Sri Scanda Mahapuranamu-3    Chapters   

పదమూడమ అధ్యాయము

మూll శ్రీ సూత ఉవాచ-

మంగలాఖ్యే మహాతీర్థే నరః స్నాత్వావికల్మషః l ఏకాంతరామనాథాఖ్యం క్షేత్రంగచ్ఛేత్‌ తతః పరా ll 1ll

తత్ర రామోజగన్నాధూ జానక్యాలక్ష్మణనచl హనుమత్ప్రముఖైశ్చాపి వాసరైః సరివారితః ll 2 ll

సన్నిధత్తే సదావిపా లోకానుగ్రహకామ్యయా l విద్యతే పుణ్యదా తత్రనామ్నాహ్యమృతవాపికా ll 3ll

తస్యాం నిమజ్జతాం నౄణాంన జరాంతక జంభయం l అస్యా మమృత వాప్యాంయంః సశ్రద్ధం స్నాతి మానవః ll 4 ll

అమృతత్వం భజత్యేష శంకరస్యప్రసాదతః l మహాపాతకనాశిన్యామస్యాం వాప్యాం నిమజ్జతాం ll 5 ll

అమృతత్వంహరోదాతుం సన్నిధత్తే సదాతటేl

ఋషయ ఊచుః-

ఇయం హ్యమృతవాపీతికుతోహెతోర్నిగద్యతే ll 6 ll

అస్మాకమేతత్‌ బ్రూహిత్వం కృపయావ్యాసశాసిత l తథైవామృత నామిన్యావాపికాయాశ్చవైభవం ll 7 ll

తృప్తిర్నజాయత్‌ 7స్మాకం త్వద్వచోమృతపాయినాం l

శ్రీసూత ఉవాచ -

అస్మాఅమృత నామత్వం వైభవం చమనోహరం ll 8 ll

ప్రవక్ష్యామి విశేషేణ శ్రుణత ద్విజసత్తమాః l పురాహిమవతఃపార్శ్వే నానాముని సమాకులే ll 9 ll

సిద్ధచారణగంధర్వ దేవకిన్నర సేవితే l సింహవ్యాఘ్ర వరాహెభ మహిషాది సమాకులే ll 10 ll

తమాలతాల హింతాల చంపకాశోకసంతతే l హంసకోకిల దాత్యూహ చక్రవాకాది శోభితే ll 11 ll

పద్మేం దీవరకల్హర కుముదాఢ్య సరోవృతేl సత్యవాన్‌ శీలనాన్‌ వాగ్మీవశీకుంభజ సోదరః ll 12 ll

ఆస్తేతపశ్చరన్నిత్యం మోక్షార్థీ శకంరప్రియః l త్రికాలమర్చయన్‌ శంభుమన్యైర్మూల ఫలాదిభి ః ll 13 ll

ఆగతానే స్వాశ్రమాభ్యాయశమతిథీన్‌ వన్యభోజనైః l పూజయన్నర్చయన్నగ్నిం సంధ్యోపాసన తత్పరః ll 14 ll

గాయత్ర్యాదీన్‌ మహామంత్రాన్‌ కాలేకాలేజపన్ముదాlనిద్రాం పరిత్యజన్‌ బ్రాహ్మె ముహూర్తే విష్ణుచింతక ః ll 15 lls

స్నానం కుర్వన్నుషః కాలే నమస్సంధ్యాం ప్రసన్నదీఃl గాయత్రీం ప్రజపన్విప్రాఃపూజయన్‌ హరిశంకరౌ ll 16 ll

వేదాధ్యాయీశాస్త్ర పాఠీమధ్యాహ్నె7 తిథిపూజకః శ్రోతాపురాణ పాఠానాం అగ్నికార్యేష్వతం ద్రితః ll17 ll

పంచయజ్ఞపరోనిత్యం వైశ్వదేవబలిప్రదః l ప్రత్యబ్ధం శ్రాధ్ధకృత్‌ పిత్రోః తథాన్యశ్రాద్ధకృధ్ద్విజాః ll 18 ll

ఏవం నినాయకాలం సనిత్యానుష్ఠానతత్పరః ll 18 1/2 ll

తాll శ్రీ సూతులిట్లనిరి - మంగలమనే మహాతీర్థంలో నరుడు స్నానము చేసి, కల్మషరహితుడై ఆ పిదప ఏకాంతరామనాధుడనే పేరుగల క్షేత్రమునకు ఆ పిదప వెళ్ళాలి. (1) అక్కడ జగన్నాధుడైన రాముడు సీత లక్ష్మణులతో కలిసి హనుమంతుడు మొదలగువానరులతో చుట్టబడి (2) లోకములను అనుగ్రహించేకొరకు ఎల్లప్పుడూ సమీపంలో ఉంటాడు . అక్కడ పుణ్యద అనుపేరుగల అమృతపు బావి ఉంది (3) అక్కడ స్నానం చేసిన వారికి నరులకు మసలితనము, యమ భయములేదు . ఈఅమృత బావియందు స్నానం చేసి శ్రాద్ధమాచరించిననరుడు (4)శంకరుని అనుగ్రహం వల్ల అమృతత్వాన్ని పొందుతాడు. మహాపాతకనాశినియైన ఈ బావియందు మునిగేవారికి (5) శివుడు అమృతత్వము ఇవ్వటానికి దాని ఒడ్డుయందు ఎల్లప్పుడు ఉంటూడు . ఋషులిట్లనిరి- ఇది అమృత వాపి అని ఏకారణంగా పిలువబడుతుంది . (6) మాకు దయతో ఈ విషయాన్ని చెప్పండి, వ్యాసశిష్య! అట్లాగే అమృత అనుపేరుగల వాపి యొక్క వైభవాన్నికూడా చెప్పండి. నీమాటలనే అమృతాన్ని తాగే మాకు తృప్తి కలుగటం లేదు. అని అనగా (7)శ్రీసూతులిట్లనిరి - దీనికి గల అమృతమనే పేరును గూర్చి మనోహరమైన వైభవాన్నిగూర్చి (8) విశేషంగా చెవుతాను . వినండి ఓ బ్రాహ్మణులారా. పూర్వం హిమవంతునకు ప్రక్కభాగంలో అనేకమంది మునులతో కూడిన (9) సిద్ధచారణ గంధర్వ దేవకిన్నరులతో సేవించబడ్డ, సింహవ్యాఘ్ర వరాహములు ఏనుగమహిషములతో కూడిన (10)తమాలతాలములు హింతాల చంపక అశోకము మొదలగు వృక్షములుకల, హంసకోకిలలు, వానకోయిల చక్రవాకాది పక్షులతో అలంకరించబడ్డ (11) పద్మము, ఇందీవరము కల్హరకుముదములతో నిండిన సరస్సుతో చుట్టబడిన ప్రాంతమున సత్యవంతుడు శీలవంతుడు వాగ్మి ఇంద్రియనిగ్రహము కల కుంభుజని సోదరుడు (12) తపస్సు చేస్తూ ఎప్పుడూ ఉండేవాడు. మోక్షాన్ని కోరే అతడు శంకరునకు ప్రియుడు . మూల ఫలాదులతో ఇతరమై వాటితో మూడుకాలములందు శివునిపూజిస్తూ (13) తన అశ్రమ సమీపమునకు వచ్చిన అతిథులను వనమందలి ఆహారపదార్థములతో పూజస్తూ. అగ్నిని అర్చిస్తూ. సంధ్యోపాసన తత్పరుడై (14) గాయత్ర్యాది మహా మంత్రములను ప్రతికాలమందు సంతోషంతో జపిస్తూ, నిద్రను వదలి బ్రహ్మముహూర్తమందున, విష్ణువును ధ్యానిస్తూ (15)స్నానంచేస్తూ ఉషఃకాలమందు ప్రసన్నమైన బుద్ధితో సంధ్యకు నమస్కరిస్తూ, గాయత్రిని జపిస్తూ, హరి శంకరులను పూజిస్తూ (16) వేదం అధ్యయనం చేస్తూ, శాస్త్రం పఠిస్తూ మద్యాహ్నమందు అతిథుల పూజిస్తూ, పూరాణ పాఠముల వింటూ, అగ్నికార్యముల యందు శ్రధ్ధవహిస్తూ (17) ప్రతిరోజు పంచయజ్ఞము లాచరిస్తూ వైశ్వదేవబలులను ఇస్తూ ప్రతి సంవత్సరము పితరులకు శ్రాద్ధం చేస్తూ, అట్లాగే ఇతర శ్రాద్ధము లాచరిస్తూ ఉండేవాడు (18)ఇట్లా నిత్యానుష్ఠాన పరుడై కాలంగడిపేవాడు (18 1/2)

మూll తసై#్యవం వర్తమానస్య తపశ్చరత ఉత్తమం ll 19 ll

సహస్రవర్షాణ్యగమన్‌ శంకరాసక్తచేతనః తథాపిశంకరోనాస్యాయ¸° ప్రత్యక్షతాంతదా ll 20 ll

తతస్త్వగస్త్య భ్రాతాసౌ గ్రీష్మే పంచాగ్నీ మధ్యగః lభాస్కరేదత్తదృష్టిశ్చ మౌనవ్రత సమన్వితః ll 21 ll

తిష్ఠన్‌ కనిష్ఠికాం గుల్యాం వామపాదస్య నిశ్చలఃl ఊర్ధ్వ బాహుః నిరాలంబః తపస్తేపేతి దారుణం ll 22 ll

అథతస్యప్రసన్నాత్యా మహాదేవో ఘృణానిది l ప్రాదురాసీత్‌ స్వయాదీప్త్యాదిశోదశవిభాసయన్‌ ll 23 ll

తతో7ద్రాక్షీస్మునిః శంభుంసాంబం వృషభసంస్థితం l దృష్ట్వా ప్రణమ్మతుష్టావభవానీ పతిమీశ్వరం ll 24 ll

మునిరువాచ-

నమస్తే పార్వతీ నాథ నీలకంఠ మహేశ్వర l శివరుద్రమహాదేవ నమస్తే శంభ##వేవిభో ll 25 ll

శ్రీకంఠోమా పతే శూలిన్‌ భగనేత్రహరావ్యయ l గంగాధర విరూపాక్షనమస్తే రుద్ర మన్యవే ll 26 ll

అంతకారే కామశత్రోదేవదేవ జగత్పతే l స్వామిన్‌ పశుపతే శర్వనమస్తే శతధన్వనే ll 27 ll

ll27ll]

దక్షయజ్ఞ వినాశాయ స్నాయూనాం వతయేనమః l విచేరవేనమస్తుభ్‌ యం పుష్టానా పతయేనమః ll 28 ll

భూయో భూయో సమస్తుభ్‌ యం మహాదేవకృపాలయ l దుస్తరాత్‌ భవసింధోర్మాం తారయస్వత్రిలోచన ll 29 ll

అగస్త్యసోదరేణౖవం స్తుతః శంభురభాషతః ప్రీణయన్‌ వచసాస్వేన కుంభజస్యానుజంమునిం ll 30 ll

ఈశ్వర ఉవాచ -

కుంభజాను జవక్ష్యామి ముక్త్యు పాయంత వానఘ l సేతుమధ్యే మహా తీర్థం గంధమానద పర్వతే ll 31 ll

మంగలా ఖ్యస్యతీర్థస్య నాతి దూరేణ వర్తతే l తత్ర గత్వాకురుస్నానం తతోముక్తి మవాస్స్యసి ll 32 ll

తత్తీర్థసేవనాన్నాన్యోమోక్షోపాయోలఘుస్తవ l నహితతత్తీర్థ వైశిష్ట్యం వక్తుం శక్యం మయా పిచ ll 33 ll

సందేహోనాత్ర కర్తవ్యఃత్వయాద్యమనిసత్తమlతస్మాత్తత్రైవ గచ్ఛత్వం యదీచ్ఛసిభపక్షయం ll 34 ll

ఇత్యుక్త్వ భగవానీశః తత్రైవాంతర ధీయత ll 34 1/2 ll

తాll ఈ విధంగా ఉంటూ ఉత్తమమైన తపమాచరిస్తున్న అతనికి (19) వేయి సంవత్సరాలు గడిచిపోయాయి. శంకరుని యందు ఆసక్తికలవాడైనా ఈ తనికి శంకరుడు ప్రత్యక్షం కాలేదు (20) పిదప ఆగస్త్యుని భ్రాతైన ఈతడు ఎండాలామందు పంచాగ్నుల మధ్య ఉంటూ, సూర్యునిపై దృష్టిని నిలిపి, మౌన వ్రతం పాటిస్తూ (21) ఎడమకాలి చిటికను వేలిపై నిశ్చలంగా నిలిచి, చేతులుపైకెత్తి ఏఅధారంలేకుండా అతి దారణమైన తపమాచరించాడు (22) దయానిధియైన మహాదేవుడు ప్రసన్నహృదయుడై తన వెలుగుతో పదిదిక్కులను వెలిగింపచేస్తూ ఆతని ఎదుట ప్రత్యక్షమైనాడు . (23)అప్పుడు మునివృషభమందున్న శంభుని సాంబుణ్ణి చూచాడు. చూచిననమస్కరించి భవానీ పతియైన ఈశ్వరుని ఇట్లా స్తుతించాడు (24) ముని ఇట్లన్నారు-పార్వతీ నాథ నీలకంఠ, మహేశ్వర, శివ, రుద్ర, మహాదేవ, శంభో!నమస్కారము (25) శ్రీకంఠ, ఉమాపతి, శూల, భగనేత్ర, హర, అవ్యయ, గంగాధర, విరూపాక్ష, రుద్ర, మన్యో! నీకు నమస్కారము (26) అంతకారి, కామశత్రువ, దేవదేవ, జగత్పతి, పశుపతి, శర్వ, శతధ్వనిన్‌ ! నీకు నమస్కారము. (27) దక్షయజ్ఞ వినాశక, స్నాయుపతి, నిచేరవ, పుష్టపతి (28) కృపానిలయ, మహాదేవ! మరోమరోమారు నీకు నమస్కారము. ఓత్రిలోచన ! దుస్తరమైన సంసార సముద్రము నుండి నన్ను ఒడ్డెక్కించు (29) అగస్త్యసోదరునితోస్తుతింపబడ్డ శివుడు తన మాటలతో కుంభుజుని తమ్ముడైన మునిని సంతోష పరుస్తూ ఇట్లా అన్నాడు . (30) ఈశ్వరుని మాట - ఓ కుంభుజుని తమ్ముడ! నీకు పుణ్యప్రదమైన ముక్త్యుపాయాన్ని చెప్తాను. సేతుమధ్య మందు గంధమాధన పర్వతమందు మహాతీర్థముంది (31) మంగల మను తీర్థమునకు చాలా దగ్గరలో ఉంది . అక్కడికి వెళ్ళి స్నానం చేయి. పిదప ముక్తిని పొందుతావు (32) ఆ తీర్థసేవనముకన్న సులభ##మైన మోక్షోపాయము మరొకటి లేదు . అ తీర్థ వైశిష్ట్యమును చెప్పుట నాకు గూడా చేత కాదు (33) ఓముని సత్తమ ! నీవు ఈ రోజు ఈ విషయంలో సందేహించకూడదు . సంసారనాశము కావాలనుకుంటే అక్కడికే వెళ్ళు. (34) అని పలికి భగవంతుడైన ఈశుడు అక్కడే కన్పించకుండా పోయాడు (34 1/2)

మూll తతోదేవస్యవచనాదగస్త్యస్య సహోదరః ll 35 ll

గత్వాసేతుంసముద్రేతు గంధమాదన పర్వతే l ఈశ్వరేణౖన గదితం తీర్థం తచ్ఛీఘ్ర మాసదత్‌ ll 36 ll

తత్రతీర్థే మహాపుణ్య స్నాతానాం ముక్తిదాయిని l ఏకాంతరామనాథాఖ్యే క్షేత్రాలంకరణశుభే ll 37 ll

సస్నౌనియమపూర్వం సత్రీణి వర్షాణి వైద్విజః l తతశ్చతుర్థ వర్షేతు సమాధి స్థోమహామునిః ll 38 ll

బ్రహ్మనాడ్యాం ప్రాణవాయుం మూర్థన్యారో వ్యయోగతః ప్రాణాన్నిర్గమయా మాసబ్రహ్మరంధ్రేణ తత్రసః ll 39 ll

తతో7గస్త్యానుజః సోయం వరిత్యజ్యకలేవరం l అవాపముక్తిం పరమాంతస్యతీర్థస్యవైబవాత్‌ ll 40 ll

వినష్టాశేషదుఃఖస్యతత్తీర్థస్నానవైభవాత్‌ l అమృతత్వమ భూద్యస్మాత్‌ అగస్త్యానుజ జన్మనః ll 41 ll

తతోహ్యమృతవాపీతి ప్రాధా7స్యాసీన్మునీశ్వరాః అత్రతీర్థే సరాయేతు వర్షత్రయమతంద్రితాః ll 42 ll

స్నానం కుర్వంతితే సత్మ్యం అమృతత్వం ప్రయాంతిహి l ఏవం త్వమృతవాపీతి ప్రధాతద్వైభవంతథా ll 43 ll

యుష్మాకం కథితం విప్రా ః కింభూయః శ్రోతుమిచ్ఛథ l

ఋషయ ఊచుః ఏకాంతరామనాథాఖ్యాతస్యక్షేత్రస్యవైమునే ll l44 ll

కథం కసమాగతాసూతవక్తుమేతత్‌ త్వమర్హసి l అస్మాకం మునిశార్దూల తచ్చుశ్రూషా తిభూయసీ ll 45 ll

తాll మహాదేవుని వచనాన్ననుసరించి అగస్త్యుని సహోదరుడు (35) సేతువునకు సముద్రమందలి గంధమాదన పర్వతమునకు వెళ్ళి ఈశ్వరుడు చెప్పిన ఆ తీర్థమునకు త్వరగా వెళ్ళాడు (36)స్నానం చేసిన వారికి ముక్తినిచ్చే ఆ పుణ్యప్రదమైన తీర్థమందు, ఏకాంతరామనాథ అనుపేరుగల, క్షేత్రముల కలంకారమైన శుభ##మైన ఆచోట (37)నియమ పూర్వకముగా మూడు సంవత్సరములు అతడు స్నానం చేశాడు. పిదప నాల్గవ సంవత్సరమందు మహాముని సమాదిస్థితుడై (38)యోగశక్తితో ప్రాణవాయువును మూర్థమందు బ్రహ్మనాడియందారోపించి బ్రహ్మరంథ్రం ద్వారా ప్రాణములను వదిలాడు . (39)పిదప ఆ అగస్త్యానుజుడు. ఆ శరీరాన్ని వదలి, ఆ తీర్థవైభవం వల్ల పరమమైన ముక్తిని పొందాడు (40) ఆ తీర్థస్నాన వైభవం వల్ల అశేష దుఃఖములు నశించి అమునికి అమృతత్వం సిద్ధించింది కనుక (41) దీనికి అమృతవాపి అని పేరొచ్చింది, ఓమునులారా ! ఈ తీర్థమందు మూడు సంవత్సరాలు నిశ్చలంగా స్నానం చేసిన నరులు (42)తప్పకుండా అమృతత్వాన్ని పొందుతారు. ఈ విధముగా అమృతవాపి అనే పేరు దాని ప్రశస్తి మీకు వివరించాను ఓవిప్రులారా ! ఇంకా ఏమివినదలుచుకున్నారు (43)అని అనగా ఋషులిట్లనిరి - ఆక్షేత్రమునకు ఏకాంతరామనాధమనే పేరు (44) ఎట్లా వచ్చింది . సూత! దీన్ని వివరించ నీవు సమర్థుడవు మాకు దాన్ని సేవించాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంది . ఓమునీ ! అని అన్నారు (45).

మూll శ్రీసూత ఉవాచ -

పురాదాశరధీరామః నసుగ్రీవ విభీషణః లక్ష్మణనయుతో భ్రాత్రామంత్రజ్ఞేన హనూమతా ll 46 ll

వానరైర్బధ్యమానే తుసేతావం బుధిమధ్యతః l చింతయన్మనసా సీతాం ఏకాంతే సమమంత్రయత్‌ lll 47 ll

తేషుమంత్రయమాణషు రావణాదివధం ప్రతి ఉల్లోలతరకల్లోలోజుఘోష జలధిర్‌ భృశం ll 48 ll

అర్ణవస్యమహాభీమేజృంభమాణ మహాధ్వనౌ l అన్యోన్య కథితాం వార్తాంనాశ్రుణ్వంస్తే పరస్పరం ll 49 ll

తతఃకించి దివకృద్థో భృకుటికుటలేక్షణః l భ్రూభంగలీలయారామో నియమ్మజలధింతదా ll 50ll

స్యమంత్రయత విప్రేంద్రా రాక్షసానాం పధంప్రతి l ఏకాంతే7మంత్రయత్తత్రతైః సార్థం రాఘవోయతః ll 51 ll

ఏకాంతరామనాథాఖ్యం తత్‌ క్షేత్రమభవద్ధ్విజాః l సోయంనియమితో వార్థీరామభ్రూభంగలీలయా ll 52 ll

అద్యాపి నిశ్చలజలః తత్ర్పదేశేషుదృశ్యతే l ఏకాంతరామనాథాఖ్యంత దేతత్‌ క్షేత్రముత్తమం lll 53 ll

అగస్త్యామృతవాప్యాంచస్నాత్వానియమపూర్వకం l రామాదీనపిసేవంతే తే సర్వేముక్తిమాప్నుయుః ll 54 ll

అద్వైత విజ్ఞాన వివేకశూన్యా l విరక్తిహీనాశ్చ సమాధిహీనాః

యాగాద్యనుష్ఠాన వివర్జితాశ్చ lస్నాత్వాత్రయాస్యంత్యమృతం ద్విజేంద్రాః ll 55 ll

ఇతి శ్రీస్కాందే మహాపురాణ ఏకాశీత సాహస్య్రాం సంహితాయాంతృతీయే బ్రహ్మఖండే సేతుమహాత్య్మే అమృత వాపీ ప్రశంసాయాంఅగస్త్య భ్రాతృవిముక్తి వర్ణనం నామత్రయోదశో7ధ్యాయః ll 13 ll

తాll శ్రీసూతులిట్లనిరి - పూర్వం దశరథ రాముడు సుగ్రీవ విభీషణులతో కలిసి తమ్ముడైన లక్ష్మణునితో కలిసి మంత్రజ్ఞుడైన హనుమంతునితో కూడా ఉండగా (46) సముద్రమధ్యమునుడి సేతువును వానరులు నిర్మిస్తూ ఉండగా, రాముడు సీతను మనస్సులో స్మరిస్తూ, ఏకాంతంలో వారితో మంత్రాలోచన చేశాడు (47)రావణాదులవధును గూర్చి వారు ఆలోచిస్తూ ఉండగా సముద్రము అలల మిక్కిలి ఎగిసిపడుతూ ధ్వనించాయి. (48) మహా భయంకరమైన సముద్ర ధ్వని అదికమౌతుండగా, వారు పరస్పరం మాట్లాడుకునే మాటలను ఒకరివొకరు వినలేకపోయారు (49) అప్పుడు రాముడు కొంచం కోపగించినట్టై కనుబొమలు ముడిచుటచే వక్రమైన చూపులు గలవాడై, భ్రూభంగ విలాసముల చేతనే రాముడు సముద్రాన్ని నియమించి (50) రాక్షసులను చంపటం గూర్చి మంత్రాలోచన చేసాడు. ఏకాంతమందు వారితో కూడి మంత్రాలోచన చేసాడు రాముడు కనుక (51) ఆ క్షేత్రము ఏకాంతరామనాథమనే పేరుగలదైంది . ఈ రకంగా రాముని భ్రూభంగలీలతో నియమింపబడిన వార్థి (52) నేటికి కూడా నిశ్చలమైన జలముకలదై ఆ ప్రదేశంలో కన్పిస్తోంది. ఏకాంతరామనాథమను పేరుగల ఈ క్షేత్రము ఎంతో ఉత్తమమైనది . (53) ఇక్కడికి వచ్చి అమృతవాపి యందు నియమపూర్వకముగా స్నానము చేసి రామాదులను సేవించిన వారు అంతా ముక్తిని పొందుతారు (54) అద్వైత విజ్ఞాన వివేకములు లేనివారు, విరక్తి లేనివారు, సమాధిలేనివారు, యాగాదులనుష్ఠించుటను వదలిన వారు ఇక్కడ స్నానం చేసి అమృతత్వం పొందుతారు. ఓ బ్రాహ్మణులారా ! అని శ్రీస్కాంద మహా పురాణంలో ఎనుబది ఒక్కవేల సంహిత యందు తృతీయమైన బ్రహ్మఖండ మందు సేతుమాహత్య్మమందు అమృతవాపి ప్రశంసయందు అగస్త్య భ్రావవిముక్తి వర్ణనమ అనునది పదమూడవ అధ్యాయము సమాప్తము ll 13 ll.

Sri Scanda Mahapuranamu-3    Chapters