Sri Scanda Mahapuranamu-3    Chapters   

నలుబది ఎనిమిదవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

రామనాథం సముధ్ధిశ్యకథాం పావవినాశినీం | ప్రవక్ష్యామి మునిశ్రేష్ఠాః శృణుధ్వం సునమాహితాః ||1||

పాండ్యదే శాధిపోరాజా పురాసీచ్ఛంకరాభిధః | బ్రహ్మణ్యః సత్యసంధశ్ఛ యాయజూకశ్చధార్మికః ||2||

వేదవేదాంగతత్వజ్ఞః పరసైన్యవిదారణః | చతురోప్యాశ్రమాన్వర్ణాన్‌ ధర్మతః పరిపాలయన్‌ ||3||

వైదికాచార నిరతః పురాణస్మృతి పారగః | శివవిష్ణ్వర్చకోనిత్యమన్య దైవత పూజకః

||4||

మహాదాన ప్రదోనిత్యం బ్రాహ్మణానాం మహాత్మనాం | మృగయార్థంయ¸°ధీమా న్సకదాచిత్తపోవనం ||5||

సింహవ్యాఘ్రేభమహిషక్రూరసత్వ భయంకరం | రి&ుల్లికా భీషణ రనం సరీసృప సమాకులం ||6||

భీమాశ్వాపద సంపూర్ణం దావానలభయం కరం | మహారణ్యం ప్రవిశ్యాథ శంకరోరాజశేఖరః ||7||

అనేకసైనికోపేత అఖేటి కులసంకులః | పాదుకాగూఢ చరణోరక్తోష్ణీషోహరిచ్ఛదః ||8||

బద్ధగోధాం గులిత్రాణో ధృత కోదండసాయకః | కక్ష్యాబద్ధమహాఖడ్గః శ్వేతాశ్వ పరమాస్థితః ||9||

సువేషధారీ సన్నద్ధః పత్తిసంఘసమావృతః | కాంతరేషు చరమ్యేషు పర్వతేషు గుహానుచ ||10||

సముత్తీర్ణమహాస్రోతాయువాసింహపరాక్రమః | విచచార బలైః సాకం దరీషు మృగయన్మృగాన్‌ || 11 ||

బధ్యతాం వధ్యతామేషయాతి వేగాన్మృగోవనే | ఏవం వదత్సుసైన్యేషు స్వయముత్ల్సుత్యశంకరః || 12 ||

మృగంహంతిమహారాజో విగాహ్యవిపినస్థలీం | సింహాన్వరాహాన్మహిషాన్కుంజరాన్‌ శరభాంస్తథా ||13 ||

వినిఘ్నన్స మృగానన్యాన్వన్యాన్‌ శంకర భూపతిః | కుత్రచిద్విపినోద్దేశే దరీ మధ్యనివాసినం ||14 ||

వ్యాఘ్రచర్మధరం శాంతం మునిం నియత మానసం | వాఘ్రబుధ్ధ్యాజఘానాశు శ##రేణానత పర్వణా || 15 ||

అతివేగేన విప్రేంద్రా స్తత్పత్నీంచన సాయకః | నిజఘానవతి ప్రాణాంనివిష్టాం పత్యురంతికే || 16 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - రామనాథుని గూర్చి పావ వినాశిని యైన కథను చెప్తున్నాను. ఓ మునిశ్రేష్ఠులార | చాలా శ్రధ్ధగా వినండి (1) పూర్వము పాండ్య దేశమునకు అధిపతి రాజు శంకరుడను పేరు గలవాడు ఉండేవాడు. అతడు బ్రాహ్మణుడు ( బ్రాహ్మణుల మేలు కోరేవాడు) సత్యసంధుడు, ధార్మికుడు అనేకమార్లు యజ్ఞం చేయాలనే స్వభావం కలవాడు (2) వేదవేదాంగముల తత్వరిగినవాడు, శత్రుసైన్యమును చీల్చగలవాడు నాల్గు ఆశ్రమములను, చతుర్వర్ణములను ధర్మంగా పాలిస్తున్నాడు (3 ) వైదికాచారములందు ఆసక్తి కలవాడు పురాణములు, స్మృతులు వీనిసార మెరిగినవాడు నిత్యము శివవిష్ణుదైవముల అర్చకుడు అట్లాగే ఇతర దేవతా పూజకుడు కూడా ( 4) మహాత్ములైన బ్రాహ్మణులకు నిత్యము గొప్పదానం చేసేవాడు ఆ బుద్ధిమంతుడొకసారి వేటకొరకు తపోవనమునకు వెళ్ళాడు ( 5 ) సింహములు, పులులు ఏనుగులు దున్నపోతులు క్రూర జంతువులతో భయంకరమైనదది. కీచురాళ్ళ భయంకర ధ్వని గలది. పాకుడుజంతువులతో నిండినది. ( 6 ) భయంకరమైన హింసించే జంతువులతో నిండినది దావానలముతో భయంకరమైనది. రాజశేఖరుడైన శంకరుడు మహారణ్యమును ప్రవేశించి ( 7 ) అనేక సైనికులతో కూడి, వేటగాళ్ళ సమూహముతో నిండి పాదములను చెప్పులతో ఆచ్ఛాదించుకొని, ఎర్రని తల పాగా గలగి, పచ్చని దుప్పటి గలిగి ( 8 ) చేతులకు వేళ్ళ రక్షణకై తొడుగులు ధరించి, కోదండము (ధనస్సు ) బాణములు ధరించి నడుమునకు ఖడ్గమును కట్టుకొని శ్రేష్ఠమైన తెల్లని గుర్రము నెక్కి (9) మంచి వేషమును ధరించి సన్నద్ధుడై కాలిబంట్ల సమూహముతో చుట్టబడి, అందమైన అడవులయందు పర్వతములందు గుహలందు (10) గొప్ప ప్రవాహములను దాటుతూ సింహ పరాక్రముడు యువకుడు రాజు బలములతో పాటు దరులయందు ( గుహ ) మృగములను వెతుకుతూ తిరిగాడు (11) అదిగో ఈ మృగం వేగంగా అడవిలోకి పోతోంది. దీన్ని బంధించండి, దీన్ని చంపండి, అని ఈ విధంగా సైన్యం అంటుండగా శంకరుడు స్వయంగా దూకి (12) అడవిలోకి ప్రవేశించి మహారాజు మృగమును చంపుతున్నాడు. సింహములను పందులను దున్నలను, ఏనుగులను శరభములను (13) చంపుతూ అతడు శంకర భూపతి ఇతరములైన అడవి జంతువులను చంపుతూ అడవిలో ఒకచోట గుహలో మధ్యఉండే (14) శాంతుడైన నిశ్చల మనస్సు గల వ్యాఘ్రచర్మము ధరించిన మునిని వ్యాఘ్రమను బుద్ధితో వంచిన ధనస్సు (పర్వము = కణువు) గల బాణముతో త్వరగా చంపాడు (15) ధనస్సు గలిగి వేగంగా ఆతని భార్యను కూడా, పతియే ప్రాణముగా గల, భర్త సమీప మందు కూర్చున్న ఆమెను చంపాడు (16) .

మూ || విలోక్యమాతాపితరౌ తత్పుత్రోనిహతౌవనే | రురోద భృశదుఃఖార్తో విలలా పచకాతరః || 17 ||

భోస్తాతమాతర్మాం హిత్వాయువాం యాతౌ క్వవాధునా | అహంకుత్ర గమిష్యామి కోవామే శరణం భ##వేత్‌ || 18 ||

కోమామధ్యాపయే ద్వేదాన్‌ శాస్త్రం వా పాఠయేత్పితః | అంబమేభోజనం కావాదాన్యతే సోపదేశకం || 19 ||

ఆచారాన్‌ శిక్షయేత్కోవా తాతత్వయిమృతేధునా | అంబబాలం ప్రకుపితం కావామామువలాలయేత్‌ || 20 ||

యువాం నిరాగసావద్యకేన పాపేన సాయకైః | నిహతౌ వైతపోనిష్ఠౌమత్ర్పాణౌ మద్గురూవనే || 21 ||

ఏవంతయోః సుతోవిప్రాముక్త కంఠం రురోదవై | అథప్రలపితం శ్రుత్వాశంకరో విపినేచరన్‌ || 22 ||

తచ్ఛబ్దాభిముఖః సద్యః ప్రయ¸° సదరీముఖం | తత్రత్యామునయోప్యాశు సమాగచ్ఛం స్తమాశ్రమం || 23 ||

తేదృష్ట్వామునయః సర్వేశ##రేణ నిహతం మునిం | తత్పత్నీంచ హతా విప్రా రాజానం చ ధనుర్ధరం || 24 ||

విలవంతం సుతంచాపి విలోక్యభృశవిహ్వలాః | పుత్రమాశ్వానయామాసుర్మారోదీరితికాతరం || 25 ||

మునయ ఊచుః -

ఆఢ్యేవాపి దరిద్రే వామూర్ఛేవా పండితేపివా | పీనేనాథ కృశే వాపి సమవర్తీపరేతరాట్‌ || 26 ||

వనేవానగరే గ్రామే పర్వతే వాస్థలాంతరే | మృత్యోర్వశే ప్రయాతద్యం సర్త్వే రపిహిజంతుభిః || 27 ||

వత్సనిత్యంచ గర్భస్థైః జాతైరపిచ జంతుభిః | యువభిః స్థవిరైః సర్వై ర్యాతవ్యం యమపత్తనం || 28 ||

వర్ణిభిశ్చ గృహస్థైశ్చవానప్రస్థైశ్చ భిక్షుభిః | కాలేప్రాప్తేత్వయందే హస్త్యక్తవ్యోద్విజపుత్రక || 29 ||

బ్రాహ్మణౖః క్షత్రియైర్వైశ్యైః శూద్రైర పిచసంకరైః | యాతవ్యం ప్రేతనిలయే ద్విజపుత్రమహామతే || 30 ||

దేవాశ్చ మునయో యక్షా గంధర్వోరగ రాక్షసాః | అన్యేచ జంతవః సర్వేబ్రహ్మవిష్ణు హరాదయః || 31 ||

సర్వేయాన్యంతి విలయం నత్వం శోచితుమర్హుసి |

తా || వారి కుమారుడు అడవి యందు చనిపోయిన తన తల్లిదండ్రులను చూచి ఏడ్చాడు. మిక్కిలి దుఃఖంతో బాధపడినవాడై భయస్థుడై ఏడ్చినాడు (17) ఓనాతండ్రి, నాతల్లి నన్ను వదలి మీరిద్దరు ఇప్పుడెక్కడికి వెళ్ళారు. నేనెక్కడికి వెళ్ళాలి నాకు శరణమెవ్వరు (18) నాకు వేదములెవ్వరు చెప్తారు. ఓ నాన్న! నన్ను శాస్త్రములెవ్వరు చదివిస్తారు. ఓ అమ్మ! నాకు భోజనమెవ్వరు పెడ్తారు. ఉపదేశంచేస్తూ (19) ఓ నాన్న ! ఇప్పుడు నీవు చనిపోతే నాకు ఆచారములను బోధించేదెవరు అమ్మ ! కోపించిన నన్ను ఓదార్చేదెవరు (20) తప్పులేని మీరు ఈవేళ ఏ పాపిబాణములతో చంపబడ్డారు. తపోనిష్ఠులు, నా ప్రాణము నా గురువులు ఐన మీరు వనంలో ఎవనితో చంపబడ్డారు (21) ఓ బ్రాహ్మణులార ! ఈ విధముగా వారి పుత్రుడు గొంతెత్తి ఏడ్చాడు. ఆ ఏడ్పును అడవిలో తిరిగే శంకరుడు విని (22) ఆ శబ్దమునకు అభిముఖుడై వెంటనే ఆ గుహముందరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి మునులు కూడా త్వరగా ఆ ఆశ్రమమునకు వచ్చారు (23) ఆ వారందరు మునులు బాణములతో చంపబడ్డమునిని చూచి, చనిపోయిన ఆతని భార్యను చూచి (24) ఏడుస్తున్న ఆకుమారుని కూడ చూచి మిక్కిలి చలితులై అధీరుడైన కుమారుని ఏడ్వవద్దు అని ఓదార్చసాగారు (25) మునుల మాటలు - ధనవంతుడైనా ! దరిద్రుడైనా ! మూర్ఖుడైనా ! పండితుడైనా ! బలిసినవాడైనా ! బక్కచిక్కినవాడైనా యముడు అందరి విషయంలోనూ సమంగా వర్తిస్తాడు (26) వనంలోకాని నగరంలో కాని గ్రామంలోకాని పర్వతమందు కాని మరోచోటైనా ఎక్కడున్నా ప్రాణులందరు మృత్యువశులుగా వెళ్ళవలసినదే (27) ఓ కుమార ! గర్భమందున్న లేదా పుట్టిన ప్రాణులు, యువకులైనా ముసలివారైనా అందరు నిత్యము (తప్పక) యమ పట్టణానికి వెళ్ళాల్సిందే (28) బ్రహ్మచారులు, గృహస్థ వానప్రస్థులు, భిక్షులు అందరూ యమనగరానికి వెళ్ళాల్సిందే. ఓ బ్రాహ్మణ కుమార ! పోయే కాలం వస్తే ఈ శరీరాన్ని వదలాల్సిందే (29) బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, సంకరులు ఎవరైనా ప్రేతనిలయమునకు వెళ్ళాల్సిందే, ఓ మహామతి, బ్రాహ్మణపుత్ర (30) దేవతలు మునులు యక్ష గంధర్వ ఉరగ రాక్షసులు ఇతర ప్రాణులు అందరు బ్రహ్మవిష్ణు హరాదులు (31) అందరు విలయం పొందుతారు కనుక నీవు దుఃఖించరాదు.

మూ || అద్వయం సచ్చిదానందం యద్ర్బహ్మోపనిషద్గతం || 32 ||

నతస్యవిలయో జన్మవర్ధనం చాపిసత్తమ | మలభాండేన వద్వారే పూయానృక్‌ శోణితాలయే || 33 ||

దేహేస్మిన్‌ బుద్బుదాకారే కృమియూధనమాకులే | కామక్రోధ భయద్రోహమోహమాత్సర్యకారిణి || 34 ||

వరదార పరక్షేత్ర పరద్రవ్యైకలోలుపే | హింసాసూయాశుచివ్యాప్తే విష్టామూత్రైక భాజనే || 35 ||

యః కుర్యాచ్ఛోభన ధియం సమూఢః సచదుర్మతిః | బహుచ్ఛిద్రఘటాకారే దేహేస్మిన్నశుచౌనదా || 36 ||

వాయోరవస్థతిః కింస్యాత్ర్పాణాఖ్యన్యచిరం ద్విజ | అతోమాకురుశోకంత్వం జననీం పితరం ప్రతి || 37 ||

తౌన్వకర్మవశాద్యాతౌ గృహం త్యక్త్వా త్విదంక్వచిత్‌ | తవకర్మవశాత్త్వంచ తిష్ఠత్యస్మిన్మహీతలే || 38 ||

యదాకర్మక్షయస్తే స్యాత్తదాత్వంచ మరిష్యసి | మరిష్యమాణప్రేతోహి మృతప్రేతన్యశోచతి || 39 ||

యస్మిన్కాలే సముత్పన్నౌ తవమాతాపితాతథా | నతస్మిస్త్వం సముత్పన్నస్తతోభిన్నాగతిర్హివః || 40 ||

యదితుల్యాగతిస్తే స్యాత్తాభ్యాం సహమహామతే | తర్హిత్వమపియాతవ్యం మృతౌయత్రహితౌగతౌ || 41 ||

మృతానాం బాంధవాయేతు ముంచంత్యశ్రూణిభూతలే | పిబంత్యశ్రూణితాన్యద్ధామృతాఃప్రేతాః పరత్రవై || 42 ||

అతఃశోకం పరిత్యజ్య ధృతిం కృత్వానమాహితః | అనయోః ప్రేతకార్యాణి కురుత్వం వైదికానితు || 43 ||

శరఘాతాన్మృతావేతౌ యస్మాత్తే జననీ పితా | అతస్తద్దోషశాంత్యర్థమస్థీన్యాదాయవైతయోః || 44 ||

రామానాథశివక్షేత్రే రామసేతౌ విముక్తిదే | స్థాపయస్వ తథాశ్రాద్ధం నపిండీకరణాదికం || 45 ||

తత్రైవకరుశుద్ధ్యర్థం తయోర్ర్బాహ్మణపుత్రక | తేనదుర్మృత్యుదోషస్య శాంతిర్భవతినావ్యధా || 46 ||

శ్రీ సూత ఉవాచ -

ఏవముక్తః సమునిభిః శాకల్య స్యసుతోద్విజాః | జాంగలాఖ్యస్తయోః సర్వం పితృమేధం చకారవై || 47 ||

తా || ద్వయముగా నిది (ఒక్కటే) సచ్చిదానంద రూపము ఐన ఉపనిషత్తులలో చెప్పబడ్డ బ్రహ్మమునకు (32) నాశము, జన్మ, పెరుగుదల అనునవి లేవు ఓ సజ్జనశ్రేష్ట. ఈ శరీరముమల భాండము, నవద్వారములు కలది, చీము రక్తముతో ఎర్రనైన ప్రదేశము (33) బుద్బుదాకారము కలది, పురుగుల సమూహంతో నిండినదీ శరీరము. ఇది కామక్రోధ భయద్రోహమోహమాత్సర్యములను కల్గించేది (34) ఇతరుని భార్యయందు, పరక్షేత్రము లందు, పరద్రవ్య మందు మాత్రమే ఆసక్తమైనది (ఇచ్ఛ) హింస, అశుచి, అసూయలతో నిండినది. మలమూత్రములకు మాత్రమే స్థానమైనది (35) ఇట్టి శరీరముపై మంచి బుద్ధిని కలిగినవాడు మూఢుడు. వాడు దుర్మతి. బహుచ్ఛిద్రములు గల కుండ ఆకారంగా ఉన్న ఈ అశుచియైన దేహములో ఎల్లప్పుడు (36) ప్రాణమను పేరుగల వాయువు చిరకాలము ఉంటుందా ఏమి ఓ బ్రాహ్మణ! అందువల్ల నీ తల్లిని గూర్చి తండ్రిని గూర్చి నీవు దుఃఖించవద్దు (37) వారు తమకర్మ వశం వల్ల ఈ ఇంటిని విడిచి వెళ్ళారు. నీకర్మవశం వల్ల నీవు ఈ భూమి యందున్నావు (38) కర్మక్షయమైతే నీవు కూడా మరణిస్తావు. చావబోయే ప్రేతమే చనిపోయిన ప్రేతాన్ని గూర్చి ఏడుస్తుంది (39) నీ తలిదండ్రులు పుట్టిన కాలంలో నీవు పుట్టలేదు. అందువల్ల మీ మార్గాలు వేరు (40) ఒకవేళ నీగతి వాళ్ళతో పాటిదే ఐతే చనిపోయే వారెక్కడికి వెళ్ళారో అక్కడికే నీవు కూడా వెళ్ళాలి (41) చనిపోయిన వారి బంధువులు భూమిపై విడిచేకన్నీళ్ళను మరణించి ప్రేతరూపంలో పరంలో ఉన్నవారు ఆ కన్నీళ్ళను తాగుతారు (42) అందువల్ల దుఃఖాన్ని వదలి ధైర్యం వహించి, చక్కగా ఉండి, వీరి, వైదికమైన ప్రేతకార్యములను నీవాచరించు (43) నీతలిదండ్రులు వీరు శరాఘాతంతో చనిపోయారు కనుక ఆ దోషశాంతి కొరకు వారి ఆస్థులను తీసుకొని (44) రామనాధ శివక్షేత్ర మందు ముక్తి నిచ్చే రామసేతువు యందు ఉంచు. అట్లాగే నపిండీకరణాది శ్రాద్ధమును (45) వారి శుద్ధి కొరకు అక్కడే ఆచరించు, ఓ బ్రాహ్మణ పుత్ర. దానివలన దుర్‌మృత్యుదోషశాంతి జరుగుతుంది. మరోరకంగా కాదు (46) శ్రీ సూతుల వచనము - ఈ విధముగా మునులు చెప్పగా ఓ బ్రాహ్మణులార! ఆశాకల్య సుతుడు జాంగలుడను పేరుగలవాడు, వారికి పితృమేధము సంపూర్తిగా ఆచరించాడు (47).

మూ || అన్యేద్యురస్థీన్యాదాయహాలాస్యంప్రయ¸°చనః | తస్మాద్రామేశ్వరంసద్యోగత్వాయంజాంగలోద్విజః || 48 ||

మునిప్రోక్తప్రకారేణ తస్మిన్రామేశ్వరస్థలే | నిధాయ పిత్రోరస్థీని శ్రాద్ధాదీన్యకరోత్తథా || 49 ||

ప్రథమాబ్దిక పర్యంతం కార్యంతత్రాకరోచ్చనః | స్థిత్వాబ్దం సమునేః పుత్రః ఏకోజాం గల సంజ్ఞకః || 50 ||

ఆబ్దికాంతేదినే విప్రోరాత్రౌ స్వప్నే విలోక్యతు | స్వమాతరం చపితరం శంఖ చక్రగదా ధరౌ || 51 ||

గరుడో పరిసంవిష్టౌ పద్మమాలా విభూషితౌ | శోభితౌతులసీదామ్నాస్ఫురస్మకరకుండలౌ || 52 ||

కౌస్తుభాలంకృతోరస్కౌపీతాంబరవిరాజితౌ | ఏవందృష్ట్వామునిసుతోజాంగలఃసుప్రసన్నధీః || 53 ||

స్వాశ్రమంపునరాగత్యసుఖేనన్యవసద్ద్విజాః | స్వప్నదృష్టంచవృత్తాంతంమాతాపిత్రోఃసజాంగలః || 54 ||

తేభ్యోస్యవేదయత్సర్వంబ్రాహ్మణభ్యోతిహర్హితః | శ్రుత్వాతేమునయోవృత్తమానన్‌సంప్రీతమానసాః || 55 ||

అథరాజాసమాలోక్యసర్వేతేపిమహర్షయః | అపదన్‌కుపితావిప్రాఃశవంతఃశంకరంనృపం || 56 ||

పాండ్యభూపమహామూర్ఖక్రౌర్యాద్‌బ్రాహ్మణఘాతక | స్త్రీహత్యాబ్రహ్మహత్యాచకృతాయస్మాత్త్వయాధునా || 57 ||

అతఃశరీరసంత్యాగంకురుత్వంహవ్యవాహనే | నోచేత్తవనశుద్ధిఃస్యాత్ర్పాయశ్చిత్తశ##తైరపి || 58 ||

త్వత్సంభాషణమాత్రేణబ్రహ్మహత్యాయుతంభ##వేత్‌ | అస్మత్సకాశాద్గచ్ఛత్వంపాండ్యానాంకులపాంసన || 59 ||

ఇత్యుక్తోమునిభిఃపాండ్యఃశంకరోద్విజపుంగవాః | తథాస్తుదేహసంత్యాగంకరిష్యేహవ్యవాహనే || 60 ||

బ్రహ్మహత్యావిశుద్ధ్యర్థంభవతాంసన్నిధావహం | అనుగ్రహంమేకుర్వంతుభవంతోమునిసత్తమాః || 61 ||

తధాశరీరసంత్యాగాత్పాతకంమేలయంప్రజేత్‌ | ఏవముక్త్వామునీన్సర్వాన్‌శంకరఃపాండ్యభూపతిః || 62 ||

స్మాన్మంత్రిణఃసమాహూయబభాషేవచనంత్విదం |

తా || మరుసటి రోజు ఎముకలను తీసుకొని ఆతడు హాలాస్యమునకు బయలుదేరాడు. అక్కడినుండి ఈజాంగలద్విజుడు వెంటనే రామేశ్వరమునకు వెళ్ళి (48) ఆరామేశ్వరస్థలమందు ముని చెప్పిన ప్రకారము తలిదండ్రుల అస్థులను ఉంచి, అట్లానే శ్రాద్ధాదులను చేశాడు. (49) ప్రథమాబ్ధికమువరకు చేయవలసిన పనులను అక్కడఅతడు చేశాడు. జాంగలుడను పేరుగల ఆమునియొక్క ఒకే కుమారుడు ఒక సంవత్సర కాలముండి (50) ఆబ్దికాంతదినమందు ఆ బ్రాహ్మణుడు రాత్రి స్వప్నంలో శంఖచక్ర గదాధరులైన తన తల్లిదండ్రులను చూచాడు (51) వారు గరుడునిపై కూర్చున్నారు. పద్మమాలతో అలంకరింపబడ్డారు. తులసి మాలతో శోభిస్తున్నారు. వారిచెవులను మకరకుండలములు వెలుగుతున్నాయి. (52) వారి వక్షమందు కౌస్తుభమలంకరింప బడింది. పీతాంబరము ధరించారు. ఇట్టివారినిగా తనతలిదండ్రులను జాంగలుడను ఆ మునికుమారడు చూచి ప్రసన్నమైనబుద్ధి కలవాడై (53) తన ఆశ్రమమునకు తిరగివచ్చి సుఖంగాఉన్నాడు. ఆజాంగలుడు తాను తలిదండ్రులను కలలోచూచిన వృత్తాంతాన్ని (54) చాలా సంతోషంతో ఆబ్రాహ్మణులందరికి అంతా నివేదించాడు. ఆమునులు ఆవృత్తాంతమును విని సంతోషించిన మనస్సు కలవారైనారు (55) ఆరాజును చూచి ఆమహర్షులందరు శంకరనృపుని శపిస్తూ కోపంతో ఇట్లా అన్నారు (56) పాండ్యభూప! మహామూర్ఖ! క్రౌర్యంతో బ్రాహ్మణుని చంపిన వాడ! నీవిప్పుడు స్త్రీ హత్యను బ్రహ్మహత్యను చేశావు. (57) అందువల్ల నీవుఅగ్నితో శరీరత్యాగంచేయి లేకున్న నీవు నూరు ప్రాయశ్చిత్తములు చేసుకున్నా నీకు శుద్ధి కలగదు. (58) నీతో మాట్లాడినందు వలన పదివేల బ్రహ్మహత్యలు చేసినట్లౌతుంది. పాండ్యవంశమును చెరిచేవాడ! మాదగ్గరి నుండి నీవువెళ్ళు (59) అనిమునులు చెప్పగా, పాండ్యరాజైన శంకరుడు, అట్లాగేకాని అగ్నిలో దేహాన్ని వదులుతాను (60) బ్రహ్మహత్యవిశుద్ధి కొరకు మీసన్నిధిలో నేను అగ్నిలోదూకుతాను. ఓమునిశ్రేష్ఠులార! మీరునన్ను అనుగ్రహించండి (61) అట్లాశరీరాన్ని వదలటంవల్ల నాపాతకము నష్టమౌతుంది. ఇట్లా మునులందరికి చెప్పి పాండ్యభూపతి శంకరుడు (62) తన మంత్రులను పిలిచి ఇట్లా అన్నాడు.

మూ || భోమంత్రిణోబ్రహ్మహత్యామయాకార్యవిచారతః || 63 ||

స్త్రీహత్యాచతధాక్రూరామహానరకదాయినీ | ఏతత్పాతకశుద్ధ్యిర్థంమునీనాంవచనాదహం || 64 ||

ప్రదీప్తేగ్నౌమహాజ్వాలేపరిత్యక్ష్యేకలేవరం | కాష్ఠ్యాన్యానయతక్షిప్రంతైరగ్నిశ్చసమిధ్యతాం || 65 ||

మమపుత్రంచసురుచింరాజ్యేస్థాపయతాచిరాత్‌ | మాశోకంకరుతామాత్యాదైవతందురతిక్రమం || 66 ||

ఇతీరితానృపతినా మంత్రిణోరురుదుస్తదా | పాండ్యనాధమహారాజరిపూణామపివత్సల || 67 ||

వయంహిభవతానిత్యంపుత్రవత్పరిపాలితాః | త్వాంవినానప్రవేక్ష్యావపురీందేవపురోవమాం || 68 ||

హవ్యవాహంప్రవేక్ష్యామోమహాకాష్ఠసమేధితం | తేషాంప్రలపితంశ్రుత్వాపాండ్యఃశంకరభూపతిః || 69 ||

ప్రోవాచమంత్రిణఃసర్వాన్వచనంసాంత్వపూర్వకం

శంకరఉవాచ

కింకరిష్యధభోమత్యామహాపాతకినామయా || 70 ||

సింహాసనంసమారుహ్యనకుర్తంయుజ్యతేబత | చతురర్ణవపర్యంతధరాపాలనమంజసా || 71 ||

మత్సుత్రంసురుచింశీఘ్రమతఃస్థాపయతాసనే | కాష్ఠాన్యానయతక్షిప్రంవ్రవేష్ఠుంహవ్యవాహనం || 72 ||

మమమంత్రిపరాయూయంవిలంబంత్యజతాధున | ఇత్యుక్త్వామంత్రిణఃకాష్ఠంసమానిన్యుఃక్షణనతే || 73 ||

అగ్నింప్రజల్వితంకాష్ఠైఃదృష్ఠ్వాశంకరభూపతిః | స్నాత్వాచమ్యవిశుద్ధాత్మా మునీనాం సన్నిధౌతదా || 74 ||

అగ్ని ప్రదక్షిణీకృత్యతాన్మునీనపి సత్వరం | అగ్నింమునీ న్నమస్కృత్య ధ్యాత్వాదవముమాపతిం || 75 ||

అగ్నౌపతితుమారేభే ధైర్యమాలంబ్యభూపతిః | తస్మిన్నవనరేవిప్రా మునీనామపిశృణ్వతాం || 76 ||

అశరీరా సముదభూద్వాణీ భైరవనాదినీ | భోఃశంకర మహీపాల మానలం ప్రవిశాధునా || 77 ||

బ్రహ్మహత్యానిమిత్తం తే భయం మా భూన్మహామతే | తవోపదేశం వక్ష్యామి రహస్యం వేదసంమితం || 78 ||

శృణుష్వావహితో రాజన్‌ మదుక్తం క్రియతాం త్వయా

తా || ఓ మంత్రులార ! నేను విచారించకుండా బ్రహ్మహత్య చేశాను (63) అట్లాగే క్రూరమైన నరకాన్నిచ్చే స్త్రీహత్య కూడా చేశాను. ఈ పాతకశుద్ధి కొరకు మునులతో నేను (64) అగ్ని మహాజ్వాలలతో మండుతుండగా నాశరీరాన్ని వదులుతాను. త్వరగా కట్టెలు తీసుకురండి. వాటితో అగ్నిని రగుల్చండి (65) త్వరలో నాకొడుకు సురుచిని రాజ్యంలో స్థాపించండి. మంత్రులార ! దుఃఖించకండి. దైవము అతిక్రమింపరానిది (66) అని రాజు అనగా మంత్రులు దుఃఖించారు. పాండ్యనాథ ! మహారాజ! శత్రువులపైన కూడా దయ చూపేవాడ ! (67) మమ్ములను మీరు నిత్యము పుత్రులవలె పరిపాలించారు. దేవపురితో సమానమైన నగరిని నీవు లేకుండా ప్రవేశించలేము (68) మహా కాష్ఠములతో మండుతున్న అగ్నిని మేమూ ప్రవేశిస్తాము. వారి మాటలను విని పాండ్యరాజైన శంకర భూపతి మంత్రులందరితో సాంత్వన పూర్వకమైన మాటలను ఇట్లా పలికాడు (69) శంకరుని వచనము - ఓ మంత్రులార! మహాపాతకినైన నేను ఏం చేయను (70) సింహాసనాన్ని అధిరోహించి నాల్గుసముద్రముల వరకు విస్తరించిన రాజ్యపాలనమును సరిగా నిర్వర్తించలేను (71) అందువలన నా కొడుకైన సురుచుని త్వరగా సింహాసన మందుంచండి. అగ్నిలో త్వరగా ప్రవేశించటానికి కట్టెలు తీసుకురండి. (72) నామంత్రి వరులార! మీరిప్పుడు అలసించటం మానండి. అని అనగా ఆ మంత్రులు క్షణంలో కట్టెలు తెచ్చారు (73) అగ్నితో మండుతున్న కట్టెలను చూచి శంకర భూపతి స్నానం చేసి ఆచమించి నిర్మలమైన ఆత్మకలవాడై అప్పుడు మునుల ఎదుట (74) అగ్నికి ప్రదక్షిణ మాచరించి, త్వరగా ఆమునులకు ప్రదక్షిణం చేసి, అగ్నికి మునులకు నమస్కరించి, దేవుడైన ఉమాపతిని ధ్యానించి (75) దైర్యమవలంబించి రాజు అగ్నిలో పడటానికి సిద్ధమైనాడు. ఓ విప్రులార ! ఆ సందర్భమున మునులందరూ వింటుండగ (76) గట్టిగా శబ్దిస్తూ అశరీరవాణి పలికింది. ఓ శంకర మహారాజ! ఇప్పుడు అగ్నిలో ప్రవేశించొద్దు (77) ఓ మహామతి ! బ్రహ్మహత్యా నిమిత్తకమైన భయము నీకొద్దు. వేద సమ్మితమైన రహస్యమును నీకు ఉపదేశిస్తాను. (78) ఓ రాజ ! నేను చెప్పే దానిని శ్రద్ధగా విను నీవు దాని నాచరించు.

మూ || దక్షిణాం బునిధేస్తీరే గంధమాదన పర్వతే || 79 ||

రామసేతౌ మహాపుణ్య మహాపాతక నాశ##నే | రామప్రతిష్ఠితంలింగం రామనాథం మహేశ్వరం || 80 ||

సేవస్వ వర్షమే కంత్వం త్రికాలం భక్తిపూర్వకం | ప్రదక్షిణ ప్రక్రమణం నమస్కారం చవైకురు || 81 ||

మహాభిషేకః క్రియతాం రామనాథస్య వైత్వయా | నైవేద్యం వివిధం రాజన్ర్కియతాంచదినేదినే || 82 ||

చందనాగరుకర్పూరైః రామలింగం ప్రపూజయ | భారద్వయేన గవ్యేన హ్యాజ్యేన త్వభిషేచయ || 83 ||

ప్రత్యహంచగ వాంక్షీరైః ద్విభార పరిసంమితైః | మధుద్రోణన తల్లింగం ప్రత్యహం స్నాపయ ప్రభోః || 84 ||

ప్రత్యహం పాయసాన్నేన నైవేద్యం కురుభూపతే | ప్రత్యహం తిలతైలేనదీపారాధన మాచర || 85 ||

ఏతేన తవరాజేంద్ర రామనాథస్య శూలినః | స్త్రీహత్యా బ్రహ్మహత్యాచతత్‌ క్షణాదేవనశ్యతః || 86 ||

దర్శనా ద్రామనాథస్య భ్రూణహత్యాశతానిచ | అయుతంబ్రహ్మహత్యానాం సురాపానాయుతంతథా || 87 ||

స్వర్ణస్తేయా యుతం రాజన్‌గురుస్త్రీగమనాయుతం | ఏతత్సం సర్గదోషాశ్చ వినశ్యంతి క్షణాద్విభో || 88 ||

మహాపాతక తుల్యాని యాని పాపాని సంతివై | తాని సర్వాణి నశ్యంతి రామనాథస్య సేవయా || 89 ||

మహతీరామనాథస్య సేవాలభ్యేతచే న్పృణాం | కింగం గయాచగయయా ప్రయాగేణా ధ్వరేణవా || 90 ||

తద్గచ్ఛరామసేతుంత్వం రామనాధం భ జానిశం | విలంబం మాకురువిభో గమనే చ త్వరాంకురు || 91 ||

ఇత్యుక్త్వా విర రామాథ సాపి నాగశరీరిణీ |తచ్ఛ్రుత్వా మునయః సర్వేత్వర యంతిస్మభూపతిం || 92 ||

గచ్ఛశీఘ్రం మహారాజ రామసేతుం విముక్తిదం | రామనాథస్య మహాత్మ్యమజ్ఞాత్వాస్మాభిరీరితం || 93 ||

దేహత్యాగం కురుష్వేతి వహ్నౌ ప్రజ్వలితేధునా | అనుజ్ఞాతో మునివరైరితి రాజాసశంకరః || 94 ||

చతురంగబలం పుర్యాం ప్రాపయిత్వాత్వరాన్వితః | నమస్కృత్యమునీన్‌ సర్వాన్‌ ప్రహృష్టేనాంతరాత్మనా || 95 ||

పృతః కతిపయైః సైన్యైః సమాదాయ ధనంబహు | రామనాథస్యసే వార్థ మయాసీ ద్గంధ మాదనం || 96 ||

తా || దక్షిణ సముద్ర తీరమందు గంధమాదన సర్వతమందు (79) మహాపాతక నాశకమైన, మహాపుణ్యకరమైన రామసేతువు యందు రాముడు ప్రతిష్ఠించిన లింగము రామనాథ మహేశ్వరుని (80) మూడు కాలములందు భక్తి పూర్వకముగా ఒక సంవత్సరకాలము నీవు సేవించు, ప్రదక్షిణం ఆచరించటం, నమస్కారముచేయి (81) నీవు రామనాథునకు మహాభిషేకమాచరించు. ఓ రాజ ప్రతిరోజు వివిధములైన నైవేద్యములు ఏర్పరుచు (82) రామలింగమును చందన అగరుకర్పూరములతో పూజించు. రెండు భారముల ఆవునేయితో అభిషేకించు. (83) ప్రతిరోజు రెండు భారముల (40 మణుగులు) పరిమితమైన ఆవు పాలతో, నేయి దొప్పతో ప్రభువు యొక్క ఆ లింగమును ప్రతిరోజు స్నానం చేయించు (84) ఓరాజ! రోజు పాయ సాన్నముతోనే నైవేద్యమర్పించు. ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన కావించు (85) ఓ రాజేంద్ర! శూలియైన రామనాథునికి ఈ సేవ చేయటంతో నీకున్న స్త్రీ హత్య, బ్రహ్మహత్య దోషములు ఆక్షణంలోనే నశిస్తాయి (86) రామనాథుని దర్శనము వలన బుూణహత్యలు నూరు చేసిన పాపము పదివేల బ్రహ్మహత్యల పాపము, పదివేల సురాపానముల పాపము (87) పదివేల స్వర్ణస్తేయముల దోషము, పదివేల గురుస్త్రీ గమన దోషము, వీని సంసర్గం వల్ల కలిగే దోషములు క్షణంలో నశిస్తాయి ఓ ప్రభు! (88) మహా పాతకములతో సమానమైన పాపములు అన్ని రామనాథుని సేవతో నశిస్తాయి (89) గొప్పదైన రామనాథుని సేవ నరులకు లభిస్తే గంగతో కాని గయతో కాని ప్రయాగతోకాని, అధ్వరముతోకాని పనిలేదు (90) అందువల్ల నీవు రామసేతువునకు వెళ్ళు. నిరంతరము రామనాథుని భజించు. ఓ విభు! ఆలస్యం చేయకు. వెళ్ళటం గూర్చితొందరపడు (91) అని పలికి ఆ అశరీర వాణికూడా విరమించింది. దానిని విని మునులందరు రాజును తొందరపెట్టసాగారు (92) ఓ మహారాజ! విముక్తినిచ్చే రామసేతువునకు త్వరగా వెళ్ళు. రామనాథుని మాహాత్మ్యము తెలియక మేము (93) మండుతున్న అగ్నిలో ప్రాణాన్ని వదలు అని చెప్పాము. అని మునులతో అనుజ్ఞను పొంది రాజైన ఆ శంకరుడు (94) వేగంగా చతురంగ బలాన్ని నగరికి పంపి, మునులందరికి నమస్కరించి ఆనందించిన అంతరాత్మతో (95) కొద్ది సైన్యాన్ని తీసుకొని, చాలా ధనం తీసుకొని రామనాథుని సేవకొరకు గంధమాదనమునకు వెళ్ళాడు (96).

మూ || ఉవాసవర్షమేకంచ రామసేతౌ విశుద్ధిదే | ఏకభుక్తో జితక్రోధో విజితేంద్రియ సంచయః || 97 ||

త్రిసంధ్యం రామనాథంచ సేవమానః సభక్తికం | ప్రదదౌ రామనాథాయ దశభారం ధనంముదా || 98 ||

ప్రత్యహం రామనాథస్య మహాపూజామకారయత్‌ | అకరోచ్చధనుష్కోటౌ ప్రత్యహం భక్తిపూర్వకం || 99 ||

స్నానం ప్రతిదినంచాన్నం బ్రాహ్మణభ్యోదదౌముదా | అశరీరవచః ప్రోక్త మఖిలం పూజసం తధా || 100 ||

ఏవంకృతపతస్తస్యవర్షమేకం గతం ద్విజాః | వర్షాంతే సశుచిర్భూత్వా శంకరస్తుష్టమాననః

తుష్టావ పరమేశానం రామనాథం ఘృణానిధిం || 101 ||

శంకర ఉవాచ -

నమామి రుద్రమీశానం రామనాథముమాపతిం || 102 ||

పాహిమాం కృపయాదేవ బ్రహ్మహత్యాందహాశుమే | త్రిపురఘ్నమహాదేవ కాలకూట విషాదన || 103 ||

రక్షమాం త్వందయాసింధోస్త్రీ హత్యాం మేవిమోచయ | గంగాధర విరూపాక్ష రామనాథత్రిలోచన || 104 ||

మాంపాలయకృపాదృష్ట్వాఛింధి మత్పాతకంవిభో | కామారే కామసందాయిన్‌ భక్తానాం రాఘవేశ్వర || 105 ||

కటాక్షం పాతయమయిశుద్ధం మాంకురుధూర్జటే | మార్కండేయ భయత్రాణమృత్యుంజయ శివావ్యయ || 106 ||

నమస్తే గిరిజార్థాయ నిష్పాపంకురుమాంసదా | రుద్రాక్షమాలాభరణ చంద్రశేఖర శంకర || 107 ||

వేదోక్తసమ్యగా చారయోగ్యం మాంకురుతేనమః | సూర్యదంతభిదేతుభ్యం భారతీనాసికాచ్ఛిదే || 108 ||

రామేశ్వరాయదేవాయనమోమేశుద్ధిదోభవ | ఆనందం సచ్చిదానందం రామనాథం వృషధ్వజం || 109 ||

భూయోభూయోనమస్యామి పాతకం మేవినశ్యతు | భ##క్త్యైవం స్తువతస్తస్యరా మనాథం మహేశ్వరం || 110 ||

నిర్జగాముఖాద్రాజ్ఞో బ్రహ్మహత్యాతిభీషణా | నీలవస్త్ర ధరాక్రూరా మహారక్త శిరోరుహా || 111 ||

తాంబ్రహ్మహత్యాంభీభత్సాం నృపవక్త్రాద్వినిర్గతాం | నిజఘానత్రిశూలేన భైరవోరుద్రశాసనాత్‌ || 112 ||

హతాయాం బ్రహ్మహత్యాయాం భైరవేణ శివాజ్ఞయా | రామనాథోనృపంప్రాహస్తుత్యాతస్యప్రసన్నధీః || 113 ||

తా || శుద్ధినిచేకూర్చే రామసేతువు యందు ఒక సంవత్సరము ఉన్నాడు ఒక పూట భోజనముతో, క్రోథమును జయించి, ఇంద్రియ సమూహములను జయించి (97) మూడు సంధ్యలందు భక్తితో రామనాథుని సేవిస్తూ ఉన్నాడు. రామనాథునకు సంతోషంగా దశభారమైన ధనమునిచ్చాడు (98) రామనాథునకు ప్రతిరోజు మహాపూజను చేయించాడు. ధనుష్కోటి యందు ప్రతిరోజు భక్తితో (మహాపూజ) చేశాడుకూడ (99) సంతోషంగా ప్రతిరోజు స్నానం చేసి బ్రాహ్మణులకు అన్నదానం చేశాడు. అశరీరవాణి చెప్పిన పూజనంతా చేయించాడు. చేశాడు (100) ఇట్లాచేస్తున్న అతనికి ఒక సంవత్సర కాలం గడిచింది. ఓ బ్రాహ్మణులార ! సంవత్సరం చివర ఆశంకరుడు (రాజు) శుచియై సంతుష్ట మనస్కుడై, పరమేశుని, రామనాథుని, దయగలవానిని స్తుతించాడు (101) శంకరుని వచనము - రుద్రునకు, ఈశునకు రామనాథునకు ఉమాపతికి నమస్కారము (102) ఓదేవ! నన్ను దయతో రక్షించు నా బ్రహ్మహత్యను త్వరగా కాల్చు త్రిపుర సంహార ! మహాదేవ ! కాలకూట విషభక్షక ! (103) దయాసింధు ! నీవు నన్ను రక్షించు. నా స్త్రీహత్యను తొలగించు గంగాధర! త్రినేత్ర! రామనాథ! విరూపాక్ష (104) కృపాదృష్టితో నన్ను పాలించు ఓ విభు ! నా పాతకమును నశింపచేయి. కామునకు శత్రువ! భక్తుల కోర్కెల తీర్చేవాడ! రాఘవుని ఈశ్వరుడ! (105) నాపై నీ చూపును ప్రసరింపచేయి. ఓ ధూర్జటి! నన్ను శుద్ధునిగా చేయి. మార్కండేయుని భయము నుండి రక్షించినవాడ! మృత్యుంజయ ! శివ! అవ్యయ! (106) గిరిజను సగం శరీరంలో కలవాడ! నీకు నమస్కారము. నన్ను ఎల్లప్పుడు పాప రహితునిగా చేయి. రుద్రాక్షమాలను ఆభరణముగా గలవాడా చంద్రశేఖర ! శంకర! (107) నీకు నమస్కారము. వేదోక్తమైన మంచి ఆచారములను ఆచరించుటకు యోగ్యమైన వానినిగా నన్ను చేయి. సూర్యునిదంతమును ఛేదించినవాడ! భారతి నాసికను ఛేదించినవాడ! నీకు నమస్కారము(108) రామేశ్వరదేవ! నీకు నమస్కారము. నాకు శుద్ధిని కల్గించు. ఆనందుని సచ్చిదానందుని, రామనాథుని, వృషధ్వజుని (109) మరల మరల నమస్కరిస్తున్నాను. నా పాతకముల నశింపచేయని రామనాధుడైన మహేశ్‌వరుని భక్తితో ఈ విధముగా స్తుతిస్తున్న ఆ రాజుయొక్క (110) ముఖమునుండి మిక్కిలి భయంకరమైన బ్రహ్మహత్య బయటికి వచ్చింది. వస్త్రమును ధరించి, క్రూరముగా ఎర్రని తలవెంట్రుకలతో (111) (ఉంది) భీభత్సంగా, రాజునోటి నుండి బయటికి వచ్చిన ఆ బ్రహ్మహత్యను, రుద్రుని ఆజ్ఞతో భైరవుడు త్రిశూలంతో చంపాడు. (112) శివుని ఆజ్ఞతో భైరవుడు బ్రహ్మహత్యను చంపాక, రాజుస్తోత్రముతో ప్రసన్నమైన బుద్ధిగల రామనాథుడు రాజుతో ఇట్లా అన్నాడు (113).

మూ || శ్రీరామనాథ ఉవాచ -

పాండ్యభూపమహారాజస్తోత్రేణానేనతేసఘా | ప్రసన్నహం పరందాస్యేతుభ్యం పరయచేప్సితం || 114 ||

స్త్రీహత్యాబ్రహ్మహత్యాభ్యాం యస్తేదోషః స నిర్గతః | శుద్ధోవిధూత పాపోసి రాజ్యం పాలయ పూర్వవత్‌ || 115 ||

యేమామత్రనిషేవంతే భక్తియుక్తేన చేతసా | నాశయా మినృణాం తేషాం బ్రహ్మహత్యాయుతాన్యపి || 116 ||

సురాపానాయుతం భూపగురుస్త్రీ గమనాయుతం | స్వర్ణస్తేయా యుతమపితత్సం సర్గాయుతం తథా || 117 ||

అన్యాన్యపిచపాపాని నాశయా మిన సంశయః | మత్సేవినోనరా రాజన్న భూయః సంసరంతితే || 118 ||

కింతుసాయుజ్యరూపాంమేముక్తింయాస్యంత్యసంశయం | స్తుపంత్యనేనస్తోత్రేణయేమాంభక్తిపురఃనరం || 119 ||

నాశయామ్యహమేతాషాం మహాపాతకసంచయం | ప్రీతోహంతవ భక్త్యాచ స్తోత్రేణమనుజేశ్వర || 120 ||

యథేష్టం ప్రార్థయవరం మత్తస్త్వం వరదాన్పృప | ఏవముక్తః శివేనాథ శంకరోనృప పుంగవః

రామనాథం బభాషేతం శంకరం కరుణానిధిం || 121 ||

నృప ఉవాచ -

తవ సందర్శనే నాహం కృతార్థోస్మి మహేశ్వర || 122 ||

ఇతఃపరం ప్రార్థనీయం మమనాస్త్యధునాధికం | మృకండుసుత సంతాపహారి పాదయుగంతవ || 123 ||

దృష్టం మయామహాదేవ నాతః ప్రార్థ్యం విభోస్తివై | త్వత్సాద పద్మయుగలే నిశ్చలా భక్తిరస్తుమే || 124 ||

నపునర్జన్మమే భూయాన్మాతౄణాముదరేశుచౌ | యేమత్కృతమిదం స్తోత్రం కీర్తయంతి తవప్రభో

తేనరాః పాపనిర్ముక్తాః త్వత్సేవా ఫలమాప్నుయుః || 125 ||

శ్రీసూత ఉవాచ -

తథాస్త్విత్యను గృహ్యైనం రామనాథో ద్విజోత్తమాః || 126 ||

నీలకంఠో విరూపాక్షో లింగరూపే తిరోహితః | రాజాపి రామనాథేన విహితాను గ్రహస్తతః || 127 ||

రామనాథం నమస్కృత్య కృతార్థే నాంతరాత్మనా | నసేనా సంవృతః ప్రీతః ప్రయయా వాత్మనః పురీం || 128 ||

వృత్తాంతమేతమ వదన్మునీనాం వనవాసినాం | తేభ్యషించ న్నృపం రాజ్యేమునయఃప్రీతమానసాః || 129 ||

పుత్రదారయుతోరాజాప్రాప్యరాజ్యమకంటకం | మంత్రిభిః సహితోవిప్రా రరక్షపృథివీంచిరం || 130 ||

తతోంతకాలేసంప్రాప్తే థ్యాయన్రామేశ్వరం శివం | దేహాంతే రామనాథస్యసాయుజ్యం ప్రయ¸°శుభం || 131 ||

ఏవంవః కథితం విప్రారామనాథస్యవైభవం | చరితం పుణ్యమాఖ్యానం శంకరాఖ్యనృపస్యచ || 132 ||

శృణ్వన్పఠన్వామనుజస్త్విమమధ్యాయ మాదరాత్‌ | సర్వపాప వినిర్ముక్తో రామనాథం నమశ్నుతే || 133 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే రామనాథ ప్రశంసాయాం శాకల్య దుర్మరణ దోషశాంతి పూర్వక శంకర స్త్రీ హత్యా బ్రహ్మహత్యా దోషశాంతి వర్ణనం నామాష్ట చత్వారింశోధ్యాయః || 48 ||

తా || శ్రీ రామనాథుడు ఇట్లా అన్నాడు - ఓ మహారాజ! పాండ్యభూప! పుణ్యప్రదమైన ఈ నీస్తోత్రంతో నేను ప్రసన్నుడనైనాను. నీకు వరమిస్తాను. నీకిష్టమైన వరం కోరుకో (114) స్త్రీ హత్య బ్రహ్మహత్యల వల్ల కల్గిన నీ దోషము పోయింది. శుద్ధుడవు, పాపములను పోగొట్టుకున్న వాడవైనావు. పూర్వం లాగ రాజ్యాన్ని పాలించు (115) నన్నిక్కడ భక్తితో కూడిన మనస్సుతో సేవించిన వారి పదివేల బ్రహ్మహత్యలను కూడా నాశనం చేస్తాను. (116) ఓ రాజ! పదివేల సురాపానములు, పదివేల గురుస్త్రీ గమనములు, పదివేల స్వర్ణస్తేయ పాపములు, వాని పదివేల సంసర్గములు (117) ఇతర పాపములు వీనినన్నింటిని నశింపచేస్తాను అనుమానములేదు. ఓ రాజ! నన్ను సేవించేనరులు తిరిగి సంసారంలోకి రారు (118) పైగా సాయుజ్యరూపమైననా ముక్తిని పొందుతారు. అనుమానము లేదు. ఈ స్తోత్రంలో భక్తి పూర్వకముగా నన్ను స్తోత్రం చేసినవారి (119) మహాపాతక సంచయమును నేను నశింప చేస్తాను. ఓ మనుజేశ్వర! నీ స్తోత్రముతో భక్తితో సంతుష్టడనైనాను (120) ఓ రాజ! వరమిచ్చే నన్ను నీవు ఇష్టమైన వరముకోరుకో. అని శివుడిట్లనగా నృపపుంగవుడైన శంకరుడు, కరుణానిధియైన ఆ రామనాథ శంకరునితో ఇట్లా అన్నాడు (121) రాజు వచనము - ఓ మహేశ్వర ! నీ సందర్శనంతో నేను కృతార్థుడనైనాను (122) ఇంతకన్నా ప్రార్థించ తగినది నాకు ఇప్పుడు అధికమైనది లేదు. నీ పాదద్వయము మార్కండేయుని సంతాపమును హరించినట్టిది. (123) నీ పాదద్వయమును నేను చూశాను ఓ మహాదేవ! ఇంతకన్న ప్రార్థించతగినది ఓ విభు! లేదు. నీ పాద పద్మయుగళ మందు నాకు నిశ్చలమైన భక్తి ఉండని (124) అశుచియైన తల్లి గర్భంలో పునర్జన్మ కలగవద్దు. ఓ ప్రభు! నేను చేసిన ఈ స్తోత్రమును కీర్తించిన నరులు పాపనిర్ముక్తులైన నీ సేవా ఫలమును పొందుతారు (125) శ్రీ సూతులవచనము - ఓ ద్విజోత్తములార! అట్లాగే కానిమ్మని రామనాథుడు ఈతనిని అనుగ్రహించి (126) నీలకంఠుడు, విరూపాక్షుడు లింగరూపమందు అంతర్థానమైనాడు. ఆ పిదప రామనాథునితో అనుగ్రహింపబడ్డ రాజు కూడ (127) రామనాథుని నమస్కరించి చరితార్థమైన అంతరాత్మకలవాడై సేనతో కూడినవాడై సంతుష్టుడై తన నగరానికి వెళ్ళాడు (128) వనంలో నివసించే మునులకు ఈ వృత్తాంతాన్ని రాజు చెప్పాడు. మునులు సంతుష్ట మనస్కులై వారు రాజును రాజ్యమందు అభిషేకించారు (129) పుత్రులు భార్యవీరితో కూడి రాజు రాజ్యమును ఎదురు లేకుండా పొంది, మంత్రులతో కూడి రాజ్యమును చాలాకాలము రక్షించాడు, విప్రులార! (130) అంత్యకాలము సమీపించగా రామేశ్వరుని శివుని ధ్యానిస్తూ దేహాంతమందు శుభ##మైన రామనాథుని సాయుజ్యాన్ని చేరాడు (131) ఈ విధముగా మీకు ఓ విప్రులార! రామనాథుని వైభవాన్ని మీకు చెప్పాను. శంకరుడను పేరు గల రాజు యొక్క పుణ్యమైన కథా చరిత్రను (132) ఈ అధ్యాయమును ఆదరంతో విన్న చదివిన మనుజులు సర్వపాపములనుండి నిర్ముక్తులై రామనాథుని పొందుతారు. (133) అని శ్రీ స్కంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతు మహాత్మ్య మందు రామనాథ ప్రశంస యందు శాకల్య దుర్మరణ దోషశాంతి పూర్వకమైన శంకరుని స్త్రీ హత్య బ్రహ్మహత్య దోషశాంతి వర్ణన మనునది నలుబది ఎనిమిదవ అధ్యాయము || 48 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters