Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది ఐదవ అధ్యాయము

మూ|| యజ్ఞదేవ ఉవాచ -

దుర్వాసర్షే మహా ప్రాజ్ఞ పరాపర విచక్షణ| దుర్వినీతాభిదఃకోయం యోసౌగుర్వంగనామగాత్‌ || 1 ||

కస్యపుత్రోధనుష్కోటౌ స్నానేసనకథంద్విజః | తత్‌క్షణాన్ముముచేపాపాత్‌ గురుస్త్రీగమసంభవాత్‌

ఏతన్మేశ్రద్ధధాసన్యవిస్తరాద్వక్తుమర్హసి || 2 ||

దుర్వాసాఉవాచ -

పాండదేశేపురాకశ్చిత్‌బ్రాహ్మణోభూద్బహుశ్రుతః || 3 ||

ఇధ్మవాహాభిధోనామ్నాతస్యభార్యారుచిన్త థా | బభూపతవ్యతనయోదుర్విసీతాభిధోద్వాజః || 4 ||

బాల్యేపయసిపుత్రస్యమమారజనకోస్యవై | దుర్విసీతఃసితుస్తన్యసకృత్వాచౌర్థ్వదైహికం || 5 || కంచిత్కాలంగృహేవాత్సీన్మాత్రావిధపయాసహ | తతోదుర్భిక్షమభవత్‌ద్వాదశాబ్దమపర్షణాత్‌ || 6 ||

తతోదేశాంతరమగాత్‌మాత్రాసాకంద్విజోత్తమ | గోకర్ణంసనమాసాద్యసుభిక్షంధాన్యసంచయైః || 7 ||

ఉవాససుచిరంకాలమాత్రావిధపయాసహా | తతోబహుతిథేకాలేదుర్వినీతోగతేనతి || 8 ||

పూర్వదుష్కర్మపాకేనమూఢబుద్ధిరహోబత | అనంగశరవిద్ధాంగోరాగాద్వికృతమానసః || 9 ||

మామేతివాదినీమంబాంబలాదాకృష్యపాతకే | బుభుజేకామమోహాత్మామైథునేసద్విజోత్తమ || 10 ||

సఖిన్నోధుర్వినీతోయంరేతఃసేకాదనంతరం | మనసాచింతయన్‌పాపంరురోదభృశదుఃభితః || 11 ||

అహోతిపాపకృదహంమహాపాతకినాంపరం అగమంజననీంయస్మాత్‌కామబాణవశానుగః ||12 ||

ఇతిసంచింత్యమనసాతత్రమునిసన్నిధౌ | జుగుప్సమానశ్చాత్మానంతాన్మునీనిదమబ్రవీత్‌ || 13 ||

గురుస్త్రీగమపాపస్యప్రాయశ్చిత్తంమమద్విజాః | వదధ్వంశాస్త్రతత్వజ్ఞాఃకృపయామయికేవలం || 14 ||

మరణాన్నిష్కృతిఃస్యాచ్చేన్మరిష్యామినసంశయః | భవద్భిరుచ్యతేయత్తుప్రాయశ్చిత్తంమమాధునా || 15 ||

కరిష్యేతద్ద్విజాః సత్యంమరణంవాస్యదేవవా || 15 1/2 ||

తా || యజ్ఞదేవుడడిగాడు - పరాపరవిచక్షణుడ ! మహాప్రాజ్ఞదుర్వాసఋషి ఈదుర్వినీతుడనువాడెవడు. గురువుభార్యను పొందినవాడెవడు (1) ఎవనికొడుకీతడుధనుష్కోటిలోస్నానంవలనఆబ్రాహ్మణుడుఅక్షణంలోనే ఎట్లాముక్తుడైనాడు. గురుస్త్రీ గమసంభవమైనపాపంనుండి. శ్రద్ధగలిగిననాకుదీనినివిస్తరంగాచెప్పవలసినదిఅని అనగా (2) దుర్వాసుడిట్లాఅన్నాడు. పూర్వం పాండ్యదేశంలోబహుశ్రుతడైనొకబ్రాహ్మణుడుండేవాడు (3) అతనిపేరు ఇధ్మవాహుడు. అతనిభార్యరుచి. అతని కుమారుడు దుర్వినీతుడనిపేరుగలవాడుఉండేవాడు (4) ఈతనిచిన్నవయస్సులోనేఈతనితండ్రిచనిపోయాడు. దుర్వినీతుడు తనతండ్రిఔర్ధ్వదైహికకర్మలునిర్వర్తించి (5) కొంతకాలంవిధవయైనతల్లితోఇంట్లోఉన్నాడు. వర్షాలులేనందు వల్లపన్నెండు సంవత్సరాలుదుర్భిక్షమేర్పడింది. (6) ఓద్విజోత్తమ ! ఆతడుతల్లితోపాటువేరేప్రదేశానికి వెళ్ళాడు. ధాన్యరాశులతో సుభిక్షమైన గోకర్ణమునకాతడుచేరి (7) విధవయైనతల్లితోపాటుచాలాకాలమునివసించాడు. పిదపబహుతిథులతోకూడిన కాలంగడిచాక దుర్వినీతుడు (8) పూర్వదుష్కర్మపరిపాకంవల్లమూఢబుద్ధిగలవాడు మన్మధబాణములతోకొట్టబడిన శరీరంకలవాడైరాగంతో వికృతమైనమనస్సుకలవాడై (9) పాతకి,వద్దుంటున్నతల్లిని బలవంతంగాలాగికామమోహితుడై మిధునకర్మద్వారా అనుభవించాడు. (10) రేతఃపతనమైనతరువాతఖిన్నుడైన అదుర్వినీతుడు, మనస్సులోపాపంగురించి ఆలోచిస్తూమిక్కిలి దుఃఖంతోఏడ్చాడు (11) మిక్కలిపాపంచేసినవాణ్ణినేను మహాపాతకులలో శ్రేష్ఠుడనునేను. మన్మథబాణము నకు ఆధీనుడనై తల్లినిపొందినవాణ్ణి (12) మనస్సులో ఆలోచించి, అతను మునులసన్నిధియందు తననుతానుఅసహ్యించు కుంటూ ఆ మునులతో ఇట్లాఅన్నాడు (13) గురుస్త్రీనిపొందినపాపినైననాకుప్రాయశ్చిత్తంచెప్పండి ద్విజులారా ! శాస్త్రతత్వ మెరిగినపెద్ద లారా! నామీదదయతోమాత్రమే ప్రాయశ్చిత్తంచెప్పండి. (14) మరణంవల్లనిష్కృతిలభిస్తే మరణిస్తాను అనుమానంలేదు. మీరు నాకు ఇప్పుడు చెప్పేప్రాయశ్చిత్తాన్ని (15) ఆచరిస్తాను ఓద్విజులారాసత్యమిది. మరణమైనామ రేదైనాచేస్తాను (151/2).

మూ || తచ్ఛృత్వాపచనంతస్యకేచిత్తత్రమునీశ్వరాః || 16 ||

అనేనసాకంవార్తాతుదోషాయేతివినిశ్చితా | మౌనిత్వంభేజిరేకేచిత్‌మునయఃకేచిదాభృశం || 17 ||

దుష్టాత్మామాతృగామీత్వంమహాపాతకినాంపరః | గచ్ఛగచ్ఛేతిబహుశోవాచమూచుర్ద్విజోత్తమాః || 18 ||

తాన్నివార్యకృపాశీలః సర్వజ్ఞఃకరుణానిధిః | కృష్ణద్వైపాయనస్తత్ర దుర్వినీతమభాషత ||19 ||

గచ్ఛాశురామసేతౌత్వం ధనుష్కోటీసహాంబయా | మకరస్థేరవౌమాఘేమాసమేకంనిరంతరం || 20 ||

జితేంద్రియోజితక్రోథఃపరద్రోహవివర్జితః | ఏకమాపంనిరాహారఃకురుస్నానంసహాంబయా || 21 ||

పూతోభవష్యస్యద్థాత్వం గురుస్త్రీగమదోషతః | యత్పాతకంసనశ్యేతసేతుస్నానేనతన్నహి || 22 ||

శ్రుతిస్మృతిపురాణషు ధనుష్కోటిప్రశంసనం | బహుధాభణ్యతేపంచ మహాపాతకనాశనం || 23 ||

తస్మాత్త్వంత్వరయాగచ్ఛ ధనుష్కోటింసహాంబయా | ప్రమాణంకురుమద్వాక్యంవేదవాక్యమివద్విజ || 24 ||

శ్రీరామధనుషఃకోటిస్నాతస్యద్విజపుత్రక | మహాపాతకకోట్యోసినైవక్ష్యాఇతీవహి || 25 ||

ప్రాయశ్చిత్తాంతరంప్రోక్తంమన్వావాదిస్మృతిభిః స్మృతౌ | తద్గచ్ఛత్వంధనుష్కోటింమహాపాతకనాశినీం || 26 ||

ఇతీరితోథవ్యాసేనదుర్వినీతోద్విజోత్తమాః | మాత్రాసాకంధనుష్కోటింసత్వావ్యాసంచనిర్య¸° || 27 ||

మకరస్థేరవౌమాఘేమాసమాత్రంనిరంతరం | మాత్రాసహనిరాహారోజితక్రోదోజితేంద్రియః || 28 ||

శ్రీరామధనుషఃకోటౌసన్నసంకల్పపూర్వకం | రామనాథంసనమస్కుర్వన్‌త్రికాలంభక్తిపూర్వకం || 29 ||

మాసాంతేపారణాంకృత్వామాత్రాసహవిశుద్ధధీః | వ్యాసాంతికంపునఃప్రాయాత్‌తసై#్మవృత్తంనివేదితుం || 30 ||

సవ్రణమ్యపునర్వ్యానందుర్వినోతోబ్రవీద్వచః || 31 ||

తా || అతనిమాటలనువిని అక్కడకొందరుమునీశ్వరులు (16) ఈతనితోకూడామాట్లాడటంకూడా దోషమేఅని నిశ్చ యించుకొని కొందరుమౌనంగా ఉన్నారు. మరికొందరుమునులువేగంగా (17) దుష్ట్వాత్మ, మాతృగామినీవుమహాపాతకులలో మొదటివాడవువెళ్ళు వెళ్ళు అనిఅనేకసార్లుఅన్నారు. (18) వారందరినివారించిదయగలవాడు సర్వజ్ఞుడు కరుణానిధికృష్ణద్వైపాయనుడుఅక్కడదుర్వినీతునితో ఇట్లాఅన్నాడు. (19) నీవురామసేతువునకు ధనుష్కోటికిమీతల్లితోపాటుత్వరగావెళ్ళు. మాఘమాసంలో సూర్యుడుమకరరాశియందుండగాఒకనెలరోజులునిరంతరముగా (20) జితేంద్రియుడవై, క్రోధమును జయించినవాడవై పరద్రోహాన్నివదలి ఒకనెలరోజులు ఆహారంలేకుండా మీతల్లితోకూడిస్నానమాచరించు (21) గురు- స్త్రీగమనదోషంనుండి పవిత్రుడవౌతావు. సేతుస్నానంతోనశించనిపాతకములేదు. (22) శ్రుతిస్మృతిపురాణములలోధనుష్కోటి ప్రశంసచాలాసార్లు చెప్పబడింది. పంచమహాపాతకములనశింపచేసేది (23) అందువల్లనీవునీతల్లితోకలిసి ధనుష్కోటికి త్వరగావెళ్ళు. వేదవాక్యమువలె నామాటను ప్రమాణంగా స్వీకరించు (24) ఓ బ్రాహ్మణపుత్ర! శ్రీరామధనుష్కోటియందు స్నానంచేసినవానికి మహాపాతకకోటులు కూడా లక్ష్యంకావు అనిగదా అంటారు (25) స్మృతియందుమన్వాదిస్మృతులలోమరొక ప్రాయశ్చిత్తముచెప్పబడింది. అందువల్ల మహాపాతకనాశినియైన ధనుష్కోటికి నీవు వెళ్ళు (26) అని వ్యాసుడు చెప్పగా దుర్వినీతుడు వ్యాసునకు నమస్కరించి తల్లితో సహాధనుష్కోటికి వెళ్ళాడు (27) సూర్యుడు మకరరాశి యందుండగా మాఘమాసమందు నెలరోజులు నిరంతరము తల్లితో కూడి నిరాహారుడు జితక్రోధుడు జితేంద్రియుడై (28) శ్రీ రామధనుష్కోటి యందు సంకల్ప పూర్వకముగా స్నానం చేశాడు. రామనాథుని మూడు కాలములందు భక్తి పూర్వకముగా నమస్కరిస్తూ (29) నెలచివర పారణ చేసితల్లితోసహా శుద్ధమైన బుద్ధి కలవాడై వ్యాసునకుతనవృత్తాంతాన్ని తెలుపడానికై తిరిగి అతని దగ్గరకు వచ్చాడు (30) అతడు వ్యాసునకు నమస్కరించి ఆ దుర్వినీతుడు ఇట్లా అన్నాడు (31)

మూ || దుర్వినీత ఉవాచ -

భగవస్కరుణాసింధో ద్వైపాయన మహోత్తమ | భవతః కృపయా రామధనుష్కోటౌ సహాంబయా

మాఘమాసే నిరాహారో మాస మాత్రమతంద్రితః || 32 ||

అహంత్వకరవం స్నానం నమస్కుర్వన్మహేశ్వరం | ఇతః వరం మయావ్యాస భగవన్భక్తవత్సల || 33 ||

యత్కర్తవ్యం మునేతత్వం మమోపదిశతత్వతః |

ఇతితస్యవచఃశ్రుత్వాదుర్వినీతస్యవైమునిః | బభాషే దుర్వినీతంతం వ్యాసోనారాయణాంశకః || 34 ||

వ్యాస ఉవాచ -

దుర్వినీత గతంతేద్య పాతకం మాతృసంగజం || 35 ||

మాతుశ్చపాతకం నష్టంత్వత్సంగతి నిమిత్తజం | సందేహోనాత్రకర్తవ్యః సత్యముక్తంమయాతవ || 36 ||

బాంధవాః స్వజనాః సర్వేతధాన్యే బ్రాహ్మణాశ్చయే | సర్వేత్వాం సంగ్రహీష్యంతి దుర్వినీతాం బయాసహ || 37||

మత్ర్పసాదాద్ధనుష్కోటౌ విశుద్ధస్త్వం నిమజ్జనాత్‌ | దారసంగ్రహణం కృత్వాగార్హస్థ్యం ధర్మమాచర || 38 ||

త్యజత్వంప్రాణిహింసాంచ ధర్మం భజసనాతనం | సేవస్వసజ్జనాన్నిత్యం భుక్తిముక్తేసచేతసా || 39 ||

సంధ్యోపాసనముఖ్యాని నిత్యకర్మాణిసత్యజ |నిగృహీష్వేంద్రియ గ్రామ మర్చయస్వ హరం హరిం || 40 ||

పరాపవాదంమాబ్రూయామాసూయాంభవకర్హిచిత్‌ | అన్యస్యాభ్యుదయందృష్ల్వా సంతాపంకృణుమావృథా || 41 ||

మాతృవత్పరదారాంశ్చత్వన్నిత్యమవలోకయ | అధీతవేదాన ఖిలాన్‌ మా విస్మర కదాచన || 42 ||

అతిథీన్మానమస్యస్వశ్రాద్ధం పితృదినేకురు | పైశున్యం మా వదస్వత్వం స్వప్నేప్యన్యస్యకర్హిచిత్‌ || 43 ||

ఇతిహాసపురాణాని ధర్మశాస్త్రాని సంతతం | అవలోకవేదాంతంవేదాంగాని తథాపునః || 44 ||

హరిశంకరనామాని ముక్తీలజ్జోసుకీర్తయ | జాబాలోపనిషన్మంత్రైః త్రిపుండ్రోద్ధూలనం కురు || 45 ||

రుద్రాక్షాన్‌ ధారయసదాశౌచాచారవరోభవ | తులస్యాబిల్వపత్రైశ్చ నారాయణ హరాపుభౌ || 46 ||

ఏకకాలంద్వికాలం వాత్రికాలం చార్చయ స్వభోః | తులసీదల సంమిశ్రం సిక్తం పాదోదకేనచ || 47 ||

నైవేద్యాన్నంసదాభుంక్ష్వశంభునారాయణాగ్రతః | కురుత్వంవైశ్వదేవాఖ్యం బలిమన్న విశుద్ధయే || 48 ||

యతీశ్వరాన్‌ బ్రహ్మనిష్ఠాన్‌తర్పయాన్నైర్‌ గృహాగతాన్‌ | వృద్ధాన న్యాననాథాంశ్చ రోగిణో బ్రహ్మచారిణః || 49 ||

కురుత్వం మాతృశుశ్రూషాంఔపాసన పరోభవ | పంచాక్షరం మహామంత్రం ప్రణవేన సమన్వితం || 50 ||

తథైవాష్టాక్షరం మంత్రం అన్యమంత్రాన పిద్విజ | జపత్వం ప్రయతోభూత్వాధ్యాయన్మంత్రాధి దేవతాః || 51 ||

ఏవమన్యాంస్తథా ధర్మాన్‌ స్మృత్యుక్తాన్‌ సర్వదాకురు | ఏవంకృతవతస్తేస్యాద్దేహాంతే ముక్తిరప్యలం || 52 ||

తా ||దుర్వినీతుని మాట - ఓ ద్వైపాయన ! మహత్తమ ! దయాసముద్ర ! ఓ భగవాన్‌ ! మీదయవల్ల రామ ధనుష్కోటి యందు నాతల్లితోపాటు మాఘమాసంలో నిరాహారుడనై నెలరోజులు కునికిపాట్లు లేకుండ (32) మహేశ్వరుని నమస్కరిస్తూ నేను స్నానం చేశాను. ఇక ముందు ఓ వ్యాస! భక్తవత్సల ! (33) భగవాన్‌! నేనేమి చేయాలో ఓముని! యథార్థాన్ని ఉన్నదున్నట్లుగా నాకుపదేశించండి, అనే ఆ దుర్వినీతుని మాటలను విని ఆ ముని నారాయణాంశకుడైన వ్యాసుడు ఆ దుర్వినీతునితో ఇట్లా అన్నాడు (34) వ్యాసవచనము - మాతృసంగమంవల్ల కల్గిననీపాతకముఈరోజుపోయింది, ఓదుర్వినీతా (35) నీ సంగతితో కల్గినట్టి నీతల్లి పాతకం కూడా పోయింది. ఇందులో అనుమానించాల్సింది లేదు. నేను నీకు నిజం చెప్పాను (36) బాంధవులు, నీ స్వజనులందరు, ఇతర బ్రాహ్మణులు అందరూ నిన్ను స్వీకరిస్తున్నారు. నీ తల్లితో సహ ఓ దుర్వినీత ! (37) నా అనుగ్రహంవల్ల ధనుష్కోటిలో స్నానం చేయటం వల్ల నీవు విశుద్ధుడవైనావు. భార్యను సంగ్రహించి (పెండ్లాడి) గృహస్థ ధర్మాన్నాచరించు (38) ప్రాణి హింసను వదలు. సనాతన ధర్మాన్ని సేవించు. భక్తితో కూడిన మనస్సుతో ఎప్పుడూ సజ్జనులను సేవిస్తూ ఉండు (39) సంధ్యోపాసన మొదలైన ముఖ్యమైన నిత్య కర్మలను వదలకు. ఇంద్రియ సమూహమును అరికట్టు శివకేశవులను పూజించు (40) ఇతరుల అపవాదాన్ని చెప్పకు. ఎప్పుడూ అసూయపడకు. ఇతరుల అభివృద్ధిని చూసి వ్యర్థంగా సంతాప పడకు (41) ఇతరుల భార్యలను నీ తల్లివలె నీవు నిత్యం గౌరవించు చదివిన వేదముల నన్నిటిని ఎప్పుడూ మరువకు (42) అతిధులను అవమానపరచకు. పితృదినమందు శ్రాద్ధంచేయి. కలలో కూడా ఇతరుల కొండెకాడి లక్షణాన్ని నీవు ఏవిధంగాను చెప్పవద్దు (43) ఇతిహాసపురాణములు, ధర్మశాస్త్రములు ఎల్లప్పుడు చదువుతూ ఉండు. అట్లాగే వేదాంతము, వేదాంగములు కూడా (44) హరి శంకరుల నామములను సిగ్గుపడకుండా కీర్తించు. జాబాలో పనిషన్మంత్రములతో త్రిపుండ్రమును పైకితీయు (45) ఎప్పుడు రుద్రాక్షలను ధరించి శౌచాచార వరుడవుకమ్ము. తులసితో బిల్వపత్రములతో నారాయణ హరులను ఇద్దరిని (46) ఒకసారి రెండు సారులు, లేదా త్రికాలమందు పూజించు శంభునారాయణుల ఎదుట తులసీ దళముతో కూడిన భగవత్‌ పాదోదకముతో తడిపిన (47) నైవేద్యాన్నమును ఎప్పుడు భుజించు అన్న విశుద్ధికొరకు వైశ్వదేవమను బలిని నీవు ఆచరించు (48) ఇంటికి వచ్చిన బ్రహ్మనిష్ఠులైన యతీశ్వరులను, అన్నములతో తృప్తి పరచు వృద్ధులైన ఇతర అనాథలను రోగులను బ్రహ్మచారులను అన్నముతో తృప్తి పరచు (49) నీవు మాతృశుశ్రూషను చేయి.ఔపాసన పరుడవు కమ్ము. ప్రణవముతో కూడిన పంచాక్షర మహామంత్రాన్ని (50) అట్లాగే అష్టాక్షరమంత్రాన్ని ఇతర మంత్రములను కూడా, మంత్రాధి దేవతలను కూడా ధ్యానం చేస్తూ పరిశుద్ధుడవై నీవు జపించు. (51) ఈ విధముగా స్మృతులలో చెప్పబడిన ఇతర ధర్మములను కూడా ఎప్పుడూ ఆచరించు. ఈ విధంగా చేస్తే నీకు దేహాంతమందు ముక్తి లభిస్తుంది. ఇక చాలు (52)

మూ || ఇత్యుక్తో వ్యాస మునినా దుర్వినీతః ప్రణమ్యతం | తదుక్తమఖిలంకృత్వాదేహాంతేముక్తిమాస్తవాన్‌ || 53 ||

తన్మాతాపి మృతాకాలే ధనుష్కోటి నిమజ్జనాత్‌ | అవావ పరమాం ముక్తిం అపునర్భవదాయనీం || 54 ||

దుర్వాసా ఉవాచ -

ఏవంతే దుర్వినీతస్యతన్మాతుశ్చ విమోక్షణం | ధనుష్కోట్యభిషేకేణ యజ్ఞదేవమయేరితం || 55 ||

పుత్రమేనంత్వమస్యాశు బ్రహ్మహత్యా విశుద్ధయే | సమాదాయ వ్రజ బ్రహ్మన్‌ ధనుష్కోటిం విముక్తిదాం || 56 ||

సింధుద్వీప ఉవాచ -

ఇతి దుర్వాససాప్రోక్తోయజ్ఞదేవోనిజంసుతం | సమాదాయయ¸°రామధనుష్కోటిం విముక్తిదాం || 57 ||

గత్వానివాసమకరోత్‌ షణ్మాసంతత్రసద్విజః | పుత్రేణ సాకం నియతోహెనృగాలప్లవంగమౌ || 58 ||

ససస్నౌచ ధనుష్కోటౌ షణ్మానం వైసపుత్రకః | షణ్మాసాంతేయజ్ఞదేవం ప్రాహ వాగశరీరిణీ || 59 ||

విముక్తా యజ్ఞదే వస్య బ్రహ్మహత్యానుతస్యతే | స్వర్ణస్తేయాత్‌ సురాపానాత్‌ కిరాతీ సంగమాత్తథా || 60 ||

అన్యేభ్యోపిహిపాపేభ్యోవిముక్తోయం సుతస్తవ | సంశయం మాకురుష్వత్వం యజ్ఞదేవద్విజోత్తమ || 61 ||

ఇత్యుక్త్వా విరరామాథ సాతువాగశరీరిణీ | తదాశరీరిణీ వాక్యం యజ్ఞదేవః సశుశ్రువాన్‌ || 62 ||

సంతుష్టః పుత్రసహితో రామనాథం నిషేవ్యచ | ధనుష్కోటిం నమస్కృత్య పుత్రేణ సహితస్తదా || 63 ||

స్వదేశంప్రయ¸°హృష్టః స్వగ్రామం స్వగృహంతథా | సపుత్రదారః సుచిరం సుఖమాస్తే సునిర్వృతః || 64 ||

సింధుద్వీప ఉవాచ -

గోమాయువానరావేవం యువయోః కథితం మయా | యజ్ఞదేవసుతస్యాస్య సుమతేః పరిమోక్షణం || 65 ||

పాతకేభ్యోమహద్భ్యశ్చ ధనుష్కోటౌ నిమజ్జనాత్‌ | యువామతో ధనుష్కోటింగచ్ఛతం పాపశుద్ధయే

నాన్యథా పాపశుద్ధిః స్యాత్‌ ప్రాయశ్చిత్తాయుతైరపి | || 66 ||

శ్రీసూత ఉవాచ -

సింధుద్వీపస్యవచన మితిశ్రుత్వాద్విజోత్తమాః || 67 ||

నృగాల వానరావాశు విలంఘిత మహాపథౌ | ధనుష్కోటిం ప్రయాసేనగత్వాస్నాత్వాచతజ్జలే || 68 ||

విముక్తా సర్వపాపేభ్యో విమానపరసంస్థితౌ | దేవైః కుసుమవర్ణేణ కీర్యమాణౌ సుతేజసా || 69 ||

హరకే యూరముకుటకటకాది విభూషితౌ | దేవస్త్రీ ధూయమానాభ్యాం చామరాభ్యాం విరాజితౌ

గత్వాదేవపురీం రమ్యాం ఇంద్రస్యార్ధాససంగతౌ | || 70 ||

శ్రీ సూత ఉవాచ -

యుష్మాకమేవంకథితం నృగాలస్యకపేరపి || 71 ||

పాపాద్విమోక్షణం విప్రాధనుష్కోటౌ నిమజ్జనాత్‌ | భక్త్వాయిఇమ మధ్యాయం శ్రుణోతి పఠతేసివా || 72 ||

స్నానజంఫలమాప్నోతి ధనుష్కోటౌ సమానవః | యోగివృందైరసులాభాం ముక్తిమప్యాశువిందతి || 73 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే ధనుష్కోటి ప్రశంసాయాం నృగాల వానర విమోక్షణ వర్ణనంనామ పంచత్రింశోధ్యాయ || 35 ||

తా || అని వ్యాసముని చెప్పగా దుర్వినీతుడు ఆతనికి నమస్కరించి, ఆతడు చెప్పినదంతా చేసి దేహాంతమందు ముక్తిని పొందాడు (53) ఆతనితల్లి కూడా ధనుష్కోటి యందు స్నానమాడి మరణమురాగానే మరణించి, మరల పుట్టుకరానటువంటి పరమమైన ముక్తిని పొందింది (54) దుర్వాసుడు ఇట్లన్నాడు - ఈ విధముగా దుర్వినీతునికి మరి ఆతని తల్లికి ధనుష్కోటి స్నానం వల్ల ముక్తి లభించటం గూర్చి ఓ యజ్ఞదేవ ! నేను నీకు చెప్పాను (55) నీవు కూడా ఈ కుమారుని బ్రహ్మహత్య నుండి విశుద్ధి కొరకు తొందరగా విమోచనాన్నిచ్చే ధనుష్కోటికి తీసుకొని వెళ్ళు, ఓ బ్రహ్మన్‌! (56) సింధు ద్వీపుడిట్లా అన్నాడు - అని దుర్వాసుడనగా యజ్ఞదేవుడు తన కుమారుని తీసుకొని విముక్తినిచ్చే రామ ధనుష్కోటికి వెళ్ళాడు (57) వెళ్ళి అక్కడ ఆ బ్రాహ్మణుడు ఆరునెలలు నివాసమున్నాడు. ఓ నృగాల ప్లవంగములార ! కొడుకుతో పాటు నియమముగా ఉన్నాడు (58) కొడుకుతో పాటు ఆతడు ధనుష్కోటి యందు ఆరునెలలు స్నానం చేశాడు కూడ. ఆరునెలల చివర అశరీరవాణి యజ్ఞదేవునితో ఇట్లా అంది (59) యజ్ఞదేవుని బ్రహ్మహత్య విముక్తమైంది. నీ పుత్రిని యొక్క బంగారపు దొంగతనము, సురాపానము, కిరాతీ సంగమము వల్ల వచ్చిన పాపము విముక్తమైంది (60) నీకుమారుడు ఇతర పాపములనుండి ముక్తుడైనాడు. ఓ బ్రాహ్మణశ్రేష్ఠ ! యజ్ఞదేవ ! నీవు అనుమానించొద్దు (61) అని పలికి ఆ అశరీరవాణి విరమించింది.ఆ అశరీరవాణి వాక్యమును ఆ యజ్ఞదేవుడు విన్నాడు (62) సంతుష్టుడై అతడు కొడుకుతో పాటు రామనాథుని సేవించి ధనుష్కోటికి నమస్కరించి కుమారునితో కూడినవాడై (63) సంతోషంతో తన దేశమునకు తన గ్రామమునకు తన ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. కొడుకుతో భార్యతో కూడి చాలా కాలము (ఊరట) చక్కని ప్రశాంతితో సుఖంగా ఉన్నాడు (64) సింధు ద్వీపుని వచనము - ఓ గోమాయు వానరులార ! మీకు నేను యజ్ఞదేవుని సుతుడైన ఈ సుమతి పరిమోక్షణమును చెప్పాను (65) ధనుష్కోటి స్నానం వల్ల గొప్ప పాపములనుండి ముక్తులౌతారు. అందువల్ల మీరు పాపశుద్ధి కొరకు ధనష్కోటికి వెళ్ళండి. మరోరకంగా పదివేల ప్రాయశ్చిత్తములాచరించి నా పాపశుద్ధికాదు (66) శ్రీసూతులిట్లనిరి - అనిన సింధుద్వీపుని వచనమును విని ఓ బ్రాహ్మణులార ! (67) నృగాల వానరులు త్వరగా మహాపథములను లంఘించి ప్రయాసతో ధనుష్కోటికి వెళ్ళి ఆ జలమందు కూర్చొని దేవతలుపూలవాన కురిపిస్తుండగా, తేజస్వంతులై, (69) హరకేయూర ముకుటకటకాది ఆ భరణములచే నలంకరింపబడి, దేవతాస్త్రీలు చామరాలు విసురుతుండగా ప్రకాశిస్తూ రమ్యమైన దేవపురికి వెళ్ళి ఇంద్రుని అర్థసింహాసననాన్ని పొందారు(70) శ్రీ సూతులిట్లనిరి - మీకు ఈ విధముగా నృగాల కవుల విషయం చెప్పాను (71) ధనుష్కోటి స్నానం వల్ల పాపవిమోక్షణ మౌతుంది భక్తితో ఈ అధ్యాయాన్ని విన్నవారు, చదివిన వారు (72) ధనుష్కోటి స్నానం వల్ల కలిగే ఫలాన్ని పొందుతారు. యోగులకు కూడా సులభ సాధ్యంకాని ముక్తిని కూడా త్వరగా పొందుతారు (73) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు మూడవ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్య మందు ధనుష్కోటి ప్రశంసయందు నృగాల వానర విమోక్షణ వర్ణనమనునది ముప్పది ఐదవ అధ్యాయము || 35 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters