Sri Scanda Mahapuranamu-3    Chapters   

ఏకాదశ అధ్యాయము

మూll శ్రీ సూత ఉవాచ-

పాపనాశేనర: స్నాత్వా సర్వపాప నిబర్హణ l తతః సీతాసరోగచ్ఛేత్‌ స్నాతుం నియమపూర్వకం ll 1ll

యానికానిచ పుణ్యాని బ్రహ్మాండాతర్గతానివై l తాని గంగాదితీర్థాని స్వపాప పరిశుద్ధయే ll 2ll

సీతా సరసివర్తంతే మహా పాతకనాశ##నేlక్షేత్రాణ్యపిమహార్హాణికాశ్యాదీనిదివానిశంll3ll

సీతా సరోత్ర సేవంతే స్వస్వకల్మష శాంతయే l తస్యాః సరసి సంగీత గుణనాకృష్య బాలిశః ll 4ll

పంచాననో 7పివసతే పంచపాతకనాశనః l తదేతత్తీర్థమాగత్య స్నాత్వావైశ్రద్ధయాసహ ll 5 ll

పురఃదరః పురావిప్రాముముచే బ్రహ్మహత్యయా ll 5 1/2 ll

ఋషయ ఊచుః-

బ్రహ్మహత్యా కథమ భూత్‌ వాసవస్యవురామునే l సీతానరసినస్నానాత్‌ కథం ముక్తో7భవత్త యా ll 6 ll

శ్రీసూత ఉవాచ-

కపాల భరణోనామ రాక్షసో7భూత్‌ పురాద్విజాఃll 7 ll

అపధ్యఃసర్వదేవానాం సో7భవత్‌ బ్రహ్మణోవరాత్‌ l శవభక్షణనామాతు తస్యాసీన్మంత్రినత్తమః ll 8ll

అక్షౌహిణీశతం తస్యహయే భరధసంకులం l అస్తితస్యపురం చాపివైజయంతమితి శ్రుతం ll 9 ll

వసత్యస్మిన్పురే సో7యంకపాలా భరణోబలీl శవభక్షం సమాహూరుబభాషేమంత్రిణం ద్విజాః ll 10 ll

శవభక్ష మహావీర్య ! మంత్ర శాస్త్రేషు కోవిద l వయందేవపురీం గత్వా వినిర్జిత్య సురాస్రణ ll 11 ll

శక్రస్యభవనే రమ్యే స్థాస్యామః సైనికైః సహ l రమావోనందనే తస్యరం భాద్యప్సరసాంగణౖll 12 ll

కపాలభరణస్యేదం నిశమ్యవచనంతదా l శవభక్షో7బ్రవీద్వి ప్రావచస్తస్యతథాస్త్వితి ll 13 ll

తతః కపాలభరణః పుత్రం ధుర్మే దనంబలీ l ప్రతిష్ఠాప్యపురే శూరంసేనయావరివారితః ll 14 ll

యుయుత్సురమరైఃసాకంప్రయయాపమరావతీం l గజాశ్వరథపాదాతై ః ఉద్థతైః రేణుసంచయై ll 15 ll

శోభయన్‌ జలధీన్‌ సింధున్‌ చూర్ణయన్‌ పర్వతానపి l నిఃసాణధ్వనినాని ప్రానాదయన్‌ రోదసీతథా ll 16 ll

అశ్వానాంహెషితరవై ః గజానామపిబృంహితైః l రథనేమిస్వనైరుగ్రైః సింహనాదైః పదాతినాం ll 17 ll

శ్రోత్రాణిదిగ్గజానాంచ వితన్యన్‌ బదిరాణినః l అగమద్దేవనగరీం యుయుత్సురమరైస్సహ ll 88 ll

