Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది ఆరవ అధ్యాయము

శ్రీ సూత ఉవాచ -

ధనుష్కోటేస్తు మాహాత్మ్యంభూయోపివ్రబ్రవీమ్యహం | దురాచారాభిదోయత్రస్నాత్వాముక్తోభవద్ద్విజాః || 1 ||

మునయ ఊచుః -

దురాచారాభిధః కోసౌ సూతతత్వార్థ కోవిద | కించ పాపంకృతంతేన దురాచారేణవై మునే || 2 ||

కథం వాపాతకాన్ముక్తో ధనుష్కోటౌ నిమజ్జనాత్‌ | ఏతచ్ఛుశ్రూషమాణానాం విస్తరాద్వదనోమునే || 3 ||

శ్రీసూత ఉవాచ-

మునయః శ్రూయతాం తస్య దురాచారస్య పాతకం | స్నానేన ధనుషః కోటౌయథాముక్తశ్చ పాతకాత్‌ || 4 ||

దురాచారాభిధోవిప్రో గౌతమీ తీరమాశ్రితః కశ్చిదస్తి ద్విజాః పాపీక్రూరకర్మరతః సదా || 5 ||

బ్రహ్మఘ్నైశ్చ సురాపైశ్‌చస్తేయిభిః గురుతల్పగైః | తదా సంసర్గదుష్టోసౌ తైః సాకంస్యవసద్ద్విజాః || 6 ||

మహాపాతకి సంసర్గదోషేణాస్య ద్విజన్యవై | బ్రాహ్మణ్యం సకలంనష్టం నిః శేషేణ ద్విజోత్తమాః || 7 ||

మహాపాతకిభిః సార్ధం దినమేకంతు యోద్విజః | నివసేత్పాదరం తస్యతక్షణాద్వై ద్విజన్మనః || 8 ||

బ్రాహ్మణస్య తురీయాంశోనశ్యత్యేవ నసంశయః | ద్విదినం సేవనాత్‌ స్పర్శాత్‌ దర్శనాచ్ఛయనాత్తథా || 9 ||

భోజనా త్సహపంక్తౌ చ మహాపాతకిభిర్ద్విజాః | ద్వితీయ భాగోనశ్యేత బ్రాహ్మణస్య న సంశయః || 10 ||

త్రిదినాచ్చతృతీయాంశోనశ్యత్యే వన సంశయః | చతుర్దినాచ్చతుర్ధాంశో విలయం యాతిహిధ్రువం || 11 ||

అతః పరం తుతై స్సాకం శయనాసనభోజనైః తత్తుల్య పాతకీ భూయాత్‌ మహాపాతక సంభవాత్‌ || 12 ||

తేన బ్రాహ్మణ్య హీనోయం దురాచారాభి ధోద్విజాః | గ్రస్తోభవద్భీషణన వేతాలేన బలీయసా || 13 ||

అసౌ పరవశ##స్తేన వేతాలేనాతి పీడితః | దేశాద్దేశం భ్రమన్‌ విప్రా వనాచ్చైవవనాంతరం || || 14 ||

పూర్వ పుణ్య నిపాకేన దైవ యోగేన సద్విజః | రామచంద్ర ధనుష్కోటిం మహాపాతక నాశనీం || 15 ||

అనుద్రుతః పిశాచేన తేనా విష్టోయ¸°ద్విజాః | న్యమజ్జయత్సవేతాలో ధనుష్కోటి జలేత్వముం || 16 ||

ధనుష్కోటి జలేసోయం వేతాలేన ప్రవేశితః | ఉదతిష్ఠత్‌ క్షణాదేవ వేతాలేన విమోచితః || 17 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - ధనుష్కోటి మాహాత్మ్యాన్ని తిరిగి నేను చెబుతాను. దురాచారుడని పేరు గలవాడు స్నానం చేసి ముక్తుడైనాడు ఓద్విజులార ! (1) మునులిట్లనిరి - ఈ దురాచారుడెవరు. యథార్థమెరిగిన ఓ సూత ! దురాచారుడైన ఆతడు ఏం పాపం చేశాడు. ఓ ముని! (2) ధనుష్కోటి స్నానం వల్ల పాతకం నుండి ఎట్లా ముక్తుడైనాడు. శుశ్రూష చేసే మాకు ఓ ముని! దీనిని విస్తరంగా చెప్పండి అని అనగా (3) శ్రీ సూతులిట్లనిరి - ఓ మునులార! ఆ దురాచారుని పాతకాన్ని వినండి. ధనుష్కోటియందు స్నానం వల్ల పాతకం నుండి ముక్తుడైనది వినండి (4) దురాచారుడను పేరు గల విప్రుడు గౌతమీ తీరమందున్నాడు. అతడొక బ్రాహ్మణుడు పాపి ఎప్పుడు క్రూరకర్మ ఆచరించేవాడు (5) బ్రహ్మఘ్నులతో, సురాపానం చేసే వారితో, దొంగలతో, గురుతల్సగులతో ఎప్పుడూ వారి సహవాసంతో ఈతడు దుష్టుడైనాడు. వారితో పాటు నివసించాడు. ఓ బ్రాహ్మణులార ! (6) మహాపాతకుల సంసర్గ దోషం వల్ల ఈ బ్రాహ్మణుని బ్రాహ్మణ్యమ ఏమిలేకుండ పూర్తిగా నష్టమైంది (7) మహా పాతకులతోపాటు ప్రేమతో ఒకరోజు ఉన్న బ్రాహ్మణుని (8) బ్రాహ్మణత్వంలోని నాల్గవ భాగము ఆ క్షణంలోనే నశిస్తుంది అనుమానంలేదు. రెండు రోజులు సేవించటం వల్ల మహాపాతకుల స్పర్శన దర్శనముల వల్ల, పడుకోవటంవల్ల (9) సహపంక్తి భోజనం వల్ల బ్రాహ్మణుని బ్రాహ్మణత్వ ద్వితీయ భాగము పోతుంది అనుమానంలేదు (10) మూడు రోజుల సహవాసం వల్ల మూడవభాగమునశిస్తుంది. అనుమానములేదు. నాల్గురోజుల సహవాసంవల్ల నాల్గవ భాగం నశిస్తుంది తప్పకుండా (11) అంతకంటే ఎక్కువగా వారితో పాటు శయన ఆసన భోజనములు ఆచరిస్తే అతనితో సమానమైన పాతకిఔతాడు మహాపాతక సంభవుడైన వానితో సమానమౌతాడు (12) అందువల్ల బ్రాహ్మణ్య హీనుడైన వీడు దురాచారుడను పేరుగలవాడు బలవంతుడైన, భయంకరుడైన వేతాలునితో మింగబడ్డాడు. (13) పరవశుడైన వీడు ఆ భేతాళునితో మిక్కిలి పీడింపబడుతూ దేశం నుండి మరోదేశమునకువనంనుండి మరో వనమునకు తిరిగుతూ (14) పూర్వపుణ్య విపాకం వల్ల దైవయోగంతో ఆ బ్రాహ్మణుడు మహాపాతకనాశినియైన రామచంద్ర ధనుష్కోటికి (15) భేతాలునితో ఆవేశింపబడి పిశాచంతో వెంటనంటబడి అక్కడికి వెళ్ళాడు. ధనుష్కోటి జలంలో ఈతనిని వేతాలుడు ముంచాడు (16) ధనుష్కోటి జలమందు ఈతడు వేతాలునితో ప్రవేశ##పెట్టబడి, వేతాలునితో విడువబడి క్షణంలోనే అందుండి పైకి లేచాడు (17).

మూ || ఉత్ధితోసౌ ద్విజోవిప్రాధనుష్కోటిజలాత్తదా | స్వస్థోవ్యచింతయత్‌ కోయం దేశో జలధితీరతః || 18 ||

కథం మయాగతమిహా గౌతమీ తీరవాసినా | ఇతిచింతాకులః సోయం ధనుష్కోటి నివాసినం || 19 ||

దత్తాత్రేయం మహాత్మానం యోగిప్రవరముత్తమం | సమాగమ్య ప్రణమ్యాసౌ దురాచారోభ్య భాషత || 20 ||

నజానే భగవన్దేశః కతమోయం వదాధునా | గౌతమీ తీరనిలయోదురాచారాభిధ్యోహ్యహం || 21 ||

కృపయాబ్రూహిమే బ్రహ్మన్‌ మయాత్ర కథమాగతం | ఇతిపృష్టోమునిస్తేన దురాచారేణ సువ్రతః || 22 ||

ధ్యాత్వా ముహూర్తమవదత్‌ దురాచారం ఘృణానిధిః మహాపాతకి సంసర్గేదురాచారే కృతేపురా || 23 ||

బ్రాహ్మణ్యం నష్టమభవత్‌ వేతాలస్త్వాం తతోగ్రహీత్‌ | తేనావిష్టస్త్వమాయాతో వివశోత్ర విమూఢధీః || 24 ||

న్యమజ్జయత్త్వాంవేతాలో ధనుష్కోటిజలేత్రతు | తత్రమజ్జన మాత్రేణ విముక్తః పాతకాద్భవాన్‌ || 25 ||

ధనుష్కోటౌ తుయేస్నానం పుణ్యకుర్వం తిమానవాః | తేషాంనశ్యంతి వై సత్యం పంచపాతకసంచయాః || 26 ||

రామచంద్ర ధనుష్కోటాపత్ర మజ్జసమాత్రతః | మహాపాతకి సంసర్గదోషన్తే విలయం య¸° || 27 ||

తన్నాశాదేవవేతాలస్త్వాం ముక్త్వా విలయం గతః | త్వామగ్రహీద్యో వేతాలః పురాయం బ్రాహ్మణోభవత్‌ || 28 ||

సోయం భాద్రపదేమాసే కృష్ణపక్షే మహాలయం | పార్వణన విధానేన పితౄణణాం నాకరోన్ముదా || 29 ||

తేనస్వపితృభిః శప్తో వేతాలత్వమ గాదయం | సోపిచాప్య ధనుష్కోటేః అవలోకన మాత్రతః || 30 ||

వేతాలత్వం విహాయేహ విష్ణులోక మవాస్తవాన్‌ | అతోభాద్రపదే మాసే కృష్ణపక్షే మహాలయం || 31 ||

ఉద్దిశ్య స్వపితృన్‌ యేతు సకుర్వం త్యతి లోభతః | మహాలోభయుతాస్తే ద్ధావేతాలాఃస్యుర్న సంశయః || 32 ||

తా || ఓ బ్రాహ్మణులార ! అప్పుడు ధనుష్కోటి జలమునుండి ఆ బ్రాహ్మణుడు లేచి, స్వస్థుడై సముద్ర తీరమందు ఇది ఏదేశము అని ఆలోచించ సాగాడు (18) గౌతమీ తీరంలో ఉండే నేను ఇక్కడి కెలా వచ్చాను. అని చింతిస్తూ ఈతడు ధనుస్కోటి యందు నివసించే (19) మహాత్ముడు, యోగి ప్రవరుడు, ఉత్తముడైన దత్తాత్రేయుని చేరి, నమస్కరించి ఈ దురాచారుడు ఇట్లా అన్నాడు. (20) ఓ భగవాన్‌ ఇది ఏ దేశమో తెలియటంలేదు. నాకు తెలియజెప్పండి. నేను గౌతమీ తీరంలో ఉండేవాణ్ణి దురాచారుడని నాపేరు. (21) ఓ బ్రాహ్మణ నేనిక్కడికి ఎట్లా వచ్చానో నాకు దయ చేసి చెప్పండి, ఆ మునిని దురాచారుడు అడుగగా ఆతడు సువ్రతుడై (22) కొద్దిసేపు ధ్యానించి దయగలవాడై దురాచారునితో ఇట్లా అన్నాడు. దురాచర! పూర్వం నీవు మహాపాతకి సహవాసం చేశావు (23) అందువల్ల బ్రాహ్మణ్యము నశించింది. నిన్ను బేతాళుడు పట్టుకున్నాడు. అతనితో ఆవేశింపబడి, మూఢమైన బుద్ధిగలవాడవై, వివశుడవై నీ విక్కడికి వచ్చావు (24) వేతాలుడు నిన్ను ఇక్కడ ధనుష్కోటి జలమందు ముంచాడు. అక్కడ స్నానం చేయగానే నీవుపాతకముల నుండి ముక్తుడవైనావు. (25) పుణ్యమైన ధనుష్కోటియందు స్నానం చేసిన వారి పంచ పాతకసంచయములు నశిస్తాయి. ఇది నిజము (26) ఈ రామచంద్ర ధనుష్కోటి యందు స్నానం చేసినంత మాత్రం చేత మహాపాతకి సంసర్గం వల్ల కల్గిన దోషము నీది నశించింది (27) అది నశించింది కాబట్టే వేతాలుడు నిన్ను వదలి నశించిపోయాడు. నిన్ను పట్టుకున్న వేతాలుడు పూర్వం బ్రాహ్మణుడుగా ఉండేవాడు. (28) అతడు భాద్రపద మాస కృష్ణ పక్షమందు మహాలయ మందు పార్వణ విధితో పితృకర్మను సంతోషంగా చేయలేదు. (29) అందువల్ల తన పితరులతో శపింపబడి ఈతడు వేతాలుడైనాడు. ఆతడు కూడ ఈ ధనుష్కోటిని చూసినంతలోనే (30) వేతాలత్వమును వదలి విష్ణులోకమును పొందాడు. అందువల్ల భాద్రపదమాస కృష్ణపక్షమందలి మహాలయమును, (31) తమ పితరులనుద్దేశించి అతిలోభంవల్ల చేయనివారు, మహాలోభులైనవారు, వేతాలులౌతారు అనుమానంలేదు. (32)

మూ || తస్మాద్భాద్రపదేమాసే కృష్ణపక్షే మహాలయం | పితౄ సుద్దిశ్య శక్త్యాయే బ్రాహ్మణాన్వేదపారగాన్‌ || 33 ||

భోజయేయుర్మహాన్నేననతే విందంతి దుర్గతిం | యస్తు భాద్రపదే మాసే కృష్ణపక్షే మహాలయం || 34 ||

స్వశక్త్యనుగుణం విప్రమేకం ద్వౌత్రీనకించనః | భోజయేన్నహిదైర్గత్యం భ##వేదస్యకదాచన || 35 ||

అయంభాద్రపదేమాసే పితౄణామనుపాసనాత్‌ | య¸° వేతాలతాంవిప్రోయస్త్వాం జగ్రాహపాపినం || 36 ||

కాలోభాద్రపదమాస మారభ్యవృశ్చికావధి | మహాలయస్యకథితో మునిభిః తత్వదర్శిభిః || 37 ||

మాసోభాద్రపదః కాలః తత్రాపిహి విశిష్యతే | కృష్ణపక్షో విశిష్టః స్యాత్‌ దురాచారక తత్రవై || 38 ||

తస్మిన్‌ శుభేకృష్ణపక్షే ప్రథమా యాం తథాతిథౌ | శ్రాద్ధం మహాలయం కుర్యాత్‌ యోనరో భక్తి పూర్వకం || 39 ||

తస్యప్రీణాతి భగవాన్‌ పావకః సర్వపావనః | సవహ్నిలోకమాప్నోతివహ్నినా సహమోదతే || 40 ||

తసై#్మచజ్వలనోదేవః సర్వైశ్వర్యం దదాత్యపి | ప్రథమాయాం తిథౌమర్త్యోయో సకుర్మాన్మహాలయం || 41 ||

వహ్నిః గృహం దహెత్తస్యశ్రియం క్షేత్రాదికం తథా | వేదజ్ఞే బ్రాహ్మణ భుక్తే ప్రథమాయాం మహాలయే || 42 ||

దశకల్పసహస్రాణిపితరోయాంతితృప్తతాం | ద్వితీయాయాం తుయోభక్త్వా కుర్యాచ్ర్ఛా ద్ధం మహాలయం || 43 ||

తస్యప్రీణాతి భగవాన్‌ భవానీ పతిరీశ్వరః | సకైలాసమవాప్రోతి శివేన సహమోదతే || 44 ||

విపులాం సంపదం తసై#్మ ప్రీతో దద్యాన్మహేశ్వరః | ద్వితీయాయాం తిథౌమర్త్యోయోనకుర్యాన్మహాలయం || 45 ||

తస్యవైకుపితః శంభుఃనాశ##యే ద్ర్బహ్మవర్చనం | రౌరవం కాలసూత్రాఖ్యం నరకం చాస్యదాస్యతి || 46 ||

వేదజ్ఞే బ్రాహ్మణ భుక్తే ద్వితీయాయాం మహాలయే | వింశత్కల్ప సహస్రాణి పితరోయాంతి తృప్తతాం || 47 ||

అనుగ్రహాత్పితౄణాంచ సంతతిశ్చాన్యవర్ధతే | తృతీయాయాం నరోభక్త్యా కుర్యాచ్ఛ్రాద్ధం మహాలయం || 48 ||

తస్యప్రీణాతి భగవాన్‌ లోకపాలో ధనాధివః | మహా పద్మాదిని ధయో వర్తంతే తస్యవైవశే || 49 ||

తస్యానుగాస్త్ర యో దేవాబ్రహ్మవిష్ణుమహేశ్వరాః | తృతీయాయాం తిథౌ మర్త్యోయోనకుర్యాన్మహాలయం || 50 ||

ధనదోభగవాంస్తన్య సంపదం హరతిక్షణాత్‌ | దారిద్ర్యం చ దదాత్య సై#్మ బహుదుఃఖ సమాకులం || 51 ||

తృతీయా యాంతిథౌ మర్త్యోయః కరోతి మహాలయం | తృప్యంతి పితరస్తన్య త్రింశత్కల్ప సహస్రకం || 52 ||

తా || అందువల్ల భాధ్రపద మాసకృష్ణపక్ష మందు మహాలయమును పితరులనుద్దేశించి చేస్తూ శక్తి కొలది వేద పారగులైన బ్రాహ్మణులకు (33) అన్నంతో భోజనం పెట్టినవారు దుర్గతిని పొందరు. భాద్రపద కృష్ణపక్షమందు మహాలయ మందు (34) తన శక్తికి తగినట్టు ఒక్కనికో, ఇద్దరికో, ముగ్గురికో బ్రాహ్మణులకు దారిద్ర్యం లేకుండ భోజనం పెట్టిన యెడల అతనికి దుర్గతి ఎప్పుడు ఉండదు (35) ఈతడు భాద్రపదమాసంలో పితరులను ఉపాసించనందువలన ఈ బ్రాహ్మణుడు వేతాలుడైనాడు. పాపియైన నిన్ను పట్టుకున్నాడు (36) భాద్రపదమాసం కాలం మొదలుకొని వృశ్చికం వరకు తత్వదర్శులైన మునులు మహాలయమని చెప్పారు (37) అక్కడకూడా భాద్రపద మాసకాలము విశిష్టమైంది. ఓ దురాచారక ! అక్కడకూడా కృష్ణపక్షము విశిష్టమైంది (38) శుభ##మైన భాద్రపద కృష్ణపక్షమందు ప్రథమ తిథి యందు భక్తి పూర్వకముగ మహాలయ శ్రాద్ధము చేసిన వాని కర్మతో (39) సర్వపావనుడైన అగ్ని సంతుష్టుడౌతాడు. అతడు, చేసిన వాడు వహ్నిలోకమును చేరి వహ్నితో సహకూడి ఆనందిస్తాడు (40) అతనికి అగ్నిదేవుడు సర్వైశ్వర్యములను ఇస్తాడుకూడ. ప్రథమ తిథి యందు మహాలయము చేయని నరుని (41) గృహమును, సంపదను, క్షేత్రాదికమును అగ్నిదహిస్తాడుకూడా. మహాలయ ప్రథమతిథియందు వేదజ్ఞుడైన బ్రాహ్మణుడు భుజిస్తే (42) పితరులు దశకల్ప సహస్రముల కాలము తృప్తిని పొందుతారు. ద్వితీయ యందు మహాలయ శ్రాద్ధము చేసిన వాని భక్తికి (43) భగవాన్‌, భవానీపతియైన ఈశ్వరుడు సంతుష్టుడౌతాడు. ఆతడు కైలాసానికి చేరి శివునితో కూడి ఆనందిస్తాడు (44) సంతుష్టుడైన మహేశ్వరుడు అతనికి అధికమైన సంపదనిస్తాడు. ద్వితీయ తిథి యందు మహాలయము చేయని నరుని (45) కోపించి శంభువు ఆతని బ్రహ్మవర్చస్సు నాశనం చేస్తాడు. కాలసూత్రమను రౌరవనరకాన్ని ఆతనికిస్తాడు (46) మహాలయ ద్వితీయతిథి యందు వేదజ్ఞుడైన బ్రాహ్మణుడు భుజిస్తే పితరులు ఇరువది కల్ప సహస్రముల కాలము తృప్తి నందుతారు (47) పితరుల అనుగ్రహం వల్ల ఈతని సంతతి వృద్ధి చెందుతుంది. తృతీయ యందు మహాలయ శ్రాద్ధమును నరుడు భక్తితో చేయాలి (48) దీనితో భగవాన్‌ ! లోకపాలుడైన ధనాధిపతి సంతుష్టుడౌతాడు. మహాపద్మాది నిధులు అతని వశంలో ఉంటాయి. (49) బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలు అతన్ని అనుసరించి ఉంటారు. తృతీయ తిథి యందు మహాలయముచేయని నరుని (50) సంపదను భగవాన్‌ ! ధనరుడు (కుబేరుడు) క్షణంలో హరిస్తాడు బహుదుఃఖ సమాకులమైన దారిద్ర్యాన్ని కూడా ఈతనికిస్తాడు (51) తృతీయతిథి యందు మహాలయముచేసిన నరుని కర్మతో, అతని పితరులు ముప్పది కల్పసహస్రముల కాలము తృప్తినందుతారు (52)

మూ || చతుర్థ్యాంతు నరోభక్త్యాశ్రాద్ధంకుర్యాన్మహాలయం | తస్యప్రీణాతిభగవాన్‌హెరంబఃపార్వతీసుతః || 53 ||

తస్యవిఘ్నాశ్చ నశ్యంతి గజవక్త్ర ప్రసాదతః | చతుర్థ్యాంతుతిథౌ మర్త్యో యోనకుర్యాన్మ హాలయం || 54 ||

విఘ్నేశోభగవాంస్తస్య సదావిఘ్నం కరోతిహి | చండకోలాహలభిభ్యే నరకేచ పతత్యథ || 55 ||

చతుర్థ్యాం వైతిథౌ మర్త్యోయః కరోతిమహాలయం | పితరః కల్పసాహస్రం చత్వారింశత్ర్పహర్షితాః || 56 ||

బహూన్‌ పుత్రాన్ర్ప దాస్యంతి శ్రాద్ధకర్తుర్నిరంతరం | పంచమ్యాంతుతిథౌభక్త్యా యోనకుర్యాన్మహాలయం || 57 ||

