Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది నాల్గవ అధ్యాయము

మూ|| శ్రీ సూత ఉవాచ -

ఇతి హాసం పునర్వక్ష్యే ధనుష్కోటి ప్రశంసనం | సృగాలస్యచ సంవాదం వానరస్య చనత్తమాః || 1 ||

సృగాల వానరౌపూర్వం అస్తాంజాతిస్మరావుభౌ | పురాపి మానుషేభావే నఖా¸°తౌ బభూవతుః || 2 ||

అన్యాం యోనిం నమావన్నౌ సార్గాలీ వానరీ తథా | సఖ్యం సమీయ తురుభౌ సృగాలోవానరోద్విజాః || 3 ||

కదాచి ద్రుద్రభూమిష్ఠం సృగాలం వానరోబ్రవీత్‌ | శ్మశానమధ్యే సంప్రేక్ష్య పూర్వజాతి మనుస్మరన్‌ || 4 ||

వానర ఉవాచ -

సృగాల పాతకంపూర్వంకిమకార్షీః సుదారుణం - యస్త్వం శ్మశానేమృతకాన్‌ పూతిగంథాంశ్చ కుత్సితాన్‌

అత్సీత్యుక్తోథక పినాసృగాల స్తమభాషత | || 5 ||

నృగాల ఉవాచ -

అహం పూర్వ భ##వే హ్యాసం బ్రాహ్మణో వేదపారగః || 6 ||

వేదశర్మాభి ధో విద్వాన్‌ సర్వకర్మ కలాపవిత్‌ | బ్రాహ్మణాయ ప్రతిశ్రుత్య సమయాతత్రజన్మని || 7 ||

కపే థనం తదా దత్తంసృగాలోహంతతోభవం | తస్మాదేవం విధంభక్ష్యంభక్షయామ్యతికుత్సితం || 8 ||

ప్రతిశ్యుత్య దురాత్మానో నప్రయచ్ఛంతియేనరాః | కపే నృగాలయోనింతే ప్రాప్ను వంత్యతి కుత్సితాం || 9 ||

యో న దద్యాత్‌ ప్రతిశ్రుత్య స్వల్పం వాయదివాబహు|సర్వాశాః తస్య నష్టాః స్యుః షంఢస్యేనవ్రజోద్భవః || 10 ||

ప్రతిశ్రుత్యా ప్రదానే తుబ్రహ్మణా యప్లవంగమ | దశజన్మార్జితం పుణ్యం తత్‌ క్షణాదేవనశ్యతి || 11 ||

ప్రతిశ్రుత్యా ప్రదానేన యత్పాపము పజాయతే | నాశ్వమేధశ##తేనాపి తత్సావం పరిశుధ్యతి || 12 ||

నజానేహమిదంపాపం కదానష్టం భ##వేదితి | తస్మాత్ర్పతిశ్రుతం ద్రవ్యం దాతవ్యం విదుషానదా || 13 ||

ప్రతిశ్రుత్యా ప్రదానేన నృగాలో భవతి ధ్రువం | తస్మాత్ర్పాతిశ్రుతం ద్రవ్యం దాతవ్యం విదుషాసదా || 14 ||

ఇత్యుక్త్వాన నృగాలస్తం వానరం పునరబ్రవీత్‌ | భవతాకిం కృతం పాపం యేన వానరతామగాత్‌ || 15 ||

