Sri Scanda Mahapuranamu-3    Chapters   

చతుర్థఅధ్యాయము

మా || ఋషయఊచుః -

భగవన్‌ రాక్షసః కోసౌ సూత పౌరాణి కోత్తమ | విష్ణుభక్తం మహాత్మానం యోగాలవమ బాధత || 1 ||

శ్రీ సూత ఉవాచ -

వక్ష్యామిరాక్షసంక్రూరంతం విప్రాః శ్రుణుతాదరాత్‌ | యథా సరాక్షసోజాతో మునీనాంశాపవైభవాత్‌ || 2 ||

పురాకైలాసశిఖరే హాలాస్యే శివమందిరే | చతుర్వింశతి సాహస్రా మునయో బ్రహ్మవాదినః || 3 ||

వసిష్ఠా త్రిముఖాః సర్వే శివభక్తా మహౌజనః | భస్మోద్థూలిత సర్వాంగాః త్రిపుండ్రాంకిత మస్తకాః || 4 ||

రుద్రాక్షమాలా భరణాః పంచాక్షరజపేరతాః | హాలాస్యనాథం భూతేశం చంద్రచూడముమాపతిం || 5 ||

ఉపాసాంచక్రిరేముక్త్యై మధురాపురవాసినః | కదాచిత్త త్రగంధర్వోవిశ్వావసుసుతో బలీ || 6 ||

దుర్దమో నామ విప్రేంద్రా విటగోష్ఠీపరాయణః | లలనాశత సంయుక్తో వివస్త్రః సలిలాశ##యే || 7 ||

చిక్రీడ సవివస్త్రాభిః సాకం యువతిభిర్ముదా | హాలాస్యనాథతీర్థం తత్‌ వసిష్ఠోమునిభిః సహ || 8 ||

మాధ్యం దినం కర్తు మనా య¸°శంకర మందిరాత్‌ | తానృషీనవలోక్యాథ రామాస్తా భయకాతరాః || 9 ||

వాసాం స్యాచ్ఛాదయా మాసుః దుర్దమోనతు సాహసీ | తతోవసిష్ఠః కుపితః శశాపైనం గతత్రపం || 10 ||

తా || ఋషులు ఇట్లా అన్నారు - ఓ సూత! పౌరాణిక శ్రేష్ఠ! ఆరాక్షసుడెవడు. మహాత్ముడైన ఆ విష్ణుభక్తుని బాధించిన వాడెవడు (1) శ్రీ సూతులు ఇట్ల నిరి - ఓ విప్రులారా! ఆక్రూరుడైన రాక్షసుని గురించి చెప్తాను. ఆదరంతో వినండి. మునుల శాపశక్తి వల్ల ఆ రాక్షసుడు ఎట్లా పుట్టాడో చెప్తాను (2) పూర్వము కైలాస శిఖరంలో హాలాస్యంలో శివమందిరమందు ఇరవైనాలుగువేల మంది మహర్షులు బ్రహ్మవాదులు (3) వసిష్ఠుడు అత్రి మొదలగువారు గొప్పతేజస్సు గలిగిన శివభక్తులందరు, శరీరం నిండా భస్మంధరించిన వారు లలాట మందు త్రిపుండ్రములు ధరించినవారు (4) రుద్రాక్షమాలలు ఆభరణముగా గలవారు, పంచాక్షరి జపమందు ఆసక్తి గలవారు, హాలాస్య నాథుని భూతేశుని, చంద్రచూడుని, ఉమాపతిని (5) మధురాపురవాసులు ముక్తికొరకు ఉపాసించసాగారు. ఒకసారి విశ్వావసుసుతుడైన, బలవంతుడైన గంధర్వుడు (6) దుర్దముడనువాడు, విటగోష్ఠీపరాయణుడు, నూరుగురుస్త్రీలతో కూడినవాడై వివస్త్రుడై సలిలాశయమందు (నీటిమడుగు) (7) వివస్త్రలైన స్త్రీలతో కూడి, సంతోషంగా క్రీడించసాగాడు. వసిష్ఠ మహర్షి మునులతోకూడి హాలాస్య తీర్థమునకు (8) మధ్యాహ్నకాలమందలి సంధ్యాదివిధులను చేయదలచి శంకరమందిరమునుండి వచ్చాడు. ఆ ఋషులను చూచి భయపడినవారై ఆ స్త్రీలు (9) వస్త్రములను కప్పుకొన్నారు. సాహసుడైన ఆ దుర్దముడు మాత్రం వస్త్రంధరించలేదు. కుపితుడైన వసిష్ఠుడు సిగ్గులేని వీనిని శపించెను.

మా || వసిష్ఠ ఉవాచ -

యస్మాద్దుర్దర్మ గంధర్వ దృష్ట్వాస్మాన్‌ లజ్జయాత్వయా | వాసోనాచ్ఛాదితం శీఘ్రం యాహిరాక్షసతాంతతః || 11 ||

ఇత్యుక్త్వాతాః స్త్రి యః ప్రాహవసిష్ఠోముని పుంగవః| యస్మాదాచ్ఛాదితం వస్త్రం దృష్ట్వాస్మాన్‌లలనోత్తమాః || 12 ||

తతోనయుష్మాన్‌శప్స్యామి గచ్ఛధ్వంత్రి దివంతతః | ఏవముక్తావసిష్ఠేన రామాః ప్రాంజల యస్త దా || 13 ||

వ్రణిపత్య వసిష్ఠం తం భక్తినమ్రేణ చేతసా | ముని మండల మధ్యేతం వసిష్ఠ మిదమబ్రువన్‌ || 14 ||

రామా ఊచుః-

భగవన్‌ సర్వధర్మజ్ఞ చతురాసన నందన | యదాసింధోzవలో క్యాస్మాన్‌ నకోపంకర్తు మర్హసి || 15 ||

పతిరే వహీనారీణాం భూషణం పరముచ్యతే | పతిహీనాతుయానారీశతపుత్రాపిసామునే || 16 ||

విధవేత్యుచ్యతేలోకే తత్‌స్త్రీణాం మరణం స్మృతం | తత్ప్రసాదంకురుమునే పత్యావస్మాకమాదరాత్‌ || 17 ||

ఏకోపరాధః క్షంతవ్యోమునిభిః తత్వదర్శిభిః | క్షమాంకురు దయాసింధో యుష్మచ్చిష్యేzత్రదుర్దమే || 18 ||

వసిష్ఠః ప్రార్థితస్త్వేవం దుర్దమ స్యాంగనా జనైః | ప్రోవాచవచనం భూయః ప్రసన్నః స ద్విజోత్తమాః || 19 ||

నమేస్యా ద్వచనం మిథ్యాక దాచిదపి సుభ్రువః | ఉపాయంవః ప్రవక్ష్యామిశ్రుణుధ్వం శ్రద్ధయాసహ || 20 ||

షోడశాబ్దావధిః శాపోభర్తుర్వోభవితాధ్రువం | షోడశాబ్దావధౌ చైష దుర్దమో రాక్షసాకృతిః || 21 ||

యదృచ్ఛయాచక్రతీర్థం గమిష్యతి సురాంగనాః | ఆస్తేతత్రమహాయోగీ గాలవోవిష్ణు తత్పరః || 22 ||

భక్ష్యార్థంతం మునింసోయం రాక్షసో భిగమిష్యతి | తతోగాలవరక్షార్థం ప్రేరితం చక్రముత్తమం || 23 ||

విష్ణునాస్యశిరోరామాహరిష్యతిన సంశయః | తతః స్వరూపమాసాద్యశాపాన్ముక్తః సుదర్దమః || 24 ||

పతిర్వస్త్రిదివం భూయోగంతాస్త్యత్ర నసంశయః | తతస్త్రి దివమాసాద్య దుర్దమోzయంపతిర్హివః || 25 ||

రమయిష్యతి సుందర్యో యుష్మాన్‌ సుందరవేషభృత్‌ || 25 1/2 ||

తా || వసిష్ఠులు ఇట్లనిరి - ఓ గంధర్వ! దుర్దమ! మమ్ములను చూసి, సిగ్గుపడి నీవు వస్త్రములను ధరించిలేదు కనుక నీవు రాక్షసుడవుకమ్ము (11) అని, ఆ స్త్రీలతో వసిష్ఠుడు ఇట్లనెను - ఓ ఉత్తమస్త్రీలారా! మమ్ములను చూచి వస్త్రములను ధరించినారు కనుక (12) మిమ్ములను శపించను. మీరు స్వర్గమునకు వెళ్ళండి. ఈ విధముగా వారితో అనగానే ఆ స్త్రీలు జోడించి (13) నమస్కరించి, భక్తితో వినమ్రమైన హృదయము కలవారై మహర్షుల సమూహం మధ్యలోనున్న వసిష్ఠునితో ఇట్లనిరి (14) స్త్రీలమాట - బ్రహ్మపుత్రుడ! అన్ని ధర్మములు తెలిసిన వాడ! భగవాన్‌! దయా సముద్ర! మమ్ములను చూచైనా కోపగించవద్దు (15) ఆడవారికి పతియే ఆభరణము భర్తలేనటువంటి స్త్రీ నూరుగురు సంతానముకలదైనా (16) విధవ అని లోకంలో పిలువబడుతుంది. అది వారికి మరణముతో సమానము. అందువలన దయతో మా భఱ్తయందు అనుగ్రహం చూపండి (17) తత్వదర్శులైనమునులు ఒక అపరాధమును క్షమించాలి ఓ దయాసముదని! మీ శిష్యుడైన దుర్దముని క్షమించండి (18) ఈ విధముగా దుర్గముని స్త్రీలతో ప్రార్థింపబడ్డ వసిష్ఠుడు ప్రసన్నుడై మళ్ళా ఈ విధముగా పలికాడు (19) నామాట అబద్దకాదు, ఎప్పుడైనా చక్కనికనుబొమలు కల ఓ స్త్రీలారా! నేనొక ఉపాయమును చెప్తాను శ్రద్ధగా వినండి (20) మీ భర్తకు పదహారు సంవత్సరముల వరకు ఈ శాపం ఉంటుంది. ఈ పదహారు సంవత్సరములలో రాక్షసాకృతి గల ఈ దుర్దముడు (21) అనుకోకుండానే చక్రతీర్థమునకు వెళ్ళుతాడు. ఓ దేవతాస్త్రీలారా! విష్ణుభక్తుడైన మహాయోగియైన గాలవుడు అక్కడ ఉంటాడు. (22) ఈ రాక్షసుడు, ఆమునిని భక్షించుటకు వెళ్తాడు - అప్పుడు గాలవుని రక్షణ కొరకు విష్ణువుచే - పంపబడ్డ చక్రము (23) ఈతని శిరస్సును హరిస్తుంది అనుమానంలేదు. పిదప తనరూపమును పొంది శాపముక్తుడైన దుర్దముడు (24) మీ భర్త, తిరిగి స్వర్గమునకు వెళ్ళగలడు అనుమానము లేదు పిదప, త్రి దినమునకు చేరిన దుర్దముడను పేరు గల మీ భర్త (25) సుందరవేషమును ధరించి సుందరులైన మిమ్ములను ఆనందింపచేస్తాడు. 25 1/2

మూ || శ్రీ సూత ఉవాచ -

ఇత్యుక్త్వాతు వసిష్ఠఃతాః దుర్దమస్యవరాంగనాః || 26 ||

స్వాశ్రమం ప్రయమౌతూర్ణం హాలాస్యేశ్వర భక్తిమాన్‌ | అథరామాస్తమాలింగ్య దుర్దమం పతి మాతురాః || 27 ||

రురుదుః శోకసంవిగ్నాః దుఃఖ సాగర మధ్యగాః | ప్రపశ్యం తీషుతాస్వేవ దుర్దమో రాక్షసోzభవత్‌ || 28 ||

మహాదంష్ట్రో మహాకాయో రక్త శ్మశ్రుశిరోరుహః | తందృష్ట్వా భయసం విగ్నా జగ్మూరామాః త్రివిష్టపం || 29 ||