తస్యలక్ష్మీః భగవతీ పరిత్యజతి మందిరం | అలక్ష్మీః కలహాధారా తస్య ప్రాదుర్భ వేద్‌ గృహే || 58 ||

పంచమ్యాంతు తిథౌ మర్త్యో యః కరోతిమహాలయం | తస్యతృప్యంతిపితరః పంచకల్పసహస్రకే || 59 ||

సంతతించాప్యవిచ్ఛిన్నా మసై#్మదాస్యంతితర్పితాః | పార్వతీ చప్రసన్నాస్యాన్మహదైశ్వర్యం దాయినీ || 60 ||

షష్ఠ్యాంతిథౌనరోభక్త్యా శ్రాద్ధంకుర్యాన్మహాలయం | తస్యప్రీణాతి భగవాన్‌ షణ్ముఖః పార్వతీసుతః || 61 ||

తస్యపుత్రాశ్చ పౌత్రాశ్చ షణ్ముఖ స్యప్రసాదతః | గ్రహైర్బాల గ్రహైశ్చైవన బాధ్యంతే కదాచన || 62 ||

షష్ఠ్యాంతి థౌనరోభక్త్యా యోనకుర్యాన్మహాలయం | తస్యస్కందో మహాసేనో విముఖః స్యాన్నసంశయః || 63 ||

గర్భాన్నిర్గత మాత్రైవప్రజాతస్యవినశ్యతి | పూతనాది గ్రహకులైర్బాధ్యతే చనిరంతరం || 64 ||

వహ్నిజ్వాలా ప్రవేశాఖ్యేనరకే చపతత్యధః | షష్ఠ్యాంతిథౌయః శ్రద్ధావాన్‌ కుర్యాచ్ర్ఛాద్ధం మహాలయం || 65 ||

షష్టికల్పసహస్రంతు పితరోయాంతి తృప్తితాం | పుత్రానపి ప్రదాస్యంతి సంపదం విపులాంతథా || 66 ||

సప్తమ్యాంతుతిథౌ మర్త్యః శ్రాద్ధం కుర్యాన్మహాలయం | హిరణ్యపాణిర్భగవాన్‌ ఆదిత్యస్తన్యతుష్యతి || 67 ||

ఆరోగోదృఢగాత్రః స్యాద్భాస్కరస్య ప్రసాదతః | హిరణ్య పాణిర్భగవాన్‌ హిరణ్యం పాణినా స్వయం || 68 ||

మహాలయ శ్రాద్ధకర్త్రే దదాతి ప్రీతమానసః | సప్తమ్యాంతు తిథౌ భక్త్యా యోనకుర్యాన్మహాలయం || 69 ||

వ్యాధిభిఃక్ష యరోగాద్యైః బాధ్యతేసదివానిశం | తీక్షణ ధారాస్త్ర శయ్యాఖ్యే నరకేచపతత్యధః || 70 ||

వస్త్రమ్యాంయోనరోభక్త్యా శ్రాద్ధం కుర్యాన్మహాలయం | సప్తతిం కల్పసాహస్రం ప్రీణంతి పితరోన్యవై || 71 ||

సంతతిం చాప్యవిచ్ఛిన్నాం దద్యుః పితృగణాః సదా || 71 1/2 ||

తా || చతుర్థియందు నరుడు భక్తితో మహాలయ శ్రాద్ధం చేయాలి. దాని వలన భగవాన్‌ పార్వతీసుతుడు ఐన హెరంబుడు సంతోషిస్తాడు (53) గజవక్త్రుని అనుగ్రహంవల్ల అతని విఘ్నాలు నశిస్తాయి. చతుర్థితిథి యందు మహాలయము చేయని నరునకు (54) భగవాన్‌ విఘ్నేశుడు ఎప్పుడు విఘ్నం చేస్తూనే ఉంటాడు. చండకోలాహలమనే నరకంలో పడిపోతాడు కూడా. (55) చతుర్థితిథి యందు మహాలయము చేసిన నరుని పితరులు నలుబది సహస్రములు ఆనందంతో ఉండి (56) శ్రాద్ధకర్తకు నిరంతరంగా బహుపుత్రులనిస్తారు. పంచమితిథి యందు మహాలయము భక్తితో చేయని నరుని (57) మందిరమును భగవతిలక్ష్మి వదిలిపెడుతుంది. ఆతని ఇంటిలో కలహమున కాధారమైన అలక్ష్మి పుడుతుంది (58) పంచమి తిథి యందు మహాలయమాచరరించిన నరుని పితరులు ఐదు (యాభై బహుశాక్రమంలో) కల్ప సహస్రకములు తృప్తినందుతారు (59) తృప్తులై ఈతనికి అవిచ్ఛిన్నమైన సంతానాన్ని కూడా ఇస్తారు. మహదైశ్వర్యమునిచ్చే పార్వతికూడా ప్రసన్నురాలౌతుంది (60) షష్టితిథి యందు నరుడు భక్తితో మహాలయ శ్రాద్ధమును చేయాలి. ఆ కర్మవలన పార్వతీసుతుడైన షణ్ముఖుడు భగవానుడు సంతుష్టుడౌతాడు (61) ఆతని అనుగ్రహంవల్ల ఆనరునకు పుత్రులు పౌత్రులు కలుగుతారు. గ్రహములతో బాల గ్రహములతో కూడా ఎప్పుడూ బాధింపబడరు (62) షష్టితిథి యందు భక్తితో మహాలయ శ్రాద్ధము చేయని నరునకు స్కందుడు మహాసేనుడు, విముఖుడౌతాడు (63) గర్భం నుండి బయటికి వస్తూనే ఆతని సంతానం నశిస్తుంది. ఎప్పుడూ పూతనాది గ్రహముల సమూహములతో బాదింపబడతాడు (64) వహ్నిజ్వాలా ప్రవేశమనే నరకంలో కిందపడిపోతాడు. షష్ఠితిథి యందు శ్రద్ధ కలిగి మహాలయ శ్రాద్ధము చేసిన నరుని (65) పితరులు అరవైవేల కల్పసహస్రములు తృప్తినందుతారు. పుత్రులను, విపులమైన సంపదను కూడా ఇస్తారు (66) సప్తమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధమును చేయాలి. బంగారు చేతులు గల భగవాన్‌ ఆదిత్యుడు దీని వలన సంతుష్టుడౌతాడు. (67) భాస్కరుని అనుగ్రహం వలన రోగం లేకుండా దృఢశరీరం గల వాడుగా ఔతాడు. భగవాన్‌ హిరణ్యపాణియైన వాడుస్వయంగా తన చేతితో హిరణ్యమును సంతుష్టమనస్కుడై (68) మహాలయ శ్రాద్ధకర్తకు ఇస్తాడు. సప్తమి తిథి యందు భక్తితో మహాలయము చేయని నరుడు (69) క్షయరోగాది వ్యాధులతో రాత్రింబగళ్ళు ఆతడు బాధింపబడుతాడు. క్రింద తీక్షధార అస్త్రశయ్య అను నరక మందు పడతాడు (70) సప్తమి యందు భక్తితో మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు డెబ్బది కల్పసహస్రములు సంతుష్టులౌతారు (71) పితృగణము ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు కూడా. (71 1/2).

మూ || అష్టమ్యాంతుతిథౌమర్త్యః శ్రాద్ధంకుర్యాన్మహాలయం || 72 ||

మృత్యుంజయఃకృత్తివాసాఃతస్యప్రీణాతిశంకరః | కరస్థం తస్యకైవల్యంశంకరస్య ప్రసాదతః || 73 ||

మహాలయేన శ్రాద్ధేన తుష్టేసాక్షాత్‌ త్రియంబకే | చతుర్దశ సులోకేషు దుర్లంభంతస్యకింభ##వేత్‌ || 74 ||

మహాలయం సకుర్యాద్వైయోష్టమ్యాం మూఢచేతనః | సంసారసాగరేఘోరే సదామజ్జతి దుఃఖితః || 75 ||

కదాచిదపితస్యేష్టం నైవసిద్ధ్యతిభూతలే | వైతరిణ్యాఖ్యనరకే పతత్యాచంద్రతారకం || 76 ||

యోష్టమ్యాం శ్రద్ధయాశ్రాద్ధం నరఃకుర్యాన్మహాలయం | అశీతికల్పసాహస్రం తృప్యంతి పితరోన్యవై || 77 ||

అశీర్భిర్వర్ధయంత్యేనం విఘ్నశ్చాస్యవ్యపోహతి | సంతతించావ్యవిచ్ఛిన్నాం దద్యుఃపితృగణాఃసదా || 78 ||

నవమ్యాంతు తిథౌ మర్త్యః శ్రాద్ధంకుర్యాన్మహాలయం | దుర్గాదేవీభగవతీ తస్యప్రీణాతి శాంభవీ || 79 ||

క్షయాపసార కుష్ఠాదీన్‌ క్షుద్రప్రేత పిశాచకాన్‌ | నాశ##యేత్తస్య సంతుష్టా దుర్గామహిషమర్దినీ || 80 ||

నవమ్యాంతుతిథౌమర్త్యోయోనకుర్యాన్మహాలయం | అపస్మారేణ పీడ్యేత తథైవ బ్రహ్మరక్షసా || 81 ||

అభిచారార్థకృత్యాభిః బాధ్యేత చనిరంతరం | నవమ్యాంయస్తిథౌమర్త్యః శ్రాద్ధంకుర్యాన్మహాలయం || 82 ||

సవతిం కల్పసాహస్రం తృప్యంతి పితరోస్యవై | సంతతించాప్యవిచ్ఛిన్నాం దద్యుః పితృగణాః సదా || 83 ||

దశమ్యాంతుతిథౌ మర్త్యః శ్రాద్ధంకుర్మాన్మహాలయం | తస్యామృతకలశ్చంద్రః షోడశాత్మాప్రసీదతి || 84 ||

ఔషధానా మధీశేస్మిన్‌ శ్రాద్ధేనా నేనతోషితే | వ్రీహ్మదీని తుధాన్యాని దద్యురోషధయః సదా || 85 ||

యోనకుర్యాద్దశమ్యాంతు మహాలయ మనుత్తమం | ఓషధ్యోనిష్ఫలాస్తస్య కృషిశ్చా వ్యన్యనిష్ఫలా || 86 ||

దశమ్యాంయస్తిథౌమర్త్యఃశ్రాద్ధం కుర్యాన్మహాలయం | శతకల్ప సహస్రాణి తృప్యంతి పితరోన్యవై || 87 ||

సంతతిం చాప్యవిచ్ఛిన్నాం దద్యుఃపితృగణాః సదా | ఏకాదశ్యాం నరోభక్త్యాశ్రాద్ధం కుర్యాన్మహాలయం || 88 ||

సంహర్తా సర్వలోకస్యతస్య రుద్రః ప్రసీదతి | రుద్రస్య సర్వసంహర్తుః ప్రసాదేన జగత్పతేః || 89 ||

శత్రూన్పరాజయత్యేషశ్రాద్ధకర్తానిరంతరం | బ్రహ్మహత్యాయుతంచాపితస్యనశ్యతితత్‌క్షణాత్‌ || 90 ||

అగ్నిష్టోమాది యజ్ఞానాం ఫలమాప్నోతి పుష్కలం | ఏకాదశ్యాంనరోభక్త్యాయోనకుర్యాన్మహాలయం || 91 ||

తస్యవైవిముఖోరుద్రోన ప్రసీదతికర్హిచిత్‌ | సర్వతోవర్థమానాశ్చ బాథంతే శత్రవోహ్యముం || 92 ||

అగ్నిష్టోమాదికా య జ్ఞాః కృతాశ్చబహు దక్షిణాః | నిష్ఫలా ఏవతస్యన్యుః భస్మనిన్యస్తహవ్యవత్‌ || 93 ||

బ్రహ్మఘాతక తుల్యః స్యాత్‌ శ్రాద్ధాకరణ దోషతః | ఏకాదశ్యాంతిధ్యౌయస్తు శ్రాద్ధంకుర్యాన్మహాలయం || 94 ||

ద్విశతం కల్పసాహస్రం తృప్యంతి పితరోన్యవై | సంతతించాప్యవిచ్ఛిన్నాం దద్యుః పితృగణాః సదా || 95 ||

తా || అష్టమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధము చేయాలి. (72) మృత్యుంజయుడు, కృత్తి వాసుడు, శంకరుడు దాని వలన సంతుష్టుడౌతాడు. శంకరుని అనుగ్రహం వలన అతనికి కైవల్యము చేతియందున్నట్లే (73) మహాలయ శ్రాద్ధంతో సాక్షాత్తు త్రియంబకుడు సంతోషపడితే, పదునాల్గులోకములలో అతనికి దుర్లభ##మైనదేముంటుంది. (74) మూఢచేతనుడై అష్టమియందు మహాలయము చేయనివాడు ఘోరమైన సంసారసాగరమందు దుఃఖితుడై మునుగుతాడు ఎప్పుడూను (75) భూమి యందు ఆతనికోరిక ఎప్పుడు కూడా సిద్ధించదు. చంద్రుడు తారలున్నంత వరకు వైతరిణి అను నరకమందు పడిపోతాడు (76) అష్టమియందు శ్రద్ధతో మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు ఎనుబది కల్పసహస్రము తృప్తి నందుతారు (77) ఈతనిని ఆశీస్సులతో వృద్ధిపరుస్తారు. ఈతని విఘ్నముకూడా తొలగిపోతుంది. పితృగణములు ఎల్లప్పుడ అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు (78) నవమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధమును చేయాలి. దానితో దుర్గాదేవి, భగవతి, శాంభవి సంతుష్టి పొందుతుంది (79) సంతుష్టి చెందిన దుర్గమహిష నందిని అతని క్షయ, అపస్మార కుష్ఠాదులను క్షుద్రప్రేత పిశాచములను నశింపచేస్తుంది (80) నవమితిథి యందు మహాలయము చేయని నరుడు బ్రహ్మరక్షస్సుతో, అపస్మారముతో పీడింపబడుతాడు (81) నిరంతరము అభిచార అర్థకృత్యములతో బాధింపబడుతాడు. నవమి తిథి యందు మహాలయ శ్రాద్ధముచేసిన నరుని (82) పితరులు తొంబది కల్ప సహస్రములు తృప్తి నందుతారు. పితృగణములు ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని గూడా ఇస్తారు (83) దశమి తిథి యందు నరుడు మహాలయ శ్రాద్ధము చేయాలి దానితో షోడశాత్మ అమృత కళుడు, చంద్రుడు ప్రసన్నుడౌతాడు (84) ఓషధులకు అధీశుడైన ఈతడు ఈ శ్రాద్ధంతో సంతోషిస్తే ఓషధులు ఎల్లప్పుడూ వ్రీహ్యది ధాన్యములను ఇస్తాయి (85) దశమి యందు ఉత్తమ (ముఖ్య)మైన మహాలయమాచరించని నరుని ఓషధులు నిష్ఫలమౌతాయి.ఆతని కృషి కూడా నిష్ఫలమే (86) దశమి తిథి యందు మహాలయశ్రాదధము చేసిన నరుని, పితరులు శతకల్పసహస్రములు తృప్తినందుతారు (87) పితృగణములు ఎల్లప్పుడూ ఈతనికి అవిచ్ఛిన్న సంతతి నిస్తారు. ఏకాదశియందు, భక్తితో మహాలయ శ్రాద్ధాన్ని చేయాలి నరుడు. (88) దానితో సర్వలోకముల సంహర్త ఐన రుద్రుడు అనుగ్రహిస్తాడు. సర్వసంహర్తయైన జగత్పతియైన రుద్రుని అనుగ్రహముతో (89) ఈ శ్రాద్ధ కర్త నిరంతరము శత్రువులను ఓడిస్తాడు. అతని బ్రహ్మహత్యలు పదివేలైన ఆక్షణంలోనే నశిస్తాయి. (90) అగ్నిష్టోమాది యజ్ఞముల ఫలమును పుష్కలంగా పొందుతాడు. ఏకాదశియందు భక్తితో మహాలయము చేయని నరునిపై (91) రుద్రుడు విముఖుడౌతాడు. అతనిని ఎప్పుడు కూడా అనుగ్రహించడు. అన్ని విధముల అభివృద్ధి చెందుతున్న శత్రువులు ఈతనిని బాధిస్తారు. (92) బహుదక్షిణలతో చేసిన అగ్నిష్టోమాది యజ్ఞములు ఆతనిని నిష్ఫలములే, బూడిదలో పోసిన హవ్యములవలె ఔతాయి (93) శ్రాద్ధము చేయని దోషము వలన బ్రహ్మఘాతకతుల్యుడౌతాడు. ఏకాదశితిథి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు (94) రెండు వందల కల్పసహస్రములు తృప్తులౌతారు. పితృగణముల ఎల్లప్పుడు అవిచ్ఛిన్న సంతతిని ఇస్తారు (95).

మూ|| ద్వాదశ్యాంతు తిథౌమర్త్యఃకుర్యాచ్ఛ్రాద్ధంమహాయలం | తస్యలక్ష్మీపతిఃసాక్షాత్‌ ప్రసీదతి జనార్దనః || 96 ||

ప్రసన్నేనతిదేవేశే దేవేదేవే జనార్దనే | చరాచరం జగత్సర్వం ప్రీతమేవన సంశయః || 97 ||

భూమిర్‌హరిప్రియాచాస్యనస్యం సంవర్ధయత్యపి | లక్ష్మీశ్చవర్ధతే తస్యమందిరే హరివల్లభా || 98 ||

గదాకౌమోదకీ నామ నారాయణకరస్థితా | అపస్మారాది భూతాని నాశయత్యేవ సర్వదా || 99 ||

తీక్షణధారం తథాచక్రం శత్రూనస్యదహత్యపి | యాతుధానపిశాచాదీన్‌ శంఖశ్చాన్యవ్యపోహతి || 100 ||

ఏవం సర్వాత్మనాపీడాం వారయత్యస్యకేశవః | మహాలయం సకుర్యాద్యోద్వాదశ్యాం మనుజాథమః || 101 ||

తస్యక్షేత్రాణి సంపచ్చ వినశ్యంతినసంశయః | అపస్మారాది భూతాని శత్రవశ్చ మహాబలాః || 102 ||

యాతుధానాశ్చబాధంతే తంవైవిష్ణుపరాజ్‌ముఖం | పాత్యతే నరకే చాపి అస్థిభేదన నామకే || 103 ||

ద్వాదశ్యాం భక్తియుక్తో యః శ్రాద్ధం కుర్యాన్మహాలయం | షడ్‌శతం కల్పసాహస్రం ప్రీణంతిపితరోస్యవై || 104 ||

సంతతిం చాప్యవిచ్ఛిన్నాం పితరోసై#్మ దదత్యపి | త్రయోదశ్యాం నరోభక్త్యా శ్రాద్ధం కుర్యాన్మహాలయం || 105 ||

ప్రసీదత్యస్య భగవాన్‌ కందర్పోరతి నాయకః | స్రక్చందనాదయోభోగాలల నాశ్చమనోరమాః || 106 ||

కామదేవప్రసాదేన తస్యసిద్ధ్యంతి సర్వదా | ఆజన్మమరణాంతంచ సుఖమేవ సవిందతే || 107 ||

యోనకుర్యాంత్‌త్రయోదశ్యాంసచశ్రాద్ధంమహాలయం | కామదేవోస్యవిముఖఃస్త్రియోభోగాంశ్చనాశ##యేత్‌ || 108 ||

అంగారశయ్యాభ్రమణనరకే పాతయత్యముం | పితౄసుద్దిశ్యయః కుర్యాత్‌ త్రయోదశ్యాం మహాలయం || 109 ||

సహస్ర కల్పసాహస్రం ప్రీణంతి పితరోస్యవై | సంతతించాప్యవిచ్ఛిన్నం దద్యుః పితౄగణాస్తదా || 110 ||

తా || ద్వాదశి తిథి యందు మర్త్యుడు మహాలయ శ్రాద్ధము చేయాలి. ఆతనిని లక్ష్మీపతియైన జనార్దనుడు సాక్షాత్తుగా అనుగ్రహిస్తాడు. (96) దేవేశుడు, దేవదేవుడు ఐన జనార్దనుడు ప్రసన్నుడైతే చరాచర జగత్తంతా సంతోషించినట్టే అనుమానంలేదు (97) హరిప్రియ ఐన భూమి ఈతని పంటను వృద్ధిపరుస్తుంది కూడా. హరివల్లభ ఐన లక్ష్మికూడా అతని ఇంటిలో వృద్ధి పొందుతుంది (98) నారాయణుని చేతియందున్న గద కౌమోదకి అనునది ఎప్పుడూ అపస్మారాది భూతములను నశింపచేస్తుంది (99) తీక్షణమైన అంచులు గల చక్రము ఈతని శత్రువులను దహించి వేస్తుంది. ఈతని శంఖము యాతుధాన పిశాచాదులను తొలగిస్తుంది (100) ఈ విధముగా కేశవుడు అన్ని విధముల ఈతని పీడను తొలగిస్తాడు. హహాలయమును ద్వాదశియందు చేయని మను జాథమునియొక్క (101) క్షేత్రములు సంపదలు నశిస్తాయి. అనుమానంలేదు. అపస్మారాది భూతములు, మహాబలవంతులైన శత్రువులు (102) యాతుధానులు (రాక్షసులు, పుణ్యజనులు) కూడా విష్ణుపరాఙ్‌ముఖుడైన ఈతనిని బాధిస్తారు. అస్థిభేదనమను పేరుగల నరకమందు పడవేయబడుతాడు (103) ద్వాదశి యందు భక్తియుక్తుడై మహాలయ శ్రాద్ధము నాచరించిన వాని పితరులు ఆరువందల కల్ప సహస్రములు సంతోషపడుతారు (104) ఈతని పితరులు ఈతనికి అవిచ్ఛిన్న సంతతిని కూడా ఇస్తారు. త్రయోదశి యందు నరుడు భక్తితో మహలయ శ్రాద్ధమును చేయాలి (105) అతనికి రతినాయకుడైన భగవాన్‌ కందర్పుడు ప్రసన్నుడౌతాడు. ప్రక్చందనాది భోగములు మనోరమలైన స్త్రీలు (106) కామదేవుని ప్రసాదం వల్ల అతనికి ఎల్లప్పుడూ సిద్ధిస్తారు. పుట్టుకనుండి చావు వరకు ఆతడు సుఖమునే పొందుతాడు. (107) త్రయోదశి యందు మహాలయ శ్రాద్ధము చేయని వానికి కామదేవుడు విముఖుడౌతాడు. స్త్రీలను భోగములను నశింపచేస్తాడు. (108) ఈతనిని అంగార శయ్యా భ్రమణమనే నరకమందు పడవేస్తాడు. పితరుల నుద్దేశించి త్రయోదశి యందు మహాలయం మాచరించిన వాని (109) పితరుల సహస్ర కల్పసహస్రములు సంతుష్టి నందుతారు. పితృగణములు అవిచ్ఛిన్న సంతతిని కూడా ఇస్తారు (110).