అనాగసోవన చరాన్‌ పక్షిణో హింసి వానర | తత్పాతకం పదస్వాద్య వానరత్వప్రదం మమ || 16 ||

ఇత్యుక్తః సనృగాలేన నృగాలం వానరోబ్రవీత్‌

తా || ధనుష్కోటి ప్రశంసకు చెందిన ఇతిహాసమును తిరిగి చెప్తాను. నక్క, కోతి ఆరెంటి సంవాదమును, ఓ సజ్జనులార ! (1) పూర్వము నృగాలము వానరము ఉండినవి. అవి రెండు తమ పూర్వ జాతిని స్మరించేవి. మనుష్యరూపమెత్తినా అవి రెండు స్నేహితులైనాయి (2) నృగాల వానరములు ఈ రెండు మరో యోనిని పొందినాయి. నృగాలము వానరము ఈ రెండు స్నేహితం చేశాయి (3) ఒకసారి రుద్రభూమిలో ఉన్న నక్కతో శ్మశానం మధ్యలో చూచి పూర్వజాతిని స్మరిస్తూ కోతి అంది (4) వానర వచనము - ఓ నృగాల ! పూర్వము మిక్కిలి దారుణమైన ఏ పాతకం చేశావు. ఎందుకంటే నీవు శ్మశానంలో చచ్చిన దుర్గంధము గల కుత్సితమైన వాటిని తింటున్నావు. అని కోతి అనగా నక్క దానితో అంది (5) నృగాల వచనము - నేను పూర్వజన్మలో బ్రాహ్మణున్ని, వేద పాఠగుణ్ణి ఐయుంటిని (6) వేదశర్మ అని పేరు. విద్వాంసుణ్ణి సర్వకర్మల కలాప మెరిగినవాణ్ని. ఆ జన్మలో నేను బ్రాహ్మణునకిస్తానని (7) ఓ కపి ! ధనాన్ని ఇవ్వలేదు. అందువల్ల ఇప్పుడు నేను నృగాలమైనాను. అందువల్ల ఈ విధమైన ఆహారాన్ని అతికుత్సితమైనదాన్ని తింటున్నాను. (8) ఒప్పుకొని, దుర్మార్గులై ఇవ్వని నరులు ఓకపి ! వారు అతి కుత్సితమైన నృగాల యోనిని పొందుతారు (9) కొద్దిగాని అధికంకాని అంగీకరించి ఇవ్వని వారి అన్ని ఆశలు నశిస్తాయి. షండునకు సంతానములాగ (10) ఓప్లవంగమ ! బ్రాహ్మణునకు ఇస్తానని అంగీకరించి ఇవ్వని పక్షంలో పది జన్మలలో సంపాదించిన పుణ్యం కూడా ఆ క్షణంలోనే నశిస్తుంది (11) అంగీకరించి ఇవ్వనందువల్ల కలిగే పాపము నూరు అశ్వమేధములు చేసినా పోదు (12) ఈ పాపం ఎప్పుడు నశిస్తుందో నాకు తెలియదు. అందువల్ల విద్వాంసుడు ఎప్పుడూ ఇస్తానని అంగీకరించిన ద్రవ్యాన్ని ఇవ్వాలి (13) అంగీకరించి ఇవ్వని పక్షంలో తప్పకుండా నృగాలము ఔతాడు. అందువల్ల ప్రాజ్ఞుడైన విద్వాంసుడు అంగీకరించిన దాన్ని ఇవ్వాలి (14) అని పలికి ఆ నక్క ఆ కోతితో తిరిగి ఇట్లా అంది. నీవేం పాపం చేశావు. ఈ వానర రూపం పొందావు (15) ఓ వానర ! తప్పుచేయని వనచరములను పక్షులను హింసిస్తున్నావు వానరత్వమునకు కారణమైన ఆ పాతకమేదో నాకీవేళ చెప్పు. అని నృగాలంఅనగానే ఆనృగాలంతో వానరం ఇట్లా అంది (16)

మూ || వానర ఉవాచ -

పురాజన్మన్యహం విప్రో వేదనాథ ఇతిస్మృతః || 17 ||

విశ్వనాథో మమపితా మమాంబాకమలాలయా | నృగాల సఖ్యమభవత్‌ ఆపయోః ప్రాగ్భవేపిహి || 18 ||

త్వంనజానాసితత్సర్వం వేద్మ్యహం పుణ్యగౌరవాత్‌ | తపసారాధ్య గిరిశం తత్ర్పసాదాత్పురామమ || 19 ||

అతీతభావి విజ్ఞానమస్తి జన్మాంతరేపిచ | గోమయోతద్భవేశా కం బ్రాహ్మణన్యహృతంమయా || 20 ||

తత్పాపాత్‌ వానరోజాతః నరకానుభవాదను | నాహార్తవ్యం విప్రధనం హరణాన్నర కంభ##వేత్‌ || 21 ||

అనంతరం వానరత్వం భవిష్యతి నసంశయః | తస్మాన్న బ్రాహ్మణస్వంతు హర్తవ్యం విదుషానదా || 22 ||

బ్రహ్మ స్వహరణాత్పాప మధికం నైపవిద్యతే | పీతవంతం విషంహంతి బ్రహ్మస్వం నకులందహేత్‌ || 23 ||

బ్రహ్మస్వహరణాత్పాపీ కుంభీపాకేషు పచ్యతే | పశ్చాన్న రకశేషేణ వానరీం యోని మశ్నుతే || 24 ||

విప్రద్రవ్యం నహర్తవ్యం క్షంతవ్యం తేష్వతః సదా | బాలాః దరిద్రాఃకృపణాః వేదశాస్త్రాది వర్జితాః || 25 ||

బ్రాహ్మణా నావమంతవ్యాః క్రుద్ధాశ్చేదనలో పమాః | అతీతానాగతం జ్ఞానం నృగాలాఖిల మస్తిమే || 26 ||

జ్ఞానమస్తినమేత్వేకం ఏతత్పాపవిశోధనం | జాతిన్మరోపిహి భవాన్‌ భావికార్యంనబుధ్యతే || 27 ||

అతీతేష్వపికించిత్‌జ్ఞః ప్రతిబంధవశాత్‌ భవాన్‌ | అతోభవాన్నజానీతే భావ్యతీతంతథాఖిలం || 28 ||

కియత్కాలం నృగాలాతో భుక్తావ్యసన మీదృశం | అవయోరస్య పాపస్య కోవామోచ యితాభ##వేత్‌ || 29 ||

ఏవం ప్రబ్రువతోస్తత్ర ప్లవంగమనృగాలయోః | యదృచ్ఛయాదైవయోగాత్‌పూర్వపుణ్యపశాత్‌ద్విజాః || 30 ||

అయ¸°సమహాతేజాః సింధుద్వీపాహ్మయోమునిః | భస్మోద్ధూలిత సర్వాంగః త్రిపుండ్రాంకితమస్తకః || 31 ||

రుద్రాక్షమాలా భరణః శివనామాని కీర్తయన్‌

నృగాలవానరౌదృష్ట్వా సింధుద్వీపాభిధంమునిం | ప్రణమ్యము దితౌ భూత్వా పప్రచ్ఛతు రిదంతదా || 32 ||

తా || వానరం చెప్పింది - పూర్వ జన్మలో నేను వేదనాధుడను విప్రుణ్ణి (17) నాతండ్రి విశ్వనాథుడు, నాతల్లి కమలాలయ ఓ నృగాలమ! పూర్వజన్మలో కూడ మనిద్దరికి స్నేహమైంది (18) నాపుణ్యాధిక్యం వలన నాకిదంతా తెలుసు. అదంతానీకు తెలియదు. గిరీశుని తపస్సుతో ఆరాధించాను. అతని అనుగ్రహం వల్ల నాకు (19) జన్మాంతరంలో కూడా జరిగిన రాబోయే విజ్ఞానముంది. ఓగోమాయు ! ఆ జన్మలో నేను బ్రాహ్మణుని శాకాన్ని హరించాను (20) ఆ పాపం వల్ల నరకం అనుభవించే కొరకు కోతిగా జన్మించాను. బ్రాహ్మణుని ధనాన్ని హరించకూడదు. హరిస్తే నరకం వస్తుంది (21) ఆ పిదప వానరత్వం వస్తుంది అనుమానం లేదు. అందువల్ల విద్వాంసుడు ఎప్పుడైనా బ్రాహ్మణుని సొత్తును హరించరాదు

(22) బ్రహ్మస్వహరణముకన్న అధిక పాపము లేదు. విషము తాగిన వానినే హరిస్తుంది. బ్రహ్మస్వము కులాన్నంతా దహిస్తుంది (23) బ్రహ్మస్వహరణము చేసిన పాపి కుంభీపాకనరకంలో వండబడతాడు పిదప పరకం మిగిలినందుచేత వానరయోని నాశ్రయిస్తాడు (24) విప్రద్రవ్యాన్ని హరించరాదు. అందువల్ల వారిని ఎప్పుడూ క్షమించాలి. బాలురు, దరిద్రులు, కృపణులు, వేదశాస్త్రాదులు వదలిన వారు (25) ఐన బ్రాహ్మణులను అవమానపరచరాదు కోపగిస్తే అగ్గివంటివారు. ఓ నృగాల ! నాకు అతీత, అనాగత జ్ఞానమంతా ఉంది (26) ఈ పాపం నుండి శుద్ధిని పొందే జ్ఞానం మాత్రం నాకులేదు. నీకు జాతి స్మరణ ఉంది ఐనా ముందు ఏం ఔతుందో నీకు తెలియదు (27) ప్రతిబంధం వల్ల నీకు అతీత జ్ఞానం కూడా కొద్దిగానే ఉంది. అందువల్ల నీవు గతాన్ని భవిష్యత్తును పూర్తిగా తెలుసుకోలేవు (28) నృగాలంగా ఎంతకాలం నుండి ఇటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నావు మనలను ఈ పాపం నుండి విముక్తులనుగా చేసేవాడు ఎవడున్నాడో (29) ఈ రకంగాప్లవంగమ, నృగాలాలు మాట్లాడుకుంటుండగా ఓ బ్రాహ్మణులార ! అనుకోకుండ అదృష్టవశాత్తు, పూర్వపుణ్యవశం వల్ల (30) మహా తేజస్సంపన్నుడైన సింధుద్వీపాహ్మాయుడను ముని వచ్చాడు. సర్వాంగములందు భస్మంధరించి, నొసటత్రిపుండ్ర చిహ్నము గలవాడై (31) రుద్రాక్షమాల ఆభరణముగా గలిగి శివనామాలను కీర్తిస్తూ వచ్చాడు. సింధు ద్వీపమను పేరుగల మునిని నృగాల వానరములు చూచి, సంతసించి, నమస్కరించి అప్పుడిట్లా అడిగారు (32).

మూ|| నృగాల వానరా పూచతుః -

భగవాన్‌ సర్వధర్మజ్ఞ సింధుద్వీప మహామునే || 33 ||

ఆ వాంరక్షకృపాదృష్ట్వా విలోకయ ముహుర్మదా | కపిత్వంచ నృగాలత్వం అవయోర్యేననశ్యతి || 34 ||

తముపాయం వదస్వాద్యత్వం హిపుణ్యవతాం వరః | అనాథాన్‌ కృపణాన్‌ అజ్ఞాన్‌ బాలాన్‌ రోగాతురాన్‌ జనాన్‌ || 35 ||

రక్షంతిపాధవోనిత్యం కృపయానిరపేక్షకాః తాభ్యామితీరితః ప్రాజ్ఞః సింధుద్వీపో మహామునిః

ప్రాహతౌ కపిగోమాయూ ధ్యాత్వాతు మనసాచిరం || 36 ||

సింధుద్వీప ఉవాచ -

జానామ్యహం యువాం సమ్యక్‌ హనృగాలప్లవంగమ || 37 ||

నృగాల ప్రాగ్భవేత్వం వై వేదశర్మాభిధో ద్విజః | బ్రాహ్మణాయ ప్రతిశ్రుత్య ధాన్యానా మాఢకం త్వయా || 38 ||

సదత్తం తేన పాపేన సార్గాలీం యోని మాప్తవాన్‌ | త్వంచ వానర పూర్వస్మిన్‌ వేదనాథాభిధోద్విజః || 39 ||

బ్రాహ్మణస్య గృహచ్ఛాకం హృతం చౌర్యాత్త్వ యాతతః | ప్రాప్తోపి వానరీం యోనిం సర్వపక్షిభయంకరీం || 40 ||

యువయోః పాపశాంత్యర్థం ఉపాయం ప్రవదామ్యహం | దక్షిణాంబునిధౌ రామ ధనుష్కోటౌ యువామరం || 41 ||

గత్వాత్ర కురుత స్నానం తేన పాపాద్విమోక్ష్యథః | పురాకిరాతీసంసర్గాత్‌ సుమతిర్ర్బాహ్మణః సురాం

పీతవాన్సధనుష్కోటౌ స్నాత్వా పాపాద్విమోచితః || 42 ||

నృగాల వానరాపూచతుః -

సుమతిః కస్యపుత్రోసౌ కథంచ సనురాంపపౌ || 43 ||

కథంకిరాత్యాంపక్తోభూత్సిం ధుద్వీపమహామతే | ఆవయోర్విన్తరాదేతద్వద త్వం కృపయాధునా || 44 ||

సింధుద్వీప ఉవాచ -

మహారాష్ట్రాభిధేదేశే బ్రాహ్మణః కశ్చిదాస్తికః | యజ్ఞదేవ ఇతిఖ్యాతో వేదవేదాంగ పారగః || 45 ||

దయాలు రాతిథేయశ్చశివనారాయణార్చకః | సుమతి ర్నామపుత్రోభూద్యజ్ఞదేవస్యతస్యవై || 46 ||

పితరౌ న పరిత్యజ్య భార్యా మపి పతివ్రతాం | ప్రయయా వుత్కలే దేశే విటగోష్ఠీ పరాయణః || 47 ||

కాచిత్కి రాతీతద్దేశే పవన్తీ యువమోహినీ | యూనాం సమస్త ద్రవ్యాణీ ప్రలోభ్య జగృహేచిరం || 48 ||

తస్యాగృహం నప్రయ¸° సుమతిర్ర్బాహ్మణాధమః | సుమతిం సాన జగ్రాహ కిరాతీ నిర్ధనం ద్విజం || 49 ||

తా || నృగాల వానరములిట్లా అన్నాయి | భగవాన్‌ ! సర్వధర్మజ్ఞ ! మహాముని ! సింధుద్వీప ! (33) కృపాదృష్టితో మమ్మల్ని రక్షించు మాటిమాటికి సంతోషంతో మమ్మల్ని చూడు దేని వల్ల మా కపిత్వము, నృగాలత్వము నశిస్తుందో (34) అట్టి ఉపాయాన్ని చెప్పండి. నీవు పుణ్యవంతులలో శ్రేష్ఠుడవు. అనాధులను, కృపణులను, ఆజ్ఞులను, బాలులను, రోగాతురు లైన జనులను (35) సాధువులు ఏమీ అపేక్షించకుండ, నిత్యము కృపతో రక్షిస్తారు. అని అవి ఇట్లా అనగా ప్రాజ్ఞుడు సింధు ద్వీపుడను మహాముని, మనస్సులో చాలాసేపు ధ్యానం చేసి ఆ కపి గోమాయువులతో ఇట్లా అన్నాడు (36) సింధు ద్వీపుని మాట - ఓ నృగాల ప్లవంగములార! నేను మిమ్మల్ని ఎరుగుదును. (37) ఓ నృగాల! పూర్వజన్మలో నీవు వేదశర్మ అను పేరుగల బ్రాహ్మణుడవు. తూమెడు ధాన్యమును బ్రాహ్మణునకు ఇస్తానని నీవు మాటిచ్చి (38) నీవు ఇవ్వలేదు. ఆ పాపంతో ఆడనక్కగా జన్మించావు. ఓ వానర ! పూర్వం నీవు వేదనాథుడను పేరుగల బ్రాహ్మణుడవు. (39) ఒక బ్రాహ్మణుని ఇంటినుండి దొంగతనంగా నీవు శాకం తెచ్చావు (హరించావు) అందువల్ల ఆడకోతిగా జన్మించావు. సర్వ పక్షులకు భయంకరమైన రూపమిది (40) మీ ఇద్దరి పాప శాంతి కొరకు ఉపాయాన్ని నేను చెపుతాను. దక్షిణ సముద్రమందు రామ ధనుష్కోటి యందు మీరు త్వరగా (41) వెళ్ళి అక్కడ స్నానం చేయండి అందువల్ల పాపం నుండి ముక్తులౌతారు. పూర్వం కిరాతస్త్రీ సహవాసం వలన సుమతి అను బ్రాహ్మణుడు సురను తాగాడు. ఆతడు ధనుష్కోటి యందు స్నానం చేసి పాపం నుండి ముక్తుడైనాడు (42) నృగాల వానరములు ఇట్లా అన్నాయి. సుమతి ఎవరికొడుకు. అతడు సురను ఎందుకు తాగాడు (43) కిరాతియందు ఎట్లా ఆసక్తుడైనాడు. ఓ మహామతి! సింధుద్వీప ! నీవు దయతో ఇప్పుడు మాకు విస్తారంగా దీన్ని చెప్పండి, అని అనగా (44) సింధుద్వీపుని మాట - మహారాష్ట్ర అను పేరుగల దేశంలో అస్తికుడైన బ్రాహ్మణుడొకడు, యజ్ఞదేవుడని ప్రసిద్ధుడు, వేదవేదాంగ పారగుడు (45) దయాళువు, అతిథి పూజకుడు, శివనారాయణ అర్చకుడు న్నాడు. ఆయజ్ఞదేవునకు సుమతి అని పుత్రుడు కలిగాడు (46) ఆతడు తలిదండ్రులను, పతివ్రతయైన భార్యను వదలి, విటగోష్ఠి పరాయణుడై ఉత్కల దేశానికి వెళ్ళాడు. (47) అక్కడ ఆ దేశంలో యువకులను మోహింప చేసేది ఒక కిరాతస్త్రీ ఉండేది. యువకుల యొక్క ద్రవ్యమునంత ప్రలోభ##పెట్టి చాలాకాలం తీసుకొంది (48) సుమతి అనే ఈ బ్రాహ్మణాధముడు ఆమె ఇంటికి వెళ్ళాడు. ధనహీనుడైన ఈ బ్రాహ్మణుని సుమతిని ఆకిరాతి స్వీకరించలేదు (49).

మూ|| తయాత్యక్తోథ సుమతిః తత్సంయోగైకతత్పరః | ఇతస్తతశ్చోరయిత్వా బహుద్రవ్యాణి సంతతం || 50 ||

దత్వాతయా చిరంరేమే తద్గృహె బుభుజేచనః | ఏకేన చషకేణాసౌ తయానహనురాం పపౌ || 51 ||

ఏవంస బహుకాలంవై రమమాణస్తయాసహ | పితరౌని జపత్నీంచ నాన్మరద్విషయాతురః || 52 ||

సకదాచిత్కిరాతైస్తు చౌర్యంకర్తుంయ¸°సహ | ద్రవ్యం హర్తుం కిరాతాస్తేలాటానాంవిషయంయయుః || 53 ||

విప్రస్య కస్యచిద్గేహ సోపి కైరాతవేషధృక్‌ | య¸°చోరయితుం ద్రవ్యం సాహసీఖడ్గహస్తవాన్‌ || 54 ||

తద్గృహస్వామినం విప్రం హత్వాఖడ్గేన సాహసీ | సమాదాయ బహుద్రవ్యం కిరాతీ భవనం య¸° || 55 ||

తం యాంతమనుయాతిస్మ బ్రహ్మహత్యా భయంకరీ | నీలవస్త్ర ధరాభీమా భృశం రక్త శిరోరుహా || 56 ||

గర్జంతీసాట్టహాసంసాకంపయంతీచరోదసీ | అనుద్రుతస్తయాసో యంబభ్రామజగతీతలే || 57 ||

ఏవంభ్రమన్‌ భువంసర్వాం కదాచిత్సుమతిస్వ్యయం | స్వంగ్రామంప్రయ¸°భీత్యాహేనృగాలప్లవంగమౌ || 58 ||

అనుద్రుతస్తయాభీతః ప్రయ¸° స్వగృహంప్రతి | బ్రహ్మహత్యాప్యసుద్రుత్య తేన సాకం గృహం య¸° || 59 ||

పితరం రక్షరక్షేతి సుమతిః శరణం య¸° | మాభైషీరితి తంప్రోచ్య పితారక్షితు ముద్యతః

తదానీం బ్రహ్మహత్యేయం తత్తాతం ప్రత్యభాషత | || 60 ||

బ్రహ్మహత్యోవాచ -

మైనం త్వం ప్రతిగృహ్ణీష్వ యజ్ఞ దేవద్విజోత్తమ || 61 ||

అసౌసురా పీస్తేయీచ బ్రహ్మహాచాతి పాతకీ | మాతృద్రోహీ పితృద్రోహీ భార్యా త్యాగీచ పాపకృత్‌ || 62 ||

కిరాతీసంగదుష్టశ్చ వైనం ముంచామ్యహం ద్విజ | గృహ్ణాసిచే దిమం విప్ర మహాపాతకిసంసుతం || 63 ||

త్వద్భార్యామస్యభార్యాంచ త్వాంచపుత్రమిమం ద్విజ | భక్షయిష్యామివంశంచతస్మాన్ముంచసుతంత్విమం || 64 ||

ఇమంత్యజసిచేత్సుత్రయంయుష్మాన్‌ మోక్ష్యామిసాంప్రతం | నైకస్యార్థేకులంహంతుమర్హసిత్వంమహమతే

ఇత్యుక్తః సతయాతత్ర యజ్ఞదేవోబ్రవీచ్చతాం |

తా || ఆమె ఆ సుమతిని విడిచి పెట్టాక ఆతడు ఆమె సంయోగమందే ఆసక్తి కలవాడై ఎప్పుడూ ఇక్కడ, అక్కడ చాలా ధనం దొంగతనం చేసి (50) ఆమెకిచ్చి ఆమెతో చాలా రోజులు రమించాడు. ఆమె ఇంట్లో భోంచేశాడుకూడా. ఒకే పాత్రతో ఈతడు ఆమెతో కూడి సురను తాగాడు. (51) ఇట్లా అతడు చాలా కాలము ఆమెతో సహా సుఖించాడు. విషయాతురుడై తలిదండ్రులను, తన భార్యను స్మరించలేదు (52) అతడొకసారి కిరాతులతో కూడా కూడి దొంగతనం చేయటానికి వెళ్ళాడు. ఆ కిరాతులు ద్రవ్యం హరించటానికి లాటదేశానికి వెళ్ళారు (53) అతడు కూడా కిరాత వేషం ధరించి, ఏదో ఒక బ్రాహ్మణుని ఇంటిలో, సాహసవంతుడై ఖడ్గం ధరించి, ద్రవ్యం దొంగిలించుటకు వెళ్ళాడు (54) ఆ సాహసి ఖడ్గంతో ఆ గృహ యజమానియైన విప్రుని చంపి, చాలా ద్రవ్యం తీసుకొని కిరాతి భవనమునకు వెళ్ళాడు (55) వస్తున్న అతనిని భయంకరమైన బ్రహ్మహత్య అనుసరించ సాగింది నీల వస్త్రమును ధరించి మిక్కలి భయంకరంగా ఎర్రని వెంట్రుకలతో (56) అట్టహాసంగా గర్జిస్తూ, రోదసి భాగాన్ని కంపింపచేస్తూ అతనిని అనుసరించింది. అది వెంట పడగా ఈతడు భూతలమంతా భ్రమించాడు (57) భూమి అంతా ఈ రకంగా తిరుగుతూ ఒకసారి సుమతి స్వయంగా భయంతో తన గ్రామానికి బయలుదేరాడు. ఓ నృగాల, ప్లవంగములార ! (58) ఆ బ్రహ్మహత్యతో అనుసరింపబడుతూ భయపడి తన ఇంటికి వెళ్ళాడు. బ్రహ్మహత్య కూడా అనుసరించి పరుగెత్తుతూ అతనితోపాటు అతని ఇంటికి వచ్చింది (59) సుమతి! రక్షించు, రక్షించు అని తన తండ్రిని శరణు వేడాడు. భయపడకు అని పలికి తండ్రి అతనిని రక్షించుటకు ప్రయత్నించాడు. అపుడు బ్రహ్మహత్య అతని తండ్రితో ఇట్లా అంది (60) బ్రహ్మహత్య వచనము - ఓ యజ్ఞదేవ, బ్రాహ్మణోత్తమ ! ఈతనిని నీవు స్వీకరించవద్దు (61) ఈతడు సురతాగినవాడు. దొంగ. బ్రహ్మహత్య చేసినవాడు. అతి పాతకి, మాతృద్రోహి, పితృద్రోహి, భార్యను వదలినవాడు, పాపమాచరించినవాడు (62) కిరాతీ సంగమంవల్ల దుష్ఠుడైన వాడు ఓ బ్రాహ్మణ ! నేను ఈతనిని వదలను ఓ విప్ర! ఈ మహా పాతకియైన కొడుకును నీవు స్వీకరిస్తే (63) నేను నీ భార్యను, ఈతని భార్యను నిన్ను ఈనీపుత్రుని, వంశాన్ని తింటాను. అందువల్ల ఈ పుత్రుని వదలు (64) ఈ పుత్రుని వదలిన యెడల ఇప్పుడు మిమ్మల్ని వదులుతాను. ఓ మహామతి ! ఒకనికొరకు, కులాన్ని నశింపచేయటం తగదు. అని ఇట్లా ఆ బ్రహ్మహత్య అనగా ఆయజ్ఞదేవుడు ఆమెతో ఇట్లా అన్నాడు (65).

మూ || యజ్ఞదేవ ఉవాచ -

బాధతే మాం సుతస్నేహః కథమేనం పరిత్యజే | బ్రహ్మహత్యాతదాకర్ణ్య ద్విజోక్తం తమభాషత || 66 ||

బ్రహ్మహత్యోవాచ -

అయం హి పతితోభూత్తే వర్ణాశ్రమ బహిష్కృతః || 67 ||

పుత్రేస్మిన్‌ మాకురుస్నేహం నిందితం తస్యదర్శనం | ఇత్యుక్త్వా బ్రహ్మహత్యాసాయజ్ఞ దేవస్యపశ్యతః || 68 ||

తలేన ప్రజహారాస్య పుత్రం సుమతి నామకం | రురోదతాత తాతేతి పితరం ప్రబ్రువన్ముహుః || 69 ||

రురుదుః జనకోమాతా భార్యా పిసుమతేస్తదా | ఏతస్మిన్నంతరే తత్ర డుర్వాసాః శంకరాం శజః || 70 ||

దిష్ట్యాసమాయ¸° యోగీ హేనృగాల ప్లవంగమౌ

యజ్ఞదేవోథతందృష్ట్వామునింరుద్రావతారకం | శ్రుత్వాప్రణమ్యశరణం యయాచే పుత్రకారణాత్‌ || 71 ||

పితోవాచ -

దుర్వాసస్త్వం మహాయోగీ సాక్షాద్వైశంకరాంశజః || 72 ||

త్వద్దర్శన మపుణ్యానాం భవితాన కదాచన | బ్రహ్మహాచ సురాపీచస్తేయీచా భూత్సుతోమమ | || 73 ||

ఏవం ప్రహర్తు మాయతా బ్రహ్మహత్యా వివర్తతే | భూయాద్యధామే పుత్రోయం మహాపాతకమోచితః || 74 ||

ఘోరాచ బ్రహ్మహత్యేయంయథాశీఘ్రంలయంప్రజేత్‌ | తముపాయం పదస్వాద్యమమవుcతేదయాంకరు || 75 ||

అయమే నహిపుత్రోమేనాన్యోస్తి తనయోమునే | అస్మిన్‌ మృతే తువం శోమే సముచ్ఛిద్యేత్సమూలతః || 76 ||

తతః పితృభ్యః పిండానాం దాతాపి నభ##వేద్ధ్రువం | అతః కృపాం కురుష్వత్వ మస్మాను భగవన్మునే || 77 ||

ఇత్యుక్తః సతదోవాచ దుర్వాసాః శంకరాంశజః | ధ్యాత్వాతునుచిరం కాలం యజ్ఞ దేవం ద్విజోత్తమం || 78 ||

దుర్వాసా ఉవాచ -

యజ్ఞ దేవ కృతం పాపం అతి క్రూరం సుతేనతే | నాస్య పాపస్య శాంతిః స్యాత్‌ ప్రాయశ్చిత్తాయుతైరపి || 79 ||

అథాపితే సుతస్యాహ మస్యపావన్య శాంతయే | ప్రాయశ్చిత్తం పదిష్యామిశ్రుణునాన్యమనాద్విజ || 80 ||

శ్రీరామ ధనుషః కోటౌ దక్షిణ సలిలార్ణవే | స్నాతిచేత్తన పుత్రోయం పాతకాన్మోక్త్యతేక్షణాత్‌ || 81 ||

దుర్వినీతాభిధోవిప్రోయత్ర స్నానాద్ద్విజోత్తమ | గురుస్త్రీగమ పాపేభ్యప్తక్షణాదేవ మోచితః || 82 ||

సైషాశ్రీధనుషః కోటీ రాఘవస్య స్వయం హరేః స్నానమాత్రేణ పాపౌఘం నాశ##యేత్త్వత్సు తస్యసా || 83 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే ధనుష్కోటి ప్రశంసాయాం నృగాల వానరసంవాదే సుమతి మహా పాతక విమోక్షోపాయ కథనం నామచతుస్త్రింశోధ్యాయః || 34 ||

తా || యజ్ఞ దేవుడిట్లనెను - నన్ను పుత్ర ప్రేమ బాధిస్తోంది. ఈతనినెట్లా వదిలి పెడ్తాను. అని అనగా బ్రహ్మహత్య ఆ మాటలు విని అతనితో ఇట్లా అంది (66) బ్రహ్మహత్య మాట - వర్ణాశ్రమ బహిష్కృతుడై ఈ నీ పుత్రుడు పతితుడైనాడు (67) ఈ పుత్రునిపై ప్రేమ చూపకు. అతను కనపడటమే నిందాకరము. అని బ్రహ్మహత్య యజ్ఞదేవుడు చూస్తుండగా (68) సుమతి నామకుడనే అతని పుత్రుని అరచేతితో కొట్టాడు. మాటిమాటికి నాన్న ! నాన్న! అని తండ్రిని పిలుస్తూ ఏడ్చాడు (69) అప్పుడు సుమతి యొక్క తండ్రి తల్లి భార్య అందరు ఏడ్చారు. ఇంతలో శంకరాంశజుడైన దుర్వాసుడు (70) యోగి అదృష్టవశాత్తు వచ్చాడు, ఓ నృగాల వానరులార! రుద్రావతారుడైన మునిని చూచి ¸్ఞుదేవుడు, విని నమస్కరిచంచి పుత్రునికొరకు శరణువేడాడు (71) పితృవచనము - ఓ దుర్వాన నీవు మహా యోగివి సాక్షాత్తు శంకరరాంశుడవు (72) నీ దర్శనము పుణ్యము చేయని వారికి ఎప్పుడూ లభించదు. నాకుమారుడు బ్రహ్మహత్య చేశాడు. సురాపానం చేశాడు. దొంగతనం చేశాడు (73) ఈతనిని చంపుట కొరకు వచ్చిన బ్రహ్మహత్య తిరుగుతోంది. నా కొడుకు మహాపాతకం నుండి ముక్తుడయ్యేట్టు (74) ఘోరమైన ఈ బ్రహ్మహత్యలయమయ్యేట్టు ఉపాయం చెప్పండి. ఈ రోజు నా పుత్రుని మీద దయ చూపండి (75) ఓ ముని! వీడొక్కడే నాకు కొడుకు నాకు మరొ కొడుకు లేడు. వీడు మరణిస్తే నా వంశము సమూలంగా నశిస్తుంది (76) పిదప పితరులకు పిండమిచ్చే వాడుకూడా ఉండడు నిశ్చయము. అందువల్ల ఓ భగవాన్‌! ముని! నీవు మా యందు దయచూపు (77) అని అనగా అప్పుడు శంకరాంశజుడైన దుర్వాసుడు ఇట్లా అన్నాడు. (78) దుర్వాసోక్తి - ఓ యజ్ఞదేవ ! నీకుమారుడు అతి క్రూరమైన పాపం చేశాడు. పదివేల ప్రాయశ్చిత్తము లాచరించినా ఈ పాపమునకు శాంతిలేదు (79) ఐనానేను నీ కొడుకు యొక్క ఈ పాప శాంతి కొరకు ప్రాయశ్చిత్తము చెప్తున్నాను. శ్రద్ధగా విను, ఓ బ్రాహ్మణ (80) దక్షిణ సముద్రమందు శ్రీరామ ధనుష్కోటి యందు ఈనీ పుత్రుడు స్నానం చేస్తే క్షణంలో పాతకముల నుండి ముక్తుడౌతాడు (81) దుర్వినీతుడను పేరుగల విప్రుడు అక్కడ స్నానం చేయటం వలన గురుస్త్రీగమ పాపం నుండి వెంటనే ముక్తుడైనాడు (82) రాఘవుని యొక్క స్వయంగా హరియొక్క శ్రీ ధనుష్కోటి ఇది అది స్నానమాత్రంతో నీ కొడుకు యొక్క పాపరాశిని నశింపచేస్తుంది (83) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండ మందు సేతు మాహాత్మ్య మందు ధనుష్కోటి ప్రశంస యందు నృగాల వానర సంవాదమందు సుమతి మహాపాతక విమోక్ష ఉపాయ కథన మనునది ముప్పది నాల్గవ అధ్యాయము || 34 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters