Sri Scanda Mahapuranamu-3    Chapters   

ముప్పది మూడవ అధ్యాయము

మూ|| శ్రీ సూత ఉవాచ -

భూయోప్యహం ప్రవక్ష్యామి ధనుష్కోటేస్తు వైభవం | అత్యద్భుతతరం గుహ్యం సర్వలోకైక పావనం || 1 ||

పురావరావనుర్నామ బ్రాహ్మణోవేదవిత్తమః | అజ్ఞానాత్‌ పితరం హత్వా బ్రహ్మ హత్యామవాస్తవాన్‌

సోపిస్నాత్వా ధనుష్కోటౌ తద్దోషాన్ముముచే క్షణాత్‌ | || 2 ||

ఋషయ ఊచుః-

పితరం హతవాన్‌ పూర్వం కథం సూత పరావసుః || 3 ||

కథం వాధనుషః కోటౌ ముక్తిస్తస్యాప్యభూన్మునే| ఏతన్నః శ్రద్ధధానానాం విస్తరాద్వక్తుమర్హసి || 4 ||

శ్రీసూత ఉవాచ -

ఆసీద్రాజాబృహద్ద్యుమ్నః చక్రవర్తీ మహాబలః ధర్మేణ పాలయామాన సాగరాంతాం వసుంధరాం || 5 ||

అయజత్సత్రయాగేన దేవానింద్రపురోగమాన్‌ | యాజకస్తన్యరైభ్యోద్విద్వాన్‌ పరమధార్మికః || 6 ||

అస్తాంపుత్రాపుభౌ తస్యాప్యర్వావసువరావసూ |షడంగవేదవిదుషౌ శ్రౌతస్మార్తేషు కోవిదౌ || 7 ||

కాణాదే జైమినీయేచ సాంఖ్యే వైయాసికే తథా | గౌతమే యోగశాస్త్రేచ పాణినీయేచ కోవిదౌ || 8 ||

మన్వాదిస్మృతి నిష్ణాతౌ సర్వశాస్త్రవిశారదౌ | సత్రయాగే సహాయార్ధం బృహద్ద్యుమ్నేన యాచితౌ || 9 ||

భ్రాతరౌసమనుజ్ఞాతౌ పిత్రారైభ్యేణ జగ్మతుః | బృహద్ద్యుమన్నస్య సత్రంతా పశ్వినా వివరూపిణౌ || 10 ||

అతిష్ఠ దాశ్రమే రైభ్యః స్నుషయా జ్యేష్ఠయాసహా | తౌగత్వాభ్రాతరౌ తత్రరాజ్ఞః సత్రమనుత్తమం || 11 ||

యాజయామానతుః నత్రే బృహద్ద్యుమ్నం మహీపతిం | నాభవత్‌స్థలనం భ్రాత్రోః సత్రేసాంగేషుకర్మను || 12 ||

నత్రేసంతన్య మానేస్మిన్‌ బృహద్ద్యుమ్నస్యభూపతేః | మునయోభ్యాగమన్‌ సర్వేరాజ్ఞాహూతానిరీక్షితుం || 13 ||

వసిష్ఠోగౌతమశ్చాత్రిః జాబాలిరథకశ్యపః | క్రతుర్దక్షః పులస్త్యశ్చ పులహోనారదోమునిః || 14 ||

మార్కండేయః శతాసందో విశ్వామిత్రః పరాశరః | భృగుః కుత్పోథ వాల్మీకిః వ్యాసధౌమ్యాదయోపరే || 15 ||

శిష్యప్రశిషై#్యః బహుభిఃఅసంఖ్యాతైః సమావృతాః | తానాగతాన్‌ సమాలోక్య బృహద్ద్యుమ్నో మహీపతిః || 16 ||

అర్ఘ్యాదినామునీన్‌ సర్వాన్‌ పూజయామాన సాదరం |

తా || శ్రీ సూతుల వచనము - ధనుష్కోటి వైభవాన్ని మళ్ళీ ఇంకా చెప్తాను. సర్వలోములకు ఒకే పావనమైనది. అత్యద్భుతతరము రహస్యమైనది (1) పూర్వం పరావసుడనే బ్రాహ్మణుడు వేదవిత్తముడు. అజ్ఞానం వల్ల తండ్రిని చంపి బ్రహ్మహత్య పాపాన్ని పొందాడు. అతడుకూడా ధనుష్కోటి యందు స్నానం చేసి ఆ దోషం నుండి క్షణంలో ముక్తుడైనాడు (2) ఋషులిట్లన్నారు - ఓ సూత ! పరావసువు పూర్వము తండ్రిని ఎట్లా చంపాడు. (3) ధనుష్కోటి యందు అతనికి కూడా ముక్తి ఎట్లా వచ్చింది ఓముని! ఈ విషయాన్ని శ్రద్ధగలిగిన మాకు విస్తరంగా చెప్పండి అని అనగా (4) శ్రీ సూతులిట్లన్నారు - చక్రవర్తి మహాబలుడు, బృహద్యుమ్నుడను రాజు ఉండేవాడు. సాగరాంతమైన భూమిని ధర్మంతో పాలించసాగాడు (5) ఇంద్రుడు మొదలగు దేవతలను సత్రయాగంతో పూజించాడు. విద్వాంసుడు, పరమ ధార్మికుడు రైభ్యుడు అతనికి యజ్ఞం చేయించేవాడు (6) ఆతనికి అర్వావసు పరావసు అని ఇద్దరు కొడుకులు ఉండిరి. షడంగములతో కూడిన వేదమెరిగినవారు, శ్రౌతస్మార్త కర్మలలో కోవిదులు (7) కాణాదము, జైమినీయము, సాంఖ్యము వైయాసికము గౌతమీయము, యోగశాస్త్రము, పాణినీయము వీటన్నిటియందు కోవిదులు (8) మన్వాది స్మృతులలో నిష్ణాతులు, సర్వశాస్త్రములందు విశారదులు. సత్రయాగంలో సహాయం కొరకు బృహద్ద్యుమ్నుడు వీరిని కోరాడురమ్మని (9) తండ్రియైన రైభ్యుని అనుమతి పొంది ఈ అన్నతమ్ములు వెళ్ళారు, బృహద్ద్యుమ్నుని సత్రయాగానికి. వారు రూపంలో అశ్వినీ దేవతల వలెనున్నరు (10) ఆశ్రమంలో రైభ్యుడు తన పెద్ద కోడలితో ఉన్నాడు. వారిద్దరు అన్నదమ్ములు ఉత్తమమైన, రాజుగారి సత్రయాగానికి వెళ్ళి (11) సత్రయాగంలో బృహద్ద్యుమ్న రాజును యజ్ఞింప చేయసాగారు. సత్రమందు అన్ని కర్మలలోను అన్నదమ్ములకు స్థలనము కాలేదు (తొట్రుపడలేదు) (12) బృహద్ద్యుమ్నరాజుయొక్క సత్రయాగం జరుగుతుండగా, రాజుగారు పిలువగా యజ్ఞాన్ని చూడటానికి మునులందరూ వచ్చారు (13) వసిష్ఠుడు, గౌతముడు, అత్రి, జాబాలి, కశ్యపుడు, క్రతువు, దక్షుడు, పులస్త్యుడు, నారదుడు (14) మార్కండేయుడు, శతానందుడు, విశ్వామిత్రుడు, పరాశరుడ, భృగువు, కుత్సుడు, వాల్మీకి, వ్యాసుడు, ధౌమ్యుడు మొదలగువారు ఇతరులుకూడా (15) శిష్యులు, ప్రశిష్యులు లెక్కింపరానంతగా అనేక మందితో వచ్చారు. వచ్చిన వారిని చూచి బృహద్ద్యుమ్న మహీపతి (16) అర్ఘ్యాదులతో మునులందరిని సాదరంగా పూజించసాగాడు.

మూ ||నానాదిగ్భ్యః సమాయాతాఃచతురంగబలైర్యుతాః || 17 ||

ఉపదానహితాభూపాః సత్రం వీక్షి తుమాదరాత్‌ | వైశ్యాఃశూద్రాః తథావర్ణాః చత్వారోపిసమాగతాః || 18 ||

వర్ణినోథ గృహస్థాశ్చ వానప్రస్థాశ్చ భిక్షవః | సత్రం నిరీక్షితుంతస్యబృహద్ద్యుమ్నన్యచాయయుః || 19 ||

తాన్‌ సర్వాన్‌ పూజయామాన యథార్హం రాజసత్తమః | దదౌచాన్నానిసర్వేభ్యో ఘృతసూపాది కాంస్తథా || 20 ||

వస్త్రాణి చనువర్ణాని హారరత్నాన్యనేకశః | ఏవం సత్కారయామానరాజాసత్రేసమాగతాన్‌ || 21 ||

రైభ్య పుత్రోతదావిప్రా అర్వావసువరావసూ | అధ్వరాదీని కర్మాణి చక్రతుః స్థలితం వినా || 22 ||

తద్దృష్ట్వామునయన్సర్వే కౌశలం రైభ్యపుత్రయోః | శ్లాఘం తేనశిరః కంపం వసిష్ఠప్రముఖాస్తదా || 23 ||