మూ || చతుర్దశ్యాంనరోభక్త్యా శ్రాద్ధం కుర్యాన్మహాలయం | తస్యాభీష్టప్రదానాయ జాగర్తి భగవాన్‌శివః || 111 ||

ఉపదిశ్యశివజ్ఞానం సాయుజ్యం చదదాత్యపి | సురాపానాయుతం చాపి స్వర్ణస్తేయా యుతం తథా || 112 ||

నశ్యంతి తత్‌క్షణాదేవచతుర్దశ్యాం మహాలయాత్‌ | చండాల పృషలస్త్రీణాం సంగదోషోపినశ్యతి || 113 ||

అశ్వమేధసహస్రస్య పౌండరీకాయుతస్యచ | పుష్కలా ఫలసిద్‌ధిస్స్యాత్‌ చతుర్దశ్యాం మహాలయాత్‌ || 114 ||

యోనకుర్యాచ్చతుర్దశ్యాం శ్రాద్ధమేతన్మహాలయం | సకల్పకోటి సాహస్రం కల్పకోటిశతం తథా || 115 ||

సంసారాంధమహాకూపేపతితః స్యాదనిష్కృతిః | అచోరయిత్వాకనకమపీత్వాపిసురాంతథా || 116 ||

సురాపానాదిభిర్దోషైర్లిప్యతే సవిమూఢధీః | కృతాఅపి విధానేన యజ్ఞాః స్యుః నిష్ఫలాస్తథా || 117 ||

చతుర్దశ్యాంతిథౌ యస్తుకుర్యాచ్ఛ్రాద్ధం మహాలయం లక్షకోటి సహస్రాణి లక్షకోటి శతానిచ || 118 ||

కల్పానిపితరస్తస్య తృప్యంత్యేపనసంశయః | నరస్థాశ్చపితరః స్వర్గంయాంతి ప్రహర్షితాః || 119 ||

సంతతించాప్యవిచ్ఛిన్నాందద్యుఃపితృగణాస్తదా | అమాయాంతునరోభక్త్యా శ్రాద్ధం కుర్యాన్మహాలయం || 120 ||

పితౄణాం తస్యతృప్తిస్యాదనంతానాత్రసంశయః | సుధామాస్వాద్యయాతృప్తిర్దే వానాం దివివైభ##వేత్‌ || 121 ||

అనంతాతాదృశీతృప్తిః అమావాస్యాం మహాలయాత్‌ | అమావాస్యా మహాపుణ్యా పితృదేవన మస్కృతా || 122 ||

శాంతాహ్యేషాతు పరమాశివస్యచమహాప్రియా | తస్యాం మహాలయే శ్రాద్ధే భోజయేద్వేద విత్తమాన్‌ || 123 ||

తేనతృప్తిః పితౄణాం స్యాదనంతా తుష్యతే శివః | బ్రహ్మహత్యాదయః పంచపాతకాః నాశమాప్నుయుః || 124 ||

కృతాశ్చస్యుః విధానేన సర్వేయజ్ఞాః సదక్షిణాః | అసుష్ఠితాః స్యు విధివత్‌ సర్వేధర్మాః సనాతనాః || 125 ||

అమావాస్యాదినేయేనకృతంశ్రాద్ధంమహాలయం | ప్రత్యక్‌బ్రహ్మైకతాంజ్ఞాత్వాసాయుజ్యంయాత్యసంశయం || 126 ||

యోనకుర్యాదమావాస్యాం మహాలయమచేతనః | బ్రహ్మలోకగతాశ్చాన్యపితరోయాంతినారకం || 127 ||

సంతతిశ్చాన్య మూఢస్య విచ్ఛిద్యేతైపతత్‌క్షణాత్‌ | ఏవీవహిమహానర్థోయదమాయాం తిథైనరైః || 128 ||

మహాలయార్థోవిప్రేంద్రా విధి వన్నైవ భోజితాః || 128 1/2 ||

తా || చతుర్దశి యందు నరుడ భక్తితో మహాలయ శ్రాద్ధము చేయాలి. అతని అభీష్టమును నెరవేర్చుటకై భగవాన్‌ శివుడు మేల్కొంటాడు (111) శివజ్ఞానమును ఉపదేశించి సాయుజ్యము కూడా ఇస్తాడు. పదివేల సురాపానముల, పదివేల స్వర్ణప్తేయము బంగారం దొంగతనము / (112) పాపము చతుర్దశి మహాలయం శ్రాద్ధం వల్ల తత్‌క్షణమందే నశిస్తుంది. చండాల వృషలస్త్రీల సమాగమ దోషం కూడా నశిస్తుంది (113) అశ్వమేధ సహస్రముల పదివేల పుండరీక యాగముల పుష్కలఫలసిద్ధి చతుర్దశి మహాలయం వల్ల లభిస్తుంది (114) చతుర్దశి యందు మహాలయ శ్రాద్ధం చేయని నరుడు కల్పకోటి సహస్రము, అట్లాగే కల్పకోటి శతము కాలము (115) సంసారమనే పెద్ద చీకటి బావిలో పడిపోతాడు. నిష్కృతి లభించదు. బంగారం దొంగిలించకుండానే సురను తాగకుండానే (116) సురాపానాది దోషములతో తాకబడుతాడు. ఆ మూఢ బుద్ధి కలవాడు. విధానం ప్రకారం చేసినా ఆతని యజ్ఞములు నిష్ఫలములౌతాయి (117) చతుర్దశి యందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుని పితరులు లక్షకోటి సహస్రముల లక్షకోటి శతములు (118) కల్పములు తృప్తి నందుతారు. అనుమానంలేదు. నరకమందున్న పితరులు కూడా ఆనందంతో స్వర్గానికి వెళుతారు (119) పితృగణములు అవిచ్ఛిన్నమైన సంతతిని కూడా ఇస్తారు. అమాయందు నరుడు మహాలయ శ్రాద్ధ మాచరించాలి (120) ఆతని పితరులకు అనంతమైన తృప్తి లభిస్తుంది. అనుమానంలేదు. దేవలోకంలో దేవతలకు అమృతాస్వాదన వల్ల లభించేతృప్తి (121) అనంతమైన అట్టి తృప్తి అమావాస్య మహాలయవల్ల లభిస్తుంది. పితృదేవతలను నమస్కరించే అమావాస్య మహాపుణ్యప్రదమైంది (122) ఇది పరమ శాంతమైంది. శివునకు మహా ఇష్టమైనట్టిది. ఆమహాలయ శ్రాద్ధమందు వేద విత్తములను భుజింపచేయాలి. (123) అందువల్ల పితరులకు అనంతమైన తృప్తి లభిస్తుంది. శివుడు ఆనందిస్తాడు బ్రహ్మహత్యాది పంచ పాతకములు నశిస్తాయి. (124) అన్ని యజ్ఞములు దక్షిణలతో కూడా విధానముగా చేసినట్లౌతాయి. సనాతన సర్వధర్మములు విధి ప్రకారము అనుష్ఠింపబడినట్లౌతాయి (125) అమావాస్యదినమందు మహాలయ శ్రాద్ధము చేసిన నరుడు ప్రత్యక్‌ బ్రహ్మేకతను తెలుసుకొని సాయుజ్యమును పొందుతాడు (126) అచేతనుడై మహాలయ అమావాస్య నాచరించని వాని పితరులు బ్రహ్మలోక గతులైన నరకమునకే వెళుతారు (127) ఈ మూఢుని సంతతి ఆక్షణంలోనే విచ్ఛిత్తి నందుతుంది. ఆమాతిథి యందు నరులు (128) మహాలయము కొరకు విధి ప్రకారము బ్రాహ్మణులకు భోజనం పెట్టనట్లైతే అదే మహా అనర్థమౌతుంది (సంతతి విచ్చిత్తి) (128 1/2)

మూ || మాసిభాద్రపదే ప్రాప్తే నృత్యంతి పితృదేవతాః | || 129 ||

అస్మానుద్దిశ్య మత్పుత్రా భోజయేయుర్ద్విజోత్తమాన్‌ | తేసనోనరకక్లేశోన భవిష్యతి దారుణః || 130 ||

వాసశ్చ స్వర్గలోకే స్యాద్యా వ దాచంద్రతారకం | మాసిభాద్రపదే ప్రాప్తే పితౄణాం తృప్తి దాయినీ || 131 ||

ఏకైకం భోజయేద్విప్రం ప్రత్యహం భక్తి పూర్వకం | పితృమాతృకులోద్భూతాః పితరః తృప్తిమాప్నుయుః || 132 ||

కృష్ణపక్షేవిశేషస్త్రణ బ్రాహ్మణాన్భోజయేత్సుధీః | ఘృతసూపాది ససై#్యశ్చతైలాభ్యంగ పురస్సరం || 133 ||

సుధంపాస్యంతిపితరః తస్యాకల్పం ప్రహర్షితాః | సప్తమీంకృష్ణపక్షస్య ప్రారభ్య ప్రత్యహం నరాః || 134 ||

విప్రాన్యావదమావాస్యాత్రీం స్త్రీనభ్యర్చ్యభోజయేత్‌ | ఆరభ్యద్వాదశీం విప్రాన్‌ త్రీనవశ్యంతు భోజయేత్‌ || 135 ||

అస్యథైశ్వర్యహానిః స్యాత్‌ మహాదారిద్ర్యభాగ్భవేత్‌ | విత్తలోభం పరిత్యజ్యవిప్రాన్‌ సూపఘృతాదిభిః || 136 ||

వయసాపాయసాన్నేసదధ్నాపూపాదిభిస్తథా | పేయైర్లేహ్యైశ్చచోషై#్యశ్చ భ##క్ష్యైశ్చ వివిధైరపి || 137 ||

భోజయేద్వేదవిన్ముఖ్యాంన్తృప్తిస్తేషాం యథాభ##వేత్‌ | తేన బ్రహ్మాహరిః శంభున్తృప్తాః స్యర్నాత్ర సంశయః || 138 ||

అగ్నిష్వాత్తాది పితరస్తథైవేంద్రాది దేవతాః | బహునాత్రకిముక్తేన తుష్టం తేన జగత్త్రయం || 139 ||

పార్వణన విధానేన కుర్యాచ్ఛ్రాద్ధే మహాలయం | నరోమహాలయంశ్రాద్ధే పితృవంశ్యాన్పతౄనిన || 140 ||

మాతృవంశ్యానపిపితౄన్భోజయేచ్ఛ్రేయసే ముదా | దక్షిణాంచయథాశక్తి దద్యాద్విత్తానుసారతః || 141 ||

తస్మిన్మహాలయే శ్రాద్ధే విత్తశాఠ్యం నకారయేత్‌ | దక్షిణాఖలు యజ్ఞానాం కథితేయంపురోగవా || 142 ||

అనః పురోగవైర్హీనం కరిష్యతి యథాధ్వని | అదక్షిణం తథాసోయం పితృయజ్ఞోపిరిష్యతి || 143 ||

తస్మాద్యజ్ఞేషు దాతవ్యాదక్షిణాల్పాహిజానతా | విధవాభిరపిస్త్రీభిరపుత్రాభిర్మహాలయః || ||144 ||

భర్తౄనుద్దిశ్యకర్తవ్యోభూరిభోజనకర్మణా | అన్యథా ధర్మహానిః స్యాత్‌ నరకంచ మహాద్భవేత్‌ || 145 ||

తా || భాద్రపద మాసం వస్తే పితృదేవతలు నాట్యం చేస్తారు (129) మమ్మల్ని ఉద్దేశించి మా పుత్రులు బ్రాహ్మణోత్తములకు భోజనం పెడతారు. దాని వలన మాకు దారుణమైన నరకక్లేశము కలుగదు (130) చంద్ర తారలున్నంత కాలము స్వర్గలోకవాసము కల్గుతుంది. భాద్రపదమాసం వస్తే అది పితరులకు తృప్తినిచ్చేది (131) కనుక ప్రతిరోజు భక్తి పూర్వకముగా ఒక్కొక్క బ్రాహ్మణునకు భోజనం పెట్టాలి. పితృమాతృకులమందు జన్మించిన పితరులు తృప్తి నందుతారు (132) విశేషించి కృషపక్షమందు బుద్ధిమంతుడు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. నేయిపప్పు మొదలగు సస్యములతో తైలా భ్యంగపురస్సరముగా పెట్టాలి (133) దీనితో ఆ కల్పము ఆనందిస్తూ పితరులు అమృతము సేవిస్తారు. కృష్ణపక్ష సప్తమి మొదలుకొని ప్రతిరోజు నరులు (134) అమావాస్య వరకు ముగ్గురు బ్రాహ్మణులను పూజించి భుజింపచేయాలి. ద్వాదశి నారంభించి (ఆనాటినుండి) ముగ్గురు బ్రాహ్మణులకు తప్పకుండ భోజనం పెట్టాలి (135) లేనిచో ఐశ్వర్య హాని కల్గుతుంది. మహా దారిద్ర్య వంతుడౌతాడు. విత్తలోభమును వదలి బ్రాహ్మణులకు సూపఘృతాదులతో (136) వయస్సుతో పాయసాన్నముతో పెరుగు అపూపాదులతో పేయములు, లేహ్యములు, చోష్యములు(జుర్రేది) వివిధములైన భక్ష్యములు (137) మొదలగు వానితో వేదవిదులైన ముఖ్యులను వారికి తృప్తి కలిగేటట్టుగా భుజింప చేయాలి. అందువల్ల బ్రహ్మవిష్ణు శంభులు తృప్తులౌతారు ఇందులో అనుమానం లేదు. (138) అగ్నిష్వత్తాది పితరులు అట్లాగే ఇంద్రాది దేవతలు తృప్తులౌతారు. ఎక్కువగా చెప్పటం ఎందుకు దానితో జగత్త్రయము తుష్టమౌతుంది (139) మహాలయ శ్రాద్ధమును పార్వణ విధానంతో చేయాలి. నరుడు మహాలయ శ్రాద్ధమందు పితృవంశమందలి పితరులను వలె (140) మాతృ వంశమందలి పితరులను కూడా సంతోషంతో శ్రేయస్సు కొరకు భుజింప చేయాలి. తన విత్తమున కనుగుణంగా శక్తి కొలది దక్షిణను కూడా ఇవ్వాలి (141) ఆ మహాలయ శ్రాద్ధంతో విత్త శాఠ్యము చేయరాదు. యజ్ఞములకు దక్షిణ ఆవులుగా చెప్పబడింది. (పురోగవునితో) (142) మార్గంలో పురోగవులతో (ముందు ఆవులుంటే) శ్వాస హీనం చేయబడ్డట్టు (దుమ్మువల్ల) ఆ పితృయజ్ఞం కూడా దక్షిణ లేకపోతే హీనమౌతుంది (143) అందువల్ల యజ్ఞములందు తెలుసుకొని దక్షిణ అల్పంగానైనా ఇవ్వాలి. విధవలైన స్త్రీలుకూడా అపుత్రులైనవారుకూడా మహాలయమును (144) తమ భర్తల గురించి అధిక భోజన కర్మతో చేయాలి. లేని పక్షంలో ధర్మహాని కల్గుతుంది. గొప్పనరకం సంభవిస్తుంది. (145)

మూ|| మాసిభాద్రపదేప్రాప్తేయోనకుర్యాన్మహాలయం | తత్కులంనాశమాప్నోతి బ్రహ్మత్యాంచ విదంతి ||146||

మహాలయం ప్రకుర్వంతి శ్రద్ధావంతః పితౄన్స్రతి | సతేషాం సంతతిచ్ఛేదో భ##వేత్సంపదభంగురా ||147||

ఆలయం హ్యాస్పదం ప్రోక్తం మహఃకల్యాణముచ్యతే | కల్యాణామాస్పదత్వాత్‌ మహాలయముదీర్యతే ||148||

తస్మాస్మహాలయం మర్త్యః కుర్యాత్కల్యాణ సిద్ధయే | అమంగలం భ##వేత్తస్యనకుర్యచ్చేన్మహాలయం ||149||

న కుర్యాద్యద్య పిశ్రాద్ధం మాతాపిత్రో ర్మృతేహని | కుర్యాన్మహాలయ శ్రాద్ధం అస్మరన్నేవబుద్ధిమాన్‌ ||150||

కుర్తుం మహాలయ శ్రాద్ధం యదిశక్తిర్నవిద్యతే | యాచిత్వాపి నరః కుర్యాత్‌ పితౄణాం తన్మహాలయం ||151||

బ్రాహ్మణభ్యో విశిష్టేభ్యోయాచేతధనధాన్యకం | పతితే భ్యోనగృహ్ణీయాత్‌ ధనధాన్యంకదాచన ||152||

బ్రాహ్మణభ్యోనలభ్యేత యదిధాన్యధనాదికం | యాచేతక్షత్రియ శ్రేష్ఠాత్‌ మహాలయ చికీర్షయా ||153||

దాతారశ్చేన్నభూపాలావైశ్యేభ్యోపిచయాచయేత్‌ | వైశ్యా అపిహిదాతారోయదిలోకే న నంతివై ||154||

దద్యాద్ఛాద్రవదేమాసే గోగ్రాసంపితృత్నప్తయే | అథవారోదనం కుర్యాత్‌ బహిర్నగ్గత్యకాననే ||155||

పాణిభ్యాముదరం స్వీయం ఆహత్యాశ్రూణివర్తయన్‌ | తేష్వరణ్యప్రదేశేషు ఉచ్చైరేవంవదేన్నరః ||156||

శ్రుణ్వంతు పితరః సర్వేమత్కులీనావచోమమ | అహందరిద్రః కృపణోనిర్లజ్జః క్రూరకర్మకృత్‌ || 157 ||

ప్రాప్తోభాద్రపదోమాసః పితౄణాం ప్రీతి వర్ధనః | కర్తుం మహాలయ శ్రాద్ధం సచమేశక్తిరస్తివై || 158 ||

భ్రమిత్వాపి మహీంకృత్స్నాం సమేకించనలభ్యతే | అతోమహాలయ శ్రాద్ధం సయుష్మా కంకరోమ్యహం || 159 ||

క్షమధ్వం మమ తద్యూయం భవంతోహిదయాపరాః | దరిద్రోరోదనం కుర్యాత్‌ ఏవంకాననభూమిషు || 160 ||

తస్యరోదన మాకర్ణ్య పితరస్తత్కులోద్భవాః | హృష్టాన్తృప్తిం ప్రయాంత్యేవసుధాంపీత్వైవనిర్జరాః || 161 ||

మహాలయార్ధేవిప్రౌఘే భుక్తేతృప్తిర్యథా భ##వేత్‌ | గోగ్రాసారణ్యరుదితైః పితృతృప్తిస్తథా భ##వేత్‌ || 162 ||

తా || భాద్రపద మాసం వచ్చాక మహాలయము చేయని నరుని కులము నాశనమౌతుంది. బ్రహ్మహత్యను పొందుతాడు (146) శ్రద్ధగలవారు పితరుల గూర్చి మహాలయమాచరిస్తారు. వారికి సంతతిచ్ఛేదముకాదు. ఎడతగెని సంపద లభిస్తుంది. (147) ఆలయము అనగా స్థానము మహా అనగా కల్యాణము కల్యాణమునకు స్థానమైనదికనుక మహాలయమని చెప్పబడింది (148) కనుక కల్యాణం కలిగే కొరకు నరుడు మహాలయమాచరించాలి. మహాలయమాచరించని పక్షంలో అతనికి అమంగలం కల్గుతుంది (149) తల్లిదండ్రులు చనిపోయిన రోజున శ్రాద్ధం చేయకపోయినా, బుద్ధిమంతుడు స్మరించకుండానే మహాలయ శ్రాద్ధమాచరించాలి (150) మహాలయ శ్రాద్ధము చేయటానికి శక్తిలేని పక్షంలో, పితరుల ఆమహాలయాన్ని యాచించియైనా ఆచరించాలి (151) ధనదాన్యమును విశిష్టులైన బ్రాహ్మణుల నుండి యాచించాలి. ధనధాన్యమును ఎప్పుడుకూడా పతితుల నుండి తీసుకోరాదు (152) ధనధాన్యాదికము బ్రాహ్మణుల నుండి లభించని పక్షంలో, మహాలయం చేసే కొరకు క్షత్రియ శ్రేష్ఠులను యాచించాలి (153) రాజులు ఇచ్చేవారు లేని పక్షంలో వైశ్యుల నుండైనా యాచించాలి. లోకంలో వైశ్యులు కూడా ఇచ్చేవాళ్ళు లేని పక్షంలో (154) పితరుల తృప్తి కొరకు గోవుల గ్రాసమును (గడ్డిని) భాద్రపదమాసంలో ఇవ్వాలి. లేని పక్షంలో, బయటికిపోయి అడవిలో ఏడవాలి (155) చేతులతో తన కడుపును కొట్టుకొంటూ కన్నీరు కారుస్తూ, ఆ అరణ్య ప్రదేశములందు గట్టిగా నరుడు ఇట్లా చెప్పాలి (156) మాకులంనకు చెందిన పిలరులందరు నా మాట వినండి. నేను దరిద్రుణ్ణి. కృపణుణ్ణి. సిగ్గులేని వాణ్ణి, క్రూరకర్మ ఆచరించిన వాణ్ణి (157) పితరులకు ప్రీతిని పెంచే భాద్రపదమాసం వచ్చింది. మహాలయ శ్రాద్ధము చేయటానికి నాకు శక్తిలేదు. (158) భూమి అంతా తిరిగినా నాకేమీ లభించటంలేదు. అందువల్ల మహాలయశ్రాద్ధాన్ని మీకొరకు నేను చేయటంలేదు. (159) మీరుదయగల వారైనాఈపనిని మీరు క్షమించండి. దరిద్రుడుఇట్లాగేఅరణ్యప్రదేశములందు ఏడవాలి (160) అతని ఏడుపునువిని ఆతని కులంలో పుట్టిన పితరులు సంతుష్టులై, దేవతలు అమృతాన్ని త్రాగి తృప్తులైనట్లు తృప్తులౌతారు (161) బ్రాహ్మణుల సమూహం మహాలయంకొరకు భుజిస్తే తృప్తిచెందినట్లు గోగ్రాన, అరణ్యరోదనములతో కూడ పితృదేవతల తృప్తి అట్లా కలుగుతుంది. (162)

మూ|| మాసిభాద్రపదేవిఘ్నోయదిస్యాత్సూతకాదినా | యాతేషుసూతకాహఃసుకుర్యాదావృశ్చికావధి || 163 ||

బుధోమహాలయస్యార్థేబ్రాహ్మణాన్వృణుయాన్నవ | ప్రిత్రర్థమేకంపృణుయాత్‌పితామహాకృతేతధా || 164 ||

ప్రపితామహాముద్దిశ్యతథైకంపృణుయాద్ద్విజః | తథామాతామహార్థంతు ఏకంవైపృణుయాద్ద్విజం || 165 ||

మాతుఃపితామహార్థంచపృణుయాద్ద్విజమేకకం | వృణుయాదేకముద్దిశ్యమాతుశ్చప్రపితామహం || 166 ||

తథైవవిశ్వేదేవార్థేవృణుయాద్ద్వౌద్ద్విజోత్తమౌ | విష్ణ్వర్థం బ్రాహ్మణంత్వేకంపృణుయాద్వేదవిత్తమం || 167 ||

ఏవంమహాలయశ్రాద్ధేబ్రాహ్మణాన్వృణుయాన్నవ| అధవాపితృవర్గార్థంవరయేద్విప్రమేకకం || 168 ||

మాతామహాదీన్‌వోద్దిశ్యవరయేద్విప్రమేకకం | విశ్వేదేవార్థమేకంచవిష్ణ్వర్థంచతథావరం | 169 ||

ఏవంవైవరయేద్విప్రాశ్చతురస్తుమహాలయే | బ్రాహ్మణాన్వేదనంపన్నాన్‌నుశీలాన్వరయేత్సుధీః || 170 ||

దుఃశీలాన్వరయేద్యస్తునవైశ్రాద్ధస్యఘాతకః | మాసిభాద్రపదేప్రాప్తేకృష్ణపక్షేవిశేషతః || 171 ||

కుర్యాన్మహాలయశ్రాద్ధంయోనరఃశ్రద్ధయాసహ | సస్నాతః సర్వతీర్థేషుదురాచారమహామతే || 172 ||

అగ్నిష్టోమాదయోయజ్ఞాఃశతమప్యమునాకృతాః | తులాపురుషముఖ్యానిదానాన్యపికృతానివై || 173 ||

చాంద్రాయణాదికృచ్ర్ఛాణికృతాన్యేవనసంశయః | చతుర్ణాంసాంగవేదానాంపారాయణఫలంలభేత్‌ || 174 ||

గాయత్ర్యాదిమహామంత్రజపపుణ్యంలభేత్తథా | ఇతిహాసపురాణానాంపారాయణఫలంలభేత్‌ || 175 ||

మహాలయసమంపుణ్యంవృత్తంనాస్తిమహీతలే | బ్రహ్మవిష్ణుమహేశానలోకప్రాప్తిర్మహాలయాత్‌ || 176 ||

మహాలయాదికంశ్రాద్ధంనిత్యంకామ్యమపీష్యతే | తస్మాదకరణతస్యప్రతవాయోమహాన్భవేత్‌ || 177 ||

కరణాదిష్టసిద్ధిశ్చభవిష్యతినసంశయః | మహాలయన్యకరణాత్‌ భూతవేతాలకాదయః || 178 ||

అపస్మారగ్రహాశ్చాపిశాకినీడాకినీగణాః | యాతుధానాః పిశాచాశ్చ వేతాలాశ్చభయానకః || 179 ||

నశ్యంతితత్‌క్షణాదేవభూతాన్యవ్యానివైతథా | మహాలయస్యకరణాత్‌విపులాంశ్రియమశ్నుతే || 180 ||

తా || భాద్రపద మాసమందు సూతకాదుల వల్ల విఘ్నం వస్తే సూతకపు రోజులు పోయాక వృశ్చిక పర్యంతము మహాలయం చేయాలి (163) బుధుడు మహాలయం కొరకు తొమ్మిది మంది బ్రాహ్మణులను వరణం చేయాలి. పితరుని కొరకు ఒకబ్రాహ్మణుని పితామహుని కొరకొకనిని (164) ప్రపితామహుని కొరకొకబ్రాహ్మణుని వరణం చేయాలి. మాతా మహుని కొరకొకనిని బ్రాహ్మణుని వరణం చేయాలి. (165)మాతృపితామహుని కొరకొకబ్రాహ్మణుని వరణం చేయాలి. తల్లి ప్రపితామహుని గురించి ఒకనిని వరణం చేయలి (166) అట్లాగే విశ్వేదేవుల కొరకు ఇద్దరు బ్రాహ్మణులను వరణం చేయాలి. విష్ణువు కొరకు వేదవిత్తముడైన ఒక బ్రాహ్మణుని ఎన్నుకోవాలి (167) ఈ విధముగా మహాలయ శ్రాద్ధమందు తొమ్మది మంది బ్రాహ్మణులన ఎన్నుకోవాలి. లేదా పితృవర్గము కొరకు ఒక బ్రాహ్మణుని ఎన్నుకోవాలి (168) మాతామహుడు మొదలగు వారికొరకు ఒక బ్రాహ్మణునినిర్ణయించుకోవాలి. విశ్వేదేవుల కొరకొకనిని, విష్ణువు కొరకొకనిని ఎన్నుకోవాలి (169) ఈ విధముగా మహాలయమందు నలుగురు బ్రాహ్మణులను ఎన్నుకోవాలి. బుద్ధిమంతుడు వేదసంపన్నులు, సుశీలులు, ఐన బ్రాహ్మణులను నిశ్చయించుకోవాలి (170) దుఃశీలులను ఎన్నుకున్న వాడు శ్రాద్ధ ఘాతకుడు. భాద్రపద మాసం వస్తే విశేషించి కృష్ణపక్షంలో (171) శ్రద్ధతో కూడి మహాలయశ్రాద్ధము చేసిన నరుడు సర్వతీర్థములందు స్నానమాడినట్లే ఓదురాచార! మహామతి ! (172) ఈతడు అగ్నిష్టో మాది నూరు యజ్ఞములు ఈతడు చేసినట్లే. తులా పురుష ముఖ్యములైన దానములు కూడా ఈతడు చేసినట్లే (173) చాంద్రాయణాది కృచ్ఛ్రములు ఈతడాచరించినట్టే. అనుమానంలేదు. సాంగములైన నాలుగు వేదములు చదివిన ఫలం లభిస్తుంది (174) అట్లాగే గాయత్ర్యాది మహామంత్ర జప పుణ్యము వస్తుంది. ఇతి హాస పురాణముల పారాయణ ఫలము లభిస్తుంది (175) భూమిపై మహాలయముతో సమానమైన పుణ్యవృత్తము మరొకటి లేదు. మహాలయం వల్ల బ్రహ్మవిష్ణు మహేశాన లోకముల ప్రాప్తి కల్గుతుంది. (176) మహాలయాదిక శ్రాద్ధము నిత్యము కామ్యముగూడా. అందువల్ల అదిచేయకపోతే గొప్ప ప్రత్యవాయం కల్గుతుంది. (177) చేయటం వల్ల ఇష్టసిద్ధి కూడా కల్గుతుంది. అనుమానం లేదు. మహాలయం చేయటం వల్ల భూతవేతాల కాదులు (178) అపస్మార గ్రహములు శాకిని డాకిని గణములు, యాతుధానులు పిశాచములు, భయానకమైన వేతాలములు (179) అట్లాగే ఇతరమైన భూతములు కూడా ఆక్షణంలోనే నశిస్తాయి. మహాలయము చేయటం వల్ల అధికమైన శ్రీని పొందుతాడు (180)

మూ || పురాదశరథోరాజా వసిష్ఠస్యోపదేశతః | మాసిభాద్రపదేప్రాప్తే కృత్వాశ్రాద్ధం మహాలయం || 181 ||

రామా దీంశ్చతురః పుత్రాన్‌ ప్రాప్తవాన్‌ లోకసమ్మతాన్‌ | విశ్వాతి శాయినీం లక్ష్మీం ప్రపేదే కీర్తి ముత్తమాం || 182 ||

మహాలయస్యకరణాద్యయాతీ రాజసత్తమః | యదుముఖ్యాన్మహా పుత్రాస్ర్పపేదేవంశవర్ధనాన్‌ || 183 ||

అనన్య దుర్లభం స్వర్గం ప్రపేదే శ్రాద్ధ పుణ్యతః | దుష్టంతో భరతం లేభే మహాలయ విధానతః || 184 ||

మహాలయ విదానేన దమయంతీపతిర్నలః | కృచ్ఛ్రం మహత్తరం తీర్త్వా పునర్లేభే మహీమిమాం || 185 ||

నిజగ్రాహకలింఘోరం పుష్కరం చాప్యరాతినం | ఇంద్రసేనాభిధానం చపుత్రంలేభేతిధార్మికం || 186 ||

హరిశ్చంద్రోమహారాజో మహాలయ విధానతః | విశ్వామిత్రకృతాద్ధుః ఖాన్ముక్తః సత్యవతాంవరః || 187 ||

లేభే చంద్రవతీం భార్యాం లోహితాశ్వం సుతంపునః | మహాలయ విధానేన కృతవీర్యనుతో బలీ || 188 ||

అష్టాదశానాం ద్వీపానాం అధిపత్య మవాస్తవాన్‌ | రామోపి దండకారణ్య మహాలయ విధానతః || 189 ||

హత్వాతురావణం సంఖ్యే సీతాంపునరవాస్తవాన్‌ |మహాలయస్య కరణాత్‌ ధర్మపుత్రో యుధిస్ఠిరః || 190 ||

దుఃఖ సాగరముత్తీర్య ధార్త రాష్ట్రాన్‌ జఘానచ | మహాలయస్య కరణా ద్వసిష్ఠో మునిసత్తమః || 191 ||

అత్రిర్భృగుశ్చ కుత్సశ్చ గౌతమ శ్చాంగి రాస్తథా | కశ్యపశ్చ భరద్వాజో విశ్వా మిత్రశ్చ కుంభజః || 192 ||

పరాశరోమృకండశ్చ యే చాన్యేముని సత్తమాః | విధాయవిధి వచ్ఛ్రాద్ధం మహాలయ మనుత్తమం || 193 ||

అణిమా ద్యష్ట సిద్ధీనాం ప్రతానాం తపసాం తథా | నివాస భూతా సంజాతాస్తథా విశ్వాతిశాయినః || 194 ||

జీవన్ముక్తాశ్చతే సర్వేహ్య భవన్ముని సత్తమాః | అతో మహాలయ శ్రాద్ధం కర్తవ్యం భూతి మిచ్ఛతా || 195 ||

అతోద్యాపి దురాచారన కుర్యాద్యో మహాలయం | భూతవేతాల కాదిభ్యో భూయాత్తన్యమహద్భయం || 196 ||

మహాలయస్యాకరణాత్‌వేతాలత్వమవాప్నుయాత్‌ | త్వయావిష్టమిదంభూతంవిప్రఃసన్‌పూర్వజన్మని || 197 ||

నామ్నా వేదనిధిః పుణ్యో భరద్వాజన్య చాత్మనః | కుశస్థల్యభిధానేచ వసన్‌ గ్రామే మహామునిః || 198 ||

సచకారవిధానే శ్రాద్ధమేతన్మహాలయం | తతోయం పితౄణాం శాపాత్‌ వేతాలత్వమవాస్తవాన్‌ || 199 ||

తస్మాద్భాద్రపదేమాసే దురాచార పితౄన్ర్పతి | బ్రాహ్మణాన్భోజయాన్నేన షడ్రసేన న భక్తికం || 200 ||

తా || పూర్వం దశరథుడను రాజు వసిష్ఠుని ఉపదేశం వల్ల భాద్రపదమాసం రాగా మహాలయ శ్రాద్ధము చేసి (181) లోకసమ్మతులైన రామాదులైన నలుగురు పుత్రులను పొందాడు. విశ్వాతిశాయియైన లక్ష్మిని ఉత్తమమైన కీర్తిని పొందాడు. (182) రాజ సత్తముడైన యయాతి మహాలయం చేయటం వలన వంశ వర్ధనులైన యదు ముఖ్యులైన మహా పుత్రులను పొందాడు (183) శ్రాద్ధ పుణ్యం వలన అనన్యదుర్లభ##మైన స్వర్గములను పొందాడు మహాలయవిధానమువలనదుష్యంతుడు భరతునిపొందాడు (184) దమయంతి పతియైన నలుడు మహాలయ విధానము వలన మహత్తరమైన కష్టములను దాటి ఈ భూమిని తిరిగి పొందాడు. (185) ఘోరమైన కలిని పుష్కరుడను శత్రువును పట్టుకొన్నాడు. జయించాడు. అతి ధార్మికుడైన ఇంద్రసేనుడను పేరుగల పుత్రుని పొందాడు (186) హరిశ్చంద్ర మహారాజు మహాలయ విధానం వల్ల విశ్వామిత్రుడు చేసిన దుఃఖము నుండి ముక్తుడై సత్యవంతులలో శ్రేష్ఠుడైనాడు (187) చంద్రవతి అను భార్యను లోహితాశ్వుడను పుత్రుని పొందాడు. కృతవీర్యసుతుడైన బలవంతుడు మహాలయ విధానంవల్ల (188) అష్టాదశ ద్వీపములకు ఆధిపత్యమును పొందాడు. రాముడు కూడా దండకారణ్యంలో మహాలయ విధానం వల్ల (189) యుద్ధమందు రావణుని చంపి తిరిగి సీతను పొందాడు. మహాలయమును చేయటం వలన ధర్మపుత్రుడైన యుధిష్ఠిరుడు (190) దుఃఖ సాగరమును దాటి ధార్త రాష్ట్రులను చంపాడు కూడా. మహాలయాన్ని చేయటం వలన ముని సత్తముడైన వసిష్ఠుడు (191) పరాశరుడు, మృకండుడు ఇతరముని సత్తములు, ముఖ్యమైన మహాలయ శ్రాద్ధమును విధి ప్రకారము చేసి (193) అణిమాద్యష్ట సిద్ధులకు వ్రతములకు, తపస్సులకు నివాస భూతులైనారు.అట్లాగే లోకాతిశాయులైనారు (194) ఆముని సత్తములందరు జీవన్ముక్తులైనారు కూడా. అందువల్ల మహాలయ శ్రాద్ధమును అభివృద్ధి కోరుకునే వాడు ఆచరించాలి. (195) అందువల్ల ఇప్పటికి గూడా మహాలయ మాచరించని వానికి భూతవేతాల కాదులతో గొప్ప భయముంటుంది. ఓ దురాచార ! (196) మహాలయమాచరించనందువల్ల వేతాలత్వాన్ని పొందుతారు. నిన్నావహించిన ఈ భూతము పూర్వజన్మలో బ్రాహ్మడై ఉండి (197) వేద నిధి అని పేరు గలిగిన పుణ్యుడు. తనవాడైన భరద్వాజుని యొక్క కుశస్థలి అను పేరు గల గ్రామంలో ఉంటూ మహా మనస్సు గల (198) ఈతడు ఈ మహాలయ శ్రాద్ధాన్ని విధానం ప్రకారము చేయలేదు. అందువల్ల ఈతడు పితరుల శాపం వల్ల వేతాలత్వమును పొందాడు. (199) అందువల్ల ఓ దురాచార ! భాద్రపద మాసమందు పితరులను గూర్చి భక్తి పూర్వకముగా షడ్రసాన్నముతో బ్రాహ్మణులను భుజింపచేయి (200).

మూ || దారిద్ర్యం తే న తేనస్యాత్‌ సుఖీచైవ భవాన్భవేత్‌ | మహాపాతకి సంసర్గం మాకురుత్వమితః వరం || 201 ||

త్వయానుభూతం యద్దుఃఖం వేతాల గ్రహణోద్భవం | గచ్ఛత్వం అనుజానామి స్వదేశం ప్రతిమాచిరం || 202 ||

ఇతీరితః సమునినా దత్తాత్రేయేణయోగినా | తంప్రణమ్యయ¸°దేశంకృతార్థేనాంతరాత్మనా || 203 ||

గత్వాచ స్వగృహం విప్రో దురాచారో ద్విజోత్తమాః | విముక్త వేతాలభయో గత పాతక కంచుకః || 204 ||

దత్తాత్రేయేరితేనాసౌ మార్గేణ ప్రీత మాససః | త్యక్త పాతకి సంసర్గః స్వాశ్రమాచార తత్పరః || 205 ||

రామచంద్ర ధనుష్కోటి తీర్థమజ్జన గౌరవాత్‌ | దేహాంతే వరమాం ముక్తిం దురాచారో య¸°తదా || 206 ||

శ్రీ సూత ఉవాచ -

ఏవంవః కథితం పుణ్యం దురాచార విమోక్షణం | సేయం పుణ్యాధనుష్కోటిః మహాపాతకనాశినీ || 207 ||

యత్రహిస్నానమాత్రేణ దురాచారో విమోచితః | అథవాధనుష కోటేరియత్తా కింహివైభ##వేత్‌ || 208 ||

యానిష్కృతి విహీనాని పాపాన్య పి వినాశ##యేత్‌ | ప్రాయశ్చిత్త విహీనానియాని పాపాని సంతివై || 209 ||

తాన్యప్యత్ర వినశ్యంతి ధనుష్కోటౌనిమజ్జనాత్‌ | శూద్రేణ పూజితం లింగం విష్ణుం యోనమేద్ద్విజః || 210 ||

స్రాయశ్చిత్తం సతస్యోక్తం స్మృతిభిః పరమర్షిభిః | నశ్యేత్త స్యాపి తత్పావం ధనుష్కోటినిమజ్జనాత్‌ || 211 ||

విప్రనిందాకృతాం నౄణాం ప్రాయశ్చిత్తంనవిద్యతే |విశ్వాస ఘాతకానాంచ కృతఘ్నానాం న నిష్కృతిః || 212 ||

cభాతృభార్యారతానాంచ ప్రాయశ్చిత్తం నవిద్యతే | శూద్రాన్నే నియతానాంచ శ్రుతి నిందారతాత్మనాం || 213 ||

కన్యావిక్రయిణాం విప్రాహయవిక్రయిణాంతథా | దేవ విక్రయిణాం వేదవిక్రయే నిరతాత్మనాం || 214 ||

ధర్మ విక్రయిణాం పుంసాం వ్రత విక్రయిణాం తథా | తీర్థవిక్రయిణాం పుంసాం ప్రాయశ్చిత్తం సవిద్యతే || 215 ||

తేషాం పాపాని నశ్యంతి ధనుష్కోటౌ నిమజ్జనాత్‌ | మాతృద్రోహ పితృద్రోహ యతి ద్రోహరతాత్మనాం || 216 ||

గురునిందా పరాణాంచ శివనిందారతాత్మనాం | విష్ణునిందావరానాంచ యతినిందారతాత్మనాం || 217 ||

సత్కథా దూషకానాంచ ప్రాయశ్చిత్తం స విద్యతే | తేషాం చాత్ర ధనుష్కోటౌ స్నానాచ్ఛుద్ధిర్భవిష్యంతి || 218 ||

ఏవంవః కథితం విప్రాః ధనుష్కోటే స్తువైభవం | యచ్ఛ్రుత్వాసర్వపాపేభ్యోముచ్యతే మానవోభువి || 219 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే ధనుష్కోటి ప్రశంసాయం దురాచార సంసర్గదోషశాంతి వర్ణనం నామ షట్‌ త్రింశోధ్యాయః || 36 ||

తా || దానితో నీకు దారిద్ర్యముండదు. నీవు సుఖివౌతావు. ఇక ముందు నీవు మహా పాతకి సంసర్గము చేయకు (201) వేతాలుడు పట్టుకోవటం వల్ల కల్గిన దుఃఖాన్ని అనభవించావు కదా. నీవు వెళ్ళు. వెళ్ళుటకు అనుమతిస్తున్నాను. ఆలస్యం చేయకుండా నీ దేశానికి పో (202) అని మునియైన దత్తాత్రేయ యోగి చెప్పగా ఆతడు ఆతనికి నమస్కరించి కృతార్థమైన అంతరాత్మతో తన దేశానికి వెళ్ళాడు. (203) ఓ బ్రాహ్మణులార ! విప్రుడైన దురాచారుడు తన ఇంటికి వెళ్ళి వేతాల భయంవదలిని వాడై పాతకముల కవచము పోయినవాడై (204) సంతుష్ఠమనస్కుడై ఈతడు దత్తాత్రేయుడు చెప్పిన మార్గంలో పాతకి సంసర్గం వదలి స్వాశ్రమ ఆచారతత్పరుడై (205) రామచంద్ర ధనుష్కోటి తీర్థంలో మునిగిన గౌరవం వల్ల దురాచారుడు అప్పుడు దేహాంతమందు పరమ ముక్తిని పొందాడు (206) శ్రీ సూతులిట్లనిరి - ఈ విధముగా మీకు పుణ్యమైన దురాచార విమోక్షణమును చెప్పాను. ఈ ధనుష్కోటి పుణ్యప్రదమైనది మహాపాతకములను నశింపచేసేది (207) అక్కడ స్నానం చేసినంత మాత్రం చేత దురాచారుడు విముక్తుడైనాడు. ధనుష్కోటి మహత్తు ఇంతేనా (208) నిష్కృతి విహీనములైన పాపములను కూడా ఇది నశింపచేస్తుంది. ప్రాయశ్చిత్తములేని పాపములను కూడా (209) ధనుష్కోటి స్నానము నశింపచేస్తుంది. శూద్రుడు పూజించిన లింగమును కాని విష్ణువును కాని బ్రాహ్మణుడు నమస్కరించిన (210) దానికి ప్రాయశ్చిత్తము లేదు స్మృతులు పరమర్షులు చెప్పలేదు. ఆతని ఆ పాపము కూడా ధనుష్కోటి స్నానం వల్ల పోతుంది (211) విప్రనింద చేసిన నరులకు ప్రాయశ్చిత్తము లేదు. విశ్వాసఘాతకులకు కృతఘ్నలకు నిష్కృతి లేదు (212) భ్రాతృభార్యను పొందిన వానికి ప్రాయశ్చిత్తము లేదు. శూద్రాన్నము నిత్యమైన వానికి శ్రుతినిందారతులకు (213) కన్యావిక్రయులకు హయవిక్రయులకు, దేవవిక్రయులకు వేద విక్రయం యందే నిరతులైన వారికి (214) ధర్మవిక్రయు లకు, వ్రతవిక్రయులకు, తీర్థవిక్రయులకు వీరందరికి ప్రాయశ్చిత్తము లేదు (215) ధనుష్కోటి స్నానం వల్ల వారి పాపాలు పోతాయి. మాతృద్రోహి పితృద్రోహయతి ద్రోహములందు ఆసక్తి గలవారికి (216) గురునిందా వరులకు శివ నిందారతులకు విష్ణునిందా పరులకు యతి నిందారతులకు (217) సత్కధలను ధూషించేవారికి ప్రాయశ్చిత్తము లేదు. వారికి ఇక్కడ ధనుష్కోటి యందు స్నానం వల్ల శుద్ధి కల్గుతుంది. (218) ఈ విధముగా మీకు ధనుష్కోటి వైభవాన్ని చెప్పాను. భూమి యందు మానవుడు దీనిని విని అన్ని పాపముల నుండి ముక్తులౌతాడు (219) అని శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు ధనుష్కోటి ప్రశంస యందు దురాచారుని సంసర్గ దోషశాంతి వర్ణన మనునది ముప్పది ఆరవ అధ్యాయము || 36 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters