడక్షరమంత్రమును ఎవరు జపించరో, వినరో స్మరించరో అట్టివారి (157) పాపములు రామసేతువు యందు స్నానమాడుట వలన నశిస్తాయి. శుభ##మైన హరిదినమందు ఉపవసించని వారు (158) త్రిపుండ్ర ఉద్ధూలనాదులతో భస్మమును జాబాలో పనిషన్మంత్రము లేడింటితో తల మొదలగు చోట్ల ధరించని వారు (159) శివునికాని, విష్ణువును కాని, లేదా ఇతర దేవతలను కాని వేదోక్త మార్గముతో పూజింపని వారు (160) ఓ ద్విజ పుంగవులార ! వీరందరి పాపములు రామసేతువు యందు స్నాన మాడుట వలన నశిస్తాయి. శివుడు విష్ణువు మొదలగు దేవతలకు దూపము, దీపము, చందనము (161) పుష్పములు భక్తి పూర్వకముగా ఇవ్వని వారు, శివవిష్ణ్వాది దేవతలను శ్రీ రుద్రచమకములతో (162) శ్రీమత్‌ పురుష సూక్తముతో పవమానాది సూక్తములతో, త్రిమధుత్రిసువర్ణ మంత్రములతో పంచశాంతులు మొదలగు వానితో (163) అభిషేకించని నరులు పాప చేతనులు, వారి పాపములు ధనుష్కోటి యందు స్నానం చేయటం వలన నశిస్తాయి (164) శివ విష్ణ్వాది దేవతలకు నమస్కార ప్రదక్షిణలు భక్తితో చేయని, పాపోపహత బుద్ధులు (165) ధనుర్మాస మందు ఉషః కాలమందు పూజచేయని, శివవిష్ణ్వాది దేవతలకు నైవేద్యమర్పించని వారు (166) వారి పాపములు రామసేతువు యందు మునుగుట వలన నశిస్తాయి. విష్ణువు యొక్క కాని శివుని యొక్కకాని నామములను కీర్తించని వారు (167) శాలిగ్రామ శిలా చక్రమును శివనాభమును, ద్వారకా చక్రమును కాని మోహముతో పూజించని నరులు (168) గంగమట్టి, తులసి మృత్తిక, గోపి చందనము లలాట మందు, వక్షః స్థలమందు ధరించని మూఢులు (169) రెండు చేతుల యందు (భుజములు) కంఠమందు, సర్వపాప సమూహముల శాంతి కొరకు మంచిగ రుద్రాక్షను తులసి కాష్ఠమును ధరించని నరులు (170) వీరందరి పాపములు ధనుష్కోటి యందు మునుగుట వలన, నశిస్తాయి.

మూ || బ్రాహ్మముహూర్తేసంప్రాప్తేనిద్రాంత్యక్త్వాప్రసన్నధీః || 171 ||

హరిశంకరనామాని తత్‌ స్తోత్రాణ్యథవాద్విజాః | యోహిచింతయతే నిత్యం విశిష్టం మంత్రమే వవా || 172 ||

తస్యపాపాని నశ్యంతి ధనుష్కోటౌ నిమజ్జనాత్‌ | ప్రాతర్జలాశయం గత్వాస్నాత్వాచమ్య విశుద్ధధీః || 173 ||

ప్రసన్నాత్మామునిశ్రేష్ఠాః సంధ్యోపాసన పూర్వకం | నోపాస్తేచనరోయస్తు గాయత్రీం వేదమాతరం || 174 ||

నౌపాసనం నకుర్వంతి సాయం ప్రాతరతంద్రితాః | మాధ్యాహ్నికం నకుర్వంతి యేవాపాపహతాశయాః || 175 ||

బ్రహ్మయజ్ఞంవైశ్వదేవంమధ్యాహ్నతిథిపూజసం | నాచరంతిచ సాయంయే పూజామతిథి సమతాం || 176 ||

తేషాం పాపానినశ్యంతి ధనుష్కోటౌ నిమజ్జనాత్‌ | భిక్షాంయతీనాంమధ్యాహ్నేనప్రయచ్ఛంతియేనరాః || 177 ||

యేప్యధీతాంత్రయీంవిప్రావిస్మరంతికుబుద్ధయః | నాధీయతే త్రయీం వాపి వేదాంగా నితథాపునః || 178 ||

ప్రత్యాబ్దికం మాతృపిత్రోః శ్రాద్ధంయే నాచరంతివై | శ్రాద్ధం మహాలయం నిత్యమష్టకాశ్రాద్ధమేవవా || 179 ||

అన్యన్నైమిత్తికం శ్రాద్ధం యేనకుర్వం తిలోభతః | యే చైత్రేతు పౌర్ణమాస్యాం చిత్రగుప్తస్య తుష్టయే || 180 ||

పానకం కదలీ పక్వం పాయసాన్నం నశర్కరం | సగుడం సామ్ర ఫలకం పనసాది ఫలైర్యుతం || 181 ||

తాంబూలం పాదుకే ఛత్రం వస్త్రపుష్పాణి చందనం | విప్రేభ్యోన ప్రయచ్ఛంతి లోభోప హతబుద్ధయః || 182 ||

తేషాం పాపాని నశ్యంతి ధనుష్కోటౌ నిమజ్జనాత్‌ | దుర్వృత్తో వాసువృత్తో వాయో ధనుష్కోటి సేవకః || 183 ||

తస్య సంసార విచ్ఛిత్తిః పునర్జన్మ వినా భ##వేత్‌ | సంసార సాగరం తర్తుం య ఇచ్ఛేన్ముని పుంగవాః || 184 ||

రామచంద్ర ధనుష్కోటిం నగచ్ఛే దవిలంబితం | సత్యం వచ్మిహితం వచ్మిసారం వచ్మిహితం పునః || 185 ||

రామచంద్ర ధనుష్కోటౌ గచ్ఛధ్వం ముక్తి సిద్ధయే | రామచంద్రధనుష్కోటౌకుర్యాత్స్నానంవిముక్తయే || 186 ||

నాస్త్యుపాయాంతరంవిప్రాభూయోభూయోవదామ్యహం | రామచంద్రధనుష్కోటౌస్నానంకుర్వంతియేనరాః || 187 ||

తేషామయత్నతః సిద్థ్యేత్‌ సంసార భయనాశనం | సత్యంజ్ఞానమనంతం యత్పూర్ణంబ్రహ్మసనాతనం || 188 ||

తత్ర్పాప్తిఃస్యాద్ధనుష్కోటౌమజ్జనాన్నాత్రసంశయః

తా || బ్రాహ్మీముహూర్తమురాగానే నిద్రను వదలి ప్రసన్నమైన బుద్ధిగలవాడై (171) హరిశంకర నామములను లేదా వారి స్తోత్రములను నిత్యము తలచే (చని) వాని వారి విశిష్ట మంత్రమును కాని తలచే (చని) (172) నరుని పాపములు ధనుష్కోటి యందు మునుగుట వలన నశిస్తాయి. ప్రొద్దున్నే జలాశయమునకు వెళ్ళి స్నానము చేసి, ఆచమించి, శుద్ధమైన బుద్ధిగలవాడై (173) ప్రసన్నమైన ఆత్మగలవాడై, ఓ మునిశ్రేష్ఠులార ! సంధ్య ఉపాసన పూర్వకముగా వేదమాతయైన గాయత్రిని ఉపాసించని నరుని (174) సాయం ప్రాతః కాలములందు శ్రద్ధతో (కునుకుపాటులేక) ఔపాసన చేయని వారి, పాపముతో హతమైన కోరికలు గలవారై మాధ్యాహ్నికము చేయనివారి (175) బ్రహ్మయజ్ఞము, వైశ్వదేవము, మధ్యాహ్నమందు అతిధిపూజ, సాయంత్రమందు, అతిథులకు సమ్మతమైన పూజను ఆచరించనివారి (176) వీరందరి పాపములు ధనుష్కోటి యందు మునుగుట వలన నశిస్తాయి. మధ్యాహ్నము పూట యతులకు భిక్షమీయని నరుల (177) చదివిన వేద విద్యను, కుబుద్ధులై మరచిన విప్రుల, వేదములను గాని, వేదాంగములను గాని చదవని వాని (178) ప్రతి సంవత్సరము తలిదండ్రులకు శ్రాద్ధమాచరించని వారి, మహాలయ శ్రాద్ధము, ప్రతిరోజు అష్టకాశ్రాద్ధముకాని (179) ఇతరమైన నైమిత్తిక శ్రాద్ధముకాని, లోభముతో చేయనివాని, చైత్రపూర్ణిమ యందు చిత్రగుప్తుని తుష్టి కొరకు (180) పానకము, కదలిపక్వము, శర్కరతో కూడిన పాయసాన్నము, బెల్లము, మామిడిపండు, పనస మొదలగు పండ్లు కలిగి (181) తాంబూలము, పాదుకలు, ఛత్రము, వస్త్రపుష్పములు, చందనము లోభముతో చెడిన బుద్ధిగలవాడై బ్రాహ్మణుల కివ్వని వారి (182) వీరందరి పాపములు ధనుష్కోటి యందు మునుగుట వలన నశిస్తాయి. చెడునడవడిక లేదా మంచి నడవడిక కలవాడుగాని వాడు ధనుష్కోటిని సేవించేవాడైతే (183) అతనికి పునర్జన్మలేకుండా సంసారవిచ్ఛిత్తి కలుగుతుంది. ఓముని పుంగపులార ! సంసారసాగరమును దాటుటకు ఇచ్ఛగించే నరుడు (184) ఆలసించకుండా రామచంద్ర ధనుష్కోటికి ఆతడు వెళ్ళాలి. సత్యం చెబుతున్నాను. హితం చెబుతున్నాను. హితమైన సారమునే తిరిగి చెబుతున్నాను (185) ముక్తి సిద్ధించే కొరకు రామచంద్ర ధనుష్కోటికి వెళ్ళండి. విముక్తి కొరకు రామచంద్ర ధనుష్కోటి యందు స్నాన మాచరించాలి. (186) ఓ విప్రులార! మరొక ఉపాయము లేదు. మాటిమాటికి చెబుతున్నాను. రామచంద్ర ధనుష్కోటి యందు స్నానం చేసిన నరులకు (187) ఏ ప్రయత్నం లేకుండా సంసార భయనాశనము సిద్ధిస్తుంది. సత్యము, జ్ఞానము, అనంతము, పూర్ణమైన సనాతన బ్రహ్మ (188) ప్రాప్తి ధనుష్కోటియందు మునుగుట వలన లభిస్తుంది. ఈ విషయంలో అనుమానములేదు.