కర్మాణి కానిచిత్త త్రకార యిత్వా పరావసుః | తృతీయ సవన స్యాంతే గృహకృత్యం నిరీక్షితుం || 24 ||

ప్రయ¸° స్వాశ్రమం సాయం వినైవార్వావసుంద్విజాః | తస్మిన్న వనరేరైభ్యం కృష్ణాజిన సమావృతం || 25 ||

వనే చరంతం పితరం దృష్ట్వా సమృగ శంకయా | నిద్రా కలుషితో రాత్రా వంధే తమసి సంకులే || 26 ||

ఆత్మానం హంతుమాయాతిమృగోయమితిచింతయన్‌ | జఘాన పితరంసోయంమహారణ్యపరావసుః || 27 ||

రిరక్షుణాశరీరం స్వంతే నాకామన యాపితా | రజన్యాం హింసితోవిప్రా మహాపాతకకారిణా || 28 ||

అంతికం స సమాగత్య వ్యలోకయత తంహతం | జ్ఞాత్వాస్వపితరం రాత్రౌశుశోచ వ్యధితేంద్రియః || 29 ||

ప్రేతకార్యం తతః కృత్వాపితుః సర్వంపరావసుః | భూయో పినృపతేః సత్రం సరావసురుపాయ¸° || 30 ||

స్వచేష్టితం తుతత్సర్వం అనుజాయతతోబ్రవీత్‌ | మృతంస్వపితరంశ్రుత్వాసో పి శోకాకులోభవత్‌ || 31 ||

జ్యేష్ఠోసుజంతతఃప్రాహవచనంద్విజస్తమాః |మహత్సత్రం సమారబ్ధం బృహద్ద్యుమ్న స్యభూపతేః || 32 ||

వోఢృత్వశక్తిర్నాస్త్యత్ర కర్మణో బాలకస్యతే | జనకశ్చ హతోరాత్రౌ మయాపి మృగశంకయా || 33 ||

ప్రాయశ్చిత్తం చకర్తవ్యం బ్రహ్మహత్యా విశుద్ధయే | మదర్ధం వ్రత చ ర్యాంత్వం చర తాత కనిష్ఠక || 34 ||

ఏకాకీ ధురముద్ధోడుం శక్తోహం సత్రకర్మణః | అర్వావసురితిప్రోక్తో జ్యేష్ఠేన సతమభ్యధాత్‌ || 35 ||

తథాభవత్వహంజ్యేష్ఠ చరిష్యే వ్రతముత్తమం | బ్రహ్మహత్యావిశుద్ధ్యర్థంత్వం సత్రధురమావహ || 36 ||

ఇత్యుక్త్యా సోసుజో జ్యేష్ఠం తస్మాత్సత్రాత్‌ వినిర్య¸° |

తా || అనేక దిక్కులనుండి చతురంగ బలములతో కూడిన (17) కానుకలతో సహా రాజులు సత్రాన్ని చూడటానికి ఆదరంతో వచ్చారు. వైశ్యులు, శూద్రులు అట్లాగే నాలుగు వర్ణములు వారు వచ్చారు. (18) బ్రహ్మచారులు, గృహస్థులు, భిక్షువులు, ఆ బృహద్ద్యుమ్నుని సత్రయాగం చూడటానికి వచ్చారు. (19) రాజశ్రేష్ఠుడు వారందరిని వారి వారికి తగినట్లు పూజించాడు. అన్నములను ఘృత సూపాదులను అందరికి పెట్టాడు. (20) వస్త్రములు బంగారము అనేక రత్న హారములు ఇచ్చాడు. ఈ విధంగా రాజు సత్రంకు వచ్చిన వారిని సత్కరించాడు. (21) ఓ బ్రాహ్మణులార ! రైభ్య పుత్రులైన ఆర్వావసు పరావసులు ఏ తొట్రుపాటు లేకుండ అధ్వరాది కర్మలను చేశారు (22) దాన్ని చూచి మునులందరు రైభ్యపుత్రుల నేర్పరితన్నాన్ని తలూపుతూ పొగుడుతున్నారు. వసిష్ఠప్రముఖులు కూడా అట్లే పొగిడారు. (23) పరావసు కొన్ని పనులను చేయించి, తృతీయ నవనం చివర ఇంటి పనులను చూచుటకు (24) అర్వావసులేకుండానే తన ఆశ్రమానికి సాయంకాలం వెళ్ళాడు. ఆ సందర్భంలో కృష్ణాజనంతో చుట్టబడి ఉన్న రైభ్యుని (25) అడవిలో తిరుగుతున్న తన తండ్రిని చూచి మృగమని శంకించి, నిద్రతో కలతచెంది రాత్రియందు అంధకారమయమైన తమస్సుతో వ్యాకులమై (26) ఈ మృగము నన్ను చంపటానికి వస్తున్నదని చింతించి, మహారణ్యంలో పరావసువు తన తండ్రిని చంపాడు (27) తన శరీరాన్ని రక్షించుకునే ఉద్దేశ్యంతో పరావసు ఏకామన లేకుండానే మహా పాతక కారియై రాత్రియందు తండ్రిని చంపాడు (28) దగ్గరకు వచ్చి హతుడైన వానిని చూచాడు తన తండ్రిగా గుర్తించి కలత చెందిన అవయవములు కలవాడై రాత్రి ఏడ్చాడు (29) పరావసు తండ్రికి ప్రేతకార్యమంతా నిర్వర్తించి తిరిగి పరావసురాజు గారి సత్రానికి వచ్చాడు (30) తాను చేసిన పనినంతా అనుజునకు చెప్పాడు. తండ్రి చనిపోయినాడనివిని ఆతడు శోకాకులుడైనాడు (31) జ్యేష్ఠుడు అనుజునితో ఇట్లా అన్నాడు. బృహద్ద్యుమ్నరాజు యొక్క గొప్ప సత్రయాగము ఆరంభ##మైంది. (32) బాలకుడవైన నీకు ఈ పనిలో నిర్వహణ శక్తి చాలదు. నేను రాత్రి మృగమనే అనుమానంతో తండ్రిగారిని చంపాను (33) బ్రహ్మ హత్య విశుద్ధి కొరకు ప్రాయశ్చిత్త మాచరించాలి. నా కొరకు ప్రతిచర్యకు ఓతమ్ముడనీవు తిరుగు (34) ఒంటరిగా నత్రకర్మ భారాన్ని మోయటానికి నేను సమర్థుణ్ణి, ఓ అర్వావసు ! అని పెద్దవాడు అనగానే అతడు దానిని వహించాడు (35) అట్లాగే కాని ఓ అన్న ! నేను ఉత్తమమైన వ్రతాన్ని ఆచరిస్తాను. బ్రహ్మహత్య విశుద్ధి కొరకు నీవు సత్రము భారాన్ని మోయి (36) పెద్దవానితో పలికి ఆ తమ్ముడు ఆ సత్రం నుండి వెడలిపోయాడు.

మూ|| కారయా మాసకర్మాణి జ్యేష్ఠస్తస్మిన్‌గతేక్రతౌ || 37 ||

ద్వాదశాబ్దం కనిష్ఠోపి బ్రహ్మహత్యావ్రతం ద్విజాః | చరిత్వాసత్రయాగేస్మిన్‌ ఆజగామ పునర్ముదా || 38 ||

తందృష్ట్వా భ్రాతరం జ్యేష్ఠో బృహద్ద్యుమ్నమువాచహ | అయంతే బ్రహ్మహా సత్రమర్వావసురుపాగతః || 39 ||

ఏన ముత్సార యాశుత్వమస్మాత్సత్రాన్పృపోత్తమ | అన్యథా సత్రయాగస్య ఫలహానిర్భవిష్యతి || 40 ||

ఇతీరితః స స్వప్రేషై#్యః యాగాత్తముదవాసయత్‌ | ఉద్వాన్యమానోరాజానం అర్వావసురాథా బ్రవీత్‌ || 41 ||

సమయాబ్రహ్మహత్యేయంబృహద్ద్యుమ్నకృతానఘ | కింతుజ్యేష్ఠేనమేసాహితబ్రహ్మహత్యాకృతావిభో || 42 ||

బ్రహ్మహత్యావ్రతంచీర్ణంతదర్థంచమయాధునా | ఏవముక్తోపిరాజాసౌవచసాసవరావసోః || 43 ||

అర్వావసుంనిజాత్‌సత్రాత్‌ఉదవాసయదాశువై | ధిక్కృతోబ్రాహ్మణౖశ్చాయంయ¸°తూష్ణీంవసంతదా || 44 ||

మునివృందనమాకీర్ణంతపోవనముపేత్యనః | అర్వావసుస్తపశ్చక్రేదేవైరపిసుదుష్కరం || 45 ||

తపఃకుర్వంస్తధాదిత్యముపతస్థేసమాహితః | మూర్తిమాంస్తవసాతస్యమహాతాదుష్టధీఃస్వయం || 46 ||

ఆవిరాసీత్స్వయాదీప్త్యాభావయన్‌జగతీతలం | కర్మసాక్షీజగచ్చక్షుః భాస్కరోదేవతాగ్రణీః || 47 ||

ఆవిర్బభూవుఃదేవాశ్చపురస్కృత్యశచీపతిం | ఇంద్రాదయస్తతోదేవాః ప్రోచురర్వావసుంద్విజాః || 48 ||

అర్వావసోత్వంప్రవరఃతపసాబ్రహ్మచర్యతః | ఆచారేణశ్రుతేనాపివేదశాస్త్రాదిశిక్షయా || 49 ||

నిరాకృతోపమానేనత్వంపరావసునాబహు | తథాపిక్షమయాయుక్తోనకుప్యతిభవాన్యతః || 50 ||

యస్మాజ్జ్యేష్ఠోపధీత్తాతంసహింసీస్త్వంమహామతే | బ్రహ్మహత్యావ్రతంయస్మాత్తదర్థంచరితంత్వయా || 51 ||

అతఃస్వీకుర్మహేత్వాంతుపరాకుర్మఃపరావసుం | ఉక్త్వైవంబలభిన్ముఖ్యాఃసర్వేచత్రిదివాలయాః || 52 ||

తంతేప్రవరయామానుఃనిరానుశ్చవరావసుం | పునరింద్రాదయోదేవాఃపురోధామదివాకరం || 53 ||

అర్వావసుంప్రోచురిదం పరంత్వపరయేతివై || 53 1/2 ||

తా || అతడు వెళ్లాక పెద్దవాడు యజ్ఞకర్మలను చేయించాడు(37) ఓద్విజులార! కనిష్ఠుడుకూడా పన్నెండుసంవత్సరములు బ్రహ్మహత్యావ్రతమునుచరించి సంతోషంతోతిరిగి ఈసత్రయాగానికి వచ్చాడు. (38) ఆతమ్ముణ్ణిచూసిజ్యేష్ఠుడు బృహద్ద్యుమ్నునితో ఇట్లాఅన్నాడు. ఈతడుబ్రహ్మహత్యచేసినవాడు. నీసత్రమునకు అర్వావసువచ్చాడు. (39 ఓరాజ! ఈ సత్రంనుండి ఈతనిని త్వరగానీవుతొలగించు. లేని పక్షంలో సత్రయాగం యొక్క ఫలహాని కల్గుతుంది (40) అనిఅనగా ఆరాజు తనదూతలతో యాగంనుండి ఆతనినితొలగించాడు. తొలగింపబడుతూఅర్వావనురాజుతో ఇట్లాఅన్నాడు. (41) బృహద్ద్యుమ్న ! పుణ్యాత్ముడ ! నేనీ బ్రహ్మహత్యనుచేయలేదు. ఓవిభు!కానిమాపెద్ద అన్నయ్యే ఆబ్రహ్మహత్యచేశాడు. (42) అందుకొరకు నేను ఇప్పుడు బ్రహ్మహత్యావ్రతాన్నిచరించాను. అనిచెప్పగాఆరాజువరావనుమాటతో (43) తన సత్రంనుండి అర్వావసును తొందరగా తొలగించాడు. బ్రహ్మణులు కూడా ధిక్కరించగా ఆతడు మౌనంగా అప్పుడు అడవికి వెళ్లాడు. (44) మునివృంద ములతోనిండిన తపోవనమునకు చేరి ఆతడు అర్వావసు దేవతలు కూడా ఆచరింపలేని తపమాచరించాడు (45) సమాధి యందుండి తపస్సుచేస్తూ అట్లాగే ఆదిత్యుని ఉపాసించాడు. ఆతని గొప్పతపస్సుతో, అదుష్టమైన బుద్ధిగలవాడు మూర్తి మంతుడైస్వయంగా (46) తనకాంతిలో జగతీతలాన్ని వెలిగింప జేస్తూ ప్రత్యక్షమైనాడు కర్మసాక్షి, జగ్తుత్తున కుచక్షువు, భాస్కరుడు దేవతలకు అగ్రణి ప్రత్యక్షమైనాడు. (47) ఇంద్రునిపురస్కరించుకొని దేవతలు ప్రత్యక్షమైనారు. పిదప ఇంద్రాది దేవతలు అర్వావసుతో ఇట్లాఅన్నారు. (48) అర్వావసు ! తపస్సువల్ల బ్రహ్మచర్యంవల్లనీవు శ్రేష్ఠుడవు. ఆచారంతో, శ్రుతంతో, వేదశాస్త్రాది దీక్షతోకూడా ప్రవరుడు (49) నీవు వరావసుతో అనేక అవమానంతో నిరాకరింపబడ్డావు. నీవుకోపగించలేదు. కాబట్టి క్షమతో కూడియున్నట్టే (50) జ్యేష్ఠుడు తండ్రిని చంపాడు. ఓ మహామతి! నీవు హింసించలేదు. అతని కొరకు నీవు బ్రహ్మహత్యావ్రతాన్ని చరించావు (51) అందువల్ల నిన్ను స్వీకరిస్తున్నాము. పరావసును తిరస్కరిస్తున్నాము. అని పలికి ఇంద్రుడు ముఖ్యులుగా గల దేవతలందరు (52) ఆతనిని శ్రేష్ఠునిగా గణించారు. పరావసును నిరాకరించారు. తిరిగి ఇంద్రాది దేవతలు సూర్యుని పురస్కరించుకొని (53) అర్వావసుతో ఇట్లా అన్నారు. నీవు వరాన్నివేడుకో, అని

మూ || సచాపి ప్రార్థయా మాస జనక స్యోత్థితిం పునః ||54||

వధేచాస్మరణ ందేవానాత్మనోజనకన్యవై | తథాస్త్వితి సురాః ప్రోచుః పునరూచురిదం వచః ||55||

వరంచాన్యం ప్రదాస్యామో పరయత్వం మహామతే | ఏవముక్తః సురైః పునరూచురిదం వచః ||56||

మమభ్రాతురదుష్టత్వం భవతు త్రిదశాలయాః | అర్వావసోః వచః శ్రుత్వాత్రిదశాః పునరబ్రువన్‌ ||57||

బ్రహ్మణస్యపితుర్ఘాతాత్‌ మహాన్‌ దోషః పరావసోః | సహ్యన్యకృత పాపస్య పరేణానుష్ఠితేనవై ||58||

ప్రాయశ్చిత్తేన శాంతిః స్యాత్‌ మహాపాతక పంచకే | పితుర్ర్బాహ్మణ హంతుస్తు సుతరాం నాస్తి నిష్కృతిః ||59||

ఆత్మనానుష్ఠితేనా పివ్రతేననహిదుష్కృతిః | పరావసోస్తవభ్రాతుః అతోనైవాస్తి నిష్కృతిః ||60||

అతోస్మాభిరదుష్టత్వమసై#్మ దాతుంనశక్యతే | అర్వావసుః పునః ప్రాహ దేవానింద్రపురోగమాన్‌ || 61 ||

తథాపి యుష్మన్మాహాత్మ్యాత్‌ ప్రసాదాత్‌ భవతాం తథా | పితుర్‌బ్రాహ్మణ హంతుర్నేభ్రాతుస్త్రిదశసత్తమాః ||62||

యథాస్యాన్నిష్కృతి ర్ర్బూత తథైవ కృపయాయుతాః | ఏవమర్వావసోః శ్రుత్వావచస్తేత్రిదశాలయాః || 63 ||

ధ్యాత్వాతు సుచిరంకాలం వినిశ్చిత్యే దమబ్రువన్‌ | ఉపాయంతే ప్రవక్ష్యామః తత్పాతక నివారణం || 64 ||

దక్షిణాం బునిధౌపుణ్య రామసేతౌ విముక్తిదే | ధనుష్కోటిరితి ఖ్యాతం తీర్థమస్తి విముక్తిదం || 65 ||

బ్రహ్మహత్యా సురాపాన స్వర్ణస్తేయ వినాశనం | గురుతల్పగ సంసర్గ దోషాణా మపినాశనం || 66 ||

అకామేనాపియః స్నాయాత్‌ అపవర్గఫలప్రదం | దుఃస్వప్న నాశనం ధన్యం నరకక్లేశనాశనం || 67 ||

కైలాసాది పదప్రాప్తి కారణం పరమార్థదం | సర్వకామమిదం పుంసాం ఋణదారిద్ర్యనాశనం || 68 ||

ధనుష్కోటి ధనుష్కోటి ధనుష్కోటి రితీరణాత్‌ | స్వర్గాపవర్గదంపుంసాంమహాపుణ్యఫలప్రదం || 69 ||

తత్రగత్వాతవభ్రాతా స్నాయాద్యది పరావసుః | తత్‌క్షణా దేవతే జ్యేష్ఠో ముచ్యతే బ్రహ్మహత్యయా || 70 ||

ఇదంరహస్యం సుమహత్‌ ప్రాయశ్చిత్త ముదీరితం || 71 ||

తా || తన తండ్రి తిరిగి బ్రతకాలని అతడు ప్రార్థించాడు (54) తన తండ్రియొక్క వధను స్మరించక పోవటంను వరంగా దేవతలను కోరాడు. అట్లాగే కానిమ్మని దేవతలన్నారు . తిరిగి ఇట్లా అన్నారు. (55) ఇంకొక వరాన్నిస్తాము. ఓ మహామతి ! నీవు కోరుకో అని దేవతలనగా, ఆ అర్వావసు ఇట్లా అన్నాడు (56) ఓ త్రిదశాలయులార ! నాఅన్న అదుష్టుడు కావాలి. అర్వావసుమాటలను విని త్రిదశులు తిరిగి ఇట్లన్నారు (57) బ్రాహ్మణుడైన పితరుని చంపడం వల్ల పరావసునకు పెద్ద దోషం వస్తుంది. ఇతరుడు పాపం చేయగా, మరొకడు (58) ప్రాయశ్చిత్తం అనుష్ఠిస్తే శాంతిలేదు. మహాపాతక పంచకంలో తండ్రిని, అందున బ్రాహ్మణున్ని చంపిన వానికి ఏమాత్రం నిష్కృతి లేదు. (59) తాను వ్రతాన్ని అనుష్ఠించినా నిష్కృతి లేదు. నీ అన్నయైన పరావసునకు కూడా నిష్కృతి లేదు (60) అందువల్ల మేము అతనికి అదుష్టత్వమును ఇవ్వలేము అని అనగా అర్వావసు తిరిగి ఇట్లన్నాడు. ఇంద్రుడు మొదలుగా గల దేవతలతో (61) ఐనా మీమాహాత్మ్యం వల్ల అట్లాగే మీ అనుగ్రహం వల్ల, తండ్రి, బ్రాహ్మణుడుఐన వానిని చంపిన మా అన్నకు ఓ దేవతలార ! (62) నిష్కృతి ఎట్లా కలుగుతుందో, అట్లాగే దయతో చెప్పండి. అని అర్వావసు అనిన మాటలను విని ఆ దేవతలు (63) చాలా కాలం ధ్యానించి నిశ్చయించి ఇట్లా అన్నారు. ఆ పాతక నివరణ కొరకు ఉపాయాన్ని చెప్తాము. (64) దక్షిణ సముద్రమందు పుణ్యమైన ముక్తినిచ్చే రామసేతువు యందు ధనుష్కోటియని ప్రసిద్ధి చెందిన ముక్తినిచ్చే తీర్థముంది (65) బ్రహ్మహత్య సురాపానము, స్వర్ణస్తేయము వీటన్నిటిని నశింపచేసేది, గురుతల్పగ సంసర్గ దోములను నశింపచేసేది (66) ఏ కోరికి లేకుండా స్నానం చేసినా ముక్తిఫలాన్నిచ్చేది, దుస్సప్నములనశింపచేసేది ధన్యమైనది, నరకక్లేశ నాశకము (67) కైలాసాది పదప్రాప్తికి కారణమైనది, పరమార్థమునిచ్చేది, ఇది పురుషులకు అన్ని కామములనిచ్చేది (కోరికలు ఇదే) ఋణ దారిద్ర్య నాశకము(68) ధనుష్కోటి, ధనుష్కోటి, ధనుష్కోటి అని పలికితే పురుషులకు స్వర్గఅపవర్గములనిచ్చేది మహా పుణ్యఫలప్రదము (69) అక్కడికి వెళ్ళి నీ అన్న పరావసు స్నానం చేసినట్లైతే ఆ క్షణంలోనే నీ జ్యేష్ఠుడు బ్రహ్మహత్యతో ముక్తుడౌతాడు (70) ఈ చాలా గొప్ప రహస్యమైన ప్రాయశ్చిత్తాన్ని చెప్పాము.

మూ|| ఉక్త్వేత్యర్వావసుందేవాఃప్రయముఃస్వపురీంప్రతి || 71 ||

తతఅర్వావసుర్జ్యేష్ఠంసమాదాయవరావసూ | రామచంద్రధనుష్కోటిం ప్రయ¸°ముక్తిదాయనీం || 72 ||

సేతౌ సంకల్ప ముక్త్వాతు నియమేన పరావసుః | సహ భ్రాత్రా ధనుష్కోటౌ నస్నౌ పాతక శుద్ధయే || 73 ||

స్నాత్వోత్థితం ధనుష్కోటౌ తం ప్రోవాచా శరీరిణి | పరావసో వినష్టాతే పితుః బ్రాహ్మణ ఘాతజా || 74 ||

బ్రహ్మహత్యా మహాఘోరా నరక క్లేశకారిణీ | ఇత్యెక్త్వా విర రామాథ సాపి వాగశరీరిణి || 75 ||

పరావసుస్తదా విప్రాః కనిష్ఠేన సమన్వితః | రామచంద్ర ధనుష్కోటిం ప్రణమ్యచ సభక్తికం || 76 ||

రామనాథం మహాదేవం సత్వా భక్తి పురః నరం | విముక్తపాతకోవిప్రాః ప్రయ¸°పితురాశ్రమం || 77 ||

మృత్వోత్థితస్తదారైభ్యోదృష్ట్వా పుత్రౌ సమాగతౌ | సంతుష్ట హృదయో హ్యాస్తే పుత్రాభ్యాం స్వాశ్రమే తదా || 78 ||

రామచంద్ర ధనుష్కటౌ స్నానేన హత పాతకం | ఏవం పరావసుం సర్వేస్వీచక్రుర్మున యస్తదా || 79 ||

ఏవం పరావసోరుక్తం బ్రహ్మహత్యావిమోక్షణం | స్నాన మాత్రా ద్ధనుష్కటౌ యుష్మాకం మునిపుంగవాః || 80 ||

సురాపానా దయోవిప్రాసశ్యంత్యే వాత్రమజ్జనాత్‌ | సత్యం సత్యంపునస్సత్యముద్ధృత్య భుజముచ్యతే || 81 ||

మహాపాతక సంఘాశ్చనశ్యేయుర్మజ్జనాదిహ | యఇమంపఠతేధ్యాయం బ్రహ్మహత్యా విమోక్షణం || 82 ||

బ్రహ్మహత్యా వినశ్యేత తత్‌ క్షణాన్నాప్తి సంశయః సురాపానా దయోప్యస్య శాంతింగచ్ఛేయు రంజసా || 83 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే ధనుష్కోటి ప్రశంసాయాం పరావసోర్ర్బహ్మహత్యావిమోక్షణంనామ త్రయస్త్రింశోధ్యాయః || 33 ||

తా || అని అర్వావసునకు చెప్పి దేవతలు తమ నగరమునకు వెళ్ళారు (71) పిదప అర్వావసు జ్యేష్టుడైన పరావసును తీసుకొని ముక్తిదాయినియైన రామచంద్ర ధనుష్కోటికి వెళ్ళాడు. (72) పరావసువు నియమంగా సేతువుయందు సంకల్పం చెప్పి పాతకశుద్ధికొరకు ధనుష్కోటి యందు తమ్మునితో కలిసి స్నానం చేశాడు. (73) ధనుష్కోటి యందు స్నానం చేసి లేచిన అతనితో అశరీరవాణి ఇట్లా అంది తండ్రిని బ్రాహ్మణుని చంపినందువల్ల వచ్చిన పాపము నష్టమైంది (74) బ్రహ్మహత్య మహాఘోరమైంది. నరకక్లేశమును కల్గించేది. అని పలికి ఆ అశరీరవాణి కూడ విరమించింది. (75) ఓ విప్రులార ! అప్పుడు పరావసువు తమ్మునితో కూడి భక్తితో రామచంద్ర ధనుష్కోటికి నమస్కరించి (76) రామనాధుడైన మహాదేవుని భక్తి పూర్వకముగా నమస్కరించి పాతకముల నుండి ముక్తుడై తండ్రి ఆశ్రమమునకు వెళ్ళాడు (77) చనిపోయిలేచిన రైభ్యుడు కొడుకులు రావటం చూసి సంతుష్ట హృదయుడై పుత్రులతోపాటు తన ఆశ్రమంలో ఉన్నాడు (78) రామచంద్ర ధనుష్కోటిలో స్నానంవల్ల పాపములు పోయిన ఈ పరావసును మునులంతా స్వీకరించారు. (79) ఈ విధముగా పరావసు బ్రహ్మహత్య విముక్తిని చెప్పాను. ఓ మునిశ్రేష్ఠలార ! ధనుష్కోటిలో స్నానం వల్లనే ఈ ముక్తి (80) ఇక్కడ స్నానం వల్ల సురాపానాదులు నశిస్తాయి. సత్యము సత్యము సత్యము చేతులెత్తి చెప్తున్నాను (81) ఇక్కడ స్నానం వల్ల మహా పాతక సంఘాలు నశిస్తాయి. బ్రహ్మహత్యా విమోక్షణమైన ఈ అధ్యాయాన్ని చదివినవారి (82) బ్రహ్మహత్య వెంటనే నశిస్తుంది. అనుమానంలేదు. అతని సురాపానాదులు కూడా త్వరగా శాంతిస్తాయి (83) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంహిత యందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్య మందు ధనుష్కోటి ప్రశంస యందు పరావసు బ్రహ్మహత్యా విమోక్షణ మనునది ముప్పది మూడవ అధ్యాయము || 33 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters