Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఇరువది ఎనిమిదవ అధ్యాయము

మూ || శ్రీసూత ఉవాచ -

కోటితీర్థం మహాపుణ్యం సేవిత్వాకేవలంనరః | స్నాతుం జితేంద్రియ స్తీర్ణం తతః సాధ్యామృతంవ్రజేత్‌ || 1 ||

సాధ్యామృతం మహాతీర్థం మహాపుణ్య ఫలప్రదం | మహాదుఃఖ ప్రశమనం గంధమాదన పర్వతే || 2 ||

అస్తిపాప హరం పుంసాం సర్వాభీష్టప్రదాయకం | యత్రస్నాత్వానరో భక్త్యాసర్వాన్‌ కామానవాప్నుయాత్‌ || 3 ||

తపసాబ్రహ్మచర్యేణ యజ్ఞైః దానేన వాపునః | గతింతాం నలభేన్మర్త్యోయాం సాధ్యామృతమజ్జనాత్‌ || 4 ||

స్పృష్టానియేషా మంగాని సాధ్యామృతజలైశ్శుభైః | తేషాం దేహగతం పాపం తత్‌క్షణాదేవనశ్యతి || 5 ||

సాధ్యామృతజలేయన్తుసాఘమర్షణ కృన్నరః | సవిధూయేహపాపానివిష్ణలోకేమహీయతే || 6 ||

పూర్వే పయసి పాపానికృత్వాకర్మాణి యోనరః | పశ్చాత్‌ సాధ్యామృతం సేవేత్‌ పశ్చాత్తాప సమన్వితః || 7 ||

అన్తే వయసి ముక్తః స్యాత్‌ సనరో నాత్ర సంశయః | సాధ్యామృతేనరః స్నాత్వా దేహబంధాద్విముచ్యతే || 8 ||

సాధ్యామృత జలే స్నాతా మనుష్యాః పాపకర్మిణః | అనేక క్లేశఘోరాణి నరకాణిసయాంతిహి || 9 ||

సాధ్యామృతజలే స్నానాత్‌ పుంసాంయాస్యాత్‌ గతిర్ద్విజాః | న సాగతిర్భవేద్యజ్ఞైః నవేదైఃపుణ్యకర్మభిః || 10 ||

యావదస్థి మనుష్యాణాం సాధ్యామృతజలేస్థితం | తావద్వర్షాణి తిష్టంతి శివలోకేసుపూజితాః || 11 ||

అపహత్య త మస్తీవ్రం యథాభాత్యుదయేరవిః | తథాసాధ్యామృత స్నాయీ భిత్వాపాపాని రాజతే || 12 ||

వాంఛితాన్‌ లభ##తే కామానత్రస్నాతో నరః సదా | యత్రస్నాత్వా మహాపుణ్య పురారాజపురూరవాః || 13 ||

విప్రయోగం సహోర్వశ్యాజహౌతుంబురుశాపజం

ఋషయ ఉవాచః-

కథం సూత మహాభాగ సహోర్వశ్యామరస్త్రియా || 14 ||

ప్రథమంలబ్ధవాన్‌ యోగం మర్త్యోరాజాపురూరవాః | విప్రయోగం సహోర్వశ్యాజహౌతుంబురుశాపజం || 15 ||

హేతునాకేన రాజానం శశాపతుంబురుర్మునిః | ఏతత్సర్వం సమాచక్ష్వ విస్తరాన్ముని పుంగవ || 16 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - మహాపుణ్యప్రదమైన కోటి తీర్థమును మాత్రము సేవించి, నరుడు పిదప జితేంద్రియ తీర్థము పిదప సాధ్యామృత తీర్థ మందు స్నానం చేయటానికి వెళ్ళాలి (1) సాధ్యామృతము గొప్ప తీర్థము. మహా పుణ్య ఫలము నిచ్చేది. మహా దుఃఖమును తొలగించేది. గంధమాదన పర్వతమందు (2) ఉంది. అది పాపహరము సర్వాభీష్టముల నిచ్చేది. అక్కడ నరుడు భక్తితో స్నానం చేసిన అన్ని కోరికలను పొందుతాడు (3) తపస్సుతో బ్రహ్మచర్యంతో యజ్ఞం దానములతో పొందని గతిని సాధ్యామృత తీర్థమజ్జనం వల్ల పొందుతాడు (4) శుభ##మైన సాధ్యామృత జలం శరీరాన్ని తాకినట్లైతే, వారి దేహగత పాపము ఆక్షణంలోనే నశిస్తుంది (5) సాధ్యామృతజల మందు అఘమర్షణ స్నానం చేసిన నరుడు ఇక్కడ పాపాలు పోగొట్టుకుని విష్ణులోకంలో వెలుగుతాడు (6) పూర్వవయస్సులో పాపకర్మలు చేసిన నరుడు, పిదప పశ్చాత్తాపంతో సాధ్యామృతాన్ని సేవిస్తే (7) ఆ నరుడు అంత వయస్సులో ముక్తుడౌతాడు. అనుమానంలేదు. నరుడు సాధ్యామృతంలో స్నానం చేసి దేహ బంధమునుండి ముక్తుడౌతాడు (8) సాధ్యామృతజలమందుస్నానంచేసిన పాపకర్ములు అనేకక్లేశములతో ఘోరమైన నరకములకు వెళ్ళరు (9) సాధ్యామృత జలంలో స్నానం వల్ల నరులకు కలిగే గతి యజ్ఞములతో వేదములతో పుణ్యకర్మలతో కలగదు (10) సాధ్యామృత జలమందున్నవారు, మనుష్యులకు ఎముకలెన్ని ఉన్నాయో అంతకాలము పూజితులై శివలోకమందుంటారు (11) తీవ్రమైన చీకటి తొలగించి ఉదయమందు రవివెలిగినట్లు, సాధ్యామృత మందు స్నానం చేసినవారు పాపముల ఛేదించి వెలుగుతారు (12) ఇక్కడ స్నానము చేసి పూర్వంపురూరవుడను రాజు తుంబురు శాపంవల్ల వచ్చిన ఊర్వశి వియోగమును తొలగించుకున్నాడు (13) ఋషులిట్లనిరి - ఓ మహాభాగ ! సూత ! అమరస్త్రీయైన ఊర్వశీతో (14) మర్త్యుడైన పూరూరవరాజు మొదట ఎట్లా యోగాన్ని పొందాడు. తుంబురు శాపం వల్ల కల్గిన ఊర్వశి వియోగాన్ని ఎట్లా వదిలాడు (15) తుంబురుముని ఏ కారణంగా రాజును శపించాడు. ఓ మునిపుంగవ! ఇదంతా విస్తరంగా చెప్పండి, అని (16)

మూ || సూత ఉవాచ -

ఆ సీత్పురూరవానామశక్రతుల్యపరాక్రమః | రాజరాజనమోరాజా పురాహ్యమరపూజితః || 17 ||

ధర్మతః పాలయామానమేదినీం సనృపోత్తమః | ఈ జేచ బహుభిర్యజ్ఞేః దదౌదానాని సర్వదా || 18 ||

ప్రశాసతి మహీంసర్వాం రాజ్ఞితస్మిన్మహామతౌ | మిత్రా వరుణశాపేన భువం ప్రాపోర్వశీద్విజాః || 19 ||

సాచచారోర్వశీతత్రరాజ్ఞస్తత్యపురాంతికే | కో కిలాలా పమధురవీణ యోపవనే జగౌ || 20 ||

స రాజోపవనేరంతుం కదాచిద్ధృత కౌతుకః | అరూఢతురగః ప్రాయాత్‌ లలనాశతనంవృతః || 21 ||

తాదృశీమూర్వశీంతత్ర కరసమ్మిత మధ్యమాం | ఉవాచచైనాం రాజాసౌ భార్యా మమభ##వేతివై || 22 ||

సాపికామాతురా తత్ర రాజానం ప్రత్యభాషత | భవత్వేవంసరశ్రేష్ఠ సమయం యదిమే భవాన్‌ || 23 ||

కరిష్యతితావాభ్యాశేవత్స్యా మిధృతకౌతుకా | కరిష్యే సమయం సుభ్రుతవా హమితి సో బ్రవీత్‌ || 24 ||

అధోర్వ శీబ భాషేతం పూరూరవనముత్సుకా | పుత్ర భూతం మమయది రక్షస్యురణ కద్వయం || 25 ||

ననగ్నో దృశ్యసే రాజన్‌ కదాపి యదివైతథా | నోచ్ఛిష్ఠం మమదద్యాశ్చేత్త దావత్స్యే తవాంతికే || 26 ||

ఘృతమాత్రాశనా చాహం భవిష్యా మినృపోత్తమ | ఏవ మస్త్వితి రాజోక్తాం తాం ని నాయని జంగృహం || 27 ||

అలకాయాంసభూపాలః తథా చైత్రరధేవనే | రేమే సరస్వతీతీరే పద్మ ఖండ మనోరమే || 28 ||

ఏక షష్ఠి సవర్షాణి రమమాణస్తయానయత్‌ | తేనోర్వశీప్రతి దినం వర్ధ మానానురాగిణీ || 29 ||

స్పృహాం నదేవలోకే పి చ కారతను మధ్యమా | నాభవ ద్రమణీ యోసౌ దేవలోకస్త యావినా || 30 ||

అతస్తామాన యిష్యామి దేవలోకమితి ద్విజాః | విశ్వావసుర్విచార్యైవం భూర్లోక మగమత్‌ క్షణాత్‌ || 31 ||

ఉర్వశ్యాః సమయం రాజ్ఞా విశ్వావసురయం సహ | విదిత్వా సహగంధర్వైః సమవేతో నిశాంతరే || 32 ||

ఉర్వశ్యాః శయనాభ్యాశాత్‌ జగ్రాహో రణకంజవాత || 32 1/2 ||

ఆకాశేనీయమానస్య తస్యశ్రుత్వోర్వశీవతిం || 33 ||

అబ్రవీన్మత్సుతఃకేనగృహ్యతేత్యజ్యతామయం | అనాథాశరణంయామికంనరంగతచేతనా || 34 ||

పురూరవాః సమాకర్ణ్యవాక్యంతస్యానిశాంతరే | మాంసనగ్నంనిరీక్షేతదేవీతినయ¸°తదా || 35 ||

అధాన్యమప్యురణకంగంధర్వాః ప్రతిగృహ్యతే | యయున్తస్యోరణస్యాపిశబ్దంశుశ్రావచోర్వశీ || 36 ||

తా || సూతుడిట్లనెను - ఇంద్రునితో సమానమైన పరాక్రమం కలవాడు పురూరవుడను రాజు, రాజరాజుతో సమానమైనవాడు దేవతలతో పూజింపబడినవాడు పూర్వం ఉండేవాడు (17) ఆ రాజు భూమిని ధర్మంగా పాలించసాగాడు. అనేక యజ్ఞములు చేశాడు ఎప్పుడూ దానాలు చేసేవాడు (18) ఆ బుద్ధి గలరాజు భూమిని పాలిస్తూ ఉండగా మిత్రావరుణుని శాపంవల్ల ఊర్వశి భూమిపైకి వచ్చింది (19) ఆ రాజుగారి పురం సమీపంలో ఆమె ఊర్వశి తిరుగసాగింది. కోకిల ధ్వనివలె మధురమైన వీణతో ఉపవనమునకు వెళ్ళింది (20) ఆ రాజు ఉపవనంలో విహరించుటకు ఒకసారి కుతూహలం కలవాడై గుఱ్ఱమునెక్కి నూరుగురు స్త్రీలతో కూడి వెళ్ళాడు (21) అటువంటి ఊర్వశిని, పిడికిటనణుగు నడుము కలదానిని చూచి రాజు నీవు నా భార్యవుకమ్ము అని ఆమెతో అన్నాడు (22) ఆమె కామాతురమై రాజుతో ఇట్లా అంది. నా షరతులను నీవు పాటించేట్లైతే అట్లాగే కాని ఓ రాజ ! అని అంది (23) కౌతుకం కలదాన్నై నీ ఆధీనంలో ఉంటాను అని అనగా రాజు ఓ సుభ్రు ! నీ ఒప్పందమును నేను ఆచరిస్తాను అన్నాడు (24) అప్పుడు ఉర్వశి పురూరవుని యందు ఔత్సుక్యం కలదై ఇట్లా అంది. పుత్రులతో సమానమైన నాఈ రెండు పొట్టెళ్ళను రక్షించే పక్షంలో, (25) అట్లాగే ఎప్పుడూ నగ్నంగా రాజా ! నీవు నాకు కన్పించని పక్షంలో, నాకు ఎంగిలి ఇవ్వనిపక్షంలో నేను నీ దగ్గర ఉంటాను (26) ఓ రాజా నేను నేయిని మాత్రమే భుజిస్తాను. అని అనగా అట్లాగే కానిమ్మని రాజు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు (27) ఆరాజు అలకానగర మందు అట్లాగే చైత్రరథవనమందు పద్మ ఖండములతో మనోహరమైన సరస్వతీ తీరమందు ఆనందంగా గడిపాడు (28) అరువది ఒక్క సంవత్సరాలు ఆమెతో క్రీడిస్తూ గడిపాడు. దానితో ఊర్వశి ప్రతిరోజు పెరుగుతున్న అనురాగం కలదై (29) అతనుమధ్యమదేవలోకంను గూడా జ్ఞప్తి చేయలేదు. ఆమె లేకుండ దేవలోకము అందంగా లేదు (30) అందువల్ల ఆమెను దేవలోకానికి తీసుకువస్తానని ఆలోచించి విశ్వావసువు క్షణంలో భూలోకానికి వచ్చాడు (31) రాజుతో కూడా ఊర్వశికి గల షరతులను విశ్వావసువు తెలుసుకొని, మధ్యరాత్రి గంధర్వులతో కూడి (32) ఉర్వశి యొక్క పడకగది నుండి వేగంగా పొట్టేలును ఎత్తుకెళ్ళాడు. ఆకాశంలో తీసుకుపోబడుతున్న దాని ధ్వనిని విని ఉర్వశి, పతి (33) తో ఇట్లా అంది. నా కొడుకును ఎవరు తీసుకెళ్తున్నారు. దానిని వదలండి. చైతన్యం కోల్పోయి. అనాథనై ఎవరిని శరణు వేడాలి (34) అర్థరాత్రి పురూరవుడు ఆమె మాటలనువిని, నగ్నంగా ఉన్న నన్ను దేవి చూడకూడదని అప్పుడు వెళ్ళలేదు (35) పిదప ఆ గంధర్వులు మరో పొట్టేలును కూడా తీసుకొని వెళ్ళారు. ఆ ఉరణము యొక్క శబ్దాన్ని కూడా ఉర్వశి విన్నది (36)

మూ || అనాథాయా మమసుతో గృహ్యతే తస్కరైరితి | చుక్రోశ##దేవీపరుషం కం యామిశరణంనరం || 37 ||

అమర్షవశమాపన్నః శ్రుత్వాతద్వచనంనృపః తిమిరేణావృతం సర్వమితిమత్వా నఖడ్గధృక్‌ || 38 ||

దుష్టదుష్టకు తోయాసీ త్యభ్యధావద్వచోవదన్‌ | తావత్సౌ దామినీ దీప్తా గంధర్వై ర్జనితా భృశం || 39 ||

తత్ర్ప భామండలైర్దేవీ రాజానం విగతాంబరం | దృష్ట్వానివృత్త సమయాతత్‌క్షణాదేవనిర్య¸° || 40 ||

త్యక్త్వాహ్యురణకౌతత్ర గంధర్వా అపినిర్యయుః రాజా మేషాసమాదాయ హృష్టః స్వశయానాంతికం || 41 ||

అగతో నోర్వశీంతత్ర దదర్శాయతలోచనాం | తాంచా పశ్యన్వివస్త్రశ్చ బభ్రామోన్మత్త పద్భువి || 42 ||

కురుక్షేత్రం గతో రాజాతటాకే పద్మనంకులే | చతుర్భిరప్సరస్త్రీభిః క్రీడమానాం దదర్శతాం || 43 ||

హేజాయే మనసా ఘోరే తి వ్యాహ రన్ముహుః | ఏవం బహుప్రకారం వైన సూక్తం ప్రాల వన్నృవః || 44 ||

అబ్రవీదుర్వశీం తంచ క్రీడంతీ సాప్సరోగణౖః | మహారాజాలమేతేన చేష్టితేన తవానఘ || 45 ||

త్వత్తో గర్భిణ్యహం పూర్వమబ్దాంతే భవతాత్రవై | అగంతన్యం కుమారస్తే భవిష్యత్యతి ధార్మికః || 46 ||

ఏకాం విభావరీం రాజంస్త్వయా వత్స్యామి వైతదా | ఇత్యుక్తో నృపతి ర్‌ హృష్టః స్వపురీం ప్రావిశద్ద్విజాః || 47 ||

తా సామప్సర సాం సాతుకథయా మానతం నృవం | అయం న పురుష శ్రేష్ఠో యేనాహం కామరూపిణా || 48 ||

ఏతా వంతం మహాకాలం అనురాగవశాతురా | ఉషితాస్మి సహానేన సఖ్యోనృపతినాచిరం || 49 ||

ఏవముక్తాః తతః సఖ్యస్తామూచుః సాధుసాధ్వితి | అనేనసాక మాస్యామః సర్వకాలం వయం సఖి || 50 ||

ఇత్యూచురుర్వశీం తత్ర సఖీమప్సరసస్త దా | అబ్దేథ పూర్ణే రాజాపి తటా కాంతికమాయ¸° || 51 ||

అగతంనృపతిం దృష్ట్వా పురూర వసముర్వశీ | కుమార మాయుషం తసై#్మ దదౌ సంప్రీత మానసా || 52 ||

తా || అనాథయైన నా కుమారుని దొంగలు తీసుకుపోతున్నారు, అని దేవి పరుషంగా ఏడ్చింది. ఏ నరుని శరణు వేడాలి అని అంది (37) రాజు ఆ మాటలను విని కోపమునకు లోనై అంతా చీకటిమయంగా ఉంది అని తలచి అతడు ఖడ్గం ధరించి (38) దుష్ట! దుష్ట! ఎక్కడి కెళ్తున్నావు అని అంటూ వెంబడించాడు. అంతలో గంధర్వులు కల్గించిన సౌదామిని బాగా వెలిగింది (39) ఆ కాంతులతో దేవి వస్త్రము లేని రాజును చూసి షరతు తప్పాడు కనుక ఆక్షణంలోనే వెళ్ళిపోయింది (40) అక్కడ పొట్టేళ్ళను వదలి గంధర్వులు కూడా వెళ్ళి పోయారు. రాజు ఆ మేషములను తీసుకొని ఆనందంతో తన పడక సమీపమునకు (41) వచ్చాడు. విశాలమైన నేత్రములు కల ఉర్వశి కనబడలేదు. ఆమె కన్పించక, వివస్త్రుడై యుండి పిచ్చివానివలె భూమిమీద తిరిగాడు (42) రాజు కురుక్షేత్రమునకు వెళ్ళి పద్మములతో నిండిన తటాక మందు నలుగురు అప్సర స్త్రీలతో క్రీడిస్తున్న ఆమెను చూచాడు (43) మనస్సులో ఘోరాఘోరా అని మాటి మాటికి అనుకుంటూ హేజాయ (భార్య) ఉండు అని అన్నాడు. ఈ విధముగా చాలా రకాలుగా మంచి మాటలను ఆ రాజు పలికాడు (44) అప్సరస గణములతో క్రీడిస్తూ ఉర్వశి అతనితో ఇట్లా అంది. ఓ పుణ్యాత్మ ! మహారాజ ! ఈ చేష్టలిక చాలు (45) నీ మూలంగానే, గర్భవ తినయ్యాను. అబ్దము చివర నీవు ఇక్కడికిరా. అతిధార్మికుడైన కుమారుడు నీకు కల్గుతాడు (46) అప్పుడు ఒకరాత్రిని నీతో గడుపుతాను ఓ రాజ ! అని అనగా రాజు సంతుష్టుడై తన పట్టణానికి చేరాడు (47) ఆ అప్సరసలకు ఆమె ఆ రాజును గూర్చి ఇట్లా చెప్పింది. ఈ పురుష శ్రేష్ఠునితో నేను కామరూపంతో (48) ఇంత పెద్ద కాలము అనురాగ వశురాలనై ఈ రాజుతో కూడా చాలా కాలము స్నేహంగా నివసించాను. అని (49) ఆమె చెప్పగా వారు చెలులు (బాగు) మంచిది మంచిది (బాగు) అని అన్నారు. సర్వకాలము మనము ఓ సఖి! ఇతనితో పాటు ందాము (50) అని సఖియైన ఉర్వశితో అప్సరసలు అన్నారు. సంవత్సరం నిండాక రాజు కూడా తటాక సమీపానికి వచ్చాడు (51) వచ్చిన పురూరవరాజును చూచి ఉర్వశి ఆయుష్మంతుడైన కుమారుని సంతోషమైన మనస్సుతో అతనికిచ్చింది (52).

మూ|| తేనసాకం నిశామే కాముషితా సానురాగిణీ | పంచ పుత్రcపదం గర్భం తస్మా దాపాశు సోర్వశీ || 53 ||

ఉవాచ చైనం రాజాన ముర్వశీ పరమాంగవా | పరం దాస్యంతి గంధర్వా మత్ర్పీత్యా తవ భూపతే || 54 ||

భవతాం ప్రార్థ్యతా తేభ్యోవరోరాజర్షి సత్తమ | ఇత్యుక్తః సత యారాజా ప్రాహ గంధర్వ సత్తమాన్‌ || 55 ||

అహం సంపూర్ణకోశశ్చ విజితారాతి మండలః | సలోకతాం వినోర్వశ్యాః ప్రాప్తవ్యం నాన్య దస్తిమే || 56 ||

అతస్తయాసహోర్వశ్యాకాలంనేతు మహం వృణ | ఏవముక్తే నృపేణాథ గంధర్వాన్తుష్టమానసాః || 57 ||

అగ్నిస్థాలీం ప్రదాయాసై#్మ ప్రోచుశ్చైనం నృపంతదా |

గంధర్వా ఊచుః -

అగ్ని వేదాను సారీ త్వం త్రి ధాకృత్వా నృపోత్తమ || 58 ||

ఇష్ట్వా యజ్ఞేన చోర్వశ్యాః సాలోక్యం యాహి భూపతే | ఇతీరి తసై#్త రాదాయ స్థాలీమగ్నే ర్య¸° నృపః || 59 ||

అహోబలాతి మూఢోహమితి మధ్యే వనం నృపః | ఉర్వశీన మయాల బ్ధావ హ్నిస్థాల్యాతు కింఫలం || 60 ||

నిధాయైవవనేస్థాలీం స్వపురం ప్రయ¸° నృపః | అర్ధరాత్రేవ్యతీతేసౌ విని ద్రోచింతయత్స్వయం || 61 ||

ఉర్వశీలోకసిద్ధ్యర్థం మమ గంధర్వపుంగవైః | అగ్నిస్థాలీ సంప్రదత్తా సాచత్యక్తా మయావనే || 62 ||

అహరిష్యే పునః స్థాలీమిత్యుత్థాయ య¸°వనం | నాగ్నిస్థాలీ దదర్శాసౌ వనే తత్ర పురూరవాః || 63 ||

శమీగర్భమధాశ్వత్థ మగ్నిస్థానే విలోక్యనః | వ్యచింతయన్మయా స్థాలీ నిక్షిప్తాత్రపనే పురా || 64 ||

సాచాశ్వత్థః శమీగర్భః సమభూదధునాత్విహ | తస్మాదేనం సమాదాయ వహ్నిరూప మహంపురం || 65 ||

గత్వాకృత్వారణీం సమ్యక్‌ తదుత్పన్నాగ్ని మాదరాత్‌ | ఉపాస్యామీతి నిశ్చిత్య స్వపురం గత వాన్నృ పః || 66 ||

తా || అనురాగంతో అతనితో పాటు ఒక రాత్రిని గడిపింది. ఆ ఉర్వశి అతని నుండి ఐదుగురు పుత్రులను ఇవ్వగలిగిన గర్భమును పొందింది. (53) పరమ అంగనయైన ఉర్వశి రాజుతో ఇట్లా అంది - నా సంతోషం కొరకు ఈ గంధర్వులు నీకు వరాన్ని ఇస్తారు. (54) నీవు ప్రార్థించగా వారు నీకు వరమిస్తారు ఓరాజర్షి. అని ఆమె చెప్పగా రాజు గంధర్వులతో ఇట్లా అన్నాడు (55) నాధనాగారం నిండుగా ఉంది. శత్రుమండలాన్ని జయించాను. ఉర్వశిలోకం చేరటం తప్ప నేను పొందగలిగింది మరొకటి లేదు (56) అందువల్ల ఆ ఉర్వశితో కూడా కాలం గడపటాన్ని నేను కోరుకుంటున్నాను.రాజు ఇట్లా పలుకగా గంధర్వులు సంతోషించిన మనస్సు కలవారై ఈతనికి అగ్నిస్థాలినిచ్చి ఈ రాజుతో ఇట్లా అన్నారు (57) గంధర్వులమాట - నీవు వేదముల అనుసరించేవాడివి. ఓ రాజ! అగ్నిని మూడు భాగములుచేసి (58) యజ్ఞము చేసి ఉర్వశి లోకమునకు చేరు ఓ రాజ ! అని వారనగా వారి నుండి అగ్ని స్థాలిని తీసుకొని రాజు వెళ్ళాడు (59) అడవిమధ్యలో రాజు నేను చాలా మూర్ఖుణ్ణి అయ్యో ! ఉర్వశి లంభిచలేదు. వహ్ని స్థానంతో పనియేమి (60) అని అనుకొని స్థాలిని అడవియందే ఉంచి రాజు తన నగరానికి వెళ్ళాడు. అర్థరాత్రి గడిచాక ఈ రాజు నిద్రరాక స్వయంగా ఇట్లా ఆలోచించాడు (61) ఉర్వశీలోక సిద్ధి కొరకు నాకు గంధర్వశ్రేష్ఠులు అగ్నిస్థాలినిచ్చారు. నేను దాన్ని అడవిలో వదిలాను (62) తిరిగి స్థాలిని తీసుకువస్తాను. అని లేచి అడవికి వెళ్ళాడు. ఈ పురూరవునకు అక్కడ అడవిలో అగ్ని స్థాలి కనిపించలేదు (63) అగ్ని స్థానములైన శమీ గర్భమును, అశ్వత్థమును రాజు చూచి ఇట్లా ఆలోచించాడు. ఇంతకు మందు ఈ అడవిలో నేను స్థాలిని పెట్టాను కదా (64) అది ఇప్పుడిక్కడ అశ్వత్థము శమీ గర్భము ఐంది. అందువల్ల నేను వహ్నిరూపమైన దీనిని తీసుకొని నగరానికి (65) వెళ్ళి మంచి గఅరణిని చేసి, అందుండి పుట్టిన అగ్నిని ఆదరంతో ఉపాసిస్తాను. అని నిశ్చయించుకొని రాజు తన నగరానికి వెళ్ళాడు (66).

మూ|| రమణీయారణీం చక్రే స్వాంగులైః ప్రమితా మసౌ |నిర్మాణ సమయే రాజాగాయత్రీమజ పద్ధ్విజాః || 67 ||

గాయత్ర్యాః పఠ్యమానాయాః యాని సంత్యక్షరాణిహి | తాప దంగుళి మర్యాదా మకరో దరణీం నృపః || 68 ||

తత్ర నిర్మథనాదగ్నిత్రయముత్పాద్య భూపతిః | ఉర్వశీలోక సంప్రాప్తి ఫలముద్దిశ్య కాంక్షితం || 69 ||

వేదాను సారీనృపతిః జహావాగ్ని త్రయం ముదా | తేనైవచాగ్ని విధినా బహూన్య జ్ఞాన థా తనోత్‌ || 70 ||

తేనగంధర్వలోకాంశ్చ సంప్రాప్య జగతీపతిః | సహోర్వశ్యా చిరంరేమే దేవలోకే ద్విజోత్తమాః || 71 ||

అథ సర్వామరోపేతః కదాచిత్‌ బలవృత్రహా | నృత్యం నురాంగ నానాం వై వ్యలోకయత సంసది || 72 ||

పురూర వానృపోప్యాయాత్‌ తదాదే వేంద్ర సంసదం | ద్రష్టుం సురాంగనా నృత్యం మనోహారి దివౌకసాం || 73 ||

ఏకైకశస్తాః శక్రస్య సనృతుః పురతోంగనాః అథోర్వశీ సమాగత్వ న నర్త పురతో హరేః || 74 ||

నృత్తాభినయ సామర్థ్య గర్వయుక్తా తదోర్వశీ | తంపురూరవనం దృష్ట్వా జహాసాతిమనోహరా || 75 ||

జహాసతత్ర రాజాపి తాం విలోక్యతదోర్యశీం | హససంకుపితస్తత్ర నాట్యాచార్యోథ తుంబురుః

శశా వతాపుభౌ కోపాత్‌ ఉర్వశీం చనృపోత్తమం || 76 ||

తుం ఋరురువాచ -

అనేక దేవ సంపూర్ణ సభాయా మత్రయత్కృతం || 77 ||

యువాభ్యాంహసితం నృత్తమధ్యేనిష్కారణం వృథా| తస్మాత్‌ఘటితిరాజేంద్రవియోగోయువయోః క్షణాత్‌ || 78 ||

భూయాదితిశశాపైనం సర్వదైవత సన్నిధౌ | అథశప్తో నృపస్తత్ర నాట్యా చార్యేణ దుఃఖితః || 79 ||

జగామశరణం తత్రపాహిపాహీతి వజ్రిణం | ఉవాచ దీనయావాచా పురుహూతం పురూరవాః || 80 ||

తా || రాజు తన అంగుళులతో కొలిచి అందమైన అరణిని చేశాడు. ఓ బ్రాహ్మణులార ! నిర్మాణ సమయమందు రాజు గాయత్రిని జపించాడు (67) గాయత్రిని చదువుతున్నపుడు దానికి ఎన్ని అక్షరాలున్నాయో అన్ని అంగుళుల ప్రమాణముగల అరణిని రాజు చేశాడు (68) అక్కడ చిలికి రాజు మూడగ్నుల పుట్టించి ఉర్వశీలోక సంప్రాప్తి ఫలాన్ని ఉద్దేశించి ఆ కోరికతో (69) వేదానుసారియైన రాజు మూడగ్నులలో ఆనందంగా హోమంచేశాడు. అదే అగ్ని విధితో అనేక యజ్ఞములను చేశాడు (70) దానితో రాజు గంధర్వలోకములను పొంది, దేవలోకంలో ఉర్వశితో కూడి చాలా కాలము రమించాడు (71) అందరు దేవతలతో కూడి ఒకసారి ఇంద్రుడు సభలో సురాంగనల నృత్యాన్ని చూచాడు (72) అప్పుడు దేవేంద్రుని సదస్సుకు పురూరవరాజు కూడా వచ్చాడు, మనోహరమైన స్వర్గంలో ఉండే దేవతాస్త్రీల నృత్యం చూడటానికి. (73) ఆ స్త్రీలు ఒక్క రొక్కరుగా ఇంద్రుని ఎదుట నాట్యం చేశారు. అప్పుడు ఉర్వశి వచ్చి ఇంద్రుని ఎదుట నాట్యం చేసింది. (74) నృత్త అభినయ సామర్థ్యమనే గర్వంతో కూడిన ఉర్వశి, ఆ పురూరవనుని చూచి అతి మనోహరమైన ఆమె నవ్వింది. (75) ఆ ఉర్వశిని చూచి అప్పుడు రాజు కూడా నవ్వాడు. పిదప నాట్యాచార్యుడైన తుంబురుడు హాసంతో కోపగించినవాడై ఉర్వశిని రాజును వారిద్దరిని కోపంతో శపించాడు (76) తుంబురుడిట్లన్నాడు. అనేక దేవతలతో నిండిన సభయందు మీరేం చేశారు (77) నిష్కారణంగా వృథాగా నాట్యం మధ్యలో మీరిద్దరు నవ్వారు. అందువల్ల మీకు ఇద్దరికి త్వరగా క్షణంలో వియోగము (78) కలగని, అని అందరు దేవతల సన్నిధిలో ఈతనిని శపించాడు. నాట్యాచార్యునితో శపించబడ్డరాజు దుఃఖితుడై (79) రక్షించు, రక్షించు అని ఇంద్రుని శరణు వేడాడు దీనమైన మాటలతో పురూరవుడు ఇంద్రునితో ఇట్లా అన్నాడు (80)

మూ|| ఊర్వశ్యా సహ సాలోక్య సిద్ధ్యర్థ మహా మిష్టవాన్‌ |అతస్తస్యావియోగమే అసహ్యఃస్యాత్పాకవాసన || 81 ||

ఇత్యుక్తవంతంతంప్రాహా సహస్రాక్షః శచీపతిః | శాపమోక్షం ప్రవక్ష్యామి మా భైషీస్త్వం నృపోత్తమ || 82 ||

దక్షిణాం భోనిధౌ పుణ్య గంధమాదన పర్వతే | సాధ్యామృత మితి ఖ్యాతం తీర్థమస్తి మహత్తరం || 83 ||

సేవితం సర్వదేవైశ్చ సిద్ధ చారణకిన్నరైః | సనకాది మహాయోగి మునివృంద నిషేవితం || 84 ||

భుక్తిముక్తి ప్రదం పుంసాం సర్వశాపవిమోక్షదం | అస్తి తీర్థం భవాంస్తత్ర గచ్ఛస్వత్వర యానృప || 85 ||

సర్వేషామమృతం స్నానాదత్రసాధ్యం యతస్తతః | సాధ్యామృత మితిఖ్యాతం సర్వలోకేషువిశ్రుతం || 86 ||

తత్ర స్నానాత్త వోర్వశ్యాః పునర్యోగో భవిష్యతి | మమలోకే నివాసశ్చ భవిష్యతిన సంశయః || 87 ||

ఇతివ్రతిసమాదిష్టో నృపః సంప్రీతమాససః | సాధ్యామృతం మహాతీర్థం సముద్దిశ్యయ¸°క్షణాత్‌ || 88 ||

సస్నౌ సాధ్యామృతే తత్ర మహా పాతకనాశ##నే | తత్ర స్నానాస్పృపో విప్రాః సద్యః శాపేనమోచితః || 89 ||

స్నానానంతర మేవాసా పుర్వశ్యా సహసంగతః | తయాసహ విమానస్థః ప్రయయా వమరావతీం || 90 ||

రేమే పునస్త యా సార్థం దేవవద్దేవ మందిరే | ఏవం ప్రభావంతత్తీర్థం సాధ్యామృత మనుత్తమం || 91 ||

పురూరవా సహోర్వశ్యా యత్రస్నానేన సంగతః | అతోత్ర తీర్థేయః స్నాయాత్‌ మహా పాతకనాశ##నే || 92 ||

వాంఛితాన్‌ లభ##తే కామాన్‌యాస్యతి స్వర్గముత్తమం | నిష్కామః స్నాతిచేత్‌ విప్రామోక్షమాప్నోతిమానవః || 93 ||

ఇమంపవిత్రం పాపఘ్నంఅధ్యాయం పఠతే తుయః | శ్రుణుయాద్వామనుష్యోసౌ వైకుంఠే లభ##తేస్థితిం || 94 ||

ఏవంవః కథితం విప్రా వైభవం పాపనాశనం | సాధ్యామృతస్యతీర్థస్య విస్తరాత్‌ శ్రద్ధ యామయా || 95 ||

యత్పురాసనకాదిభ్యఃప్రోక్తవాంశ్చతురాననః || 96 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతు మాహాత్మ్యే సాధ్యామృత తీథ ప్రశంసాయాం పురూర వః శాప విమోక్షణ వర్ణనంనా మాష్టా వింశోధ్యాయః || 28 ||

తా || ఉర్వశితో సహ సాలోక్య సిద్ధికొరకు నేను యజ్ఞం చేశాను. అందువల్ల ఆమె వియోగము నాకు భరింపరానిది ఓ ఇంద్ర ! (81) అని పలుకుతున్న అతనితో సహస్రాక్షుడు శచీపతి ఇట్లా అన్నాడు. ఓ రాజ! నీవు భయపడవద్దు. నీకు శాపమోక్షాన్ని చెబుతాను (82) దక్షిణ సముద్ర మందు పుణ్యమైన గంధమాదన పర్వతమందు మహత్తరమైనది సాధ్యామృతమని ప్రసిద్ధి చెందిన తీర్థముంది (83) సర్వదేవతలతో సిద్ధచారణకిన్నరులతో సేవింపబడేది. సనకాది మహాయోగిముని బృందములతో సేవింపబడేది (84) పురుషులకు భుక్తిముక్తులనిచ్చేది. సర్వశాపములనుండి ముక్తినిచ్చేది, తీర్థముంది ఓరాజ ! త్వరగా నీవు అక్కడికివెళ్ళు (85) అందరికి ఇక్కడ స్నానం వల్ల అమృతము సాధ్యమౌతుంది. కనుక సాధ్యామృతమని ప్రసిద్ధమైంది. సర్వలోకములలో ప్రసిద్ధమైంది (86) అక్కడస్నానంచేస్తే నీకు ఉర్వశికి తిరిగి యోగం కలుగుతుంది. నాలోకంలో నివాసంకూడా సంభవిస్తుంది. అనుమానంలేదు. (87) అని ఇంద్రుడు సమాధానము చెప్పగా రాజు ప్రీతినందినమనస్సుగలవాడై క్షణంలో సాధ్యామృత మహాత్తీర్థమును గూర్చి వెళ్ళాడు. (88) మహాపాతకనాశకమైన సాధ్యమృతమునందుస్నానంచేశాడు. ఓవిప్రులారా! అక్కడ స్నానం చేయటంవల్ల రాజువెంటనే శాపంనుండి విముక్తుడైనాడు (89) స్నానాంతరమే ఈరాజు ఉర్వశితో కూడకూడినాడు. ఆమెతో విమానమందు కూర్చుని అమరావతికి వెళ్ళాడు (90) దేవమందిరమందు దేవుని వలెతిరిగి ఆమెతో కూడిరమించాడు. ఇట్టి ప్రభావముగలది అత్యుత్తమమైన సాధ్యామృతతీర్థము (91) ఇక్కడ స్నానంచేయటంవల్ల పురూరవుడు ఉర్వశితో కలిశాడు. అందువల్ల ఈతీర్థంలో మహాపాతకనాశినిలో స్నానం చేసినవారు (92) ఇష్టమైన కోరికలను పొందుతారు. ఉత్తమమైన స్వర్గానికి చేరుతారు. నిష్కాముడై స్నానంచేస్తే మోక్షాన్ని పొందుతాడు (93) పవిత్రమైన పాపానాశనమైన ఈ అధ్యాయాన్ని చదివినవారు, విన్నవారు వైకుంఠంలోస్థానాన్ని పొందుతారు (94) ఈ విధముగా పాపనాశనవైభవాన్ని మీకు నేనుచెప్పానుఓవిప్రులారా ! విస్తారంగా శ్రద్ధగానేనుమీకు సాధ్యామృతతీర్థ వైభవాన్ని చెప్పాను (95) దీనిని బ్రహ్మపూర్వంస నకాదులకు చెప్పాడు. (96) అని శ్రీ స్కాందమహాపురాణమునందుఏ కాశీతిసహస్రసంహితయందు తృతీయమైన బ్రహ్మఖండయందు సేతుమాహాత్మ్యమందు సాధ్యామృతతీర్థప్రశంసయందు పురూరవశాపవిమోక్షణవర్ణనమనునది. ఇరువది ఎనిమిదవ అధ్యాయము || 28 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters