Sri Scanda Mahapuranamu-3    Chapters   

పందొమ్మిదవ అధ్యాయము

మూ|| శ్రీ సూత ఉవాచ-

తారక బ్రహ్మణస్తస్యతీర్థేస్నాత్వద్విజోత్తమాః | లక్ష్మణస్యతతస్తీర్థమభి గచ్ఛేత్సమాహితః || 1 ||

శ్రీ లక్ష్మణస్యతీర్థేతుస్నాత్వాపాపైర్విమోచితాః | ముక్తిం ప్రయాంతి విమలామపునర్భవలక్షణం || 2 ||

స్నానా ల్లక్ష్మస్యతీర్థేతు దారిద్ర్యం సశ్యతేభిలం | ఆయుష్మాన్‌ గుణవాన్‌ విద్వాన్‌ పుత్ర శ్చైవాస్యజాయతే || 3 ||

కూలే లక్ష్మణ తీర్థస్యతస్మంత్రంజ పతేతుయః | ససర్వశాస్త్రవత్తాస్యాత్‌ చతుర్వేదవిదప్యసౌ || 4 ||

తస్యకూలే మహల్లింగం స్థాపయామాసలక్ష్మణః | తత్రతీర్థేతుయః స్నాత్వాసేవతలక్ష్మణశ్వరం || 5 ||

ఇహదారిద్ర్యరోగాభ్యాం సంసారాచ్చవిముచ్యతే | స్నాత్వాలక్ష్మణ తీర్థేతుసేవిత్వాలక్ష్మణశ్వరం || 6 ||

బలభద్రః పురావిప్రాముముచే బ్రహ్మహత్యయా

ఋషయాఊచుః-

బ్రహ్మహత్యాకథమభూత్‌ రౌహిణ యస్యసూతజ | కథం చాత్ర వినష్టాసాతన్నో బ్రూహిమహామునే || 7 ||

శ్రీ సూత ఉవాచ-

శెషావతారో భగవాన్‌ బలభద్రః పురాద్విజాః || 8 ||

కురూణాం పాండవానాంచ యుద్థోద్యోగంవిలోక్యతు | బంధూనాం సపధంసోడుం అసమర్థోహలాయుధః || 9 ||

విచార మేవ మకరోత్‌ బలభద్రోమహామతిః | యద్యహంకురురాజస్యకరిష్యామి సహాయతాం || 10 ||

కోపఃస్యాత్పాండు పుత్రాణాంమయ్యవార్యః సుదారుణః | ఉపకారం కరిష్యామి పాండవానామహంయది || 11 ||

దుర్యోధనస్యకోవః స్వాదితిబుద్థ్వాహలాయుధః | తీర్థయాత్రచ్ఛలేనాసౌమధ్యస్థః ప్రయ¸°తదా || 12 ||

ప్రభాసమభిగమ్యాథ స్నాత్వాసంకల్పపూర్వకం | దేవాన్‌ ఋషీన్‌ పితృగణాన్‌ తర్పయామాసవారిణా || 13 ||

సరస్వతీం తతః ప్రాయాత్‌ ప్రతీచ్యాభిముఖాంహలీ | పృథూదకం బిందు సరోముక్తిదం బ్రహ్మతీర్థకం || 14 ||

గంగాచయమునాం సింధుంశతధ్రూంచసుదర్శనం | సంప్రాప్యబలభద్రో7యం స్నాత్వాతీర్థేషు ధత్మతః || 15 ||

ప్రపేదే నైమిషారణ్యం మునీంద్రైరభిసేవితం

తా || శ్రీ సూతులిట్లనిరి - తారక బ్రహ్మతీర్థంలో స్నానం చేసి ఓ బ్రాహ్మణులార ! శ్రద్థతో లక్ష్మణ తీర్థమునకు ఆ పిదప వెళ్ళాలి (1) లక్ష్మణ తీర్థంలో స్నాతులైతె పాపవిముక్తులై మళ్ళీ పునర్జన్మ అంటూ లేని విమలమైన ముక్తికి వెళ్ళారు. (2) లక్ష్మణ తీర్థంలో స్నానమువలన సమస్త దరిద్రము నశిస్తుంది. ఆయుష్మంతుడు,గుణవంతుడు,విద్వాంసుడు ఐన పుత్రుడు జన్మిస్తాడు (3) లక్ష్మణ తీర్థము తీరమందు ఆ మంత్రం జపించిన వారు సర్వశాస్త్ర వేత్తలు, చతుర్వేదవిధులు ఔతారు. (4) దాని తీరమందు లక్ష్మణుడు మహా లింగమును స్థాపించాడు. ఆ తీర్థంలో స్నానం చేసి లక్ష్మణశ్వరుని సేవించినవారు (5) ఇక్కడ దారిద్ర్య రోగములనుండి సంసారము నుండి ముక్తులౌతారు. లక్ష్మణ తీర్థంలో స్నానం చేసి లక్ష్మణశ్వరుని సేవించి పూర్వము బల రాముడు బ్రహ్మహత్య నుండి ముక్తుడైనాడు (6) ఋషులమాట - ఓ సూతజ ! బలరామునకు బ్రహ్మహత్యదోషం ఎట్లా సంభవించింది. అది ఇక్కడ ఎట్లానష్టమైంది ఓ మహాముని ! మాకు చెప్పండి (7) శ్రీ సూతులిట్లనిరి - పూర్వము బలరాముడు, శేషావతారుడు (8) అతడు కౌరవపాండవుల యుద్ధ ప్రయత్నాన్ని చూసి బంధువుల చావును సహించుటకు అసమర్థుడై (9) బుద్థిమంతుడైన బలభధ్రుడు ఇట్లా ఆలోచించాడు. నేనొకవేళ కురురాజునకు సహాయం చేసినట్టైతే (10) భయంకరమయిన తొలగించరాని కోపం నాపై పాండవులకు కల్గుతుంది. ఒకవేళ పాండవులకు నేను ఉపకారం చేసినట్టైతే (11) దుర్యోధనునకు కోపం వస్తుంది. అని హలాయుధుడు భావించి, తీర్థయాత్రా నెపంతో మధ్యస్తుడై వెళ్ళి పోయాడు. అప్పుడు (12) ప్రభాస తీర్థమునకు వెళ్ళి సంకల్ప పూర్వకముగా స్నానం చేసి దేవతలకు, ఋషులకు పితృగణములకు నీటితో తర్పణం చేశాడు. (13) పిదప ప్రతీచి అభిముఖమైన సరస్వతీనదికి వెళ్ళాడు. హలి, పృథూదకము గల బిందు సరస్సు, ముక్తినిచ్చే బ్రహ్మతీర్థము (14) గంగ, యమున, సింధు, శతద్రు, సుదర్శనములకు చేరి ఈ బలరాముడు ఆయా తీర్థములలో ధర్మము ప్రకారము స్నానంచేసి (15) మునీంద్రులతో సేవింపబడే నైమిశారణ్యము చేరాడు.

మూ || ఆగతంతం విలోక్యాథ నైమిశీయాస్తపస్వినః || 16 ||

దీర్ఘసత్రేస్థితాః సమ్యక్‌నియతాధర్మతత్పరాః | అభ్యుద్గమ్యయదుశ్రేష్ఠం ప్రణమ్యోత్థాయచాసనాత్‌ || 17 ||

అపూజయన్‌ విష్టరాద్యైః కందమూలఫలైస్తదా | ఆసనం పరిగృహ్యాయం పూజితః సపురః సరః || 18 ||

ఉచ్చాసనేస్థితం సూతం అనమంతం అనుత్థితం | అక్రుతాంజలి మాసీనం వ్యాసశిష్యం విలోకస్యః || 19 ||

విప్రాంశ్చానమతో దృష్ట్వావిలోకాత్మాన మాగతం | చుక్రోధరోహిణీసూనుఃసూతఃపౌరాణికోత్తమం || 20 ||

మధ్యేమునీనాంసూతోయంకస్మాన్నింద్యోనులోమజః | ఉచ్ఛాసనే సమధ్యాస్తే సయుక్తమిదమంజసా || 21 ||

అవమత్యభృశంచాస్మాన్‌ ధర్మసంరక్షకానయం | ఆస్తే7నుత్థాయ నిర్భీతిః నచప్రణమతే తథా || 22 ||

పఠిత్వాయం పురాణానిద్వైపాయన నకాశతః | సేతిహాసానిసర్వాణి ధర్మశాస్త్రాణ్యనేకశః || 23 ||

సమాం దృష్ట్వాప్రణమతే నవత్యజతి చాసనం | ద్వైపాయనస్యమహతః శిష్యాః పైలాదయోద్విజాః || 24 ||

ఏవం విధమ ధర్మంతే నైవకుర్యుర్యధాత్వయం | తస్మాదేనం వధిష్యామి దురాత్మానమచేతనం || 25 ||

దుష్టానాం నిగ్రహార్ధం హి భూర్లోకమహమాగమం | మయాహతోహి దుష్టాత్మాశుద్ధి మేష్యత్యసంశయం || 26 ||

ఇత్యుక్త్వాభగవాన్‌ రామోముసలీ ప్రబలోహలీ | పాణిస్థేన కుశాగ్రేణ తచ్ఛిరః ప్రాచ్ఛిన ద్రుషా || 27 ||

తత్రత్యామునయస్సర్వేహా కష్టమితి చుక్రుశుః | అవాదిషుస్తదారామం మునమోబ్రహ్మావాదినః || 28 ||

రామాధర్మః కృతఃకష్టస్త్వయా సంకర్షణ ప్రభో | అస్యసూతస్య చస్మాభిః దత్తం బ్రహ్మాసనంమహత్‌ || 29 ||

అక్షయం చయురస్మాభిః అస్యదత్తం హ లాయుధ | భవతా7జానతైవాద్యకృతో బ్రహ్మవధోమహాన్‌ || 30 ||

యోగేశ్వరస్యభవతోనాస్తికశ్చిన్నియామకః | అస్యాస్తు బ్రహ్మహత్యాయాః యత్కర్తవ్యం విచార్యతత్‌ || 31 ||

ప్రాయశ్చితం భవనేవలోక సంగ్రహణాయతు

కురుష్వభగవాన్‌ రామనాన్యేన ప్రేరితః కురు | ఇత్యుక్తో భగవాన్‌ రామః తానువాచమునీన్‌ ప్రతి || 32 ||

తా || వచ్చిన ఆతనిని నైమిష మందలి తపస్వులు చూచి (16) దీర్ఘసత్ర మందున్నవారు ధర్మతత్పరులు, చక్కని శ్రద్థకలవారు, ఆసనముల నుండి లేచి ఎదుగేరి యదుశ్రేష్టునకు నమస్కరించి (17) కంద మూల ఫలములతో అట్లాగే ఆసనము కల్పించుట ద్వారాను పూజించారు. పూజింపబడి ఈతడు ఆసనమును స్వీకరించి పురఃసరుడై (18) ఉన్నత ఆసనమందు కూర్చున్న, నమస్కరించని, లేచి నిలబడని సూతుని, చేతులు జోడించని వానిని, వ్యాసశిష్యుని చూచి ఈతడు (19) వచ్చిన తను చూచియు నమస్కరించని విప్రులను చూచి, పౌరాణికోత్తముడైన సూతుని రోహిణీ సూనుడు కోపగించాడు. (20) మునుల మధ్యలో నింద్యుడు, అనులోమజుడైన ఈ సూతుడెందుకు. ఉన్నత ఆసనమందు అధివసించి ఉన్నాడు. ఇది యుక్తమైంది కాదు (21) ధర్మసంరక్షకులమైన మమ్ములను ఈతడు చాలా అవమానం చేసి, లేచి నిలవకుండా, భీతిలేక, నమస్కరించకుండా ఉన్నాడు (22) ద్వైపాయనుని నుండి ఈతడు పురాణములు చదివి అన్ని ధర్మశాస్త్రములను, అనేక ఇతి హాసములు మొదలగు వనిని చదివి (23) నన్నుచూచి కూడా నమస్కరించటం లేదు. అసనం నుండి లేవటంలేదు. ద్వైపాయనుని గొప్ప గొప్ప శిష్యులు, పైలాది బ్రాహ్మణులు (24) ఈతడు చేసిన విధంగా ఇటువంటి అధర్మమును వారు చేయనే చేయరు. దురాత్ముడు, అచేతనుడు ఐన ఈతనిని వధిస్తాను (25) దుష్టుల నిగ్రహము కొరకే నేను భూలోకమునకు వచ్చాను. నాతో చంపబడి ఈ దుష్టాత్ముడు, శుద్థిని పొందుతాడు అనుమానం లేదు (26) అని పలికి భగవంతుడైన హల ధరరాముడు బలవంతుడు ముసలిధారి, చేతి యందలికు శాగ్రముతో కోపంతో ఆతని శిరస్సును చేదించాడు (27) అక్కడున్న మునులందరు అయ్యో! కష్టము అని ఆక్రోశించారు. బ్రహ్మవాదులైన మునులు రామునితో అప్పుడు ఇట్లా అన్నారు (28) ఓ సంకర్షణ ప్రభు! రామ! కష్టమైన అధర్మం నీవు చేశావు. ఈ సూతునకు బ్రహ్మాసనాన్ని మేమే ఇచ్చము (29) ఓహలాయుధ! అక్షయమైన ఆయుష్యాన్ని ఈతనికి మేమిచ్చాము. నీవు దీన్ని తెలుసుకోకుండానే ఈ రోజు గొప్ప బ్రహ్మవథ చేశావు (30) యోగేశ్వరుడవైన నిన్ను నియమించువాడొక్కడూలేడు. ఈ బ్రహ్మహత్యకు నివృత్తిగా ఏంచేయాలో విచారించి దాన్ని చేయండి (31) లోకసంగ్రహణ కొరకు నీవే ప్రాయశ్చిత్తం ఆచరించు. ఓ రామ! ఇతరులు చెప్పకుండానే ప్రాయశ్చిత్తమాచరించు. అని అనగా భగవాన్‌ రాముడు! ఆమునులను గూర్చి ఇట్లా అన్నాడు. (32).

మూ || రామ ఉవాచ-

ప్రాయశ్చిత్తం చరిష్యామి పాపశోధకమాస్తికాః || 33 ||

లోక సంగ్రహణార్థాయ నాస్యకామనయాధునా | యాదృశోనిమో7స్మాభిః కర్తవ్యః పావశాంతయే || 34 ||

తాదృశం నియమం త్వద్యభవంతః ప్రబ్రువంతునః

భవద్భిరస్యసూతస్య యదాయుర్థత్తమక్షయం ఇంద్రియాణిచసత్వంచకరిష్యే యోగమాయయో || 35 ||

మునయఊచుః-

పరాక్రమస్యతేస్త్రస్య మృత్యోర్నశ్చయథాప్రభో | స్యాత్సత్యవచనం రామ తద్భవాన్‌ కర్తుమర్హతి || 36 ||

రామ ఉవాచ-

ఆత్మావైపుత్రరూపేణ భవతీతి శ్రుతిస్సదా || 37 ||

ఉద్ఘోషయతి విప్రేంద్రాస్తస్మాదస్యశరీరతః | పుత్రోభవతుదీర్ఘాయుః సత్వేంద్రియబలోర్జితః || 38 ||

కథయిష్యతి యుష్మాకం పురాణాదీనిసో7స్వహం | సంభవిష్యతి సర్వజ్ఞో యోగమాయాబలాన్మమ || 39 ||

ఇత్యుక్త్వా రౌహిణ యస్తాన్‌ పునః ప్రశ్రితమబ్రవీత్‌ | మనోభిలషితంకింవా యుష్మాకం కరవాణ్యహం

తద్భ్రూతమునయోయూయం కరిష్యామి న సంశయః || 40 ||

అజ్ఞానాత్‌ మత్క్రుతస్యాస్య పాపస్యాపినివర్తకం | ప్రాయశ్చితం భవన్తోమే ప్రబ్రూతముని సత్తమాః || 41 ||

తా|| రాముడిట్లనెను - ఓ ఆస్తికులారా ! పాపమును శుద్థి చేసే ప్రాయశ్చిత్తమును ఆచరిస్తాను (33) ఇప్పుడు లోక సంగ్రహణముకొరకు మరొక కోరికతో కాదు. మనం ఎలాంటినియమాన్ని పాపశాంతికొరకు ఆచరించాలో (34) అటువంటి నియమాన్ని నాకు మీరు ఈవేళ చెప్పండి. మీరు ఈ సూతునకు ఇచ్చిన అక్షయమైన ఆయుష్యాన్ని, ఇంద్రియములను, సత్త్వమును యోగమాయతో నే నేర్పరుస్తాను (35) మునులిట్లన్నారు. ఓ ప్రభు! పరాక్రమ వంతుడవైన నీ అస్త్రము యొక్క మృత్యువునకు మాకు సత్యవచనము - కలిగేటట్లుగా ఓరామ! నీవు ఆచరించాలి (36) రామోక్తి:- ఆత్మయే పుత్రరూపముగా ఔతుందనేది ఎల్లప్పుడు వేదము (37) ఉద్ఘోషిస్తోంది. అందువల్ల ఈతని శరీరము నుండి దీర్ఘాయువుగల సత్వఇంద్రియబలోర్జితుడైన పుత్త్రుడు జ న్మించని (38) ఆతడు ప్రతిరోజు మీకు పురాణాదులు చెప్తాడు. నాయోగమాయాబలము వల్ల సర్వజ్ఞుడై జన్మిస్తాడు (39) ఈ విధముగా బల రాముడు వారితో అని మళ్ళీ ఈ విధముగా పలికాడు. మీకు ఏ కోరికను చేయాలి నేను (40) చెప్పండి ఓ మునులార! నేను చేస్తాను అనుమానం లేదు. అజ్ఞానం వల్లనేను చేసిన ఈ పాపానికి కూడా నివర్తకమిది. ఓ మునులార! నాకు ప్రాయశ్చిత్తాన్ని మీరు చెప్పండి అని రాముడనగా (41)

మూ || మునయ ఊచుః-

ఇల్వల స్యాత్మజః కశ్చిత్‌దానవోబల్వలాభిధః || 42 ||

సదూషయతినోయాగం రామేహాగత్యపర్వణి | దుష్టంతం దానవం పాపంజహిలోకైక కంటకం || 43 ||

అనేన పూజాహ్యస్మాకంకృతాస్యాద్భవతాధునా | అస్థివిణ్మూత్రరక్తానిసురామాంసానిచక్రతౌ || 44 ||

సదాభివర్షతే7స్మాకమత్రాగ్మత్యసదానవః | అస్మిన్‌ భారత భూభాగే యాని తీర్థాని సంతిహి || 45 ||

తేషుస్నాహ్యబ్దమేకం త్వం సర్వేషు సుసమాహితః | తేనతే పాపశాంతిః స్యాత్‌ నాత్రకార్యావిచారణా || 46 ||

శ్రీ సూత ఉవాచ -

పర్వకాలేతు విప్రేంద్రాః సమావృత్తే మునిక్రతౌ | మహాభీమోరజోవర్షో ఝంఝావాతశ్చభీషణః || 47 ||

ప్రాదుర్భభూవవిప్రేంద్రాః వూయరక్తైశ్చవర్షణం | తతోవిష్ఠామయావృష్ఠిః బల్వలేనకృతాప్యభూత్‌ || 48 ||

అసురం యజ్ఞశాలాయాం శూలపాణి మథక్షణాత్‌ | అపశ్యద్భలభద్రో7సౌ మహాబలపరాక్రమం || 49 ||

తమాలోక్యమహాదేహం దగ్థాద్రిప్రతిమంతదా | ప్రతప్తతామ్రసంకాశ శ్మశ్రుదంష్ట్రోత్కటాసనం || 50 ||

చింతయామాసముసలం రామః పరవిదారణం | సీరంచ దానవహరంగదాందైత్యవిదారిణీం || 51 ||

యాన్యాయుధానితంరామంచింతితాన్యుపతస్థిరే | సీరాగ్రేణతమాకృష్యబల్వలం ఖేచరం తదా || 52 ||

ముసలేన నిజఘ్నేనకుపితోమూర్థ్నివేగతః | ప పాతభువిసం క్షుణ్ణలలాటోరక్తముద్వమన్‌ || 53 ||

బల్వలోదీనకథనోగిరిర్వజ్రహతోయథా | స్తుత్వాథమున యోరామంప్రోచ్చార్యవిమలాశిషః || 54 ||

అభ్యషించన్‌శుభైస్తోయః వృత్రశత్రుం యథాసురాః | మాలందదుఃవైజయంతీం శ్రీమదంబుజశోభితాం || 55 ||

మాధవాయశుభేవస్త్రే భూషణాని శుభానిచ | ధారయంస్తాని సర్వాణి రౌహిణ యో మహాబలః || 56 ||

పుష్పితానోకహోపేతః కైలాస ఇవపర్వతః | అనుజ్ఞాతో7థమునిభిః సర్వతీర్థేషున ద్విజాః || 57 ||

ఏకమబ్దం చరన్‌సస్నౌ నియమాచార సంయుతః || 57 ||

తా || మునులిట్లనిరి - ఇల్వలుని కుమారుడు బల్వలుడను పేరుగలవాడు ఒక రాక్షసుడున్నాడు (42) ఓ రామ! పర్వసమయంలో అతడిక్కడికి వచ్చిమాయాగాన్ని పాడు చేస్తున్నాడు. లోకకంటకుడు దుష్టుడు అయిన ఆ పాప రాక్షసుని చంపు (43) దీనివల్ల నీవు మాకు ఇప్పుడు పూజచేసినట్లౌతుంది. ఎముకలు విణ్మూత్రములు రక్తము సురామాంసములు మా యాగమందు ఆ (44) రాక్షసుడు ఇక్కడికి వచ్చి ఎప్పూడు హర్షిస్తుంటాడు. ఈ భారత భూభాగంలో ఎన్ని తీర్ధములున్నాయో ( 45) వాటన్నిటియందు శ్రద్థతో ఒక సంవత్సరము నీవు స్నానం చేయి. దానివల్ల నీ పాపశాంతి ఔతుంది. ఇక్కడ విచారించాల్సింది లేదు (46) శ్రీ సూతులిట్లనిరి - ఓ బ్రాహ్మణులారా ! పర్వకాలమందు ముని క్రతువు ఆరంభం అయ్యాక భయంకరమయిన రజోవర్షము, భయంకరమయిన ఝంఝావాతము (47) పూయరక్తముల వర్షము కలిగింది. విష్ణమయమైన వర్షమును బల్వలుడు కల్గించాడు కూడా(48) యజ్ఞశాలయందు క్షణంలో శూలముచేత ధరించిన రాక్షసుని మహాబలాపరాక్రమవంతుని ఈ బలభధ్రుడు చూచాడు(49) మహా దేహముకల దగ్థమైన అద్రిలాఉన్న వానిని చూచి, కాల్చిన రాగిలా ఉన్న మీసాలు,కోరలు వీనితో భయంకరమౖౖెన ముఖముగల (50) వానిని చూచి బలరాముడు పరులను చీల్చేశక్తి గల ముసలమును స్మరించాడు. దానవులను చంపే నాగలిని, దైత్యలను విదారించే శక్తి గల గదను (51) ఇతర ఆయుధములు ఆతడు స్మరించినవి ఆతనిని చేరాయి. నాగలి చివరతో ఆకాశంలో సంచరించే బల్వలుని లాగి (52) కోపంతో తలపై వేగంగా ముసలంతో కొట్టాడు. రక్తాన్ని కక్కుతూ ముక్కలైన నొసలు గలవాడై భూమిపై పడిపోయాడు (53) దీనమైన వాక్కు గలవాడై వజ్రంతాకిడిని పొందిన పర్వతంలా బల్వలుడు పడిపోయాడు. మునులు రాముని స్తుతించి స్వచ్ఛమైన (మంచి) ఆశీస్సులను పలికి (54) శుభ##మైన నీటితో, వృత్రశత్రువును సురులు అభిషేకించినట్లు బలరాముని అభిషేకించారు. అంబుజములతో శోభిల్లే వైజయంతి మాలనిచ్చారు (55) మాధవునకు శుభప్రదమైన వస్త్రములను భూషణములను ఇచ్చారు. వాటన్నింటిని ధరించి బలవంతుడైన రౌహిణయుడు (56) పుష్పించిన వృక్షములతో కూడిన కైలాస పర్వతమువలె ఉన్నాడు. ఓ బ్రాహ్మణులార! మునులతో అనుజ్ఞపొంది అన్ని తీర్థములందు (57) నియమాచారములతో కూడి ఒక సంవత్సరం తిరుగుతూ స్నానం చేశాడు (57 1/2).

మూ|| తతః సంవత్సరే పూర్ణే కాలిందీ భేదనోబలః || 58 ||

సమాప్త తీర్థయాత్రస్సన్‌ పురీంగంతుం ప్రచక్రమే | తతస్తమోమయీంఛాయాంపృష్ఠతోనుగతాంకృశాం || 59 ||

అవశ్యద్బలదేవోయం మహానాదవిరావిణీం | అథవార్తాంస శుశ్రావసముద్భూతాం తదాంబరే || 60 ||

రామరామమహాబాహోరౌహిణయసితప్రభ | తీర్థాభిగమనేనాద్యచరతేన త్వయానఘ త్వయా సఘ || 61 ||

ననష్టా బ్రహ్మహత్యాతే నిః శేషం రోహిణీసుత ఇతివార్తాం సమాకర్ణ్యచింతయామానవైబలః || 62 ||

ప్రాయశ్చిత్తం మయాచీర్ణం ఏకాబ్దం తీర్థసేవయా | తథాపి బ్రహ్మహత్యాసాననష్టేతి శ్రుతంవచః || 63 ||

కింకుత్మితిసంచిత్యనైమిశారణ్యమభ్యగాత్‌ | తత్రగత్వామునీనాంతస్న్యవేదయదరిందమః || 64 ||

యఁచ్ఛుతంగగనేవాక్యం యాచదృష్టాతమోమయీ

న్యవేదయతతత్సర్వం మునీనాంరోహిణీసుతః | తచ్ఛ్రుత్వామునయస్సర్వేరామం వాక్యమథాబృవన్‌ || 65 ||

మునయ ఊచు:-

యదిరామననష్టాతే బ్రహ్మహత్యాతుకృత్స్నశః || 66 ||

తర్హిగచ్ఛమహాభాగగంధమాదన పర్వతం

మహాదుఃఖ ప్రశమనం మహారోగ వినాశనం | రామసేతౌ మహాపుణ్యగంధమాదన పర్వతే || 67 ||

అస్తిలక్ష్మణ తీర్థాఖ్యం సరః పాప వినాశనం || 68 ||

స్నానం కురుష్వతత్రత్వం తల్లింగం చ నమస్కురు | నిః శేషం తేననష్టాస్యాత్‌ బ్రహ్మహత్యానసంశయః || 69 ||

శ్రీసూతఉవాచ -

ఏవముక్తస్తదారామో గంధమాదన పర్వతం గత్వాలక్ష్మణ తీర్థంచ ప్రాప్తవాన్‌ముని పుంగవాః || 70 ||

స్నాత్వాసంకల్ప పూర్వంతు తత్రతీర్థేహలాయుధః | బ్రాహ్మణభ్యోదదౌవిత్తం ధాన్యం గాశ్చవసుంధరాం || 71 ||

తస్మిన్నవసరే తత్రరామమాహాశరీరవాక్‌ | నిః శేషం రామనష్టాతే బ్రహ్మహత్యాధునాత్విహ || 72 ||

సందేహోనాత్రకర్తవ్యః సుఖం యాహివురీం నిజాం | తచ్ఛ్రుత్వాబలభద్రోథ తత్తీర్థం ప్రశశం సహ || 73 ||

తతస్తత్రత్యతీర్ధేషు స్నాత్వా సర్వేషు మాధవః | ధనుష్కోటీ తథాస్నాత్వారామనాధం నిషేవ్యచ

ద్వారకాం స్వపురీం ప్రాయాత్‌ నష్టపాతకసంచయః || 74 ||

శ్రీసూత ఉవాచ -

ఏవం వః కథితః విప్రాః శ్రీ లక్ష్మణ సరోమలం || 75 ||

పుణ్యం పవిత్రం పాపఘ్నం బ్రహ్మహత్యాదిశోధకం యః | పఠేదిమమధ్యాయం శ్రుణుయాద్వాసమాహితః || 76 ||

సయాతిముక్తిం విప్రేంద్రాః పునరావృత్తి వర్జితాం || 77 ||

ఇతి శ్రీ స్కాందే మహా పురాణ ఏకాశీతి సాహస్ర్యాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే లక్ష్మణ తీర్థ ప్రశం సాయాం బలభద్ర బ్రహ్మహత్యావిమోక్షణం నామ ఏకోన వింశోధ్యాయః || 19 ||

తా|| పిదప సంవత్సరాలం నిండాక కాలిందీ భేదనుడైన బలరాముడు (58) తీర్థయాత్రను సమాప్తిచేసి తననగరానికి వెల్ళుటకు ప్రారంభించాడు. పిదప నల్లగా ఉన్న నీడను వెనుక అనుసరిస్తున్న దాన్ని కృశించిన దానిని (59) గట్టిగా అరుస్తున్న దానిని ఈ బలదేవుడు చూచాడు. పిదప ఆకాశం నుండి విన్పిస్తున్న మాటలను విన్నాడు (60) తెల్లని కాంతిగలవాడ, రౌహిణయ, రామ, మహాబాహు! నీ వాచరించిన ఈ తీర్థాభిగమనంతో ఈ వేళ (61) ఓ రోహిణీ సుతా ! నీ బ్రహ్మ హత్యా దోషము నిః శేషంగా నశించలేదు. అనే మాటను విని బలరాముడు ఇట్లా చింతించాడు (62) తీర్థ సేవతో ఒక సంవత్సరకాలము నేను ప్రాయశ్చిత్తమాచరించాను. ఐనా ఆ బ్రహ్మహత్యాపాపము నశించలేదనే మాటను విన్నాను. (63) ఏమి చేయాలని ఆలోచిస్తూ నైమిశారణ్యమునకు వెళ్ళాడు. అరిందముడైన రాముడు అక్కడికి వెళ్ళి మునులకు ఆ విషయం చెప్పాడు (64) ఆకాశంలోంచి విన్న మాటను, చీకటిమయంగా కన్పించిన దానిని అంతా మునులకు రోహిణీ సుతుడు నివేదించాడు. దానిని విని మునులంతా రామునితో ఇట్లా అన్నారు. (65) మునులమాట - ఓ రామ ! పూర్తిగానీ బ్రహ్మహత్యా పాతకం నశించని పక్షంలో (66) ఓ మహాభాగ! గంధమాదన పర్వతానికి వెళ్ళు. మహా దుంఖములను తగ్గించేది, మహా రోగముల నశింపచేసేది (67) రామసేతువు యందు మహా పుణ్యప్రదమైన గంధమాదన పర్వతమందు పాపనాశకమైన లక్ష్మణ తీర్థమను పేరుగల సరస్సు ఉంది (68) నీవక్కడ స్నానం చేయి ఆ లింగానికి నమస్కారము చేయి. దానితోనీ బ్రహ్మహత్యా పాపము ఏమీ మిగలకుండా పూర్తిగా నశించిపోతుంది. అనుమానం లేదు (69) శ్రీ సూతులమాట ఇట్లా చెప్పగానే, రాముడు గంధమాదన పర్వతమునకు వెళ్ళి లక్ష్మణ తీర్థమునకు చేరాడు. ఓ మునులార ! (70) ఆ తీర్థంలో హలాయుధుడు సంకల్ప పూర్వకముగా స్నానంచేసి బ్రాహ్మణులకు, ధనము, ధాన్యము, ఆవుతో, భూమిని, దానం చేశాడు (71) ఆ సందర్భంలో రామునితో అక్కడ అశరీరవాణి ఇట్లా అంది. ఇప్పుడు ఇక్కడ ఓరామ! నీ బ్రహ్మహత్య పూర్తిగా నశించి పోయింది (72) ఇక్కడ అనుమానించాల్సింది లేదు. నీ పట్టణానికి సుఖంగాపో అని అనగా దానిని విని బలభద్రుడు ఆ తీర్థాన్ని ప్రశంసించాడు. (73) పిదప అక్కడ ఉన్నటు వంటి తీర్థాలన్నింటిలో మాధవుడు స్నానం చేసి ధనుష్కోటియందు స్నానం చేసి, రామనాథుని సేవించి, పాతకములన్నీ నశించగా తననగరమైన ద్వారకకు వెళ్ళాడు (74) శ్రీ సూతులిట్లనిరి - ఓ విప్రులారా ! ఈ విధముగా అమలమైన లక్ష్మణ సరస్సును గురించి మీకు చెప్పాను (75) పుణ్యమైనది, పవిత్రమైనది, పాపముల నశింపచేసేది, బ్రహ్మహత్యాదులనుండి శుద్ధిచేసేది. ఈ అధ్యాయమును చదివినవారు శ్రద్ధతో విన్నవారు (76) పునరావృత్తిలేని ముక్తిని పొందుతారు (77) అని శ్రీ స్కాంద మహాపురాణమందు ఏకాశీతి సహస్ర సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్యమందు లక్ష్మణ తీర్థ ప్రశంస యందు బలభద్రుని బ్రహ్మహత్యా విమోక్షణమనునది పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము || 19 ||

Sri Scanda Mahapuranamu-3    Chapters