Sri Scanda Mahapuranamu-3    Chapters   

పన్నెండవ అధ్యాయము

మూ || శ్రీ సూత ఉవాచ

సీతాకుండే మహాపుణ్యనరః స్నాత్వా ద్విజోత్తమాః | తతస్తు మంగలం తీర్థం అభిగచ్ఛేత్సమాహితః || 1 ||

సన్నిధత్తే సదాయత్ర కమలా విష్ణువల్లభా | అలక్ష్మీపరిహారాయ యస్మిన్‌ నరసివైనురాః || 2 ||

శతక్రతుమఖాః సర్వేసమాగచ్ఛంతి నిత్యశః | తదేత త్తీర్థముద్దిశ్య ఋషయోలోకపావనం || 3 ||

ఇతిహాసం ప్రవక్ష్యామి పుణ్యం పాపవినాశనం | పురామనోజవోనామరాజాసోమకులోద్బవః || 4 ||

పాలయామా సధర్మేణ ధరాం సాగరమేఖలాం | అయష్టననురాన్‌ యజ్ఞెః బ్రాహ్మణానన్న సంచయైః || 5 ||

తర్పయామానకవ్యేన ప్రత్యబ్దం పితృదేవతాః | త్రయీమద్యైష్ఠ సతత మపాఠీచ్ఛాస్త్ర మర్థవత్‌ || 6 ||

వ్యజేష్ఠశత్రూన్‌వీర్యేణ ప్రాణం సీదీశ##కేశవౌ | అరంస్తనీతిశాస్త్రేషు తథాపాఠీన్‌ న్మహమనూన్‌ || 7 ||

ఏవం సధర్మతోరాజా పాలయామాసమేదీనీం | రక్షతస్తన్యరాజ్ఞో7భూద్రాజ్యం నిహత కంటకం || 8 ||

అహంకారో7భవత్తన్యపుత్ర సంపద్వినాశనః | అహంకారో భ##వేద్యత్రతత్రలో బోమదస్తథా || 9 ||

కామః క్రోధశ్చహింసాచ తథా7సూయా విమోహినీ | భవంత్యేతాని విప్రేంద్రాః సంపదాంనాశహోతవః || 10 ||

ఏతాని యత్ర విద్యంతే పుదుషె వినశ్యతి | క్షణన పుత్రపౌత్రైశ్చసార్థం చాఖిల సంపదా || 11 ||

బభూవతస్యానూయాచ జతవిద్వేషిణీసదా | అనూయాకులచిత్తస్యవృథహంకారిణస్తధా || 12 ||

లుబ్దన్యకామదుష్టన్యమతిరేవంబభూవహ | విప్రగ్రామే కరాదానం కరిష్యామీతి నిశ్చితః || 13 ||

అకరోచ్చతథారాజా నిశ్చిత్య మనసాతదా | ధనం ధాన్యంచ విప్రాణాం జహారకలిలోభతః ||14 ||

శివవిష్వాదిదేవానాం విత్తాన్యాదత్తరాగతః | శివవిష్ణ్వా దిదేవానాం విప్రణాంచ మహత్మనాం

||15 ||

క్షేత్రణ్యపజహారా యయహంకార విమూఢదీః | ఎవమన్యాయయుక్తస్యదేవద్విజవిరోధినః || 16 ||

దుష్కర్మపరిపకేన క్రూరేణ ద్విజపుంగవాః | పురంరుద బలవాన్‌ పరదేశాధి పోరివుః ||17 ||

తా || శ్రీ సూతులిట్లనిరి - ఓ బ్రాహ్మణులారా | మహపుణ్యప్రదమైన సీతాకుండమందు నరుడు స్నానం చేసి ఆ పిదప శ్రద్ధతో మంగళ తీర్థానికి వెళ్ళాలి (1) అక్కడ లక్ష్మిదేవి సర్వదా ఉంటుంది. అలక్ష్మీ పరిహరం కొరకు ఆ సరస్సుకు దేవతలు (2) ఇంద్రుడు మొదలగు వారంతా నిత్యం వస్తూ ఉంటారు. లోక పావనమైన ఈ తర్థాన్నుద్దేశించి ఋషులు వస్తుంటారు (3) పాపనాశనమైన పుణ్యప్రదమైన ఇతిహసమును చెప్తాను. సోమవంశందు మనోజవుడు అనే రాజు జన్మించి (4) సాగరం హద్దుగాగల ధరను దర్మంతో పాలించసాగాడు. దేవతలను యజ్ఞమలతో బ్రాహ్మణులను బోజనముతో సంతృప్తి పరిచాడు (5) ప్రతి సంవత్సరము పితృదేవతలను కవ్యములతో తృప్తి పరిచేవాడు. ఎప్పుడు వేదం చదివేవాడు. శాస్త్రములను అర్ధజ్ఞాన పూర్వకముగా చదివేవాడు (6) శత్రువులను పరాక్రమంతో జయించాడు. ఈ శ##కేశవులను అధికంగా స్తుతించేవాడు నీతి శాస్త్రములందు రమించేవాడు. మహామనువులను చదివాడు. (7) ఈ రకంగా ఆ రాజు ధర్మంతో భూమిని పాలించసాగాడు. ఈ రకంగా రక్షిస్తున్న రాజునకు శత్రువులు లేకుండా పోయారు (8) ఆ రాజునకు పుత్ర సంపద్వినాశకమైన అహంకారము కలిగింది. అహంకారమున్న చోట లోభము మదము ఉంటాయి (9) కామము క్రోథము హింసా, అసూయ, మోహము ఇవన్నీ సంపదనాశనమునకు కారణమౌతాయి. (10) ఇవి ఉన్న పురుషుడు నశిస్తాడు. క్షణంలో పుత్రపౌత్రులతో పాటు అఖిల సంలదతో పాటు నశిస్తాడు (11) జనములను ద్వేషించే అసూయ అతనికి కలిగింది అసూయతో కూడుకున్న వానికి, వ్యర్థంగా అహంకరిచే వానికి (12) లుబ్థునకు, కామదుష్టునకు వానికి బుద్ది ఇట్లా మారింది. బ్రాహ్మణుల గ్రామంలో పన్నులు వసూలు చేయాలి అని నిశ్చయించిన వాడై (13) మనసులో అట్లాగే నిశ్చయించుకొని రాజు అట్లాగే చేసాడు. బ్రాహ్మణుల దనదాన్యములను లోభంతో తీసుకున్నాడు (14) రాగంతో శివవిష్ట్యాది దేవతల దనమును అపహరించాడు శివవిష్ణ్యాదిదేవతల, మహత్ములైన బ్రాహ్మణుల (15) క్షేత్రములనపహరించి, అహంకారంతో మూఢుడైనాడు ఈ రాజు. ఈ రకంగా అన్యాయుక్తుడైన దేవద్విజవిరోధియైన ఈతని (16) క్రూరమైన దుష్కర్మ పరిపాకం వల్ల, బలవంతుదైన పరదేశాధిపుడైన శత్రురాజు ఈతని పట్టణాన్ని ముట్టడించాడు (17)

మూ || గోలబోనామవిప్రేంద్రాః చతురంగ బలైర్యుతః | షణ్మాసంయుద్ధమబవత్‌ గోలభేనదురాత్మనః || 18 ||

మనోజ వన్యనృవతేః అహంకారరతాత్మనః | తతః సగోలబేనాజౌ జితోరాజ్యాత్లరిచ్యుతః || 19 ||

వనం సపుత్ర దారన్సన్‌ ప్రపేదే సమనోజవః | గోలభః పాలయన్నాస్తే మనోజవపురేచిరం || 20 ||

చతురంగబలోపేతః తముద్వాస్యరణబలీ | మనోజవోపి విప్రేంద్రాః శోచన్‌ స్త్రీ పుత్ర సంయుతః || 21 ||

క్షుత్‌క్షామః ప్రస్థలత్‌ శశ్వత్‌ ప్రవివేశమహావనం | రి&ుల్లికాగణసంఘుష్టం వ్మాఘ్రశ్వాపదబీషణం || 22 ||

వ్యాప్తద్విరదచీత్కారం వరాహమహిషాకులం | తస్మిన్వనే మహఘోరే క్షుధయా పరిపీడితః || 23 ||

అయాచతాన్నం పితరం మనోజవసుతః శిశుః | అంబమేన్నం ప్రయచ్ఛత్వం క్షుధామాం బాదతే భృషం || 24 ||

ఏవం స్వజననీం చాపి ప్రార్థయా మానబాలకః |తన్మాత పితరౌతత్ర శ్రుత్వాపుత్రస్య భాషితం || 25 ||

శోకాభిభూతౌ సహసామోహం సముపజగ్మతుః | భార్యామధాబ్రవీద్రాజా సుమిత్రాంనామనామతః ||26 ||

ముహ్యమానశ్చ సముహుః శుష్కకంఠౌష్ఠతాలుకః | సుమిత్రే కింకరిష్యామికుత్ర యస్వామి కాగతిః || 27 ||

మరిష్యత్యచిరాదేష సుతో మేక్షుధయార్దితః | కిమర్ధంస సృపజేవేదా దుర్బాగ్యం మాంపృధాప్రియే || 28 ||

కోవామో చయితాదుఃఖమేతద్దుష్కర్మజంమమ | నపూజితో మయాశంబుః హరిర్వాపూర్వజన్మసు ||29 ||

తధాన్యా దేవతాః సూర్యవిభావసుముఖాఃప్రియే | తేనపాపేనచాద్యాహమస్మిన్‌జన్మని శోభ##నే || 30 ||

అహంకారాభిభూతో7స్మివిప్రక్షేత్రాణ్యపాహరం | శివవిష్ణ్వాదిదేవానాం విత్తంచావహృతంమయా || 31 ||

ఏవందుష్కర్మబాహుల్యాత్‌ గోలభెనపరాజితః |వనంయాతో7స్మివిజనంత్వయాసహసుతే నచ || 32 ||

నిరన్నోనిర్ధనోదుఃఖీక్షుధితో7హంపి పాసితః | కథమన్నంప్రదాస్యామి క్షధితాయసుతాయమే || 33 ||

తా || గోలభుడనేరాజుచతురంగ బలముతోకూడివచ్చాడు. ఈదుర్మార్గునకు గోలభునకు ఆరునెలలు యుద్దము జరిగింది. (18) అహఃకారరతుడైన మనోజవనృతికి యుద్ధంజరిగి, ముద్ధంలో గోలభునితో అతడు జయింపబడి రాజ్యమునుండి పరిచ్యుతుడైనాడు (19) మనోజువుడు పుత్రడుభార్యతో కూడి అడవికి చేరాడు. మనోజవపురాన్ని చాలాకాలము గోలభుడు పాలిస్తున్నాడు (20) చతురంగబలోపేతుడై యుద్దంలో అతనిని తొలగించి బలవంతుడైన గోలభుడు పాలించసాగాడు. మనోజవుడు కూడా భార్యపుత్రులతో కూడి దుఃఖిస్తూ (21) ఆకలితో కృశిస్తూ తోట్రువడ్తూ పెద్ద అడవిని ప్రవేశించాడు. కీచురాళ్ళ గుంపుతో కూడింది, పులులు, హింసించే క్రూరజంతువులతో భయంకరమైనది (22) ఏనుగులచీత్కారంతో నిండింది, అడవిపందులు, దున్నపోతులతోనిండింది అట్టి అడవిలో మహాఘోరమైనదానిలో ఆకలితో పీడింపబడుతూ (23) ఉండగా మనోజవుని కొడుకు తండ్రిని అన్నంఅడిగాడు. అమ్మనాకు అన్నంపెట్టు నాకుబాగా ఆకలౌతోంది (24) ఇట్లాతనతల్లిని కూడ పిల్లవాడుప్రార్థించాడు. అతని మాతాపితురులు కొడుకుమాటలువిని (25) శోకంతో తిరస్కృతులై తొందరగా మోహాన్నిపొందారు. పిదపరాజు సుమిత్ర అనుపేరుగల భార్యతో ఇట్లా అన్నాడు (26) మాటిమాటికి మోహం పొందటంవల్ల కంఠము, పెదవులు, తాలువులుఎండి పోగా సమిత్రాఏంచేయాలినేను. ఎక్కడికి వెళ్ళాలి. నాకుదిక్కేది(27)త్వరలోఆకలితోబాధపడుతూఈనాకొడుకుచనిపోతాడు. బ్రహ్మదురదృష్టవంతుడైన నన్నువృధాగా ఎందుకు సృజించాడు. (28) ఈ దుష్కర్మవల్లకలిగిన నాదుఃఖాన్ని తోలగించేవాడెవడు. నేను పూర్వజన్మలోశివునిగా%ిహరినిగాని పూజించలేదా.(29)అట్లాగే ఇతరదేవతలు సూర్యవి%ిభావసుముఖులైనరు పూజించబడలేదా. అపావంవల్లనే నేనుఈజన్మలో (30) అహంకారపూరితణ్ణౖనాను. బ్రాహ్మణులక్షేత్రాన్ని అపహరించాను. శివవిష్ణ్వాదిదేవతలధనాన్ని కూడనేనుఅపహరించాను. (31) ఇట్లాదుష్కర్మ ఆదిక్యంవల్ల గోలభునితో ఓడింపబడ్డాను. జనంలేని అడవికి నీతోకుమారునితో కలసి వచ్చాను, (32) అన్నములేక, ధనములేక, దుఃఖిస్తూ, ఆకలితో, దప్పిగొని ఉన్నాను. ఆకలి గొన్ననాసుతునకు అన్నంఎట్లాపెడ్తాను. (33)

మూ || సమయాన్నాని దత్తాని బ్రాహ్మాణభ్యఃశుచిస్మితే | సమయాపూజితః శంభూః విష్ణుర్వాదేవతాంతరం || 34 ||

తేనపాపేనమేత్వద్యదుఃఖమేతత్పమాగతం | సమయాగ్నౌ హుతం పూర్వం న తీర్థమపిసేవితం || 35 ||

మాతృశ్రాద్ధం పితృశ్రాద్ధం మృతాహదివసేతయోః | నైకోద్దిష్టవిధానేన పార్వణనాపివైప్రియే || 36 ||

కృతంనహిమయాభ##ద్రే భూరిభోజనమేవవా | తేన పాపేన మేత్వద్యదుఃఖమే తత్సమాగతం || 37 ||

చైత్రమాసే ప్రియే చిత్రానక్షత్రే పానకంమయా | వనసానాంఫలంస్వాదు కదలీఫలమేవవా || 38 ||

తాథాఛత్రం నదండంచరమ్యంపాదుకయోర్ద్యయం | తాంబూలానిచపుష్పాణి చందనం చాను లేపనం || 39 ||

నదత్తంవేదవద్భ్యస్తు చిత్రగుప్తన్యతష్టయే | తేనపాపేన మేత్వద్య దుఃఖమేత త్సమాగతం || 40 ||

నాశ్వత్థశ్చూతవృక్షోవాన్యగ్రోధస్తింత్రిణీ తథా | పిచుమందః కపిత్థోవాతదైవమలకీతరుః || 41 ||

నారికేల తరుర్వాపి స్థాపితో7ధ్వగ శాంతయే | తేనపాపేన మేత్వద్య దుఃఖమేత త్సమాగం || 42 ||

సమ్మార్జనంచ నకృతం శివిష్ణ్వాలయేమయా | నఖానితం తటాకంచ నకూపోపిహ్రదో7పివా || 43 ||

సరోపితం పుష్పవనం తథైక తలసీ వనం | శివవిష్ణ్యాల¸°వాపి నిర్మితోన మయా ప్రియే || 44 ||

తేనపాపేన మేత్వద్యదుఃఖమేతత్సమాగతం |నమాయాపైతృకేమాసిపితౄసుద్దిశ్యశోభ##నే || 45 ||

మహాలమం కృతం శ్రాద్ధం అష్టకా శ్రద్ధమేవవా || 451/2 ||

నిత్యశ్రాద్ధంతథాకామ్యం శ్రాద్ధం నైమిత్తికం ప్రియే | నకృతాః క్రతవశ్చాపి విధివత్‌ భూరిదక్షిణాః || 46 ||

మాసోపవాసోనకృతః ఏకాదశ్యాముపోషణం | ధనుర్మాసే ప్యుషః కాలేశంభువిష్ణ్వాదిదేవతాః || 47 ||

నంపూజ్యవిధివత్‌ భ##ద్రే నైవేద్యంనకృతమయా | తేనపాపేనమేత్వద్య దుఃఖమేతత్సమాగతం || 48 ||

హరిశంకర యోర్తామ్నాంకీర్తనంసమయాకృతం | ఉద్ధూలనం త్రివుండ్రంచ

జాబులోక్తెశ్చసప్తభిః || 49 ||

నా దృతంభస్యనాభ##ద్రే రుద్రాక్షం నధృతం మయా | జపశ్చరుర్రసూక్తానాం పంచాక్షర జవస్తథా || 50 ||

తథాపురుషసూక్తన్యజపో7వ్యష్టాక్షరస్యచ | నైవకారీమయా భ##ద్రేనైవాన్యోధర్మసంచయః || 51 ||

తేన పాపేన మేత్వద్యదుఃఖమేతత్సమాగతం | ఏవం నవిలవన్రాజా భార్యామాభాష్యఖిన్నధీః || 52 ||

ముర్ఛా ముపాయ¸° విప్రాః వపాత ఛదరాతలే || 521/2 ||

తా || ఓ శుచిస్మిత | నేను బ్రాహ్మణలకు బోజనం పెట్టలేదు శివునిగాని విష్ణువుగాని లేదా ఇతర దేవతలను గాని నేను పూజించలేదు (34) ఆ పాపం కారణంగానే, నాకీవేళ ఈదుఃఖం వచ్చింది. నేను ఇది వరలో అగ్నిలో హోమం చేయలేదు ఏ తీర్థమును సేవించలేదు (35) మాతృశ్రాద్దము, పితృశ్రాద్దము, పితురులు మరణించిన రోజున ఏకోద్దిష్ట విధానంతో కాని లేదా పార్వణ విధానంతో కాని (36) నేనా చరించలేదు. అదికంగా అన్నదానముకాని చేయలేదు.ఆ పాపం కారణంగానే నాకీవేళ ఈ దుఃఖం వచ్చింది (37) చైత్రమాసంలో చిత్తానక్షత్రం రోజున పానకము, పనసపండ్లు రుచికరమైనఅరటిపండ్లుకాని , (38) గొడుగు, దండముతో పాటుఅందమైన చెప్పులు జత, తాంబూలములు, పుష్పములు, చందనము, అను లేపనములు (39) చిత్రగుప్తుని సంతృప్తి కొరకు, వేదములెరిగిన వారికి నేను ఇవ్వలేదు. ఆ పాపం కారణంగా నాకీవేళ ఈ దఃఖం కల్గింది (40) అశ్వత్థ వృక్షమో(రాగి) మామిడో,న్యగ్రోథమో (మర్రి), చింతచెట్టో, వేపచెట్టో, వెలగచెట్టో, ఉసిరిచెట్టో లేదా (41) కొబ్బరిచెట్టో బాటసారుల శ్రమశాంతి కొరకు నాటలేదు. ఆ పాపం కారణంగానే నాకీవేళ ఈదుఃఖం కలిగినది (42) శివవిష్ణ్యాలయాలలో నేను ఊడ్వటము చేయలేదు చెరవో, బావో, లేద హ్రదమో తవ్వించలేదు. (43) పుష్పవనాన్ని లేదా తులసివనాన్ని నాటించలేదు శివాలయంకాని విష్ణ్యాలయంకాని నేను కట్టించలేదు (44) ఆ పాపం కారణంగా నాకీవేళ ఈ దుఃఖం కల్గింది. పితృమాసంలో, పితరులు నుద్దేశించి మహాలయ శ్రాద్దమో, అష్టకాశ్రాద్దమో నేను ఆచరించలేదు (45) నిత్య శ్రాద్ధము, కామ్యశ్రాద్దము కాని నైమిత్తిక శ్రాద్దముకాని నేనాచరించలేదు శాస్త్రప్రకారము క్రతువులాచరించలేదు. భూరి దక్షిణలను ఇవ్వలేదు. (46) మాసోపవాసము చేయలేదు. ఏకాదశ్యుపవాసము ఆచరించలేదు. ధనుర్మాషమందు ఉషఃకాలంలో శివుడు, విష్ణువు మొదలగు దేవతల (47) పూజించి, శాస్త్రప్రకారము నైవేద్యమాచరించలేదు. ఆ పాపంకారణంగా నాకీవేళ ఈ దఃఖం కల్గింది (48) విష్ణువు శివుల నామసంకీర్తనను నేను చేయలేదు. జాబాలి చెప్పిన ఏడుమంత్రములతో భస్మమును చల్లుకోవటము, త్రిపుండ్రధారణము నేనుచేయలేదు (49) నేను రద్రాక్షలు ధరించలేదు. రుద్రసూక్తముల జపము, పంచాక్షర జపము (50) పురుష సూక్తజపము అష్టాక్షర జపమనే నాచరించలేదు. ఇతర దర్మకార్యలు చేయలేదు (51) ఆ పాపము కారణంగా నాకీవేళ ఈ దుఃఖం కల్గింది. ఈరకంగా రాజు దుఃఖిస్తూ భార్యతో చెప్పుచు. భిన్నమైనమనస్సుగలవడై (52) ఆరాజు మూర్ఛపోయాడు. భూమియందు పడిపోయాడు (521/2)

మూ || సుమిత్రాపతితం దృష్ట్యా భార్యాసాపతిమంగనా || 53 ||

ఆలింగ్యవిలలా పాథ సపుత్రాభృశదుఃఖితా | మమనాథ మహారాజ సోమాన్వయ ధురంధర || 54 ||

మాంవిహాయ క్వయాతో7సి సపుత్రాం విజనే వనే | అనాథాం త్వామనుగతాం సింహత్రస్తాం మృగీమివ || 55 ||

మృతో7సి యది రాజేంద్ర తర్హిత్వా మహమప్యరం | అనువజ్రామి విధవాన స్థాస్యేక్షణ మవ్యుత || 56 ||

పితరం పశ్యవతితం చంద్రకాంతసుతక్షితౌ | ఇత్యుక్తశ్చంద్ర కాంతో7పి సుతో రాజ్ఞఃక్షుధార్దితః || 57 ||

పితరం పరిరభ్యాథ నిః శబ్దం ప్రరురోదనః | ఏతస్మిన్నంతరేవిప్రాః జటావల్కల సంవృతః || 58 ||

భస్మోద్ధూళిత సర్వాంగః త్రివుండ్రాంకితమస్తకః | రుద్రాక్షమాలాభరణః సితయజ్ఞోపవీతవాన్‌ || 59 ||

వరాశరో నామమునిరాజగామయదృచ్ఛయా | తంశబ్దమభిలక్ష్యాసౌ సాధుసజ్జన సంమతః || 60 ||

తతః సుమిత్రాతం దృష్ట్యా పారాశరము పాగతం | వవందే చరణౌతస్యసపుత్రా సాపతివ్రతా || 61 ||

తతః పరాశ##రేణయ సమిత్నా పరిసాంత్యితా | ఆశ్వాసితాచమునినా మశోచస్వేతి భామిని ||62 ||

తతః సుమిత్రాం వప్రచ్ఛశక్తి పుత్రోమహామునిః || 621/2 ||

పరాశర ఉవాచ -

కాత్వం సుశ్రోణి కశ్ఛాసౌ యశ్చాయం పతితో7గ్రతః || 63 ||

అయం శిశుశ్చకస్తే స్యాత్‌ వదతత్వన మే శుభే | పృష్‌ట్వైవం మనినాసాద్వీతమువాచమహమునిం || 64 ||

సుమిత్రోవాచ -

పతిర్మమాయమస్యాహం బార్యావైమునిసత్తమ | అవాభ్యాం జనితశ్చయం చంద్రకాంతాభిదః సుతః || 65 ||

అయంమనోజవోనామరాజా సోమకులోద్భవః | విక్రమాఢ్యస్యతనయః శౌర్యేవిష్ణునమోబలి || 66 ||

సుమిత్రానామతస్యాహం భార్యాపతిమనువ్రతా | యుద్దేవినిర్జితోరాజాగోలభేనమనోజవః || 67 ||

రాజ్యాత్‌ భ్రష్టో నిరాలంబో మయా పుత్రేణ చాన్విత | వనం వివేశ బ్రహ్మర్షేక్రూరసత్వభయానకం || 68 ||

క్షుధయాపీడితః పుత్రోహ్య వామన్నమయాచత | నిరన్నోవిధురో రాజా దృష్ట్యా పుత్రం క్షుధార్దితం || 69 ||

శోకాకుల మనా బ్రహ్మన్‌మూర్ఛితః పతితోభువి | ఇతితద్వచనంశ్రుత్వాశోక పర్యాకులాక్షరం || 70 ||

శక్తి పుత్రోమునిః ప్రాహనుమిత్రాంతాం పతివ్రతాం | మనోజవస్యనృవతేః భార్యామగ్ని శిఖోవమాం || 71 ||

పరాశర ఉవాచ - మనోజవుస్యభార్యేతేమాభీఃభూయాత్‌కథంచన |

యుష్మాకమశుభం సత్యమచిరాత్‌ నాశ##మేష్యతి || 72 ||

తా || అతని భార్యసుమిత్ర పడిపోయిన తన భర్తను చూచి (53) అధిక దుఃఖంతో భర్తను కౌగిలించుకొని పుత్రునితోపాటు ఏడ్చింది. నా నాథ | మహారాజ | సోమవంశమందు సమర్థమైనవాడా| (54) నిర్జనమైన వనంలో పుత్రునితో పాటు నన్నువదలి ఎక్కడికి వెళ్ళావు. నాథడులేని, నిన్నను సరించే నన్ను సింహమును చూచి భయపడే మృగము వలె ఉన్నదాన్ని వదిలావు (55) ఒకవేళ నీవు చనిపోయినట్లైతే ఓరాజ| నేను నిన్ను శీఘ్రంగా అనుసరిస్తాను. విధవగా క్షణకాలం కూడా ఉండలేను (56) కుమార, చంద్రకాంత | భూమిపై పడిన మీనాన్నను చూడు. అని తల్లి అనగా చంద్రకాంతుడు రాజుగారి కుమారుడు ఆకలితో బాదపడుతూ (57) తండ్రిని కౌగిలించుకొని అతడు నిశ్శబ్దంగా ఏడ్చాడు. ఓబ్రాహ్మణులారా| ఇతంలో జడలు,వల్కలము కలిగిన (58) శరీరం నిండా భస్మము కలిగిన, నొసట త్రిపుండ్రములు కల, రుద్రాక్షమాల ఆభరణంగా కల, తెల్లనియజ్ఞోపవీతముకల (5 9 ) పరాశరుడనే ముని అనుకోకుండా వచ్చాడు. సాధు సజ్జనులకు ఇష్టుడైన ఆమునిఅరోదన శబ్దాన్ని లక్ష్యంగాచేసుకొని వచ్చాడు(60) వచ్చిన పరాశరుని ఆ సుమిత్రచూచి, ఆపతివ్రత పుత్రునితో కలిసి అతని పాదములకు నమస్కరించింది(61) పిదప పరాశరునితో ఈ సుమిత్ర ఓదార్చబడింది. ఓభామిని | దుఃఖించకు అనిముని ఆమె ను అనునయించాడు. పిదప శక్తి పుత్రుడైన పరాశరుడు ముని సుమిత్రనిట్లా అడిగాడు (62) పరాశరుని మాట - ఓసుశ్రోణి |నీవెవరు. ఈముందు పడి ఉన్నవాడు ఎవరు (63) ఈ పిల్లవాడు నీకేమౌతాడు. యథార్థమంతా నాకు చెప్పు. అని ఈ రకంగా ముని అడుగుగా ఆ మునితోఆమె ఇట్లా అంది (64) సుమిత్రవచనము ఈతడు నా భర్త ఈతని భార్యనునేను ఓ మనిశ్రేష్టా | చంద్రకాంతుడను పేరుగల ఈ పిల్లవాడు మాకు కలిగిన సంతానము. (65) సోమవంశంలో జన్మించిన వాడు మనోజవుడనే పేరుగల వాడీరాజు. పరాక్రమ వంతుని కుమారుడు. పరాక్రమ మందు విష్ణుసముడు బలవంతుడు(66) సుమిత్ర అను పేరుగల నేను అతని భార్యను భర్త ననుసరిస్తాను. ఈ రాజును యద్ధంలోగోలభుడు జయించాడు(67)రాజ్యభ్రష్ట్రుడై, ఆదారంలేని వాడైనాతో పుత్రునితో కలిసి, ఓబ్రహ్మర్షి!క్రూరజంతువులతో భయంకరమైన అడవిలో ప్రవేశించాడు.(68)ఆకలితో బాధింపడి మాపుత్రుడు అన్నమడిగాడు. అన్నములేక వికలుడైన రాజు ఆకలిగొన్న పుత్రుని చూచి(69)దుఖితుడైమూర్ఛపోయి భూమిపై పడినాడు ఆ మాటలను శోకంలతో నిండిన వానిని విని(70)శక్తి పుత్రుడైన ఆముని పతివత్రయైన ఆ సుమిత్రతో అగ్ని éశిఖవలె వెలగుతోన్న మనోజవుడనే రాజు భార్యయైన అమెతో ఇట్లా అన్నాడు(71)పరాశరుని వచనము-ఓ మనోజవుని భార్య! నీకు ఏరకమైన భయమూ వద్దు. మీ అశుభము త్వరలో నాశం పొందుతుంది నిజము.(72).

మూll మూర్ఛాం విహాయతే భ##ద్రే క్షణాదుత్థాస్యతే పతి ః పరాశరో విప్రఃపాణినాతం నరాధిప ll73 ll

పస్పర్శమంత్రం ప్రజపన్‌ ధ్యాత్యాదేవంత్రియంబకం l తతోమనోజవోరాజా కరస్పృష్టోమహామునేః ll 74 ll

ఉత్థితః సహసాతత్రత్యక్త్వా మూర్ఛాంతమోమయీం l తతః పరాశరమునిం ప్రణమ్యజగతీ పతిః ll 75 ll

ఉవాచ పరమ ప్రీతః ప్రాంజలిర్వి ప్రసత్తమం ll 75 1/2 ll

మనోజప ఉవాచ -

పరాశరమనే త్వద్య త్వత్పాదాబ్జనిషేవణాత్‌ ll 76 ll

మూర్ఛామేవిగతాసద్యః పాతకంచైవనాశితం lత్వద్దర్శనమపుణ్యానాం నైవసిద్ధ్యేత్‌ కదాచన ll 77 ll

రక్షమాం కరుణాదృష్ట్యా చ్యావితం శత్రుభిః పురాత్‌ l ఇత్త్యుక్తఃసమునిః ప్రాహరాజానం తం మనోజపం ll 78 ll

పరాశర ఉవాచ l

ఉపాయంతే ప్రవక్ష్యామి రాజన్‌ శత్రుజ యాయవై l రామసేతౌ మహాపుణ్య గంధమాదన పర్వతే ll 79 ll

విద్యతే మంగలం తీర్థం సర్వైశ్వర్య ప్రదాయకం l సర్వలోకో పకారాయ తస్మిన్సరసి రాఘవః ll 80 ll

సన్నిధత్తే సదా లక్ష్యాసీతయా రాజ సత్తమ l సపుత్రభార్యస్త్వం తత్ర గత్వాస్నాత్వాసభక్తికం ll 81 ll

క్షేత్రశ్రాద్ధాదికంచాపి తత్తీర్థే కురుభూపతే l ఏవంకృతేత్వయా రాజన్నలక్ష్మిఃక్లేశకారిణి ll 82 ll

వైభవాత్తస్యతీర్థస్య నాశం యాస్యత్య సంశయం l మంగలానిచ సర్వాణి ప్రాస్స్యసే న చిరాస్సృప ll 83 ll

విజిత్య శత్రూంశ్చ రణ పునర్భుమిం ప్రవత్స్యసే l అతస్త్వం భార్యయాసార్థం పుత్రేణ చమనోజవ ll 84 ll

గచ్ఛమంగల తీర్థం తత్గంధ మాదన పర్వతే l అహమప్యాగమిక్ష్యామి తనాసుగ్రహకామ్యయా ll 85 ll

పరాశరస్త్వేవ ముక్త్వా రాజముఖ్త్యేస్త్రి భిస్సహ l ప్రాయత్‌ సేతుం సముద్ధి శ్యస్నాతుం మంగల తీర్థకే ll 86 ll

రాజాదిభిఃసహమునిః విలంఘ్యవివిధం వనం l వనప్రదేశ దేశాంశ్చ దస్యుగ్రామాననే కశః ll 87 ll

ప్రయ¸°మం గలం తీర్థం గంధమాదస పర్వతే lతత్రసంకల్ప్యవిధివత్‌ సస్నౌసముని పుంగవః ll 88 ll

తానపిస్నాపయామాసరాజాదీన్‌ విధిపూర్వకం l తత్రశ్రాద్ధంచ భూపాలః చకారపితృతృప్తయే ll 89 ll

తత్రమా సత్రయంసస్నౌరాజాపత్నీ సుతస్తథా l తతః పరాపాశరమనిః సస్నౌ వియమపూర్వకం ll 90 ll

ఏవంమా సత్రయం సస్నౌతైః సాకంముని పుంగవః l మంగలాఖ్యేమహాపుణ్య సర్వామంగలనాశ##నే ll 91 ll

తాll ఓభ##ద్రే ! నీ భర్త మూర్ఛను వదలి క్షణంలో లేస్తాడు. ఆ పిదప పరాశరుడును ఆ బ్రాహ్మణుడు తన చేతితో ఆ రాజును (73) తాకాడు .తాకేప్పుడు త్య్రంబకుని స్మరిస్తూ మంత్రం జపించాడు . ఆ మనోజవుడనే రాజు మహాముని, చేతితో తాకగానే (74)తమోమయమైన మూర్ఛనువదలి తొందరగా లేచాడు. పిదప పరాశరమనికి నమస్కరించి ఆ రాజు, చాలా సంతోషంతో చేతులు జోడించి ఇట్లా అన్నాడు (75)మనోజపున వచనం - ఓపరాశరముని ! ఈ వేళ నీ పాద పద్మములను సేవించటం వలన (76) నా మూర్ఛ వెంటనే పోయింది . నాపాతకం కూడా పోయింది . పుణ్యము చేయని వారికి నీ ధర్శనము ఎప్పుడూ సిద్ధించదు (77) శత్రువులు నాపురము నుండి నన్ను తొలగించారు. కరుణా దృష్టితో నన్ను రక్షించండి ఇట్లా అనగానే ఆ ముని ఆ మనోజపరాజుతో ఇట్లా అన్నాడు (78) పరాశర వచనం- ఓరాజ! శత్రుజయము కొరకు నీకొక ఉపాయం చెప్తాను. రామ సేతువునందు గంధమాదన పర్వతమందు (79) అన్ని ఐశ్వర్యములను ఇచ్చే మంగళతీర్థము ఉంది . లోకములకు ఉపకారం కొరకు ఆ సరస్సులో రాముడు (80) ఓరాజ! లక్ష్మియైన సీతతోకూడి ఎల్లప్పుడు ఉంటాడు పుత్రుడు భార్యతో కలిసి నీవు అక్కడికి వెళ్ళి భక్తి పూర్వకముగా స్నానంచేసి (81) దాని తీరమందు క్షేత్ర శ్రాద్ధాదికములనుగాడా ఆచరించు. ఇట్లా నీవు చేస్తే దుఃఖాన్ని కల్గించే అలక్ష్మి (82)ఆ తీర్థం యొక్క ప్రభావంవల్ల నశించిపోతుంది . అనుమానం లేదు. సర్వమంగళములను త్వరలోనే పొందుతావు (83)యుద్ధంలో శత్రవులను జయించి, తిరిగి రాజ్యాన్ని పొందుతావు. అందువల్ల ఓ మనోజవ ! నీభార్యతో పుత్రునితో కూడా (84)ఆగంథమాదన పర్వతంలోని మంగల తీర్థానికి వెళ్ళు. నిన్ను అనుగ్రహించాలనే వాంచతో నేను గూడా వస్తున్నాను . (85)ఈ విధముగా పరాశరుడు పలికి ఆ ముగ్గురితో కూడి, మంగల తీర్థంలో స్నానం చేయటానికి సేతువునుద్దేశించి బయలుదేరాడు (86)రాజు, అతని భార్య పుత్రునితో కూడిముని అనేకమైన అడవులను దాటి అడవి ప్రదేశములను దొంగలుగల అనేక గ్రామములను దాటి (87)గంధమాదన పర్వంతలో ని మంగళ తీర్థానికి వెళ్ళాడు. అక్కడ సంకల్పముచేసి శాస్త్ర ప్రకారము అముని పుంగవుడు స్నానం చేశాడు (88) శాస్త్ర ప్రకారము రాజు మొదలగు వారిని కూడా స్నానం చేయించాడు. పితరుల తృప్తికొరకు రాజు శ్రాద్ధము చేశాడు . (89) రాజు, ఆతని భార్య కుమారుడు వారు అక్కడ మూడు నెలలు స్నానం చేశారు. పిదప పరాశరముని శాస్త్ర ప్రకారము చేశాడు. (90) ఈ విధముగా మూడు నెలలు వారితో పాటు అముని స్నానం చేశాడు . అన్ని అమంగళములనశింపచేసే పుణ్యప్రదమైన మంగలతీర్థమందు ఉన్నాడు. . (91)

మూll తతః పరాశరముని ః సర్వాసర్థవినాశనం l రామసై#్యకాక్షరం మంత్రం తదంతే సముపాదిశత్‌ ll 92 ll

చత్వారింశద్ధిసంతత్ర మంత్ర మేకాక్షరంసృప ః l తత్రతీర్థే జజాపాసౌ మున్యుక్తే నైవర్త్మనా ll 93 ll

ఏవమభ్యాసతస్తస్య మత్రమేకాక్షరం ద్విజాః l మునిప్రసాదాత్‌ పురతోధనుః ప్రాదురభూద్ధృఢం ll 94 ll

అక్షయా విషుధీచాపి ఖడ్గౌచకనకత్సరూ l ఏవంచర్మగదాచైకాతథై కోముసలోత్తమః ll 95 ll

ఏకఃశంఖో మహానాదో వాజియుక్తోరథస్తథా l ససారథిః పతాకాచతీర్ధదుత్తస్థురగ్రతః ll 96 ll

కవచం కాంచనమయం వైశ్వాసర సమప్రభం l ప్రాదుర్బభూపతత్తీర్థాత్‌ ప్రసాదేన మునేస్తథా ll 97 ll

హారకే యూరముకుటకటకా దివిభూషణం l తీర్థానాం ప్రవరాత్తస్మాదుత్థితం సృపతేఃపుంః ll 98 ll

దివ్యాంబర సహస్రంచ తీర్థాత్‌ ప్రాదుర భూత్తదా lమాలచవైజయంత్యాఖ్యాభాస్వర్ణ పంకజ శోభితా ll 99 ll

ఏతత్సర్వం సమాలోక్యమునయే 7సౌన్యవేదయత్‌lత్తతతఃపరాశమునిః జలమాదాయతీర్థతః ll 100 ll

అభ్యషించన్నరపతిం మంత్రపూతేన వారిణా l తతో 7భిషిక్తోసృపతిః మునినా పరిశోభితః ll 101 ll

సన్నద్ధః కవచీఖడ్గీచాపబాణథరోయువాl హారకే యూరముకుట కటకాది విభూషితఃll 102 ll

దివ్యాబరధరశ్చాపి వాజియుక్తరథస్థితః l శుశుభే 7తీవనృపతిః మధ్యాహ్న ఇవభాస్కరః ll 103 ll

తాll పిదప పరాశరముని అన్ని అనర్థములను నశింపచేసే రాముని ఏకాక్షరమంత్రాన్ని చివర ఉపదేశించాడు. (92)అ రాజు ఏకాక్షర మంత్రాన్ని నలుబది రోజులు ముని చెప్పిన పద్ధతిలోనే ఆ తీర్థంలో జపించాడు (93) ఈ రకంగా ఏకాక్షర మంత్రాన్ని జపిస్తున్న అతనికి ముని ప్రసాదంవల్ల ఎదురుగా దృఢమైన ధనువు ప్రత్యక్షమైంది (94)అక్షయములైన అమ్ముల పొదలు, బంగారు పిడిగల కత్తులు, డాలు, గద, రోకలి, గొప్ప ధనస్సు, (95) శంఖము, గుఱ్ఱములతో కూడిన రథము. సారధితోపాటు జండ, తీర్థము నుండి ముందర నిలిచాయి. (96) బంగారుమయమై, వైశ్వాసరునిలా కాంతి గల కవచము, ముని ప్రసాదంవల, ఆ తీర్థం నుండి ప్రాదుర్భవించాయి. (97) హారము కేయూరములు, ముకుటకటకాది అభరణములు ఆ శ్రేష్ఠమైన తీర్థము నుండి రాజుముందర నిలిచాయి (98) వేలకొలది దివ్య వస్త్రములు ఆ తీర్థము నుండి ఉద్భవించాయి . వైజయంతి మాల బంగారుతామరలతో శోభిస్తున్నది వచ్చింది . (99) వీటినన్నిటిని చూచి రాజు వీటిని మునికి అర్పించాడు . అప్పుడు పరాశరవముని తీర్థము నుండి జలము తీసుకొని (100)మంత్రపూతమైన జలముతో రాజును అభిషేకించాడు. మునితో అభిషేకింపబడిన రాజు శోభిస్తూ (101)సన్నద్ధుడైక పచఖడ్గ చావబాణముల ధరించి యువకుడై, హారకే యూర ముకుటకటకాది భూషితుడై (102) దివ్య వస్త్రముల ధరించి, గుఱ్ఱములు గల రథము పైకెక్కి మధ్యాహ్న భాస్కరునివలె ఆ రాజు మిక్కిలి ప్రకాశించాడు (103).

మూll తసై#్మనృపతయేతత్రబ్రహ్మాద్యస్త్రం మహామునిః సాంగంచ సరహస్యం చసోత్సర్గం సోవసంహృతి ll 104 ll

ఉపాదిశచ్ఛక్తి పుత్రః సుమిత్రాజానయేతదా l మనోజవో 7థమునినా హ్యాశీర్యాద పురస్సరం ll 105 ll

ప్రేరితో రథమాస్థాయ ప్రణమ్యమునిపుంగవం l ప్రదక్షిణీకృత్యతదాభ్యను జ్ఞాతో మహర్షిణా ll 106 ll

సార్థం పత్య్నాచ పుత్రేణ ప్రయ¸° విజయాయసః l సగత్వా స్వపురంరాజా ప్రదధ్మౌ జలజంతదా ll 107 ll

తతః శంఖర వంశ్రుత్వా గోలభస్తుససైనికః l యుద్ధాయనిర్య¸°తూర్ణం మనోజవనృపేణసః ll 108 ll

దినత్రయం రణం జజ్ఞే గోలభేససృపస్యవై l తతశ్చతుర్థే దివసే గోలభంతు సపైనికం ll 109 ll

మనోజవో నృపోయుద్ధే బ్రహ్మాస్త్రేణ వ్యనాశయత్‌ l తతఃసపుత్ర భార్యో7యంపురం ప్రాప్య నిజంనృపః ll 110 ll

పాలయన్‌ పృధివీం సర్వాం బుభుజే భార్యయాసహ l తదా ప్రభృతిరాజా సౌనాహంకారంచకారవై ll 111 ll

అసూయాదీంప్తథా దోషాన్‌ వర్జయామాసభూపతిః అహింసానిరతోదాంతః సదా దర్మపరో7భవత్‌ ll 112 ll

సహస్రంవత్సరానేవం రరక్ష సమహీపతిః l తతో విరక్తో రాజేంద్రః పుత్రే రాజ్యం నిధాయతు ll 113 ll

జగామ మంగలంతీర్థం గంధమాదన పర్వతేl తపశ్చచారతత్రాసౌధ్యాయన్‌ హృదిసదాశివం ll 114 ll

తతో 7చిరేణ కాలేనత్యక్త్వా దేహం మనోజవ ః శివలోకం య¸°రాజా తస్య తీర్థస్యవైభవాత్‌ ll 115 ll

తస్యభార్యాసుమిత్రాపి తస్యాలింగ్యతసుంతదా l అన్వారూఢాచితాం విప్రాః ప్రావతల్లోకమే వసా ll 116 ll

శ్రీ సూత ఉవాచ -

ఏవం ప్రభావం తత్తీర్థం శ్రీమన్మం గలనామకం l మనోజవోనృపోయత్ర స్నాత్వాతీర్థే మహత్తరే ll 117 ll

శత్రూన్విజిత్యదేహాంతే శివలోకంయ ¸°స్త్రియా l తస్మాత్సర్వప్రయత్నేన సేవ్యం మంగల తీర్థకం ll 118 ll

తీర్థమేతదతి శోభనం శివంభూక్తిముక్తి ఫలదంసృణాంసదా l పాపరాశితృణతులాపాపకంం సేవతద్విజవరావిముక్తయే ll 119 ll

ఇతి శ్రీ స్కాందే మహాపూరాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే మంగల తీర్థ ప్రశంసాయాం మనోజవా లక్ష్మీ వినాశవర్ణనం నామ ద్వాదశో7ధ్యాయః ll 12 ll

తాll అమహారాజునకు ఆ మహాముని బ్రహ్మాద్యస్త్రములను సాంగముగా రహస్యముతో సహా విడుచుట, ఉపసంహరించుటతో కూడా (104)శక్తిపుత్రుడైన పరాశరుడు సుమిత్ర భర్తయైన రాజునకు ఉపదేశించాడు. మనోజవుడు అశీర్వాద పూర్వకముగామునితో (105)ప్రేరేపింపబడి, మనికి నమప్కరించి, రథమధిరోహించి, ప్రదక్షిణమాచరించి మహర్షితో అజ్ఞ పొంది (106) పత్నితో, పుత్రునితో కూడి విజయమునకై ఆతడు బయలుదేరాడు ఆతడు తన నగరికి వెళ్ళి శంఖమును పూరించాడు (107) ఆ శంఖరవమును విని గోలభూడు సైన్యంతో కూడి తొందరగా యుద్ధమునకై బయలుదేరాడు . మనోజవ రాజుతో ఆతడు (108)మూడు రోజులు యుద్ధం చేశాడు. గోలభునకు రాజునకు మూడు రోజుల యుద్ధం తర్వాత నాలుగవరోజున సైన్యంతోకూడిన గోలభుని (109)మనోజవుడు యుద్ధంలో బ్రహ్మాస్త్రంతో నశింప చేశాడు. పిదప భార్యపుత్రులతో కలిసి తన నగరికి రాజుచేరి (110) భుమిని పాలిస్తూ భార్యతో సహ సర్వము అనుభవించాడు . ఆ రోజు నుండి ఈ రాజు అహంకరించలేదు (111)అసూయాది దోషములను రాజు వదిలి పెట్టాడు. అహింసానిరతుడై దాంతుడై ఎప్పుడు ధర్మపరుడైనాడు (112) వేయి సంవత్సరములు ఆ రాజు ఇట్లా రక్షించాడు. పిదప రాజు విరక్తుడై పుత్రునిపై రాజ్యముంచి (113) గంధమాదన పర్వతమందలి మగంలతీర్థమునకు వెళ్ళాడు. అతడక్కడ మనస్సున సదాశివుని ధ్యానిస్తు తప మాచరించాడు (114) పిదప త్వరలోనే మనోజవుడు దేహమును వదిలి ఆ తీర్థమాహాత్మ్యమువలన రాజు శివలోకమునకు వెళ్ళాడు (115) అతని భార్య సుమిత్ర కూడా అతని శరీరమును కౌగిలించుకొని, చితిని అదిరోపించి ఆమెకూడా అదే లోకమునకు చేరెను (116) శ్రీసూతులిట్లనిరి - ఆ మంగల తీర్థము ఇట్టి ప్రభావము కలది, వనోజవరాజు ఆ ఉత్తమ క్షేత్రంలో స్నానంచేసి, (117) శత్రువుల జయించి, దేహాంతమందు భార్యతో కూడా శివలోకమునకు వెళ్ళాడు. అందువల్ల అన్ని విధముల ప్రయత్నించి మంగలతీర్థాన్ని సేవించాలి (118) ఈ తీర్థము అతి శోభనమైనది. శివప్రదము. నరులకు భుక్తిముక్తి ప్రదము. పాపరాశి అనేగడ్డి దూదికి అగ్నిలాంటిది కనుక బ్రాహ్మణులారా విముక్తి కొరకు దీన్ని సేవించండి (119) అని శ్రీస్కాంద మహాపురాణయందు ఏకాశీతి సహస్రసంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతుమాహాత్య్మమందు మంగలతీర్థ ప్రశంసయందు మనోజవుని అలక్ష్మినాశ, వర్ణన మనునది పన్నెండవ అధ్యాయము సమాప్తము.

Sri Scanda Mahapuranamu-3    Chapters