తతో రాక్షసవేశోzయం దుర్దమో భైరవాకృతిః | భక్షయన్‌ ప్రాణినః సర్వాన్‌ దేశాద్దేశం వనాద్వనం || 30 ||

భ్రమన్ననిలవేగోzసౌ ధర్మతీర్థం తతో య¸° | ఏవం షోడశ వర్షాణి భ్రమతోzస్యయయుస్తదా || 31 ||

తతస్తు షోడశాబ్దాంతే రాక్షసోయం మునీశ్వరాః | భక్షితుం గాలవమునిం ధర్మ తీర్థని వాసినం || 32 ||

ఉపాద్రవత్‌ వాయువేగః సచాస్తౌ షీజ్జనార్దనం | గలవేనస్తుతో విష్ణుః తదాచక్రమచోదయత్‌ || 33 ||

రక్షితుం గాలవమునిం రాక్షసేన ప్రపీడితం | అథాగాత్య హరేశ్చక్రం రాక్షసస్యశిరోzహరత్‌ || 34 ||

తతోzయం రాక్షసందేహం త్యక్త్వా దివ్యకలేవరః | విమాన వరమారుహ్య దురమః పుష్పవర్షితః || 35 ||

ప్రాంజలిః ప్రణతో భూత్వా వ వందేతం సుదర్శనం | తుష్టావ శ్రుతి రమ్యాభిః వాగ్భిరగ్య్రా భిరాదరాత్‌ || 36 ||

దుర్దమ ఉవాచ -

తా || శ్రీ సూతులిట్లనిరి - దుర్దముని యొక్క ఉత్తమ స్త్రీలను గూర్చి వసిష్ఠులు ఇట్లా పలికి (26) హాలాస్యేశ్వరుని యందు భక్తిగలవాడై వేగముగా తన ఆశ్రమమునకు వెళ్ళారు. పిదప ఆ స్త్రీలు దుర్దముడనే పేరు గల తమపతిని కౌగిలించుకొని (27) దుఃఖసాగరమున తేలుతూ శోకమగ్నులై ఏడ్చారు. వారు చూస్తుండగానే దుర్దముడు రాక్షసుడైనాడు. (28) పెద్ద పెద్ద కోరలు, పెద్ద శరీరము, ఎర్రని మీసములు, ఎర్రని తల వెంట్రుకలు కలవాడైనాడు. ఆతని చూచి భయపడినవారై ఆస్త్రీలు స్వర్గమునకు వెళ్ళారు (29) రాక్షస వేషము భయంకర ఆకారము గల ఈ దుర్దముడు అన్ని ప్రాణులను భక్షిస్తూ దేశమునుండి, దేశమునకు ఒక వనమునుండి మరో వనమునకు (30) తిరుగుతూ వాయువేగం గల ఈతడు ధర్మతీర్థమునకు వెళ్ళాడు. ఈ విధంగా పదునారు సంవత్సరాలు తిరుగుతూ గడిపాడు (31) పిదప, పదహారవ సంవత్సరంచివర ఈ రాక్షసుడు ధర్మతీర్థంలో ఉండే గాలవమునిని మ్రింగుటకు (32) వాయువేగంతో పరుగెత్తాడు. అతడు జనార్దనుని స్తుతించాడు. గాలవునితో స్తుతింపబడిన విష్ణువు, చక్రమును పంపాడు (33) రాక్షసునితో పీడింపబడే గాలవుని రక్షించుటకు ఆ విష్ణు చక్రము వచ్చి రాక్షసుని శిరస్సును హరించింది (34) పిదప ఆతడు రాక్షస దేహమును విడిచి దివ్య శరీరం కలవాడై విమాన శ్రేష్ఠమునెక్కి పూలవర్షము కురుస్తుండగా దుర్దముడు (35) చేతులు జోడించి ప్రణతుడై ఆసుదర్శనమును నమస్కరించాడు. శ్రుతిరమ్యములైన మాటలతో ఆదరంతో స్తుతించాడు (36) దుర్దముడు ఇట్లా అన్నాడు -

మూ || సుదర్శన నమస్తేzస్తు విష్ణుహసై#్తక భూషణ | నమస్తేzసురసంహర్త్రే సహస్రాది త్య తేజసే || 37 ||

కృపావేశేన భవతః త్యక్త్వాహం రాక్షసీంతనుం | స్వరూపమభజం విష్ణోః చక్రాయు ధ నమోzస్తుతే || 38 ||

అనుజానీహి మాంగంతుం త్రిదివం విష్ణువల్లభ | భార్యామేపరిశోచంతి విరహాతురచేతసః || 39 ||

త్వన్మనస్కో భవిష్యామి యావజ్జీవం యథాహ్యహం | తథాకృపాం కురుష్వత్వం మయిచక్రనమోzస్తుతే || 40 ||

ఏవంస్తుతం విష్ణు చక్రం దుర్దమేనస భక్తికం | అనుజగ్రాహ సహసాతథాస్త్వితి మునీశ్వరాః || 41 ||

చక్రాయు ధాభ్యనుజ్ఞాతో దుర్దమో గాలవంబునిం | ప్రణమ్యతేనానుజ్ఞాతో గంధర్వః త్రిదివంయ ¸° || 42 ||

దుర్దమేతు గతే స్వర్గంగాలవోముని పుంగవః | సచక్రం ప్రార్థయా మాస విష్ణ్వాయుధమనుత్తమం || 43 ||

చక్రాయుధ నమామిత్వాం మహాసుర విమర్దన | దేవీ పట్టణ పర్యంతే ధర్మతీర్ధే హ్యనుత్తమే || 44 ||

సన్నిధానం కురుష్వత్వం సర్వపాప వినాశనం | త్వత్సన్నిధానాత్‌ సర్వేషాం స్నాతానాం పాపినామిహ || 45 ||

పాపనాశం కురుష్వత్వం మోక్షంచకురుశాశ్వతం | చక్రతీర్ధమితిఖ్యాతిం లోకస్య పరికల్పయ || 46 ||

త్వత్సన్నిథానా దత్రత్యమునీనాం భయనాశనం | ఇతః పరం భవత్వార్య చక్రాయుధనమోzస్తుతే || 47 ||

భూతప్రేతపిశాచే భ్యోభయం మాభవతు ప్రభో | ఇతి సంప్రార్థితం చక్రం గాలవేన మునీశ్వరాః || 48 ||

తథైవాస్త్వితి సంభాష్యతస్మిస్తీర్థేతిరోహితం

శ్రీసూత ఉవాచ - ఏవం వఃకధితో విప్రాః రాక్షసస్యభవోమయా || 49 ||

తా || ఓ సుదర్శనమా! నీకు నమస్కారము. విష్ణు హస్తమునకు భూషణమా! రాక్షసుల సంహరించే దానా వేయి సూర్యుల తేజస్సుగల దాననమన్సులు (37) నీకృపాలేశంవల్లనేను రాక్షస రూపము వదలి, నానిజరూపమును పొందాను. ఓ విష్ణుమూర్తి యొక్క చక్రాయుధమ! నీకు నమస్కారము (38) విష్ణువునకు ప్రియమైన దాన! నేను స్వర్గమునకు వెళ్ళటానికి నన్ను అనుమతించు. విరహాతురమైన మనస్సులు గల నా భార్యలు దుఃఖిస్తూ ఉంటారు (39) బ్రతికి ఉన్నంతకాలమునీ యందు మనస్సు నిలిపి ఉండేట్టుగా నాయందు నీవు దయచూపు ఓ చక్రమ! నమస్సులు (40) ఈ విధముగా భక్తితోకూడి దుర్దమునితో విష్ణుచక్రముస్తుతింపబడగా అట్లాగే కానిమ్మని మునీశ్వరులందరు అనగా సుదర్శనము అనుగ్రహించెను (41) చక్రాయుధముతో అనుజ్ఞపొందిన దుర్దముడు గాలవమునికి నమస్కరించి అతని ఆజ్ఞను పొంది ఆ గంధర్వుడు త్రిదివమునక వెళ్ళెను (42) దుర్దముడు స్వర్గమునకు వెళ్ళాక గాలవముని, ఉత్తమమైన ఆ విష్ణ్వాయుధమును (చక్రమును) ప్రార్థించెను (43) మహా అసురుణ్ణి సంహరించిన ఓ చక్రమ! నిన్ను నమస్కరిస్తున్నాను దేవీపట్టణము వరకు అత్యుత్తమమైన ధర్మతీర్థమందు (44) ప్రవేశించిఉండు అది సర్వపాపనాశకము. నీవు సన్నిధిలో ఉండి స్నానముచేసిన పాపులందరి (45) పాపమును నశింపచేసి, శాశ్వతమైన మోక్షమును ప్రసాదించు. చక్రతీర్థమనే పేరును లోకమందు కల్పించు (46) నీవు సన్నిధిలో ఉండటంవల్ల ఇక్కడున్న మునుల భయం ఇక ముందు పోని ! పూజ్యమైన చక్రాయుధమ! నీకు నమస్కారము (47) భూతప్రేత పిశాచములనుండి భయము కలుగకుండుగాక అని గాలవుడు చక్రమును ప్రార్థింపగా (48) అట్లాగే కానిమ్మని పలికి ఆ చక్రము ఆ ధర్మ తీర్థమందు కన్పించకుండా పోయింది శ్రీ సూతులు ఇట్లు పలికారు - ఈ విధముగా రాక్షసుని పుట్టుకను గురించి నేను మీకు చెప్పాను (49)

మూ || మాహాత్మ్యం చక్రతీర్థస్యకధితంచ మలావహం | యచ్ఛృత్వా సర్వపాపే భ్యోముచ్యతే మానవోభువి || 50 ||

ఋషయ ఊచుః - వ్యాసశిష్యమహాప్రాజ్ఞ సూత పౌరాణి కోత్తమ | ఆరభ్య దర్భశయనం ఆదేవీపత్తనావధి || 51 ||

బహువ్యాయామ సంయుక్తం చక్రతీర్థమనుత్తమం|యయైవిచ్ఛిన్నతాం మధ్యే కథం కథయ సాంప్రతం || 52 ||

ఏనం మనసితిష్ఠంతం సంశయం ఛేత్తుమర్హసి

శ్రీసూత ఉవాచ-

పురాహి పర్వతాః సర్వే జాత పక్షామనోజవాః || 53 ||

పర్యంత పర్వతైః సార్థం చేరురాకాశమార్గగాః | నగరేషుచ రాష్ట్రేషు గ్రామేషు చవనేషు చ || 54 ||

ఆప్లుత్యాప్లుత్య తిష్ఠంతి పర్వతాః సర్వతోభువి | ఆక్రమ్యాక్రమ్యతిష్ఠంతి యత్రయత్ర మహీధరాః || 55 ||

తత్ర తత్రనరాగావః తథాన్యేప్రాణి సంచయాః | మరణం సహసాప్రాపుః పీడ్యమానా మహీధరైః || 56 ||

బ్రాహ్మణాదిషువర్ణేషునష్టేషు సమనంతరం | యజ్ఞాద్యభావాత్‌ సహసాదేవతావ్యసనం యయుః || 58 ||

ఛిద్యమానచ్ఛదాః సర్వే వాసవేన మహీధరాః | అనన్య శరణా భూత్వా సముద్రం ప్రావిశన్‌ భయాత్‌ || 59 ||

అచలేషుచ సర్వేషు పతత్సుల వణార్ణవే | నిపేతు రర్ణవ భ్రాంత్యా చక్రతీర్ధేపి కేచన || 60 ||

పతితైః పర్వతైః తైస్తు మధ్యతః పూరితోదరం | చక్రతీర్థం మహాపుణ్యం మధ్యే విచ్ఛే దమాయ¸° || 61 ||

యదృచ్ఛయా మహాశైలాః పార్శ్వయోః తత్రనాపతన్‌ | అతోవైదర్భశయనే తథాదేవీ పురేపిచ || 62 ||

విచ్చిన్నమధ్యం తద్ద్వేధా విభక్త మివదృశ్యతే | మధ్యతః పతితైః శైలైః చక్రతీర్థం స్థలీకృతం || 63 ||

శ్రీ సూత ఉవాచ -

యుష్మాక మేవంకధితం మునీంద్రాః | యన్మధ్యత స్తీర్థమిదం స్థలీకృతం

యథామహీధ్రాః సహాసా బిడౌజసా | విచ్ఛిన్న పక్షా ఇహ పేతురున్నతాః || 64 ||

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితా యాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే దుర్దమ గంధర్వ శాపమోచనం నామ చతుర్థోzధ్యాయః

తా || మలములనపహరించే చక్రతీర్థము యొక్క మాహాత్మ్యము చెప్పాను. మానవులు దీనిని విని సర్వపాపముల నుండి విముక్తులౌతారు. (50) ఋషులు ఇట్లనిరి - ఓ బుద్ధిమంతుడ! పౌరాణిక శ్రేష్ఠ! వ్యాసుని శిష్యుడ! ఓ సూత! దర్భశయనం మొదలుకొని దేవీ పట్టణం వరకు (51) చాలా దీర్ఘంగా ఉన్న ఉత్తమమైన చక్రతీర్థము మధ్యలో ఎందుకు విచ్ఛిన్నమైందో చెప్పండి (52) మా మనస్సులోని ఈ అనుమానాన్ని నివృత్తిచేయండి, అని అనగా శ్రీ సూతులు ఇట్లనిరి - పూర్వము పర్వతముల కన్నిటికి రెక్కలుండేవి. అవి మనోవేగం కలవి. (53) సరిహద్దు పర్వతములతో సహా ఆకాశమార్గమున వెళ్తూ నగరములందు రాష్ట్రములందు గ్రామములందు వనములందును (54) దుముకుతు, దుముకుతు పర్వతములు, భూమియంతట ఉండేవి. పర్వతములు ఆక్రమించినచోట (55) నరులు గోవులు ఇతర ప్రాణులు, పర్వతములతో పీడింపబడుతు తొందరగా మరణించేవి (56) ఆ పిదప బ్రాహ్మణాది వర్ణములు నష్టమైన పిదప యజ్ఞాదులు లేకపోవటం వలన దేవతలు వ్యసనము నొందిరి (57) ఇంద్రుడు బాగా కోపగించినవాడై వజ్రమునెత్తి వేగంగా వేగముగల పర్వతముల రెక్కలను విరుగగొట్టెను (58) ఇంద్రునితో రెక్కలు విరగ్గోట్టబడ్డ పర్వతములన్ని మరొక రక్షణ లేక భయం వల్ల సముద్రంలో ప్రవేశించాయి. (59) పర్వతములన్ని సముద్రమందు పడుతూ ఉంటే కొన్ని చక్రతీర్థమును సముద్రమనుకొని ఇందులో పడ్డాయి (60) మధ్యలో పడ్డ పర్వతములతో ఉదరభాగం పూరింబడ్డదై మహా పుణ్య ప్రదమైన చక్రతీర్థము మధ్యలో విచ్ఛేదాన్ని పొందింది (61) పర్వతములు పార్శ్వము లందు పడలేదు. అందువల్ల దర్భశయనమందు దేవీపురమందును (62) మధ్యభాగము విచ్ఛిత్తినంది అది రెండు భాగములుగా విభక్తమైనట్లు కన్పిస్తోంది. మధ్యలో పడ్డ పర్వతాలవల్ల చక్రతీర్థము స్థలంగా చేయబడింది. (63) శ్రీ సూతులిట్లనిరి. ఈ తీర్థము మధ్యలో భూమిగా ఎట్లా ఐందో మీకు చెప్పాను ఇందులో ఇంద్రునితో రెక్కలు విరగ్గొట్టబడి పర్వతములు ఎలా పడిపోయాయో చెప్పాను (64) అని, శ్రీ స్కాంద మహా పురాణమందు ఎనుబది యొక్క వేల సంహితయందు తృతీయ ఖండమందు సేతు మాహాత్మ్యమందు దుర్దముడను గంధర్వుని శాపమోచన మనునది చతుర్ధోధ్యాయము.

Sri Scanda Mahapuranamu-3    Chapters