తాll శ్రీ సూతులిట్లనిరి - అన్ని పాపములను తొలగించే పాపనాశనమందు నరుడు స్నానంచేసి, నియమపూర్వకముగా స్నానం చేయటానికి పిదప సీతాసరస్సుకు వెళ్ళాలి. (1) బ్రహ్మాండా తర్గతములై ఉన్న కొన్ని పుణ్యప్రదములైన గంగాది తీర్థములు తమ పాప పరిశుద్ధికొరకు (2) పాతకనాశకమైన సీతాసరస్సుయందు ఉంటున్నాయి. యోగ్యమైన కాశ్యాదిక్షేత్రములు కూడా రాత్రింబగళ్ళు (3)తమ తమ కల్మషశాంతికొరకు ఇక్కడ సీతా సరస్సును సేవిస్తున్నాయి. ఈ సరస్సులోని సంగీత గుణంవల్ల ఆకర్షింపడి (4)సింహముపిల్ల కూడా ఇక్కడ ఉంటోంది. ఇది పంచపాతకనాశకము. ఈతీర్థమునకు వచ్చి శ్రద్ధతో స్నానంచేసి ఇంద్రుడు ఇదివరలో బ్రహ్మ హత్యాపాతకం నుండి ముక్తుడైనాడు (5)ఋషులిట్లా అన్నారు ఓ ముని ! పూర్వము ఇంద్రుడు బ్రహ్మ హత్య ఎందుకు చేశాడు . సీతా సరస్సులో స్నానం చేసి ఆ పాపం నుండి ఎట్లా ముక్తుడైనాడు (6)శ్రీ సూతులిట్లనిరి - ఓబ్రాహ్మణులారా ! పూర్వం కపాలా భరణుడనే రాక్షసుడు ఉండేవాడు . (7)బ్రహ్మవరం వల్ల వాడుసర్వదేవతలకు అవధ్యుడైనాడు. ఆతనికి శవభక్షణుడు అని మంత్రి ఉండేవాడు (8)గుఱ్ఱములు ఏనుగులు రధములు వీనితో వానికి నూరు అక్షౌహిణుల సైన్యముండేది . వాని నగరము వైజయంతము అని (9)బలవంతుడైన కపాలాభరణుడు ఈపురంలో ఉండేవాడు. మంత్రియైన శవభక్షకుణ్ణి పిలిచి ఇట్లా అన్నాడు- (10)ఓ శవభక్షక, పరాక్రమవంతుడ మంత్రశాస్త్ర మెరిగినవాడా! దేవతల నగరానికి మనం వెళ్ళి యుద్ధంలో దేవతల జయించి (11)సైనుకులతో సహా అందమైన ఇంద్ర భవనంలో ఉందాము. రంభాద్యప్సరసలతో కలిసినందనవనంలో రమిద్దాం (12)కపాల భరణుని ఈ మాటలను విని శవభక్షుడు ఇట్లా అన్నాడు. సరె ! అట్లాగే కానీ అని (13)పిదప కపాలా భరణుడు బలవంతుడు గొప్పమేధస్సంపన్నుడు, ఐన శూరుణ్ణి తన కొడుకును పట్టణమందుచి సేనతోకూడి (14) దేవతలతో యుద్ధం చేయాలని తలచి అమరావతికి వెళ్ళాడు. ఏనుగులు గుఱ్ఱములు రథములు పదాతి సైన్యములతో కూడి విపరీతంగా దుమ్మురేగగా (15)అది సముద్రాన్ని ఎండగొడ్తుండగా, పర్వతములను చూర్ణముచేస్తూ, నిస్సణముల ధ్వని రోదసిని ధ్వనింపచేస్తుండగా (16) గుఱ్ఱముల సకిలింపు గజముల బృంహితము, రధముల చక్రముల చప్పుళ్ళు, పదాతి సైన్యము సింహనాదములు (17) దిగ్గజముల కర్ణ రంధ్రములను కూడా చెవిటివానిగా చేసినవి . ఇట్లా అతడు దేవతలతో యుద్ధం చేయదలచి దేవనగరికి వెళ్ళాడు (18)

మూll తత ఇంద్రాదయోదేవా ః సేనాకల కల ధ్వనింlశ్రుత్వాభి నిర్యయుః పుర్యాయుద్ధాభి మనసో ద్విజాః ll 19 ll

తతో యుద్ధం సమభవత్‌ దేవానాం రాక్షసైస్సహా l అదృష్టపూర్వం జగతి తథైవాశ్రుత పూర్వకం ll 20 ll

తత ఇంద్రాదయోదేవా రాక్షసాన్‌ జఘ్నురాహవే l రాక్షసాశ్చసురాన్‌ జఘ్నుః సమరే విజిగీషవః ll 21 ll

ద్వంద్వయుద్ధంచ సమభూత్‌ అన్యోన్య సురరక్షసాం l కపాలభరణ నాజౌ యుయుధే బలవృత్రహా ll 22 ll

యమేనశపభక్షశ్చ వరణన చకౌశికఃl కుచేరో రుధి రాక్షేణ యుయుధే బ్రాహ్మణోత్తమాః ll 23 ll

మాం సప్రియోమద్యసేవీ క్రూరదృష్టిః భయావహః చత్వార ఏతేవిక్రాంతాః కపాలా భరణాసుజాః ll 24 ll

అశ్విభ్యామగ్ని వాయుభ్యాం యుద్ధేయుయుధిరే ­ుథః | తతోయమోమహా­dర్యః కాలదండేన వేగవాన్‌ || || 25 ||

శవభక్షంని హత్యాజౌ అన్యయద్యమ సాదనం l తస్యచాక్షౌహీణీ స్త్రింశత్‌ నిజఘ్నే సమరేయమః ll 26 ll

వరుణ ః కౌశిక స్యాజౌ ప్రాసేన ప్రాహరచ్ఛిరః కుబేరోరుథిరాక్షస్యకుంతేనాభ్యహరచ్ఛిరః ll 27 ll

అశ్విభ్యామగ్ని వాయుభ్యాం కపాలాభరణానుజాః l నిహతాః సమరే విప్రాః ప్రయయుః యమ సాదనం ll 28 ll

అక్షౌహిణీశతం చాపిదేవేంద్రేణమృధేద్విజాః l యామార్ధేసహతం యుద్ధే ప్రయ¸°యమసాదనం ll 29 ll

తతః కపాలభరణః ప్రేక్ష్యసేనాం నిజాంహతాం l చాపమాదాయ నిశితాన్‌ శరాం శ్చాపిమహాజవాన్‌ ll 30 ll

అభ్యయాత్‌ సమరేశక్రం తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్‌ l తతః శక్రస్యశిరసి వ్యధమచ్ఛర పంచకైః ll 31 ll

తానప్రాప్తాన్‌ ప్రచిచ్ఛేద శ##రైర్యుద్దే సవృత్రహా l తతఃశూలం సమాదాయ కపాలా భరణోమృధే ll 32 ll

దేవేంద్రాయ ప్రచిక్షేవతం శక్త్యానిజఘానసః తతః కపాలాభరణఃశతహస్తాయతాంగదాం ll 33ll

అయసీం పంచసాహస్రతులాభారేణనిర్మాతాం l ఆదదే సమరేశక్ర వక్షోదేశేజఘానచ ll 34 ll

తతఃసమూర్ఛితః శక్రోరథోపస్థ ఉపావిశత్‌ l మృతసంజీవినీం విద్యాంజపిత్వాథ బృహాస్పతిః ll 35 ll

పులో మజాపతిం యుద్ధే సమజీవయదద్భుతంlఐరావతం తదారుహ్యకపాలభరణాంతికం ll 36 ll

ఆజగామశచీ భర్తా ప్రహర్తుం కులిశేనతం l ఏకప్రహారేణ తదా మహెంద్రః పాకశాసనః ll 37 ll

కపాలాభరణం యుద్ధే వజ్రేణ సరథాశ్వకం l సచాపంసధ్వజం చైవసతూణీరం సవర్మకం ll 38 ll

చూర్ణయామానకుపిత ః తిలశః కణశస్తథాl హతేతస్మిన్‌ మహావీరే కపాలాభరతే రణ ll 39 ll

తా ll పిదప ఇంద్రాది దేవతలు సేనా కలకల ధ్వనిని విని యుద్ధం చేయదలచి పట్టణం నుండి బయలుదేరారు. (19) పిదప దేవతలకు రాక్షసులతో సహా యుద్ధం జరిగింది. జగత్తులో ఇంతకు ముందు చూడబడనిది (20) ఇంద్రాది దేవతలు రాక్షసులను యుద్ధమందు చంపారు. యుద్ధమందు జయించదలచి రాక్షసులు దేవతలను చంపారు. (21) దేవతలకురాక్షసులకు అన్యోన్యము ద్వంద్వ యుద్ధము జరిగింది. యుద్ధమందు కపాలా భరణునితో ఇంద్రుడు యుద్ధం చేశాడు. (22) యమునితో శవభక్షకుడు వరుణునితో కౌశికుడు, కుబేరుడు రుధిరాక్షునితో యుద్ధం చేశారు. (23) మాంస ప్రియుడు, మద్యసేవి, క్రూరదృష్టి, భయావహుడు ఈ నల్గురు పరాక్రమ వంతులు, కపాలా భరణుని తమ్ములు (24) అశ్వినులతో అగ్ని వాయువులతో యుద్ధమందు పరస్పరం యుద్ధంచేశారు. పిదప మహా పరాక్రమవంతుడైన యముడు కాలదండంతో వేగంగా (25) యుద్ధంలో శవభక్షుని చంపి యమనదనానికి పంపాడు. ఆతని ముప్పది అక్షౌహిణుల సైన్యాన్ని యుద్ధంలో యముడు చంపాడు. (26) వరుణుడు ప్రానముతో యుద్ధములో కౌశికుని శిరస్సును హరించాడు. కుబేరుడు కుంతముతో రుధిరాక్షుని శిరము హరించాడు (27) అశ్వినులతో అగ్నివాయువులతో కపాలా భరణుని అనుజులు యుద్ధంలో చంపబడ్డారు. యమ సదనమునకు వెళ్ళారు. (28) దేవేంద్రుడు యుద్ధమందు నూరు అక్షౌహిణుల సైన్యాన్ని అరజాములో చంపాడు. వారు యమసదనమునకు వెళ్ళారు (29) అప్పుడు కపాలాభరణుడు చనిపోయిన తన సేనను చూచి, ధనస్సు తీసుకొని వేగము గల తీష్ణమైన బాణములను తీసుకొని (30) యుద్ధానికి వచ్చి, ఇంద్రునితో నిలు, నిలు, అనికూడా అన్నాడు. పిదప ఐదు బాణములతో ఇంద్రుని తలపై కొట్టాడు. (31) ఇంద్రుడు ఆ బాణములు తనను చేరకముందే తన బాణములతో యుద్ధమందు వానిని ఛేదించాడు. పిదప కపాలా భరణుడు శూలము తీసుకొని యుద్ధంలో (32) ఇంద్రునిపై విసిరాడు. ఆతడు శక్తితో దానిని కొట్టాడు. పిదప కపాలా భరణుడు నూరు హస్తములవైశాల్యము గల గదను (33) ఉక్కుతో చేసిన దానిని, ఐదువేల తులముల బరువుతో తయారు చేసిన దానిని తీసుకొని, యుద్ధంలో ఇంద్రుని రొమ్ముపై కొట్టాడు. (34) పిదప ఇంద్రుడు మూర్ఛపోయి రథంలోనే కూర్చున్నాడు. బృహస్పతి మృతసంజీవినీ విద్యను జపించి (35) యుద్ధంలో ఇంద్రుణ్ణి అద్భుతంగా బ్రతికింపచేశాడు. అప్పుడు ఐరావతాన్కెక్కి కపాలా భరణుని దగ్గరకు (36) వచ్చి ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. పాకశాసనుడైన ఇంద్రుడు ఒకే దెబ్బతో (37) యుద్ధంలో వజ్రాయుధంతో, రధము గుఱ్ఱములు, ధనుస్సు, ధ్వజము, అమ్ములపొది, కవచము వీటన్నిటితో కూడి కపాలాభరణుని (38) కోపంతో పొడిగా చేశాడు. తిలలుతిలుగా, కణకణములుగా చేశాడు. యుద్ధమందు ఆ మహావీరుడైన కపాల భరణుడు చంపబడగా (39)

మూ|| సుఖంసర్వస్యలోకస్యబభూవచిరదుఃఖినః | రాక్షసస్యవధోత్పన్న బ్రహ్మహత్యాపురందరం || 40 ||

అన్వధావత్త దాభీమా నాదయంతీ దిశోద శ || 40 1/2 ||

ఋషయ ఊచుః -

సవిప్రోరాక్షసః సూత కపాలా భరణోమునే | తత్కధం బ్రహ్మహత్యేంద్రం తద్వధాత్‌ సముపాద్రవత్‌ || 41 ||

శ్రీ సూత ఉవాచ -

వక్ష్యామి పరమంగుహ్యాం మునీంద్రాః పరమాద్బుతం || 42 ||

శృణుత శ్రద్దయాయూయం సమాధాయస్వమానసం | పురావింధ్య ప్రదేశేషు త్రివ్రకోనామరాక్షసః || 43 ||

తస్యబార్యాగణోపేతా సౌందర్యగుణశాలినీ |సుశీలానామ సుశ్రేణి సర్వలక్షణ లక్షితా|| 44||

సా కదా చిన్మనోజ్ఞాంగీ సువేషా చారుహాసినీ| వింధ్యపాదవనోద్దేశే విచచారవిలాసినీ || 45||

తస్మిన్‌ వనేశు చిర్నామవర్తతేస్మ మహామునిః | తపస్సమాధి సంయుక్తో వేదాధ్యయనతత్పరః ||46||

తస్యాశ్రమ సమీపంతు సాయ¸°వరవర్ణినీ|తాందృష్ట్యాసమునిర్ఘెర్యం ముమోచానంగపీడితః ||47||

తామాసాద్యవరారోహాం బభాషేమునిసత్తమః || 47 1/2||

శుచిరువాచ-

లలనే స్వాగతం తేజస్తు కన్యభార్యాశచిస్మితే || 48 ||

కిమాగమనకృత్యతతే వనేస్మిన్నతి భీషణ | శ్రాంతాసిత్యం వరారోహో వసాసస్మిన్నుటజేమమ || 49 ||

తథోక్తాసాతు సుశ్రోణీ తం మునిం ప్రత్యభాషత | త్రిపక్రక్షోభార్యాహం సుశీలా నామతోమునే || 50 ||

పుష్పావచయ కామేన వనమేతత్సమాగతా | అపుత్రాహంమునే భర్తా ప్రేరితా పుత్రమిచ్ఛతా|| 51 ||

శుచింమునిం సమారాధ్యతస్మాత్‌ పుత్రమవాప్నుహి| ఇతివ్రతి సమాదిష్టాపతినాత్వాం సమాగతా|| 52 ||

పుత్రముత్పాదయ త్వం మే కృపాంకురు మునేమయి | ఏవముక్తః సతుశుచిః సుఃశీలాం తామభాషత || 53 ||

శుచిరువాచ -

త్యాందృష్ట్యా మమచప్రీతిః సశీలే విద్యతే7ధునా | మనోరథ మహాంభోధిం త్యమా పూరయ మామకం || 54 ||

ఇత్యుక్త్వా సమునిస్తత్ర తయా రే మేదినత్రకయం | తామువాచమునిః ప్రీతః సశీలాం సందరాకృతిం || 55 ||

తవోదరే మహవీర్యః కపాలాభరణాభిధః | భవిష్యతి చిరం రాజ్యం పాలయిష్యతిమేదానీం || 56 ||

సహస్రం వత్సరాన్‌ వత్సః తపసాప్రీణ యన్విధిమ్‌ | పుందరం వినాన్యేభ్యో దేవేఖ్యోనాస్యవధ్యతా || 57 ||

ఈ దృశ##స్తే సుతో భూయాత్‌ ఇంద్రతుల్య పరాక్రమః | ఇత్యుక్త్వాసముని ర్నారీంకాశీం శివ పురీం య¸° || 58 ||

తా || చాలానాళ్ళనుండి దుఃఖిస్తున్నలోకానికంతా సుఖమేర్పడింది. రాక్షస వధవల్ల కలిగిన బ్రహ్మాహత్యాపాతకము భయంకరమైధ్వనిచేస్తూ ఇంద్రుని అనుసరించింది. అతడు పదిదిక్కులకు పరుగెత్తాడు (40) ఋషలిట్లనిరి - ఓ సూతముని ! కపాలా భరణుడు విప్రుడుకాడు రాక్షసుడు. అందువల్ల బ్రహ్మహత్య ఇంద్రుని, ఆ రాక్షసుని చంపటంవల్ల ఎందుకు అనుసరించి పరుగెత్తింది. (41) శ్రీ సూతులిట్లనిరి - మిక్కిలి రహస్యమైన మిక్కిలి అద్భుతమైన దానిని ఓమునులారా | చెపుతాను (42) మీమీమనస్సులను ఏకాగ్రపరచుకొని మీరు శ్రద్దగా వినండి. పూర్వం వింద్య ప్రదేశమందు త్రివక్రుడనే రాక్షసుడు ఉండేవాడు (43) అతని భార్య గుణవంతురాలు సౌందర్య, గుణములు కలది. సుశ్రోణి అన్ని శుభ లక్షణములు కలది. సుశీల అనునది పేరు (44) ఆమె అందమైన అవయవములు కలది, మంచివేషముకలది, అందమైన నవ్వుకలది, విలాసిని వింధ్య పర్వత అరఫణ్యములో ఒకసారి తిరుగసాగింది. (45) ఆ వనంలో శుచి అనే పేరుగల మహాముని ఉండేవాడు. తపస్సమాధి కలవాడు. వేదాధ్యయనమందే ఆసక్తి కలవాడు. (46) ఆవరవర్ణినిఅతని ఆశ్రమ సమీపమునకు వెళ్ళింది. ఆమెను చూచి ఆముని మన్మధ పీడితుడై ధైర్యాన్ని వదిలాడు. ఆవరారోహనుచేరి ముని సత్తముడు ఇట్లా అన్నాడు. (47) శుచి అనుముని మాట - ఓలలన | నీకు స్వాగతము. ఓస్వచ్ఛమైన చిరునవ్వుగలదానా | నీవు ఎవరి భార్యవు (48) అతిభీషణమైన ఈవనంలోకి నీవు ఎందుకొరకు వచ్చావు. ఓ వరావోహ| చాలా అలసినట్లున్నావు. నా ఈ పర్ణశాలలో ఉండు (49) ఆమె అట్లా చెప్పబడి ఆ సుశ్రోణి ఆమునితో ఇట్లా అంది. త్రివక్రడును రాక్షసుని భార్యను సుశీల అను నాపేరు. (50) పూలు తెంపాలనే కోరికతో ఈఅడవికి వచ్చాను. ఓముని| సంతానములేని నేను, పుత్రునికొరకు భర్తతో ప్రేరేపింపబడ్డాను (51) శుచి అనుమునిని సేవించి అతని నుండి పుత్రుని పొందు, అని భర్తతో సమాదానం చెప్పబడి నీ దగ్గరకొచ్చాను. (52) నీవునాకు కొడుకును కల్గించు. ఓముని నామీద దయచూపు. ఈ రకంగా చెప్పబడి ఆ శుచిఅనుముని ఆ సుశీలతో ఇట్లా అన్నాడు. (53) శుచివాక్కు - నిన్నుచూచి ఓ సుశీల| ఇప్పుడు నాకు ప్రీతి కల్గుతోంది. నా కోరిక అనే సముద్రాన్ని నీవు పూర్తిచేయి (54) అని చెప్పి ఆముని ఆమెతో మూడు రోజులు రమించాడు. సందరాకృతిగల ఆమెతో సంతోషంగా ముని ఇట్లా అన్నాడు. (55) నీ గర్భమందు మహాపరాక్రమ వంతుడు కపాలా భరణడను పేరుగలవాడు జన్మిస్తాడు. చాలాకాలము భూమిని రాజ్యాన్ని పాలిస్తాడు. (56) వేయి సంవత్తరాలు తపస్సుచేసి బ్రహ్మను తన తపస్సుతో మెప్పించును. ఇంద్రుడు తప్ప ఇతర దేవతల చేతుల్లో ఇతని చావులేదు. (57) ఈ విధంగా నీ కొడుకు ఇంద్రునితో సమానమైన పరాక్రమం కలవాడౌతాడు, అని ముని ఆ స్త్రీతో చెప్పి శివపురియైన కాశికి వెళ్ళాడు (58).

మూ || సుశీలా సాపి సుఘవే కపాలా భరణం సుతం | తం జఘానమృధే శక్రః వజ్రేణముని పుంగవాః ||59||

శుచేః బీజనముద్భూతం తమింద్రోన్యవధీద్యతః | తతః పురందరః శక్రః జగృహే బ్రహ్మహత్యయా || 60 ||

ధావతిస్మతదాశక్రః సర్వాన్‌లోకాన్‌ భయాకులః|ధావంతమనుధావంతీ బ్రహ్మహత్యాతమన్వగాత్‌ || 61 ||

అనుద్రతోహినిప్రేంద్రాః శక్రో7యం బ్రహ్మహత్య యా |పితామహనదఃప్రాపసంతప్త హృదయోభృశం || 62 ||

న్యవేదయత్‌ బ్రహ్మహత్యాంబ్రహ్మణ సపురందరః | భగవన్‌లోకనాధేయం బ్రహ్మ హత్యాతి భీషణా || 63 ||

బాథతేమాంప్రజానాథతస్యానాశంబ్రవీహిమే|పురందరేణౖవముక్తోబ్రహ్మాప్రాహదివస్పతిం || 64 ||

బ్రహ్మోవాచ -

సీరాకుండం ప్రయాహీంద్ర గంధమాదన పర్వతే | నీతాకుండస్యతీరేత్వం ఇష్ట్వాయాగైః సదాశివం || 65 ||

తస్మిన్‌ నరసిచస్నాయాః సర్వపాపహరేశుభే | తతః పూతో భ##వే శక్ర బ్రహ్మత్యావిమోచితః || 66 ||

దేవలోకం పునర్యాయాః సర్వదఃఖ వివర్జితః | సర్వపాపహరం పుణ్యం సీతాకుండం విముక్తిదం || 67 ||

మహాపాతక సంఘానాం నాశకం పరమామృతం | సర్వదుఃఖ ప్రశమనం సర్వదారిద్ర్యనాశనం || 68 ||

దనధాన్యప్రదం శుద్దం వైకుంఠాది పదప్రదం | తస్మాత్తత్రకురుష్వేష్టిం సీతాసరసివృత్రహన్‌ || 69 ||

ఇత్యుక్తః సురరాజో7 సౌప్రయ¸°గంధమాదనం | ప్రావ్యసీతా సరోవిప్రాః స్నాత్వేష్ట్వాచ తదంతికే || 70 ||

ప్రయ¸° స్వపూరీం భూయో బ్రహ్మహత్యావిమోచితః | ఏవం ప్రభావంతత్తీర్థం సీతాయాఃకుండముత్తమం || 71 ||

రాఘవ ప్రత్యయార్థంహి ప్రవిశ్యహుతవాహనం | సన్నిదౌ సర్వదేవానాం మైధిలీజన కాత్మజా || 72 ||

వినిర్గతా పునర్వహ్నేః స్థితా సర్వాంగశోభనా | నిర్మమేలోకరక్షార్థం స్వనామ్నాతీర్థముత్తమం || 73 ||

తత్రసస్నౌ స్వయంసీతాతేన సీతాసరః స్మృత్యం | తత్రయో మనవః స్నాతి సర్వాన్‌ కామాన్‌లభేతనః || 74 ||

తస్మిన్ను పస్పృశ్యనరోద్విజేంద్రా | దత్తాచదానాని పృథగ్విధాని

కృత్వాచయజ్ఞాన్‌ బహుదక్షిణాభిః | లోకం ప్రయాయాత్‌ పరమేశ్వరస్య || 75 ||

యుష్మాకమేవం ప్రథితం మునీంద్రాః | సీతా సరోవైభవ మేతదక్తం

శృణ్వన్‌పఠన్వైత రిహైవభోగాన్‌ | భుక్త్వావరత్రాపి సుఖంలభేత || 76 ||

ఇతి శ్రీ స్కాందే మహపురాణ ఏకాశీతి సాహస్య్రాం సంహితాయాం తృతీయే బ్రహ్మఖండే సేతుమాహాత్మ్యే సీతాసరః ప్రశంసాయాం ఇంద్రబ్రహ్మ హత్యావిమోక్షణం నామ ఏకాదశో7ధ్యాయః || 11 ||

తా || ఆ సుశీల కపాలాభరణుడనే పుత్రుని కనెను. యుద్ధమందు ఇంద్రుడు వజ్రంతో ఆతనిన చంపాడు(59)శుచి అనుముని భీజంవల్ల కల్గిన వానిని ఇంద్రుడు చంపాడు కనుక ఇంద్రుడు బ్రహ్మహత్యతో పట్టుబడ్దాడు (60) భయాకులుడై ఇంద్రుడు అన్ని లోకములకు పరుగెత్తసాగాడు పరుగెత్తుతున్నవాని వెంట పరుగెత్తుతూ బ్రహ్మహత్య అతనిని అనుసరించింది. (61) ఈ ఇంద్రుడు బ్రహ్మహత్యతో అనుసరింపబడుతూ మిక్కిలి పరితపించి బ్రహ్మగృహమునకు చేరాడు(62)బ్రహ్మకు ఇంద్రుడు బ్రహ్మహత్యను నివేదించాడు. ఓలోకనాథ| ఈ బ్రహ్మహత్య మిక్కిలి బీషణమైంది (63) ఓ ప్రజానాథ ఇది నన్ను భాధిస్తోంది. దాని నాశనాన్ని గూర్చినాకు చెప్పు. ఇంద్రుడు ఇలా చెప్పగా బ్రహ్మ ఇంద్రుని గూర్చి ఇట్లా అన్నాడు. (64) బ్రహ్మవాక్కు - గంధమదన పర్వతంలోని సీతాకుండమునకు వెళ్ళు. సీతాకుండముతీరంలో నీవు యాగములతో శివుని పూజించి (65) సర్వపాపహరమైన ఆ సరస్సులో స్నానంచేయి. ఆ పిదప బ్రహ్మహత్య నుండిముక్తిని పొంది పవిత్రుడవుకమ్ము. ఓ ఇంద్ర| (66) అన్ని దుఃఖములను వదలి దేవలోకమునకు తిరిగి పొమ్ము. సీతాకుండము అన్ని పాపములను తొలగించేది. ముక్తినిచ్చేది. పుణ్యప్రదమైంది (67) పాతక సంఘములను నశిపచేసేది. మిక్కిలి అమృతమైంది. అన్ని దుఃఖములను నశిపచేసేది. దారిద్య్రాన్నంతా నశింపచేసేది (68) ధనధాన్యములనిచ్చేది శుద్ధమైనది. వైకుంఠాదిపదములనిచ్చేది. అందువల్ల అక్కడ సీతాసరస్సుయందు ఇష్టినిచేయి. ఓ ఇంద్ర (69) అని చెప్పబడగా ఇంద్రుడు గంధమాదనమునకు వెళ్ళాడు. సీతా సరస్సును చేరి స్నానం చేసి అక్కడ ఇష్టిచేసి (70) తిరిగి తన వురికి బ్రహ్మహత్యనుండి విముక్తుడై వెళ్ళాడు. ఆ ఉత్తమమైన సీతాకుండము తీర్థము ఇటువంటి ప్రభావము కలది (71) రామునకు నమ్మకము కలిగే కొరకు అగ్నిలో ప్రవేశించి జనకుని కూతురైన మైథిలి దేవలందరి ఎదుట (72) తిరిగి అగ్ని నుండి బయటికి వచ్చి సర్వాయవ సందరముగా నిలిచింది. లోకరక్షణ కొరకు తన పేరుతో ఈ ఉత్తమ తీర్థాన్ని ఏర్పరిచింది. (73) అక్కడ సీత స్వయంగా స్నానం చేసింది. కనుక సీతాసరమని పేరైంది. అక్కడ స్నానంచేసినవారు అన్ని కోరికలను పొందుతారు (74) అక్కడ స్నానం చేసి, రకరకాలైన దానములుచేసి, అనేక దక్షిణలతో యజ్ఞములను చేసిన నరులు పరమేశ్వరలోకానికి వెళ్తారు. (75) ఈరకంగా ప్రసిద్ధమైన సీతాసరోవైభవమును మీకు చేప్పాను. విన్నవారు, చదివినవారు ఇక్కడ భోగముల ననుభవించి పదమందును సుఖం పొందుతారు (76) అని శ్రీ స్కాంద మహపురాణమందు ఎనుబది ఒక్క సహస్రముల సంహితయందు తృతీయమైన బ్రహ్మఖండమందు సేతు మహత్మ్యమందు సీతావరః ప్రశంసయందు ఇంద్రుని బ్రహ్మహత్తావిమోచమను పేరుగల పదునొకండవ అద్యాయము సమాప్తము

Sri Scanda Mahapuranamu-3    Chapters