Sri Scanda Mahapuranamu-3    Chapters   

నలుబది మూడవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ -

అధేదానీం ప్రవక్ష్యామి రామనాధస్య వైభవం | యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే మానవోభువి || 1 ||

రామప్రతిష్టితం లింగంయః పశ్యతి నరః సకృత్‌ | సనరోముక్తి మాప్నోతి శివసాయుజ్యరూపిణీం || 2 ||

దశవర్షైస్తు యత్పుణ్యం క్రియతేతు కృతేయుగే | త్రేతాయామే కవర్షేణ తత్పుణ్యం సాధ్యతేనృభిః || 3 ||

ద్వాపరే తచ్చమాసేన తద్దినేన కలౌయుగే | తత్ఫలం కోటిగుణితం నిమిషేనిమిషే నృణాం || 4 ||

నిఃసందేహం భ##వేదేవం రామనాథవిలోకినాం | రామేశ్వర మహాలింగే తీర్థాని సకలాన్యపి || 5 ||

విద్యంతే సర్వదేవాశ్చమునయః పితరస్తధా | ఏకకాలం ద్వికాలం వాత్రికాలం సర్వదైవవా || 6 ||

యే స్మరంతి మహాదేవం రామనాథం విముక్తిదం | కీర్తయంత్యథవా విప్రాస్తే విముక్తా ఘపంజరాః || 7 ||

సచ్చిదానందమద్వైతం సాంబంరుద్రం ప్రయాంతివై | రామేశ్వరాఖ్యం యల్లింగం రామచంద్రేణ పూజితం || 8 ||

యస్యస్మరణమాత్రేణ యమపీడాపినోభ##వేత్‌ | రామేశ్‌పర మహాలింగం యేర్చ యంతినకృన్నరాః || 9 ||

నమానుషాస్తే విజ్ఞే యాః కింతురు ద్రానసంశయః | రామేశ్వర మహాలింగం నార్చితం యేన భక్తితః || 10 ||

చిరకాలం ససంసారే సంసరే ద్దుఃఖసంకులే | రామేశ్వర మహాలింగం యేపశ్యంతి సకృన్నరాః || 11 ||

కిందానైః కింవ్రతైస్తేషాం కింతపోభిః కిమధ్వరైః | రామేశ్వర మహాలింగం యోన చింతయతిక్షణం || 12 ||

అజ్ఞానీసచపాపీస్యాత్సమూకోబధిరస్తథా | సజడోంధశ్చ విజ్ఞేయః ఛిద్రం తస్యసదా భ##వేత్‌ || 13 ||

ధనక్షేత్ర సుతాదీనాం తస్యహానిస్తధా భ##వేత్‌ | రామేశ్వర మహాలింగే సకృద్ధృష్టే మునీశ్వరాః || 14 ||

కింకాశ్యాగయాయాకింవా ప్రయాగేణాపి కింఫలం | దుర్లభం ప్రాప్యమానుష్యం మానవాయత్ర భూతలే || 15 ||

రామనాథ మహాలింగం నమస్యంత్యర్చ యంతిచ | జన్మతేషాంహి సఫలం తేకృతార్థాశ్చ నేతరే || 16 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - పిదప ఇప్పుడు రామనాథుని వైభవాన్ని వర్ణిస్తాను. మానవుడు భూమిపై దానిని విని సర్వపాపముల నుండి ముక్తుడౌతాడు (1) రాముడు ప్రతిష్టించిన లింగాన్ని ఒకసారి చూచిన నరుడు శివ సాయుజ్య రూపమైన ముక్తిని పొందుతాడు (2) కృతయుగంలో పది సంవత్సరములలో చేయబడే పుణ్యమును త్రేతాయుగంలో ఒక సంవత్సరంలో ఆ పుణ్యమును నరులు సాధిస్తారు (3) ద్వాపరంలో ఆ పుణ్యాన్ని మాసంలోను, కలియుగంలో ఒక రోజులోనే సాధిస్తారు. నిమిష నిమిషంలో నరులకు ఆ ఫలము కోటి గుణితమౌతుంది (4) రామనాథుని చూచిన వారికి నిః సందేహంగా ఇట్లా ఔతుంది. రామేశ్వర మహాలింగంలో సకల తీర్థములు (5) సర్వదేవతలు, మునులు, పితరులు ఉన్నారు. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు లేదా ఎల్లప్పుడూ (6) ముక్తినిచ్చే రామనాథ మహాదేవుని స్మరించిన వారు లేదా కీర్తించిన వారు, ఆ బ్రాహ్మణులు పాప పంజరం నుండి ముక్తులౌతారు (7) సచ్చిదానందుడు అద్వైత స్వరూపుడు ఐన సాంబశివుని రుద్రుని చేరుతారు. రామేశ్వరుడను పేరు గల లింగాన్ని రామచంద్రుడు పూజించిన దాన్ని (8) స్మరించిన మాత్రం చేత యమపీడ కూడా కలుగదు. రామేశ్వర మహాలింగమును ఒకసారి అర్చించిన నరులు (9) మనుష్యులు కారు, పైగా రుద్రులు అనుమానంలేదు. రామేశ్వర మహాలింగమును భక్తితో అర్చించని నరుడు (10) చాలా కాలము దుఃఖ సంకులమైన సంసారంలో తిరుగుతాడు. రామేశ్వర మహాలింగాన్ని ఒక్కసారి చూచిన నరులకు (11) దానములతో, తపస్సులతో, అధ్వర్యములతో పనిలేదు. రామేశ్వర మహాలింగాన్ని క్షణకాలమైనా చింతించని నరుడు (12) అజ్ఞాని, పాపి, మూగవాడు, బధిరుడు. జడుడు, అంధుడు, అని గుర్తించాలి. అతనికి ఎల్లప్పుడూ ఆపదలే కల్గుతుంటాయి (13) ఆతని ధనక్షేత్ర సంతానాదులకు అదే విధంగా హాని కల్గుతుంది. ఓ మునీశ్వరులార ! రామేశ్వర మహాలింగమును ఒకసారి చూశాక, (14) కాశి, గయ, ప్రయాగలతో పనిలేదు. భూమిపై దుర్లభ##మైన మానుషరూపాన్ని పొందిన నరులు (15) రామనాథ మహాలింగాన్ని నమస్కరించి పూజించాలి. వారిజన్మ సఫలము. వారు కృతార్థులైనవారు. ఇతరులు కాదు. (16)

మూ || రామేశ్వర మహాలింగే పూజితే వాస్మృ తేపినా | విష్ణునా బ్రహ్మణాకిం వా శ##క్రేణా ప్యఖిలా మరైః || 17 ||

రామనాధ మహాలింగం భక్తియుక్తాశ్చయేనరాః | తేషాం ప్రణామస్మరణ పూజాయుక్తాస్తుయేనరాః || 18 ||

సతే పశ్యంతి దుఃఖాని నైవయాంతి యమాలయం | బ్రహ్మహత్యా సహస్రాణి సురాపానా యుతానిచ || 19 ||

దృష్టే రామేశ్వరే దేవే విలయం యాంతికృతస్స్నశః | యేవాంఛంతి సదా భోగం రాజ్యంచత్రిదశాలయే || 20 ||

రామేశ్వర మహాలింగం తే సమంతు సకృన్ముదా | యానికానిచపాపాని జన్మకోటి కృతాన్యపి || 21 ||

తాని రామేశ్వరే దృష్టే విలయం యాంతిసర్వదా | సంపర్కాత్కౌతుకాల్లోభాత్‌ భయాద్వాపిచ సంస్మరన్‌ || 22 ||

రామేశ్వర మహాలింగం నేహాముత్రచ దుఃఖభాక్‌ | రామేశ్వర మహాలింగం కీర్తయన్నర్చయన్నపి || 23 ||

అవశ్యం రుద్రసారూప్యం లభ##తేనాత్ర సంశయః | యథైధాంసి సమిద్ధోగ్ని ర్భస్మ సాత్కురుతే క్షణాత్‌ || 24 ||

తధాపాపాని సర్వాణి రామేశ్వర విలోకనాత్‌ | రామేశ్వర మహాలింగ భక్తిరష్టవిధాస్మృతా || 25 ||

తద్భక్తజనవాత్సల్యం తత్పూజాపరితోషణం | స్వయంతత్పూజనం భక్త్యా తదర్థే దేహచేష్టితం || 26 ||

తన్మాహాత్మ్యకథానాంచ శ్రవణస్వాదరస్తథా | స్వరనేత్ర శరీరేషు వికారస్ఫురణం తథా || 27 ||

రామేశ్వర మహాలింగ స్మరణం సతతం తథా | రామేశ్వర మహాలింగ మాశ్రిత్తైవో పజీవనం || 28 ||

ఏవమష్టవిధాభక్తిర్యస్మిన్‌వ్లుెచ్ఛేపి విద్యతే | స ఏవముక్తిక్షేత్రాణాందాయాభాక్పరికీర్త్యతే || 29 ||

భక్త్యాత్వసన్యయాముక్తిర్ర్బహ్మజ్ఞానేన నిశ్చితా | వేదాంతశాస్త్ర శ్రవణాద్యతీనామూర్థ్వ రేతసాం || 30 ||

సాచముక్తిర్వినాజ్ఞాన దర్శనశ్రవణోద్భవం | యత్రాశ్రమం వినావిప్రావిరక్తించ వినాతథా || 31 ||

సర్వేషాం చైవవర్ణానామఖిలా శ్రమిణామపి | రామేశ్వర మహాలింగ దర్శనాదేవ కేవలాత్‌ || 32 ||

అవునర్భవదాముక్తిర్భవిష్యత్య విలంబితా 7 కృమికీటాశ్చదేవాశ్చ మునయశ్చ తపోధనాః || 33 ||

తుల్యారామేశ్వర క్షేత్రే రామనాథ ప్రసాదతః |

తా || రామేశ్వర మహాలింగాన్ని పూజించాక, లేదా స్మరించాక విష్ణువుతో బ్రహ్మతో లేదా ఇంద్రునితో, మిగిలిన దేవతలతోనూ పనిలేదు (అవసరంలేదు). (17) నరులు భక్తి యుక్తులై రామనాథ మహాలింగాన్ని పూజించిన, లేదా అట్టివారిని నమస్కరిస్తూ, పూజిస్తూ ఉన్నవారైనా (18) అట్టి నరులు దుఃఖములు చూడరు. యమాలయమునకు వారు వెళ్ళరు. సహస్రముల కొలది బ్రహ్మహత్యలు, పదివేల సురాపానములు వీని పాపములు (19) రామేశ్వర దేవుని చూచాక సంపూర్తిగా నశిస్తాయి. స్వర్గంలో భోగమును రాజ్యమును ఎల్లప్పుడూ కోరేవారు (20) రామేశ్వరలింగాన్ని ఒక్కసారి ఆనందంతో వారు నమస్కరించని. జన్మ కోటులలో చేసిన ఏ పాపములైనా (21) రామేశ్వరుని చూడగానే ఎప్పటికీ అవన్నీ నశిస్తాయి. సహవాసం వల్ల, కౌతూహలం వల్ల, లోభంవల్ల లేదా భయంవల్ల కాని రామేశ్వర లింగాన్ని స్మరించిన వారు (22) ఇక్కడ పై లోకంలోనూ దుఃఖమును పొందరు. రామేశ్వర మహాలింగాన్ని కీర్తిస్తు, పూజిస్తూకాని (23) ఉన్నచో తప్పకుండా రుద్రసారూప్యాన్ని పొందుతారు. ఇందులో అనుమానంలేదు. మండుతున్న అగ్ని కట్టెలను క్షణంలో కాల్చినట్లు (24) అట్లాగే పాపములన్ని రామేశ్వరుని చూడటం వలన పోతాయి. రామేశ్వర మహాలింగభక్తి ఎనిమిది రకములు (25) ఆతని భక్తజనుల యందు ప్రేమ చూపుట, ఆతని పూజించిన ఆనందపడుట, స్వయముగా తాను భక్తితో పూజించుట, ఈ శరీరంతో చేసే ప్రతి పని ఆతని కొరకే అని భావించుట (26) ఆతని మాహాత్మ్య కథలను వినటంలో ఆదరము చూపుట, స్వరమందు నేత్రములందు శరీరమందు అందుకు తగిన మార్పులు కల్గుట (27) ఎల్లప్పుడు రామేశ్వర మహాలింగ స్మరణము చేయుట, రామేశ్వర మహాలింగము నాశ్రయించి బ్రతుకుట (28) ఈ విధముగా ఎనిమిది విధములైన భక్తి కలిగినవాడు ఎంతటి పాపాత్ముడైనా ఆతడు ముక్తి క్షేత్రములకు భాగస్వామి అని చెప్పబడతాడు (29) అనన్య భక్తితో, బ్రహ్మ జ్ఞానముతో ముక్తి నిశ్చయము. యతులకు మునులకు వేదాంత శాస్త్ర శ్రవణము వలన ముక్తి (30) కాని అట్టి ముక్తి జ్ఞాన దర్శనశ్రవణములు లేకుండానే ఇక్కడ లభిస్తుంది. ఆశ్రమ నియమం లేకున్నా, విరక్తి భావం కలుగకున్నా (31) అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి, కేవలం రామేశ్వర మహాలింగ దర్శనం వల్లనే (32) ఆలస్యం లేకుండా పునర్జన్మ లేని ముక్తి కల్గుతుంది. కృమి కీటములు దేవతలు మునులు తపోధనులు (33) అంతా రామనాథుని ప్రసాదం వల్ల రామేశ్వర క్షేత్రంలో సమానులే.

మూ || పాపంకృతంష యానేకమితిమాక్రియాతాంభయం || 34 ||

మాగర్వఃక్రియతాంపుణ్‌యంమయాకారీతివాజనైః రామేశ్వర మహాలింగే సాంబరుద్రే విలోకితే || 35 ||

నన్యూనా నాధికాశ్చస్యుః కింతుసర్వేజనాః సమాః రామేశ్వర మహాలింగం యః పశ్యతి సభక్తికం || 36 ||

సతేన తుల్యతా మేతి చతుర్వే ద్యపి భూతలే | రామేశ్వర మహాలింగే భక్తోయః శ్వపచోపినన్‌ || 37 ||

తసై#్మదానాని దేయాని నాస్యసై#్మచ త్రయీవిదే | యాగతి ర్యోగయుక్తానాం మునీనా మూర్ధ్వరేతసాం || 38 ||

సాగతిః సర్వజంతూనాం రామేశ్వర విలోకినాం | రామనాథ శివక్షేత్రే యేవసంతినరాః ద్విజాః || 39 ||

తేసర్వే పంచ వక్త్రాఃస్యుః చంద్రాలంకృతమస్తకాః | నాగాభరణసంయుక్తాస్తథైవ వృషభధ్వజాః || 40 ||

త్రినేత్రా భస్మదిగ్ధాంగాః కపాలాకృతిశేఖరాః | సాక్షాత్సాంబా మహాదేవాః భ##వేయుర్నాత్రసంశయః || 41 ||

రామనాథ శివక్షేత్రం యేవ్రజంతి నరాముదా | పదే పదేశ్వమేధానాం ప్రాప్నుయుః సుకృతానితే || 42 ||

రామసేతుంసమాశ్రిత్య రామనాథస్యతుష్టయే | దదాతిగ్రామమేకం యోబ్రాహ్మణాయసభక్తికం || 43 ||

దేనభూః సకలాదత్తా సశైలవనకానవా 7 పత్రం పుష్పం ఫలంతోయం రామనాథాయయోనరః || 44 ||

భక్త్యాదదాతితంరక్షేద్రామనాథోహ్యహర్నిశం | రామనాథమహాలింగే సాంబేకారుణికేశివే || 45 ||

అత్యంతదుర్లభా భక్తిః తత్పూజాప్యతి దుర్లభా | స్తోత్రం చ దుర్లభం ప్రోక్తం స్మరణం చాతి దుర్లభం || 46 ||

రామనాథేశ్వరం లింగం మహాదేవం త్రిలోచనం | శరణంయే ప్రపద్యంతే భక్తియుక్తేన చేతసా || 47 ||

లాభ##స్తేషాం జయస్తేషా మిహలోకే పరత్రచ | రామనాథ మహాలింగ విషయా యస్య శేముషీ || 48 ||

దివారాత్రంచభవతి నవైధస్యతరోభువి | రామనాథేశ్వరం లింగం యోన పూజయతే శివం || 49 ||

నాయం భుక్తేశ్చ ముక్తేశ్చ రాజ్యానాం మపిభాజసం | రామేశ్వర మహాలింగం యః పూజయతి భక్తితః || 50 ||

భుక్తిముక్త్యో శ్చ రాజ్యానా మసౌ పరమ భాజసం | రామనాథార్చన సమం నాధికం పుణ్యమస్తివై || 51 ||

తా || నేను చాలా పాపం చేశాను అని భయపడకండి (34) జనులార ! నేను పుణ్యం చేసాను అని గర్వపడవద్దు. రామేశ్వర మహాలింగమైన సాంబరుద్రుణ్ణి చూశాక (35) తక్కువవారు ఎక్కువ వారు అని లేదు. అందరు జనులు సమానమే. భక్తిపూర్వకముగా రామేశ్వర మహాలింగమును చూచిన వారు (36) వారితో భూమిపై నాలుగు వేదముల నెరిగిన వాడు కూడా సమానంకాడు. రామేశ్వర మహాలింగమందు శ్వపచుడైన భక్తునకు కూడా (37) దానములనివ్వాలి. త్రయీవిదుడైన వానికి ఇతరునకు ఇవ్వవద్దు. యోగయుక్తులైన ఊర్థ్వరేతస్కులైన మునులకు లభించే స్థానమే (38) రామేశ్వరుని చూచిన సర్వప్రాణులకు లభిస్తుంది. రామనాథ శివక్షేత్ర మందుండే నరులు బ్రాహ్మణులు (39) అందరు పంచ వక్త్రులు, చంద్ర చూడులు నాగాభరణములు కలవారు, వృసభధ్వజులు (40) త్రినేత్రులు, శరీరం నిండా భస్మము గలవారు, కపాలాకృతిని శిరమందు గలవారు, సాక్షాత్తు సాంబమూర్తులు మహా దేవులు ఔతారు. ఇందులో అనుమానం లేదు (41) ఆనందంతో రామనాథ శివక్షేత్రమునకు వెళ్ళిన నరులు అడుగడుగున అశ్వమేథ పుణ్యఫలమును పొందుతారు. (42) రామసేతువు నాశ్రయించి, సోమనాథుని సంతుష్టికొరకు భక్తితో బ్రాహ్మణునకు ఒక గ్రామమును దానము చేసిన (43) వారు శైలములు వన కాననములతో కూడిన సమస్త భూమిని దానం చేసిన వారౌతారు. రామనాథునకు పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో (44) భక్తితో దానం చేసిన నరుని రామనాథుడు రాత్రింబగళ్ళు రక్షిస్తాడు. రామనాథ మహాలింగమందు, సాంబుని యందు, కారుణికుడైన శివుని యందు (45) భక్తి గల్గుట అత్యంత దుర్లభము. ఆతని పూజకూడా అతి దుర్లభము. అతని స్తోత్రము దుర్లభము. స్మరణ కూడా అతి దుర్లభము. (46) రామనాథేశ్వరుని, లింగమును మహాదేవుని త్రిలోచనుని భక్తితో కూడిన మనస్సుతో శరణుపొందినవారికి (47) లాభము, వారికి జయము ఈ లోకమందు పరలోకంలో కూడా రామనాథ మహాలింగ విషయకమైన బుద్ధి (48) రాత్రింబగళ్ళు కలిగిన నరుడు ఈ భూమిపై ధన్యతరుడు. రామనాధేశ్వరుడైన లింగమును శివుని పూజించని నరుడు (49) భుక్తికి ముక్తికి రాజ్యార్హుడు కాడు. భక్తితో రామేశ్వర మహాలింగమును పూజించిన నరుడు (50) భుక్తికి ముక్తికి రాజ్యమునకు తగినవాడు. రామనాధార్చనతో సమానమైన, అధికమైన పుణ్యము మరొకటి లేదు (51).

మూ || రామనాధేశ్వరంలింగంద్వేష్టి యోమోహమాస్థితః | బ్రహ్మహత్యాయుతం తేన కృతం నరకకారణం || 52 ||

తత్సంభాషణ మాత్రేణ మానవో నరకం ప్రజేత్‌ | రామనాథ పరాదేవా రామనాథ పరామఖాః || 53 ||

రామనాథ పరాః సర్వే తస్మాదన్యన్న విద్యతే | అతః సర్వం పరిత్యజ్య రామనాథం సమాశ్రయేత్‌ || 54 ||

రామనాథ మహాలింగం శరణం యాతిచేన్నరః | దౌర్మత్యం తస్యనాస్త్యేవ శివలోకంచ యాస్యతి || 55 ||

సర్వయజ్ఞతపోదాన తీర్థస్నానేషు యత్ఫలం | తత్ఫలం కోటిగుణితం రామనాథస్య సేవయా || 56 ||

రామనాథేశ్వరం లింగం చింతయన్‌ ఘటికాద్వయం | కులైకవింశముద్ధృత్య శివలోకే మహీయతే || 57 ||

దినమేకంతుయః ఫశ్యే ద్రామనాథం మహేశ్వరం | ఇహైవధన వాస్భూత్వాసోంతే రుద్రశ్చ జాయతే || 58 ||

యఃస్మరేత్‌ప్రాతరుత్థాయ రామనాథం మహేశ్వరం | అనేనైవ శరీరేణ సశివో వర్తతే భువి || 59 ||

రామనాథమహాలింగ ద్రష్టుర్దర్శనమాత్రతః | అన్యేషాం ప్రాణినాం పాపం తత్‌క్షణాదేవనశ్యతి || 60 ||

రామనాథేశ్వరం లింగం మధ్యాహ్నేయస్తువశ్యతి | సురాపాన సహస్రాణి తస్యనశ్యంతి తత్‌క్షణాత్‌ || 61 ||

సాయంకాలేపశ్యతియో రామనాథం సభక్తికం 7 గురుస్త్రీగమనోత్పన్నపాతకం తస్యనశ్యతి || 62 ||

సాయంకాలేమహాస్తోత్రైః స్తౌతిరామేశ్వరం తుయః | స్వర్ణస్తే యసహస్రాణి తస్యనశ్యంతితత్‌క్షణాత్‌ || 63 ||

స్నానంచధనుషః కోటౌ రామనాథస్య దర్శనం | ఇతిలభ్యేతవైపుంసాం కింగంగా జలసేవయా || 64 ||

రామనాథ మహాలింగ సేవయా యన్నలభ్యతే | తదన్యద్ధర్మ జాలేన నైవలభ్యేతకర్హిజిత్‌ || 65 ||

రామనాథం మహాలింగం యః కదాపినపశ్యతి | సంకరః సతువిజ్ఞేయోన పితుర్బీజసంభవః || 66 ||

రామనాథేతి శబ్దం యస్త్రిః పఠేత్ర్పాతరుత్థితః | తస్యపూర్వదినోత్పన్న పాతకం నశ్యతిక్షణాత్‌ || 67 ||

రామనాథేమహాలింగే భక్తరక్షణ దీక్షితే | భోజనే విద్యమానేపి యాచనాః కింప్రయాస్యథ || 68 ||

రామనాథమహాలింగే ప్రసన్నే కరుణానిధౌ | నశ్యంతి సకలాః క్లేశాః యధాసూర్యోదయే హిమమ్‌ || 69||

తా || మోహమందున్నవాడై రామనాధేశ్వరుడైన లింగమును ద్వేషించిన నరుడు నరక కారణమైన పదివేల బ్రహ్మహత్యలను ఆతడు ఆచరించినట్లుఔతుంది. (52) అట్టివానితో మాట్లాడినంత మాత్రం చేత మానవుడు నరకానికి వెళుతాడు. దేవతలందరు రామనాధుని పరమైన వారే. యజ్ఞములన్ని రామనాధుని పరమైనవే (53) అన్ని రామనాధుని పరమైనవే (చెందినవే). అతనికన్న వేరైనది మరొకటి లేదు. అందువల్ల అన్నింటిని వదలి రామనాధుని ఆశ్రయించాలి. (54) రామనాథ మహాలింగాన్ని శరణువేడిన నరునకు దుర్మతి కలుగదు. శివలోకానికి వెళ్తాడు. (55) సర్వయజ్‌ఞ తపోదాన, తీర్థస్నానముల వల్ల కలిగే ఫలముకన్న కోటిరెట్లు అధిక ఫలం రామనాధుని సేవవల్ల కలుగుతుంది. (56) రామనాథేశ్వరలింగాన్ని రెండు ఘడియల కాలము చింతించిన నరుడు ఇరువది యొక్క కులములను ఉద్ధరించి శివలోకమందు వెలుగొందుతాడు (57) రామనాథుడైన మహేశ్వరుని ఒక రోజంతా చూచిన నరుడు ఇక్కడే ధనవంతుడై చివర రుద్రుడౌతాడు. (58) రామనాథుడైన మహేశ్వరుని ప్రొద్దున్నే లేచి స్మరించిన నరుడు ఈ శరీరంతోనే భూమిపై శివుడై సంచరిస్తాడు (59) రామనాథ మహాలింగాన్ని చూచే వ్యక్తిని చూచినంత మాత్రం చేత ఇతరప్రాణుల పాపము ఆ క్షణంలోనే నశిస్తుంది (60) రామనాధేశ్వర లింగాన్ని మధ్యాహ్న కాలంలో చూచిన నరుని సురాపాన సహస్ర దోషములు ఆక్షణంలోనే నశిస్తాయి. (61) సాయంకాలమందు భక్తితో రామనాధుని చూచిన నరుని యొక్క గురుస్త్రీ గమనం వల్ల వచ్చిన పాతకము నశిస్తుంది. (62) సాయంకాలమందు మహాస్తోత్రములతో రామేశ్వరుని స్తుతించిన నరుని యొక్క స్వర్ణస్తేయ సహస్ర పాపములు ఆ క్షణంలోనే నశిస్తాయి (63) ధనుష్కోటి యందు స్నానము రామనాథుని దర్శనము, ఇవి పురుషులకు లభిస్తే గంగా జలసేవనముతో పనేమి (64) రామనాథ మహాలింగము సేవతో లభించనిది ఇతరమైన ధర్మకార్యములతో ఎప్పుడూ లభించదు (65) రామనాథ మహాలింగాన్ని ఎప్పుడూ చూడని నరుని సంకరుడని గ్రహించాలి. తండ్రి బీజంతో పుట్టనివానిగా గ్రహించాలి (66) ప్రొద్దున్నే లేచి రామనాథ అను శబ్దాన్ని మూడుసార్లు ఉచ్చరించిన నరుని పూర్వదినము పాతకము క్షణంలో నశిస్తుంది (67) భక్త రక్షణ దీక్షితుడై రామనాథ మహాలింగముండగా ఇతరులను ప్రార్థించుట భోజనముండగా తిండికై ప్రయాసపడ్డట్టు (68) కరుణానిధియైన రామనాథ మహా లింగము ప్రసన్నమైన, సకల క్లేశములు నశిస్తాయి, సూర్యోదయంతో మంచుపోయినట్టు (69).

మూ || ప్రాణోత్క్రమణవేళాయాంరామనాథంస్మరేద్యది | జన్మనే సౌనకల్పేతభూయఃశంకరతామియాత్‌ || 70 ||

రామనాథ మహాదేవ మాంరక్షకరుణానిధే | ఇతియః సతతం బ్రూయాత్కలి నాసౌనబాధ్యతే || 71 ||

రామనాధ జగన్నాధ ధూర్జటే నీలలోహిత | ఇతియః సతతంబ్రూయాత్‌ బాధ్యతేసౌన మాయయా || 72 ||

నీలకంఠ మహాదేవ రామేశ్వర సదాశివ | ఇతిబ్రువన్‌ సదాజంతుర్నైవ కామేన బాధ్యతే || 73 ||

రామేశ్వర యమారాతే కాలకూట విషాదన | ఇతీరయన్‌జ నోనిత్యం నక్రోధేన ప్రపీడ్యతే || 74 ||

రామనాధాలయం యస్తు దారుభిః కురుతేనరః | నపుమాన్‌ స్వర్గమాప్నోతి త్రికోటి కుల సంయుతః || 75 ||

ఇష్టికాభిస్తుయః కుర్యాత్సవైకుంఠమవాప్నుయాత్‌ | శిలాభిః కురుతేయస్తు సగచ్ఛేద్ర్బహ్మణః పదం || 76 ||

స్ఫటికాది శిలాభేదైః కుర్వన్నస్యాలయం జనః | శివలోకమవాప్నోతి విమాన వరమాస్థితః || 77 ||

రామనాధాలయంతామ్రైః కుర్వన్భక్తి పురస్సరం | శివసామీప్యమాప్నోతి శివస్యార్ధాసన స్థితః || 78 ||

రామేశ్వరాలయం రూపై#్యః కుర్వన్వై మానవోముదా | శివసారూప్యమాప్నోతి శివవన్మోదతే సదా || 79 ||

రామనాధాలయం హెమ్నాయః కరోతి సభక్తికం | సనరో ముక్తి మాప్నోతి శివసాయుజ్య రూపిణీం || 80 ||

రామనాధాలయం హెమ్నాధ నాఢ్యః కురుతేనరః | మృదాదరిద్రః కురుతేతయోః పుణ్యం సమంస్కృతం || 81 ||

రామనాధ మహాలింగస్నాన కాలే ద్విజోత్తమాః | త్రిసంధ్యంగే యనృత్తేచ ముఖవాద్యైశ్చ కాహలం || 82 ||

వాద్యా న్యన్యాని కురుతే యః వుమాన్భక్తి పూర్వకం | సమహాపాతకైర్ముక్తు రుద్రలోకే మహీయతే || 83 ||

యోభిషేకస్య సమయే రామనాథస్య శూలినః | రుద్రాధ్యాయంచ చమకం తథా పూరుషసూక్తకం || 84 ||

త్రిసువర్ణం పంచ శాంతిం పాపమాన్యాది కంతథా | జపేత్ర్పీతియుతో విప్రానరకం స నమశ్నుతే || 85 ||

గవాంక్షీరేణ దధ్నాచ పంచ గవ్యైఃఘృతైస్తథా | రామనాధ మహాలింగ స్నానం నరకనాశనం || 86 ||

రామనాథ మహాలింగం ఘృతేన స్నాపయేచ్చయః | కల్పజన్మార్జితం పాపం తత్‌క్షణా దేవనశ్యతి || 87 ||

రామనాథ మహాలింగం గోక్షీరైః స్నాపయన్నరః | కులైక లింగము త్తార్య శివలోకే మహీయతే || 88 ||

రామనాథ మహాలింగం దధ్నా సంస్నాప యన్నరః | సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే || 89 ||

తా || ప్రాణం పోయే సమయంలో రామనాథుని స్మరించిన నరుడు తిరిగి జన్మ నొందడు. శంకరత్వాన్ని పొందుతాడు. (70) ఓ రామనాధ ! మహాదేవ ! ఓ కరుణానిధి ! నన్ను రక్షించు అని ఎల్లప్పుడూ పలికే నరుడు కలితో బాధింపబడడు (71) రామనాధ ! జగన్నాధ! ధూర్జటి! నీలలోహిత ! అని ఎల్లప్పుడూ పలికే నరుడు మాయతో బాధింపబడడు (72) నీలకంఠ, మహాదేవ, రామేశ్వర, సదాశివ అని ఎల్లప్పుడూ పలుకుతూ ఉండే నరుడు కామంతో బాధింపబడడు(73) రామేశ్వర, యమారాతి, కాలకూట విషభక్షక, అని ఎల్లప్పుడూ పలికే నరుడు క్రోధంతో పీడింపబడడు (74) రామనాధాలయాన్ని కట్టెలతో నిర్మించే నరుడు త్రికోటి కులములతో కూడిన వాడై స్వర్గాన్ని పొందుతాడు (75) ఇటుకలతో నిర్మించిన నరుడు వైకుంఠము పొందుతాడు. రాతితో నిర్మించిన బ్రహ్మ స్థానాన్ని చేరుతాడు (76) రామనాథుని ఆలయాన్ని స్ఫటికాదిశిలా భేధములతో నిర్మించిన నరుడు శ్రేష్ఠమైన విమానము నధిరోహించి శివలోకమును పొందుతాడు (77) భక్తి పూర్వకముగా రామనాధాలయమును రాగితో నిర్మించిన నరుడు శివుని అర్ధాసనమందు ఉన్నవాడై శివసామీప్యమునకు చేరుతాడు (78) రామేశ్వరాలయమును ఆనందంతో, వెండితో నిర్మించిన నరుడు శివరూప్యమును పొంది ఎల్లప్పుడూ శివునివలె ఆనందిస్తాడు. (79) భక్తితో రామనాథాలయమును బంగారముతో నిర్మించిన నరుడు శివసాయుజ్య రూపమైన ముక్తిని పొందుతాడు (80) ధనాఢ్యుడైన నరుడు రామనాథాలయమును బంగారంతో చేసినా, దరిద్రుడు మట్టితో చేసినా వారిద్దరికి పుణ్యము సమమని చెప్పబడింది (81) ఓ బ్రాహ్మణులార ! రామనాధ మహాలింగ స్నాన కాలమందు మూడు కాలములందు గేయ నృత్తములు, ముఖవాద్యములు, కాహలము (82) ఇతర వాద్యములు భక్తితో ఉపయోగించిన నరుడు మహా పాతకముల నుండి ముక్తుడై రుద్రలోక మందు వెలుగుతాడు (83) శూలియైన రామనాధుని అభిషేక సమయమందు, రుద్రాధ్యాయమును చమకములను, పురుష సూక్తమును (84) త్రిసువర్ణమును, పంచశాంతిని, పవమానాది సూక్తములను, ప్రీతియుతుడై జపించిన నరుడు నరకమును పొందడు (85) ఆవుపాలతో పెరుగుతో పంచగవ్యముతో, నేయితో, రామనాథ మహాలింగానికి స్నానం చేయిస్తే నరకం నాశనమౌతుంది (86) రామనాథ మహాలింగాన్ని నేయితో స్నానం చేయించినచో నరుడు ఒక కల్పకాలము నందలి జన్మల్లో పొందిన పాపమును ఆ క్షణంలోనే పోగొట్టుకుంటాడు (87) రామనాథ మహాలింగాన్ని ఆవుపాలతో స్నానం చేయించిన నరుడు ఇరువది యొక్క కులములనుద్ధరించి శివలోకంలో వెలుగుతాడు (88) రామనాధ మహాలింగాన్ని పెరుగుతో స్నానం చేయించిన నరుడు సర్వపాపముల నుండి ముక్తుడై విష్ణు లోకమందు గొప్పవాడౌతాడు (89).

మూ || అభ్యంగం తిలతైలేన రామేశ్వర శివన్యయః | కరోతిహిసకృత్‌ భక్త్యా సకుబేరగృహే వసేత్‌ || 90 ||

రామనాథ మహాలింగే స్నాన మిక్షుర సేనయః | సకృద ప్యాచరేద్భక్త్యా చంద్రలోకం నమశ్నుతే || 91 ||

లికుచామ్రర సోత్పన్న సారేణ స్నాపయన్నరః | రామనాథ మహాలింగం పితృలోకం నమశ్నుతే || 92 ||

నాలికేరజలైః స్నానం రామనాధ మహేశ్వరే | బ్రహ్మహత్యాదిపాపానాం నాశనం పరికీర్తితం || 93 ||

రామనాధ మహాలింగం రంభాపక్వైర్విమర్దయన్‌ - వికాశ్యస కలంపాపం వాయులోకే మహీయతే || 94 ||

వస్త్రపూతేనతోయేన రామనాధం మహేశ్వరం | స్నాపయన్వారుణం లోక మాప్నోతి ద్విజసత్తమాః || 95 ||

చందనోదక ధారాభీ రామనాధం మహేశ్వరం | స్నాపయే త్పురుషోవిప్రా గాంధర్వంలోక మాప్నుయాత్‌ || 96 ||

పుష్పవాసితతోయేన హెమసంపృక్తవారిణా | పద్మవాసితతోయేన స్నానా ద్రామేశ్వర స్యతు || 97 ||

మహేంద్రాసన మారుహ్యతే నైవ సహమోదతే | పాటలో త్పలకల్హార పున్నాగ కరవీరకైః || 98 ||

వాసితైర్వారిభిర్విప్రా రామేశ్వర మహేశ్వరం | అభిషిచ్య మహద్భిశ్చ పాతకైః సవిముచ్యతే || 99 ||

యానిచాన్యాని పుష్పాణి సురభీణి మహాతించ | తద్గంధవాసితైస్తోయైరభిషిచ్య దయానిధిం || 100 ||

రామేశ్వర మహాలింగం శివలోకే మహీయతే | ఏలా కర్పూర లామజ్జ వాసితైః శుద్ధవారిభిః || 101 ||

రామనాథ మహాలింగమభిషిచ్య విశుద్ధధీః | ఆగ్నేయంలోకమాసాద్యసర్వాన్కామాన్సమశ్నుతే || 102 ||

రామనాథాభిషేకార్థం మృద్ఘటాన్యఃప్రయచ్ఛతి |

ఇహలోకేశతాయుఃస్యాత్సర్వకామసమృద్ధిమాన్‌ || 103 ||

తామ్రకుంభప్రదానేనదేవేంద్రత్వమవాప్నుయాత్‌ | రౌప్యుకుంభప్రదానేనబ్రహ్మలోకంనమశ్నుతే || 104 ||

హేమకుంభప్రదానేనశివలోకేమహీయుతే | రత్నకుంభప్రదానేనశివసామీప్యమశ్నుతే || 105 ||

రామనాథాభిషేకార్థంనైవేద్యార్థమపిద్విజాః | యో, గాంపయస్వినీందద్యాత్సోయేశ్వమేథఫలంలభేత్‌ || 106 ||

ప్రాప్నోతిశివవేషంచదేహాంతేశివలోకభాక్‌ | రామసేతౌధనుష్కోటౌరామనాథేత్యుదీర్యయః || 107 ||

యత్రక్వాప్యాచరేత్స్నాసంసేతుస్నానఫలంలభేత్‌ ||

తా || రామేశ్వరశివునకునువ్వులనూనెతోఅభ్యంగస్నానముఒక్కసారి భక్తితోచేయించిననరుడు కుబేరగృహంలోఉంటాడు. (90) రామనాథమహాలింగమునకు చెరకురసముతోఒక్కసారైనాభక్తితోస్నానం చేయించిననరుడుచంద్రలోకంనుపొందుతాడు. (91) గజనిమ్మ, మామిడిపండ్ల సారముతో రామనాథ మహాలింగమునకుస్నానం చేయించిన నరుడు, పితృలోకంపొందుతాడు. (92) రామనాథమహేశ్వరునకుకొబ్బరినీళ్ళతోస్నానంచేయించిననరునిబ్రహ్మహత్యాదిపాపములు నాశనమౌతాయాని అన్నారు. (93) రామనాథమహాలింగమునుఅరటిపండ్లతోమర్థించిన, నరుని సకలపాపములునశిస్తాయి. వాయులోకంలో ముఖ్యుడౌతాడు. (94) వస్త్రపూతమైనవీటితోరామనాథమహేశ్వరునకుస్నానంచేయించిననరుడు వరుణలోకమును పొందుతాడు (95) రామనాథమహేశ్వరుని చందనపునీటితోస్నానంచేయించిననరుడుగాంథర్వలోకాన్ని పొందుతాడు. (96) పూలవాసనతోకూడిననీటితో బంగారముతోకూడిన నీటితోపద్మమువాసనతోకూడిననీటితోరామేశ్వరు నకుస్నానంచేయిస్తే (97) మహేంద్రవనమును అధిరోహించి అతనితోకూడి ఆనందిస్తాడు. పాటలము, కలువ, సౌగంధిక, పున్నాగ, కరవీరముల (98) వాసనతోనిండిననీటితో రామేశ్వర మహేశ్వరుని అభిషేకించిన వారుమహాపాతకములనుండి విముక్తులౌతారు. (99) ఇతరములైన గొప్పనైనవాసనగల పుష్పములువాని వాసనతో నిండి ననీటితో దయానిధియగు (100) రామేశ్వరమహాలింగమును అభిషేకించిననరుడుశివలోకంలో గొప్ప వాడౌతాడు. ఇలాచి, కర్పూరము, నీటిపట్టివేరువీటివాసనతోకూడినపరిశుద్ధమైననీటితో (101) విశుద్ధమైన బుద్ధిగలవాడైరామేశ్వర మహాలింగమును అభిషేకించిననరుడు ఆగ్నేయంలోకమునుపొంది అన్నికోరికలనుపొందుతాడు. (102) రామనాథునిఅభిషేకంకొరకు మట్టికుండను ఇచ్చిననరుడు ఈలోకంలోనూరేళ్ళుబ్రతికిసర్వకామసమృద్ధుడౌతాడు. (103) రాగిపాత్రనిచ్చినచోదేవేంద్రత్వమునుపొందుతాడు. వెండికుండనిచ్చినచోబ్రహ్మలోకమునుపొందుతాడు. (104) బంగారుపాత్రనిచ్చినచోశివలోకంలోశ్రేష్ఠుడౌతాడు. రత్నకుంభమునుఇచ్చినచో శివసామీప్యమునుపొందుతాడు (105) ఓ బ్రాహ్మణులారా! రామనాధునిఅభిషేకంకొరకు నైవేద్యంకొరకు, పాలిచ్చేఆవునిచ్చిననరుడు అశ్వమేధఫలాన్నిపొందుతాడు (106)శివవేషమునుపొందిదేహాంతమందుశివ లోకమును పొందుతాడు. రామసేతువుయందుధనుష్కోటి యందురామనాథఅని పలుకుతూ (107) ఎక్కడైనా స్నానమాచ రించిన నరుడు సేతుస్నానఫలాన్ని పొందుతాడు.

మూ ||సుధాప్రల్తిప్తంయఃకుర్యాద్రామనాథశివాలయం || 108 ||

తత్పుణ్యంగదితుంనాహంశక్తోవర్షశతాదపి నవీకరోతియోమర్త్యోరామనాథశివాలయం || 109 ||

కర్తుః శతగుణంజ్ఞేయంతస్యపుణ్యఫలంద్విజాః | ఛిన్నంభిన్నంచయః సమ్యక్‌రామనాధశివాలయం || 110 ||

కరోతిభక్త్యాపురుషోబ్రహ్మహత్యాయుతందహేత్‌ | రామనాథస్యపురతోధీపానారోపయన్ముదా || 111 ||

అవిద్యాపటలంభిత్వాయాతిబ్రహ్మసనాతనం | ఘృతంతైలంతధాముద్గాన్‌శర్కరాస్తండులాన్గుడాన్‌ || 112 ||

ప్రయచ్ఛన్‌రామనాథాయదేవేంద్రపదమశ్నుతే | రామనాథమహాలింగదర్శనాదర్చనాత్స్మృతేః || 113 ||

స్పర్శనాదపిపాపానివిలయంయాంతితత్‌క్షణాత్‌ | రామనాధాయయోదద్యాన్మహాఘంటాంచదర్పణం || 114 ||

విమానశతసంభోగైశ్చిరంశివపురేవసేత్‌ | భేరీమృదంగపటహనిఃసాణమురజాదికం || 115 ||

వంశకాంస్యాదివాదిత్రంతథావాద్యాంతరాణిచ | ప్రయచ్ఛన్నామనాథాయమహాదేవాయసాదరం || 116 ||

సవిమానైర్మహాభోగైర్వాద్యఘోషసమన్వితైః | అనేకయుగపర్యంతంశివలోకేమహీయతే || 117 ||

రామనాథంసముద్దిశ్యయద్దత్తంస్వల్పమాదరాత్‌ | తదనంతఫలందాతుః పరత్రభవతిధ్రువం || 118 ||

రామేశ్వరేమహాక్షేత్రేరామనాథస్యసన్నిధౌ | పసన్ముక్తిమవాప్నోతిపునరావృత్తివర్జితాం || 119 ||

ఆయుఃప్రయాతిత్వరితం త్వరితంయాతి¸°వనం | త్వరితంసంపదోయాంతిదారపుత్రాదయస్తథా || 120 ||

రాజాధిభిర్ధసంబాథ్యంగృహక్షేత్రాదికంతథా | సర్వంచక్షణికంవిప్రాగృహోపకరణాదికం || 121 ||

తస్మాత్సర్వంపరిత్యజ్యసంసారస్యోపలాలనం | రామేశ్వరమహాలింగమాపన్నార్తిహరంనృణాం || 122 ||

శ్రోతవ్యంకీర్తితప్యంచన్మర్తప్యంచమనీషిభిః | రామేశ్వరాయదేవాయయోవైగ్రామాన్ర్పయచ్ఛతి || 123 ||

సహిప్రారబ్ధదేహాంతే శివేవ ప్రజాయతే | పాత్రాణాముత్తమంపాత్రంరామనాథోమహేశ్వరః || 124 ||

తసై#్మదత్వాద్విజాః సత్యమనంతంసుఖమశ్నుతే | రామనాథమహాలింగదర్శనావధిపాతకం || 125 ||

దత్వాపై#్మజనఃకించిత్సార్వభౌమోభ##వేద్ధ్రువం | తాలవృంతంధ్వజంఛత్రంచందనంగుగ్గులుంతధా || 126 ||

తామ్రకాంస్యాదిరజతహెమరత్నమయాన్‌ ఘటాన్‌ | ప్రయచ్ఛంత్యభిషేకార్థంరామనాథస్యయేనరాః || 127 ||

భూమండలాధిపతయోజాయంతేతేభవాంతరే

తా || రామనాధశివాలయమునునున్నపుపూతతోఅలంకరించిననరుని (108) పుణ్యమునుచెప్పుటకు నూరుసంవత్సరాలకైనానేనుశక్తుణ్ణికాను. రామనాథశివాలయమునుకొత్తగాచేసిన (పునరుద్ధరణ) నరుని (109) పుణ్యఫలము సాధారణ ఫలముకన్ననూరురెట్లుఅధికంఅని గ్రహించాలి. ఛిన్నమైన భిన్నమైనరామనాధశివాలయాన్ని (110) భక్తితోమంచిగా చేసిన నరుని పదివేల బ్రహ్మహత్యలుదహించుకుపోతాయి. రామనాధునిఎదురుగా సంతోషంతోదీపంపెట్టిననరుని (111) అవిద్యాసమూహమునశించిఅతడుసనాతనబ్రహ్మపదాన్నిచేరుతాడు. నేయి, నూనె, శెనగలు, శర్కర, తండులము, బెల్లము (112) వీటిని రామనాధునకిచ్చిన నరుడు దేవేంద్రపదాన్ని పొందుతాడు. రామనాధమహాలింగమునుచూడటం, పూజించటం, స్మరించటం, (113) తాకటంవీటివల్ల ఆక్షణంలోనేపాపాలన్నీపోతాయి. రామనాధునకుమహాఘంటను, దర్పణమును ఇచ్చిన నరుడు (114) విమాన (ఆకాశరథం లేదా, రాజభవనం) శతములలోసుఖిస్తూ చాలాకాలము శివపురంలోవసిస్తాడు. భేరి, మృదంగ,(తప్పెట) పటహ(యుద్ధవాద్యం)నిఃసాణములు(చర్మవాద్యం) మురజ (మృదంగం) మొదలగు వాద్యములు (115) వేణువు, కంచుమొదలగువానితో చేసిన వాద్యములను (వాదిత్రం = 4రకాలు తతము = వీణ, ఆనద్ధము = మద్దెల) = సుషిరము = వేణువు, ఘనము = తాళవాద్యము) అట్లాగే ఇతర వాద్యములను మహాదేవుడైన రామనాధునకు భక్తితోఇచ్చిననరుడు (116) విమానములతో, మహాభోగములతోవాద్యఘోషముతోకూడి, అనేకయుగముల పర్యంతరము శివలోకమందు ముఖ్యుడౌతాడు. (117) రామనాధుని ఉద్దేశించి ఆదరంతో ఇచ్చింది కొంచమైనా అది దాతకు పరలోకంలో అనంతఫలమౌతుందినిశ్చయము (118) రామేశ్వరమహాక్షేత్రమందు రామనాధునిసన్నిధిలో నివసించిన వారు పునరావృత్తిలేని ముక్తిని పొందుతారు. (119) ఆయుస్సుత్వరగా పోతుంది. ¸°వ్వనముత్వరగాపోతుంది. సంపదలుత్వరగాపోతాయి. అట్లాగే దారపుత్రాదులు పోతారు (120) రాజులు మొదలగు వారితో ధనము బాధింపబడుతుంది గృహము పొలాలు మొదలగునవి అట్లాగే, గృహోపకరణాదులు, అన్ని క్షణికము ఓ బ్రాహ్మణులార! (121) అందువలన సంసారాన్ని అతిప్రేమతోచూడటంవదలినరులాపన్నుల ఆర్తి నిహరించే రామేశ్వరమహాలింగాన్ని సేవించండి. (122) బుద్ధిమంతుడు ఆతనిని గూర్చివినాలి, కీర్తించాలి, స్మరించాలి. రామేశ్వర దేవునకు గ్రామములనిచ్చిన నరుడు (123) ఆరంభించిన దేహం ముగియగానేశివుడేఔతాడు. దానయోగ్యులలోఉత్తమదానయోగ్యుడు రామనాధ మహేశ్వరుడు (124) ఆతనికి ఇచ్చినసత్యమైన అనంతమైన సుఖాన్నిపొందుతారు. రామనాథమహాలింగాన్ని దర్శించేవరకే పాతకమలు (125) అతనికికొంచమిచ్చిననరుడు సార్వభౌముడౌతాడు నిశ్చయము. విసనకర్ర, ఛత్రము, చందనము, గుగ్గిలము (126) అట్లాగేరాగి, కంచుమొదలగుపాత్రలువెండి, బంగారు, రత్నమయమైనఘటములను, రామనాధుని అభిషేకము కొరకు ఇచ్చిననరులు (127) మరుజన్మలో వారుభూమండలాధిపతులౌతారు.

మూ || రామనాథస్యపూజార్థంపుష్పాణ్యుత్పాదయంతియే || 128 ||

అశ్వమేధాదియాగానాంఫలాస్యద్ధాప్నుపంతితే | రామేశ్వరేమహాలింగేపూజితేనమితేస్మృతే || 129 ||

శ్రుతేదృష్టేచవిపేంద్రాదుర్లభంనాస్తికించిన | రామనాధమహాలింగంసేవితుంయఃపుమాన్వ్రజేత్‌ || 130 ||

తందృష్ట్వాభయమాప్నోతి తస్యపాపౌఘ ఆశువై | రామనాథోమహాదేవోదృష్టోయదిభ##వేన్పృభిః || 131 ||

కింవేదైఃకిమువాశాసై#్త్రః కింవాతీర్థనిషేవణౖః | చందనంకుంకుమంకోష్ఠంకస్తూరీంగుగ్గులుంతథా || 132 ||

మృగనాభించనరలందద్యాద్రామేశ్వరాయయః | సభూమావిహజాయేతధనాడ్యోవేదపారగః || 133 ||

ముక్తాభరణవస్త్రాణిమహార్హాణిదదాతియః | రామనాధాయదేవాయనాసౌదౌర్గత్యమాప్నుయాత్‌ || 134 ||

రామనాథమహాలింగం గంగాతోయైః సమాహృతైః | యోభిషించత్యసౌపూజ్యఃశివస్యాపినసంశయః || 135 ||

యావన్నయాతిమరణంయావన్నాక్రమతేజరా | యావన్నేంద్రియవైకల్యంతాపదేపద్విజోత్తమాః || 136 ||

తాపదేవ మహాదేవో రామనాధోముముక్షుభిః | వంద్యః పూజ్యశ్చ మంతవ్యః స్తుత్యశ్చసతతం శివః || 137 ||

రామేశ్వర మహాలింగ పూజాతుల్యోసవిద్యతే | ధర్మః సర్వపురాణషు సర్వశాస్త్రేషు వైతథా || 138 ||

రామనాధేశ్వరం దేవం మహాకారుణికం ప్రభుం | భక్త్యా భజంతియేనిత్యంతే భూలోకేసుఖాన్వితాః || 39 ||

భుక్త్వాభోగాన్‌ బహుసుఖాన్‌ పుత్రదారయుతాభృశం | ఏతచ్ఛరీరపాతాంతే ముక్తింయాస్యంతిశాశ్వతీం || 40 ||

శ్రీసూత ఉవాచ -

ఏవంవః కథితం విప్రా రామనాథస్య వైభవం | యస్త్వేతచ్ఛృణుయాన్నిత్యం పఠతేచ సభక్తికం || 41 ||

సరామనాథసేవాయాః ఫలమాప్నోత్యనుత్తమం | ధనుష్కోటి మహా తీర్థస్నాన పుణ్యంచ యాస్యతి || 42 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే రామనాథ ప్రశంసావర్ణనం నామత్రిచత్వారింశోధ్యాయః || 43 ||

తా || రామనాథుని పూజ కొరకు పూలను(తోటను) పెంచేవారు (128) అశ్వమేధాది యాగముల ఫలమును పొందుతారు. రామేశ్వర మహాలింగము పూజింపబడినా, నమస్కరింపబడిన స్మరింపబడినా (129) లింగమును చూచిన, లింగమును గూర్చి విన్నా ఓ బ్రాహ్మణులార ! దుర్లభ##మైనది ఏది లేదు. రామనాథ మహాలింగమును సేవించుటకు వెళ్ళిన నరు (130) ని చూచి ఆతని పాప సమూహములు త్వరగా భయపడి, పోతాయి. రామనాథ మహాదేవుని నరులు చూశాక (131) వారికి వేదములతో శాస్త్రములతో తీర్థ సేవతో పనిలేదు. చందనము, కుంకుమ కోష్ఠము కస్తూరి, గుగ్గిలము (132) మృగనాభి, సరలము (ధూపద్రవం) వీటిని రామేశ్వరునకిచ్చిన నరుడు ఈ భూమిపై ధనాఢ్యుడుగా వేదపారగుడుగా జిన్మిస్తాడు (133) ముక్తాభరణ వస్త్రములను యోగ్యమైన గొప్ప వస్తువులను రామనాథదేవునికిచ్చిన నరుడు దుర్గతిని పొందడు. (134) తీసుకొని వచ్చిన గంగ తోయములతో రామనాథ మహాలింగమును అభిషేకించిన నరుడు శివునకు కూడా పూజనీయుడు సంశయములేదు (135) మరణం రాకముందే ముసలి తనం రాకముందే ఇంద్రియ వైకల్యం కలగక ముందే ఓ బ్రాహ్మణులార ! (136) అంతకు ముందే రామనాథుని మహాదేవుని శివుని ఎల్లప్పుడు ముముక్షువులైన వారు నమస్కరించాలి. పూజించాలి. మననం చేయాలి. స్తుతించాలి (137) రామేశ్వర మహాలింగ పూజతో సమానమైనది లేదు. సర్వపురాణములందు సర్వశాస్త్రములందు ఇదే ధర్మమనబడింది. (138) మహాకారుణికుడైన ప్రభువైన మహారామాశ్వర దేవుని భక్తితో నిత్యం భజించేవారు భూలోకంలో సుఖం కలవారౌతారు (139) పుత్రదారయుతులై మిక్కిలి భోగములను, బహు సుఖములను అనుభవించి ఈ శరీరం పడిపోయిన తరువాత శాశ్వతమైన ముక్తిని పొందుతారు (140) శ్రీ సూతులిట్లనిరి - ఈ విధముగా మీకు ఓ బ్రాహ్మణులార ! రామనాథుని వైభవాన్ని చెప్పాను. దీనిని భక్తితో విన్నవారు, చదివినవారు (141) రామనాథుని సేవతో కలిగే ప్రధానమైన ఫలమును పొందుతారు. ధనుష్కోటి మహాతీర్థ స్నానము వల్ల కలిగే పుణ్యమును పొందుతారు (142) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్య మందు రామనాథ ప్రశంసావర్ణన మనునది నలుబది మూడవ అధ్యాయము || 43 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters