Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదునెనిమిదవ అధ్యాయము

మూll శ్రీ సూత ఉవాచ-

కుంభసంభవతీర్థే7స్మిన్‌ విధాయభిషవంనరః l రామకుండం తతః పుణ్యం గచ్ఛేత్‌ పాపవిముక్తయే ll 1 ll

రఘునాథసరః పుణ్యంద్విజాః పాపహరంతాథా l రఘునాథ సరస్తీరేకృతో యజ్ఞో7 ల్పదక్షిణః ll 2 ll

సంపూర్ణఫలదోభూయాత్స్వాధ్యాయో7పిజపస్తిథాlరఘునాథసంస్తీరేముష్టిమాత్రామపిద్విజాః ll 3 ll

దత్తం చేద్వేదవిదుషే తదనంతగుణం భ##వేత్‌ lరామతీర్థం సముదిశ్యపక్ష్యామి మునిపుంగవాః ll 4 ll

ఇతిహాసం మహాపుణ్యం సర్వపాతకనాశనం l సుతీక్ణనామా విప్రేంద్రోమునిర్నియతమానసః ll 5 ll

అగస్త్యశిష్యోరామస్య చరణాబ్జవిచింతకఃlరామచంద్ర సరస్తీరే తపస్తే పే సుదుష్కరం ll 6 ll

జపన్‌షడక్షరంమంత్ర రామచంద్రాధిదైవతం l నిత్యంస పంచ సాహస్త్రం మంత్రరాజమతంద్రితః ll 7 ll

జజాప కుర్వన్‌ స్నానంచ రఘునాథ సరోజలే lభిక్షాశీ ని యతాచారోజితక్రోధో జితేంద్రియః ll 8 ll

ఏవం సుతీక్ణో విప్రేంద్రా బహుకాలమవర్తత - తతః కదాచిత్‌ సమునీంరామం ధ్యాయన్‌ సదాహృది ll 9 ll

తుష్టావసీతాసహితం రామచంద్రం సభక్తికం l

సుతీక్ణ ఉ%ాచ-

నమస్తే జానకీనాథ నమస్తే హనుమత్ర్పియ ll 10 ll

నమస్తే కౌశికమునేర్యాగరక్షణ దీక్షితl నమస్తే కౌసలేయాయ విశ్వామిత్ర ప్రియాయచ ll 11 ll

నమస్తే హరకోదండ భంజ కామరసేవిత l మారీచాంతక రాజేంద్ర తాటకాప్రాణనాశన ll 12 ll

కబంధారే హరే తుభ్‌యం నమో దశరథాత్మజ l జామదగ్న్యజితేతుభ్యం ఖరవిధ్వంసినేనమః ll 13 ll

నమః సుగ్రివనాధాయనమోవాలిహరాయతే l విభీషణ భయక్లేశహారిణ మలహారిణ ll 14 ll

అహల్యాదుఃఖ సంహర్త్రే నమస్తే భరతాగ్రజ l అంబోధిగర్వసంహర్త్రే తస్మిన్‌ సేతుకృతేనమః ll 15 ll

తారకబ్రహ్మణతుభ్యం లక్ష్మణాగ్రజితేనమః l రక్షఃసంహారిణ తుభ్యం నమోరావణమర్దినే ll 16ll

కోదంఢధారిణ తుభ్యం సర్వరక్షావిధాయినే l ఇతిస్తు వన్మునిః సో7యంసుతీక్ణోరామమన్వహం ll 17 ll

నినాయ కాలమనిశం రామచంద్రంనిషణ్ణధీః l సవమభ్యసతస్త స్యరామమంత్రం షడక్షరం ll 18 ll

స్తువతోరామచంద్రంచస్తోత్రేణా నేనసువ్రతాః తీర్థేచరఘునాధస్యకుర్వతః స్నానమన్వహం ll 19 ll

అభవన్నశ్చలా భక్తీ రామచంద్రేతి నిర్మలా ll 19 1/2 ll

తా ll శ్రీ సూతులిట్లనిరి - మానవుడు ఈ అగస్త్యతీరమందు స్నానముచేసి పాపవిముక్తి కొరకు పిదప పుణ్యప్రదమైన రామకుండమునకు వెళ్ళాలి (1)రఘునాధ సరస్సు పుణ్యప్రదాము పాపనాశకము . రఘానాథ సరస్సు తీరమందు అల్పదక్షిణలతో యజ్ఞము చేసినా (2) సంపూర్ణ ఫలాన్నిస్తుంది . స్వాధ్యాయజపములు కూడా అల్పములైనా పూర్ణఫలాన్నిస్తాయి. రఘునాథ సరస్తీరమందు పిడికెడు మాత్రమైనా (3) వేదమెరిగిన వారికి దానం చేస్తే అది అనంత ఫలితాన్నిస్తువంది . ఓ మునులారా ! ఆ రామతీర్థమును గూర్చి చెబుతున్నాను (4) ఈ ఇతిహాసము పుణ్యప్రదము. పాతక నాశకము. సుతీక్‌ష్ణుడను పేరుగల బ్రాహ్మణుడు ముని మనోనిగ్రహము కలవాడు (5) అగస్త్యునకు శిష్యుడు రామపాద చింతకుడు. రామచంద్ర సరస్తీరమందు చాలా కఠినమైన తపమాచరించాడు . (6) రామచంద్రుడు అధిదేవతగాగల షడక్షరమంతమును జపిస్తూ ప్రతిరోజు ఐదువేలసార్లు జాగ్రత్తగా ఆమంత్రరాజాన్ని జపిస్తూ (7) రఘునాధ సరోజలంలో స్నానంచేస్తూ భిక్షాహారాన్ని భుజిస్తూ నియత ఆహారపరుడై క్రోధమును జయించి, ఇంద్రియముల జయించి (8) సుతీక్షణుడు చాలా కాలమున్నాడు. ఆ ముని ఎల్లప్పుడు హృదయంలో రాముని ధ్యానిస్తూ, భక్తి పూర్వకముగా సీతతో కూడిన రాముణ్ణి సంతుష్టిపరచాడు (9) సుతీక్‌ష్ణుని వచనము - జానకీనాథ ! నమస్సులు. హనుమత్‌ ప్రియ ! నీకు నమస్కారము (10) కౌశికముని యాగరక్షణలో దీక్షితుడు నమస్సులు నీకు కౌసల్యాతనయ, విశ్వామిత్రునకు ప్రేమ పాత్రుడనమస్కారము (11) శివుని ధనస్సు విరచినవాడ! దేవతలతో సే­ంచబడినవాడ! నీకు నమస్కారము. మారీచుని సంహరించినవాడ! రాజశ్రేష్ఠ! తాటకను సంహరించినవాడ! (12) కబంధశత్రువ దశరథకుమార!ఓవిష్ణు! నీకునమస్కారము. జామదగ్నిని జయించిన వాడ, ఖరుని సంహరించిన వాడ నీకు నమస్కారము (13)సుగ్రీవనథా ! వాలి సంహార ! నీకు నమస్కారము. వీభీషణుని భయమును హరించినవాడ! మలములహరించేవాడ నీకు నమస్కారము. (14)అహల్యా దుఃఖమును తొలగించినవాడ! భరతుని అగ్రజ !నీకు నమస్కాకరము. సముద్రగర్వమును హరించిన వాడ! సేతువును నిర్మించినవాడ (15)తారక బ్రహ్మ! లక్ష్మణాగ్రజ!నీకు నమస్కారము. రాక్షసులను సంహరించిన, రావణుని మర్దించిన నీకు నమస్కారము (16)కోదండధారి ! అన్నిరకముల రక్షణ నిచ్చే వాడ నీకు నమస్కారముఅని రాత్రింబగళ్ళు సుతీక్ణముని రాముని స్తుతిస్తూ (17)రాముని యందే మనస్సును నిలిపి ఎప్పుడూ కాలాన్ని గడిపేవాడు . ఈ విధముగా షడక్షరమైన రామమంత్రాన్ని జపిస్తున్న ఆతనికి కాలంగడిచేది (18) ఈ స్తోత్రముతో రామచంద్రుణ్ణిస్తుతిస్తున్న, రఘునాథ తీర్థమందు ప్రతిరోజు స్నానం చేస్తున్న ఆతనికి (19) రామచంద్రునిపై నిర్మలమైన భక్తి నిశ్చలంగా కలిగింది (19 1/2)

మూll అభూదద్వైత విజ్ఞానం ప్రత్యకాత్మైకలక్షణం ll 20 ll

అనధీత త్రయీజ్ఞానంప తథైవాశ్రుతవేదనం lపరకాయప్రవేశేచ సామర్థ్యమభవద్ధ్విజాః ll 21 ll

అకాశగమనేశక్తిః కలావైదగ్ద్య మేవచ l అశ్రుతానాంచ శాస్త్రాణాం అభజ్ఞానం వినాగురుం ll 22 ll

గమనం సర్వలోకేషు ప్రతిఘాత వివర్జితంం lఅతీంద్రియార్థద్రష్టృత్వం దేవైః సంభాషణం తథా ll 23 ll

పి పీలికాది జంతూనాం వార్తాజ్ఞానమపిద్విజాఃl బ్రహ్మవిష్ణుమహాదేవలోకేషు గమనంతథా ll 24 ll

చతుర్దశనులోకేషు స్వాదీనగమనంతథా l ఏతాన్యన్యానిసర్వాణి యోగిలభ్యానిసత్తమాః ll 25 ll

సుతీక్ణస్యాభవన్‌ విప్రారామతీర్థనిషేవణాత్‌ ఏవం ప్రభావం తత్తీర్థం మహాపాతకనాశనం ll 26 ll

మహాసిద్ధికరం పుణ్యం అపమృత్యువినాశనం l భుక్తిముక్తి ప్రదం పుంసాం సరకక్లేశనాశనం ll 27 ll

రామభక్తిప్రదం నిత్యం సంసారోచ్ఛేదకారణం

అస్యతీరేమహాల్లింగస్థాపరుత్వారఘుద్వహఃlపూజయామాసతల్లింగంలోకానుగ్రహకామ్యయా ll 28 ll

రామతీర్థేమహాపుణ్యస్నాత్వాతల్లింగదర్శనాత్‌lనరాణాంముక్తిరేవస్యాత్కిముతాన్యావిభూతయః ll 29 ll

తత్రస్నాత్వాశివందృష్ట్వా దర్మపుత్రః పురాద్విజాః l అనృతోక్తి సముధ్బూత దోషాన్ముక్తో 7భవత్‌క్షణాత్‌ ll 30 ll

ఋషయ ఊచుః-

అసత్యముదితం కస్మాత్‌ ధర్మపుత్రేణ సూతజ l యద్దోషశాంతయేస స్నౌరామతీర్థే7తి పావనే ll 31 ll

శ్రీసూత ఉవాచ -

యుష్మాకంఋషయోవక్ష్యేయథోక్తమనృతంరణlఛలేనధర్మపుత్రేణయన్నష్టంరామతీర్థకే ll 32 ll

తాllప్రత్యగాత్మయే (ఒకే) లక్షణంగా గల అద్వైత విజ్ఞానము కల్గింది(20)చదవకుండానే వేద పరిజ్ఞానము వినకుండానే విషయ పరిజ్ఞానము, వరకాయ ప్రవేశసామర్థ్యము కల్గింది (21) అకాశగమనశక్తి, కళలయందు పాండిత్యము విననిశాస్త్ర విషయములందు గురువు లేకుండానే విశేషజ్ఞానము (22)ఎదురులేకుండా సర్వలోకములకు వెళ్ళే శక్తి, గడచిన విషయాన్ని (తెలుసుకునే) చూచే శక్తి, దేవతలతో సంభాషణము (23) పిపీలికా దిజంతువులు మాట్లాడుకునే మాటల జ్ఞానము కూడా కలిగాయి. త్రిమూర్తుల లోకములకు వెళ్ళగల శక్తి (24) పదునాల్గులోకములకు తనఇచ్చవచ్చిన రీత వెళ్ళగల శక్తి ఇవి, ఇంతేకాక ఇతరములైనవన్ని యోగులకు లభించేశక్తులన్ని (25) రామతీర్థమును సేవించుటవలన సుతీక్‌ష్ణునకు లభించాయి. ఇంతటి ప్రభావము కలది ఆ తీర్థము. మహా పాతకముల నశింపచేసేది (26) మహాసిద్ధులను ఇచ్చేది. పుణ్యకరము. అపమృత్యునాశకము భుక్తిముక్తులనిచ్చేది . నరక క్లేశనాశకము (27) రామభక్తి నిచ్చేది. సంసార ఉచ్చేదమునకు కారకమైనది. దీని తీరమందు శ్రీరాముడు మహాలింగమును స్థాపించి, లోకమును అనుగ్రహంచే కొరకు ఆ లింగమను పూజించసాగాడు (28) మహాపుణ్యకరమైన రామతీర్థమందు స్నానంచేసి ఆ లింగాన్ని దర్శించటం వలన నరులకు ముక్తే కల్గుతుంది అని అంటే ఇంకా ఇతర ఐశ్వర్యాల గూర్చి చెప్పటమెందుకు (29) అక్కడ స్నానం చేసి శివుని చూచి పూర్వము ధర్మరాజు అబద్ధం చెప్పటం వల్ల వచ్చిన దోషం నుండి ముక్తుడైనాడు అక్షణంలోనే (30) ఋషలిట్లనిరి - ఓసూతపుత్ర! దర్మజుడు ఏకారణం వల్ల అబద్దం చెప్పాడు. ఆ దోషశాంతికొరకు అతిపావనమైన రామతీర్థంలో స్నానం చేశాడు 31) శ్రీ సూతులిట్లనిరి - మోసంగా ధర్మజుడు యుద్ధమందు అబద్ధం చెప్పిన విషయాన్ని రామతీర్థంలో అది నష్టమవటం ఋషులారా ! మీకు చెబుతాను. (32)

మూll అన్యోన్యం పాండవావిప్రా ధర్మపుత్రాదయః పురా l ధృతరాష్ట్ర స్యపుత్రాశ్చదుర్యోదన ముఖాస్తదా ll 33 ll

మహధ్వైవైరమాసాద్యరాజ్యార్థం విప్రసత్తమాఃl మహత్యాసేనయాసార్థం కురుక్షేత్రే సమేత్యచ ll 34 ll

అయుధ్యన్‌ సవరేవీరాః సవరేష్వనివర్తనః l యుద్ధం కృత్వాదశదినం గాంగేయః పతితోభువి ll l35 ll

తతః పంచదినం భూయో ధృష్టద్యుమ్నేన వీర్యవాన్‌ l ఆచార్యోయుయుధేద్రోణో మహాబలపరాక్రామః ll 36 ll

అనేకాస్త్రాణి శస్త్రాణి ద్రోణాచార్యోమహాబలీ lవిసృజన్‌ పాండవానీక పీడయామాసవీర్యవాన్‌ ll 37 ll

అథదివ్యాస్త్ర విచ్ఛూరోధృష్టద్యుమ్నెమహాబలః l అభినద్బాణవర్షేణ ద్రోణ సేనామనేకధా ll 38 ll

ధృష్టద్యుమ్నం తదాద్రోణః శరవంర్షైరవాకిరత్‌ lపార్‌థసేనాతథాద్రోణబాణవర్షతిపీడితా ll 39 ll

దశదిక్షుభయాక్రాంతావిద్రుతాద్విజసత్తమాఃlతతో7ర్జునోరణద్రోణంయుయుధేరధినాంవరః ll 40 ll

రణప్రవీణయోస్తత్రవిజయద్రోణయోరణ l ద్రష్టుంసమాగతైర్దేవైరభూద్వ్యోమనిరంతరం llk 41 ll

ద్రోణఫాల్గునయోర్విప్రానాస్తియుద్ధోవమాభువిl సామర్షయోస్తదాచార్యశిష్యయోరభవద్రణః ll42 ll

ద్రోణఫాల్గునయోర్వుద్ధం ద్రోణఫల్గునయోరివ l బహుమేనేథమనసా ద్రోణో7ర్జున పరాక్రమం ll 43 ll

తతోద్రోణోమహావీర్యం ప్రియశిష్యంసఫాల్గునం l విహాయపాంచాలబలం సమముధ్య తవీర్యవాన్‌ ll 44 ll

సవింశతి సహస్రాణి దశతత్రాయుతానిచ l ద్రోణాచార్యో7వధీ ద్రాజ్ఞాం యుద్ధేసగజవాజినాం ll 45 ll

ధృష్టద్యుమ్నె7థకుపితోద్రోణమభ్యహనచ్ఛరైఃlద్రోణశ్చపట్టిశంగృహ్యధృష్టద్యుమ్నమతాడయత్‌ ll 46 ll

శ##రైర్వివ్యాథతం యుద్ధే తీక్ణైరగ్ని శిఖోవమైః l పరాజ్‌ ముఖో7భవత్త త్ర ధృష్టద్యుమ్నః శరాహతః ll 47 ll

తాll పాండవులైన ధర్మపుత్రాదులు ధృతరాష్ట్రపుత్రులు దుర్యోధనాదులు పరస్పరము (33) రాజ్యము కొరకు గొప్ప వైరాన్ని పొంది గొప్ప సేనతో కురుక్షేత్రమునకు వచ్చి (34)యుద్ధంలో వెనకడుగు వేయకుండా వీరులు యుద్ధం చేశారు. పదిరోజులు యుద్ధముచేసి భీష్ముడు పడిపోయాడు (35)తరువాతి ఐదురోజులు ధృష్టద్యుమ్నునితో వీరుడైన మహాబలపరాక్రమములు కల ద్రోణాచార్యుడు యుద్ధం చేశాడు. (36) మహాబలవంతుడైన ద్రోణాచార్యుడు అనేక అస్త్రశస్త్రములను వదిలి పాండవసైన్యాన్ని పిడించసాగాడు (37)బలవంతుడు,వీరుడైన ధృష్టద్యుమ్నుడు, దివ్యాస్త్రవేది, బాణవర్షముతో ద్రోణసైన్యమును అనేక విధముల ఛేదించాడు (38) ద్రోణుడు శరవర్షముతో ధృష్టద్యుమ్నుని విసిరేసాడు. ద్రోణుని బాణవర్షంతోబాగా పీడింపబడ్డ అర్జునుని సేన కూడా అట్లాగే చెదిరిపోయింది . (39) పదిదిక్కులకు భయాక్రాంతులై పరుగెత్తారు. రధులలో శ్రేష్టుడైన అర్జునుడు రణరంగంలో ద్రోణునితోయుద్ధం చేశాడు (40) యుద్దవిశారదులైన అర్జున ద్రోణుల రణమును చూచుటకు వచ్చిన దేవతలతో ఆకాశము వ్యవధి లేకుండా పోయింది (41) ద్రోణార్జనుల యుద్ధమునకు పోల్చతగినది ఈ భుమిపై లేదు. కోపముతో కూడిన గురుశిష్యులకు యుద్దమైంది (42) ద్రోణార్జును యుద్ధము ద్రోణార్జున యుద్ధమే. ద్రోణుడు అర్జునుని పరాక్రమాన్ని మనసులో మెచ్చుకున్నాడు. (43) పిదప ద్రోణుడు పరాక్రమశాలి, ప్రియశిష్యుడుఐన అర్జునుని వదలి పాంచాలబలంతోయుద్ధం చేశాడు (44)ఒక లక్ష ఇరువది వేల ఏనుగులను గుఱ్ఱములను యుద్ధంలో ఇతర రాజులకు చెందిన వానిని ధ్రోణాచార్యుడు చంపాడు ధృష్టద్యుమ్నుడు కోపగించి బాణములతో ద్రోణుని కొట్టాడు. ద్రోణుడు పట్టిశమును గ్రహించి ధృష్టద్యుమ్నుని కొట్టాడు (46) అగ్నిశిఖలతో సమానమైన తీక్ణములైన బాణములతో ఆతనిని యుద్ధంలో కొట్టాడు. శరాహతుడై ధృష్టద్యుమ్నుడు అక్కడ పరాఙ్‌ముఖుడైనాడు (47).

మూllతతోవిరథమాగత్యధృష్టద్యుమ్నంవృకోదరఃlస్వంస్యందనంసమారోప్యద్రోణాచార్యమథాబ్రవీత్‌ ll 48 ll

స్వకర్మభిరసం తుష్టః శిక్షితాస్త్రాద్విజాధమాః నయధ్యేరన్‌ యది క్రూరాన సశ్యేరన్‌ నృపారణ ll 49 ll

అహింసాహిపరోధర్మో బ్రాహ్మణానాం సదాస్మృతఃlహింసయాదారపుత్రాదీన్రక్షంతే వ్యాధజాతయః ll 50 ll

హింసీస్త్వమేకపుత్రార్థే యుద్ధేస్థిత్వాబహూనృపాన్‌ l సచాపి తేసుతోబ్రహ్మన్‌ హతఃశేతేరాణాజిరే ll 51 ll

తథాపిలజ్జాతేనాస్తి శోకో7పీహన జాయతే l వచనంత్వితదీ భీమస్యసత్యం శ్రుత్వాయుధిష్ఠిరాత్‌ ll 52 ll

నిజాయుధం సతత్యాజ పపాతస్యందనోపరి l యోగవిత్‌ ప్రాయమాతస్థే ద్రోణాచార్య స్తదాద్విజాః ll 53 ll

తదంతరం పరిజ్ఞాయద్రోణా,చార్యస్యపార్శ్వతః lఖడ్గపాణిః శిరచ్ఛేత్తుం అభ్యాధావద్రణాజిరే ll 54 ll

వార్యమానో7పిపార్థాద్యైఃతచ్ఛిరశ్ఛేత్తుముద్య¸° lయోగవిత్త్వాత్‌ ద్రోణమూర్ద్నో జ్యోతియారూర్థ్వందివంయ¸°ll 55 ll

దృష్టం కృష్ణార్జునకృప ధర్మపుత్రాదిభిర్మృధే lద్రోణస్యాస్యగత ప్రాణాత్‌ శరీరాచదచ్ఛినచ్చిరః ll 56 ll

భారద్వాజేహతే యుద్ధేకౌరవాః ప్రాద్రవన్‌భయాత్‌ l జిహృషుః పాండవావి ప్రాధృష్టద్యుమ్నాదయస్తదా ll 57 ll

సేనాంతాంవిదృతాందృష్ట్వాద్రౌణిరూచే సుయోధనం l ఏతత్‌ ద్రవతికింసైన్యం త్యక్తప్రహరణం స్నప ll 58 ll

తదా దుర్యోధనోరాజా స్వయంపక్తుమశక్నువన్‌ l యుద్ధేద్రోణపధంపక్తుం కృపాచార్యమచోదయత్‌ ద్రౌణయే7థకృపాచార్యోవధముచే గురోస్తదాl ll 59 ll

కృప ఉవాచ -

అశ్వత్థామం స్తవపితా బ్రహ్మాస్తేణ మృధేరిపూన్‌ lహత్వానినాయసదనం యమస్యశతశోబలీ ll 60 ll

దురాధర్షతమం దృష్ట్వాతద్వీర్యం కేశవస్తదా lపాండవాన్‌ ప్రాహవిప్రేంద్ర వాక్యం వాక్య విశారదఃll 61 ll

కేశవ ఉవాచ -

ద్రోణజేతుమ పాయో7స్తి పాండవాయుది దుర్జయం ll 62 ll

అశ్వత్థమాతపసుతోహతో ద్రోణమృధే7ధునాl సత్యవాదీపదేదేవం యది ప్రామాణికోజనః ll 63 ll

ద్రోణోనివర్తేతరణాత్‌ తదాత్యక్త్వాయుధం క్షణాత్‌ lఅతఏనాంమృషావార్తాం ధర్మరాజో7ధునావదేత్‌ ll 64 ll

వాన్యథాశక్యతేజేతుంద్రోణోయుద్ధవిశారదః భర్మాజ్జేతు మశక్యం చేత్‌ ధర్మం త్యక్త్వా 7ప్యరింజయేత్‌ ll 65 ll

తా ll రథం లేకుండా వచ్చిన ధృష్టద్యుమ్నుని భీముడు తన రథంపై కూర్చోబెట్టుకొని ద్రోణాచార్యునితో ఇట్లనెను. (48)బ్రాహ్మణాధములు అస్త్రశిక్షను పొంది తమజాతికర్మల యందు అసంతుష్టులై క్రూరులైయుద్ధంచేయనట్టైతే రాజులు యుద్ధంలో మరణించేవారు కాదు (49) బ్రాహ్మణులకు అహింసయే ఎల్లప్పుడూ ఉత్తమ ధర్మంగా చెప్పబడింది. వ్యాధులు మొదలగు జాతులవారు హింసతో భార్యాపుత్రులను రక్షిస్తున్నారు (50)ఒక్క కొడుకు కొరకు యుద్ధంలో నిలబడి అనేకమంది రాజులను హింసించావు. ఆనీకొడుకు యుద్ధభూమియందు చంపబడి నిద్రస్తున్నాడు.(51)అట్లాగైనా నీకు సిగ్గులేదు. దుఃఖంకూడా కలగటంలేదు . అనే భీముని మాటను యుధిష్ఠిరుని ద్వారా నిజమని తెలుసుకొని (52) తన ఆయుధమను ఆతడు విడిచాడు . రథం మీద పడిపోయాడు. యోగమెరిగిన వానిలా ద్రోణాచార్యుడు అప్పుడు ఉండిపోయాడు. (53)ఆ సమయాన్ని గమనించి ద్రోణుని ప్రక్కకు, ఖడ్గమును దరించి శిరస్సును ఛేదించుటకు యుద్ధరంగంలో పరుగెత్తాడు (ధృష్టద్యుమ్నడు )(54)అర్జునుడు మొదలుగువారు వద్దని వారిస్తున్నా అతని తలను తెగ కోయుటకు ఉద్యమించాడు. యోగవిదుడైనందువల్ల ద్రోణుని శిరస్సు నుండి ఒక జ్వోతి పైకిస్వర్గానికి వెళ్ళింది(55)కృష్ణఅర్జున కృపాధర్మపుత్రాదులు యుద్ధములో చూచారు. ప్రాణం పోయిన ధ్రోణి శరీరము నుండి శిరస్సును ఖండించాడు. (56)యుద్ధంలో భారద్వాజుడు (దోణుడు) మరణించాక కౌరవులు భయంతో పరుగెత్తారు. పాండవులు ధృష్టద్యుమ్నాదులు ఆనందించారు. (57)పరుగెత్తుతున్న సేననుచూచి ఆశ్వత్థామదుర్యోధనునితో ఇట్లా అన్నాడు. ఆయుధములను వదలి ఈ సైన్యం ఎందుకు పరుగెత్తుతోంది అని (58)అప్పుడు, రాజైన దుర్యోధనుడు స్వయంగా చెప్పటం చాతకాక యుద్ధంలో ద్రోణుని వధను గూర్చి చెప్పుటకు కృపాచార్యుని ప్రేరేపించాడు. అశ్వత్థామకు కృపాచార్యుడు గురువు వధను గూర్చి ఇట్లా చెప్పాడు . (59) కృపునిమాట -అశ్వత్థామ l! నీతండ్రి యుద్ధంలో శత్రువులను బ్రహ్మాస్త్రంతో చంపి సూర్లకొలది బలవంతులను యమని భవనానికి చేర్చాడు (60) కేశవుడు అణచటానికి వీలేలేని ఆతని పరాక్రమాన్ని చూచి, మాటలనేర్పరియైన ఆతడు పాండవులతో ఇట్లా అన్నాడు . (61) కేశవునిమాట - యుద్దంలోదుర్జయుడైన ద్రోణునిజయించిటకు ఉపాయం ఉంది ఓ పాండవులారా!(62)ఓ ద్రోణా!ఇప్పుడు యుద్ధంలో నీకొడుకు చంపబడ్దాడు ప్రామాణికుడైనవాడు, సత్యవాదియైనవాడు ఇట్లా చెపితే (63) అప్పుడు ఆయుధాన్ని క్షణంలో వదలి ద్రోణుడు యుద్దం నుండి విరమిస్తాడు. అందువల్ల అబద్దమైన ఈ వార్తను ధర్మరాజు ఇప్పుడు చెప్పాలి. (64) ద్రోణుడు యుద్దవిశారదుడు. మరోరకంగా ఆతనిని జయించలేము. ధర్మం ద్వారా జయించలేని పక్షంలో ధర్మాన్ని వదలియైనా శత్రువును జయించాలి (65).

మూllఇతికేశవం వాక్యంతచ్ఛృత్వాభీమః పృథాసుతఃl పితరంతే సమభ్యే త్యమిథ్యావాక్యమభాషత ll 66 ll

అశ్వత్థామాహతోద్రోణ యుద్ధేత్ర పతితో7ధునా lద్రోణాచార్యోపితద్వాక్యమమస్యత యథార్థతః ll 67 ll

అవిశ్వస్యపునః సో 7థర్మ. జంప్రాప్యచాబ్రవీత్‌ l ర్మాత్మజ మృధే సూనురశ్వత్థామా మమాదునా lll 68 ll

హతః కింత్వం వదస్వాద్యసత్యవాదీ భవాన్మతః l దర్మపుత్రో7 సత్యభీరుః ఆ సీచ్చారిజయోత్సుకః ll 69 ll

కింకర్తవ్యంమయాద్యేతిదోలాలోల మనాఅభుత్‌ lసదృష్ట్వాభీమని హతమశ్వత్థామాభిదంగజం ll 70 ll

అశ్వత్థామా హతోయుద్ధే భ##యేనాద్యరణమహాన్‌ l ఆత్థం ద్రోణం బభాషే7సౌ దర్మపుత్రశ్చలోక్తితః ll 71 ll

తచ్ఛృత్వాత్వత్పితా శస్త్రం త్యక్త్వాయుద్దాన్య్నవర్తతl అధధర్మసుతః ప్రాహపరంవారణ ఇత్యపి ll 72 ll

త్యక్తం శస్త్రం నగృహ్ణీయాం యుద్ధేపునరీతిస్మనఃlప్రతిజజ్ఞేతవపితా వత్సద్రోణోబలీపునః ll 73 ll

అతః శస్త్రంన జగ్రాహ ప్రతిజ్ఞాభం గకాతరః - ధృ%్‌ద్టద్యుమ్నం తదాదృష్ట్వాపితాతేమృత్యుమాత్మనః ll 74 ll

మత్వాప్రాయోపవే%్‌ఘేన రథోవస్థేసయోగవిత్‌ lఅశయిష్ట సమాధిస్థః ప్రాణానాయమ్యవాగ్యతః ll 75 ll

తతో నిర్భిద్య మూర్ధానం తత్ర్పాణా నిర్యయుః క్షణాత్‌lతదామృతస్యద్రోణస్యవత్సఖడ్గేన తచ్ఛిరః ll 76 ll

కేశాన్‌ గృహీత్వాహస్తేన ధృష్టధ్యుమ్నె7చ్ఛినద్యుధిl మావధీరితి పార్థాద్యాః ప్రోచుఃసర్వేచ సైనికాః సర్వైర్నివార్యమాణో7పిత్వత్తాతం పార్శ్వతో7వధీత్‌ l ll44 ll

శ్రీసూత ఉవాచ-

పితరంనిహతంశ్రుత్వారుదన్‌ ద్రౌణిశ్చిరం ద్విజాః l ll 78 ll

కోపేన మహతాతత్ర జ్వలన్‌ వాక్యమథాబ్రవీత్‌ lఅనృతం ప్రోచ్యపితరం న్యస్త శస్త్రం చకారయః ll 79 ll

పితరం మే7ద్యతం పార్థ మప్యన్యానథ పాండవాన్‌ l గృహీత్వాకేశపాశం యస్త్యక్త శస్త్ర శిరో7హనత్‌ ll 80 ll

ఛద్మనా పార్శతం తంచ హనష్యామ్యచిరాదహం lకృష్జేన సహపశ్యంతు పాండవా మత్పరాక్రమం ll 81 ll

ఇతిద్రౌణిర్ద్విజాస్తత్ర ప్రతిజజ్ఞే భయంకరం ll 81 1/2 ll

తాll అనే కృష్ణుని వాక్యాన్ని పృథాసుతుడైన భీముడు విని, నీ తండ్రి దగ్గరకు వచ్చి అబద్దం మాట చెప్పాడు . (66) ఓద్రోణ! అశ్వత్థామచంపబడ్డాడు. ఇక్కడ యుద్ధంలో ఇప్పుడు పడి ఉన్నాడు, అని ఆ వాక్యాన్ని ద్రోణచార్యుడు కూడా యథార్థమని తలచాడు (67) మళ్ళీ విశ్వాసం కలగనందువల్ల ధర్మరాజు దగ్గరకు వచ్చి ఇట్లా అన్నాడు. ఓ ధర్మరాజ! ఇప్పుడు నాకుమారుడైన అశ్వత్థామ యుద్ధంలో హతుడైనాడా (68)నీవు సత్యవాదివనినమ్ముతారు. నీవు ఇప్పుడు చెప్పు అని అనగా ధర్మరాజు అసత్యంవల్ల భయపడుతూ, శత్రువును జయించాలని ఉత్సాహపడుతూ (69)ఇప్పుడు ఏం చేయాలని నేను అని ఆందోళిత మనస్కుడైనాడు. అతడు భీముడు చంపిన అశ్వత్థామ అను ఏనుగును చూచి (70) ఈ రోజు మహాయుద్ధంలో భీముడు అశ్వత్థామను చంపాడు. అని ద్రోణునితో ధర్మపుత్రుడు నెపంతో పలికాడు. (71) దాన్ని విని నీ తండ్రి శస్త్రమును వదలి యుద్ధము నుండి మరలాడు. ఆ పిదప దర్మసుతుడు ఏనుగు అని కూడా అన్నాడు . (72) అప్పుడు నీ తండ్రి వదలిన శస్త్రాన్ని తిరిగి గ్రహించనని, బలవంతుడైనా, ప్రతిజ్ఞ చేశాడు (73) ప్రతిజ్ఞ భంగమౌతుందనే భయంతో శస్త్రము స్వీకరించలేదు. నీ తండ్రి అప్పుడు ధృష్టద్యుమ్నుని చూచి తన మృత్యువుగా (74) భావించి యోగ విదుడైన అతడు ప్రాయోపవేశంతో రథంపై ఉన్నాడు. ప్రాణములను నిర్బంధించి సమాధి యందుండి నిద్రించాడు. (75) మాటవెడలే మార్గం నుండి తలను ఛేదించుకొని క్షణంలో అతని ప్రాణాలు వెడలి పోయాయి. అప్పుడు, చనిపోయిన ద్రోణుని శిరస్సును (76) కేశములను చేత బట్టి యుద్ధంలో ధృష్టద్యుమ్నుడు ఖడ్గంతో ఖండించాడు. సైనికులందరు పార్థుడు మొదలగు వారు చంపొద్దు అని అన్నారు. అందరు వారిస్తున్నా నీ తండ్రిని ప్రక్కనుండి చంపాడు (77) శ్రీసూతులిట్లనిరి - తండ్రి చనిపోయారని విని అశ్వత్థామ చాలా సేపు ఏడ్చి (78) చాలా కోపంలో మండిపోతూ ఇట్లా మట్లాడాడు. అబద్ధమాడి, శస్త్రము వదలునట్లగా నా తండ్రిని చేసిన (79) ఆ పార్థుని, ఇతర పాండవులను, వెంట్రుకలను పట్టుకొని శస్త్రము వదలిన నా తండ్రి శిరమును మోసంతో ఖండించిన (80)ఆ పార్శతుని (వెన్నుపోటుదారు ) నేను త్వరలోచంపేస్తాను . కృష్ణునితో సహా పాండవులందరు నా పరాక్రమాన్ని చూడండి (81)అని అశ్వత్థామ అక్కడ భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు . (81 1/2)

మూ ll తతోస్తంగత ఆదిత్యే రాజానః సర్వ ఏవతే ll 82 ll

ఉభ##యే నిహతే ద్రోణ ప్రావి శన్పటమంటపం lఅష్టాదశరినైరేవం వివృత్తమం భవద్రణం ll 83 ll

శల్యంకర్ణం తథా న్యాంశ్చ దుర్యోధన ముఖాంస్తతః lధార్త రాష్ట్రాన్ని హత్యాజౌ ధర్మరాజోయుధిష్ఠిరః ll 84 ll

స్వీయానాంచ పరేషాంచ మాతానాం సాంపరాయికం lఅకరోద్విధివద్విప్రాః సార్థం ధౌమ్యాభిర్ద్విపైః ll 85 ll

వందిత్వాధృతరాష్ట్రంచ సర్వే సంభూయపాండవాః l ధృతరాష్ట్రాభ్యనుజ్ఞాతా హతశిష్ట జనైర్వృతాః ll 86 ll

సంప్రావ్యహస్తినపురం ప్రావిశంస్తే స్వమందిరం l తతఃకతిపయాహఃసుగీతేషుకిలనాగరాః ll 87 ll

ధౌమ్యాదిమునిభిః సార్థం ధర్మజస్య మహాత్మనఃl రాజ్యాభిషేచనం కర్తుం ప్రారంభంత మునీశ్వరాః ll 88 ll

రాజ్యాభిషేచనే తస్య ప్రవృత్తే ధర్మజుస్యతు lఅశరీరాతతోవాణిబభాషే పదర్మనందనం ll 89 ll

ధర్మపుత్ర మహాభాగరిపూణా వపివత్సలlరాజ్యాభిషేకం మాకార్షీః నార్హస్త్వం రాజ్యపాలనే ll 90 ll

యతస్త్వం ఛద్మనాచార్యముక్త్వాసత్యం ద్విజోత్తమం l న్యస్త శస్త్రం రణరాజన్‌ అఘాతయదలజ్జకః ll 91 ll

అతస్తే పాపబాహుల్యం విద్యతే ధర్మనందన l ప్రాయశ్చిత్త మకృత్వాస్యరాజ్యపాలనకర్మణి ll 92 ll

నార్హతావిద్యతే యస్మాతే ప్రాయశ్చిత్తమతశ్చర l ఇత్యుక్త్వావిరరామథా సాతువాగశరీరిణీ ll 93 ll

తాll సూర్యుడుఅస్తమించాక రాజులందరుః (82)(వెళ్లారు) ద్రోణుడు చంపబడ్డాక రెండు వర్గముల రాజులు పట మంటపాన్ని ప్రవేశించారు. ఈరకముగా పదునెనిమిది రోజులు యుద్ధం జరిగి ముగిసింది (83) శల్యుని, కర్ణుని, అట్లాగే ఇతరులైన దుర్యోధనాదులను ధార్తరాష్ట్రులను చంపి యుద్ధంలో, ధర్మరాజు (84)తనవారికి ఇతరులకు చచ్చిన వారందరికి శాస్త్ర ప్రకారము, ధౌమ్యాధి ఋషులతో కూడి పరేత కర్మలు ఆచరించాడు (85)పాండవులందరు ఏకమై ధృతరాష్ట్రునకు నమస్కరించి, ధృతరాష్ట్రుని అనుజ్ఞపొంది, చావగా మిగిలిన పెద్ద వారందరితోకలిసి (86) హస్తినాపురికి వచ్చి తమ మందిరములో ప్రవేశించారు. కొన్ని రోజులు గడిచాక నగర ప్రజలు (87)ధౌమ్యాదిమునులతోకూడి మహాత్ముడైన ధర్మజుని రాజ్యాభి షేకముచేయుటకు ఆరంభించారు. (88) ధర్మజుని రాజ్యాభిషేకము ఆరంభముకాగా ధర్మనందునితో ఆ శరీరవాణి ఇట్లా పలికింది (89) ఓధర్మపుత్ర! మహానుభావ!శత్రువుల యందును దయగలవాడ! నీవు రాజ్యాభిషేకము చేసుకోవద్ధు. రాజ్యపాలనకు నీవు అర్హుడవు కావు. (90) నెపంతో సత్యాన్ని చెప్పి ఆచార్యుని , శస్త్రము వదలిన వానిని సిగ్గులేకుండా ఓ రాజ ! యుద్ధంలో చంపావుగదా (91) అందువల్ల ధర్మనందన! నీకు పాపబాహుళ్యము ఉంది . ఈ పనికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా, రాజ్యపాలన కర్మలో నీకు (92) అర్హత లేదుకనుక అందువల్ల ప్రాయశ్చిత్తం ఆచరించు. ఇట్లా పలికి ఆ ఆ శరీరవాణి విరమించింది (93)

మూll తతో దర్మసుతోరాజాతద్వాక్యం భృశకాతరః l మూఢో7హం సాహసీక్రూరః పిశునోలోభమోహితః ll 94 ll

తుచ్ఛరాజ్యాభిలాషేణ కృతవాన్‌ పాపమీదృశం l ఏతత్పాపవిశుద్ధ్యర్థం కింకరిష్యామికాగతిః ll 95 ll

కింవాదానం ప్రదాస్యామి కుత్రయాస్యామి వాపునః ఇతిశోకసమావిపష్టే తస్మిన్‌ రాజని ధర్మజే ll 96 ll

కృష్ణద్వైపాయనోవ్యాసః సమాయాతస్తదంతికం l తతో7భి వంద్యతం వ్యాసం ప్రత్యుత్థాయకృతాంజలిః ll 97 ll

సంపూజ్యార్ఝ్యాదినావిప్రాభక్తి ముక్తేన చేతసా l అదేవా వాచాయత్ర్పోక్తం పతత్సర్వమఖిలేననః ll 98 ll

వ్యాసాయ శ్రావయామాస దుఃఖితోదర్మనందనః lశ్రుద్వాతదఖిలం వాక్యం ధర్మజస్య మహామునిః

ధ్యాత్వాతు సుచిరంకాలం తతోపక్తుం ప్రచక్రమేl ll 99 ll

వ్యాస ఉవాచ-

మా కార్షిఃత్వంభయంరాజన్‌ ఉపాయం ప్రబ్రవీమితే l అస్యపాపసగశాంత్యర్థం శ్రుత్వానుష్ఠీయతాంత్వయా ll 100 ll

యుధిష్ఠిర ఉవాచ -

కింత ద్ర్బూహి మహాయోగిన్‌ పారాశర్యకృపానిధే యేనమే పాపనాశః స్యాతే అచిరాత్‌ తద్వదాధునా ll 101 ll

వ్యాస ఉవాచ -

దక్షిణాం భోనిధౌసేతౌగంధమాదనపర్వతే ll 102 ll

రామసేతౌ మహారాజ రామతీర్థమితి శ్రుతం l అస్తిపుణ్యంపరః సిద్ధం మహాపాతకనాశనం ll 103 ll

యస్యదర్‌ శనమాత్రేణ మహా పాతక కోటయః l ప్రయాంతివిలయంసద్యః తమః సూర్యోదయే యధా ll 104 ll

రామతీర్థంయదావశ్యేత్‌ స్వయంరామేన నిర్మితం lతదైవ బ్రహ్మహత్యాయా ముచ్యతేనా త్ర సంశయః ll 105 ll

తత్రగత్వామహారాజ రామతీర్థేవిముక్తిదేl స్నాహి తే పాపశుద్ధిః స్యాత్‌ రాజ్యరక్షార్వతాపిచ ll 106 ll

దానంకురుష్వతత్తీరేగోభూమితిలవానసాం

సువర్ణరజతానాంచ దానంకురు యుధిష్ఠర l అవశ్యమేతత్సాపానాం శుధ్ధిస్తేన చిరాద్భవేత్‌ ll 107 ll

తాll పిదప రాజైన ధర్మసుతుడు ఆ మాటకు మిక్కిలి చలించిన వాడై విని నేను మూడుణ్ణి, సాహసిని, క్రూరిణ్ణి, లోభిని, లోభంచే మోహితుణ్ణి(94) తుచ్ఛమైన రాజ్యాభిలాషతో ఇలాంటి పాపాన్ని చేశాను . ఈపాప విశుద్ధి కొరకు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి (95) ఏం దానం చేయాలి. ఎక్కడికి వెళ్లాలి. అని ధుఃఖాకులుడై ఆ ధర్మరాజుండగా (96) కృష్ణ ద్వైపాయనుడెన వ్యాసుడు ఆతని దగ్గరకు వచ్చాడు. ఎదురేగి, చేతులు జోడించి ఆ వ్యాసునకు నమస్కరించి (97) భక్తితో నిండిన మనస్సుతో అర్ఝ్యాదులతో పూజించి, ఆకాశవాణి చెప్పినదంతా పూర్తిగా (98)దుఃఖితుడైన ధర్మరాజు వ్యాసునకు వినిపించాడు. ఆ మహాముని ధర్మరాజు మటలనన్నింటిని విని, చాలా సేపు ధ్యానించి పిదప ఇట్లా చెప్పనారంభించాడు. (99) వ్యాసుని మాట - ఓరాజా ! నీవు భయపడకు నీకు ఉపాయం చెప్తాను. ఈపాప శాంతి కొరకు చెప్పిన దానిని విని నీవు ఆచరించు (100)యుధిష్ఠురుని మాట- దాని వలన నా పాపం నశించని. ఇప్పుడు దాన్ని తొందరగా చెప్పండి. (101) అని అనగా వ్యాసోక్తి ఇట్లా - దక్షిణ సముద్రమందు సేతువు యందు గంధమాదన పర్వతమందు (102) ఓ రాజ! రామసేవతువుయందు రామ తీర్థమని ప్రసిద్ధమైన, మహాపాతకముల నశింపచేసే పుణ్యసరస్సు ఉంది (103)దానిని దర్శించుకున్న మాత్రమున మహపాతకములు కోటులు నశిస్తాయి. సూర్యోదయమందు చీకట్లు నశించినట్లు (104)స్వయంగా రాముడు నిర్మించిన రామ తీర్థమును దర్శించినంతమాత్రమున వెంటనే బ్రహ్మహత్యయొక్క పాపం కూడా నశిస్తుంది . అనుమానంలేదు (105)ముక్తినిచ్చే అరామతీర్థమునకు వెల్ళి ఓ రాజా స్నానం చేయి. నీకు పాపశుద్ధి జరుగుతుంది. రాజ్యరక్షార్వత కూడా వస్తుంది . (106) దాని తీరమందు గోభూమి తిల వస్త్రములను దానం చేయి. ఓ యుధిష్ఠిర ! సువర్ణరజతముల దానం కూడా చేయి. ఈ పాపముల నుండి శుద్ధి నీకు త్వరగా లభిస్తుంది . (107)

మూll శ్రీసూత ఉవాచ-

వ్యాసేనధర్మపుత్రో7య మేవముక్తో ద్విజోత్తమాః ll 108 ll

తత్‌ క్షణ నైవ ధౌమ్యేన సహితః సానుజస్తదా l సహదేవం ప్ర్పతిష్ఠాప్య రాజ్యే ధర్మాత్మ జస్తదా ll 109ll

రామసేతుం సముద్ధిశ్యప్రతస్థే వాహనం వినా l దినైః కతిపయైరేవ రామసేతుంజ గాఘనః ll 110ll

రామతీర్థం సమాసాద్యధౌమ్యేన సహపాండవః l పురోహితోక్తమార్గేణ సంకల్ప్యవిధిపూర్వకం ll 111 ll

సస్నౌ రామసరస్తీర్థేపుణ్యపాపవినాశినే lస్నాత్వాచమ్యవిశుద్ధాత్మాక్షేత్రపిండర ప్రదాయచ ll 112 ll

వ్యాసోక్తాఖిల దానాని ప్రదదౌసయుదిష్ఠిరః l మాసమేకం నిరాహరః సస్నౌతత్ర సధర్మజః ll 113 ll

ప్రత్యహంచదదౌదానం విత్తలోభం వినాద్విజాః l ఏకమాసేగతేత్వేవం కస్మింశ్చిద్దివసేతతః ll 114 ll

అహధర్మాత్మజంవాణీ పునరప్యశరీరిణి l రాజంస్తే విలయంయాతం సర్వం పాపం యుదిష్ఠిర ll 115 ll

ఛలేనా సత్యవచనాత్‌ ఆచార్యస్యవధ్తేనయః దోషస్తే కసమభూత్పూర్యం సో7పి నష్టః పరంతప ll 116 ll

యామీస్వనగరం రాజన్‌ గత్వాపాలయమేదినీం lఅభిషేచయ చాత్మానం రాజ్యరక్షా ర్హతాస్తితే ll 117 ll

ఇత్యుక్త్వావిరరామాథ సాపివాగశరీరిణీ l తతోధర్మాత్మజః ప్రీతః తాముద్దిశ్యదిశం ప్రతి ll 118 ll

నమస్కృద్వాశరీరిణ్యౖతసై#్యవాచే సహానుజఃl ప్రయ¸°హాస్తినపురం సుప్రీతే నాంతరాత్మనా ll 119 ll

అభిషిక్తో7థ రాజ్యే7సౌ పాలయామాసమేదినీం l ఇత్థం ధర్మాత్మజో విప్రారామతీర్థనిమజ్జనాత్‌ ll 120 ll

గతపాపోవిశుద్ధాత్మాయోగ్యో7భూద్రాజ్యరక్షణ lఏవంవః కథితం చిత్రం రామతీర్థస్యవైభవం ll 121 ll

సర్వపాపహరం పుణ్యం భక్తిముక్తి ప్రదాయకం l యత్రస్నానద్విముక్తో7భూత్‌ విథ్యాదోషాత్సధర్మజః ll 122 ll

పఠంతియే7ధ్యాయమిదం ద్విజోత్తమాః l శృణ్వంతివాయే మనుజావిపాతకాః

యాస్యంతికైలా సమనన్యలభ్యం గత్వాన సంయాంతిపునశ్చజన్మ

ఇతి శ్రీస్కాందే మహాపురాణ ఏకాశీత సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతమహాత్య్మే రామతీర్థ ప్రశంసాయాం దర్మపుత్రమిథ్యాకథన దోషశాంతివర్ణనం నామ అష్టాదశో7ధ్యాయః ll 18 llS

తాll శ్రీ సూతులిట్లనిరి - ఓ ద్విజోత్తములార ! వ్యాసుడు ధర్మపుత్రునితో ఈ విధంగా చెప్పాక (108)వెంటనే ధౌమ్యునితో, తమ్ములతో కూడా కుడి, రాజ్యంలో సహ దీవున ఉంచి ధర్మరాజు (109) వాహనం లేకుండ రామసేతువపు నుద్దేశించి బయలుదేరాడు. కొద్దిరోజుల్లోనే రామసేతువుకుచేరాడు. (110) ధౌమ్యునితో కూడి ధర్మరాజు రామతీర్థము చేరి, శాస్త్ర ప్రకారము పురోహితుడు చెప్పిన విధంగా సంకల్పంచేసి (111) పాపనాశకమై పుణ్యప్రదమైన రామతీర్థమందు స్నానం చేసి, ఆచమించి విశుద్ధాత్మకల ధర్మజుడు క్షేత్ర పిండమును కూడా ఇచ్చి (112) వ్యాసుడు చెప్పిన విధముగా అన్ని దానములను ఇచ్చాడు. ఆహారం లేకుండా ఉంటూ నెలరోజులు ఆధర్మరాజు అక్కడ స్నానం చేశాడు. (113) ప్రతిరోజు విత్తలోభము లేకుండా దానం చేశాడు. ఒక నెల రోజులు గడిచాక తరువాత ఒక రోజు (114) తిరిగి అశరీర వాణి ధర్మాత్మజునితో ఇట్లా అంది. ఓ రాజ నీ పాపమంతా నశించి పోయింది. (115) నెపం వల్ల, అసత్యపుమాటవల్ల, ఆచార్యుని వధచే వచ్చిన పూర్వపునీ దోషము నశించి పోయింది (116) రాజ! నీ నగరానికి పో, పోయి రాజ్యాన్ని పాలించు. నీకు రాజ్య రక్షార్హత ఉంది. నీవు అభిషిక్తుడవుకమ్ము (117) అని ఆ అశరీరవాణి పలికి విరమించింది. పిదప ధర్మాత్మజుడు సంతుష్టుడై ఆ దిక్కునకు నమస్కరించి (118) ఆ అశరీరవాణికి నమస్కరించి అనుజులతో కూడి, సంతు ష్టమైన మనస్సుతో హస్తినాపురికి బయలుదేరాడు (119) రాజ్యమందు అభిషిక్తుడై భూమిని పరిపాలించసాగాడు. ఈ విధంగా ధర్మాత్మజుడు రామతీర్థంలో మునిగినందువల్ల (120) పాపములన్ని పోయి విశుద్ధాత్ముడై రాజ్యరక్షణకు యోగ్యుడైనాడు. ఈ విధముగా రామతీర్థ వైభవమును గూర్చి మీకు చెప్పాను. (121) ఇదిసర్వపాపములను హరించేది. పుణ్యప్రదమైనది. భక్తి ముక్తులను ఇచ్చేది. ఇక్కడ స్నానం చేయటంవల్ల ధర్మరాజు అసత్య దోషమునుండి ముక్తుడైనాడు. (122) ఓ బ్రాహ్మణులార! ఈ అధ్యాయము చదివినవారు, ఈ అధ్యాయము విన్నవారు పాతకరహితులై, ఇతరులకు లభ్యముకాని కైలాసమునకు వెళ్తారు. పోయి పిదప తిరిగి జన్మను పొందరు (123) అని శ్రీ స్కాంద మహాపురాణ మందు ఏకాశీతి సహస్ర సంఖ్యగల సంహితయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతు మాహాత్మ్య మందు రామతీర్థ ప్రశంసయందు ధర్మజుడు అసత్యం పలకటంవల్ల కల్గిన దోషశాంతిని వర్ణించేది పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము || 18 ||.

Sri Scanda Mahapuranamu-3    Chapters