మూ|| శ్రీసూత ఉవాచ -

ఏవం వః కథితం విప్రాః సేతుమాహాత్మ్య ముత్తమం || 189 ||

మహాదుఃఖ ప్రశమనం మహారోగ నిబర్హణం | ధుః స్వప్న నాశనం పుణ్‌యమవ మృత్యునివారణం || 190 ||

మహాశాంతికరం పుంసాం పఠతాం శృణ్వతామపి | స్వర్గాపవర్గదం పుణ్యం సర్వతీర్థఫలప్రదం || 191 ||

కీర్తయేద్య ఇదం పుణ్యం శృణుయాద్వాసమాహితః | సోగ్నిష్టోమాది యజ్ఞానాం ఫలమాప్నోతి పుష్కలం || 192 ||

చతుర్ణాం సాంగవేదానాం శతావృత్యాతుయత్ఫలం | తత్ఫలం సమవాప్నోతి హ్యేతన్మాహాత్మ్య కీర్తనాత్‌ || 193 ||

అత్రైకాధ్యా యపఠనాత్‌ శ్రవణా ద్వామునీశ్వరాః | అశ్వమేధస్య యజ్ఞస్య ప్రాప్నోత్య వికలం ఫలం || 194 ||

అధ్యాయద్వయ పాఠేన శ్రవణన తథైవచ | గోమేధాఖ్యన్య యజ్ఞస్య ఫలమాప్నోత్యసుత్తమం || 195 ||

దశాధ్యాయాన్పఠేద్యస్తు శృణుయాద్వానభక్తికం | స్వర్గలోక మవాప్నోతి శ##క్రేణ సహమోదతే || 196 ||

వింశత్యధ్యాయ పఠనాత్‌ శ్రవణాచ్చ మునీశ్వరాః | బ్రహ్మలోక మవాప్నోతి బ్రాహ్మణా సహమోదతే || 197 ||

త్రింశదధ్యాయ పఠనాత్‌ శ్రవణాచ్చమునీశ్వరాః | విష్ణులోకమవాప్నోతి విష్ణునాసహమోదతే || 198 ||

చత్వారింశత్తమాధ్యాయాత్‌ పఠే ద్వాశృణుయాదపి | రుద్రలోకమవాప్నోతి రుద్రేణ సహమోదతే || 199 ||

యః పంచాశత్తమాధ్యాయాన్‌ పఠతేశృణుతేపివా | ససాంబం హరమాప్నోతిశివం చంద్రార్ధశేఖరం || 200 ||

యఃపటేత్‌ శృణుయాచ్చేదంకృత్స్నంమాహాత్మ్యముత్తమం | ససాంబశి సాలోక్య మాప్నోత్యేవ ససంశయః || 201 ||

యఃపఠేత్‌ శృణుయాచ్చేదం ద్వివారం మునిసత్తమాః | సయాతి శివసామీప్యం విమానపర సంస్థితః || 202 ||

యః త్రివారం పఠేదేతత్‌ శృణుయాద్వాసమాహితః | శివసారూప్య మాప్నోతి శివస్య ప్రీతి మావహన్‌ || 203 ||

చతుర్వారం పఠేద్యస్తు శృణుయాద్వేదముత్తమం | ససాయుజ్యమవాప్నోతి శివస్యగిరిజాపతేః || 204 ||

దినేదినే పఠేన్మర్త్యః శ్లోకం శ్లోకార్థమేవవా | పాదం వా పాదమాత్రం వా అక్షరం వర్ణమేవవా || 205 ||

తత్తద్దిన కృతం పాపం తత్‌ క్షణాదేవనశ్యతి || 205 1 /2 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - ఈ విధముగా మీకు ఉత్తమమైన సేతు మాహాత్మ్యమును చెప్పాను. ఓ విప్రులార! (189) మహాదుఃఖ ప్రశమనము, మహారోగములను తొలగించేది, దుఃస్వప్ననాశకము, పుణ్యప్రదమ, అపమృత్యునివారకము (190) మహాశాంతినిచ్చేది, చదివే వారికి, వినే వారికి నరులకు స్వర్గమును అపవర్గమును ఇచ్చేది, పుణ్యకరము, సర్వతీర్థముల ఫలమునిచ్చేది (191) పుణ్యప్రదమైన దీనిని కీర్తించిన, చక్కగా విన్నను ఆతడు అగ్నిష్టోమాది యజ్ఞములు చేసిన ఫలమును పుష్కలముగా పొందుతాడు (192) అంగములతోటి నాల్గు వేదములను నూరు మారులు ఆ వృత్తిచేసిన వచ్చే ఫలితాన్ని ఈ మాహాత్మ్యమును కీర్తించుట వలన పొందుతాడు (193) ఇక్కడ ఒక అధ్యాయమును చదివిన విన్నను, ఓ మునులార అశ్వమేధ యజ్ఞము యొక్క ఫలమును సంపూర్తిగా పొందుతాడు. (194) రెండు అధ్యాయములను చదివిన, విన్నను గోమేధ యజ్ఞ ఫలమును ముఖ్యమైన దానిని పొందుతాడు (195) పది అధ్యాయములు చదివిన, భక్తితో విన్నను స్వర్గలోకమును పొంది ఇంద్రునితో కూడి ఆనందిస్తాడు (196) ఇరువది అధ్యాయములను చదివిన, విన్నను ఓ మునులార! బ్రహ్మలోకమును పొందుతాడు బ్రహ్మతో కలిసి ఆనందిస్తాడు (197) ముప్పది అధ్యాయములను పఠించినను విన్నను విష్ణులోకమును చేరుకుంటాడు విష్ణువుతో కూడి ఆనందిస్తాడు (198) నలుబది అధ్యాయములను చదివినను, విన్నను రుద్రలోకమును చేరి రుద్రునితో కలిసి ఆనందిస్తాడు (199) ఏబది అధ్యాయములను చదివినను, వినన్నను సాంబుని హరుని, శివుని, అర్థచంద్రుని తలలో గల వానిని ఆతడు పొందుతాడు (200) ఈ ఉత్తమమైన మాహాత్మ్యాన్ని పూర్తిగా చదివిన లేదా విన్నవారు సాంబశివుని సాలోక్యమను పొందుతారు అనుమానము లేదు (201) దీనిని రెండు మారులు చదివిన లేదా విన్నవారు, ఓ ముని సత్తములార! శ్రేష్ఠమైన విమానమందు కూర్చొని శివ సామీప్యమును చేరుతారు (202) చక్కగా మూడు మారులు దీనిని చదివిన లేదా వినిన వారు శివునకు ప్రీతి కలిగిస్తూ శివసారుప్యమును పొందుతారు (203) నాలుగు మారులు దీనిని ఉత్తమమైన దానిని పఠించిన లేదా విన్నవారు గిరిజాపతియైన శివుని సాయుజ్యమును పొందుతారు (204) ప్రతిరోజు శ్లోకమునుగాని సగము శ్లోకమును గాని చదివిన నరుని పాదమును గాని పాదములో కొంతగాని అక్షరముగాని వర్ణముగాని చదివిన నరుని (205) ఆయా దినములలో చేయబడ్డ పాపము ఆక్షణంలోనే నశిస్తుంది.

మూ || కృత్స్నేస్మిన్‌ సేతుమాహాత్మ్యే పఠితేపిశ్రుతేపివా || 206 ||

శ్లోకేష్వత్రైవ వర్తంతే వర్ణాయావంత ఏవహి | తాపత్యోబ్రహ్మహత్యాశ్చతావన్మద్యనిషేవణం || 207 ||

తావత్సువర్ణస్తేయంచ తావన్‌ గుర్వంగానాగమః | తావత్సంసర్గదోషాశ్చనశ్యంత్యే వహితత్‌క్షణాత్‌ || 208 ||

యావతోస్మిన్‌ మహాపుణ్య వర్తంతే వర్ణరాశయః | తావత్‌ కృత్వః చతుర్విం శత్తీర్థేషు స్నాన జంఫలం || 209 ||

తథాన్యేష్వపి తీర్థేషు సేతు మధ్యగతేషువై | తత్ఫలం సమవాప్నోతి పాఠేన శ్రవణనవా || 210 ||

యేనేదం లిఖితం భక్త్యాసేతు మాహాత్మ్యముత్తమం వినష్టాజ్ఞాన సంతానః శివసాయుజ్యమాప్నుయాత్‌ || 211 ||

యస్యేదం వర్తతే గేహామాహాత్మ్యం లిఖితం శుభం | భూతవేతాలకాదిభ్యోభీతిస్తత్రన విద్యతే || 212 ||

వ్యాధిపీడాన తత్రాస్తి నాస్తిచోరభయంతథా | శన్యం గారకముఖ్యానాం గ్రహానాం నాస్తిపీడనం || 213 ||

యద్గృహేవర్తతే పుణ్యమిదం మాహాత్మ్య ముత్తమం | రామసేతుం విజానీత తద్గృహం మునిపుంగవాః || 214 ||

చతుర్వింశతి తీర్థాని తత్రైవ నివసంతిహి | తత్రైవ వర్తతే పుణ్యో గంధమాదన పర్వతః || 215 ||

బ్రహ్మవిష్ణు మహేశాశ్చ వర్తంతే తత్రసాదరం

లిఖిత్వాసేతుమాహాత్మ్యం బ్రాహ్మణాయనివేదయేత్‌ | చతుఃసాగరపర్యంతాతేనదత్తావసుంధరా || 216 ||

సేతుమాహాత్మ్యదాన మంత్రః -

సేతు మాహాత్మ్య దానస్యకలాంనార్హంతి షోడశీం | దానాన్యన్యాని సర్వాణి హ్యతః శాంతిం ప్రయచ్ఛమే

కింపునర్బహునోక్తేన వసత్యత్రజగత్త్రయం || 217 ||

శ్రాపయేచ్ఛ్రాద్ధకాలేయోహ్యాకమధ్యాయమత్రవై | నశ్యేచ్ఛ్రాద్ధన్య వైకల్యం పితరోప్యతి హర్షితాః || 218 ||

యః పర్వకాలేసంప్రాప్తే బ్రాహ్మణాన్‌ శ్రావయేదిదం

అధ్యాయమేకం శ్లోకంవా గావోస్య నిరుపద్రవాః | బహుక్షీరాః సపత్సాశ్చ మహిష్యోస్యభవంతిహి || 219 ||

పఠనీయమిదం పుణ్యం మఠేదేవాలయేపివా | నదీతటాక తీరుషు పుణ్య వారణ్యభూతలే

శ్రోత్రియాణాంగృహెవాపినైవాన్యత్రతుకర్హిచిత్‌ || 220 ||

తా || ఈసేతుమాహాత్య్యముపూర్తిగాచదివినా, విన్నను (206) ఈశ్లోకములలోఎన్నివర్ణములు (అక్షరములు) ఉన్నాయో, అన్నిబ్రహ్మహత్యలు మద్యసేవనములు (207) అన్నిబంగారుదొంగతనములు, అన్ని గురుదారగమనములు, అన్ని సంసర్గదోషములు ఆక్షణంలోనేనశిస్తాయి. (208) ఈమహాపుణ్యమాహాత్యంలోఎన్నివర్ణరాశులుఉన్నాయో, అన్ని మారులు చతుర్వింశత్తీర్థములలో (24) స్నానంచేసిఫలములభిస్తుంది. (209) సేతుమధ్యమందున్న ఇతరతీర్థములందు స్నానంచేసినఫలమునుఈమాహాత్మ్యమునుచదువుటవలన, లేదావినుటవలనసొందుతాడు (210) ఈఉత్తమమైన సేతుమాహాత్మ్యమునుభక్తితోలిఖించినవారువారి అజ్ఞానసంతానమునశించిశివ సాయుజ్యమును పొందుతారు (211) శుభ##మైనఈమాహాత్మ్యమువ్రాయబడిఎవరిఇంట్లోఉంటుందో, వారికి భూతవేతాల కాదుల నుండి భయములేదు. (212) వారికివ్యాధిపీడ, అక్కడదొంగలభయములేదు. శనికుజుడుమొదలగు ముఖ్యగ్రహముల పీడఅక్కడలేదు. (213) ఉత్తమమైనపుణ్యప్రదమైనమాహాత్మ్యము ఏఇంట్లోఉంటే, ఆఇంటినిరామసేతువుగా తెలుసుకోండి, ఓమునిపుంగవులార! (214) ఇరువదినాలుగుతీర్థములుఅక్కడేఉన్నాయి. పుణ్యమైనగంధమాదనపర్వతముఅక్కడేఉంది. (215) బ్రహ్మవిష్ణుమహేశులుఅక్కడే సాదరంగాఉంటారు. సేతుమాహాత్మ్యమును వ్రాసిబ్రాహ్మణులకునివేదించాలి. అట్లాచేస్తేనాల్గు సముద్రములవరకు గలభూమిని ఆతడుదానంచేసినట్లే (216) సేతు మాహాత్మ్యదానమంత్రము - ఇతరదానములన్నీ సేతుమాహాత్మ్యదానము యొక్క పదహారవకలనుగూడా పొందలేవు. అందువల్ల నాకుశాంతినివ్వు. ఎక్కువగాచెప్పనవసరంలేదు. ఇక్కడ ముల్లోకములునివసిస్తున్నాయి. (217) శ్రాదధకాలమందుఒకఅధ్యాయమును ఎవరు వినిపిస్తారో, ఆతనిశ్రాద్ధమందలి దోషాలునశిస్తాయి. ఆతనిపితరులు చాలాసంతోషిస్తారు. (218) పర్వకాలమువచ్చినపుడు ఈ మాహాత్మ్యమును బ్రాహ్మణు లకువినిపించిన ఒకఅధ్యాయము కాని ఒకశ్లోకమైనావినిపించినఆతనిగోవులు ఆపదలులేకుండా ఉంటాయి. ఎక్కువగా పాలనిస్తు, దూడలతోగూడి ఉంటాయి. వాటికి బఱ్ఱలు జన్మిస్తాయి. (219 ) దీనినిపుణ్యమైనదీనిని మఠమందుదేవాలయమందుకాని, నదితటాకతీరములందు పవిత్రమైన అరణ్యహూములందు శ్రోత్రి యులగృహమంద కానిపఠించాలి. ఇతరచోట్ల ఎక్కడాచదువొద్దు. (220)

మూ|| విషువాయనకాలేషుపుణ్యచహరివానరే | అష్టమ్యాంచచతుర్దశ్యాంపఠనీయంవిశేషతః || 221 ||

ఇదంహిపాఠ్యంశ్రావణ్యాంమాసిభాద్రపదేతధా | ధనుర్మాసేచపాఠ్యంస్యాత్‌పాఠ్యంచైవోత్తరాయణ || 222 ||

నియమేనైవమాహాత్మ్యంపఠనీయమిదంద్విజాః | శ్రోతారోనియమైర్యుక్తాఃశృణుయుశ్చేదముత్తమం || 223 ||

కీర్త్యంతేపుణ్యతీర్థానిమాహాత్మ్యేస్మిన్‌బహూనివై | కీర్త్యంతేపుణ్యశీలాశ్చతథారాజర్షిసత్తమాః || 224 ||

ఋషయశ్చమహాభాగాఃకీర్త్యంతేస్మిన్మనుత్తమే | ధర్మాధర్మౌచకీర్త్యేతేపుణ్యస్మిద్ధ్విజపుంగవాః || 225 ||

బ్రహ్మావిష్ణుశ్చరుద్రశ్చకీర్త్యంతేత్రత్రిమూర్తయః | ఇదంపవిత్రంపాపఘ్నంశ్రుత్యర్థైరుపబృంహితం || 226 ||

సంమతంస్మృతికర్తౄణాంద్వైపాయసమునిప్రియం | శ్రోతవ్యంపఠితప్యంచఆత్మనఃశ్రేయఇచ్ఛతా || 227 ||

శ్రావకాయచదాతప్యంయత్కించిత్కాంచవాదికం | స్వస్వశక్త్యనురోధేనవిత్తశాఠ్యంసకారయేత్‌ || 228 ||

వస్త్రంహిరణ్యంధాన్యంవాభూమింగాంచయథాబలమ్‌ | దత్వాసంభావనీయోయంశ్రాపకఃశ్రోతృభిర్జవైః || 229 ||

పూజితేశ్రావకేతస్మిన్‌పూజితాఃస్యుఃత్రిమూర్తయః | జగత్త్రయంపూజితంస్యాత్‌పూజితాసుత్రిమూర్తిషు || 230 ||

అవతీర్థోమహీంసాక్షాత్‌రామోదాశరథిర్‌హరిః | ససీతాలక్ష్మణోనిత్యంశ్రోతృభ్యఃశ్రావకాయచ || 231 ||

దత్వేహలోకేభోగాంశ్చముక్తించాంతేప్రయచ్ఛతి | ద్వైపాయనముఖాంభోజాన్నిఃసృతంశుభదంపరం || 232 ||

ఇదంవైసేతుమాహాత్మ్యంధర్మరాజోయుధిష్ఠిరః | భీమసేనాదిభిఃసర్వైరనుజైరపిసంవృతః || 233 ||

నియమాచారసంయుక్తఃససైన్యశ్చదినేదినే | శృణోతిపఠతోధౌమ్యమహర్షేఃస్వపురోధనః || 234 ||

తా || విషువత్తుయందు, అయనకాలమందుపుణ్యప్రదమైనహరివానరమందు, అష్టమి, చతుర్దశిఈతిధులందువిశేషించి దీనినిచదువాలి (221) దీనిని శ్రావణభాద్రపదమాసములందుచదువాలిధనుర్మాసమందుచదువాలి. ఉత్తరాయణమందు చదవాలి. (222) ఓద్విజులార! ఈమాహాత్మ్యాన్నినియమంతోచదువాలి. ఉత్తమమైనదీనిని శ్రోతలుకూడానియమములతో కూడివినాలి. (223)ఈమాహాత్మ్యమందుఅనేక పుణ్యతీర్థములుకీర్తింపబడుతున్నాయి. అట్లాగేపుణ్యశీలులైనరాజర్షిసత్తములు కూడాకీర్తింపబడు తున్నారు. (224) ప్రధానమైనదీనియందుమహాభాగులైనఋషులుకీర్తింపబడుతున్నారు. ఓద్విజపుంగ పులార! పుణ్యప్రదమైనదీనియందు ధర్మఅధర్మములు కీర్తింపబడుతున్నాయి. (225) ఇందుబ్రహ్మవిష్ణురుద్రులు త్రిమూర్తులుకీర్తింప బడుతున్నారు. ఇదిపవిత్రమైనది. పాపములహరించేది. వేదఅర్థములతోపెంచబడినది (226) స్మృతి కర్తలకుఇష్టమైనది. ద్వైపాయనమునికిప్రియమైనది. తనకుశ్రేయస్సునుకోరుకునేవాడు. వినాలిచదువాలి. (227) వినిపించే వ్యక్తికి, ఏదోకొంతబంగారముమొదలైనవిఇవ్వాలి. తనశక్తికితగినట్టుఇవ్వాలి. ధనలోభంచేయరాదు. (228) వస్త్రము, బంగారము, ధాన్యము, భూమి, గోవు ఏదైనాశక్తికితగినట్లుఇవ్వాలి. వినేవారు, ఈమాహాత్మ్యాన్నిచెప్పినవ్యక్తిని దానమివ్వడం ద్వారాగౌరవించాలి. (229) ఈమాహాత్మ్యంచెప్పినవానిని పూజిస్తేత్రిమూర్తులు పూజింపబడతారు. త్రిమూర్తులుపూజింపబడితే ముల్లోకములుపూజింపబడినట్లే, (230) హరి,దశరథునికుమారుడు రాముడుగా సాక్షాత్తుగా ఈభూమిపైఅవతరించాడు. ఆతడు సీతాలక్ష్మణులతోకూడిప్రతిరోజుఈమాహాత్మ్యన్నివిన్నవారికి, వినిపించినవారికి (231) ఈలోకమందు సుఖములనిచ్చి, అంత ముందుముక్తినిస్తాడు. ద్వైపాయనునిముఖపద్మమునుండివెలువడినదిది. మిక్కిలి శుభమునిచ్చేది. (232) ఈసేతుమాహాత్మ్యానని యుధిష్ఠరుడైన ధర్మరాజు, భీమసేనుడుమొదలుగా గలతమ్ములందరితోకూడి (233) నియమాచారములతోకూడి, సైన్యముతోపాటుప్రతిదినముపురోహితుడైన ధౌమ్యమహర్షి చదువు తుండగా వినేవాడు (234)

శ్రీసూతఉవాచ -

మూ || భోభోస్తపోధనాఃసర్వేనైమిషారణ్యవాసినః | మత్సకాశాదిదంగుహ్యంమాహాత్మ్యంశ్రుతిసంమితం || 235 ||

శ్రుతంభవద్భిర్నియతైర్నిత్యంపఠతసాదరం | పాఠయధ్వంస్వశిష్యేభ్యోనియతేభ్యోనిరంతరం || 236 ||

ఇత్యుక్తాతాన్మునీన్‌సూతోరోమాంచితకలేవరః | గురుంహృదాస్మరన్‌వ్యాసంసనర్తాశ్రూణివర్తయన్‌ || 237 ||

అత్రాంతరేమహావిద్వాన్‌ పారాశర్యోమహామునిః | ఆశుప్రాదురభూత్తత్రశిష్యానుగ్రహకాంక్షయా || 238 ||

తమాగతంవిలోక్యాథమునింసత్యవతీసుతం | సూతైఃసర్వైశ్చసహితోనైమిషారణ్యవాసిభిః || 239 ||

వ్యాసస్యచరణాంభోజేదండవcత్పణిపత్యతు | జలమానందజంతత్రనేత్రాభ్యాంపర్యవర్తయత్‌ || 240 ||

ప్రణతంప్రియశిష్యంతందోర్భ్యాముత్థాప్యవైమునిః | ఆశీర్భిరభినంద్యైనంఆలింగ్యచముహుర్ముహుః || 241 ||

నైమిషారణ్యమునిభిరానీతేపరమాననే | ద్వైపాయనోమహాతేజానిషసాదతపోధనః || 242 ||

మునిష్వప్యువష్టేషుసూతేపిచనిజాజ్ఞయా | శౌనకాదీన్‌మునీన్‌సర్వాన్‌శ##క్తేఃపౌత్రోభ్యభాసత || 243 ||

మయాజ్ఞాతమిదంసర్వంనైమిషారణ్యవాసినః | మమశిష్యేణసూతేనసేతుమాహాత్మ్యముత్తమం

కథితంభవతామద్యమహాపాతకనాశనం || 244 ||

శ్రుతీనాంచస్మృతీనాంచపురాణాంతదైవచ | దశాస్త్రాణాంచేతిహాసానాంఅన్యేషామపికృత్స్నశః || 245 ||

ఏషపర్యవనన్నోర్థోమాహాత్మ్యంయత్త్విదంమహత్‌ | సర్వేష్వపిపురాణషుఇదంబహుమతంమమ || || 246 ||

శృణోతిధర్మజోధౌమ్యాదిదంనిత్యంమమాజ్ఞయా | అతోభవంతోపినదాసేతుమాహాత్మ్యముత్తమం || 247 ||

పఠంతుశృణ్వంతుతథాశిష్యాణాంపాఠయంతుచ | తచ్ఛ్రుత్వావచనంతస్యతేప్రాహుర్బాఢమిత్యపి || 248 ||

తతోవ్యాసోపిసూతేనశిష్యేణచసమన్వితః | అనుజ్ఞాప్యమునీన్‌సర్వాన్‌కైలాసంపర్వతంయ¸° || 249 ||

ఋషయోనైమిషారణ్యనిలయాఃతుష్టిమాగతాః | ప్రత్యహంసేతుమాహాత్మ్యంశృణ్వంతిచపఠంతిచ || 250 ||

ఇతిశ్రీస్కాందమహాపురాణఏకాశీతిసాహcస్యాంసంహితాయాం తృతీయేబ్రహ్మఖండేమాహాత్మ్యేద్విపంచాశత్తమో ధ్యాయః || 52 ||

ఇదంస్కాందమహాపురాణాంతర్గతబ్రహ్మఖండాంతర్గతసేతుమాహాత్మ్యం సమాప్తం

తా || శ్రీసూతులిట్లన్నారు. ఓతపోధనులార! అందరూనైమిషారణ్యవాసులార, నానుండిరహస్యమైన,శ్రుతి సమ్మితమైన ఈమాహాత్మ్యాన్ని (235) మీరంతావిన్నారు. ప్రతిరోజుఆదరంతో, నియమంగాదీన్నిచదవండి. నియమితులైనతమశిష్యులతో ఎల్లప్పుడుచదివించండి. (236) అనిమునులతోపలికిసూతుడురోమాంచితశరీరుడై, గురువైనవ్యాసునిహృదయంలోస్మరిస్తూ ఆనందబాష్పాలురాలుస్తూనాట్యంచేశాడు. (237) ఇంతలోమహావిద్వాంసుడైనపారాశర్యమహాముని, శిష్యలనుఅనుగ్రహించాలనేకోరితకతోత్వరగాఅక్కడప్రత్యక్షమైనాడు. (238) వచ్చిన, సత్యవతీసుతుడైనామునునిచూచిసూతుడు, నైమిషారణ్యవాసులందరితోకూడి (239) వ్యాసునిపాదాంభోజములకు దండమువలెసాష్టాంగనమస్కారముచేసి, ఆనందబాష్పాలను తనకన్నులనుండి కార్చాడు. (240) నమస్కరించినతనప్రియ శిష్యునిఆమునితనచేతులతోలేవనెత్తి, ఆశీస్సులతోఅభినందించి ఆతనినిమాటిమాటకి కౌగిలించుకొని (241) నైమిషారణ్యమునులు తెచ్చినపరమఆసనమునందు తపోధనుడు, మహాతేజస్సంపన్నుడు ద్వైపాయనుడుకూర్చున్నాడు. (242) ఆతని ఆజ్ఞతోమునులు కూర్చున్నపిదప, సూతుడుకూడాకూర్చున్న పిదపశౌనకాదిమునులందరితో శక్తిపౌత్రుడుఇట్లా పలికాడు (243) ఓనైమిషారణ్యవాసులార. ఇదంతానాకుతెలుసు. నాశిష్యుడైనసూతుడు, ఉత్తమమైనసేతుమాహాత్మ్యాన్ని మహాపాతకనాశకమైన దానినిమీకుచెప్పాడు. (244) శ్రుతులలోని, స్మృతులలోని అట్లాగేపురాణములలోని శాస్త్ర, ఇతిహాసము లలోనిఇతరమైనవాటినన్నింటిలోని సంపూర్ణమైన (245) పర్యవసన్నమైనఅర్థము, ఈమాహాత్మ్యము. ఇదిచాలాగొప్పది. పురాణములన్నింటిలోఇదినాకు ఇష్టమైనది. (246) నాఆజ్ఞతోధర్మరాజునిత్యముధౌమ్యునినుండిదీనినివింటున్నాడు. అందువల్ల మీరుకూడాఎల్లప్పుడు ఉత్తమమైనసేతుమాహాత్మ్యాన్ని (247) చదవండి. వినండి. అట్లాగే శిష్యులతోచదివించండి కూడా. ఆతనిమాటలనువిని వారుఅట్లాగేఅనిపలికారు. (248) పిదపవ్యాసుడుశిష్యుడైనసూతునితోకలిసి, మునులందరికి ఆజ్ఞఇచ్చికైలాస పర్వతమునకు వెళ్ళాడు. (249) నైమిషారణ్యవాసులైన ఋషులందరుఆనందపడివారు ప్రతిరోజుసేతు మాహాత్మ్యమును వింటున్నారు. చదువుతున్నారుకూడా. (250) అనిస్కాందమహాపురాణమందుఏకాశీతిసహస్రసంహితయందు తృతీయమైనబ్రహ్మ ఖండమందు సేతుమాహాత్మ్య మందుఏబదిరెండవఅధ్యాయము.

స్కాందమహాపురాణాంతర్గతమైనబ్రహ్మఖండాంతర్గతమైనసేతుమాహాత్మ్యము ఇదిసమాప్తమైనది.

Sri Scanda Mahapuranamu-3    Chapters